Sri Koorma Mahapuranam    Chapters   

అథత్రిపఞ్చాశోధ్యాయః

సూత ఉవాచ :-

వేదవ్యాసావతారాణి ద్వాపరే కథితాని తు | మహాదేవావతారాణి కలౌ శృణత సువ్రతాః || || 1 ||

ఆద్యే కలియుగే శ్వేతో దేవదేవో మహాద్యుతిః | నామ్నా హితాయ విప్రాణా మభూ ద్వైవస్వతేన్తరే || || 2 ||

హిమవచ్ఛిఖరే రమ్యే సకలే సర్వతోత్తమే | తస్య శిష్యాః ప్రశిష్యా శ్చ బభూవు రమితప్రభూః || || 3 ||

శ్వేతః శ్వేతశిఖ శ్చైవ శ్వేతాస్యః శ్వేతలోహితః | చత్వార స్తే మహాత్మానో బ్రాహ్మణా వేదపారగాః || || 4 ||

సుతారో మదన శ్చైవ సుహోత్రః కఙ్కణ స్తథా | లోకాక్షిస్త్వథ యోగీన్ద్రో జైగీషవ్యోథ సప్తమే | || 5 ||

ఏబది మూడవ అధ్యాయము

ద్వాపరయుగములో వేదవ్యాసుని అవతారములు చెప్పబడినవి మంచి నియమముకల విప్రులారా! కలియుగమునందలి మహాదేవుని అవతారములను గూర్చి వినుడు. (1)

మొదటి కలియుగమునందు, దేవదేవుడు, గొప్పకాంతి కలవాడు నగు మహాదేవుడు వైవస్వతమన్వంతరములో శ్వేతుడను పేరుతో బ్రాహ్మణుల హితము కొరకవతరించెను. (2)

మనోహరమైన హిమాలయ శిఖరమునందు, సమస్తమైన ఆ పర్వతశ్రేష్ఠమునందు, అమితమైన తేజస్సుకల ఆవ్యాసుని శిష్యులు ప్రశిష్యులు కూడ నివసించియుండిరి. (3)

శ్వేతుడు, శ్వేతశిఖుడు, శ్వేతాస్యుడు, శ్వేతలోహితుడు అను నలుగురు మహాత్ములగు బ్రాహ్మణులు వారిలో వేదమును పూర్తిగా అధ్యయనము చేసిరి (4)

సుతారుడు, మదనుడు, సుహోత్రుడు, కంకణుడు, లోకాక్షి, యోగీంద్రుడు, జైగీషవ్యుడు అను ఏడుగురు; క్రమముగా మొదటి నుండి ఏడుయుగములలో నుండిరి. (5)

అష్టమే దధివాహః స్యా న్ననమే ఋషభః | భృగుస్తు దశ##మే ప్రోక్త స్తస్మా దుగ్రః పురః స్మృతః || || 6 ||

ద్వాదశేతిసమాఖ్యాతో బాలీవాథ త్రయోదశే | చతుర్దశే గౌతమ స్తు వేదదర్శీ తతః పరః || || 7 ||

గోకర్ణ శ్చాభవ త్తస్మా ద్గుహావాసః శిఖణ్డధృక్‌ | యజమాల్యట్టహాసశ్చ దారుకో లాఙ్గలీ తథా || || 8 ||

మహాయామో మునిః శూలీ డిణ్డముణ్డీశ్వరః స్వయమ్‌ | సహిష్ణుః సోమశర్మా చ నకులీశ్వర ఏవ చ || || 9 ||

తత్ర దేవాధిదేవస్య చత్వారః సుతపోధనాః | శిష్యా బభూవు శ్చాన్యేషాం ప్రత్యేకం మునిపుఙ్గవాః || || 10 ||

ఎనిమిదవ యుగములో దధివాహుడు, తొమ్మిదవ దానిలో ఋషభుడు, భృగువు దశమ యుగములో, తరువత ఉగ్రుడు, పండ్రెండవ యుగమున అతి సమాఖ్యాతుడు, పదుమూడవ కలియుగములో బాలి, పదునాలుగవ యుగములో గౌతముడు, తరువతి యుగములో వేదదర్శి అను అవతారములు కలిగెను. (7)

తరువాత గోకర్ణుడు, అనంతరము శిఖండమును ధరించిన గుహావాసుడు, పిమ్మట యజమాలి, అట్టహాసుడు, దారుకుడు, లాంగలి, మహాయాముడు, ముని, శూలి, డిండముండీశ్వరుడు, సహిష్ణువు, సోమశర్వ, మరియు నకులీశ్వరుడును క్రమముగా మహాదేవుని కలియుగావతారములుగా తెలియవలెను. (8, 9)

వారిలో నలుగురు మిక్కిలి తపోధనులు దేవాధిదేవునకు శిష్యులుగా ఏర్పడిరి. మునిశ్రేష్ఠులారా! ఇతరులకు గూడ ప్రత్యేకముగా శిష్యులు కలరు. వారిని గూర్చి తెలుపుదును. (10)

ప్రసన్నమనసో దాన్తా ఐశ్వరీం భక్తి మాస్థితాః | క్రమేణ తాన్‌ ప్రవక్ష్యామి యోగినో యోగవిత్తమాన్‌ || || 11 ||

దున్దుభిః శతరూప శ్చ ఋచీకః కేతుమాం స్తథా | విశోక శ్చ వికేశశ్చ విశాఖః శాపనాశనః || || 12 ||

సుముఖో దుర్ముఖ శ్చైవ దుర్దమో దురతిక్రమః | సనకః సనాతన శ్చైవ తథైవ చ సనన్దనః || || 13 ||

దాలభ్య శ్చ మహాయోగీ ధర్మాత్మానో మహౌజసః | సుధామా విరజా శ్చైవ శంఖవాణ్యజ ఏవ చ || || 14 ||

సారస్వత స్తథా మోఘో ధనవాహః సువాహనః | కపిల శ్చాసురి శ్చైవ మోఢుః పఞ్చశిఖోమునిః || || 15 ||

పరాశర శ్చ గర్గ శ్చ భార్గవ శ్చాఙ్గిరా స్తథా | చలబన్ధు ర్నిరామిత్రః కేతుశృఙ్గ స్తపోధనాః || || 16 ||

నిర్మలమైన మనస్సుకలవారు, ఇంద్రియనిగ్రహము కలవారు, ఈశ్వర విషయకభక్తి నాశ్రయించినవారు. వరుసగా యోగులు, యోగము తెలిసిన వారిలో శ్రేష్ఠులైన వారిని గూర్చి తెలుపగలను. (11)

దుందుభి, శతరూపుడు, ఋచీకుడు, కేతుమంతుడు, విశోకుడు, వికేశుడు, విశాఖుడు మరియు శాపనాశనుడు, సుముఖుడు, దుర్ముఖుడు, దుర్దముడు, దురతిక్రముడు, సనకుడు, సనాతనుడు, సనందనుడు, దాలభ్యుడు అను గొప్పయోగి, వీరందరు గొప్ప శక్తికల మహాత్ములు. సుధాముడు, విరజసుడు, శంఖవాణి, అజుడు, (12, 13, 14) సారస్వతుడు, అమోఘుడు, ధనవాహుడు, సువాహనుడు, కపిలుడు, ఆసురి, మోఢువు, పంచశిఖుడనుముని, (15) పరాశరుడు, గర్గుడు, భార్గవుడు మరియు అంగిరసుడు, చలబంధువు, నిరామిత్రడు, కేతు శృంగుడనువాడు, మునులారా! వీరందరు శిష్యవర్గములోనివారు. (16)

లమ్బోదర శ్చలమ్బ శ్చ విక్రోశో లమ్బకః శుకః | సర్వజ్ఞః సమబుద్ధి శ్చ సాధ్యాసాధ్య స్తథైవ చ || || 17 ||

సుధామా కాశ్యప శ్చాథ వసిష్ఠో విరజా స్తథా | అత్రి రుగ్ర స్తథా చైవ శ్రవణోథ సువైద్యకః || || 18 ||

కుణి శ్చ కుణిబాహు శ్చ కుశరీరః కునేత్రకః | కశ్యపో హ్యుశనా చైవ చ్యవనోథ బృహస్పతిం || || 19 ||

ఉచ్చాస్యో వామదేవశ్చ మహాకాలో మహానిలిః | వాజస్రవాః సుకేశ శ్చ శ్యావాశ్వః సుపథీశ్వరః || || 20 ||

హిరణ్యనాభః కౌశిల్యోకాక్షుః కుథుభిథ స్తథా | సుమన్తవర్చసో విద్వాన్‌ కబన్థః కుషికన్థరః || || 21 ||

లంబోదరుడు, లంబుడు, విక్రోశుడు, లంబకుడు, శుకుడు, సర్వజ్ఞుడు, సమబుద్ధి, సాధ్యాసాధ్యుడు, (17) సుధాముడు, కాశ్యపుడు, వసిష్ఠుడు, విరజుడు, అత్రి, ఉగ్రుడు మరియు శ్రవణుడు, సువైద్యకుడు, (18) కుణి, కుణిబాహువు, కుశరీరుడు, కునేత్రకుడు, కశ్యపుడు, ఉశనసుడు, చ్యవనుడు మరియు బృహస్పతి, (19) ఉచ్చాస్యుడు, వామదేవుడు, మహాకాలుడు, మహానిలి, వాజస్రవసుడు, సుకేశుడు, శ్యావాశ్వుడు, సుపథీశ్వరుడు, (20) హిరణ్యనాభుడు, కౌశిల్యుడు, అకాక్షువు, కుథుభిధుడు, పండితుడైన సుమంతవర్చసుడు, కబంధుడు, కుషికంధరుడు. (21)

ప్లక్షో దర్వాయణి శ్చైవ కేతుమాన్‌ గౌతమ స్తథా | భల్లాచీ మధుపిఙ్గశ్చ శ్వేతకేతు స్తపోధనః || || 22 ||

ఉషిధా బృహద్రక్ష శ్చ దేవలః కవి రేవ చ | శాలహోత్రాగ్నివేశ్యస్తు యువనాశ్వః శరద్వసుః || || 23 ||

ఛగలః కుణ్డకర్ణ శ్చ కున్త శ్చైవ ప్రవాహకః | ఉలూకో విద్యుత శ్చైవ శాద్రకో హ్యాశ్వలాయనః || || 24 ||

అక్షపాదః కుమార శ్చ హ్యులూకో వసువాహనః | కుణిక శ్చైవ గర్గశ్చ మిత్రకో రురు రేవ చ || || 25 ||

శిష్యా ఏతే మహాత్మానః సర్వావర్తేషు యోగినామ్‌ | విమలా బ్రహ్మభూయిష్ఠా జ్ఞానయోగపరాయణాం || || 26 ||

ప్లక్షుడు, దర్వాయణి, కేతుమంతుడు, గౌతముడు, భల్లాచి, మధుపింగుడు, తపోధనుడైన శ్వేతకేతువు, (22) ఉషిధుడు, బృహద్రక్షుడు, దేవలుడు, కవియును, శాలహోత్రుడు, అగ్నివేశ్యుడు, యువనాశ్వుడు, శరద్వసువు, (23) ఛగలుడు, కుండకర్ణుడు, కుంతుడు, ప్రవాహకుడు, ఉలూకుడు, విద్యుతుడు, శాద్రకుడు, ఆశ్వలాయనుడు, (24) అక్షపాదుడు, కుమారుడు, ఉలూకుడు, వసువాహనుడు, కుణికుడు, గర్గుడు, మిత్రకుడు, రురువు, (25) అనువీరందరు యుగముల అన్ని ఆవర్తముల యందు ఆయోగులకు మహాత్ములగు శిష్యులు. వీరు నిర్మలులు, బ్రహ్మజ్ఞానము ఎక్కువగా కలవారు, జ్ఞాన యోగము నందు శ్రద్ధకలవారుగా నుండిరి. (26)

కుర్వన్తి చా వతారాణి బ్రాహ్మణానాం హితాయ చ | యోగేశ్వరాణా మాదేశా ద్వేదసంస్థాపనాయ వై || || 27 ||

యే బ్రాహ్మణాః సంస్మరన్తి నమస్యన్తి చ సర్వదా | తర్పయ న్త్యర్చయన్త్యేతాన్‌ బ్రహ్మవిద్యా మవాప్నుయుః || || 28 ||

ఇదం వైవస్వతం ప్రోక్తం మన్తరం విస్తరేణ తు | భవిష్యతి చ సావర్ణో దక్షసావర్ణ ఏవ చ || || 29 ||

దశమో బ్రహ్మసావర్ణో ధర్మ ఏకాదశః స్మృతః | ద్వాదశో రుద్రసావర్ణో రోచ్యనామా త్రయోదశః || || 30 ||

భౌత్య శ్చతుర్దశః ప్రోక్తో భవిష్యా మనవః క్రమాత్‌ | అయం వః కథితో హ్యంశః పూర్వో నారాయణరితః || || 31 ||

బ్రాహ్మణులయొక్క మేలుకొరకు, వేదములను స్థాపించుట కొరకు యోగేశ్వరుల యొక్క ఆదేశమువలన అవతారములను కూడ ధరింతురు. (27)

ఏ బ్రాహ్మణులు ఎల్లప్పుడు స్మరింతురో, నమస్కరింతురో, తృప్తిని పొందింతురో, వీరిని పూజింతురో వారు బ్రహ్మజ్ఞానమును పొందుదురు. (28)

ఈ వైవస్వత మన్వంతరమును గూర్చి విస్తరముగా చెప్పబడినది. ఇకముందు సావర్ణము, దక్షసావర్ణము అను మన్వంతరములు జరగు గలవు. (29)

బ్రహ్మసావర్ణము పదియవది. ధర్మసావర్ణము ఏదకాదశమన్వంతరము. పండ్రెండవది రుద్రసావర్ణము, పదమూడవది రోచ్యనామక మన్వంతరము కాగలదు. (30)

పదునాల్గవది భౌత్యమన్వంతరము. క్రమముగా వీరందరు కాబోవు మనువులు. పూర్వము నారాయణునిచేత చెప్పబడిన యీ విషయము నాచే మీకు తెలిపబడినది. (31)

భూతై ర్భవ్యై ర్వర్తమానై రాఖ్యానై రుపబృంహితః | యః పఠే చ్ఛృణుయా ద్వాపి శ్రావయేద్వా ద్విజోత్తమాన్‌ || || 32 ||

సర్వపాపవినిర్ముక్తో బ్రహ్మలోకే మహీయతే | పఠే ద్దేవాలయే స్నాత్వా నదీతీరేషు చైవ హి || || 33 ||

నారాయణం నమస్కృత్య భావేన పురుషోత్తమమ్‌ | నమో దేవాధిదేవాయ దేవానాం పరమాత్మనే ||

పురుషాయ పురాణాయ విష్ణవే ప్రభవిష్ణవే || || 34 ||

ఇతి శ్రీ కూర్మపురాణ పూర్వార్థే త్రిపఞ్చాశోధ్యాయః పూర్వార్థం సమాప్తమ్‌

నాచే తెలుపబడిన యీ ఆఖ్యానము భూతవర్తమాన భవిష్యత్కాలములకు సంబంధించిన కథలతో విస్తరించబడినది. దీనిని ఎవడు చదువునో, వినునో, బ్రాహ్మణులకు వినిపించునో, అట్టివాడు అన్ని పాపములనుండి విడువబడి బ్రహ్మలోకములో పూజింపబడును. స్నానము చేసి దేవాలయమునందు, లేదా నదీ తీరములయందుగాని చదువవలెను. (32, 33)

పురుషోత్తముడైన నారాయణునకు భక్తిభావముతో నమస్కరించి చదువదగును.

దేవాధిదేవుడు, దేవతలకు పరమాత్మయగువాడు, పురాణపురుషుడు, సర్వసమర్థుడును అయిన విష్ణువునకు వందనము.

శ్రీ కూర్మపురాణములో ఏబదిమూడవ అధ్యాయము ముగిసినది.

పూర్వార్థము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters