Sri Koorma Mahapuranam    Chapters   

అథఅష్టచత్వారింశోధ్యాయః

అధ జమ్బూద్వీపవర్ణనమ్‌

సూత ఉవాచ :-

హేమకూటగిరేః శృఙ్గే మహాకూటం సుశోభనమ్‌ | స్ఫాటికం దేవదేవస్య విమానం పరమేష్ఠినః || || 1 ||

తత్ర దేవాధిదేవస్య భూతేశస్య త్రిశూలినః | దేవాః సర్షిగణాః సిద్ధాః పూజాం నిత్యం ప్రకుర్వతే || || 2 ||

స దేవ్యా గిరిశః సార్థం మహాదేవో మహేశ్వరః | భూతైః పరివృతో నిత్యం భాతి తత్ర పినాకధృక్‌ || || 3 ||

నలుబది యెనిమిదవ అధ్యాయము

బంజూద్వీప వర్ణనము

హేమకూట పర్వతము యొక్క శిఖరమునందు, మిక్కిలి మంగళకరమైన, స్ఫటికమణి రచితమైన గొప్ప శిఖరము, దేవదేవుడైన పరమేష్ఠి యొక్క విమానముగా కలదు. (1)

అక్కడ ఎల్లప్పుడు ఋషిసమూహముతో కూడిన దేవతలు, సిద్ధులు దేవాధిదేవుడైన, త్రిశూలధారి అయిన, భూతపతియైన శివుని పూజను చేయుచుందురు. (2)

ఆ శంకరుడు, మహాదేవుడు, పినాకమును ధకించినవాడై, భూతగనములచే పరివేష్టించబడి పార్వతితోగూడ ఎల్లప్పుడు అచ్చట ప్రకాశించు చుండును. (3)

విభక్తచారుశిఖరః కైలాసో యత్ర పర్వతః | నివాసః కోటియక్షాణాం కుబేరస్య చ ధీమతః || || 4 ||

తత్రాపి దేవదేవస్య భవ స్యాయతనం మహత్‌ | మన్దాకినీ తత్ర పుణ్యా రమ్యా సువిమలోదకా || || 5 ||

నదీ నానావిధైః పద్మై రనేకైః సమలంకృతా | దేవదానవగన్ధర్వయక్షరాక్షసకిన్నరైః || || 6 ||

ఉపస్పృష్టజలా నిత్యం సుపుణ్యా సుమనోరమా | అన్యాశ్చ నద్యః శతశః స్వర్ణపద్మై రలంకృతాః || || 7 ||

తాసాం కూలే తు దేవస్య స్థానాని పరమేష్ఠినః | దేవర్షిగణజుష్టాని తథా నారాయణస్య తు || || 8 ||

తస్యాపి శిఖరే శుభ్రం పారిజాతవనం శుభమ్‌ | తత్ర శక్రస్య విపులం భవనం రత్నమణ్డితమ్‌ || || 9 ||

వేరుపరచబడిన అందమైన శిఖరములు కల కైలాసపర్వతము ఎక్కడకలదో, కోటి సంఖ్యలు గల యక్షులకు కుబేరునికి గూడ నివాసమైనది యేదో; (4)

అక్కడకూడ దేవదేవుడైన ఈశ్వరుని గొప్పమందిరము కలదు. అచ్చట పుణ్యవతి, అందమైనది, నిర్మలములైన జలములు కలది యగు ఆకాశగంగ కలదు. (5)

ఆ నది బహువిధములైన పద్మములచేత అలంకరించడి, దేవతలు, రాక్షసులు, గంధర్వులు యక్షరాక్షసకిన్నరుల చేత; (6)

ఎల్లకాలము సేవించబడు జలముకలదై, మిక్కిలిపుణ్యదాయకముగా, మిక్కిలి మనోహరమై ప్రకాశించును. అక్కడ బంగారు కమలములతో అలంకరింపబడిన ఇతర నదులు కూడ వందలకొలదిగా కలవు. (7)

ఆ నదుల తీరప్రదేశములో భగవంతుడైన పరమేష్ఠి యొక్క స్థానములు, దేవఋషుల సమూహముచే సేవింపబడునవి, నారాయణదేవునికి సంబంధించినవియును; (8)

ఆ పర్వతముయొక్క శిఖరముపైన స్వచ్ఛమైన గొప్ప పారిజాతవనము కలదు. దానిలో మణులచే అలంకరించబడిన, విశాలమైన దేవేంద్రుని భవనము కలదు. (9)

స్ఫాటికస్తంభసంయుక్తం హేమగోపురశోభితమ్‌ | తత్రా థ దేవదేవస్య విష్ణో ర్విశ్వాత్మనః ప్రభోః || || 10 ||

పుణ్యం చ భవనం రమ్యం సర్వరత్నోపశోభితమ్‌ | తత్ర నారాయణః శ్రీమాన్‌ లక్ష్మ్యా సహ జగత్పతిః || || 11 ||

ఆస్తే సర్వేశ్వరః శ్రేష్ఠః పూజ్యమానః సనాతనః | తథా చ వసుధారే తు వసూనాం రత్నమణ్డితమ్‌ || || 12 ||

స్థానానా ముత్తమం పుణ్యం దురాధర్షం సురద్విషామ్‌ | రత్నధారే గిరివరే సప్తర్షీణాం మహాత్మనామ్‌ || || 13 ||

సప్తాశ్రమాణి పుణ్యాని సిద్ధావాసై ర్యుతాని చ | తత్ర హైమం చతుర్ద్వారం వజ్రనీలాదిమణ్డితమ్‌ || || 14 ||

సుపుణ్యం సదవస్థానం బ్రహ్మణోవ్యక్తజన్మనః | తత్ర దేవర్షయో విప్రాః సిద్ధా బ్రహ్మర్షయోపరే || || 15 ||

స్ఫటికమణుల స్తంభములతో కూడినది, బంగారు గోపురములతో ప్రకాశించుచున్నదిగా ఆ భవనముండును. అచ్చట దేవుడు, విశ్వస్వరూపుడు, ప్రభువు అగు విష్ణువుయొక్క పుణ్యమై మనోహరమైనది, సమస్త రత్నములతో శోభించుచున్నది అగు మందిరము కలదు. దానిలో లోకములకు ప్రభువు, శ్రీమంతుడు అగు నారాయణుడు లక్ష్మీదేవితో సహ నివసించుచుండును. (10, 11)

అతడు సర్వేశ్వరుడు, ఉత్తముడు, పూజింపడువాడు, సనాతనుడు కూడ. అదేవిధముగా వసుధారమను ప్రదేశములో మణులచేత అలంకరించబడిన వసువులయొక్క పుణ్యకరమైన, రాక్షసులకు ఎదుర్కొన శక్యముకాని ఉత్తమస్థానము కలదు. రత్నధారమను పర్వతశ్రేష్ఠమునందు మహాత్ములైన సప్తర్షులయొక్క (12, 13) పుణ్యకరములైన ఏడు ఆశ్రమములు సిద్ధులు నివాసములతో కూడినవి కలవు. అక్కడ సువర్ణ నిర్మితము, నాలుగు ద్వారములు కలది, వజ్రములు నీలమణులు మొదలగువానితో అలంకరించబడినది, మిక్కిలి పుణ్యదాయకము, అవ్యక్తమైన పుట్టుకకల బ్రహ్మయొక్క నివాసస్థానమున్నది. అచ్చట దేవర్షులు, బ్రాహ్మణులు, సిద్ధులు, ఇతర బ్రహ్మర్షులు, (14, 15)

ఉపాసతే దేవదేవం పితామహ మజం పరమ్‌ | సర్వైః సమ్పూజితో నిత్యం దేవ్యా సహ చతుర్ముఖః || || 16 ||

ఆస్తే హితాయ లోకానాం శాన్తానాం పరమా గతిః | తసై#్యకశృఙ్గశిఖరే మహాపద్మై రలంకృతే || || 17 ||

స్వచ్ఛామృతజలం పుణ్యం సుగన్ధం సుమహత్సరః | జైగీషవ్యాశ్రమం పుణ్యం యోగీన్ద్రై రుపసేవితమ్‌ || || 18 ||

తత్రాస్తే భగవా న్నిత్యం సర్వశిషై#్యః సమావృతః | ప్రశాన్తదోషై రక్షుద్రై ర్బ్రహ్మవిద్భి ర్మహాత్మభిః || || 19 ||

శంఖో మనోహర శ్చైవ కౌశికః కృష్ణ ఏవ చ | సుమనా వేదవాదశ్చ శిష్యా స్తస్య ప్రసాదతః || || 20 ||

దేవతలకుదేవుడు, పితామహుడు, జన్మరహితుడు అగు బ్రహ్మను పూజించుచుందురు. ఎల్లప్పుడు అందరిచేత పూజింబడుచు దేవితో కూడ బ్రహ్మ (16) శాంతులగు యోగులకు పరమ ప్రాప్యుడై, లోకముల హితముకొరకు నివసించును. ఆ పర్వతముయొక్క ఒక్క శిఖరము పైభాగములో, శ్రేష్ఠములైన పద్ములచే అలంకరింపబడినదిగా, నిర్మలమైన అమృతపు నీరు కలది, పుణ్యకరము, మంచి పరమళముతో నిండిన గొప్ప కొలను కలదు. అక్కడ యోగీశ్వరుల చేత సేవింపబడుచున్న, పుణ్యమైన జైగీషవ్యాశ్రమముకలదు. (17, 18)

అచ్చట భగవంతుడగు జైగీషవ్యుడు శిష్యులందరితో కూడి ఎల్లప్పుడు నివసించుచుండును. ఆ శిష్యులు దోషములు తొలగినవారు, ఉత్తములు, బ్రహ్మజ్ఞానము కలవారు, మహాత్ములు నైయుండిరి. (19)

శంఖుడు, మనోహరుడు, కౌశికుడు, కృష్ణుడు, సుమనసుడు, వేదవాదుడు అనువారు ఆమహాత్ముని శిష్యులు. ఆయన అనుగ్రహము వలన (20)

సర్వయోగరతాః శాన్తా భస్మోద్ధూలితవిగ్రహాః | ఉపాసతే మహాచార్యా బ్రహ్మవిద్యాపరాయణాః || || 21 ||

తేషా మనుగ్రహార్థాయ యతీనాం శాన్త చేతసామ్‌ | సాన్నిధ్యం కురుతే భూయో దేవ్యాసహ మహేశ్వరః || || 22 ||

అనేకా న్యాశ్రమాణిస్యు స్తస్మిన్‌ గిరివరోత్తమే | మునీనాం యుక్తమనసాం సరాంసి సరిత స్తథా || || 23 ||

తేషు యోగరతా విప్రా జాపకాః సంయతేన్ద్రియాః | బ్రహ్మ ణ్యాసక్తమనసో రమన్తే జ్ఞానతత్పరాః || || 24 ||

ఆత్మ న్యాత్మాన మాధాయ శిఖాన్తే పర్యవస్థితమ్‌ | ధ్యాన్తి దేవ మీశానం యేన సర్వమిదం తతమ్‌ || || 25 ||

సుమేఘం వాసవస్థానం సహస్రాదిత్యసన్నిభమ్‌ | తత్రాస్తే భగవా నిన్ద్రః శచ్యా సహ సురేశ్వరః || || 26 ||

సమస్తయోగములందాసక్తులై, శాంతస్వభావులై, భస్మముచేత లేపనము చేయబడిన శరీరములు కలవారై, వేదాంతవిద్య యందు నిష్ఠకల గొప్ప ఆచార్యులు సేవించుచుందురు. (21)

వారందరిని అనుగ్రహించుట కొరకు మహేశ్వరుడు దేవితోకూడి శాంతమైన మనస్సుకల ఆయోగులకు సాన్నిధ్యముననుగ్రహించి వసించును. (22)

పర్వతశ్రేష్ఠమైన దానియందు అనేకములైన ఆశ్రమములు కలవు. యోగనిష్ఠులగు మునులకు సంబంధించినవి. సరస్సులు, సెలయేర్లు కూడకలవు. (23)

ఆ యాశ్రమములందు యోగమునందు తత్పరులు, జపనిష్ఠులు, ఇంద్రియముల జయించినవారు, పరబ్రహ్మమునందు మనస్సు మగ్నము చేసినవారు, జ్ఞానతత్పరులు అగు బ్రాహ్మణులు సంతోషముగా గడుపుదురు. (24)

ఆత్మయందాత్మను నిలిపి శిఖాగ్రభాగములో నిలిచియున్న దేవుని, ఎవనిచేత ఈవిశ్వమంతయు వ్యాప్తమైయున్నదో ఆయీశ్వరుని ధ్యానింతురు. (25)

వేయిసూర్యులతో సమానకాంతిగల సుమేఘమను వాసవస్థానములో భగవంతుడగు ఇంద్రుడు శచీదేవితోసహ నివసించును. (26)

గజశైలే తు దుర్గాయా వననం మణితోరణమ్‌ | ఆస్తే భగవతీ దుర్గా తత్ర సాక్షా న్మహేశ్వరీ || || 27 ||

ఉపాస్యమానా వివిధైః శక్తిభేదై రితస్తతః | పీత్వా యోగామృతం లబ్ధ్వా సాక్షా దమృత మైశ్వరమ్‌ || || 28 ||

సునీలస్య గిరేః శృఙ్గే నానాధాతుసముజ్జ్వలే | రాక్షసానాం పురాణి స్యుః సరాంసి శతశో ద్విజాః || || 29 ||

తథా పురశతం విప్రాః శతశృఙ్గే మహాచలే | స్ఫాటికస్తంసంయుక్తం యక్షాణా మమితౌజసామ్‌ || || 30 ||

శ్వేతోదరిగిరేః శృఙ్గే సుపర్ణస్య మహాత్మనః | ప్రాకారగోపురోపేతం మణితోరణమణ్డితమ్‌ || || 31 ||

స తత్ర గరుడః శ్రీమాన్‌ సాక్షా ద్విష్ణు రివాపరః | ధ్యాత్వా తత్పరమం జ్యోతి రాత్మ న్యేవ మధా వ్యయమ్‌ || || 32 ||

గజశైలమునందు మణుల తోరణముతో కూడిన దుర్గాదేవి భవనమున్నది. అక్కడ సాక్షాత్తు మహేశ్వరియగు దుర్గాదేవి నివసించును. (27)

ఆమె వివిధములైన శక్తి బేదములచేత అన్నివైపుల సేవింపబడుచున్నదై, యోగమను అమృతమును పానము చేసి ఈశ్వర సంబంధి అమృతమును పొంది నిలిచియున్నది. (28)

అనేకములైన ధాతువులతో ప్రకాశించుచున్న సునీల పర్వతము యొక్క శిఖరమునందు రాక్షసుల పట్టణములు, కొలనులు వందల కొలదిగా కలవు. (29)

బ్రాహ్మణులారా! శతశృంగమను పెద్ద పర్వతముపైన, స్ఫటికమణి నిర్మితములైన స్తంభములతో కూడిన, గొప్ప బలముకల యక్షుల యొక్క వంద పట్టణములు కలవు. 930)

శ్వేతోదరపర్వతము యొక్క శృంగముపై, మహాత్ముడైన గరుడునియొక్క ప్రాకారములతో, గోపురములతో కూడిన, మణితోరనములతో అలంకరింపబడిన పురమున్నది. (31)

అక్కడ శ్రీమంతుడగు గరుడుడు, సాక్షాత్తు రెండవ విష్ణువువలె, ఆపరంజ్యోతిని ధ్యానించి, నాశరహితుడైన బ్రహ్మను ఆత్మయందు ధ్యానించుచు వసించును. (32)

అన్యచ్చ భవనం పుణ్యం శ్రీశృఙ్గే మునిపుఙ్గవాః | శ్రీదేవ్యాః సర్వరత్నాధ్యం హైమం సమణితోరణమ్‌ || || 33 ||

తత్ర సా పరమా శక్తి ర్విష్ణో రతిమనోరమా | అనన్తవిభవా లక్ష్మీ ర్జగత్సంమోహనోత్సుకా || || 34 ||

అధ్యాస్తే దేవగన్ధర్వసిద్ధచారణవన్దితా | విచిన్త్యా జగతో యోనిః స్వశక్తికిరణోజ్జ్వలా || || 35 ||

తత్రైవ దేవదేవస్య విష్ణో రాయతనం మహత్‌ | సరాంసి తత్ర చత్వారి విచిత్రకమలాశయాః || || 36 ||

తథా సహస్రశిఖరే విద్యాదరపురాష్టకమ్‌ | రత్నసోపానసంయుక్తం సరోభి శ్చోపశోభితమ్‌ || || 37 ||

మునిశ్రేష్ఠులారా! శ్రీశృంగమునందు అన్ని రత్నములతో సంపన్నమైన, బంగారుమయమైన, మణితోరణములతో కూడిన లక్ష్మీదేవి యొక్క మరియొక భవనము కలదు. (33)

అక్కడ విష్ణువునకు అతిప్రియమైన, పరమశక్తిరూపమైన, అనంతమైనవిభవముకల లక్ష్మీదేవి జగత్తును సంమోహింపజేయుటయందాసక్తి కలదై, దేవతలు, గంధర్వులు, సిద్ధులు మరియు చారణులచేత పూజింపబడుచు, లోకమునకు కారణభూతురాలైన తనశక్తియొక్క కిరణములచే ప్రకాశించునదై నివసించియుండును. (34, 35)

అక్కడనే దేవదేవుడైన విష్ణువుయొక్క గొప్పమందిరమున్నది. విచిత్రములైన పద్మముల కాశ్రయములైన నాలుగు సరస్సులు కూడ కలవు. (36)

అట్లే సహస్రశిఖరపర్వతముపై విద్యాధరుల ఎనిమిది పట్టణములు కలవు. ఆ పట్టణ సమూహము మణి సోపానములతో కూడి కొలనులతో ప్రకాశించునదై యుండును. (37)

నద్యో విమలపానీయా శ్చిత్రనీలోత్పలాకరాః | కర్ణికారవనం దివ్యం తత్రాస్తే శంకరః స్వయమ్‌ || || 38 ||

పారిజాతే మహాలక్ష్మ్యాః పర్వతే తు పురం శుభమ్‌ | రమ్యప్రాసాదసంయుక్తం ఘణ్టాచామరభూషితమ్‌ || || 39 ||

నృత్యద్భి రప్సరఃసంఘై రితశ్చేత శ్చ శోభితమ్‌ | మృదఙ్గపణవోద్ఘుష్టం వేణువీణానినాదితమ్‌ || || 40 ||

గన్ధర్వకిన్నరాకీర్ణం సంవృతం సిద్ధపుఙ్గవైః | భాస్వద్భి ర్భృశ మాయుక్తం మహాప్రాసాదసఙ్కులమ్‌ || || 41 ||

మహాగణశ్వరై ర్జుష్టం ధార్మికాణాం సుదర్శనమ్‌ | తత్ర సా వసతే దేవీ నిత్యంయోగపరాయణా || || 42 ||

మహాలక్ష్మీ ర్మహాదేవీ త్రిశూలవరధారిణీ | త్రినేత్రా సర్వశక్త్యౌఘసంవృతా సా చ తన్మయీ || || 43 ||

నిర్మలమైన జలముతోకూడిన నదులు, విచిత్రములైన నల్లకలువలకాశ్రయములై యుండును. ఒక కర్ణికారవనము కలదు. అక్కడ శంకరుడు స్వయముగా నివసించును. (38)

పారిజాతమను పర్వతముపై మహాలక్ష్మి యొక్క మంగళకరమైన పట్టణముకలదు. అది అందములైన ప్రాసాదములతో కూడి ఘంటలు, చామరములచేత అలంకరింపబడినదై యుండును. (39)

ఇంకను, నాట్యముచేయు అప్సరసల సమూహముతో అన్నివైపుల ప్రకాశించునది, మృదంగము, పణవము అను వాద్యములతో ధ్వనించునది, వేణువు, వీణ యొక్క నాదములతో కూడినదిగాను ఉండును. (40) గంధర్వులు, కిన్నరులతోనిండి, సిద్ధులతో కూడి, గొప్ప ప్రాసాదములతో నిండినదై మిక్కిలి ప్రకాశవంతముగా నుండును. (41)

ఆ పురము మహాగణశ్వరులతో కూడి, ధర్మాత్ములకు మిక్కిలి చూడదగినదై యొప్పును. ఆ లక్ష్మీదేవి అక్కడ ఎల్లప్పుడు యోగపరాయణురాలై నివసించును. (42)

ఆ మహాలక్ష్మి మహాదేవిగా, త్రిశూలమును ధరించునది, మూడు కన్నులు కలదై, అన్ని శక్తుల సమూహముతో నిండియున్నదై తన్మయ రూపముతో ప్రకాశించును. (43)

పశ్యన్తి తత్ర మునయః సిద్ధా యే బ్రహ్మవాదినః | సుపార్శ్వ స్యోత్తరే భాగే సర్వస్వత్యాః పురోత్తమమ్‌ || || 44 ||

సరాంసి సిద్ధజుష్టాని దేవభోగ్యాని సత్తమాః | పాణ్డురస్య గిరేః శృఙ్గే విచిత్రద్రుమసఙ్కులమ్‌ || || 45 ||

గన్థర్వాణాం పురశతం దివ్యస్త్రీభిః సమావృతమ్‌ | తత్ర నిత్యం మదోత్సిక్తా నరా నార్య స్తథైవ చ || || 46 ||

క్రీడన్తి ముదితా నిత్యం విలాపై ర్భోగతత్పరాః | అఞ్జనస్య గిరేః శృఙ్గే నారీపుర మనుత్తమమ్‌ || || 47 ||

వసన్తి తత్రాప్సరసో రమ్భాద్యా రతిలాలసాః | చిత్రసేనాదయో యత్ర సమాయా న్త్యర్థినః సదా || || 48 ||

సుపార్శ్వ పర్వతమున కుత్తర భాగములో సరస్వతియొక్క ఉత్తమమైన పురము కలదు. అక్కడ సిద్ధులు, బ్రహ్మవాదులైన మునులు దర్శింతురు. (44)

మునీశ్వరులారా! సిద్ధులచే సేవింపడునవి, దేవతలకు అనుభవ యోగ్యములు అయిన కొలనులు అక్కడ కలవు. పాండురగిరి యొక్క శిఖరము మీద విచిత్రములైన వృక్షములతో వ్యాపించియున్నది, దేవతాస్త్రీలతో ఆవరింపబడియున్న గంధర్వుల పట్టణ శతము కలదు. అక్కడ ఎల్లప్పుడు మదముచే ప్రేరితులై పురుషులు మరియు స్త్రీలు (45, 46) సుఖానుభవమునందాసక్తి కలవారై, సంతోషపూర్ణులై, విలాసములతో విహరించు చుందురు. అంజన పర్వతముయొక్క శిఖరము మీద శ్రేష్ఠమైన నారీపురము కలదు. (47)

అక్కడ శృంగార క్రీడలయందాసక్తికల రంభమొదలగు అప్సరసలు నివసింతురు. అక్కడికి వారి సమాగమమును కోరువారై చిత్రసేనుడు మొదలగు గంధర్వరాజులు ఎల్లప్పుడు వచ్చుచుందురు. (48)

సా పురీ సర్వరత్నాఢ్యా నైక ప్రస్రవణౖ ర్యుతా | అనేకాని పురాణి స్యుః కౌముదే చాపి సత్తమాః || || 49 ||

రుద్రాణాం శాన్తరజసా మీశ్వరాసక్తచేతసామ్‌ | తేషు రుద్రా మహాయోగా మహేశాన్తరచారిణః || || 50 ||

సమాసతే పురం జ్యోతి రారూఢాః స్థాన మైశ్వరమ్‌ | పిఞ్జరస్య గిరేః శృఙ్గే గణశానాం పురత్రయమ్‌ || || 51 ||

నందీశ్వరస్య కపిలా తత్రాస్తే స మహామతిం | తథా చ జారుధేః శృఙ్గే దేవదేవస్య ధీమతః || || 52 ||

దీప్త మాయతనం పుణ్యం భాస్కరస్యా మితైజసః | తసై#్యవోత్తరదిగ్భాగే చన్ద్రస్థాన మనుత్తమమ్‌ || || 53 ||

ఆ పట్టణము సమస్తములైన రత్నములతో సంపన్నమై, అనేక జలాశయములతో కూడి యుండును. విప్రులారా! కౌముద పర్వతము నందు అనేకములగు పురములు కలవు. (49)

అవి రజోగుణము తొలగిపోయి, ఈశ్వరుని యందు మనస్సులగ్నమైన రుద్రగణములకు చెందినవి. ఆపట్టణములయందు గొప్పయోగము కలవారు, మహేశ్వరునకు ఆంతరింగికులైన అనుచరులు అగు రుద్రగణములవారు, ఈశ్వరసంబంధి స్థానమునధిరోహించి తేజోరూపమైన పురము నాశ్రయించి ఉందురు. పింజరమను పర్వతము యొక్క శిఖరముపై గణశుల యొక్క మూడు పట్టణములు కలవు. (50, 51)

నందీశ్వరుని యొక్క కపిలధేనువు అక్కడ నివసించును. ఆనందీశ్వరుడు గొప్ప బుద్ధికలవాడు మరియు జారుధిపర్వతము యొక్క శృంగమునందు, దేవదేవుడు, గొప్ప ధీమంతుడు, అమితమైన బలము కలిగిన సూర్యుని యొక్క ప్రకాశవంతము, పుణ్యకరము అగు నివాసస్థానము కలదు. దానికుత్తర దిగ్భాగములో సర్వశ్రేష్ఠమైన చంద్రుని స్థానము కలదు. (52, 53)

వసతే తత్ర రమ్యాత్మా భగవాన్‌ శాన్తదీధితిః | అన్యత్ర భవనం దివ్యం హంసశైలే మహర్షయః || || 54 ||

సహస్రయోజనాయామం సువర్ణమణితోరణమ్‌ | తత్రాస్తే భగవాన్‌ బ్రహ్మా సిద్ధసంఘై రభిష్టుతః || || 55 ||

సావిత్ర్యా సహ విశ్వాత్మా వాసుదేవాదిభిర్యుతః | తస్య దక్షిణగ్భాగే సిద్ధానాం పుర ముత్తమమ్‌ || || 56 ||

సనందనాదయో యత్ర వసన్తి ముని పుఙ్గవాః | పఞ్చశైలస్య శిఖరే దానవానాం పురత్రయమ్‌ || || 57 ||

నాతి దూరేణ తస్మాచ్చ దూత్యాచార్యస్య ధీమతః | సుగన్ధశైలశిఖరే సరిద్భి రుపశోభితమ్‌ || || 58 ||

అచ్చట సుందరమైన రూపము కలవాడు, పూజనీయుడు, చల్లని కిరణములు కలవాడు అగు చంద్రుడు నివసించును. మహర్షులారా! మరియొకచోట హంసశైలము నందు దివ్యమైన, వేయియోజనముల పొడవుకలది, బంగారము, మణులతో చేయబడిన తోరణములు కలది అగు భవనము కలదు. అక్కడ భగవంతుడగు బ్రహ్మ, సిద్ధుల సమూహములచేత కొనియాడబడుచు వెలసియుండును. (54, 55)

విశ్వాత్మకుడగు ఆ బ్రహ్మ, విష్ణుదేవుడు మొదలగువారితో కూడి, సావిత్రీ దేవితో సహ అక్కడ వసించి యుండును. దానికి దక్షిణ దిక్కున సిద్ధులయొక్క శ్రేష్ఠమైన పట్టనముండును. (56)

అక్కడ సనందనుడు మొదలగు మునిశ్రేష్ఠులు నివసించి యుందురు. పంచశైలము యొక్క శిఖరముమీద దానవులయొక్క మూడు పట్టనములు కలవు. (57)

వానికి కొద్దిదూరములో బుద్ధిమంతుడు, రాక్షసులకు గురువు అగు శుక్రాచార్యునియొక్క నివాసము కలదు. సుగంధపర్వతముయొక్క శృంగముమీద నదులతో ప్రకాశించుచున్నట్టి, కర్దమముని యొక్క పుణ్యవంతమైన ఆశ్రమస్థానము కలదు.

కర్దమ స్యాశ్రమం పుణ్యం తత్రాస్తే భగవా నృషిః | తసై#్యవ పూర్వదిగ్భాగే కిఞ్చి ద్వై దక్షిణాశ్రితే || || 59 ||

సనత్కుమారో భగవాం స్తత్రాస్తే బ్రహ్మవిత్తమః | సర్వే ష్వేతేషు తథాన్యేషు మునీశ్వరాః || || 60 ||

సరాంసి విమలా నద్యో దేవానా మాలయాని చ | సిద్ధలింగాని పుణ్యాని మునిభిః స్థాపితాని చ || || 61 ||

తాని చాయతనా న్యాశు సంఖ్యాతుం నైవ శక్యతే | ఏష సంక్షేపతః ప్రోక్తో జమ్బూద్వీపస్య విస్తరః || || 62 ||

న శక్యో విస్తరా ద్వక్తుం మయా వర్షశ##తైరపి ||

ఇతి శ్రీ కూర్మపురాణ జమ్బూద్వీప వర్ణనం నామ అష్టాచత్వారింశోధ్యాయః

అక్కడ భగవానుడగు కర్దమఋషి నివసించును. దానికి తూర్పుదిక్కున కొంచెము దక్షిణభాగము నాశ్రయించిన ప్రదేశములో పూజ్యుడైన, బ్రహ్మవేత్తలలో ఉత్తముడైన సనత్కుమారుడు నివసించును. ఓ మునీంద్రులారా! ఈ అన్ని పర్వతములయందును, ఇంకు ఇతరములయందును, (59, 60) కొలనులు, నిర్మలములైన నదులు, దేవతల యొక్క మందిరములును, పుణ్యదాయకములు, మునులచేత ప్రతిష్ఠించబడిన సిద్ధ లింగములును కలవు. (61)

ఆ మందిరములను శీఘ్రముగా లెక్కించుటకు శక్యముకాదు. ఇంతవరకు జంబూద్వీపముయొక్క విస్తారము గూర్చి సంక్షేపముగా నాచే తెలుపబడినది. ఇంతకంటె విపులముగా నూరు సంవత్సరాల కాలములో గూడ నాకు చెప్పుటకు శక్తి చాలదు. (62)

శ్రీ కూర్మపురాణములో జంబూద్వీప వర్ణనమను నలుబది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters