Sri Koorma Mahapuranam
Chapters
ద్విపఞ్చాశో೭ధ్యాయః అథ వేదశాఖా ప్రణయనమ్ సూత ఉవాచ :- అస్మి న్మన్వన్తరే పూర్వం వర్తమానే మహాప్రభుః | ద్వాపరే ప్రథమే వ్యాసో మనుః స్వాయమ్భుతో మతః ||
|| 1 || బిభేద బహుధా వేదం నియోగా ద్ర్బహ్మణః ప్రభోః | ద్వితీయే ద్వాపరే చైవ వేదవ్యాసః ప్రజాపతిః ||
|| 2 || తృతీయే చోశనా వ్యాస శ్చతుర్థే స్యా ద్బృహస్పతిః | సవితా పఞ్చమే వ్యాసః షష్ఠే మృత్యుః ప్రకీర్తితః ||
|| 3 || సప్తమే చ తథై వేన్ద్రో వసిష్ఠ శ్చాష్టమే మతః | సారస్వత శ్చ నవమే త్రిధామా దశ##మే మతః ||
|| 4 || ఏకాదశే తు ఋషభః సుతేజా ద్వాదశే స్మృతః | త్రాయోదశే తథా ధర్మః సుచక్షు స్తు చతుర్దశే ||
|| 5 || ఏబది రెండవ అధ్యాయము పూర్వము ఈ మన్వంతరము జరుగుచుండగా, మొదటి ద్వాపరయుగములో, గొప్ప ప్రభువైన వ్యాసుడుగా స్వాయంభువ మనువు పేర్కొనబడినాడు. (1) ఆయన ప్రభువైన బ్రహ్మయొక్క ఆదేశమువలన వేదమును అనేక విధములుగా విభజించెను. రెండవ ద్వాపర యుగములో వేదవ్యాసుడుగా ప్రజాపతియుండెను. (2) మూడవ ద్వాపరములో శుక్రాచార్యుడు వ్యాసుడుకాగా, నాలుగవద్వాపరములో బృహస్పతి వ్యాసుడాయెను. ఐదవ ద్వాపరములో సవితయనువాడు, ఆరవదానిలో మృత్యువు వ్యాసుడుగా నుండిరి. (3) ఏడవ ద్వాపరములో ఇంద్రుడు, ఎనిమిదవ ద్వాపరములో వసిష్ఠుడు, తొమ్మిదవ, పదియవ ద్వాపరములలో క్రమముగా సారస్వతుడు, త్రిధామ అనువారు వ్యాసులుగా నుండిరి. (4) పదునొకండవ ద్వాపరములో ఋషభుడు, ద్వాదశములో సుతేజుడు, పదుమూడవ ద్వాపరములో ధర్ముడు, పదునాలుగవ దానిలో సుచక్షువు వ్యాసులుగా నుండిరి. (5) త్రయ్యారుణిః పఞ్చదశే షోడశే తు ధనఞ్జయః | కృతఞ్జయః సప్తదశే హ్యష్టాదశే ఋతఞ్జయః || || 6 || తతో వ్యాసో భరద్వాజ స్తస్మా దూర్థ్వం తు గౌతమః | వాచశ్రవా శ్చైకవింశే తస్మా న్నారాయణః పరః || || 7 || తృణబిన్దు స్త్రయోవింశే వాల్మీకి స్తత్పరః స్మృతః | పఞ్చవింశే తథా ప్రాప్తే యస్మి న్వై ద్వాపరే ద్విజాః || || 8 || పరాశరసుతో వ్యాసః కృష్ణద్వైపాయనో೭భవత్ | స ఏవ సర్వవేదానాం పురాణానాం ప్రదర్శకః || || 9 || పారాశర్యో మహాయోగీ కృష్ణద్వైపాయనో హరిః | ఆరాధ్య దేవ మీశానం దృష్ట్వా స్తుత్వా త్రిలోచనమ్ || || 10 || తత్ర్పసాదా దసౌ వ్యాసం వేదానా మకరో త్ప్రభుః | అథ శిష్యా న్సజగ్రాహ చతురో వేదపారగాన్ || || 11 || పదునైదవ ద్వాపరములో త్రయ్యారుణి, పదునారవ యుగములో ధనంజయుడు, పదునేడవ ద్వాపరములో కృతంజయుడు, పదెనెన్మిదవ దానిలో ఋతంజయుడు వ్యాసులుగా నుండిరి. (6) తరువాత భరద్వాజుడు వ్యాసుడాయెను. అతని తరువాత గౌతముడు, అనంతరము వాచశ్రవుడు, ఆ పిమ్మట నారాయణుడు వ్యాసుడుగా నుండిరి. (7) ఇరువది మూడవ ద్వాపరములో తృణబిందువు, అతనియనంతరము వాల్మీకి, ఇరువది యైదవ ద్వాపర యుగమురాగా, విప్రులారా! ఏ యుగమునందు పరాశరుని కుమారుడైన కృష్ణద్వైపాయనుడు వ్యాసుడయ్యెనో, అతడే అన్ని వేదములను, పురాణములను లోకమునకు ప్రదర్శించిన వాడు. (8, 9) పరాశరపుత్రుడు, గొప్పయోగి, కృష్ణద్వైపాయనుడు, నారాయణరూపుడగు వ్యాసుడు, ఈశ్వరుని పూజించి, శంకరునిచూచి, స్తోత్రముచేసి, ఆదేవుని యనుగ్రహమువలన వేదములను విపులముగా విభజించెను. తరువాత వేదములను పూర్ణముగా అధ్యయనము చేసిన నలుగురు శిష్యులను స్వీకరించెను. (10, 11) జైమిని ఞ్చ సుమన్తు ఞ్చ వైశమ్పాయన మేవ చ | పైలం తేషాం చతుర్థం చ పఞ్చమం మాం మహామునిః || || 12 || ఋగ్వేదపాఠకం పైలం జగ్రాహ స మహామునిః | యజుర్వేదప్రవక్తారం వైశమ్పాయన మేవ చ || || 13 || జైమినిం సామవేదస్య పాఠకం సో೭న్వపద్యత | తథైవా ధర్వవేదస్య సుమన్తు మృషిసత్తమమ్ || || 14 || ఇతిహాసపురాణాని ప్రవక్తుం మా మయోజయత్ | ఏక ఆసీ ద్యజుర్వేద స్తం చతుర్థా ప్రకల్పయత్ || || 15 || చతుర్హోత్ర మభూ త్త స్మిం స్తేన యజ్ఞ మథా కరోత్ | ఆధ్వర్యవం యజుర్భిః స్యా దగ్నిహోత్రం ద్విజోత్తమాః || || 16 || జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు, పైలుడు అను నలుగురిని, అయిదవవానిగానన్ను వ్యాసుడు తన శిష్యులుగా స్వీకరించెను. (12) ఋగ్వేదమును పఠించువాడుగా పైలుని స్వీకరించినాడామహాముని. వైశంపాయనుని యజుర్వేదమును ప్రచారము చేయుటకు నియమించినాడు. (13) జైమినిని సామవేద పాఠకునిగా వ్యాసుడు స్వీకరించెను ఋషి శ్రేష్ఠుడైన సుమంతుని అధర్వవేద పాఠకుడుగా గ్రహించినాడు. (14) ఇతిహాసములను, పురాణములను ప్రవచనము చేయుటకు ఆ ముని నన్ను నియమించెను. ఒకటిగానున్న యజుర్వేదమును నాలుగు విధములుగా ఆయన విభజించెను. (15) దానియందు నాలుగు అగ్నిహోత్రముల సమూహమేర్పడెను. దానితో తరువాత యజ్ఞమును చేసెను. యజుర్వేద మంత్రములతో ఆధ్వర్యవమను అగ్నిహోత్రము సంభవించును. (16) ఔద్గాత్రం సామభి శ్చక్రే బ్రహ్మత్వం చాప్య ధర్వభిః | తతః సత్రే చ ఉద్ధృత్య కృతవాన్ ప్రభుః || || 17 || యజూంషి తు యజుర్వేదం సామవేదం తు సామభిః | ఏకవింశతిభేదేన ఋగ్వేదం కృతవా న్పురా || || 18 || శాఖానా న్తు శ##తే నైవ యజుర్వేద మథా కరోత్ | సామవేదం సహస్రేణ శాఖానాం ప్రబిభేద సః || || 19 || అధర్వాణ మథో వేదం బిభేద కుశ##కేతనః | భేదై రష్టాదశై ర్వ్యాసః ర్వ్యాసః పురాణం కృతవాన్ ప్రభుః || || 20 || సో೭య మేక శ్చతుష్పాదో వేదః పూర్వం పురాతనః | ఓఙ్కారో బ్రహ్మణో జాతః సర్వదోషవిశోధనః || || 21 || వేదవిద్యో೭థ భగవా న్వాసుదేవః సనాతనః | స గీయతే పరో వేదై ర్యో వేదైనం స వేద విత్ || || 22 || సామవేద మంత్రములతో ఔద్గాత్రమును కల్పించెను అధర్వవేద మంత్రములతో బ్రహ్మత్వమును ఏర్పరచెను. (17) తరువాత సత్రమునందు ఉద్ధరించి ఋగ్వేదమును ప్రభువు నిర్మించెను. యజుర్మంత్రములతో యజుర్వేదమును, సామ మంత్రములతో సామవేదమును ఏర్పరచెను. పూర్వము ఋగ్వేదమును ఇరువదియొక్క భేదములతో వ్యవస్థీకరించెను. (18, 19) నూరు శాఖల భేదముతో పిదప యజుర్వేదమును నిర్మించెను. ఆ వ్యాసుడు వేయిశాఖల భేదముతో సామవేదమును కల్పించెను. (20) అనంతరము కుశ##కేతనుడగు ఆముని అధర్వణ వేదమును విభజించెను. వ్యాసుడు పదునెనిమిది భేదములతో పురాణ వాఙ్మయమును సృష్టించెను. (20) పూర్వము ప్రాచీనమైన వేదము ఒక్కటి నాలుగు పాదములు కలిగియుండెను. అన్ని దోషములను శుద్ధి చేయునట్టి ఓంకారము బ్రహ్మ నుండి పుట్టినది. (21) భగవంతుడు, సనాతనుడు అగు వాసుదేవుడు వేదములచే తెలియబడువాడు. ఆ పరమపురుషుడు వేదములచేత గానము చేయుబడును. అతనినెవడు తెలియనో వాడు వేదవిదుడనబడును. (22) ఏత త్పరతరం బ్రహ్మ జ్యోతి రానన్ద ముత్తమమ్ | వేదవాక్యోదితం తత్త్వం వాసుదేవః పరమ్పదమ్ || || 23 || వేదవి ద్య ఇమం వేత్తి వేదం వేదపరో మునిః | అవేదం పరమం వేత్తి వేదనిఃశ్వాసకృ త్పరః || || 24 || స వేదవేద్యో భగవాన్ వేదమూర్తి ర్మహేశ్వరః | స ఏవ వేద్యో వేదశ్చ త మేవాశ్రిత్య ముచ్యతే || || 25 || ఇత్యేత దక్షరం వేద మోఙ్కారం వేద మవ్యయమ్ | అవేదం చ విజానాతి పారాశర్యో మహామునిః || || 26 || ఇతి శ్రీ కూర్మపురాణ వేదశాఖా ప్రణయనం నామ ద్విపఞ్చాశో೭ధ్యాయః ఇది మిక్కిలి పరమైన బ్రహ్మము. ఉత్తమమైన ఆనందరూపమైన జ్యోతి. వేదవాక్యములచేత చెప్పబడిన తత్త్వము వాసుదేవుడు. అతడే పరమగమ్యుడు. (23) ఎవడు ఇతనిని తెలియునో, వాడు వేదమును తెలిసినవాడు, వేదపరుడైన ముని అనడును. వేదములను నిశ్శ్వాసముగా చేసికొన్న పరమ పురుషుడు, వేదాతీతుడైన పరమాత్మను వేదజ్ఞుడైన వాడు తెలిసికొనును. (24) వేదస్వరూపుడైన పరమేశ్వరుడు వేదములచే తెలియదగిన భగవంతుడు అని తెలియవలెను. అతడే వేదరూపుడు, తెలియదగినవాడు. అతని నాశ్రయించి ముక్తుడగును. (25) పరాశరపుత్రుడైన వేదవ్యాసమహాముని, ఈ పూర్తోక్తవిధముగా నావరహితము, అక్షరాత్మకము, ఓంకార స్వరూపము అగువేదమును, వేదాతీతుడైన పరమాత్మను గూడ తెలిసియున్నాడు. (26) శ్రీ కూర్మపురాణములో వేదశాఖా ప్రణయనమనబడు ఏబదిరెండవ అధ్యాయము సమాప్తము.