Sri Koorma Mahapuranam
Chapters
పంచమాధ్యాయః వ్యాస ఉవాచ :- ఏతావ దుక్త్వా భగవాన్ యోగినాం పరమేశ్వరః | ననర్త పరమం భావ మైశ్వరం సంప్రదర్శయన్ ||
|| 1 || తం తే దదృశు రీశానం తేజసాం పరమం నిధిమ్ | నృత్యమానం మహాదేవం విష్ణునా గగనేమలే ||
|| 2 || యం విదు ర్యోగతత్త్వజ్ఞా యోగినో యతమానసాః | త మీశం సర్వభూతానా మాకాశే దదృశుః కిల ||
|| 3 || యస్య మాయమయం సర్వం యేనేదం ప్రేర్యతే జగత్ | నృత్యమాన స్స్వయం విపై#్ర ర్విశ్వేశః ఖలు దృశ్యతే ||
|| 4 || యత్పాదపంకజం స్మృత్వా పురుషో೭జ్ఞానజం భయమ్ | జహాతి నృత్యమానం త భూతేశం దదృశుః కిల ||
|| 5 || ఐదవ అధ్యాయము యోగులకు పరమేశ్వరుడగు శంకరభగవానుడింతవరకు చెప్పి, తన పరమఐశ్వర్యమును ప్రదర్శింపుచు, నృత్యము చేసెను. తేజోనిధి అయిన ఈశ్వరుని ఆకాశమున నృత్యము చేయుచుండగా విష్ణువుతో కలిసి దేవతలు, జితేంద్రియులైన యోగులు, యోగతత్త్వము చక్కగా తెలిసినవారు చూచిరి. సకల జగత్తు ఎవని మాయా రూపముగా ఆవిర్భవించునో, ఎవని సంకల్పముతో ప్రవర్తించునో, అట్టి విశ్వేశ్వరుడు నృత్యము చేయుచు స్వయముగా బ్రాహ్మణోత్తములకు సాక్షాత్కరించెను. జీవుడు ఏ శివుని పాదపద్మములను స్మరించి, అజ్ఞానమువలన కలుగు భయమును తొలగించుకొనునో, అట్టి భూతేశుడు నృత్యము చేయుచుండగా వారందరు చూడగలిగిరి. (1-5) యం వినిద్రా జితాశ్వాసాః శాంతా భక్తిసమన్వితాః | జ్యోతిర్మయం ప్రపశ్యన్తి స యోగీ దృశ్యతే కిల ||
|| 6 || యో೭జ్ఞానా న్మోచయేత్ క్షిప్రం ప్రసన్నో భక్తవత్సలః | త మేవ మోచకం రుద్ర మాకాశే దదృశుః పరమ్ ||
|| 7 || సహస్రశిరసం దేవం సహస్రచరణాకృతిమ్ | సహస్రబాహుం జటిలం చంద్రార్థకృతశేఖరమ్ ||
|| 8 || వసానం చర్మ వైయ్యాఘ్రం శూలాసక్తమహాకరమ్ | దండపాణిం త్రయీనేత్రం సూర్యసోమాగ్నిలోచనమ్ ||
|| 9 || బ్రహ్మాండం తేజసా స్వేన సర్వ మావృత్య చ స్థితమ్ | దంష్ట్రాకరాళం దుర్ధర్షం సూర్యకోటిసమప్రభమ్ || || 10 || అణ్డస్థం చాణ్డబాహ్యస్థం బ్రాహ్మ మభ్యంతరం పరమ్ | సృజన్త మనలజ్వాలం దహంత మఖిలం జగత్ || నృత్యన్తం దదృశుః దేవం విశ్వకర్మాణ మీశ్వరమ్ || || 11 || మహాదేవం మహాయోగం దేవానామపి దైవతమ్ | పశూనాం పతి మీశానం జ్యోతిషాం జ్యోతి రవ్యయమ్ || || 12 || పినాకినం విశాలాక్షం భేషజం భవరోగిణాం | కాలాత్మానం కాలకాలం దేవదేవం మహేశ్వరమ్ || || 13 || ఉమాపతిం విరూపాక్షం యోగానందమయం పరమ్ | జ్ఞానవైరాగ్యనిలయం జ్ఞానయోగం సనాతనమ్ || || 14 || శాశ్వతైశ్వర్యవివం ధర్మాధారం దురాసదమ్ | మహేన్ద్రోపేన్ద్రనమితం మహర్షిగణవందితమ్ || || 15 || ఆధారం సర్వశక్తీనాం మహాయోగేశ్వరేశ్వరమ్ | యోగినాం పరమం బ్రహ్మ యోగినం యోగవన్దితమ్ | యోగినాం హృది తిష్ఠన్తం యోగమాయాసమావృతమ్ || || 16 || క్షణన జగతో యోనిం నారాయణ మనామయం | ఈశ్వరే ణౖకతా పన్నమ పశ్యన్ బ్రహ్మ వాదినః || || 17 || నిద్రనువీడి, ప్రాణాయామ పరాయణులై, ఇంద్రియనిగ్రహము నలవరచుకొని, భక్తి కలిగినవారు మాత్రమే, జ్యోతి స్వరూపుడైన, మహా యోగేశ్వరుని చూడగలరు. అట్టి వారికే యోగేశ్వరుడు దర్శనమిచ్చును. భక్తవత్సలుడగు శివుడు ప్రసన్నుడైనచో, జీవులను త్వరగా అజ్ఞానమునుండి విడిపించును. ఇట్లు అజ్ఞానమును తొలగించురుద్రుని ఆకాశమున చూచిరి. ఆ పరమరుద్రుడు వేయి శిరములు, వేయి చేతులు కలవాడు. జటాధారి. అర్థ చంద్రుని శిరమున ఆభరణముగా కలవాడు వ్యాఘ్ర చర్మమును ధరించువాడు. పొడవైన చేతిలో శూలము ధరించువాడు. దండపాణి, వేదత్రయమును నేత్రములుగా గలవాడు. సూర్య ఛంద్రాగ్నులు నేత్రములుగా కలవాడు. సకల బ్రహ్మాండమును తన తేజస్సుతో అధిష్ఠించి యున్నవాడు, దంష్ట్రలతో భయంకరమైన వక్త్రము గలవాడు. ఇతరులచే ఓడింపబడనివాడు (చెనకబడనివాడు), కోటి సూర్యులతో సమానమగు కాంతిగలవాడు. అగ్ని జ్వాలలను సృజించి అఖిల జగత్తును దహించువాడు. సకల జగత్తును సృజించువాడగు ఈశ్వరుని నృత్యము చేయుచుండగా చూచిరి. ఈ పరమేశ్వరుడు, మహాదేవుడు, మహా యోగస్వరూపుడు, దేవతలకు కూడ దేవత, పశుపతి, నిఖిల జగచ్ఛాసకుడు, ఆనందరూపుడు, జ్యోతిస్వరూపుడు, నాశములేనివాడు, ధనువును ధరించినవాడు, విశాలనేత్రుడు, సంసారవ్యాధిగ్రస్తులకు దివ్యౌషధము, కాలస్వరూపుడు, యమునికి యముడు, దేవదేవుడు, మహేశ్వరుడు, ఉమాపతి, విశాలనేత్రుడు, యోగరూపుడు, పరమానందరూపుడు, జ్ఞాన వైరాగ్యనిలయుడు, జ్ఞానయోగమును శరీరముగా కలవాడు, సనాతనుడు. ఉత్పత్తి నాశములు లేని ఐశ్వర్య వైభవములు కలవాడు. ధర్మమునకు ఆధారభూతుడు. అందరానివాడు. మహేంద్ర ఉపేంద్రాదులతో, మహర్షిగణములతో నమస్కరింపబడువాడు. యోగుల హృదయములో నివసించువాడు. యోగమాయచే ఆవరించబడి యున్నవాడు. జగత్కారణ భూతుడు, ఆద్యంతములు లేని శ్రీ మన్నారాయణుడు క్షణములో ఈశ్వరునిలో ఐక్యము పొందుటను బ్రహ్మవాదులైన ఋషులు చూడగలిగిరి. (6-17) దృష్ట్వా తథైశ్వరం రూపం రుద్రనారాయణాత్మకం | కృతార్థం మేనిరే సన్తః స్వాత్మానం బ్రహ్మవాదినః || || 18 || సనత్కుమారః సనకో భృగు శ్చ సనాతన శ్చైవ సనన్దన శ్చ | రుద్రో೭ఙ్గిరా వామదేవో೭థ శుక్రో మహర్షి రత్రిః కపిలో మరీచిః || || 19 || దృష్ట్వాథ రుద్రం జగదీశితారం తం పద్మనాభాశ్రితవామభాగమ్ | ధ్యాత్వా హృదిస్థం ప్రణిపత్య మూర్ధ్నా బద్ధ్వాంజలిం స్వేషు శిరఃసు భూయః || || 20 || నారాయణస్వరూపుడైన పరమేశ్వరుని చూచిన బ్రహ్మవాదులు తమనుతాము కృతార్థులుగ తలచిరి. సనత్కుమారుడు, సనకుడు, భృగువు, సనాతనుడు, సనన్దనుడు, రుద్రుడు ఆంగిరసుడు, వామదేవుడు, శుక్రుడు, అత్రి, కపిల, మరీచి మహర్షులు అందరు జగచ్ఛాసకుడగు రద్రుని వామభాగమున నారాయణుడు నివసించియున్న స్వరూపమును చూచి, హృదయమున నిలుపుకొని, ధ్యానముచేసి, శిరసుతో ప్రణమిల్లి, తమ శిరములయందు దోసిలొగ్గి, ఓంకారమును ఉచ్చరించి, హృదయమున నివసించియున్న ఆదిదేవుని సాక్షాత్కరించుకొని పరిపూర్ణానందము నిండిన మనసుకలవారై వేదమయములగు వాక్కులతో ఇట్లు స్తుతించసాగిరి. త్వా మేక మీశం పురుషం పురాణం ప్రాణశ్వరం రుద్ర మనన్తయోగమ్ | నమామ సర్వే హృది సంనివిష్టం ప్రచేతసం బ్రహ్మమయం పవిత్రమ్ || || 22 || త్వాం పశ్యంతి మునయో బ్రహ్మయోనిం దాన్తాః శాన్తాః విమలం రుక్మవర్ణమ్ | ధ్యాత్వాత్మస్థమచలం స్వే శరీరే కవిం పరేభ్యః పరమం తత్పరం చ || || 23 || త్వత్తః ప్రసూతా జగతః ప్రసూతిః సర్వాత్మభూ స్త్వం పరమాణుభూతః | అణూ రణీయాన్ మహతో మహీయాం స్త్వామేవ సర్వం ప్రవదన్తి సన్తః || || 24 || తామొక్కరే ఈశ్వరులు, పురాణపురుషులు, ప్రాణశ్వరులు అనంత యోగ స్వరూపులు. మునులు, హృదయమున అధివసించివాని, సకల జగత్తునకు చైతన్యమును ప్రసాదించువాని, పవిత్రుడగు బ్రహ్మ స్వరూపుడగు రుద్రుని సమస్కరించుచున్నాము. బాహ్యేంద్రియములను అతరింద్రియములను వశములో నుంచుకొనినవారు ధ్యానము గావించుచు తమశరీరమును నిశ్చలుని పావనుని, హిరణ్యవర్ణుని, బ్రహ్మకు కూడ కారణ భూతుని పరులందరికంటే పరుని ఆఖిలదర్శనుడగు తమను చూచుచుందురు. సకలజగత్ సృష్టి నీ నుండి జరిగినది. అందరికి ఆత్మవు నీవే. నీవు పరమాణురూపుడవు. సత్పురుషులు నిన్ను పెద్ద వాడి కంటె పెద్దవానిగా చిన్నవాడికంటే చిన్నవానిగా చెప్పుచుందురు. (22-24) హిరణ్యగర్భో జగదంతరాత్మా త్వత్తో೭ధి జాతః పురుషః పురాణః | సంజాయామానో భవతా విసృష్టో యథావిధానం సకలం ససర్జ || || 25 || త్వత్తో వేదాః సకలాః సమ్ర్పసూతా స్త్వయ్యే వాన్తే సంస్థితిం తే లభంతే | పశ్యామ స్త్వాం జగతో హేతుభూతం నృత్యన్తం స్వే హృదయే సంనివిష్టమ్ || || 26 || త్వయై వేదం భ్రామ్యతే బ్రహ్మచక్రమ్ మాయావీ త్వం జగతా మేకనాధః | నమామ స్త్వాం శరణం సమ్ర్పపన్నా యోగాత్మానం పరమాకాశమధ్యే || || 27 || నృత్యన్తం తే మహిమానం స్మరామః సర్వాత్మానం బహుధా సంనివిష్టం | బ్రహ్మానంద మనుభూయానుభూయ || || 28 || సకల జగ్తునకంతరాత్మ పురాణపురుషుడగు హిరణ్యగర్భుడు (చతుర్ముఖ బ్రహ్మ) నీ వలన పుట్టెను. నీచేత సృజించబడగా పుట్టిన ఆ బ్రహ్మ విధిననుసరించి సకల జగత్తును సృజించెను. సకల వేదములు నీవలననే వెలువడినవి. ప్రళయ కాలమున నీలోనే నిలుచును. జగత్కారణ భూతుడవు. మా హృదయములలో అధివసించి యున్న నృత్యము చేయుచున్న నిన్ను చూచుచున్నాము. సకల బ్రహ్మ చక్రమును (కాల) తామే తిప్పుచున్నారు. తాము పరమ మాయావులు. సకల ప్రపంచమునకు ఏకమాత్ర అధినాయకులు. నిన్ను శరణు పొంది నమస్కరించుచున్నాము. యోగరూపుడవు, చిత్పతివి, దివ్యనృత్యమును చేయుచున్న నిన్ను పరమాకాశమధ్యమున చూచుచున్నాము. నీ మహిమనుస్మరించుచున్నాము. సర్వస్వరూపుడవు అనేక రూపములతో అధివసించు నిన్ను పలుమార్లు అనుభవించుచున్నాము. (26-28) ఓంకార స్తే వాచకో ముక్తిబీజం త్వ మక్షరం ప్రకృతౌ గూఢరూపమ్ | తత్త్వాం సత్యం ప్రవద న్తీహ సన్తః స్వయంప్రభం భవతో యత్ప్రకాశం || || 29 || స్తువంతి త్వాం సతతం సర్వవేదాః నమన్తి త్వా మృషయః క్షీణదోషాః | శాంతాత్మానః సత్యసంధా వరిష్ఠం - విశన్తి త్వాం యతయో బ్రహ్మవిష్ఠాః || || 30 || నిన్ను చెప్పుముక్తి బీజము ఓంకారము. ప్రకృతిలో రహస్యముగా నివసించువాడవు. నాశములేనివాడవు. నీ ప్రకాశము సహజముగా వెలువడినది. అట్టి నిన్ను సజ్జనులు సత్యమూర్తిగా చెప్పుచుదురు. అన్ని వేదములు నిన్ను స్తుతించుచున్నవి. దోషరహితులగు ఋషులు నిన్ను నమస్కరించుచున్నారు. శాంతస్వభావులు సత్యసంధులు బ్రహ్మ నిష్ఠులగు యతులు శ్రేష్ఠ తముడవగు నీలో చేరెదరు. (29-30) ఏకో వేదో బహుశాఖో హ్యనన్త స్త్వా మేవైకం బోధయం త్యేకరూపమ్ | వేద్యం త్వాం శరణం యే ప్రపన్నా స్తేషాం శాన్తిః శాశ్వతీ నేతరేషామ్ || || 31 || భవా నీశో೭నాదిమాం స్తేజోరాశి ర్బ్రహ్మా విశ్వం పరమేష్ఠీ వరిష్ఠః | స్వాత్మానంద మనుభూయా ధిశేతే స్వయంజ్యోతి రచలో నిత్యముక్తః || || 32 || ఏకో రుద్ర స్త్వం కరోషీహ విశ్వం త్వం పాలయ స్యఖిలం విశ్వరూపః | త్వ మేవాన్తే నిలయం విన్దతీదం నమామ స్త్వాం శరణం సమ్ప్రపన్నాః || || 33 || పలుశాఖలు కలది అనన్తమగు ఒకేవేదము నిన్నొక్కనినే ఒకేరూపుగలవానిగా బోధించుచున్నది. తెలియదగిన నిన్ను శరణు వేడిన వారికి మాత్రమే శాశ్వతమగు శంతి లభించును. ఇతరులకు లభించదు. నీవే ఈశ్వరుడవు ఆదిలేని వాడవు తేజోరాశివి, బ్రహ్మవు విశ్వరూపుడవు పరమేష్ఠివి శ్రేష్ఠతముడవు ఆత్మానందానుభవముతో శయనించియుందువు. స్వయం ప్రకాశుడవు. నిశ్చలుడవు నిత్యముక్తుడవు. నీ వొక్కడవే రుద్రుడవు. విశ్వమును సృజించుచున్నావు. విశ్వరూపుడవై ఆ విశ్వమును పాలించుచున్నావు. ప్రళయకాలమున సకల ప్రపంచము నీలోనే లీనమగును. నిన్ను శరణు పొందినమేము నీకు నమస్కరించుచున్నాము. (31-33) త్వా మేక మాహుః కవి మేకరుద్రం ప్రాణం బృహన్తం హరి మగ్ని మీశం | ఇంద్రం మృత్యు మనిలం చేకితానం ధాతార మాదిత్య మనేకరూపమ్ || || 34 || త్వ మక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ | త్వ మవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతన స్త్వం పురుషోత్తమో೭సి || || 35 || త్వ మేవ విష్ణు శ్చతురానన స్త్వం త్వమేవ రుద్రో భగవా నధీశః | త్వం విశ్వనాభిః ప్రకృతిః ప్రతిష్ఠా సర్వేశ్వర స్త్వరం పరమేశ్వరో೭సి. || 36 || తమను అద్వితీయునిగా కవిగా అద్వితీయరుద్రునిగా, సకల ప్రాణ భూతునిగా, హరిగా అగ్నిగా ఈశ్వరునిగా ఇంద్రునిగా, మృత్యువుగా, వాయువుగా, సర్వవ్యాపకునిగా సర్వమును ధరించువానిగా, సూర్యునిగా బహురూపునిగా చెప్పుచుందురు. నీవు నాశరహితునివి. పరమాత్మవు. తెలియదగినవానివి. ఈ సకలప్రపంచమునకు పరమాశ్రయభూతుడవు. నాశరహితుడవు. సర్వకాలములందు అనాదియగు ధర్మమును రక్షించువాడవు. నీవు సనాతనుడవు. నీవే పురుషోత్తముడవు. నీవే విష్ణువు నీవే బ్రహ్మవు నీవే రుద్రుడవు. అధీశ్వరుడవు నీవే విశ్వమునకు మూలము. నీవే ప్రకృతివి; నీవే ప్రతిష్ఠ సర్వేశ్వరుడవు నీవే. పరమేశ్వరుడవు నీవే. (34-36) త్వా మే క మాహుః పురుషం పురాణ మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ | చిన్మాత్ర మవ్యక్త మచింత్యరూపమ్ ఖం బ్రహ్మశూన్యం ప్రకృతిం నిర్గుణం చ || || 37 || యదంతరా సర్వ మిదం విభాతి య దవ్యయం నిర్మల మేకరూపమ్ | కి మప్య చిన్త్యం తవ రూప మేతత్ తదన్తరా య త్ర్పతిభాతి తత్త్వమ్ || || 38 || నీవొక్కడవే పురాణపురుషుడవు. సూర్యసమానవర్ణుడవు అజ్ఞానమునకు అందనివాడవు. జ్ఞానపుంజమవు. తెలియబడని వాడవు. చింతించలేని రూపుగలవాడవు. ఆకాశము, బ్రహ్మ, శూన్యము, ప్రకృతి రూపుడవు నిర్గుణుడవు. ఈ సకలజగత్తునీలోనే భాసించుచుండును. నీవు అవ్యయుడవు. పరిశుద్ధుడవు. ఏకరూపుడవు. అనగా మార్పులేనివాడవు. నీ రూపము మా బుద్ధికి అందదు. నీలోనే ఈ సకల తత్త్వము భాసించును. (37-38) యోగేశ్వరం రుద్ర మనంతశక్తిం పరాయణం బహుతనుం పవిత్రమ్ | నమామ సర్వే శరణార్థిన స్త్వాం ప్రసీద భూతాధిపతే మహేశ || || 39 || త్వత్పాదపద్మస్మరణా దశేషసంసారబీజం విలయం ప్రయాతి | మనో నియమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయామో వయ మేక మీశమ్ || 40 || నమో భవాయాస్తు భవూద్భవాయ కాలాయ సర్వాయ హరాయ తుభ్యమ్ | నమోస్తు రుద్రాయ కపర్దినే తే నమో೭గ్నయే దేవ నమః శివాయ || || 41 || యోగేశ్వరుడవు రుద్రుడవు అనన్త శక్తివి, పరమాధార భూతుడవు బ్రహ్మరూపుడవు పవిత్రుడవగు నిన్ను శరణు కోరు మేమందరము నమస్కరించుచున్నాము. భూతపతీ మహేశా! మాయెడ ప్రసన్నుడవు కమ్ము! నీ పాదపద్మములను స్మరించుట వలన సకల సంసార భీజములు నశించును. మనస్సు నిగ్రహించుకొని, శరీరమును వశపరచుకొని ఏకమాత్ర ఈశుడవగునిన్ను ప్రసన్నుని చేసుకొనుచున్నాము. సంసార రూపునకు, సంసారమును సృజించువానికి కాలరూపునకు, సర్వ రూపునకు నమస్కారము. రుద్రునికి జటాజూట ధరునికి, అగ్నికి శివునకు నమస్కారము. (39-41) తతః స భగవాన్ దేవః కపర్దీ వృషవాహనః | సంహృత్య పరమం రూపం ప్రకృతిస్థో೭భవత్ భవః | || 42 || తే భవం భూతభ##వ్యేశం పూర్వవత్ సమవస్థితమ్ | దృష్ట్వా నారాయణం దేవం విస్మితా వాక్య మబ్రువన్ || || 43 || అంతట మునులస్తోత్రమును వినిన జటాజూట ధారి వృషభ వాహనుడు జ్ఞానదదిషాడ్గుణ్యయుక్తుడగు మహాదేవుడు విశ్వరూపమును ఉపసంహరించి సహజరూపునిగా నిలిచెను. భూత భ##వ్యేశుని భవుని నారాయణుని ఎప్పటిలా ఉన్నవానిని చూచిన మునులు ఆశ్చర్యముతో ఇట్లు పలికిరి. (42-43) భగవన్ భూతభ##వ్యేశ గోవృషాంకితశాసన | దృష్ట్వా తే పరమం రూపం నిర్వృతాః స్మ సనాతన || || 44 || భవత్ర్పసాదా దమలే పరస్మిన్ పరమేశ్వరే | అస్మాకం జాయతే భక్తి స్త్వయ్యేవా వ్యభిచారిణీ || || 45 || ఇదానీం శ్రోతు మిచ్ఛామో మాహాత్మ్యం తవ శంకర | భూయోపి తవ యన్నిత్యం యాధాత్మ్యం పరమేష్ఠినః || || 46 || భగవాన్ భూతభ##వ్యేశ! సత్యధర్మములను సంరక్షించువాడా. సనాతనా. నీ విశ్వరూపమును చూచి పరమానందమును పొందితిమి. మీ అనుగ్రహము వలన పరిశుద్దుడవు పరుడవు పరమేశ్వరుడవు అగు నీ యందు అనన్యమగు భక్తి ఏర్పడును. ఇపుడు నీ మాహాత్మ్యమును నిత్యము యధార్థమగు వైభవమును వినగోరుచున్నాము. (44-46) స తేషాం వాక్య మాకర్ణ్య యోగినాం యోగసిద్ధిదః | ప్రాహ గంభీరయా వాచా సమాలోక్య చ మాధవమ్ || || 47 || ''ఇతిశ్రీకూర్మపురాణ ఉత్తరార్థే పంచమాధ్యాయః'' యోగసిద్ధిని ప్రసాదించు శంకరుడు ఆయోగులమాటలనువిని శ్రీమహావిష్ణువునుచూచి గంభీరమగు వాక్కుతో ఇట్లు పలికెను. ఇది శ్రీ కూర్మపురాణమున షట్ సాహస్రిలో ఉత్తర భాగమున ఈశ్వర గీతలలో 5వ అధ్యాయము