Sri Koorma Mahapuranam
Chapters
అష్టమాధ్యాయః ఈశ్వర ఉవాచ :- అన్యత్ గుహ్యతమం జ్ఞానం వక్ష్యే బ్రాహ్మణపుంగవాః | యేనాసౌ తరతే జన్తు ర్ఘోరం సంసారసాగరమ్ ||
|| 1 || అష్టమాధ్యాయము బ్రాహ్మణోత్తములారా! మరొక పరమ రహస్య జ్ఞానమును తెలుపుచున్నాను. దీనిని తెలిసిన పురుషుడు సంసార సాగరమును దాటును. (1) అహం బ్రహ్మమయః శాంతః శాశ్వతో నిర్మతో నిర్మలో೭వ్యయః | ఏకాకీ భగవా నుక్తః కేవలః పరమేశ్వరః || || 2 || మమ యోని ర్మహద్ర్బహ్మ తత్ర గర్భం దధామ్యహమ్ | మూలం మాయాభిధానం తు తమోజాత మిదం జగత్ || || 3 || ప్రధానం పురుషో హ్యాత్మా మహాన్ భూతాది రేవ చ || తన్మాత్రాణి తథా భూతానీంద్రియాణి చ జజ్ఞిరే || || 4 || తతో೭ణ్డ మభవ ద్ధైమం సూర్యకోటిసమప్రభమ్ | తస్మిన్ జజ్ఞే మహద్ర్బహ్మా మచ్ఛక్త్యా చోపబృంహితః || || 5 || యే చాన్యే బహవో జీవా మన్మయాః సర్వ ఏవ తే | న మాం పశ్యన్తి పితరం మాయయా మమ మోహితాః || || 6 || యా శ్చ యోనిషు సర్వాసు సంభవన్తి హి మూర్తయః | తాసాం మాయా పరా యోని ర్మామేవ పితరం విదుః || || 7 || యో మా మేవం విజానాతి బీజినం పితరం ప్రభుమ్ | స ధీరః సర్వలోకేషు న మోహ మధిగచ్ఛతి || || 8 || నేను పరబ్రహ్మను, శాంతుడను, శాశ్శతుడను, నిర్మలుడను, అవ్యయుడను ఒక్కడినే. భగవంతుడను. కేవలుడను. పరమేశ్వరుడను. మహద్బ్రహ్మ నాయోని. దాని యందు మాయ అనబడు గర్భమును ధరించెదను. దాని నుండి ఈ సకల జగత్తు పుట్టినది. ప్రధానము, పురుషుడు, ఆత్మ, మహత్తత్త్వము, తామసాహంకారము పంచతన్మాత్రలు, పంచమహాభూతములు ఇంద్రియములు పుట్టినవి. తరువాత కోటిసూర్య సమకాంతిగల బంగారు గుడ్డు పుట్టినది. ఆ అండమందు నా శక్తిచే పెరిగిన మహా బ్రహ్మ పుట్టెను. ఇంకనూ నా స్వరూపులైన చాలా మంది జీవులు ఉద్భవించుకొని వారందరూ నా మాయతో మోహితులై తండ్రినైన నన్ను చూచుట లేదు ఇట్లు సకల యోనుల యందు ఉద్భవించు ప్రాణులు వారందరికి తల్లి మాయ నేను తండ్రిని. నన్ను బీజప్రదునిగా తండ్రినిగా తెలియువారు ధీరులు. మోహమును పొందరు. (2-8) ఈశానః సర్వవిద్యానాం భూతానాం పరమేశ్వరః | ఓంకారమూర్తి ర్భగవా నహం బ్రహ్మా ప్రజాపతిః || || 9 || సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరం | వినశ్యత్వ్స వినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి || || 10 || సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరమ్ | న హిన స్త్యాత్మ నాత్మానం తతోయాతి పరాంగతిమ్ || || 11 || విదిత్వా సప్త సూక్ష్మాణి షడఙ్గం చ మహేశ్వరమ్ | ప్రధానవినియోగజ్ఞః పరం బ్రహ్మాధిగచ్ఛతి || || 12 || అన్ని విద్యలకు నేనే అధిపతిని. అన్ని ప్రాణులకు నేనే పరమేశ్వరుడను. నేనే ఓంకార స్వరూపుడను. భగవంతుడను. బ్రహ్మను ప్రజాపతిని. అన్ని ప్రాణులందు సమరూపినిగా ఉండువాడను. నశించు వారలలో కూడా నశించక ఉండు వాడనని తెలియువాడే తెలివి గలవాడు. అన్ని ప్రాణులలో సమముగా నుండు వానినిగా తెలిసి తనను తాను హింసించుకొనని వాడు పరమపదమును పొందును. సప్త సూక్ష్మములు ఆరు అంగములు గల మహేశ్వరుని తెలిసి ప్రధానమును విని యోగములను తెలిసినవారు పరమాత్మను చేరగలరు. (9-12) సర్వజ్ఞతా తృప్తి రనాదిబోధః స్వతంత్రతా నిత్యమలుప్త శక్తిః | అనంతశక్తిశ్చ విభోర్విదిత్వా షడాహు రఙ్గాని మహేశ్వరస్య || || 13 || తన్మాత్రాణి మన ఆత్మా చ తాని సూక్ష్మాణ్యాహుః సప్త తత్త్వాత్మకాని | యా సా హేతుః ప్రకృతిః సా ప్రధానం బన్ధః ప్రోక్తో వినియోగో೭పి తేన || || 14 || యా సా శక్తిః ప్రకృతౌ లీన రూపా వేదేషూక్తా కారణం బ్రహ్మయోనిః | తస్యా ఏకః పరమేష్ఠీ పరస్తా న్మహేశ్వరః పురుషః సత్యరూపః || || 15 || సర్వజ్ఞత్వము, తృప్తి, అనాదియగు జ్ఞానము స్వాతంత్ర్యము ఎల్లపుడు లోపించని శక్తి, అనంతశక్తి అనునవి మహేశ్వరుని ఆరు అంగములు. పంచ తన్మాత్రలు మనస్సు ఆత్మఅను ఏడు సూక్ష్మములు. హేతు రూపముగా నుండు ప్రకృతిని ప్రధానమందురు. ప్రకృతిలో ఏర్పడు బంధమే వినియోగము. ప్రకృతిలో లీనమగు శక్తిని వేదములో బ్రహ్మ యోని అందురు. అద్వితీయుడు పరమేష్ఠి పరాత్పరుడు సత్యరూప మహేశ్వరుడు బ్రహ్మయోనికి పురుషుడు. (13-15) బ్రహ్మాయోగీ పరమాత్మా మహీయాన్ | వ్యోమ వ్యాపీ వేదవేద్యః పురాణః | ఏకో రుద్రో మృత్యు రవ్యక్త మేకం ఈజం విశ్వం దేవ ఏకః స ఏవ || || 16 || త మేవైకం ప్రాహు రన్యేప్యనేకం త్వేకాత్మానం కేచిదన్యత్తథాహుః | అణూ రణీయాన్ మహతో೭సౌ మహీయాన్ మహాదేవః ప్రోచ్యతే వేదవిద్భిః || || 17 || ఏవం హి యో వేద గుహాశయం పరం ప్రభుం పురాణం పురుషం విశ్వరూపమ్ | హిరణ్మయం బుద్ధిమతాం పరాం గతిం స బుద్ధిమాన్ బుద్ధిమతీత్య తిష్ఠతి || || 18 || ఇతి శ్రీకూర్మపురాణ ఉత్తరార్థే ఈశ్వరగీతాను అష్టమోధ్యాయః ఆ పురుషుడే బ్రహ్మ, యోగి, పరమాత్మ, మహాన్, సర్వవ్యాపి వేదవేద్యుడు, పురాణుడు, అద్వితీయుడు, రుద్రుడు, మృత్యువు, అవ్యక్తము, ఏకము, బీజము, విశ్వము. ఆ పురుషుని కొందరు ఒక్కనిగా కొందరు అనేకులుగా మరికొందరు అతనినే అద్వితీయాత్మ అందురు. చిన్నవాటిలో చిన్నవాడు, పెద్దవాటిలోమ పెద్దవాడు మహాదేవుడని వేద విదులందురు. ఇట్లు అఖిల జీవాంతర్యామిగా పరునిగా ప్రభువుగా పురాణ పురుషునిగా, విశ్వరూపునిగా, హిరణ్మయునిగా, బుద్ధిమంతులకు పరమగతిగా తెలిసినవాడు బుద్ధిమంతుడు పరమపదమును పొందును. (16-18) ఇది షట్సాహస్రి సంహితయను శ్రీ కూర్మ పురాణమున ఉత్తర విభాగమున ఈశ్వరగీతలో అష్టమాధ్యాయము