Sri Koorma Mahapuranam
Chapters
పఞ్చచత్వారింశో೭ధ్యాయః అథభువనకోశే పర్వతాది సంఖ్యా సూత ఉవాచ :- ఏత ద్ర్బహ్మాణ్డ మాఖ్యాతం చతుర్దశవిధం మహత్ | అతః పరం ప్రవక్ష్యామి భూలోక స్యాస్య నిర్ణయమ్ ||
|| 1 || నలుబది ఐదవ అధ్యాయము సూతుడిట్లు పలికెను. పదునాల్గు విధములైన యీ గొప్ప బ్రహ్మాండమును గూర్చినాచేత చెప్పబడినది. ఇకముందు ఈ భూలోకముయొక్క వివరమును చెప్పబోవు చున్నాను. (1) జమ్బూద్వీపః ప్రధానో೭యం ప్లక్షః శాల్మలి రేవ చ | కుశః క్రౌఞ్చ శ్చ శాకశ్చ పుష్కర శ్చైవ సప్తమః ||
|| 2 || ఏతే సప్త మహాద్వీపాః సముద్రైః సప్తభి ర్వృతాః | ద్వీపా ద్ద్వీపో మహా నుక్తః సాగరా చ్చాపి సాగరః ||
|| 3 || క్షారోదేక్షు రసోదశ్చ సురోదశ్చ ఘృతోదకః | దధ్యోదః క్షీరసలిలః స్వాదూద శ్చేతి సాగరాః ||
|| 4 || పఞ్చాశత్కోటివిస్తీర్ణా ససముద్రా ధరా స్మృతా | ద్వీపై శ్చ సప్తభి ర్యుక్తా యోజనానాం సమన్తతః ||
|| 5 || జమ్బూద్వీపః సమస్తానాం మధ్యే చైవ వ్యవస్థితః | తస్య మధ్యే మహామేరు ర్విశ్రుతః కనక ప్రభః ||
|| 6 || ఈ జంబూద్వీపము ప్రధానమైనది. మరియు ప్లక్షము, శాల్మలి, కుశము, క్రౌంచము, శాకము, పుష్కరము అని మొత్తము ఏడు ద్వీపములు కలవు. (2) ఈయేడు మహాద్వీపములు సప్తసముద్రములచేత ఆవరింపబడియున్నవి. ఒక ద్వీపముకంటె మరొకద్వీపము, ఒక సముద్రము కంటె మరొకటి గొప్పవని చెప్పబడినది. (3) లవణ సముద్రము, ఇక్షు, సురా, ఘృత సముద్రములు, దధి, క్షీర, శుద్ధోదకసముద్రములని ఇవి యేడు సముద్రములు ప్రసిద్ధములు (4) ఏబదికోట్ల యోజనములు విస్తీర్ణము కలదిగా సముద్రసహితమైన భూమి పేర్కొనబడినది. యోజనవ్యాప్తి కల ద్వీపములతో అన్నివైపుల వ్యాపించి ఉన్నదీ భూమి. (5) జంబూద్వీపము అన్ని ద్వీపములకు మధ్యభాగములో నున్నది. దాని మధ్యలో బంగారుకాంతి గల మహామేరుపర్వతము నిలిచియున్నది. (6) చతురశీతిసాహస్రో యోజనై స్తస్య చో చ్ఛ్రయః | ప్రవిష్టః షోడశా ధస్తా ద్ద్వాత్రింశ న్మూర్థ్ని విస్తృతః ||
|| 7 || మూలే షోడశసాహస్రో విస్తార స్తస్య సర్వతః | భూపద్మస్యాస్య శైలో೭సౌ కర్ణికాత్వేన సంస్థితః ||
|| 8 || హిమవాన్ హేమకూట శ్చ నిషధ శ్చాస్య దక్షిణ | నీలః శ్వేతశ్చ శృఙ్గీ చ ఉత్తరే వర్షపర్వతాః ||
|| 9 || లక్షప్రమాణౌ ద్వౌ మధ్యదే దశహీనా స్తథా పరే | సహస్రద్వితయోచ్ఛ్రాయా స్తావద్విస్తారిణ శ్చతే || || 10 || భారతం ప్రధమం వర్షం తతః కింపురుషం స్మృతమ్ | హరివర్షం తథైవాన్య న్మేరో ర్దక్షిణతో ద్విజాః || || 11 || దానియొక్క వైశాల్యము ఎనుబది నాలుగువేల యోజనముల పరిమాణము కలది. క్రింది భాగము పదునారు యోజనాలు భూమి లోపలికి ప్రవేశించి, ముప్పది రెండు యోజనాలు శిఖర భాగములో విస్తరించి యున్నది. (7) దానిమూలభాగంలో పదునారువేల విస్తారము అన్నివైపుల కలిగి ఉన్నది. ఈభూమి అనే పద్మానికి ఈపర్వతము కర్ణికవలె ఉన్నది. (8) దీనికి దక్షిణ దిక్కున హిమవత్పర్వతము, హేమకూటము, నిషధము ఉన్నవి. ఉత్తరదిక్కున నీలము, శ్వేతము, శృంగి అనే వర్షపర్వతా లున్నవి. (9) లక్ష యోగజనముల ప్రమాణముకలవి రెండు మధ్యాభాగములలో, తక్కినవి పది యోజనములు తక్కువగా కలిగినవి. రెండువేల యోజనముల వైశాల్యము కలిగి విస్తరించి ఉన్నవి ఆ పర్వతుములు. (10) భారతవర్షము మొదటిది, దానితరువాత కింపురుష వర్షము కలదు. విప్రులారా! హరివర్షమను మరొకటి ఈ మూడుకూడ మేరువు దక్షిణముగా ఉన్నవి. (11) రమ్యక ఞ్చోత్తరం వర్షం తసై#్య వానుహిరణ్మయమ్ | ఉత్తరే కురవ శ్చైవ యథైతే భారతా స్తథా || || 12 || నవసాహస్ర మేకైక మేతేషాం ద్విజసత్తమాః | ఇలావృతం చ తన్మధ్యే తన్మధ్యే మేరు రుచ్ఛ్రితః || || 13 || మేరో శ్చతుర్దిశం తత్ర నవసాహస్రవిస్తరమ్ | ఇలావృతం మహాభాగా శ్చత్వార స్తత్ర పర్వతాః || || 14 || విష్కమ్భా రచితా మేరో ర్యోజనాయత ముచ్ఛ్రితాః | పూర్వేణ మన్దరో నామ దక్షిణ గన్ధమాదనః || || 15 || విపులః పశ్చిమే పార్శ్వే సుపార్శ్వ శ్చోత్తరే స్మృతః | కదమ్బ స్తేషు జమ్బూశ్చ పిప్పలో వట ఏవ చ || || 16 || ఉత్తరదిక్కున రమ్యకవర్షము, దానివెంబడి హిరణ్మయవర్షము, ఉత్తర కురుభూములు కలవు. ఈభారతవర్షము వలెనే ఇవి కూడ నిలిచి యున్నవి. (12) బ్రాహ్మణశ్రేష్ఠులారా! వీటిలో ఒక్కొక్కటి తొమ్మిదివేల యోజనాల పరిమాణం కలది. వాని మధ్యలో ఇలావృతవర్షము, దాని మధ్యలో మేరు పర్వతము ఎత్తుగా నిలిచి ఉన్నది. (13) మేరువుకు నాలుగుదిక్కుల తొమ్మిదివేల యోజనాల విస్తారము కలిగి ఇలావృత వర్షము వ్యాపించి ఉన్నది. అక్కడ నాలుగు పర్వతాలున్నవి. (14) ఆ నాలుగు పర్వతాలు యోజనము ఎత్తువరకు నిలిచి మేరువుకు గడియకొయ్యలుగా చేయబడినవి. తూర్పుదిక్కున మందర పర్వతము, దక్షిణములో గంధమాదన పర్వతము, పడమటివైపున విపులము, ఉత్తర దిక్కున సుపార్శ్వపర్వతము కలవు. ఆపర్వతముల యందు కడిమిచెట్టు, నేరేడు చెట్టు, రావి చెట్టు, మఱ్ఱిచెట్టు అనే వృక్షజాతులు ఎక్కువగా ఉండును. (15, 16) జమ్బూద్వీపస్యసా జమ్బూ ర్నామహేతు ర్మహర్షయః | మహాగజప్రమాణాని జమ్బ్వా స్తస్యాః ఫలాని చ || || 17 || పతన్తి భూభృతః పృష్ఠే శీర్యమాణాని సర్వతః | రసేన తస్యాః ప్రఖ్యాతా తత్ర జమ్బూనదీ గిరౌ || || 18 || సరి త్ర్పవర్తతే చాపి పీయతే తత్రవాసిభిః | న స్వేదో న చ దౌర్గన్ధ్యం న జరా నేన్ద్రియక్షయః || || 19 || న తాపః స్వచ్ఛమనసాం నా సౌఖ్యం తత్ర జాయతే | తత్తీరమృద్రసం ప్రాప్య వాయునా సువిశోషితమ్ || || 20 || జామ్బూనదాఖ్యం భవతి సువర్ణం సిద్ధభూషణమ్ | భద్రాశ్వః పర్వతో మేరోః కేతుమాల శ్చ పశ్చిమే || || 21 || వర్షే ద్వేతు మునిశ్రేష్ఠా స్తయో ర్మధ్యే ఇలావృతమ్ | వనం చైత్రరధం పూర్వం దక్షిణం గన్ధమాదనమ్ || || 22 || మహర్షులారా! ఆ జంబూవృక్షము, జంబూద్వీప నామధేయానికి కారణమైనది. ఆ వృక్షము యొక్క పండ్లు పెద్దయేనుగు ఆకారమంత పరిమాణం కలిగి ఉండును. (17) దాని పండ్లు మేరు పర్వతముపైన రాలి పడుచుండును ఆపండ్ల రసముతో ప్రసిద్ధమైన జంబూనది పర్వతము పై ప్రవహించును. (18) ఆనదీజలము అక్కడనివసించుజనులచేత త్రాగబడును. అక్కడివారికి చెమట, చెడువాసన, ముసలితనము, ఇంద్రియక్షయము కలుగదు. (19) నిర్మలమైన మనస్సు కలవారికి అక్కడ తాపముకాని, అసుఖంకాని కలుగదు. ఆనదీతీరమున మృత్తిక జంబూరసాన్ని పొంది గాలిచేత బాగుగా ఎండి జాంబూనదమనుపేర సువర్ణముగా మారును. అది సిద్ధులకు భూషణము. మేరువుకు పడమట భద్రాశ్వము, కేతుమాలము అను పర్వతాలు కలవు. ఆ రెండింటి మధ్య ఇలావృతవర్షము చైత్రరధమను వనము తూర్పున, దక్షిణములో గంధమాదనము కలవు. (20, 21, 22) వైభ్రాజం పశ్చిమం విద్యా దుత్తరం సవితు ర్వనమ్ | అరుణోదం మహాభద్ర మసితోద ఞ్చ మానసమ్ || || 23 || సరాం స్యేతాని చత్వారి దేవభోగ్యాని సర్వదా | సితాన్త శ్చ కుముద్వాంశ్చ కురరీ మాల్యవాంస్తథా || || 24 || వైకఙ్కో మణిశైలశ్చ వృక్ష వాం శ్చా చలోత్తమః | మహానీలో೭థ రుచకః సబిన్దు ర్మన్దర స్తథా || || 25 || వేణుమాం శ్చైవ మేఘశ్చ నిషధో దేవపర్వతః | ఇత్యేతే దేవరచితాః సిద్ధావాసాః ప్రకీర్తితాః || || 26 || అరుణోదస్య సరసః పూర్వతః కేసరాచలః | త్రికూటః సశిర శ్చైవ పతఙ్గో రుచకస్తథా || || 27 || నిషధో వసుధార శ్చ కలిఙ్గ స్త్రిశిఖః స్మృతః | సమూలో వసువేదిశ్చ కురు రుశ్చైవ సానుమాన్ || || 28 || పడమటి దిక్కున వైభ్రాజము, ఉత్తరమున సవితృవనము కలవని తెలియవలెను. అరుణోదము, మహాభద్రము, అసితోదము, మానసము, (23) అను ఈ నాలుగు సరస్సులు, ఎల్లప్పుడు దేవతలకు అనుభవయోగ్యాలు. సితాంతము, కుముద్వంతము, కురరి, మాల్యవంతము, వైకంకము, మణిశైలము, వృక్షవంతమను పర్వతరాజును, మహానీలము, రుచకము, బిందువు, మందరము, వేణుమంతము, మేఘము, నిషధము, దేవపర్వతము - అనునవి దేవతలచే నిర్మింపబడి సిద్ధులకు నివాసాలుగా ప్రసిద్ధములైన పర్వతాలు (24, 25, 26) అరుణోదమను సరస్సుకు తూర్పుదిక్కున కేసరాచలము, త్రికూటము, సశిరము, పతంగము, రుచకము, (27) నిషధము, వసుధారము, కలింగము, త్రిశిఖము, సమూలము, వసువేది, కురురువు అను పర్వతములు కలవు. (28) తామ్రాతశ్చ విశాలశ్చ కుముదో వేణుపర్వతః | ఏకశృఙ్గో మహాశైలో గజశైలశ్చ పిఞ్జకః || || 29 || పఞ్చశైలో೭థ కైలాసో హిమవాం శ్చాచ లోత్తమః | ఇత్యేతే దేవచరితా ఉత్కటాః పర్వతోత్తమాః || || 30 || మహాభద్రస్య సరసో దక్షిణ కేసరాచలః | శిభివాసాశ్చ వైదూర్యః కపిలో గన్ధమాదనః || || 31 || జారుధి శ్చ సురామ్బు శ్చ సర్వగన్ధాచలోత్తమః | సుపార్శ్వశ్చ సుపక్షశ్చ కఙ్కః కపిల ఏవ చ || || 32 || విరజో భద్రజాలశ్చ సుసకశ్చ మహాబలః | అఞ్జనో మధుమాం స్త ద్వచ్చిత్రశృఙ్గో మహాలయః || || 33 || కుముదో ముకుట శ్చైవ పాణ్డురః కృష్ణ ఏవ చ | పారిజాతో మహాశైల స్తథైవ కపిలాచలః || || 34 || తామ్రాతము, విశాలము, కుముదము, వేణుపర్వతము, ఏకశృంగము, మహాశైలము, గజశైలము, పింజకము, పంచశైలము, కైలాసము, పర్వతశ్రేష్ఠమైన హిమవంతము - ఇవి అన్నియు దేవతల సంచారమునకు యోగ్యములైన శ్రేష్ఠములైన పర్వతరాజములు. (29, 30) మహాభద్రమను సరస్సును దక్షిణ దిక్కున కేసరపర్వతము, శిఖివాసము, వైదూర్యము, కపిలము, గంధమాదనము, జారుధి, సురాంబువు, సర్వగంధపర్వతము, సుపార్శ్వము, సుపక్షము, కంకము, కపిల పర్వతము, (31, 32) విరజము, భద్రజాలము, సుసకము, మహాబలము, అంజనము, మధుమంతము, చిత్రశృంగము, మహాలయము, కుముదము, ముకుటము, పాండురము, కృష్ణము, పారిజాతమను పెద్ద పర్వతము, కపిలాచలము కలవు. (33, 34) సుషేణః పుణ్డరీకశ్చ మహామేఘ స్తథైవ చ | ఏతే పర్వతరాజాశ్చ సిద్ధగన్థర్వసేవితాః || || 35 || అసితోదస్య సరసః పశ్చిమే కేసరాచలః | శఙ్ఖకూటో೭థ వృషభో హంసో నాగ స్తథైవ చ || || 36 || కాలాఞ్జనః శుక్రశైలో నీలః కమల ఏవ చ | పారిజాతో మహాశైలః శైలః కనక ఏవ చ || || 37 || పుష్పకశ్చ సుమేఘశ్చ వారాహో విరజా స్తథా | మయూరః కపిల శ్చైవ మహాకపిల ఏవ చ || || 38 || ఇత్యేతే దేవగన్ధర్వసిద్ధయక్షై శ్చ సేవితాః | సరసో మానస స్యేహ ఉత్తరే కేసరాచలః || || 39 || ఏతేషాం శైలముఖ్యానా మన్తరేషు యథాక్రమమ్ | సన్తి చైవాన్తర ద్రోణ్యః సరాంసి చ వనాని చ || || 40 || సుషేణము, పుండరీకము, మహామేఘము అనునవి సిద్ధులచేత, గంధర్వులచేత సేవింపబడుచున్న పర్వతరాజములు. (35) అసితోదమనుపేరుగల సరస్సుకు పడమటిదిక్కున కేసర పర్వతము కలదు. మరియు శంఖకూటము, వృషభము, హంసము, నాగము, కాలాంజనము, శుక్రము, నీలము, పారిజాతమను మహాశైలము, కనకశైలము (36, 37) పుష్పకము, సుమేఘము, వారాహము, విరజసము, మయూరము, కపిలము మరియు మహాకపిలము - అనునీపర్వతములు దేవతలచే, గంధర్వులచే, సిద్ధులచే, యక్షులచేసేవింపబడుచుండును. మానస సరస్సుకు ఉత్తరదిక్కున కేసర పర్వతము కలదు. (38, 39) ఈ పర్వతముల మధ్యగల భూభాగములందు క్రమముగా సరస్సులు, వనములు, జలాశయములు ఉండును. (40) వసన్తి తత్ర మునయః సిద్ధా వై బ్రహ్మభావితాః | ప్రసన్నాః శాన్తరజసః సర్వదుఃఖవివర్జితాః || || 41 || ఇతి శ్రీ కూర్మపురాణ భువనకోశే పర్వతసంఖ్యానే పఞ్చచత్వారింశో೭ధ్యాయః ఆ ప్రదేశములో, మునులు, బ్రహ్మజ్ఞానముకల సిద్ధులు నిర్మలచిత్తులు, రజోగుణము తొలగినవారు, అన్నిదుఃఖములచే విడువబడినవారై ఉందురు. (41) శ్రీ కూర్మపురాణములో భువనకోశములో పర్వతసంఖ్యానము నందు నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.