Sri Koorma Mahapuranam    Chapters   

ద్వితీయోధ్యాయః

ఈశ్వర ఉవాచ :-

అవాచ్య మేత ద్విజ్ఞానం మమ గుహ్యం సనాతనమ్‌ | య న్న దేవా విజానన్తి యతన్తోపి ద్విజాతయః || || 1 ||

ఇదం జ్ఞానం సమాశ్రిత్య బ్రాహ్మీభూతా ద్విజోత్తమాః | న సంసారం ప్రపద్యన్తే పూర్వేపి బ్రహ్మవాదినః || || 2 ||

గుహ్యా ద్గుహ్యాతమం సాక్షా ద్గోపనీయం ప్రయత్నతః | వక్ష్యే భక్తిమతా మద్య యుష్మాకం బ్రహ్మవాదినామ్‌ || || 3 ||

ఆత్మా యం కేవలః స్వచ్ఛః శుద్ధః సూక్ష్మః సనాతనః | అస్తి సర్వాన్తరః సాక్షా చ్చిన్మాత్ర స్తమసః పరః || || 4 ||

సోన్తర్యామీ స పురుషః స ప్రాణ స్స మహేశ్వరః | స కాలోత్ర త దవ్యక్తం స చ వేద ఇతి శ్రుతిః || || 5 ||

ద్వితీయాధ్యాయము

ఈశ్వరుడు చెప్పెను:-

నాకు సంబంధించిన సనాతనమైన యీ విజ్ఞానము మాటలతో చెప్పుట శక్యము కానిది. ఓ బ్రాహ్మణులారా! దానిని దేవతలు కూడ ప్రయత్నించినప్పటికి తెలిసికొనజాలరు. (1)

ఈ జ్ఞానమును సంపాదించి బ్రాహ్మీభూతులైన బ్రాహ్మణోత్తములు, పూర్వులైన బ్రహ్మవాదులు కూడ మరల సంసారమును పొందరు. (2)

రహస్యములకంటె మిక్కిలి రహస్యమైనది, ప్రయత్నపూర్వకముగా దాచదగినది. అగు ఈ తత్త్వమును భక్తియుక్తులు, బ్రహ్మ వాదులు నైన మీకు నేడు చెప్పగలను. (3)

ఈ ఆత్మకేవలము శుద్ధము, నిర్మలము, సూక్ష్మము, సనాతనము కూడ. జ్ఞానమాత్రమై, అంధకారమున కతీతమై, సాక్షాత్తుగా అన్నిటి అంతర్భాగమున వ్యాపించి యున్నది. (4)

ఆ ఆత్మ అంతర్యామి, పురుషరూపి, ప్రాణము, మహేశ్వరుడు, కాలరూపుడు, అవ్యక్తము, వేదనామకము అనిశ్రుతి చెప్పుచున్నది. (5)

అస్మా ద్విజాయతే విశ్వ మత్రైవ ప్రవిలీయతే | స మాయీ మాయయా బద్ధః కరోతి వివిధా స్తనూః || || 6 ||

న చాప్యయం సంసరతి న సంసారమయః ప్రభుః | నాయం పృథ్వీ న సలిలం న తేజః పవనో నభః || || 7 ||

న ప్రాణో న మనోవ్యక్తం న శబ్దః స్పర్శ ఏవ చ | న రూపరసగన్ధాశ్చ నాహం కర్తా న వాగపి || || 8 ||

న పాణాపాదౌ నో పాయు ర్న చోపస్థం ద్విజోత్తమాః | నచ కర్తా న భోక్తా వా న చ ప్రకృతిపూరుషౌ || || 9 ||

స మాయా నైవ చ ప్రాణా న చైవ పరమార్ధతః | యథా ప్రకాశతమసోః సమన్ధో నోపపద్యతే || || 10 ||

తద్వ దైక్యం న సమ్బన్ధః ప్రపఞ్చపరమాత్మనోః | ఛాయతపౌ యథా లోకే పరస్పరవిలక్షణౌ || || 11 ||

ఈయాత్మనుండి ప్రపంచము జనించును. దీనిలోనే లయమునొందును. మాయమయుడైన ఆపురుషుడు మాయచేతబద్ధుడై వివిధ శరీరములను సృజించును. (6)

ఈతడు సంసారములో చిక్కుకొనడు. సంసారమయుడు కూడకాడు. ఇతడు భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము అనువానిలో ఏ ఒక్కటి కూడ కాడు. (7)

ఈ పురుషుడు ప్రాణరూపుడు కాడు. మనస్సు. అవ్యక్తము, శబ్దము, స్పర్శము కూడ కాడు. రూపరసగంధములు కాడు. అట్టి నేను కర్తను కాను, వాక్కును కూడ కాను. (8)

విప్రవర్యులారా! పాణిపాదములు కాను, గుదస్థానము, యోని కాని కాను, కర్తను కాని భోక్తను కాని నేను కాను. ప్రకృతి పురుషరూపుడను కాను. (9)

యథార్ధముగా నేను మాయను కాను, ప్రాణములు కాను. ఎట్లైతే వెలుగు చీకట్లకు సంబంధము సమన్వయము కాదో (10) అదే విధముగా ప్రపంచపరమాత్మల సంబంధముఐక్యముకాదు. లోకములో ఎండ, నీడ, ఎట్లు పరస్పరవిభిన్నములో, (11)

తద్వ త్ర్పపంచపురుషౌ విభిన్నౌ పరమార్థతః | తథాత్మా మలినః సృష్టో వికారీ స్యా త్స్వరూపతః || || 12 ||

నహి తస్య భ##వే న్ముక్తి ర్జన్మాన్తరశ##తై రపి | పశ్యన్తి మునయో ముక్తాః స్వాత్మానం పరమార్ధతః || || 13 ||

వికారహీనం నిర్ద్వస్ద్వ మానన్దాత్మాన మవ్యయమ్‌ | అహం కర్తా సుఖీ దుఃఖీ కృశః స్థూలేతి యా మతిః || || 14 ||

సా చాహంకరాకర్తృత్వా దాత్మ న్యారోపితా జనైః | వదన్తి వేదవిద్వాంసః సాక్షినం ప్రకృతేః పరమ్‌ || || 15 ||

భోక్తార మక్షరం బుద్ధం సర్వత్ర సమవస్థితమ్‌ | తస్మా దజ్ఞానమూలో హి సంసారః సర్వదేహినామ్‌ || || 16 ||

దానివలెనే ప్రకృతిపురుషులు కూడ వాస్తవముగా భిన్నులు. అట్లే మలినమైన ఆత్మ జీవుడుగా స్వరూపంతో వికారము కలవాడుగా ఉండును. (12)

అట్టివానికి వందలకొలది జన్మలచేత గూడ మోక్షం లభించదు. ముక్తులైన మునులు పరమార్థమైన ఆత్మ సాక్షాత్కారమును పొందుతారు. (13)

ఆ ఆత్మ వికారరహితము, ద్వంద్వములు లేనిది, అనందరూపము, నాశరహితము అయినది. నేను కర్తను, సుఖదుఃఖములు కలవాడను, బక్క వాడను, లావైన వాడను అని ఏబుద్ధికలదో, అది అహంకారజన్యము. దానిని జనులు ఆత్మయండారోపించుకొని ప్రవర్తింతురు. (14)

వేదపండితులు ఆత్మను ప్రకృతికతీతమైనదిగా, సాక్షిభూతమని, భోక్త, జ్ఞానరూపము, అక్షరాత్మకము, అంతట వ్యాపించినది అని చెప్పుదురు. కావున ప్రాణుల యొక్క సంసార బంధము అజ్ఞానమూలకమే. (16)

అజ్ఞానా దన్యథాజ్ఞానా త్తత్త్వం ప్రకృతిసంగతమ్‌ | నిత్యోదితం స్వయంజ్యోతిః సర్వగః పురుషః పరః || || 17 ||

అహంకారావివేకేన కర్తాహ మితి మన్యతే | పశ్యన్తి ఋషయోవ్యక్తం నిత్యం సదసదాత్మకమ్‌ || || 18 ||

ప్రధానం పురుషం బుద్ధ్వా కారణం బ్రహ్మవాదినః | తేనా యం సంగతః స్వాత్మా కూటస్థోపి నిరంజనః || || 19 ||

స్వాత్మాన మక్షరం బ్రహ్మ నావబుధ్యేత తత్త్వతః | అనాత్మ న్యాత్మవిజ్ఞానం తస్మా ద్దుఃఖం తథే తరత్‌ || || 20 ||

రాగద్వేషాదయో దోషాః సర్వేభ్రాన్తినిబన్ధనాః | కర్మా ణ్యస్య మహా న్దోషః పుణ్యాపుణ్య మితి స్థితిః || || 21 ||

తద్వశా దేవ సర్వేషాం సర్వదేహసముద్భవః | నిత్యం సర్వత్ర గుహ్యాత్మా కూటస్థో దోషవర్జితః || || 22 ||

ప్రకృతితో సంబంధించి మూలతత్త్వాన్ని, నిత్యము ఉదయము కలదాన్ని అజ్ఞానమువలన, విపరీత జ్ఞానమువలన, అహంకార జన్యమైన అవివేకముతో తెలిసికొనలేక నేను కర్తనని జీవుడు అనుకుంటాడు. పరతత్త్వమైన పురుషుడు అన్నిటిని వ్యాపించిన స్వయంప్రకాశజ్యోతి రూపుడు. ఋషులు, సత్‌, అసద్రూపమైన అవ్యక్తతత్త్వాన్ని ఎల్లప్పుడు దర్శింతురు. (17, 18)

బ్రహ్మవాదులైన వారు ప్రధాన పురుషుణ్ణి కారనముగా తెలిసికొని అట్లు చూడగలరు. కూటస్థము, నిర్వకారము అయినప్పటికి ఆపరతత్త్వముతో ఆత్మ సంబంధము పొంది తనను వస్తుతః అక్షరమైన బ్రహ్మముగా తెలిసికొనలేరు. ఆత్మకాని దాని యందాత్మ భావమువలన సుఖదుఃఖాలు కల్గుతున్నవి. (20)

రాగము, ద్వేషము మొదలైన దోషాలన్నీ భ్రాంతిమూలకాలైనవి. పుణ్యపాపరూపములైన కర్మలే జీవునికి పెద్దదోషము. (21)

ఆ కర్మలవలననే జీవులందరికి అన్నిరకాల శరీరాలు కలుగుతున్నవి. కూటస్థుడైన పరమపురుషుడు గుహ్యస్వరూపుడు, ఎల్లప్పుడు అంతటా దోషరహితుడుగా ఉండును. (22)

ఏకః సంతిష్ఠతే శక్త్యా మాయయా న స్వభావతః | తస్మా దద్వైత మే వాహు ర్మునయః పరమార్థతః || || 23 ||

భేదోవ్యక్తస్వభావేన సా చ మాయా త్మసంశ్రయా | యథా చ ధూమసమ్పర్కాన్నాకాశో మలినో భ##వేత్‌ || || 24 ||

అన్తఃకరణజై ర్భావై రాత్మా తద్వ న్న లిప్యతే | యథా స్వప్రభయా భాతి కేవలః స్ఫటికోపలః || || 25 ||

ఉపాధిహీనో విమల స్తథైవాత్మా ప్రకాశ##తే | జ్ఞానస్వరూప మే వాహు ర్జగ దేత ద్విచక్షణాః || || 26 ||

అర్థస్వరూప మేవాస్య పశ్య న్త్యన్యే కుదృష్టయః | కూటస్థో నిర్గుణో వ్యాపీ చైతన్యాత్మా స్వభావతః || || 27 ||

దృశ్యతే హ్యర్థరూపేణ పురుషై ర్జానదృష్టిభిః | యథా స లక్ష్యతే రక్తః కేవలం స్ఫాటికో జనైః || || 28 ||

ఆ పురుషుడు కేవలుడుగా తనశక్తితో స్వభావసిద్ధముగా నిలిచి ఉండును. మాయతో సహజస్థితికాదు. అందువలన మునులు అద్వైత తత్త్వమునే పరమార్థమని చెప్పుతారు. (23)

అవ్యక్తరూపమూలతత్త్వముతో భేదములేదు. మాయజీవుని ఆశ్రయించి ఉంటుంది. పొగతో సంబంధము వలన ఆకాశము మలినము కానట్లు అంతః కరణములో పుట్టిన కామక్రోధాది వికారములచేత ఆత్మ మలినము కాదు. స్ఫటికశిల ఏవిధముగా తన కాంతితో ప్రకాశిస్తుందో, (24, 25) అట్లే ఉపాధి శూన్యమైన నిర్మలమైన ఆత్మకూడ ప్రకాశిస్తుంది. వివేకులైనవారు ఈ ప్రపంచాన్ని జ్ఞాన స్వరూపముగానే చెప్పుదురు. (26)

సరియైన దృష్టిలేని ఇతరులు దీని సగము స్వరూపాన్ని మాత్రం చూస్తారు. కూటస్థపురుషుడు సహజముగా నిర్గుణుడు, చైతన్యరూపుడు, వ్యాపకుడు అయి ఉన్నాడు. (27)

జ్ఞానదృష్టికల పురుషులచేత, స్ఫటికము ఉపాధివశమున జనులకు రక్తవర్ణముగా కనబడినట్లు అర్థరూపముతో దర్శింపబడును. (28)

రత్తికాద్యుపధానేన తద్వ త్పరమపూరుషః | తస్మా దాత్మా క్షరః శుద్ధో నిత్యః సర్వత్రగోవ్యయః || || 29 ||

ఉపాసితవ్యో మన్తవ్యః శ్రోతవ్య శ్చ ముముక్షుభిః | యదా మనసి చైతన్యం భాతి సర్వత్ర సర్వదా || || 30 ||

యోగినః శ్రద్దధానస్య తదా సంపద్యతే స్వయమ్‌ | యదా సర్వాణి భూతాని స్వాత్మ న్యేవాభిపశ్యతి || || 31 ||

సర్వభూతేషు చాత్మానం బ్రహ్మ సమ్పద్యతే తదా | యదా సర్వాణి భూతాని సమాధిస్థో న పశ్యతి || || 32 ||

ఏకీభూతః పరేణా సౌ తదా భవతి కేవలమ్‌ | యదా సర్వే ప్రముచ్యన్తే కామా యేస్య హృది స్థితాః || || 33 ||

తదా సా వమృతీభూతః క్షేమం గచ్ఛతి పణ్డితః | యదా భూతపృథ గ్భావ మేకస్థ మనుపశ్యతి || || 34 ||

అదేవిధముగా పరమపురుషుడు జ్ఞానులకుగూడ అర్థ స్వరూపముతో భాసించును. అందువలన ఆత్మ అక్షరము, శుద్ధము, నిత్యము, నాశరహితము, అంతట నిండినది. (29)

మోక్షకాములైన వారిచేత పరమాత్మ సేవింపదగును, ఆలోచింపదగును, వినదగియుండును. ఎప్పుడైతే, మనస్సులో చైతన్యము వెలుగు చుండునో, అంతట ఎల్లప్పుడు శ్రవణాదులు చేయవలెను. (30)

శ్రద్ధకలిగియున్న యోగికి అప్పుడు స్వయముగా సిద్ధి లభిస్తుంది. ఎప్పుడు సమస్త భూతాలను తనయందే దర్శించునో, సమస్త భూతములందు తనను దర్శించునో అప్పుడు బ్రహ్మసాయుజ్యము కలుగుతుంది. (31, 32)

ధ్యానసమాధియందు సర్వభూతాలను దర్శింపనిచో, పరతత్త్వముతో ఏకీభావమునొంది కేవలరూపాన్ని పొందుతాడు. ఇతని మనస్సులో ఉన్న కోరికలన్నీ ఎప్పుడు విడిచిపోవునో, అప్పుడాతడు అమృతభావాన్ని పొంది జ్ఞానియైశుభాన్ని పొందుతాడు. ఎప్పుడు ప్రాణులకంటె భేదభావమును, ఏక స్థితమును దర్శించునో (33, 34)

తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే సదా | యదా పశ్యతి చాత్మానం కేవలం పరమార్థతః || || 35 ||

మాయామాత్రం తదా సర్వం ద్భవతి నిర్వృతమ్‌ | యదా జన్మజరాదుఃఖవ్యాధీనా మేకభేషజమ్‌ || || 36 ||

కేవలం బ్రహ్మవిజ్ఞానం జాతయేసౌ సదాశివః | యథా నదీనదా లోకే సాగరే ణౖకతాం యయుః || || 37 ||

తద్వ దాత్మాక్షరేణా సౌ నిష్కలే నైకతాం వ్రజేత్‌ | తస్మా ద్విజ్ఞాన మేవాస్తి న ప్రపఞ్చో న సంస్థితిః || || 38 ||

అజ్ఞానేనా వృతం లోకే విజ్ఞానం తేన ముహ్యతి | విజ్ఞానం నిర్మలం సూక్ష్మం నిర్వికల్పం తదవ్యయమ్‌ || || 39 ||

అజ్ఞాన మితర త్సర్వం విజ్ఞాన మితి తన్మతమ్‌ | ఏత ద్వః కథితం సాంఖ్యం భాషితం జ్ఞాన ముత్తమమ్‌ || || 40 ||

అప్పుడు అతడు విస్తృతమైన బ్రహ్మభావాన్ని పొందుతాడు. ఎప్పుడైతే ఆత్మ స్వరూపాన్ని కేవలముగా పరమార్థరూపంగా తెలుసుకుంటారో, అప్పుడు మాయామయమైన సమస్త ప్రపంచము నిర్వృతిని పొందుతుంది. ఎప్పుడు జనన, వార్థక్య, వ్యాధిదుఃఖాలకు ముఖ్యౌషధమైన (35, 36) కేవల బ్రహ్మతత్త్వదర్శనము కలుగుతుందో అప్పుడతడు సదాశివుడవుతాడు.

లోకంలో నదీనదాలు ఏవిధంగా సముద్రముతో ''ఏకత్వాన్ని పొందునో, అట్లే ఆత్మనిష్కలమైన అక్షరపర బ్రహ్మముతో అభేదాన్ని పొందుతుంది. అందువలన విజ్ఞానమొక్కటే సత్యము. ప్రపంచముకాని, స్థితి కాని లేదు. (37, 38)

ప్రపంచంలో విజ్ఞానము అజ్ఞానముచే కప్పబడి మోహాన్ని పొందుతుంది. విజ్ఞానము సహజంగా నిర్మలము, సూక్ష్మము, వికల్ప శూన్యము, నాశరహితమైనది. (39)

దానికిభిన్నమైన దంతా అజ్ఞానమే. ఈ సాంఖ్య తత్త్వము, శ్రేష్ఠమైనది. ప్రాచీనులచేత చెప్పబడినది, మీకు నాచేత వివరింపబడింది. (40)

సర్వవేదాన్తసారం హి యోగ స్త త్రైక చిత్తతా | యోగా త్సంజాయతే జ్ఞానం జ్ఞానా ద్యోగః ప్రవర్తతే || || 41 ||

యోగజ్ఞానాభిముక్తస్య నావాప్యం విద్యతే క్వచిత్‌ | యదేవ యోగినో యాన్తి సాంఖ్యై స్త దతిగమ్యతే || || 42 ||

ఏకం సాంఖ్యం చ యోగశ్చ యః పశ్యతి స తత్త్వవిత్‌ | అన్యేహి యోగినో విప్రా హ్వైశ్వర్యాసక్తచేతసః || || 43 ||

మజ్జన్తి తత్ర తత్రైవ యే చాన్యే కుణ్ఠబుద్ధయః | యత్త త్సర్వమతం దివ్య మైశ్వర్య మమలం మహత్‌ || || 44 ||

జ్ఞానయోగాభియుక్తస్తు దేహాన్తే త దవాప్నుయాత్‌ | ఏష ఆత్మాహ మవ్యక్తో మాయావీ పరమేశ్వరః || || 45 ||

ఆ విషయములో ఏకాగ్రత సర్వవేదాంతసారమైన యోగము. యోగమువలన జ్ఞానము కలుగును. జ్ఞానమువలన యోగము ప్రవర్తించును. (41)

యోగజ్ఞానములతో కూడియున్నవానికి పొందరానిది ఏదియు ఎక్కడ కూడ ఉండదు. యోగులు దేనిని పొందుదురో, అది సాంఖ్యులచే పొందడును. (42)

సాంఖ్యము, యోగము రెంటిని ఒకటిగా ఎవడు చూచునో వాడు తత్త్వము నెరిగినవాడు. ఇతరయోగులు ఐశ్వర్యము నందాసక్తి కలవారుగా తెలియవలెను. (43)

ఇతరులైన అల్పబుద్ధికలవారు అచ్చటచ్చటనే మునుగుచుందురు. ఏది అమలము, దివ్యము, గొప్పది అగు ఐశ్వర్యము కలదో, అది సర్వసమ్మతమైనది. (44)

దానిని జ్ఞానయోగనిష్ఠుడు శరీరాంతకాలములో పొందగలడు. ఆత్మస్వరూపుడైన యీ నేను అవ్యక్తుడను, మాయావియైన పరమేశ్వరుడను. (45)

కీర్తితః సర్వవేదేషు సర్వాత్మా సర్వతోముఖః | సర్వరూపః సర్వరసః సర్వగన్ధోజరోమరః || || 46 ||

సర్వతః పాణిపాదోహ మన్తర్యామీ సనాతనం | అపాణిపాదో జవగో గ్రహీతా హృది సంస్థితః || || 47 ||

అచక్షురపి పశ్యామి తథాకర్ణః శృణో మ్యహమ్‌ | వేదాహం సర్వ మేవేదం న మాం జానాతి కశ్చన || || 48 ||

ప్రాహు ర్మహాన్తం పురుషం మా మేకం తత్త్వదర్శినః | పశ్యన్తి ఋషయో హేతు మాత్మనః సూక్ష్మదర్శినః || || 49 ||

నిర్గుణామలరూపస్య య దైశ్వర్య మనుత్తమమ్‌ | య న్న దేవా విజానన్తి మోహితా మమ మాయయా || || 50 ||

అన్నివేదములయందు కీర్తింప బడినవాడు, సర్వాత్మకుడు, అంతట ముఖములు కలవాడు, సర్వరూపుడు, సర్వరసుడు, సమస్త గంధములు కలవాడు, జరామరణములు లేనివాడు. (46)

అన్నివైపుల హస్తపాదములు కలనేను, అంతర్యామిని, సనాతనుడను, పాణిపాదములు లేనివాడను, వేగముగా వెళ్లువాడను, గ్రహించువాడను, హృదయమందుండువాడను. (47)

నేత్రములు లేకున్నను చూచు చున్నాను, చెవులులేకున్నను వినువాడను, సమస్తమును నేను తెలిసికొందును, నన్నెవడును తెలియజాలడు. (48)

తత్త్వమును గ్రహించినవారు నన్ను ఒక్కని మహాపురుషుడని చెప్పుదురు. సూక్ష్మదర్శినియైన ఆత్మకు కారణభూతునిగా నన్ను ఋషులు చూచుచున్నారు. (49)

గుణరహితమైన నిర్మలరూపముకల పరమపురుషుని యొక్క సర్వశ్రేష్ఠమైన ఏ ఐశ్వర్యము కలదో, దేనినైతే దేవతలు కూడ నామాయచేత మోహితులై తెలియలేరో, (50)

వక్ష్యే సమాహితా యూయం శృణుధ్వం బ్రహ్మవాదినః | నాహం ప్రశస్తః సర్వస్య మాయాతీతః స్వభావతః || || 51 ||

ప్రేరయామి తథాపీదం కారణం సురయో విదుః | యతో గుహ్యతమం దేహం సర్వగం తత్త్వదర్శినః || || 52 ||

ప్రవిష్టా మమ సాయుజ్యం లభ##న్తే యోగినో వ్యయమ్‌ | యే హి మాయా మతి క్రాన్తా మమ యా విశ్వరూపిణీ || || 53 ||

లభ##న్తే పరమం శుద్ధం నిర్వాణం తే మయా సహ | న తేషాం పరమావృత్తిః కల్పకోటిశ##తైరపి || || 54 ||

ప్రసాదా న్మమ యోగీన్ద్రా ఏత ద్వేదానుశాసనమ్‌ | తత్పుత్రశిష్యయోగిభ్యో దాతవ్యం బ్రహ్మవాదిభిః

మదుక్త మేత ద్విజ్ఞానం సాంఖ్య యోగసమాశ్రయమ్‌ || || 55 ||

ఇతి శ్రీ కూర్మపురాణ ఉత్తరార్థే ఈశ్వర గీతా సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం

యోగశాస్త్రే ఋషి వ్యాస సంవాదే ద్వితీయోధ్యాయః

ఓ బ్రహ్మవాదులగు మునులారా! దానినిగూర్చి మీకు చెప్పుదును మీరు సావధానులై వినుడు. సహజముగా మాయకు అతీతుడనైననేను ప్రశస్తుడనై (51) ప్రేరేపించుటలేదు. అయినప్పటికి పండితులైన వారు కారణముగా గుర్తింతురు. తత్త్వవేత్తలయినవారు మిక్కిలి రహస్యమైన సర్వగతమైన శరీరమును దేనివలన (52) ప్రవేశించిన యోగులు నాసాయుజ్యమును పొందుదురో, విశ్వరూపిణియైన నామాయను ఎవరు అతిక్రమింతురో, (53) వారుశుద్ధమైన శ్రేష్ఠమైన మోక్షపదవిని చేరి నాతో కలియుదురు. మరల వారికి కోటికల్పముల వరకైనా పునరావృత్తిలేదు. (54)

యోగీశ్వరులారా! నా అనుగ్రహము వలన ఈ వేదమార్గోపదేశమును బ్రహ్మవాదులచే పుత్రులకు శిష్యులకు, యోగులకు ఈయదగును. ఇది నాచేత చెప్పబడిన యోగసంబంధిసాంఖ్య విజ్ఞానము.

కూర్మపురాణము ఉత్తరార్థము ద్వితీయాధ్యాయము సమాప్తము.

Sri Koorma Mahapuranam    Chapters