Sri Koorma Mahapuranam Chapters
సప్తమాధ్యాయః
ఈశ్వర ఉవాచ :-
శృణుధ్వ మృషయః సర్వే ప్రభావం పరమేష్ఠినః | యం జ్ఞాత్వా పురుషో ముక్తో న సంసారే పతేత్ పునః || || 1 ||
పరాత్ పరతరం బ్రహ్మ శాశ్వతం నిష్కళం ధ్రువమ్ | నిత్యానందం నిర్వికల్పం తద్ధామ పరమం మమ || || 2 ||
అహం బ్రహ్మవిదాం బ్రహ్మా స్వయంభూ ర్విశ్వతోముఖః | మాయావినా మహం దేవః పురాణో హరి రవ్యయః || || 3 ||
యోగినా మస్మ్యహం శంభుః స్త్రీణాం దేవీ గిరీంద్రజా | ఆదిత్యానా మహం విష్ణు ర్వసూనా మస్మి పావకః || || 4 ||
రుద్రాణాం శంకర శ్చాహం గరుడః పతతా మహమ్ | ఐరావతో గజేంద్రాణాం రామః శస్త్రభృతా మహమ్ || || 5 ||
ఈశ్వరుడు పలికెను.
ఓ ఋషులారా! పరమాత్మ ప్రభావమును మీరందరూ వినుడు. దీనిని తెలిసిన పురుషుడు మరల సంసారమున పడడు. పరములలో కెల్ల పరము బ్రహ్మ శాశ్వతము, నిష్కలము, ధ్రువము నిత్యానందము నిర్వికల్పము అయినదే నాధామము. నేను బ్రహ్మ జ్ఞానులలో బ్రహ్మను చతుర్ముఖుడగు స్వయంభువును, మాయావులలో పురాణుడు అవ్యయుడగు హరినినేను. యోగులలో శంభుడను. స్త్రీలలో పార్వతీదేవిని ఆదిత్యులలో నేను విష్ణువును. వసువులలోపావకుడను. ఎగిరే పక్షులలో గరుడుడను. గజేంద్రులలో ఐరావతమును శస్త్రధారులలో రాముడను. (1-5)
ఋషీణాం చ వసిష్ఠో೭హం దేవానాం చ శతక్రతుః | శిల్పినాం విశ్వకర్మాహం ప్రహ్లాదో೭స్మ్య మరద్విషామ్ || || 6 ||
మునీనా మప్యహం వ్యాసో గణానాం చ వినాయకః | వీరాణాం వీరభద్రో హం సిద్ధానాం కపిలో మునిః || || 7 ||
పర్వతానా మహం మేరు ర్నక్షత్రాణాం చ చంద్రమాః | వజ్రం ప్రహరణానాం చ వ్రతానాం సత్య మస్మ్యహమ్ || || 8 ||
అనంతో భోగినాం దేవః సేనానీనాం చ పావకిం | ఆశ్రమాణాం చ గార్హస్థ మీశ్వరాణాం మహేశ్వరః || || 9 ||
మహాకల్పశ్చ కల్పానాం యుగానాం కృత మస్మ్యహమ్ | కుబేరః సర్వయక్షాణాం గణశానాం చ వీరకః || || 10 ||
ఋషులలో వసిష్ఠుడను దేవతలలో ఇంద్రుడను శిల్పులలో విశ్వకర్మను, దైత్యులలో ప్రహ్లాదుడను. మునులలో వ్యాసుడను. గణములలో వినాయకుడను. వీరులలో వీరభద్రుడను. సిద్ధులలో కపిలమునిని. పర్వతములలో మేరువును. నక్షత్రములలో చంద్రుడను. ఆయుధములలో వజ్రాయుధమును వ్రతములలో సత్యవ్రతమును, భోగులలో నేను అనంతుడను. సేనాపతులలో కుమారస్వామిని. ఆశ్రమములలో గృహస్థాశ్రమమును ఈశ్వరులలో మహేశ్వరుడను కల్పములలో నేను మహాకల్పమును యుగములో కృతయుగమును యక్షులలో కుబేరుడను గణశ్వరులో వీరకుడను. (6-10)
ప్రజాపతీనాం దక్షో೭హం నిఋతిః సర్వరక్షసామ్ | వాయుర్బలవతామస్మి ద్వీపానాం పుష్కరో೭స్మ్యహమ్ || || 11 ||
మృగేంద్రాణాం చ సింహో೭హం యన్త్రాణాం ధను రేవ చ | వేదానాం సామవేదోహం యజుషాం శతరుద్రియమ్ || || 12 ||
సావిత్రీ సర్వయజ్ఞానాం గుహ్యానాం ప్రణవూస్మ్యహమ్ | సూక్తానాం పౌరుషం సూక్తం జ్యేష్ఠసామ చ సామసు || || 13 ||
సర్వవేదార్థవిదుషాం మనుః స్వాయంభువూ స్మ్యహమ్ | బ్రహ్మావర్తస్తు దేశానాం క్షేత్రాణా మవిముక్తకమ్ || || 14 ||
విద్యానామాత్మవిద్యాహం జ్ఞానానా మైశ్వరం పరమ్ | భూతానా మస్మ్యహం వ్యూమ సత్వానాం మృత్యు రేవ చ || || 15 ||
ప్రజాపతులలో దక్షుడను. రాక్షసులలో నిర్‌ఋతిని. బలవంతులలో వాయువును. ద్వీపములలో పుష్కర ద్వీపమును, మృగరాజులలో సింహమును, యంత్రములలో ధనువును'' వేదములలో సామవేదమును, యజుర్మంత్రములలో శతరుద్రియమును. మంత్రములలో సావిత్రి మంత్రమును. రహస్యములలో ప్రణవమును. సూక్తములో పురుషసూక్తమును సామములలో జ్యేష్ఠసామమును వేదార్థ విదులలో స్వాయంభువ మనువును. దేశములలో బ్రహ్మావర్తమును, క్షేత్రములలో అవిముక్తకమును. విద్యలలో ఆత్మవిద్యను. జ్ఞానములలో పరమేశ్వర జ్ఞానమును పంచభూతములలో ఆకాశమును సత్త్వములలో మృత్యువును. (11-15)
పాశానా మస్మ్యహం మాయా కాలః కలయతా మహం | గతీనాం ముక్తి రేవాహం పరేషాం పరమేశ్వరః || || 16 ||
యచ్చా న్యదపి లోకే೭స్మిం స్తత్వం తేజోబలాధికమ్ | తత్సర్వం ప్రతిజానీధ్వం మమ తేజోవిజృంభితమ్ || || 17 ||
ఆత్మానః పశవః ప్రోక్తాః సర్వే సంసారవర్తినః | తేషాం పతి రహం దేవః స్మృతః పశుపతి ర్బుధైః || || 18 ||
మాయాపాశేన బధ్నామి పశూ నేతాన్ స్వలీలయా | మా మేవ మోచకం ప్రాహుః పశూనాం వేదవాదినః || || 19 ||
మాయాపాశేన బద్ధానాం మోచకో೭న్యో న విద్యతే | మా మృతే పరమాత్మానం భూతాధిపతి మవ్యయమ్ || || 20 ||
పాశములలో మాయాపాశమును, మాయాపాశమును సంహారించు వారలలో కాలమును, ఉత్తమ గతులలో ముక్తిని ఉత్తములలో పరమేశ్వరుడను ఈ లోకమున అధిక తేజశ్శాలి బలిశాలి అయిన సత్త్వమంతయు నాతేజో విజృంభితముగా తెలియము. సంసారములో నుండు ఆత్మలన్నియు పశువులుగా చెప్పబడినవి. వారికి పతిని కావున నన్ను పండితులు పశుపతి యందురు. ఈ పశువులనన్నిటిని నాలీలలో మాయాపాశముతో బంధించెదను. వేద విదులు ఈ పశువుల బంధమును విడిపించువాడను నేననియే చెప్పుచుందురు. మాయా పాశ బద్ధులను విడిపించుటకు భూతాధిపతిని. పరమాత్మను అయిన నేను తప్ప ఇతరులు లేరు. (16-20)
చతుర్వింశతితత్త్వాని మాయా కర్మ గుణా ఇతి | ఏతే పాశాః పశుపతేః క్లేశా శ్చ పశుబన్ధనాః || || 21 ||
మనో బుద్ధి రహంకారః ఖానిలాగ్నిజలాని భూః | ఏతాః ప్రకృతయ స్త్వష్టౌ వికారాశ్చ తథా పరే || || 22 ||
శ్రోత్రం త్వక్ చక్షుషీ జిహ్వా ఘ్రాణం చైవ తు పంచమమ్ | పాయూపస్థం కరౌ పాదౌ వాక్ చైవ దశమీ మతా || || 23 ||
శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గన్థ స్తథైవ చ | త్రయోవింశతి రేతాని తత్త్వాని ప్రకృతాని తు || || 24 ||
చతుర్వింశక మవ్యక్తం ప్రధానం గుణలక్షణమ్ | అనాదిమధ్యనిధనం కారణం జగతః పరమ్ || || 25 ||
సత్త్వం రజ స్తమ శ్చేతి గుణత్రయ ముదాహృతమ్ | సామ్యావస్థితి మేతేషా మవ్యక్తం ప్రకృతిం విదుః || || 26 ||
సత్త్వం జ్ఞానం తమో೭జ్ఞానం రజో మిశ్ర ముదాహృతమ్ | గుణానాం బుద్ధివైషమ్యాత్ వైషమ్యం కవయో విదుః || || 27 ||
చతుర్వింశతి తత్త్వములు మాయ కర్మ గుణములు. ఇవి పశుపతికి పాశములు. జీవులకు కలుగు క్లేశములు. ఇవియే పశుబంధనములు. మనసు బుద్ధి అహంకారము ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఈ అష్ట ప్రకృతులుల ఇతర పదార్థ వికారములు. శ్రోత్రము త్వక్ చక్షువు జిహ్వ ఘ్రాణము అనునవి అయిదు జ్ఞానేంద్రియములు, పాయు ఉపస్థ కర పాద వాక్కులు అనునవి అయిదు కర్మేంద్రియములు శబ్ద స్పర్శ రూప రస గంధములు అయిదు విషయములు. ఇట్లు ఇవి 23 ప్రకృతి వనల ఏర్పడిన తత్త్వములు. 24వ తత్త్వము అ వ్యక్తము లేదా ప్రధానమందురు. ఈ అవ్యక్తము గుణ సహితము. ఇదియే ఆది మధ్యాంతములు లేనిది. జగత్తునకు పరము కారణము. సత్వము, రజస్సు, తమస్సు అనునవి మూడు గుణములందురు. ఈ మూటి సామ్యావస్థ అవ్యక్తము ప్రకృతియని అందురు. సత్త్వము జ్ఞానము, తమస్సు అజ్ఞానము, రజస్సు మిశ్రమము అని చెప్పబడినవి. బుద్ధి వైషమ్యము వలన గుణ వైషమ్యము కలుగునని పండితులు చెప్పెదరు. (21-27)
ధర్మాధర్మా వితి ప్రోక్తౌ పాశౌ ద్వౌ బంధసంజ్ఞితౌ | మయ్యర్పితాని కర్మాణి నిబన్ధాయ విముక్తయే || || 28 ||
అవిద్యా మస్మితాం రాగం ద్వేషం చాభినివేశకమ్ | క్లేశాఖ్యా నచలాన్ ప్రాహుః పాశా నాత్మ నిబంధనాన్ || || 29 ||
ఏతేషా మేవ పాశానాం మాయా కారణ ముచ్యతే | మూలప్రకృతి రవ్యక్తా సా శక్తి ర్మయి తిష్ఠతి || || 30 ||
బంధముపేరుతో ధర్మా ధర్మములనునవి రెండు పాశములు, నా యందు అర్పించడిన కర్మములు బంధ విముక్తిని ప్రసాదించును. ఆ విద్య, అస్మిత రాగద్వేష అభినివేశ క్లేశములనునవి చాలా కాలము నిలుచునవి బంధించు పాశములుగా చెప్పబడినవి. ఈ పాశములకు కారణము మాయ. అవ్యక్తము మూల ప్రకృతి యను శక్తి నా యందు ఉండును. (28-30)
స ఏవ మూల ప్రకృతిః ప్రధానం పురుషో೭పి చ | వికారా మహదాదీని దేవదేవః సనాతనః || || 31 ||
స ఏవ బంధః స చ బన్ధకర్తా స ఏవ పాశః పశవః స ఏవ | స వేద సర్వం న చ తస్యవేత్తా తమాహురగ్ర్యం పురుషం పురాణమ్ || || 32 ||
ఇతి శ్రీ కూర్మపురాణ ఉత్తరార్థే సప్తమాధ్యాయః
ఈ మూల ప్రకృతి ప్రధానము పురుషుడు, మహత్తత్త్వము, అహంకారము మొదలగు వికారములన్నియు దేవదేవుడగు సనాతనుని స్వరూపములే. సనాతన పరుషుడే బంధము. బంధనము చేయువాడు అతడే. పశువులు అతనే పాశము అతడే. అతనికి అన్ని తెలియును. అతనిని తెలియువారెవ్వరూ లేరు. ఇతడే ఆది పురుషుడు పురాణ పురుషుడుగా చెప్పబడును. (31-32)
ఇది షట్సాహస్రియను కూర్మపురాణమున ఉత్తర విభాగమున 7వ అధ్యాయము