Sri Koorma Mahapuranam    Chapters   

దశమాధ్యాయః

ఈశ్వర ఉవాచ :-

అలిఙ్గమేక మవ్యక్తం లిఙ్గం బ్రహ్మేస్త్ర్మతి నిశ్చితమ్‌ | స్వయంజ్యోతిః పరం తత్త్వం పరం మ్యోమ్ని వ్యవస్థితమ్‌ || || 1 ||

అవ్యక్తం కారణం యత్తదక్షరం పనరమం పదం | నిర్గుణం శుద్ధ విజ్ఞానం తద్‌ వై పశ్యన్తి సూరయః || || 2 ||

తన్నిష్ఠాః శాన్తసంకల్పా నిత్యం తద్భావభావితాః | పశ్యన్తి తత్‌ పరం బ్రహ్మ య త్తల్లిఙ్గమితి శ్రుతిః || || 3 ||

పదవ అధ్యాయము

ఈశ్వరుడు పలికెను.

ఏ చిహ్నము లేనిది అద్వితీయమైనది, అవ్యక్తమగు లింగము బ్రహ్మమని నిశ్చయించబడినది. ఈ బ్రహ్మము స్వయం ప్రకాశము పరతత్త్వము పరమాకాశమున నుండునది. ఇదియే అవ్యక్త కారణరూపము అక్షరమగు పరమపదము. ఇది నిర్గుణము శుద్ధ విజ్ఞానము, దానిని పండితులు మాత్రమే చూడగలరు. వీరు బ్రహ్మ నిష్ఠులు శాంత సంకల్పులు ఎపుడు దానినే ధ్యానించువారు ఆ పరబ్రహ్మను తల్లింగమని శ్రుతి చెప్పు దానిని తెలియగలరు. (1-3)

అన్యథా నహి మాం ద్రష్టుం శక్యం వై మునిపుంగవాః | నహి తత్‌ విద్యతే జ్ఞానం యత స్త జ్జాయతే పరమ్‌ || || 4 ||

ఏత త్తత్పరమం జ్ఞానం కేవలం కవయో విదుః | అజ్ఞాన మితరత్‌ సర్వం యస్మా న్మాయామయం జగత్‌ || || 5 ||

ఇతరోపాయములతో నన్ను చూడజాలరు. పరమతత్త్వమును తెలుపు ఇతర జ్ఞానమేదియూ లేదు. ఈ పరమ జ్ఞానమును విద్వాంసులు మాత్రమే తెలియగలరు. పరమ జ్ఞానము తప్ప ఇతర మంతయూ అజ్ఞానమే. ఈ అజ్ఞానము వలననే మాయ, మాయ జగత్తు ఉత్పన్న మాయెను. (4-5)

యత్‌ జ్ఞానం నిర్మలం సూక్ష్మం నిర్వికల్పం య దవ్యయమ్‌ | మమా త్మాసౌ తదేవేద మితి ప్రాహు ర్విపశ్చితః || || 6 ||

యే ప్యనేకం ప్రపశ్యన్తి తేపి పశ్యన్తి తత్‌ పరమ్‌ | ఆశ్రితాః పరమాం నిష్ఠాం బుద్ధ్వైకం తత్త్వ మవ్యయమ్‌ || || 7 ||

యే పునః పరమం తత్త్వ మేకం వానేక మీశ్వరమ్‌ | భక్త్యా మాం సమ్ర్పపశ్యన్తి విజ్ఞేయా స్తే తదాత్మకాః || || 8 ||

ఈ జ్ఞానము నిర్మలము సూక్ష్మము నిర్వికల్పము నాశము లేనిది. ఇదియే నా ఆత్మ స్వరూపము. అని పండితులు చెప్పుచున్నారు. అనేక రూపములుగా చూచువారు కూడా భక్తిని ఆశ్రయించి అద్వితీయము అవినాశియగు తత్త్వమును తెలిసి దాని ద్వారా పరమతత్త్వమును తెలియుదురు. ఇతరులు పరమాత్మకు ఏకరూపముగా కాని అనేక రూపములుగా కాని భక్తితో చూచువారు కూడా బ్రహ్మ స్వరూపులుగానే చూడవలయును. (6-8)

సాక్షా దేవ ప్రపశ్యన్తి స్వాత్మానం పరమేశ్వరం | నిత్యానందం నిర్వికల్పం సత్యరూప మితి స్థితిః || || 9 ||

భజన్తే పరమానందం సర్వగం య త్తదాత్మకమ్‌ | స్వాత్మ న్యవస్థితాః శాన్తాః పరేవ్యక్తే పరస్యతు || || 10 ||

ఏషా విముక్తిః పరమా మమ సాయుజ్య ముత్తమమ్‌ | నిర్వాణం బ్రహ్మ ణాచైక్యం కైవల్యం కవయోవిదుః || || 11 ||

తస్మా దనాదిమధ్యాన్తం వస్త్వేకం పరమం శివం | స ఈశ్వరో మహాదేవ స్తం విజ్ఞాయ విముచ్యతే || || 12 ||

తనలోనే నిత్యానంద స్వరూపము నిర్వికల్పము సత్యస్వరూపమును అగు సాక్షాత్‌ పరబ్రహ్మను చూచుట యథార్ధ స్థితి. పరమానంద స్వరూపుడు సర్వవ్యాపి యగు వానిని తనలో నున్నవానిని పరము నందు అవ్యక్తమున నున్న పరతత్త్వమును ఉపాసింతురు. ఇదియే పరమ విముక్తి ఇదియే నా సాయుజ్యము. ఇదియే బ్రహ్మైక్యము కైవల్యమని కవులు తెలియుదురు. కావున ఆది మధ్యాంతములు లేనిది రెండవది లేనిది పరమ శుభ ప్రదము అగుతత్త్వమే ఈశ్వరుడు. ఇతడే మహాదేవుడు. ఇతనిని తెలిసినవారు విముక్తిని పొందెదరు. (9-12)

న తత్ర సూర్యః ప్రవిభాతీహ చంద్రో | న నక్షత్రాణి తపనో నోత విద్యుత్‌

తద్భాసేద మఖిలం ఆతి నిత్యం తన్నిత్య భాసమచలం సద్విభాతి || || 13 ||

నిత్యోదితం సంవిదా నిర్వికల్పం శుద్ధం బృహంతం పరమం య ద్విభాతి |

అత్రాంతరం బ్రహ్మ విదోధ నిత్యం పశ్యంతి తత్వ మచలం యత్‌ స ఈశః || || 14 ||

ఆ పరంధామములో సూర్యుడు భాసించడు. చంద్రుడు భాసించడు. నక్షత్రములు భాసించవు. అగ్ని ప్రకాశించజాలడు. విద్యుత్‌ కూడా వెలుగొందదు. పరంధాముని కాంతితోనే ఇవన్నియూ వెలుగొందుచున్నవి. ఆ ధామము నిత్యము. ఆ కాంతి కూడా నిత్యముగా ప్రకాశించు చుండును. నిశ్చలము సత్‌గా భాసించు చుండును. ఎపుడూ ఉదయించియే యుండును. జ్ఞాన స్వరూపము నిర్వికల్పము శుద్ధము బృహదాకారము పరమముగా భాసించుచుండును. ఈ ప్రకాశముననే బ్రహ్మ జ్ఞానులు ఎల్లప్పుడు నిత్యము అచలమగు తత్త్వమును దర్శింతురు. ఆ తత్త్వమే ఈశ్వరుడు. (13-14)

నిత్యానంద మమృతం సత్యరూపం శుద్ధం వదంతి పురుషం సర్వవేదాః | త మోమితి ప్రణవే నేశితారం ధ్యాయంతి వేదార్థవినిశ్చితార్థాః || || 15 ||

న భూమి రాపో న మనో న వహ్నిః ప్రాణూనిలో గగనం నోత బుద్ధిః | న చేతనోన్యత్‌ పరమాకాశమధ్యే విభాతి దేవః శివ ఏవ కేవలః || || 16 ||

ఆ పరమ పురుషుని అన్ని వేదములు నిత్యానందమయంగా, అమృత స్వరూపునిగా సత్యరూపునిగా పరిశుద్ధునిగా చెప్పుచున్నవి. వేదార్థ నిశ్చయము గలవారు ఆ పరమాత్మను ఓం అని ప్రణవముతో ధ్యానము చేతురు. ఆ పరమాకాశ మధ్యమున భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి ప్రాణము ఇవేవియూ ప్రకాశించవు. అచట ఏ చైతన్యము భాసించదు. అచట ఒకే ఒక శివుడు మాత్రమే భాసించు చుండును. (15-16)

ఇత్యేత దుక్తం పరమం రహస్యం జ్ఞానామృతం సర్వవేదేషు గూఢమ్‌ |

జానాతి యోగీ విజనేథ దేశే యుంజీత యోగం ప్రయతో హ్యజస్రమ్‌ || || 17 ||

ఇతి శ్రీ కూర్మపురాణ ఉత్తరార్థే దశమోధ్యాయః

ఇట్లు పరమ రహస్యమును సర్వ వేదములలో అతిగూఢముగా దాగియున్న దానిని జ్ఞానామృతమును నీకు వివరించితిని. ఏకాంత ప్రదేశమున యోగాభ్యాసమును చేయువాడే ఈతత్త్వమును తెలియగలుగును. (17)

ఇది షట్సాహస్రి సంహితయగు కూర్మపురాణమున ఉపరి విభాగమున ఈశ్వరగీతలలో 10వ అధ్యాయము

Sri Koorma Mahapuranam    Chapters