Sri Koorma Mahapuranam    Chapters   

అథసప్తచత్వారింశోధ్యాయః

భువనకోశవర్ణనమ్‌

సూత ఉవాచ :-

కేతుమాలే నరాః కాకాః సర్వే పనసభోజనాః | స్త్రియ శ్చోత్పలపత్రాభా స్తే జీవన్తి వర్షాయుతమ్‌ || || 1 ||

భద్రాశ్వే పురుషాః శుక్లాః స్త్రియ శ్చన్ద్రాంశుసన్నిభాః | దశవర్షహస్రాణి జీవన్తే చాన్నభోజనాః || || 2 ||

రమ్యకే పురుషా నార్యో రమన్తి రజతప్రభాః | దశవర్షసహస్రాణి శతాని దశ పఞ్చ చ || || 3 ||

జీవన్తి చైవ సత్త్వస్థా న్యగ్రోధఫలభోజనాః | హిరణ్మయే హిరణ్యాభాః సర్వే శ్రీఫలభోజనాః || || 4 ||

ఏకాదశ సహస్రాణి శతాని దశ పఞ్చ చ | జీవన్తి పురుషా నార్యో దేవలోకస్థితా ఇవ || || 5 ||

నలుబది యెడవ అధ్యాయము

సూతుడిట్లు పలికెను.

కేతుమాలవర్షములో అందరుమనుష్యులు, ధృష్టులు, పనసభోజనము చేయుదురు. అక్కడి స్త్రీలు కలువపూల వంటి కాంతి కలవారు. వారు పదివేల సంవత్సరకాలము జీవింతురు. (1)

భద్రాశ్వవర్షములో పురుషులు తెల్లని వారుగాను, స్త్రీలు చంద్రునివెన్నెల వలె ప్రకాశించువారుగాను ఉందురు. వారు అన్నమును భుజించు వారై పదివేల సంవత్సరాలు జీవింతురు. (2)

రమ్యకవర్షములో వెండివలె మెరయుచున్న స్త్రీలు, పురుషులు పదివేల సంవత్సరాలు మరికు పదునైదు వందల సంవత్సరముల కాలము విహరించుచుందురు. (3)

హిరణ్మయ వర్షములో బంగారము వంటి శరీరముకల నరులు సత్త్వగునముకలవారై, మఱ్ఱిఫలములను, శ్రీఫలములను ఆహారముగా స్వీకరించుచు జీవించెదరు. (4)

అక్కడివారు పదునొకండు వేల, పదునైదు వందల సంవత్సరాల కాలము దేవలోకమునందున్న వారివలె పురుషులు, స్త్రీలు కూడ జీవనము గడుపుదురు. (5)

త్రయోదశ సహస్రాణి శతాని దశ పఞ్చ చ | జీవన్తి కురువర్షేతు శ్యామాఙ్గాః క్షీరభోజనాః || || 6 ||

సర్వే మిథునజాతా శ్చ నిత్యం సుఖనిషేవితాః | చన్ద్రద్వీపే మహాదేవం యజన్తి సతతం శివమ్‌ || || 7 ||

తథా కింపురుషే విప్రా మానవా హేమ సన్నిభాః | దశవర్ష సహస్రాణి జీవన పకభోజనాః || || 8 ||

యజన్తి సతతం దేవం చతుఃశీర్షం చతుర్భుజమ్‌ | ధ్యానే మనం సమాధాయ సాదరం భక్తిసంయుతాః || || 9 ||

తథా చ హరివర్షే తు మహారజతసన్నిభాః | దశవర్ష సహస్రాణి జీవన్తీ క్షురసాశినః || || 10 ||

తత్ర నారాయణం దేవం విశ్వయోనిం సనాతనమ్‌ | ఉపాసతే సదా విష్ణుం మానవా విష్ణుభావితాః || || 11 ||

కురు వర్షములో జనులు నల్లని శరీరము కలవారై, పాలు ఆహారముగా గ్రహించుచు పదమూడువేలు మరియు పదునైదు వందల సంవత్సరములపాటు జీవింతురు. (6)

దంపతుల జంటలన్నియు ఎల్లప్పుడు సుఖముగా జీవించుచుందురు. చంద్రద్వీపమునందు ఎల్లప్పుడు మహాదేవుడైన శివుని పూజింతురు. (7)

అట్లే కింపురుషవర్షములో మానవులు బంగారురంగు కలవారైయుందురు. వారు జువ్వి ఫలములనాహారముగా గ్రహించి పదివేల సంవత్సరాలు జీవింతురు. (8) వారు నాలుగు శిరములు, నాలుగు చేతులు కలిగిన దేవునిగూర్చి, ధ్యానమునందు మనస్సు నిలిపి భక్తితో కూడి ఎల్లప్పుడు గౌరవముతో పూజింతురు. (9)

హరివర్షములో మేలయిన వెండితో సమానవర్ణము కలవారై, చెరకురసము నాహారముగా తీసికొనుచు పదివేల సంవత్సరములు జీవించెదరు. (10)

ఆ హరి వర్సములో విశ్వమునకు కారణభూతుడు, సనాతనుడు అగు నారాయణుని దేవుని విష్ణుప్రభావితులై మానవులు సేవింతురు. (11)

తత్ర చన్ద్రమసం శుభ్రం శుద్ధస్ఫటికసన్నిభమ్‌ | విమానం వాసుదేవస్య పారిజాతవనాశ్రితమ్‌ || || 12 ||

చతుర్ద్వార మనౌపమ్యం చతుస్తోరణసంయుతమ్‌ | ప్రాకారై ర్దశభి ర్యుక్తం దురాధర్షం సుదుర్గమమ్‌ || || 13 ||

స్ఫాటికై ర్మణ్డపై ర్యుక్తం దేవరాజగృహోపమమ్‌ | సువర్ణ స్తమ్భసాహసై#్రః సర్వతః సమలంకృతమ్‌ || || 14 ||

హేమసోపానసంయుక్తం నానారత్నోపశోభితమ్‌ | దివ్యసింహాసనోపేతం సర్వశోభాసమన్వితమ్‌ || || 15 ||

సరోభిః స్వాదుపానీయై ర్నదీభి శ్చోపశోభితమ్‌ | నారాయణపరైః శుద్ధై ర్వేదాధ్యయనతత్పరైః || || 16 ||

యోగిభి శ్చసమాకీర్ణం ధ్యాయద్భిః పురుషం హరిమ్‌ | స్తువద్భిం సతతం మన్రై ర్నమస్యద్భిశ్చ మాధవమ్‌ || || 17 ||

అక్కడ స్వచ్ఛమైన చంద్రుని, నిర్మలమైన స్ఫటికముతో సమానమైన వానిని, పారిజాతవనము నాశ్రయించియున్న వాసుదేవుని యొక్క విమానమును, నాలుగు ద్వారములు కలదానిని, సాటిలేనిదానిని, నాలుగు తోరణములతో కూడియున్నదానిని, పది ప్రాకారములతో కూడిన దానిని, తిరస్కరించుటకు తగని దానిని, పొందుటకు మిక్కిలి కష్టసాధ్యమైన దానిని, (12, 13) స్ఫటిక మణులతో చేయబడిన మంటపములతో కూడిన దానిని, దేవేంద్రుని స్తంభములతో అంతట అలంకరింపబడినదానిని, బంగారు మెట్లతోకూడి, బహువిధములైన మణులతో అలంకరింపడిన దానిని, శ్రేష్ఠమైన సింహాసనముతో కూడినదానిని, అన్ని శోభలతో కూడినదానిని; (14, 15)

రుచికరమైన జలముతోకూడిన కొలనులతో, నదులతో కూడినదానిని, నారాయణుని యందాసక్తులై, వేదాధ్యయనపరులై, శుద్ధులైన, విష్ణువును ధ్యానించుచున్న యోగులతో నిండియున్న దానిని, మంత్రములతో ఎల్లప్పుడు హరిని స్తోత్రము చేయుచున్న, నమస్కరించుచున్న వారితో కూడిన దానిని; (16, 17)

తత్ర దేవాధిదేవస్య విష్ణో రమితతేజసః | రాజానః సర్వకాలం తు మహిమానం ప్రకుర్వతే || || 18 ||

గాయన్తి చైవ నృత్యన్తి విలాసిన్యో మనోహరాః | స్త్రియో ¸°వనశాలిన్యః సదా మణ్డనతత్పరాః || || 19 ||

ఇలావృతే పద్మవర్ణా జమ్బూరసఫలశినః | త్రయోదశ సహస్రాణి వర్షాణాం చ స్థిరాయుషః || || 20 ||

భారతేషు స్త్రియః పుంసో నానావర్ణాః ప్రకీర్తితాః | నానాదేవార్చనే యుక్తా నానా కర్మాణి కుర్వతే || || 21 ||

పరమాయుః స్మృతం తేషాం శతం వర్షాణి సువ్రతాః | నవయోజనసాహస్రం వర్ష మేత త్ర్పకీర్తితమ్‌ || || 22 ||

కర్మభూమి రియం విప్రా నరాణా మధికారిణామ్‌ | మహేన్ద్రో మలయః సహ్యః శక్తిమా నృక్షపర్వతః || || 23 ||

అక్కడ రాజులు, దేవాధిదేవుడు, అమితమైన తేజస్సు కలవాడు అగు విష్ణువుయొక్క మహిమను అన్ని కాలముల యందు ప్రశంసించుచుందురు. (18)

మనోహరులగు విలాసవతులు, ¸°వనముతో ప్రకాశించువారు, ఎల్లప్పుడు అలంకారములందాసక్తులైన వారగు స్త్రీలు అక్కడ పాటలు పాడుచుందురు, నృత్యము చేయుచుందురు. (19)

ఇలావృతవర్షములో నివసించువాడు పద్మము వంటి రంగు కలవారు, జంబూఫలములను, వాని రసమును భుజించువారు, పదమూడు వేల సంవత్సరాలు చిరాయువు కలవారుగా ఉందురు. (20)

భారతవర్షములో స్త్రీలు, పురుషులు కూడ అనేక వర్ణములు కలిగి ఉందురు. అనేక దేవతలను పూజింతురు, అనేక కర్మలను చేయుచుందురు. (21)

వారి పరమాయుర్దాయము నూరు సంవత్సరములు. ఈభారత వర్షము తొమ్మిదివేల యోజనముల వైశాల్యము కలిగి ఉంటుంది. (22)

బ్రాహ్మణులారా! ఇది అధికారముకల మనుష్యులకు కర్మభూమి. మహేంద్రము, మలయము, సహ్యము, శక్తిమంతము, ఋక్షపర్వతము

విన్ధ్యశ్చ పారియాత్రశ్చ సప్తా త్ర కులపర్వతాః | ఇన్ద్రద్వీపః కసేరుక్మాన్‌ తామ్రపర్ణో గభస్తిమాన్‌ || || 24 ||

నాగద్వీప స్తథా సౌమ్యో గన్ధర్వస్త్వథ వారుణః | అయన్తు నవమ స్తేషాం ద్వీపః సాగర సంస్థితః || || 25 ||

యోజనానాం సహస్రం తు ద్వీపోయం దక్షిణోత్తరః | పూర్వే కిరాతా స్తస్యాన్తే పశ్చిమే యవనా స్తథా || || 26 ||

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా మధ్యే శూద్రా స్తథైవ చ | ఇజ్యాయుద్ధవణిజ్యాభి ర్వర్తయ న్త్యత్ర మానవాః || || 27 ||

స్రవన్తే పావనా నద్యః పర్వతేభ్యో వినిఃసృతాః | శతద్రు శ్చన్ద్రభాగా చ సరయూ ర్యమునా తథా || || 28 ||

ఇరావతీ వితస్తా చ విపాశా దేవికా కుహూః | గోమతీ ధూతపాపా చ బాహుదా చ దృషద్వతీ || || 29 ||

వింధ్యపర్వతము, పారియాత్రము అనుఏడు ఈ వర్షములోకల పర్వతములు. ఇంద్రద్వీపము, కసేరుక్మము, తామ్రపర్ణము, గభస్తిమంతము, (24) నాగద్వీపము, సౌమ్యము, గంధర్వము, వారుణము అనుద్వీపములతో పాటు ఈద్వీపము సముద్రమందున్న తొమ్మిదవ సంఖ్య కలది. (25)

ఈ ద్వీపము దక్షిణోత్తర దిశలకు వేయి యోజనముల దూరము వ్యాపించి ఉన్నది. దీని తూర్పుదిక్కు చివరి భాగములో కిరాతులు, పడమటి కొనయందు యవనజాతివారు నివసింతురు. (26)

ద్వీపమధ్యభాగములో బ్రాహ్మణ క్షత్రియవైశ్యులు మరియు శూద్రజాతి జనులు నివసింతురు. ఇక్కడి వర్ణముల మానవులు క్రమముగా యజ్ఞములు, యుద్ధములు, వాణిజ్యము అను వృత్తులతో జీవనము సాగింతురు. (27) ఇక్కడ పర్వతముల నుండి బయలుదేరి ప్రవహించు పవిత్రమైన నదులు కలవు. శతద్రువు, చంద్రభాగ, సరయు, యమున, ఇరావతి, వితస్త, విపాశ, దేవిక, కుహూ, గోమతి, ధూతపాప, బాహుద మరియు దృషద్వతి, (28, 29)

కౌశికీ లోహినీ చేతి హిమవత్పాదనిఃనృతాః | వదేస్మృతి ర్వేదవతీ వ్రతఘ్నీ త్రిదివా తథా || || 30 ||

వర్ణాశా చన్దనా చైవ సచర్మణ్యవతీ సురా | విదిశా వేత్రవత్యాపి పారియాత్రాశ్రయాః స్మృతాః || || 31 ||

నర్మదా సురసా శోణో దశార్ణా చ మహానదీ | మన్దాకినీ చిత్రకూటా తామసీ చ పిశాచికా || || 32 ||

చిత్రోత్పలా విశాలా చ మఞ్జులా వాలువాహినీ | ఋక్షవత్పాదజా నద్యః సర్వపాపహరా నృణామ్‌ || || 33 ||

తాపీ పయోష్ణీ నిర్విన్ధ్యా శీఘ్రోదా చ మహానదీ | విన్నా వైతరణీ చైవ బలాకా చ కుముద్వతీ || || 34 ||

తథా చైవ మహాగౌరీ దుర్గా చాన్తః శిలా తథా | విన్ధ్యపాదప్రసూతాస్తు సద్యః పాపహరా నృణామ్‌ || || 35 ||

కౌశికి, లోహిని అని హిమవత్పర్వత పాదప్రదేశము నుండి బయలుదేరినవి. వేదస్మృతి, వేదవతి, వ్రతఘ్నిమరియుత్రిదివ అనునది, వర్ణాశ, చందన, చర్మణ్వతి, సుర, విదిశ, వేత్రవతి, అనునదులు పారియాత్రపర్వతము నాశ్రయించినవి. (30, 31)

నర్మద, సురస, శోణము, దశార్ణ, మహానది, మందాకిని, చిత్రకూట, తామసి, పిశాచిక, చిత్రోత్పల, విశాల, మంజుల, వాలువాహిని అనునవి ఋక్షవత్సర్వతము నుండి బయలుదేరునవి, మనుష్యుల అన్ని పాపములను నశింప జేయునదులు (32, 33)

తాపి, పయోష్టి, నిర్వింధ్య, శీఘ్రోద అను మహానది, విన్న మరియు వైతరణి, లాక, కుముద్వతి, మహాగౌరి, దుర్గ, అంతశ్శిల అను నదులు వింధ్యపర్వత పాదముల నుండి బయులదేరునవి, మనుష్యుల పాపములను వెంటనే నశింపజేయునవి. (34, 35)

గోదావరీ భీమరథీ కృష్ణావేణా చ వశ్యతా | తుంగభద్రా సుప్రయోగా కావేరీ చ ద్విజోత్తమాః || || 36 ||

దక్షిణాపథ నద్య స్తు సహ్యపాదా ద్వినిఃసృతాః | ఋతుమాలా తామ్రపర్ణీ పుణ్యవ త్యుత్పలావతీ || || 37 ||

మలయా న్నిః సృతా నద్యః సర్వాః శీతజలాః స్మృతాః | ఋషికుల్యా త్రిసామా చ గన్ధమాదనగామినీ || || 38 ||

క్షిప్రా పలాశినీ చైవ ఋషీకా వంశధారిణీ | శుక్తిమత్పాదసఞ్జాతాః సర్వపాపహరా నృణామ్‌ || || 39 ||

ఆసాం నద్యుపనద్య శ్చ శతశో ద్విజపుఙ్గవాః | సర్వపాపహరాః పుణ్యాః స్నానదానాదికర్మసు || || 40 ||

బ్రాహ్మణోత్తములారా! గోదావరి, భీమరథి, కృష్ణవేణి, వశ్యత తుంగభద్ర, సుప్రయోగ మరియు కావేరియను (36) సహ్యపర్వత పాద ప్రదేశమునుండి బయలుదేరిన దక్షిణాపధపునదులు. ఋతుమాల, తామ్రపర్ణి, పుణ్యవతి, ఉత్పలావతి అను నదులు (37) మలయపర్వతము నుండి బయలు వెడలినవి. ఇవన్నియు చల్లని నీరు కలవిగా ప్రసిద్ధములు. ఋషికుల్య, త్రిసామ అనునవి గంధమాదన పర్వతమును ఆశ్రయించినవి. (38)

క్షిప్ర, పలాశిని, ఋషీక మరియు వంశధారిణి అను నదులు శుక్తి మత్పర్వత పాద ప్రదేశమునుండి పుట్టినవి. అవి మనుష్యుల పాపము లన్నిటిని నశింపజేయును. (39)

విప్రులారా! ఈ నదుల యొక్క ఉపనదులు వందల కొలదిగా కలవు. అవి పుణ్యకరములైనవి. స్నానదానాది కర్మల వలన అన్ని పాపములను తొలగించును. (40)

తాస్విమే కురుపాఞ్చాలా మధ్యదేశాదయో జనాః | పూర్వదేశాదికా శ్చైవ కామరూపనివాసినః || || 41 ||

పుణ్డ్రాః కలిఙ్గా మగధా దాక్షిణాత్యా శ్చ కృత్స్నశః | తధా పరాన్తాః సౌరాష్ట్ర శూద్రా హీనా స్తదా ర్బుదాః || || 42 ||

మాలకా మలపా శ్చైవ పారియాదత్రనివాసినః | సౌవీరాః సైన్ధవా హూణా మాల్యాబాల్యా నివాసినః || || 43 ||

మాద్రా రామా స్తథైవాన్ధ్రాః పారసీకా స్తథైవ చ | ఆసాం పిబన్తి సలిలం వసన్తి సరితాం సదా || || 44 ||

చత్వారి భారతే వర్షే యుగాని కవయో బ్రువన్‌ | కృతం త్రేతా ద్వాపర ఞ్చ కలి శ్చాన్యత్ర న క్వచిత్‌ || || 45 ||

యాని కింపురుషాద్యాని వర్షా ణ్యష్టౌ మహర్షయః | న తేషు శోకో నాయాసో నోద్వేగః క్షుద్యం న చ || || 46 ||

వానియందు, ఈకురుపాంచాలదేశముల, మధ్యదేశము మొదలగు వాని, తూర్పుదేశము మున్నగు ప్రాంతాల జనులు, కామరూప దేశమందున్న ప్రజలు (41) పుండ్రులు, కలింగులు, మగధులు, సంపూర్ణ దక్షిణ ప్రాంతజనులు, అపరాంత దేశవాసులు, సౌరాష్ట్ర శూద్రులు, అర్బుదులు, తక్కువ జాతి ప్రజలును (42)

మాలకులు, మలపులు, పారియాత్ర మందు నివసించువారు, సౌవీరులు, సింధుప్రాంతీయులు, హుణులు, మాల్యులు, బాల్యులు, అక్కడ నివసించువారు. (43)

మాద్రులు, రాములు, ఆంధ్రులు, అట్లే పారశీకులు పూర్వము పేర్కొనబడిన నదుల నీటిని త్రాగుదురు. నదీ తీరాలో నివసింతురు. (44)

భారత వర్షములో నాలుగు యుగములను పండితులు చెప్పిరి. కృత, త్రేతా, ద్వాపర, కలియుగములని వాని పేర్లు. ఇవి వేరేచోట ఎక్కడను లేవు. (45)

మహర్షులారా! కింపురుష వర్షము మొదలగు ఏ యెనిమిది చెప్పబడినవో, వానిలో శోకము, ఆయాసము, ఆకలి, ఉద్వేగము ఉండవు. (46)

స్వస్థాః ప్రజా నిరాతఙ్గాః సర్వదుఃఖవివర్జితాః | రమన్తే వివిధై ర్భావైః సర్వాశ్చ స్థిర¸°వనాః || || 47 ||

ఇతి శ్రీ కూర్మపురాణ ఉవనకోశ వర్ణనం నామ సప్త చత్వారింశోధ్యాయః

అక్కడి ప్రజలు రోగరహితులై, అన్ని దుఃఖములనుండి విడువబడినవారై, మంచి స్థితి కలవారుగా, అందరును స్థిరమైన ¸°వనము కలవారై వివిధభావములతో విహరింతురు. (47)

శ్రీ కూర్మపురాణములో భువనకోశవర్ణమను నలుబది యేడవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters