Sri Koorma Mahapuranam    Chapters   

షష్ఠోధ్యాయః

ఈశ్వర ఉవాచ :-

శృణుధ్వం ఋషయః సర్వే యథావత్‌ పరమేష్ఠినః | వక్ష్యామీశస్య మాహాత్మ్యం యత్త ద్వేదవిదో విదుః || || 1 ||

ఆరవ అధ్యాయము

ఈశ్వరుడు పలికెను -

ఓ ఋషులారా. వేదవిదులు మాత్రమే తెలియు పరమేశ్వరుని యధార్థమగు ప్రభావమును చెప్పెదను వినుడు. (1)

సర్వలోకైకనిర్మాతా సర్వలోకైకరక్షితా | సర్వలోకైకసంహర్తా సర్వాత్మా హం సనాతనః || || 2 ||

సర్వేషా మేవ వస్తూనా మన్తర్యామీ పితా హ్యహమ్‌ | మధ్యే చాన్తః స్థితం సర్వం నాహం సర్వత్ర సంస్థితః || || 3 ||

నేనొక్కడిని అన్ని లోకములను సృజించువాడను. నేనొక్కడినే అన్ని లోకములను రక్షించువాడను. నేనొక్కడినే సకల లోకములను సంహరించువాడను. నేను సర్వరూపుడను సనాతనుడను. నేను అన్ని వస్తువులకు అంతర్యామిని, జనకుడను. నాలోనే సకల వస్తువుల ఆదిమధ్యాంతములుండును. నాకు ఇతరమేదీ ఆధారముకాదు. (2, 3)

భవద్భి రద్భుతం దృష్టం యత్స్వరూపం తు మామకమ్‌ | మమైషా హ్యుపమా విప్రా మాయయా దర్శితా మయా || || 4 ||

సర్వేషామేవ భావానామన్తరా సమవస్థితః | ప్రేరయామి జగత్‌ కృత్స్నం క్రియా శక్తి రియం మమ || || 5 ||

యయేదం చేష్టతే విశ్వం తత్స్వభావానువర్తి చ | సోహం కాలో జగత్‌ కృత్స్నం ప్రేరయామి కలాత్మకమ్‌ || || 6 ||

ఇపుడు మీరందరు చూచిన అద్భుతమగు నా విశ్వరూపము ఇది కేవలము. నాకు ప్రతీకగా నామాయతో చూపితిని. అన్ని వస్తువులకు అంతర్యామిగా నేనుందును. నా క్రియాశక్తియే సకల జగత్తును ప్రేరేపించును. ఈ సకల ప్రపంచమును నడిపించు, అనుసరింప చేయు కాలమును నేనే. నా అంశరూపమగు సకల జగత్తును నేనే ప్రేరూపించెదను. (4-6)

ఏకాంశేన జగత్‌ కృత్స్నం కరోమి మునిపుంగవాః | సంహరా మ్యేకరూపేణ ద్విధావస్థా మమైవ తు || || 7 ||

ఆదిమధ్యాంతనిర్ముక్తో మాయాతత్త్వ ప్రవర్తకః | క్షోభయామి చ సర్గాదౌ ప్రదానపురుషా వుభౌ || || 8 ||

తాభ్యాం సంజాయతే విశ్వం సంయుక్తాభ్యాం పరస్పరమ్‌ | మహదాదిక్రమేణౖవ మమ తేజో విజృంతే || || 9 ||

యో హి సర్వజగత్సాక్షీ కాలచక్రప్రవర్తకః | హిరణ్యగర్భో మార్తాండః సోపి మద్దేహసమ్భవః || || 10 ||

ఈ సకల జగత్తును ఏకాంశతో సృజించెదను. అట్లే ఒకే అంశతో సంహరించెదను. ఇట్లు సృష్టి సంహారావస్థలు రెండూ నావే. నేను ఆది మధ్యాంతములు లేనివాడను. మాయాతత్త్వమును ప్రవర్తింపచేయు నేను. సృష్టి ప్రారంభమున ప్రకృతి పురుషులను క్షోభింప చేయుదును. (ప్రేరూపించెదను) ఇట్లు పరస్పరము ప్రకృతి పురుషుల సంయోగము వలన ప్రపంచము పుట్టును. ప్రకృతి నుండి మహత్తత్త్వము, మహత్తత్త్వము నుండి అహంకారము ఇట్లు ఈ క్రమముననుసరించి నా తేజస్సే జగద్రూపముగా విస్తరించును. సర్వజగత్తునకు సాక్షిభూతుడు కాలచక్ర ప్రవర్తకుడు హిరణ్య గర్భుడగు మార్తాండుడు (సూర్యుడు) కూడా నా దేహమునుండి పుట్టినవాడే. (7-10)

తసై#్మ దివ్యం స్వమైశ్వర్యం జ్ఞానయోగం సనాతనమ్‌ | దత్తవా నాత్మజాన్‌ వేదాన్‌ కల్పాదౌ చతురో ద్విజాః || || 11 ||

స మన్నియోగతో దేవో బ్రహ్మా మద్భావభావితః | దివ్యం త న్మామకైశ్వర్యం సర్వదా వహతి స్వయమ్‌ || || 12 ||

స సర్వలోకనిర్మాతా మన్నియోగేన సర్వవిత్‌ | భూత్వా చతుర్ముఖః సర్గం సృజ త్యేవాత్మసమ్భవః || || 13 ||

యోపి నారాయణోనన్తో లోకానాం ప్రభవావ్యయః | మమైవ పరమా మూర్తిః కరోతి పరిపాలనమ్‌ || || 14 ||

కల్పాదియందు ఆసూర్యభగవానునకు నాదివ్యమగునది సనాతనమగు జ్ఞానయోగమును నానుండి వెలువడిన నాలుగు వేదములను కూడా ఇచ్చితిని, ఇట్లు ఆహిరణ్య గర్భుడు ఎపుడు నాదివ్యైశ్వరమును ధరించి యుండును. నాభావముతో ప్రేరేపింపబడి చతుర్ముఖుడై సకల లోకములను సృజించును. సకలలోకములను సృజించి సమయింపజేయువాడు అనన్తుడగు నారాయణుడు కూడా నా పరమమూర్తియే సకల లోకములను పాలించుచుండును. (11-14)

యోన్తకః సర్వభూతానాం రుద్రః కాలాత్మకః ప్రభుః | మదాజ్ఞయా సౌ సతతం సంహరిష్యతి మే తనుః || || 15 ||

హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాశినా మపి | పాకం చ కురుతే వహ్నిః సోపి మచ్ఛక్తిచోదితః || || 16 ||

భుక్త మాహారజాతం చ పచతే తదహర్నిశమ్‌ | వైశ్వానరోగ్నిర్భగివా నీశ్వరస్య నియోగతః || |7 ||

యోపి సర్వాంభసాం యోని ర్వరుణో దేవపుంగవః | సోపి సంజీవయేత్‌ కృత్స్న మిశ్వరస్య నియోగతః || || 18 ||

యోన్తస్తిష్ఠతి భూతానాం బర్హిదేవః ప్రభంజనః | మదాజ్ఞయా సౌ భూతానాం శరీరాణి బిభర్తిహి || || 19 ||

యోపి సంజీవనో నౄణాం దేవానా మమృతాకరః | సోమః స మన్నియోగేన చోదితః కిల వర్తతే || || 20 ||

సకల ప్రాణులను అంతము చేయు కాలస్వరూపుడగు రుద్రుడు నా ఆజ్ఞతోనే లోకములను సంహరింప చేయును. అగ్నిహోత్రుడు కూడా నా ఆజ్ఞతోనే హవ్యమును దేవతలకు, కవ్యమును పితృదేవతలకు అందచేయును. అన్నింటిని పక్వము చేయును. రాత్రింవళ్ళు ప్రాణులు భుజించు ఆహారమును వైశ్వానర నామముతో జీర్ణము చేయును. సకల జలములకు మూలకారణమగు వరుణుడు కూడా ఈశ్వరుని ఆజ్ఞవలననే సకల జగత్తును జీవింపచేయుచున్నాడు. అఖిల ప్రాణులకు లోపల వెలుపల ఉండి శరీరములను నా ఆజ్ఞతోనే వాయువు నిలుపును. మానవులను బ్రితికించు వాడు దేవతలకు అమృతము నిచ్చువాడగు చంద్రుడు నా ఆజ్ఞతో ప్రేరూపించబడియే ప్రవర్తించుచున్నాడు. (15-20)

యః స్వభాసా జగత్‌ కృత్స్నం ప్రకాశయతి సర్వదా | సూర్యో వృష్టిం వితనుతే శాస్త్రేణౖవ స్వయంభువః || || 21 ||

యోప్యశేషజగచ్ఛాస్తా శక్రః సర్వామరేశ్వరః | యజ్జ్వనాం ఫలదో వేదో వర్తతేసౌ మదాజ్ఞయా || || 22 ||

యః ప్రశాస్తా హ్యసాధూనాం వర్తతే నియమా దిహ | యమో వైవస్వతో దేవూ దేవదేవనియోగతః || || 23 ||

యోపి సర్వధనాధ్యక్షో ధనానాం సమ్ర్పదాయకః | సోపీశ్వరనియోగేన కుబేరో వర్తతే సదా || || 24 ||

యః సర్వరక్షసాం నాధ స్తామసానాం ఫలప్రదః | మన్నియోగా దసౌ దేవో వర్తతే నతిః సదా || || 25 ||

తనకాంతితో అన్నివైపులా ప్రకాశింప చేయుచు వర్షమును అందించు సూర్య భగవానుడుకూడా నా ఆజ్ఞతోనే ప్రవర్తించుచున్నాడు. మూడు లోకములను పాలించు సకల దేవతాధిపతియగు ఇంద్రుడు నా ఆజ్ఞతోనే యజ్ఞము చేయువారికి ఫలమునిచ్చుచున్నాడు. ''పాపులను శాసించుయముడు కూడా నా ఆజ్ఞనే పాలించుచున్నాడు''. సర్వధనాధ్యక్షుడగు కుబేరుడు ఈశ్వరుని ఆజ్ఞతోనే అందరికి ధనము నొసంగుచున్నాడు. సకల రాక్షసాధిపతి, తమోగుణులకు ఫలప్రదుడగు నిర్‌ ఋతికూడా నా ఆజ్ఞనే పాలించుచున్నాడు. (21-25)

వేతాలగణభూతానాం స్వామీ భోగఫలప్రదః | ఈశానః కిల భక్తానాం సోపి తిష్ఠ న్మమాజ్ఞయా || || 26 ||

యో వామదేవోఙ్గిరసః శిష్యో రుద్రగనాగ్రణీం | రక్షకో యోగినాం నిత్యం వర్తతేసౌ మదాజ్ఞయా || || 27 ||

య శ్చ సర్వజగత్పూజ్యో వర్తతే విఘ్న కారకః | వినాయకో ధర్మనేతా సోపి మద్వచనాత్‌ కిల || || 28 ||

యోపి బ్రహ్మవిదాం శ్రేష్ఠో దేవసేనాపతిః ప్రభుః | స్కందోసౌ వర్తతే నిత్యం స్వయంభూర్విధి చోదితః || || 29 ||

యే చ ప్రజానాం పతయో మరీచ్యాద్యా మహర్షయః | సృజన్తి వివిధం లోకం పరసై#్యవ నియోగతః || || 30 ||

భూత భేతాలులకు అధిపతి భక్తులకు భోగరూపమగు ఫలములను ప్రదానము చేయు ఈశానదేవుడు కూడా నా ఆజ్ఞతో ప్రవర్తించును. అంగిరసుని శిష్యుడు రుద్రుని గనములలో అగ్రగణ్యుడగు యోగిరక్షకుడగు వామదేవుడు కూడా నా ఆజ్ఞతోనే వ్యవహరించును. విఘ్నకారకుడు సర్వ జగత్పూజ్యుడగు వినాయకుడు కూడా నా ఆజ్ఞతో ధర్మమును కాపాడుచున్నాడు. బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు దేవసేనాపతియగు కుమారస్వామి కూడా విధిచేత ప్రేరేపించబడియే ప్రవర్తించుచున్నాడు. ప్రజాపతులగు మరీచ్యాది మహర్షులు కూడా పరమాత్మ ఆజ్ఞతోనే పలులోకములను సృజించుచున్నారు. (26-30)

యా చ శ్రీః సర్వ భూతానాం దదాతి విపులాం శ్రియమ్‌ | పత్నీ నారాయణస్యాసౌ వర్తతే మదనుగ్రహాత్‌ || || 31 ||

వాచం దదాతి విపులాం యా చ దేవీ సరస్వతీ | సాపీ శ్వరనియోగేన చోదితా సమ్ర్పవర్తతే || || 32 ||

యాశేషపురుషాన్‌ ఘోరా న్నరకాత్‌ తారయిష్యతి | సావిత్రీ సంస్మృతా దేవీ దేవాజ్ఞానువిధాయినీ || || 33 ||

పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యాప్రదాయినీ | యాపి ధ్యాతా విశేషేణ సాపి మద్వచనానుగా || || 34 ||

యోనన్తమహిమా నన్తః శేషోశేషామరప్రభుః | దధాతి శిరసా లోకం సోపి దేవనియెగతః || || 35 ||

శ్రీ మన్నారాయణుని పత్నియగు శ్రీదేవి అన్ని ప్రాణులకు పుష్కలమగు సంపదనిచ్చునది నా అనుగ్రహముతోనే ప్రవర్తించుచున్నది. సకల జీవులక విస్తృతముగా వాక్కును ప్రసాదించు సరస్వతి కూడా ఈశ్వరాజ్ఞచే ప్రేరేపించడియే ప్రవర్తించుచున్నది. సకల జీవులను ఘోరనరకము నుండి తరింపజేయు సావిత్రీదేవి కూడా దేవుని ఆజ్ఞను పాలించునదే. పరమదేవి బ్రహ్మవిద్యా ప్రదాయిని యగు పార్వతీదేవి అఖిల జనులచే ధ్యానించబడునది నావచనమునను సరించునదే.

అఖిల మహిమలు కలవాడు సకల దేవతలకు అధిపతి ఆదిశేషుడు కూడా దేవుని ఆజ్ఞచే అఖిల లోకములను శిరసుతో ధరించుచున్నాడు. (31-35)

యోగ్నిః సర్వాత్మకో నిత్యం బడబారూపసంస్థితః | పిబ త్యఖిల మంభోధి మీశ్వరస్య నియోగతః || || 36 ||

యే చతుర్దశ లోకేస్మిన్‌ మనవః ప్రథితౌజసః | పాలయన్తి ప్రజాః సర్వాస్తేపి తస్య నియోగతః || || 37 ||

ఆదిత్యా వసవో రుద్రాః మరుత శ్చ తథాశ్వినౌ | అన్యా శ్చ దేవతాః సర్వా మచ్ఛాస్త్రేణౖవ సుస్థితాః || || 38 ||

గంధర్వా గరుడా ఋక్షాః సిద్ధాః సాధ్యాశ్చ చారణాః | యక్ష రక్షః పిశాచాశ్చ స్థితాః శాస్త్రే స్వయంభువః || || 39 ||

కలా కాష్ఠ నిమేషాశ్చ ముహూర్తా దివసాః క్షపాః | ఋతవః పక్షమాసాశ్చ స్థితాః శాస్త్రే ప్రజాపతేః || || 40 ||

ప్రలయాగ్ని బడబాగ్ని రూపములో నున్న అగ్నికూడా ఈశ్వరాజ్ఞచేతనే సకల సముద్రజలమును త్రాగుచుండును. ఈ లోకమున సుప్రసిద్ధ తేజశ్శాలులగు పదునాలుగు మంది మనువులు కూడ ఈశ్వరాజ్ఞచేతనే ప్రజలందరిని పాలించుచున్నారు. ద్వాదశాదిత్యులు అష్టవసువులు ఏకాదశరుద్రులు సప్తమరుత్తులు అశ్వినీ దేవతలు ఇతర దేవతలందరూ నా ఆజ్ఞతోనే ప్రవర్తించుచున్నారు. గరుడ గంధర్వ ఋక్ష సిద్ధసాధ్య చారణ యక్షరాక్షస పిశాచములు కూడా స్వయంభూ శాసనమున నిలచువారే. కలాకాష్ఠ ముహూర్త నిమేష దిన రాత్రి ఋతు పక్షమాసములన్నీ ప్రజాపతి శాసనముననే ప్రవర్తించుచున్నవి. (36-40)

యుగమన్వంతరాణ్యవ మమ తిష్ఠన్తి శాసనే | పరా శ్చైవ పరార్థా శ్చ కాలభేదా స్తధాపరే || || 41 ||

చతుర్విధాని భూతాని స్థావరాణి చరాణి చ | నియోగాదేవ వర్తన్తే దేవస్య పరమాత్మనః || || 42 ||

పాతాళాని చ సర్వాణి భువనాని చ శాసనాత్‌ | బ్రహ్మాండాని చ వర్తన్తే సర్వా ణ్యవ స్వయంభువః || || 43 ||

అతీతా న్యప్య సంఖ్యాని బ్రహ్మాండాని మమాజ్ఞయా | ప్రవృత్తాని పదార్థౌఘైః సహితాని సమన్తతః || || 44 ||

బ్రహ్మాండాని భవిష్యన్తి సహ వస్తుభి రాత్మగైః | వహిష్యన్తి సదై వాజ్ఞాం పరస్య పరమాత్మనః || || 45 ||

యుగములు మన్వంతరములు నాఆజ్ఞలోనే నిలుచున్నవి. పరపరార్థములు అట్లే ఇతరకాలభేదములు జరాయుజ అండజస్వేదజ ఉద్భిజ్జములను నాలుగు విధములగు ప్రాణులు స్థావర జంగమములు పరమాత్మ యాజ్ఞతోనే ప్రవర్తించుచున్నవి. పాతాలాది సకలలోకములు అఖిల బ్రహ్మాండములు స్వయంభూ శాసనములోనే నిలుచుచున్నవి. అఖిల పదార్థములతో కూడియున్న అతీత బ్రహ్మాండములు కూడా నా ఆజ్ఞతోనే ప్రవర్తించుచున్నవి. సృజించోవు బ్రహ్మాండములు కూడా తనలోనుండు సకల వస్తువులతో పరమాత్మ ఆజ్ఞను శిరసా వహించుచున్నవి. (41-45)

భూమి రాపోనలో వాయుః ఖం మనో బుద్ధి రేవ చ | భూతాది రాదిప్రకృతిర్నియోగే మమ వర్తతే || || 46 ||

యాశేష జగతాం యోనిర్మూహినీ సర్వదేహినామ్‌ | మాయా వివర్తతే నిత్యం సాపీ శ్వరనియోగతః || || 47 ||

యో వై దేహభృతాం దేవః పురుషః పఠ్యతే పరః | ఆత్మా సౌ వర్తతే నిత్య మీశ్వరస్య నియోగతః || || 48 ||

విధూయ మోహకలిలం యయా పశ్యతి తత్‌ పదమ్‌ | సాపి విద్యా మహేశస్య నియోగవశ వర్తినీ || || 49 ||

బహునా త్ర కిముక్తేన మమ శక్త్యాత్మకం జగత్‌ | మయైవ ప్రేర్యతే కృత్స్నం మయ్యేవ ప్రలయం వ్రజేత్‌ || || 50 ||

భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి తామసాహంకారము ఆది ప్రకృతి ఇవన్నియూ నా ఆజ్ఞలోనే ప్రవర్తించుచున్నవి. సకల జగత్కారణము, సర్వ ప్రాణులను మోహింపచేయు మాయకూడా ఎల్లప్పుడూ ఈశ్వరాజ్ఞతో ప్రవవర్తించును. దేహధారులకు ఆత్మ స్వరూపుడు పరాత్పరుడు పురుషుడు దేవునిగా వ్యవహరించబడువాడు కూడా నిత్యము ఈశ్వరాజ్ఞతోనే కార్యములను నిర్వహించుచుండును. సకల మోహమును తొలగించి పరమపదమును చూపు విద్యకూడా పరమేశ్వరుని ఆజ్ఞానువర్తినిగానే యుండును. ఇంతగా చెప్పనేల. ఈ జగత్తంతయూ నా శక్తి స్వరూపమే. నా చేతనే ప్రేరేపించబడును. నాలోనే లీనమగును. (46-50)

అహం హి భగవా నీశః స్వయంజ్యోతిః సనాతనః | పరమాత్మా పరం బ్రహ్మ మత్తో హ్యన్యన్న విద్యతే || || 51 ||

ఇ త్యేతత్‌ పరమం జ్ఞానం యుష్మాకం కథితం మయా | జ్ఞాత్వా విముచ్యతే జన్తు ర్జన్మసంసారబంధనాత్‌ || || 52 ||

ఇతి శ్రీ కూర్మపురాణ ఉత్తరార్థే ఈశ్వరగీతాసూపనిషత్సు షష్ఠోధ్యాయః

నేను భగవంతుడను. ఈశ్వరుడను స్వయంప్రకాశరూపుడను. సనాతనుడను. పరమాత్మను, పరబ్రహ్మను నాకంటే భిన్నము మరియొకటి లేదు. ఇట్లు ఈ పరమజ్ఞానమును మీకు తెలిపితిని. దీనిని తెలిసినవాడు జన్మసంసార బంధమునుండి విముక్తి పొందును. (51-52)

ఇది షట్సాహస్రియగు కూర్మ పురాణమున ఉత్తరవిభాగమున (ఈశ్వరగీతలో) 6వ అధ్యాయము.

Sri Koorma Mahapuranam    Chapters