Sri Koorma Mahapuranam
Chapters
అథ తృతీయో೭ధ్యాయః ఈశ్వర ఉవాచ :- అవ్యక్తా దభవ త్కాలః ప్రధానం పురుషః పరః | తేభ్యః సర్వ మిదం జాతం తస్మాద్ బ్రహ్మమయం జగత్ ||
|| 1 || సర్వతః పాణిపాదాన్తం సర్వతో೭క్షి శిరోముఖమ్ | సర్వతః శ్రుతిమ ల్లోకే సర్వ మావృత్య తిష్ఠతి || || 2 || సర్వేన్ద్రియగుణాభాసం సర్వేన్ద్రియవివర్జితమ్ | సర్వాధారం సదా నన్త మవ్యక్తం ద్వైతవర్జితమ్ ||
|| 3 || సర్వోపమానరహితం ప్రమాణాతీతగోచరమ్ | నిర్వికల్పం నిరాభాసం సర్వావాసం పరామృతమ్ ||
|| 4 || అభిన్నం భిన్నసంస్థానం శాశ్వతం ధ్రువ మవ్యయమ్ | నిర్గుణం పరమం జ్యోతి స్తజ్ఞానం సూరయో విదుః ||
|| 5 || తృతీయాధ్యాయము ఈశ్వరుడిట్లనెను అవ్యక్త తత్త్వమునుండి కాలము పుట్టినది. ప్రధానము, పరమపురుషుడు కూడ పుట్టెను. వాని నుండి యీ సమస్తము కలిగినది. అందువలన ప్రపంచము బ్రహ్మమయము. (1) బ్రహ్మము అన్నివైపుల వ్యాపించిన చేతులు, కాళ్లు కలది, అంతట కన్నులు, తలలు, ముఖములు కలిగినది, అన్నివైపుల శ్రవణములు కలిగి మొత్తము నావరించి యుండును. (2) అన్ని ఇంద్రియముల గుణముల యొక్క ఆభాసము కలది, అన్ని ఇంద్రియముల నుండి విడువబడినది, అన్నిటికాధారమైనది, అంతములేనిది, వ్యక్తముకానిది, భేదశూన్యమైనది బ్రహ్మ స్వరూపము. (3) సమస్తోపమాన శూన్యమైనది, ప్రమాణముల కతీతముగా గోచరించునది, వికల్పశూన్యము, ఆభాసరహితము, అన్నిటికాధారభూతము, శ్రేష్ఠమై అమృతరూపమైనది. (4) భిన్నముకానిది, భిన్నమైన కూర్పుకలది, శాశ్వతము, స్థిరము, నాశరహితము, గుణశూన్యము, గొప్పతేజస్సు అగు ఆ జ్ఞానమును పండితులు తెలిసి కొందురు. (5) స ఆత్మా సర్వభూతానాం స భాహ్యాభ్యన్తరః పరః | సో೭హం సర్వత్రగః శాన్తో జ్ఞానాత్మా పురమేశ్వరః || || 6 || మయా తత మిదం విశ్వం జగత్ స్థావరజఙ్గమమ్ | మత్థ్సాని సర్వబూతాని య స్తం వేదవిదో విదుః || || 7 || ప్రధానం పురుషం చైవ త ద్వస్తు సముదాహృతమ్ | తయో రనాది రుద్దిష్టః కాలః సమయోగజః పరః || || 8 || త్రయ మేత దనాద్యన్త మవ్యక్తే సమవస్థితమ్ | తదాత్మకం త దన్యత్ స్యా త్త ద్రూపం మామకం విదుః || || 9 || మహదాద్యం విశేషాన్తం సంప్రసూతే೭ఖిలం జగత్ | యా సా ప్రకృతి రుద్దిష్టా మోహినీ సర్వదేహినామ్ || || 10 || పురుషః ప్రకృతిస్థో వై భుజ్కైయః ప్రాకృతా న్గుణాన్ | అహఙ్కారవిముక్త త్వాత్ ప్రోచ్యతే పంచవింశకః || || 11 || సమస్త భూతములకు అతడాత్మరూపుడు, అతడు బాహ్య, ఆభ్యంతరరూపుడు. అట్టి నేను అంతట నిండినవాడను, శాంతుడను, జ్ఞానరూపుడగు పరమేశ్వరుడను. (6) స్థావర జంగమరూపమైన ఈ విశ్వమునాచేత వ్యాప్తమైయున్నది. సమస్త ప్రాణులు నాయందున్నవి. అట్టి వానిని వదేవేత్తలు తెలిసి కొందురు. (7) ఆ తత్త్వము ప్రధానము, పురుష రూపము అని చెప్పబడినది. ఆ రెండిటి యొక్క సంయోగము వలన పుట్టినది, అనాది యగు కాలమని చెప్పబడినది. (8) ఈ మూడు (ప్రధానము, పురుషుడు, కాలము) ఆద్యంత రహితము అవ్యక్త తత్త్వము నందు నిలిచియున్నది. దాని స్వరూపము కలది, తద్భిన్నమైనది అగునట్టి రూపము నాదిగా తెలిసికొందురు. (9) మహత్తత్త్వము మొదలు విశేషమువరకు సమస్తలోకమును సృజించును. ఆ ప్రకృతి యేది కలదో అది సర్వప్రాణులను మోహింపజేయును. (10) ప్రకృతి యందున్న జీవరూప పురుషుడు ప్రకృతి గుణముల ననుభవించుచు, అహంకార విముక్తుడయినందున 25వ తత్త్వముగా చెప్పడును. (11) ఆద్యో వికారః ప్రకృతే ర్మహా నితి చ కథ్యతే | విజ్ఞాతృశక్తివిజ్ఞానాత్ హ్యహఙ్కార స్తదుత్థితః || || 12 || ఏక ఏవ మహా నాత్మా సో೭హఙ్కారో೭భిధీయతే | స జీవః సో೭న్తరాత్మేతి గియతే తత్త్వచిన్తకైః || || 13 || తేన వేదయతే సర్వం సుఖం దుఃఖం చ జన్మసు | స విజ్ఞానాత్మక స్తస్య మనః స్యా దుపకారకమ్ || || 14 || తేనాపి తన్మయ స్తస్మా త్సంసారః పురుషస్య తు | సదా వివేకః ప్రకృతౌ సంగా త్కాలేన సో೭భవత్ || || 15 || కాలః సృజతి భూతాని కాలః సంహరతే ప్రజాః | సర్వే కాలస్య వశగా న కాలః కస్యచి ద్వశే || || 16 || సో೭న్తరా సర్వ మేవేదం నియచ్ఛతి సనాతనః | ప్రోచ్యతే భగవాన్ ప్రాణః సర్వజ్ఞః పరుషోత్తమః || || 17 || ప్రకృతి యొక్క మొదటి వికారము 'మహత్తు' అని చెప్పబడును. తెలిసికొను శక్తి కలిగి యుండుట వలన దాని ఉండి అహంకారము కల్గినది. (12) మహద్రూపమైన ఆత్మఒక్కటే. అది అహంకారమని చెప్పబడును. తత్త్వవిమర్శకులచేత జీవుడని, అంతరాత్మయని, ఆ ఆత్మయే పేర్కొనబడుచున్నది. (13) జన్మలయందలి సమస్త సుఖదుఃఖములు దానిచేతనే తెలియబడును. ఆ యాత్మ విజ్ఞానాత్మకము. మనస్సు దాని కుపకరించును. (14) దానిచేత తన్మయమైన సంసారము జీవునకు కలుగుచున్నది. ఆ జీవపురుషుడు కాలముచేత, ప్రకృతి సంబంధము వలన వివేక శూన్యుడగు చున్నాడు. (15) కాలము భూతములను సృజించును. కాలము ప్రజలను సంహరించును. అన్నియు కాలమునకు వశములగును. కాలము దేనికిని వశము కాదు. (16) ఆ కాలము సనాతనము. అది యీ సర్వమును మించును. అది భగవంతుడని, సర్వజ్ఞమని, పురుషోత్తముడని చెప్పబడుచున్నది. (17) సర్వేన్ద్రియేభ్యః పరమం మన ఆహు ర్మనీషిణః | మనస శ్చా ప్యహఙ్కార అహంకార న్మహాన్పరః || || 18 || మహతః పర మవ్యక్తా త్పురుషః పరః | పురుషా ద్భగవాన్ ప్రాణ స్తస్య సర్వ మిదం జగత్ || || 19 || ప్రాణా త్పరతరం వ్యోమ వ్యోమాతీతో೭గ్ని రీశ్వరః | సో೭హం బ్రహ్మా వ్యయః శాన్తో మాయాతీత మిదం జగత్ || || 20 || నాస్తి మత్తః పరం భూతం మాఞ్చ విజ్ఞాయ ముచ్యతే | నిత్యం నాస్తీతి జగతి భూతం స్థావరజఙ్గమమ్ || || 21 || ఋతే మా మేవ మవ్యక్తం వ్యోమరూపం మహేశ్వరమ్ | సో೭హం సృజామి సకలం సంహరామి సదా జగత్ || || 22 || అన్ని ఇంద్రియములకంటె మనస్సు శ్రేష్ఠమైనదని పండితులు చెప్పుదురు. మనస్సు కంటె అహంకారము, అహంకారముకంటె మహత్తత్త్వము గొప్పదనికూడ వారు చెప్పుదురు. (18) మహత్తుకంటె అవ్యక్తము పరమైనది. అవ్యక్తమున కంటె పురుషుడు అధికుడు. పురుషుని వలన భగవద్రూపమైన ప్రాణము (జీవుడు) కలుగును. ఈ సర్వలోకము ఆ జీవునది. (19) ప్రాణముకంటె పరతరమైనది ఆకాశము, ఆకాశమునకతీతమైన అగ్ని యీశ్వర రూపుడు. అట్టి నేను నాశరహితమైన బ్రహ్మను, శాంతుడను, ఈ జగత్తు మాయకతీతమైనది. (20) నా కంటె పరమైన ప్రాణిలేదు. నన్ను తెలిసికొని ముక్తిని పొందును. ప్రపంచములో స్థావర జంగమాత్మకమైనది ఏదియు నిత్యము లేదని తెలిసికొనుడు. (21) అవ్యక్తుడను, ఆకాశరూపుడను, మహేశ్వరుడను అగు నన్ను విడిచి నిత్యమేదియులేదు. ఆ నేను సమస్త విశ్వమును సృజింతును మరల సంహరించుచుందును. (22) మాయీ మాయామయో దేవః కాలేన సహ సఙ్గతః | మత్సన్నిధా వేష కాలః కరోతి సకలం జగత్ | నియోజ యత్యనన్తాత్మా హ్యేత ద్వేదానుశాసనమ్ || || 23 || ఇతి శ్రీ కూర్మపురాణ ఉత్తరార్థే ఈశ్వర గీత సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే ఋషి వ్యాస సంవాదే తృతీయో೭ధ్యాయః మాయామయుడు, మాయలు కలవాడు నగు ఈశ్వరుడు కాలముతో కలియగా, ఈ కాలము నా సన్నిధిలో సకల లోకమును సృజించును. అనంతాత్మస్వరూపుడగు భగవంతుడు సమస్తమును నియమించును ఇది వేదములయందు చెప్పబడిన అనుశాసనము. శ్రీ కూర్మపురాణము ఉత్తరార్థములో ఈశ్వరగీతోపనిషత్తునందు, బ్రహ్మవిద్యయగు యోగశాస్త్రములో ఋషివ్యాససంవాదమను తృతీయాధ్యాయము సమాప్తము.