Sri Koorma Mahapuranam
Chapters
అథషట్చత్వారింశో೭ధ్యాయః భువనన్యాసవర్ణనమ్ సూతఉవాచ :- చతుర్దశ సహస్రాణి యోజనానాం మహాపురీ | మేరో రుపరి విఖ్యాతా దేవదేవస్య వేధసః ||
|| 1 || తత్రాస్తే భగవాన్ బ్రహ్మా విశ్వాత్మా విశ్వభావనః | ఉపాస్యమానో యోగీన్ద్రై ర్మునీంద్రోపేన్ద్రశంకరైః ||
|| 2 || నలుది యారవ అధ్యాయము సూతుడిట్లు పలికెను మేరుపర్వతముపైన దేవదేవుడైన బ్రహ్మయొక్క పదునాల్గు వేలయోజనముల ప్రసిద్ధమైన మహాపురి కలదు. (1) విశ్వాత్ముడు, విశ్వభావనుడు, భగవంతుడును అగు బ్రహ్మ, యోగీంద్రులచే, మునీంద్ర, విష్ణు, శంకరులచే సేవింపడుచు నివసించు చున్నాడు. (2) తత్ర దేవేశ్వరేశానం విశ్వాత్మానం ప్రజాపతిమ్ | సనత్కుమారో భగవా నుపాస్తే నిత్య మేవ హి || || 3 || స సిద్ధఋషిగన్థర్వైః పూజ్యమానః సురై రపి | సమాస్తే యోగయుక్తాత్మా పీత్వా త త్పరమామృతమ్ || || 4 || తత్ర దేవాధిదేవస్య శమ్భో రమితతేజసః | దీప్త మాయతనం శుభ్రం పురస్తా ద్ర్బహ్మణః స్థితమ్ || || 5 || దివ్యకాన్తిసమాయుక్తం చతుర్ద్వారం సుశోభనమ్ | మహర్షిగణసంకీర్ణం బ్రహ్మవిద్భి ర్నిషేవితమ్ || || 6 || దేవ్యా సహ మహాదేవః శశాఙ్కార్కాగ్నిలోచనః | రమతే తత్ర విశ్వేశః ప్రమథైః ప్రమథేశ్వరః || || 7 || తత్ర వేదవిదః శాన్తా మునయో బ్రహ్మచారిణః | పూజయన్తి మహాదేవం తపసా సత్యవాదినః || || 8 || అక్కడ దేవతలందరికి ప్రభువైన, విశ్వాత్మకుడైన ప్రజాపతి అను బ్రహ్మను పూజ్యుడైన సనత్కుమారుడు ఎల్లప్పుడు సేవించుచుండును. (3) ఆ ప్రజాపతి, సిద్ధులు, ఋషులు, గంధర్వులు, దేవతలు మొదలగు వారిచేత పూజింపబడుచు, శ్రేష్ఠమైన అమృతమును సేవించి యోగముతో కూడిన వాడై నివసించియుండును. (4) ఆ ప్రదేశములో బ్రహ్మయొక్క ముందు భాగములో, దేవాధిదేవుడు, గొప్పతేజస్సు కలవాడును అగు శివునియొక్క ప్రకాశవంతము, నిర్మలము అయిన మందిరము కలదు. (5) అది దివ్యమైన కాంతితో కూడినది, నాలుగు ద్వారములు కలిగి మిక్కిలి మంగళకరమైనది, గొప్పఋషులు సమూహముతో నిండియున్నది, బ్రహ్మవేత్తలచే సేవింపడునదై ఉండును. (6) అక్కడ సూర్యచంద్రాగ్నులు కన్నులుగా గల శంకరుడు ప్రమథగణాధిపతి, ప్రమథులతో, పార్వతీదేవితో గూడ విహరించుచుండును. (7) ఆచోట వేదవేత్తలు, శాంతచిత్తులు, అగుమునులు, బ్రహ్మచారులు, సత్యవాదులు అగువారు తపస్సుతో మహాదేవుని ఆరాధింతురు. (8) తేషాం సాక్షా న్మహాదేవో మునీనాం భావితాత్మనామ్ | గృహ్ణాతి పూజాం శిరసా పార్వత్యా పరమేశ్వరః || || 9 || తత్రైవ పర్వతవరే శక్రస్య పరమా పురీ | నామ్నా೭మరావతీ పూర్వే సర్వశోభాసమన్వితా || || 10 || తత్ర చాప్సరసః సర్వా గన్థర్వాః సిద్ధచారణాః | ఉపాసతే సమస్రాక్షం దేవా స్తత్ర సహస్రశః || || 11 || యే ధార్మికా వేదవిదో యాగహూమపరాయణాః | తేషాం తత్పరమం స్థానం దేవానా మపి దుర్లభమ్ || || 12 || తస్మా ద్దక్షిణదిగ్భాగే వహ్నే రమితతేజసః | తేజోవతీ నామ పురీ దివ్యాశ్చర్యసమన్వితా || || 13 || తత్రాస్తే భగవా న్వహ్ని ర్భ్రాజమానః స్వతేజసా | జపినాం హోమినాం స్థానం దానవానాం దురాసదమ్ || || 14 || మహానుభావులైన ఆ మునులు మొద||వారి యొక్క పూజను సాక్షాత్తు మహాదేవుడగు పరమేశ్వరుడు తన శిరస్సుతో స్వీకరించును. (9) అక్కడ పర్వతశ్రేష్ఠముపైననే తూర్పుదిక్కున అనుపేరుతో సమస్త శోభలతో కూడిన ఇంద్రునియొక్క గొప్పపట్టణము కలదు. (10) దానిలో అందరు అప్సరసలు, గంధర్వులు, సిద్ధచారణులు ఇతర దేవతలు వేలకొలదిగా సహస్రాక్షుడైన ఇంద్రుని సేవించుచుందురు. (11) ధర్మపరులు, వేదముతెలిసినవారు, యాగములు, హోమము చేయుట యందు శ్రద్ధకలవారు ఎవరుకలరో, వారికి శ్రేష్ఠమైన ఆస్థానము పొందదగినది, అది దేవతలకు గూడ దుర్లమైనది. (12) దానికి దక్షిణ దిక్కున, అధిక తేజస్సుకల అగ్నిదేవుని యొక్క తేజోవతి అనుపేరుకల పట్టణముండును. అది గొప్ప ఆశ్చర్యకర దృశ్యములతో కూడియుండును. (13) భగవంతుడైన అగ్ని తన తేజస్సుతో ప్రకాశించుచు అక్కడ వసించును. అది జపము చేయువారికి, హోమము చేయువారికి స్థానము రాక్షసులకు పొందరానిది. (14) దక్షిణ పర్వతవరే యమస్యాపి మహాపురీ | నామ్నా సంయమనీ దివ్యా సర్వశోభాసమన్వితా || || 15 || తత్ర వైవస్వతం దేవం దేవాద్యాః పర్యుపాసతే | స్థానం తత్సత్యసన్థానాం లోకే పుణ్యకృతాం నృణామ్ || || 16 || తస్యా స్తు పశ్చిమే భాగే నిర్‌ఋతేస్తు మహాత్మనః | రక్షోవతీ నామ పురీ రాక్షసైః సంవృతా తు యా || || 17 || తత్ర తే నైఋతం దేవం రాక్షసాః పర్యుపాసతే | గచ్ఛన్తి తాం ధర్మరతా యే తు తామసవృత్తయః || || 18 || పశ్చిమే పర్వతవరే వరుణస్య మహాపురీ | నామ్నా శుద్ధవతీ పుణ్యా సర్వకామర్ధిసంయుతా || || 19 || తత్రా ప్సరోగణౖః సిద్ధైః సేవ్యమానో೭ మరాధిపైః | ఆస్తే స వరుణో రాజా తత్ర గచ్ఛన్తి యే೭మ్బుదాః || || 20 || దక్షిణ దిక్కున పర్వతముపైన యమధర్మరాజు యొక్క పెద్దనగరము, సంయమని అనుపేరుకలది, సమస్త శోభలతో కూడి యున్నదై ప్రకాశించును. (15) అక్కడ దేవతలు మొదలైనవారు, యమధర్మరాజును సేవించుదురు అది సత్యసంధులు, పుణ్యవంతులు అగుమనుష్యులకు ప్రాప్యస్థానము. (16) దానికి పడమటి భాగములో, మహాత్ముడైన నిర్‌ఋతియొక్క పట్టణము రక్షోవతి అనునది కలదు. అది రాక్షసులచే చుట్టబడియుండును. (17) అక్కడ రాక్షసులు నైఋతదేవుని సేవించుచుందురు. ఎవరైతే లోకములో తమోగుణప్రవృత్తి కలిగి, ధర్మపరులుగా నుందురో వారు ఆపట్టణమును పొందుదురు. (18) పడమటి పర్వతరాజముపై వరుణదేవుని శుద్ధవతి అనుపేరుగల గొప్ప పట్టణము, పుణ్యకరమైనది, అన్ని కోరికల సమృద్ధికలదిగా నుండును. (19) దానిలో అప్సరసల సమూహముచేత, సిద్ధులచేత, దేవతలచేత సేవింపడుచు వరుణ భగవానుడు నివసించును. లోకములో జలదానము చేసినవారు అక్కడకు వెళ్లుదురు. (20) తస్యా ఉత్తరదిగ్భాగే వాయో రపి మహాపురీ | నామ్నా గన్ధవతీ పుణ్యా తత్రాస్తే೭సౌ ప్రభఙ్జనః || || 21 || అప్సరోగణగన్ధర్వైః సేవ్యమానో మహా న్ర్పభుః | ప్రాణాయామపరా విప్రాః స్థానం తద్యాన్తి శాశ్వతమ్ || || 22 || తస్యాః పూర్వే తు దిగ్భాగే సోమస్య పరమా పురీ | నామ్నా కాన్తిమతీ శుభ్రా తస్యాం సోమో విరాజితే || || 23 || తత్ర యే ధర్మనిరతాః స్వధర్మం పర్యుపాసతే | తేషాం త దుచితం స్థానం నానాభోగసమన్వితమ్ || || 24 || తస్యా స్తు పూర్వదిగ్భాగే శఙ్కరస్య మహాపురీ | నామ్నా యశోవతీ పుణ్యా సర్వేషాం సా దురాసదా || || 25 || దానికుత్తర దిగ్భాగములో వాయువుయొక్క పెద్దపట్టణము గంధవతి అనుపేరు కలది, పుణ్యవంతమైనది కలదు. అక్కడ వాయుదేవుడు నివసించును. (21) అతడు అప్సరసల సమూహముచేత, గంధర్వులచేత సేవింపబడుచు నుండును. ప్రాణాయామ పరాయణులైన బ్రాహ్మణులు ఆస్థానమును శాశ్వతముగా పొందుదురు. (22) దానికి తూర్పుదిక్కున చంద్రునియొక్క శ్రేష్ఠమైన పట్టణము కలదు. అది కాంతిమతి అనుపేరుగలది, స్వచ్ఛమైనది. దానియందు చంద్రుడు ప్రకాశించుచుండును. (23) అక్కడ ఎవరైతే ధర్మమునందు శ్రద్ధకలవారై, తమధర్మమును అనుష్ఠింతురో వారికి, అనేక సుఖములతో కూడిన ఆస్థానము తగియున్నది. (24) ఆ పట్టణమునకు తూర్పుభాగమున శంకరునియొక్క యశోవతి అనుపేరుగల గొప్పపురము కలదు. అదిపుణ్యప్రదమైనది, అందరికిని పొందుటకు శక్యము కానిది. (25) తత్రే శానస్య భవనం రుద్రేణా ధిష్ఠితం శుభమ్ | గణశ్వరస్య విపులం తత్రాస్తే స గణావృతః || || 26 || తత్ర భోగాదిలిప్సూనాం భక్తానాం పరమేష్ఠినః | నివాసః కల్పితః దేవదేవేన శూలినా || |7 27 || విష్ణుపాదా ద్వినష్క్రాన్తా ప్లావయిత్వేన్దుమణ్డలమ్ | సమన్తా ద్బ్రహ్మణః పుర్యాం గఙ్గా పతతి వై తతః || || 28 || సా తత్ర పతితా దిక్షు చతుర్ధా హ్యభవ ద్ద్విజాః | సీతా చాలకనన్దనా చ సుచక్షు ర్భద్రనామికా || || 29 || పూర్వేణ శైలా చ్ఛైలం తు సీతా యా త్యన్తరిక్షగా | తత శ్చ పూర్వవర్షేణ భద్రాశ్వా ద్యాతి చార్ణవమ్ || || 30 || తథైవా లకనన్దా చ దక్షిణా దేత్య భారతమ్ | ప్రయాతి సాగరం భిత్త్వా సప్తభేదా ద్విజోత్తమాః || || 31 || అచ్చట రుద్రుణిచేత అధిష్ఠించబడిన ఈ శానుని భవనము, శుభకరమైనది, గణశ్వరుని యొక్క విశాలమైన భవనమున్నది. అక్కడ గణములచేత పరివేష్టితుడై గణశ్వరుడుండును. (26) అక్కడ సుఖాదులను పొందగోరు పరమేష్ఠియొక్క భక్తులకు పూర్వము దేవదేవుడైన శంకరునిచేత నివాసము ఏర్పరచడినది. (27) విష్ణువు పాదమునుండి బయలుదేరి చంద్రమండలమును పావనముచేసి తరువాత గంగానది అన్నివైపుల నుండి బ్రహ్మయొక్క పట్టణము నందు పడుచున్నది. (28) ఆ నది అక్కడ దిగి దిక్కులయందు నాలుగు విధముల చీలిపోయెను. బ్రాహ్మణులారా! సీత, అలకనంద, సుచక్షువు, భద్రఅని ఆ నాలుగు పాయలకుపేర్లు. (29) తూర్పువైపుగా పర్వతమునుండి పర్వతమునకు ప్రవహించు సీత అనుపాయ అంతరిక్షమున సాగును. తరువాత తూర్పున భద్రాశ్వర్షము నుండి సముద్రమును చేరును. (30) అట్లే అలకనంద దక్షిణ దిక్కుగా భారతదేశమున నడచి ఏడుపాయలుగా విడిపోయి సముద్రమును చేరుచున్నది. (31) సుచక్షుః పశ్చిమగిరీ నతీత్య సకలాం స్తథా | పశ్చిమం కేతుమాలాఖ్యం వర్షం గత్వైతి చార్ణవమ్ || || 32 || భద్రా తథో త్తరగిరీ నుత్తరాంశ్చ తథా కురూన్ | అతీత్య చోత్తరామ్భోధిం సమభ్యేతి మహర్షయః || || 33 || ఆ నీలనిషధాయామౌ మాల్యవద్గన్ధమాదనౌ | తయో ర్మధ్యం గతో మేరుః కర్ణికాకార సంస్థితః || || 34 || భారతాః కేతుమాలాశ్చ భద్రాశ్వాః కురవ స్తథా | పత్రాణి లోకపద్మస్య మర్యాదాశూలబాహ్యతః || || 35 || జఠరో దేవకూటశ్చ మర్యాదా పర్వతా వుభౌ | దక్షిణోత్తర మాయాతా వానీలనిషధాయతౌ || || 36 || సుచక్షువను పాయ పడమటి వైపు పర్వతములన్నింటిని దాటి, పశ్చిమమున కేతుమాలమను వర్షమును చేరి సముద్రమును పొందుచున్నది. (32) భద్ర, ఉత్తరదిక్కునందలి పర్వతములను, ఉత్తరకురు దేశమునుదాటి ఉత్తర సముద్రమును చేరుచున్నది. (33) మాల్యవంతము, గంధమాదనము అను పర్వతములు నీలనిషధములంత పొడవుగలవి. ఆ రెండింటి మధ్యభాగమును పొందిన మేరు పర్వతము కర్ణికాకారములో ఉన్నది. (34) అవధి పర్వతమునకు వెలుపల, భారత, కేతుమాల, భద్రాశ్వ, కురువర్షములు లోకమను కలమలమునకు రేకుల వంటివి. (35) జఠరము, దేవకూటము అను మర్యాదాపర్వతములు రెండు నీల నిషధ పర్వతములంత పొడవు కలిగి దక్షిణోత్తర దిక్కులకు వ్యాపించినవి. (36) గన్ధమాదనకైలాసౌ పూర్వపశ్చాయతా వుభౌ | అశీతియోజనాయామా వర్ణవాన్తర్వ్యవస్థితౌ || || 37 || నిషధః పారియాత్రశ్చ మర్యాదాపర్వతా విమౌ | మేరోః పశ్చిమ దిగ్భాగే యథాపూర్వం వ్యవస్థితౌ || || 38 || త్రిశృఙ్గో జారుధి స్తద్వ దుత్తరే వర్షపర్వతౌ | తావదాయామవిస్తారా వర్ణవాన్త ర్వ్యవస్థితౌ || || 39 || మర్యాదాపర్వతాః ప్రోక్తా అష్టా విహ మయాద్విజాః | జఠరాద్యాః స్థితా మేరో శ్చతుర్దిక్షు మహర్షయః || || 40 || ఇతి శ్రీ కూర్మపురాణ భువనవిన్యాసే షట్చత్వారింశో೭ధ్యాయః గంధమాదన కైలాసపర్వతములు తూర్పు పడమరలుగా విస్తరించిన రెండు పర్వతములు. ఎనుబది యోజనముల వైశాల్యము కలిగి సముద్రమధ్యములో నిలిచి యున్నవి. (37) నిషధము, పారియాత్రము అనునవి మర్యాదాపర్వతములు. ఈ రెండు మేరువునకు పడమటి భాగమున పూర్వమువలె నిలిచి యున్నవి. (38) త్రిశృంగము, జారుధి అనునవి ఉత్తరదిక్కున వర్షపర్వతములు కలవు. పూర్వపర్వతములంత వైశాల్యము కలిగి సముద్రములో నెలకొని యున్నవి. (39) బ్రాహ్మణులారా! ఎనిమిది మర్యాదాపర్వతములు నాచేత తెలుపబడినవి. మేరు పర్వతమునకు నాలుగు దిక్కులందు జఠరము మొదలగు పర్వతములు పాదుకొని ఉన్నవి. (40) శ్రీ కూర్మపురాణములో భువన విన్యాసములో నలుబది యారవ అధ్యాయము సమాప్తము.