Sri Koorma Mahapuranam    Chapters   

అథఏకపఞ్చాశోధ్యాయః

అధ మన్వన్తరకీర్తనే విష్ణుమాహాత్త్యమ్‌

ఋషయ ఊచుః -

అతీతానాగతా నీహ యాని మన్వన్తరాణి వై | తాని త్వం కధయాస్మభ్యం వ్యాసఞ్చ ద్వాపరే యుగే || || 1 ||

వేదశాఖాప్రణయినో దేవదేవస్య ధీమతః | ధర్మార్థానాం ప్రవక్తారో హీశానస్య కలౌ యుగే || || 2 ||

కియన్తో దేవదేవస్య శిష్యాః కలియుగే పి వై | ఏత త్సర్వం సమాసేన సూత ! వక్తు మిమార్హసి || || 3 ||

సూత ఉవాచ :-

మనుః స్వాయమ్భువః పూర్వం తతః స్వారోచిషో మతః | ఉత్తమ స్తామస శ్చైవ రైవత శ్చాక్షుష స్తథా || || 4 ||

ఏబది ఒకటవ అధ్యాయము

ఋషులిట్లుపలికిరి :-

గడచినవి, రానున్నవి అగుయేమన్వంతరములు కలవో వానిని, ద్వాపరయుగములో వ్యాసునిగూర్చికూడ నీవు మాకుతెలుపుము. (1)

వేదశాఖలయందు అనురాగము కలవారు, ధర్మార్థములను గూర్చిప్రవచించువారు, దేవదేవుడు, బుద్ధిమంతుడు అగు వ్యాసభగవానునకీ కలియుగములో ఎందరు శిష్యులుకలరు? ఓ సూతుడా! ఈ విషయములన్నింటిని సంగ్రహముగా చెప్పుటకు తగుదువు. (2, 3)

సూతు డిట్లుపలికెను :-

మొదట స్వాయంభువమనువు, తరువాత స్వారోచిషుడు, అనంతరము ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు అనువారు క్రమముగా మనువులుగా అవతరించిరి. (4)

షడేతే మనవోతీతా సాంప్రతం తు రవేః సుతః | వైవస్వతోయం సపై#్తత త్సప్తమం వర్తతే పరమ్‌ || || 5 ||

స్వాయమ్భువం తు కథితం కల్పాదా వన్తరం మయా | అత ఊర్ధ్వం నిబోధధ్వం మనోః స్వారోచిషస్య తు || || 6 ||

పారావతా శ్చ తుషితా దేవాః స్వారోచిషేన్తరే | విపశ్చి న్నామ దేవేన్ద్రో బభూవా సురమర్దనః || || 7 ||

ఊర్జః స్తమ్భ స్తథా ప్రాణో దాన్తోథ ఋషభ స్తథా | తిమిర శ్చార్వరీవాంశ్చ సప్త సప్తర్షయోభవన్‌ || || 8 ||

చైత్రకిమ్పురుషాద్యాస్తు సుతాః స్వారోచిషస్య తు | ద్వితీయ మేత దాఖ్యాత మన్తరం శృణు చోత్తమమ్‌ || || 9 ||

తృతీయే ప్యన్తరే చైవ ఉత్తమో నామవై మనుః | సుశాన్తి స్తత్ర దేవేన్ద్రో బభూవా మిత్రకర్షణః || || 10 ||

ఈ యారుగురు మనువులు గతించినారు. ప్రస్తుతము సూర్యునికుమారుడగు వైవస్వతుడు మనువుగా ఉన్నాడు. ఇది యేడవ మన్వంతర కాలము జరుగుచున్నది. (5)

కల్పముయొక్క ఆదియందున్న స్వాయంభువ మన్వంతరమును గూర్చినాచేతచెప్పబడినది. దానితరువాత స్వారోచిష మనువుయొక్క వృత్తాంతమును చెప్పుదును తెలిసికొనుడు. (6)

స్వారోచిషమన్వంతరములో దేవతలు పారావతులు, తుషితులు అనువారుండిరి. రాక్షసులను మర్దించిన విపశ్చిత్‌ అనువాడు దేవతల కింద్రుడుగా నుండెను. (7)

ఊర్జుడు స్తంభుడు, ప్రాణుడు, దాంతుడు, ఋషభుడు, తిమిరుడు, అర్వరీవంతుడు అను ఏడుగురు సప్తర్షులుగా నుండిరి. (8)

స్వారోచిషమనువుకు చైత్రకింపురుషాదులు పుత్రులుగా జనించిరి. రెండవ అన్వంతర వృత్తమిది తెలుపబడినది. ఇక ఉత్తముని గూర్చి వినుము. (9)

మూడవ అంతరములో ఉత్తముడనువాడు మనువుగా నుండెను. శత్రువులను నిగ్రహించిన సుశాంతి అనువాడు ఆమన్వంతరములో దేవేంద్రుడుగా ఉండెను. (10)

సుధా మాన స్తధా సత్యః శివ శ్చాథ ప్రతర్దనః | వశవర్తినః పఞ్చైతే గణా ద్వాదశకాః స్మృతాః || || 11 ||

రజోగాత్రోర్ధ్వబాహుశ్చ సవన శ్చానఘ స్తథా | సుతపాః శక్ర ఇత్యేతే సప్త సప్తర్షయోభవన్‌ || || 12 ||

తామస స్యాన్తరే దేవాః సురాయాసహరా స్తథా | సత్యాశ్చ సుధియ శ్చైవ సప్తవింశతికా గణాః || || 13 ||

శిబి రిన్ద్ర స్తథైవాసీ చ్ఛతయజ్ఞోపలక్షణః | బభూవ శఙ్కరే భక్తో మహాదేవార్చనే రతః || || 14 ||

జ్యోతి ర్ధామ పృథక్కల్ప శ్చైత్రోగ్నివసన స్తథా | పీవర స్త్వృషయో హ్యేతే సప్త తత్రాపి చాన్తరే || || 15 ||

పఞ్చమే చాపి విప్రేన్ద్రా రైవతో నామ నామతః | మను ర్విభుశ్చ తత్రేన్ద్రో బభూవా సుమర్దనః || || 16 ||

సుధ, మానము, సత్యము, శివము మరియు ప్రతర్దనము అను అయిదు వశవర్తులైన గణములు ద్వాదశములని పేర్కొనబడినవి. (11)

రజస్సు, గాత్రుడు, ఊర్ధ్వబాహువు, సవనుడు, అనఘుడు, సుతపుడు, శక్రుడు అనువారు సప్తర్షులుగా నుండిరి. (12)

తామసమన్వంతరములో దేవతలందరు దేవతల కష్టములను తొలగించువారుగా నుండిరి. సత్యశీలురు, మంచి బుద్ధి కలవారు ఇరువది యేడు గణములుగా నుండిరి. (13)

నూరు యజ్ఞములు గుర్తుగా కల శిబి అనువాడు ఇంద్రుడుగా నుండెను. అతడు శంకరుని యందు భక్తి కలవాడు, మహాదేవుని పూజించుట యందు శ్రద్ధ కలవాడుగా నుండెను. (14)

జ్యోతిస్సు, ధాముడు, పృథక్కు, కల్పుడు, చైత్రుడు, అగ్ని వసనుడు, పీవరుడు అనువారు ఆ మన్వంతరములో ఋషులుగా నుండిరి. (15)

అయిదవ మన్వంతరములో రైవతుడనువాడు మనువుగా నుండెను. దానిలో రాక్షస నాశకుడైన విభుడను వాడు దేవేంద్రుడయ్యెను. (16)

అమితా భూతయ స్తత్ర వైకుణ్ఠాశ్చ సురోత్తమాః | ఏతే దేవగణా స్తత్ర చతుర్దశ చతుర్దశ || || 17 ||

హిరణ్యరోమా వేదశ్రీ రూర్ధ్వబాహు స్త థైవ చ | వేదబాహుః సు బాహుశ్చ సపర్జన్యో మహామునిః || || 18 ||

ఏతే సప్తర్షయో విప్రా స్తత్రా స న్రైవతేన్తరే | స్వారోచిష శ్చోత్తమశ్చ తామసో రైవత స్తథా || || 19 ||

ప్రియవ్రతాన్వితా హ్యేతే చత్వారో మనవః స్మృతాః | షష్ఠే మన్వన్తరే చాపి చాక్షుష స్తు మను ర్ద్విజాః || || 20 ||

మనోజవ స్తథైవేన్ద్రో దేవాం శ్చైవ నిబోధత | ఆద్యాః ప్రభూతభవ్యాశ్చ ప్రథనాశ్చ దివౌకసః || || 21 ||

మహానుభావా లేఖ్యాశ్చ పఞ్చ దేవగణాః స్మృతాః | విరజా శ్చ హవిష్యాం శ్చ సోమో మనుసమః స్మృతః || || 22 ||

అక్కడ అమితములైన ఐశ్వర్యములు వైకుంఠ నాములైన దేవతా శ్రేష్ఠులు ఉందురు. ఈ దేవగణములక్కడ పదునాల్గు, పదునాల్గు చొప్పున వసింతురు. (17)

హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ధ్వబాహువు, వేదబాహువు, సుబాహువు, పర్జన్యుడు, మహాముని అను ఈ ఏడుగురు సప్తర్షులుగా ఆరైవత మన్వంతరములో వ్యవహరింపబడిరి. స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు అను నీ నలుగురు ప్రియవ్రతునకు సంబంధించిన మనువులుగా పేర్కొనబడినవారు ఆరవ మన్వంతరములో చాక్షుషుడనువాడు మనువుగా ఉండెను. ఓ బ్రాహ్మణులారా! వినుడు. (18, 19, 20)

అట్లే ఆ కాలములో మనోజవుడు ఇంద్రుడుగా నుండెను. అప్పటి దేవతలను గూర్చి వినుడు. ప్రభూత భవ్యులు, ప్రధనులు, దివౌకసులు, మహానుభావులు, లేఖ్యులు అని అయిదు దేవగణములుండెను. విరజసుడు, హవిష్మంతుడు, సోముడు మనుసముడు, స్మృతుడు. (21, 22)

అవినామా స విష్ణుశ్చ సప్తాస న్నృషయః శుభాః | వివస్వతః సుతో విప్రాః శ్రాద్ధదేవో మహాద్యుతిః || || 23 ||

మనుః సంవర్తనో విప్రాః సాంప్రతం సప్తమేన్తరే | ఆదిత్యా వసవో రుద్రా దేవా స్తత్ర మరుద్గణాః || || 24 ||

పురన్దర స్తథైవేన్ద్రో బభూవ పరవీరహా | వసిష్ఠః కశ్యప శ్చాత్రి ర్జమదగ్నిశ్చ గౌతమః || || 25 ||

విశ్వామిత్రో భరద్వాజః సప్త సప్తర్షయోభవన్‌ | విష్ణుశక్తి రనౌపమ్యా సత్త్వోద్రిక్తా స్థితా స్థితౌ || || 26 ||

తదంశభూతా రాజానః సర్వే చ త్రిదివౌకసః | స్వాయమ్భవేన్తరే పూర్వం ప్రకృత్యాం మానసః సుతః || || 27 ||

అవినాముడు, విష్ణువు అను ఏడుగురు అప్పుడు ఋషులుగా నుండిరి. సూర్యుని యొక్క కుమారుడు, గొప్పతేజస్సుకలవాడగు శ్రాద్ధదేవుడు అగుసంవర్తనుడు ప్రస్తుతము ఏడవమన్వంతరములో మనువుగా ఉన్నాడు. ఆ మన్వంతరములో ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుద్గణములు దేవతలుగా నున్నారు. (23, 24)

శత్రువీరులను వధించు పురందరుడు ఇంద్రుడుగా నుండెను. వసిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, జమదగ్ని, గౌతముడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు అను ఏడుగురు ఈమన్వంతరములో సప్తర్షులుగా ఉన్నారు. సాటిలేని విష్ణువుయొక్క శక్తి సత్త్వగుణముచే పెంపొందించబడినదై స్థితి కార్యమునందు నిమగ్నమైనది. (25, 26)

స్వర్గలోక నివాసులగు దేవతలందరు, భూమిమీది రాజులు కూడ ఆవిష్ణువు అంశము కలవారు. పూర్వకాలములో స్వాయంభువ మన్వంతరములో ప్రకృతి యందు సంకల్పమువలన జన్మించిన కుమారుడు (27)

రుచేః ప్రజాపతే ర్జజ్ఞే తదంశే నా భవ ద్ద్విజాః | తతః పున రసౌ దేవః ప్రాప్తే స్వారోచిషేన్తరే || || 28 ||

తుషితాయాం సముత్పన్న స్తుషితైః సహ దైవతైః | ఉత్తమే త్వన్తరే విష్ణుః సత్యైః సహ సురోత్తమః || || 29 ||

సత్యాయా మభవ త్సత్యః సత్యరూపో జనార్దనః | తామస స్యాన్తరే చైవ సంప్రాప్తే పున రేవహి || || 30 ||

హర్యాయం హరిభి ర్దేవై ర్హరి రేవా భవ ద్థరిః | రైవతేప్యన్తరే చైవ సంకల్పా న్మానసో హరిః || || 31 ||

సమ్భూతో మానసైః సార్థం దేవైః సహ మహాద్యుతిః | చాక్షుషేప్యన్తరే చైవ వైకుణ్ఠః పురుషోత్తమః || || 32 ||

వికుణ్ఠాయా మసౌ జజ్ఞే వైకుణ్ఠౖ ర్దైవతైః సహ | మన్వన్తరే చ సంప్రాప్తే తథా వైవస్వతేన్తరే || || 33 ||

ప్రజాపతివలన రుచియందు అతని అంశతో జన్మించెను. తరువాత స్వారోచిష మన్వంతరము సంభవించగా మరల ఈదేవుడు తుషితయందు సంతోషించిన దేవతలతోకూడ ఉద్భవించెను. ఉత్తమ మన్వంతరములో దేవతా శ్రేష్ఠుడగు విష్ణువు సత్యులతోకూడ, (28, 29) సత్యరూపుడుగా సత్యయందు జన్మించెను. మరల తామసుని మన్వంతరము సంప్రాప్తముకాగా విష్ణువు హరులనబడుదేవతలతోకూడ హర్యయను స్త్రీయందు హరిగా జన్మించెను. దైవతమన్వంతరములో సంకల్పబలమువలన మానసుడగుహరి, (30, 31) మానసులైన దేవతలతో కూడ గొప్పతేజస్సు కలవాడుగా జన్మించెను. చాక్షుషమన్వంతరములో కూడ పురుషోత్తముడైన విష్ణువు, వైకుంఠులనబడుదేవతలతో గూడ వికుంఠయందు జన్మించెను. తరువాత వైవస్వతమన్వంతరము సంప్రాప్తముకాగా; (32, 33)

వామనః కశ్యపా ద్విష్ణు రదిత్యాం సమ్భూవ హ | త్రిభిః క్రమై రిమా న్లోకా ఞ్జిత్వా యేన మహాత్మనా || || 34 ||

పురన్దరాయ తైలోక్యం దత్తం నిహతకణ్టకమ్‌ | ఇత్యేతా స్తనవ స్తస్య సప్త మన్వన్తరేషు వై || || 35 ||

సప్త చైవా భవ న్విప్రా యాభిః సఙ్కర్షితాః ప్రజాః | యస్మా ద్విశ్వమిదం కృత్స్నం వామనేన మహాత్మనా || || 36 ||

తస్మా త్సర్వైః స్మృతో నూనం దేవైః సర్వేషు దైత్యహా | ఏష సర్వం సృజ త్యాదౌ పాతి హన్తి చ కేశవః || || 37 ||

భతాన్తరాత్మా భగవా న్నారాయణ ఇతి శ్రుతిః | ఏకాంశేన జగ త్సర్వం వ్యాప్య నారాయణః స్థితః || || 38 ||

కశ్యపప్రజాపతివలన అదితియందు విష్ణువు వానుడుగా జన్మించెను. ఏ మహాత్మునిచేత మూడడుగుల కొలతతో మూడు లోకములను జయించి, కంటకముల వంటి శత్రువులు లేకుండా ఇంద్రునికి అందజేయబడినదో, ఆ విష్ణువుయొక్క ఏడు మన్వంతరాలలో ధరింపబడిన శరీరములు ఈ విధముగా తెలుపబడినవి. (34, 35)

ఏడు మన్వంతరములలో ఏడు రూపములు ధరింపబడినవి. ఆ అవతారములతో ప్రళయకాలములో ప్రజలు సంహరింపబడిననారు. మహాత్ముడైన వామనునిచేత ఏకారణమువలన ఈ విశ్వము రక్షింపబడినదో, అందువలన దేవతలచేత అందరిలో విష్ణువు రాక్షస సంహారకుడని ప్రసిద్ధుడైనాడు. ఈ విష్ణువు మొదట సమస్తమును సృజించును, తరువాత రక్షించును, చివరకు నశింపజేయును. (36, 37)

భగవంతుడగు నారాయణుడు సమస్త ప్రాణులకు అంతరాత్మయగు వాడని వేదము తెలుపుచున్నది. తనయొక్క ఒక్క అంశముతో లోకమునంతయు వ్యాపించి నారాయణుడు ఉన్నాడు. (38)

చతుర్థా సంస్థితో వ్యాపీ సగుణో నిర్గుణోపిచ | ఏకా భగవతో మూర్తి ర్జా నరూపా శివామలా || || 39 ||

వాసుదేవాభిధానా సా గుణాతీతా సునిష్కలా | ద్వితీయా కాలసంజ్ఞాన్యా తామసీ శివసంజ్ఞితా || || 40 ||

నిహన్త్రీ సకల స్యాన్తే వైష్ణవీ పరమా తనుః | సత్త్వోద్రిక్తా తృతీయాన్యా ప్రద్యుమ్నేతి చ సంజ్ఞితా || || 41 ||

జగత్సం స్థాపయే ద్విశ్వం సా విష్ణోః ప్రకృతి ర్ద్రువా | చతుర్థీ వాసుదేవస్య మూర్తి ర్బ్రహ్మేతి సంజ్ఞితా || || 42 ||

రాజసీ సా నిరుద్ధస్య పురుషసృష్టికారితా | యః స్వపి త్యఖిలం హత్వా ప్రద్యుమ్నేన సహ ప్రభుః || || 43 ||

నారాయణాఖ్యో బ్రహ్మాసౌ ప్రజాసర్గం కరోతి సః | యాసౌ నారాయణతనుః ప్రద్యుమ్నాఖ్యా శుభా స్మతా || || 44 ||

వ్యాపకుడైన ఆ విష్ణువు గుణసహితుడుగా, నిర్గుణుడుగా కూడ నాలుగు విధముల నెలకొనిఉన్నాడు. భగవంతుని ఒకమూర్తి జ్ఞాప రూపము, మంగళకరము, నిర్మలమైనది. (39)

ఆ మూర్తి వాసుదేవ నామము కలది, గుణముల కతీతమైనది; మిక్కిలి భేదరహితముకూడ. రెండవమూర్తికాల సంజ్ఞ కలది, తమోగుణ సంబంధిని, శివ నామాంకితము. (40)

అది అంతమున ప్రళయకాలములో సమస్తమును నశింపజేయు విష్ణువుయొక్క శ్రేష్ఠమైన శరీరము. సత్త్వగుణము ప్రధానముగా కల మూడవ మూర్తి ప్రద్యుమ్ననామకమైనది మరియొకటి కలదు. (41)

ఆ మూర్తి నిశ్చలమైన విష్ణువుయొక్క ప్రకృతిరూపము. అది ప్రపంచమును రక్షణ ద్వారా ప్రతిష్ఠాపించుచుండును. వాసుదేవుని నాలుగవమూర్తి బ్రహ్మ అను సంజ్ఞకలిగి యుండును. (42) రజోగుణ ప్రధానమైన ఆమూర్తి అనిరుద్ధునిది. పురుషుల సృష్టి కర్మ నెరవేర్చును. సమస్తములను లయింపజేసి ప్రభువు నిద్రించును. అతడే నారాయణనాముడగు బ్రహ్మ ప్రజలను సృజించును ఈ నారాయణుని రూపము ప్రద్యుమ్ననామకము, శుభకరము. (43, 44)

తయా సమ్మోహయే ద్విశ్వం సదేవాసురమానుషమ్‌ | తతః సైవ జగన్మూర్తిః ప్రకృతిః పరికీర్తితా || || 45 ||

వాసుదేవో హ్యనన్తాత్మా కేవలో నిర్గుణో హరిః | ప్రధానం పురుషం కాలః సత్త్వత్రయ మనుత్తమమ్‌ || || 46 ||

వాసుదేవాత్మకం నిత్య మేత ద్విజ్ఞాయ ముచ్యతే | ఏకం చేదం చతుష్పాదం చతుర్థా పున రచ్యుతః || || 47 ||

బిభేద వాసుదేవోసౌ ప్రద్యుమ్నో భగవా న్హరిః | కృష్ణద్వైపాయనో వ్యాసో విష్ణు ర్నారాయణః స్వయమ్‌ || || 48 ||

అవాతర త్స సమ్పూర్ణం స్వేచ్ఛయా భగవా న్హరిః | అనాద్యన్తం పరం బ్రహ్మ న దేవా ఋషయో విదుః || || 49 ||

నారాయణుడు ఆమూర్తితో దేవతలు, అసురులు, మనుష్యులతో కూడిన విశ్వమును సంమోహపరుచును. అందువలన ఆరూపమే విష్ణువుయొక్క ప్రకృతి రూపమని చెప్పబడినది. (45)

అనంతమైన ఆత్మలు కల వాసుదేవుడు, కేవలుడు, గుణరహితుడగు హరియైయున్నాడు. ప్రధానతత్త్వము, పురుషుడు, కాలము అను మూడు శ్రేష్ఠమైన సత్త్వత్రయమనబడును. (46)

అది వాసుదేవస్వరూపము, నిత్యము కూడ. దీనిని తెలిసికొని ముక్తినిపొందును. ఈ తత్త్వము ఒక్కటైనను నాలుగు పాదములు కలది. అచ్యుతుడగు హరి మరల నాలుగు విధములుగా భిన్నరూపుడై ప్రద్యుమ్నభగవానుడు అవతారములను ధరించినాడు. కృష్ణద్వైపాయనుడగు వ్యాసుడు స్వయముగా నారాయణ విష్ణు స్వరూపుడే (48)

భగవంతుడగు హరి తన ఇచ్ఛతో సంపూర్ణముగా అవతరించెను. ఆది, అంతములేని పరబ్రహ్మతత్త్వమైన నారాయణుని, దేవతలు, ఋషులు కూడ తెలియలేరు. (49)

ఏకోయం వేద భగవాన్‌ వ్యాసో నారాయణః ప్రభుః | ఇత్యేత ద్విష్ణు మాహాత్మ్యం కథితం ముని సత్తమాః |

ఏత త్సత్యం పునః సత్య మేవం జ్ఞాత్వాన ముహ్యతి || || 50 ||

ఇతి శ్రీ కూర్మపురాణ మన్వన్తర కీర్తనే విష్ణు మాహాత్మ్యం నామైక పఞ్చాశోధ్యాయః

భగవంతుడగు నారాయణస్వరూపుడు వ్యాసమహర్షి ఒక్కడే దానిని తెలిసినవాడు. ఓ మునిశ్రేష్ఠులారా! ఈ విధముగా విష్ణువుయొక్క మాహత్మ్యము నాచేత చెప్పబడింది. ఇది సత్యము మరల మరల సత్యము దీనిని తెలిసికొని మోహమును పొందడు. (50)

శ్రీ కూర్మపురాణములో మన్వంతరకీర్తనములో విష్ణుమాహాత్మ్యమను ఏబదియొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters