Sri Koorma Mahapuranam
Chapters
పంచమోధ్యాయః అథకాల సంఖ్యా వివరణమ్ కూర్మఉవాచ :- అనుత్పాదాచ్చ పూర్వస్మాత్ స్వయంభూరితి స స్మృతః | నరాణా మయనం యస్మాత్ తేన నారాయణః స్మృతః ||
|| 1 || హరః సంసారహరణాత్ విభుత్వా ద్విష్ణు రుచ్యతే | భగవాన్ సర్వవిజ్ఞానా దవనా దో మితి స్మృతః ||
|| 2 || సర్వజ్ఞః సర్వవిజ్ఞానాత్ సర్వః సర్వమయో యతః | స్వయంభువో నివృత్తస్య కాలసంఖ్యా ద్విజోత్తమాః ||
|| 3 || న శక్యతే సమాఖ్యాతుం బహువర్షైరపి స్వయమ్ | కాలసంఖ్యా సమాసేన పరార్ధద్వయకల్పితా ||
|| 4 || స ఏవ స్యా త్పరః కాలః తదన్తే సృజ్యతే పునః | నిజేన తస్యమానేన చాయుర్వర్ష శతం స్మృతమ్ ||
|| 5 || పంచమాధ్యాయము కాల సంఖ్యావివరణము కూర్మపురుషుడుచెప్పెను :- పుట్టుకలేకపోవుట, అన్నిటికంటె పూర్వంనుండి ఉండుట అనే కారణాల వలన స్వయంభువు అని చెప్పబడినాడు. ఏకారణం చేత మనుష్యులకు గమ్యమార్గమైనాడో, అందువలన నారాయణుడుగా తలచబడుచున్నాడు (1) సంసారబంధాన్ని నశింపజేయటం వలన హరుడని, సర్వవ్యాపి కనుక విష్ణువని చెప్పబడుతున్నాడు. సమస్త విజ్ఞానము కల్గిఉన్నందున భగవంతుడుగా, జగద్రక్షుడు కావున ఓంకారరూపుడుగా పిలువబడుతున్నాడు. (2) సమగ్రవిజ్ఞానవంతుడు కావున సర్వజ్ఞుడని, సమస్త విశ్వస్వరూపుడైనందున సర్వుడని చెప్పబడును. ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! ఆవిర్భవించినట్టి ఆ స్వయంభువు యొక్క కాలసంఖ్య; (3) లెక్కించి చెప్పటానికి అనేక సంవత్సరాల కాలంచేత కూడ సాధ్యం కాదు. సంగ్రహంగా కాలసంఖ్య రెండు పరార్థాలతో ఏర్పాటు చేయబడింది. (4) అదియే పరకాలము. ప్రళయకాలము. దాని తరువాత మరల సృష్టిజరుగుతుంది. ఆ బ్రహ్మయొక్క స్వీయ మానంతో అది శతాబ్ద కాలంగా చెప్పబడింది. (5) తత్పరార్ధే తదర్థేవా పరార్థ మభిధీయతే | కాష్ఠా పఞ్చదశ ఖ్యాతా నిమేషా ద్విజసత్తమాః ||
|| 6 || కాష్ఠా త్రింశత్ కలా త్రింశత్ కలా మౌహుర్తికీ గతిః | తావత్సంఖ్యై రహోరాత్రం ముహూర్తై ర్మానుషం స్మృతమ్ ||
|| 7 || అహోరాత్రాని తావంతి మాసః పక్షద్వయాత్మకః | తైః షడ్భి రయనం వర్షం ద్వే7 యనే దక్షిణోత్తరే ||
|| 8 || అయనం దక్షిణం రాత్రిః దేవానా ముత్తరం దినమ్ | దివ్యైర్వర్షసహసై#్రస్తు కృత త్రేతాది సంజ్ఞితమ్ ||
|| 9 || చతుర్యుగం ద్వాదశభి స్తద్విభాగం నిబోధత | చత్వా ర్యాహుః సహస్రాణి వర్షాణాం తత్కృతం యుగమ్ ||
|| 10 || బ్రాహ్మణోత్తములారా! ఆపరకాలంలో సగభాగాన్ని పరార్థము అని వ్యవహరిస్తారు. పదునైదు నిమిషాల కాలము ఒక కాష్ఠగా చెప్పబడినది. (6) ముప్పది కాష్ఠల కాలము ఒకకల అనబడును. ముప్పది కలలకాలము ఒక ముహుర్తమగును. అటువంటి ముప్పది ముహూర్తకాలాలతో మనుష్యులకు ఒక అహోరాత్ర పరిమాణ కాలము జరుగును. (7) ముప్పది అహోరాత్రముల కాలము ఒకమాసమని, అదిరెండు పక్షములు కలిగి ఉండునని, అటువంటి మాసములారింటికి ఒక అయనమగు నని, దక్షిణాయనము, ఉత్తరాయణము అని రెండు అయనములను తెలియవలెను. (8) మానవుల దక్షిణాయనము దేవతలకు రాత్రికాలము, ఉత్తరాయణము పగటికాలముగా పరిగణించబడును. అటువంటి దేవమానముతో 12 వేల సంవత్సరాల కాలముతో కృత, త్రేతాది సంజ్ఞలు కలిగిన, (9) నాలుగు యుగాలు ఏర్పడును. వాని విభాగమును తెలిసి కొనుడు. నాలుగు వేల దేవసంవత్సరాల కాలము కృతయుగమని చెప్పుదురు. (10) తస్య తావచ్ఛతా సన్థ్యా సంధ్యాంశశ్చకృతస్య తు | త్రిశతా ద్విశతా సన్థ్యా తథా చైకశతా క్రమాత్ ||
|| 11 || అంశకం షట్శతం తస్మాత్కృత సంధ్యాంశ##కై ర్వినా | త్రిధైక ధాచ సాహస్రం వినా సంధ్యాంశ##కేన తు ||
|| 12 || త్రేతాద్వాపరితిష్యాణాం కాలజ్ఞానే ప్రకీర్తితమ్ | ఏతద్ద్వాదశ సాహస్రం సాధికం పరికల్పితమ్ ||
|| 13 || తదేకసప్తతిగుణం మనో రన్తర ముచ్యతే | బ్రహ్మణో దివసే విప్రా మనవ శ్చ చతుర్దశ ||
|| 14 || స్వాయమ్భువాదయః సర్వే తతః సావర్ణికాదయః | తై రియం పృథివీ సర్వా సప్తద్వీపా సపర్వతా ||
|| 15 || కృతయుగానికి నాలుగువేలదేవసంవత్సరాల కాలము. నాలుగు వందల సంధ్యాకాలము, నాలుగు వందల సంధ్యాంశము. మొత్తము 4800 సంవత్సరాలు. అదే విధంగా త్రేతాయుగానికి మూడువేల సంవత్సరాలు. సంధ్యాసంధ్యాంశలు 300+300 = 600 సం||లు మొత్తం 3600 సంవత్సరాలు. ద్వాపరయుగానికి రెండువేల సంవత్సరాలు యుగకాలము; సంధ్యసంధ్యాంశలు 200+200 = 400 సం||లు. మొత్తం 2400 సంవత్సరాలు - కలియుగానికి యుగకాలం 1000 సం||లు, సంధ్య సంధ్యాంశలు 100+100 = 200 సం|| లు మొత్తం 1200 సంవత్సరాలు. ఈ విధంగా నాలుగు యుగాలమొత్తం సంవత్సరాలు 4800+3600+2400+1200 = 12000 సంవత్సరాలు సరిపోతాయి. ఇట్టి మహాయుగములు 71 అయినచో ఒక మన్వన్తరముగా చెప్పబడినది. బ్రహ్మకు పగటిపూట 14 గురు మనువులు స్వాయంభువ సావర్ణి కాదులుగా ఉందురు. వారితో ఈ పృథివి అంతయు సప్తద్వీపములు పర్వతములు కలది వ్యాపించ బడినది. పూర్ణం యుగసహస్రం వై పరికల్పా నరేశ్వరైః | మన్వన్తరేణ చైకేన సర్వాణ్య వాన్తరాణి వై ||
|| 16 || వ్యాఖ్యాతాని న సందేహః కల్పే కల్పే న చైవ హి | బ్రాహ్మ మేక మహః కల్ప స్తావతా రాత్రిరిష్యతే ||
|| 17 || చతుర్యుగ సహస్రం తు కల్ప మాహు ర్మనీషిణః | త్రీణి కల్పశతాని స్యుః తథాషష్టిర్ద్వ జోత్తమాః || || 18 || బ్రహ్మణో వత్సర స్తజ్ఞైః కథితో వై ద్విజోత్తమాః | స చ కాలః శతగుణః పరార్థం చైవ తద్విదుః ||
|| 19 || తస్యాంతే సర్వసత్త్వానాం సహేతౌ ప్రకృతౌ లయః | తేనాయం ప్రోచ్యతే సద్భిః ప్రాకృతః ప్రతిసంచరః ||
|| 20 || సంపూర్ణముగా వేయి యుగముల సమూహము పరికల్ప అని చెప్పబడును. ఒక మన్వంతరమును వివరించుట చేత అన్ని మన్వంతరాలను గూర్చి వివరించినట్లైనది. సందేహములేదు. ప్రతికల్పము బ్రహ్మకు ఒక పగలు, అట్లే ఒక కల్పము రాత్రిగా పరిగణింపబడును. (16, 17) నాలుగు వేలయుగముల కాలమును ఒక కల్పమని పండితులు చెప్పుచున్నారు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! మూడు వందల అరవై కల్పముల కాలము; (18) బ్రహ్మకు ఒక సంవత్సరకాలమని విద్వాంసులైన వారిచేత చెప్పబడినది. దానికి వందరెట్లు పరిమాణము గల కాలము పరార్థము అని తెలియవలెను. (19) దాని సమాప్తి కాలములో సృష్టిలోని సకల ప్రాణులకు ప్రకృతి యందు లయము కలుగును. అందుచేత ఇది సజ్జనులచేత ప్రాకృతమైన సర్గమని చెప్పబడుచున్నది. బ్రహ్మనారాయణశానాం త్రయాణాం ప్రాకృతో లయః | ప్రోచ్యతే కాలయోగేన పున రేవచ సమ్భవః ||
|| 21 || ఏవం బ్రహ్మాచ భూతాని వాసుదేవో7పి శంకరః | కాలేనైవ తు సృజ్యన్తే స ఏవ గ్రసతే పునః ||
|| 22 || అనాది రేష భగవాన్ కాలో7 నన్తో7 జరో7 మరః | సర్వగత్వా త్స్వతన్త్రత్వా త్సర్వాత్మత్వా న్మహేశ్వరః ||
|| 23 || బ్రహ్మాణో బహవోరుద్రా హ్యన్యే నారాయణాదయః | ఏకోహి భగవానీశః కాలః కవిరితి శ్రుతిః ||
|| 24 || ఏక మత్ర వ్యతీతం తు పరార్థం బ్రహ్మణో ద్విజాః | సామ్ర్పతం వర్తతే త్వర్థం తస్య కల్పో7 యమగ్రజః |
|| 25 || యో7 తీతః సో7న్తిమః కల్పః పాద్మ ఇత్యుచ్యతె బుధైః | వారాహో వర్తతే కల్పః తస్య వక్ష్యామి విస్తరమ్ ||
|| 26 || ఇతి శ్రీ కూర్మపురాణ కాలసంఖ్యాకథనం నామ పఞ్చమో7 ధ్యాయః బ్రహ్మకు, విష్ణువుకు, రుద్రునికి ఈ ముగ్గురికి కూడ కాలనియమముతో ప్రాకృతికమైనలయము కలుగుతున్నది. మరల కొంత కాలానికి జన్మము కూడ కలుగుతుంది. (21) ఈ విధముగా బ్రహ్మ, ప్రాణులు, వాసుదేవుడు, శంకరుడు కూడ కాలముచేతనే సృజింప బడుతున్నారు. మరల ఆకాలమే వారిని మ్రింగి వేయుచున్నది. (22) పూజనీయమైన యీ కాలము అది, అంతములేనిది, జరామరణములు లేనిది. ఆకాలమే అన్నిటిని పొందినది, స్వతంత్రము, సర్వాత్మకము అయినందువలన మహేశ్వర స్వరూపమైనది. (23) బ్రహ్మలు చాలా మంది కలరు. రుద్రులు, నారాయణాదులు కూడ పెక్కు మంది ఉన్నారు. భగవద్రూపమైన కాలము మాత్రము ఒక్కటే అని వేదము. (24) ఓ విప్రులారా! బ్రహ్మమొక్క ఒక పరార్థము గడిచినది. ఇప్పుడు అతని రెండవ పరార్థము జరుగుతున్నది. దానిలో ఇది మొదటి కల్పము. (25) ఇంతకు ముందుగడిచిన చివరి కల్పము పాద్మమని పండితులచేత చెప్పబడుతున్నది. ఇప్పుడు వారాహకల్పము జరుగుతున్నది. దాని వివరము తెలుపుదును. కూర్మపురాణములో కాలసంఖ్యాకథనము అను పంచమాధ్యాయము సమాప్తము.