Sri Koorma Mahapuranam
Chapters
అథపఞ్చాశో೭ధ్యాయః సూత ఉవాచ :- శాకద్వీపస్య విస్తారా ద్ద్విగుణన వ్యవస్థితః | క్షీరార్ణవం సమాశ్రిత్య ద్వీపం పుష్కరసంజ్ఞితమ్ ||
|| 1 || ఏక ఏవా త్ర విప్రేన్ద్రా పర్వతో మానసోత్తరః | యోజనానాం సహస్రాణి చోర్థ్వం పంచాశ దుచ్ఛ్రితః ||
|| 2 || ఏబదియవ అధ్యాయము సూతుడు పలికెను :- శాకద్వీపముయొక్క వైశాల్యమునకు రెండురెట్లుగా క్షీరసాగరము నాశ్రయించి పుష్కరమను పేరుగల ద్వీపము నెలకొనియున్నది. (1) బ్రాహ్మణోత్తములారా! ఈ ద్వీపములో మానసోత్తరమను పేరుగల పర్వతము ఒక్కటే వేయియోజనముల పొడవు, ఏబది యోజనముల ఎత్తును కలిగియున్నది. (2) తావ దేవ చ విస్తీర్ణః సర్వతః పారిమణ్డలః | స ఏవ ద్వీప శ్చార్థేన మానసోత్తరసంస్థితః ||
|| 3 || ఏక ఏవ మహాభాగః సన్నివేశో ద్విధాకృతః | తస్మిన్ ద్వీపే స్మృతౌ ద్వౌతు పుణ్యౌ జనపదౌ శుభౌ ||
|| 4 || అపరౌ మానస స్యాథ పర్వతస్యా నుమణ్డలౌ | మహావీతం స్మృతం వర్షం ధాతకీఖణ్డ మేవ చ ||
|| 5 || స్వాదూదకే నోదధినా పుష్కరః పరివారితః | తస్మిన్ ద్వీపే మహావృక్షో న్యగ్రోధో೭ మరపూజితః || || 6 || తస్మి న్నివసతి బ్రహ్మా విశ్వాత్మా విశ్వభావనః | తత్రైవ మునిశార్దూలా శివనారాయణాలయః || || 7 || వస త్యత్ర మహాదేవో హరోర్థం హరి రవ్యయః | సమ్పూజ్యమానో బ్రహ్మాద్యైః కుమారాద్యైశ్చ యోగిభిః || || 18 || అంతే విస్తీర్ణము కలిగి, అన్నివైపుల వ్యాపించి ఆద్వీపము యొక్క సగభాగము మానసోత్తరపర్వతము నాశ్రయించి మండలాకారముగా నున్నది. (3) ఒకపెద్దభాగమే రెండు విభాగములుగా కల్పించబడినది. ఆ ద్వీపమునందు రెండు పుణ్యములైన, మంగళకరములైన జనపదములు పేర్కొనబడినవి. (4) మానసోత్తరపర్వతము ననుసరించిన మండలముగా చెప్పదగినవి ఆరెండు జనపదములు. మహావీతమనుపేరుగల వర్షము, ధాతకీఖండము అనునవి ఆజనపదములపేర్లు (5) పుష్కరద్వీపము శుద్ధోదక సముద్రము చేతచుట్టబడియున్నది. ఆ ద్వీపమునందు దేవతలచేత పూజింపబడు ఒకపెద్ద మఱ్ఱి చెట్టు కలదు. (6) ఆ ద్వీపమునందు విశ్వరూపుడు, విశ్వభావనుడు అయిన బ్రహ్మనివసించును. ఓమునీశ్వరులారా! అక్కడనే శివనారాయణుల నివాసము కలదు. (7) ఇచ్చట సగభాగమున మహాదేవుడగు శివుడు, సగమున నాశరహితుడగు విష్ణువు, బ్రహ్మాదులచే పూజింపబడుచు, కుమారుడు మున్నగు యోగులచేత అర్చింపబడుచు వసింతురు. (8) గన్ధర్వైః కిన్నరై ర్యక్షై రీశ్వరః కృష్ణపిఙ్గళః | స్వస్థా స్తత్ర ప్రజాః సర్వా బ్రాహ్మణాః శతశ స్త్విషః || || 9 || నిరామయా విశోకా శ్చ రాగద్వేషవివర్జితాః | సత్యానృతే న తత్రా స్తా నోత్తమాధమమధ్యమాః || || 10 || న వర్ణాశ్రమధర్మాశ్చ న నద్యో న చ పర్వతాః | పరేణ పుష్కరే ణాథ సమావృత్య స్థితో మహాన్ || || 11 || స్వాదూదక సముద్ర స్తు సమన్తా ద్ద్విజసత్తమాః | పరేణ తస్య మహతీ దృశ్యతే లోకసంస్థితిః || || 12 || కాఞ్చినీ ద్విగుణా భూమిః సర్వత్రైకశిలోపమా | తస్యాః పరేణ శైల స్తు మర్యాదాభానుమణ్డలః || || 13 || ప్రకాశ శ్చా ప్రకాశశ్చ లోకాలోకః స ఉచ్యతే | యోజనానాం సహస్రాణి దశ తస్యో చ్ఛ్రయః స్మృతః || || 14 || కృష్ణపింగళవర్ణముకల ఈశ్వరుడు గంధర్వులచేనత, కిన్నరులచేత, యక్షులచేత పూజింపబడుచుండును. అక్కడ ప్రజలందరు స్వస్థులుగా నుందురు, బ్రాహ్మణులు అధికతేజస్సుకలవారుగా నుందురు. (9) అచట ప్రజలు రోగరహితులుగా, శోకములేని వారుగా, రాగద్వేషములచే విడువబడినవారుగానుందురు. అక్కడ సత్యము, అనృతము అనువిభాగములేదు. ఉత్తమ, మధ్యమ, అధమ భేదము లేదు. (10) అక్కడ వర్ణాశ్రమ ధర్మములు కాని, నదులు పర్వతాలు కాని లేవు. పుష్కరద్వీపమునకు ఆవలి భాగమున ఆవరించి పెద్దదైన శుద్ధోదక సముద్రము అన్నివైపుల ఉన్నది. విప్రవరులారా! దానికి అవతలి భాగమున విశాలమైన లోకముయొక్క వ్యాప్తి ఉన్నది. (11, 12) బంగారుమయమైన రెట్టింపు భూమి, ఒకేశిలతో పోల్చదగినదై అంతట ఉండును. దానికి ఆవలిభాగములో సూర్యమండల ప్రచారమునకు అవధియగు పర్వతముండును. (13) ఒకవైపు వెలుతురు, మరొకవైపు చీకటి కలిగి అది లోకాలోకమని చెప్పబడును. దానియొక్క ఎత్తు పదివలే యోజనముల పరిమాణము కలిగియుండును. (14) తావా నేవ చ విస్తారో లోకాలోకమహాగిరేః | సమావృత్య తు తం శైలం సర్వతో వై సమస్థితమ్ || || 15 || తమ శ్చాణ్డకటాహేన సమన్తా త్పరివేష్టితమ్ | ఏతే సప్త మహాలోకాః పాతాలాః సంప్రకీర్తితాః || || 16 || బ్రహ్మాణ్డాశేషవిస్తారః సంక్షేపేణ మయోదితః | అణ్డానా మీదృశానాం తు కోట్యో జ్ఞేయాః సహస్రశః || || 17 || సర్వగత్వా త్ర్పధానస్య కారణస్యా వ్యయాత్మనః | అణ్డ ష్వేతేషు సర్వేషు భువనాని చతుర్దశ || || 18 || తత్ర తత్ర చతుర్వక్త్రా రుద్రా నారాయణాదయః | దశోత్తర మథైకైక మణ్డావరణసప్తకమ్ || || 19 || సమన్తా త్సంస్థితం విప్రా స్తత్ర యాన్తి మనీషిణః | అనన్త మేవ మవ్యక్త మనాదినిధనం మహత్ || || 20 || లోకాలోకపర్వతముయొక్క విస్తారముకూడ అంతే పరిమానము కలిగి యుండును. ఆపర్వతమును ఆవరించి అంతట నిలిచియుండునది, అన్నివైపుల వ్యాపించినది అగు చీకటి పాత్రమువంటి అండాకారా భాగములో నిండియుండును. ఇవి యేడు పాతాళములనబడుమహాలోకములు చెప్పబడినవి. (15, 16) బ్రహ్మాండము యొక్క సమగ్రమైన విస్తారము సంగ్రహముగా నాచే చెప్పబడినది. ఇటువంటి అండాకారగోళములు వేలకొలది కలవని తెలియదగును. (17) అన్నిటికి సంబంధించియుండుటవలన, కారణభూతుడైన, నాశరహితుడైన భగవంతుడు ప్రధానమైయున్నాడు. ఈ అన్నిఅండములయందు పదునాలుగు లోకములు ముఖ్యములైనవి. (18) అచ్చటచ్చనట నాలుగు ముఖములు కల. నారాయణుడు మొదలగువారు, రుద్రులు కలరు. తరువాత ఒక్కొక్కటి పదిరెట్లపరిమాణము కల ఏడు అండావరణములుండును. (19) బ్రాహ్మణులారా! ఆ అండావరణములు అంతట వ్యాపించియున్నవి. బుద్ధిమంతులైన సజ్జనులు అచ్చటికి వెళ్లుదురు. అది అంతములేనిది, వ్యక్తముకానిది, జననమరణములులేనిది, గొప్పది, (20) అతీత్య వర్తతే సర్వం జగత్ ప్రకృతి రక్షరమ్ | అనన్తత్వ మనన్తస్య యతః సంఖ్యా న విద్యతే || || 21 || తద వ్యక్త మిదం జ్ఞేయం తద్ బ్రహ్మ పరమం ధ్రువమ్ | అనన్త ఏష సర్వత్ర సర్వస్థానేషు పఠ్యతే || || 22 || తస్య పూర్వం మయా ప్యుక్తం యత్త న్మాహాత్మ్య ముత్తమమ్ | గతః స ఏష సర్వత్ర సర్వస్థానేషు పూజ్యతే || || 23 || భూమౌ రసాతలే చైవ ఆకాశే పవనే೭నలే | ఆణవేషు చ సర్వేషు దివి చైవ న సంశయః || || 24 || తథా తమసి సత్త్వే వా ప్యేష ఏవ మహాద్యుతిః | అనేకధా విభక్తాఙ్గః క్రీడతే పురుషోత్తమః || || 25 || మహేశ్వరః పరో೭వ్యక్తా దణ్డమ వ్యక్తసమ్భవమ్ | అణ్డా ద్ర్బహ్మా సముత్పన్న స్తేన సృష్ట మిదం జగత్ || || 26 || ''ఇతి శ్రీకూర్మపురాణభువనకోశవర్ణనంనామపఞ్చా೭శోధ్యాయః అక్షరరూపమైన ప్రకృతి సమస్త ప్రపంచమునతిక్రమించి వర్తించును. అనంతునియొక్క అనంతత్వము, ఏ కారణమువలన దానికి సంఖ్య ఉండదో, ఆ అవ్యక్త రూపమిదియని తెలియదగును. అది శ్రేష్ఠమైన, నిశ్చలమైన బ్రహ్మము. ఈతడు అనంతుడుగా అంతట అన్నిస్థలముల యందు కీర్తింపబడుచున్నాడు. (21, 22) అతనియొక్క శ్రేష్ఠమైన మాహాత్మ్యము పూర్వము నాచేత ఏదిచెప్పబడినదో, దానిని వహించిన యితడు అన్ని స్థానములయందు పూజింప బడుచున్నాడు. (23) భూమిపైన, పాతాళమునందు, ఆకాశమునందు, వాయువునందు అగ్నియందు, అణుసంబంధులైన అన్నిటియందు స్వర్గమునందుకూడ, అట్లే తమోగుణమునందు, సత్త్వగుణమునందుకాని గొప్ప ప్రకాశము కలిగిన ఇతడే పురుషోత్తముడై అనేక విధముల విభజింపబడిన శరీరము కలవాడుగా విహరించుచున్నాడు. (24, 25) శ్రేష్ఠుడైన మహేశ్వరుడు అవ్యక్తమునకంటె అతీతుడు. అవ్యక్తము నుండి బ్రహ్మాండము జనించినది. దానినుండి బ్రహ్మ ఉద్భవించెను. అతనిచేత ఈజగము సృజింపబడినది. (26) శ్రీ కూర్మపురాణములో భువనకోశవర్ణనమను ఏబదియవ అధ్యాయము సమాప్తము.