Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటరెండవ అధ్యాయము - జన్మ నక్షత్ర స్నానవిధి

పుష్కర ఉవాచ ||జన్మనక్షత్రగే సోమే సర్వౌషధి సమన్వితమ్‌ | కుంభం సుపూజితం కృత్వా స్నపనం తేన కారయేత్‌ ||

స్నాతశ్చై వార్చ యేద్దేవం వాసుదేవం జగత్పతిమ్‌ | నక్షత్రదైవతం చంద్రం నక్షత్రం వారుణం తధా ||

వాయు చాయుధపీఠాద్యం ఛత్రం సంపూజయేత్తథా | యథోక్తదేవ తాలింగైర్మంత్త్రెశ్చ జుహుయాద్‌ ఘృతమ్‌ ||

శక్త్యా చ దక్షిణాదేయా బ్రాహ్మణభ్యో భృగూత్తమః | తతోనులిప్తః సురభిః స్రగ్వీ వివిధభూషణః ||

తిష్ఠేన్మనుజ శార్దూల! హవిష్యాశీ జితేంద్రియః | ఉవాసం వినాప్యేతత్ప విత్రంపాపనాశనమ్‌ ||

మాతృస్థానే తు జగతాం జన్మతారా విధీయతే | చంద్రరూపీ చ భగవాన్పితా విష్ణుః ప్రకీర్తితః ||

తస్మా త్సర్వప్రయత్నేన జన్మ నక్షత్ర సంస్థితమ్‌ | భక్త్యాతం పూజయే చ్ఛంద్రం జన్మరక్షం చ విశేషతః ||

పూజాంసదా చంద్రమసస్తు కృత్వా జన్నరక్ష సంస్థస్యభృగుప్రధానః |

కామా నవాప్నోతి నరస్తు సర్వాన్సుఖీసదాస్యాధ్భువి నష్టపాప్మా || 8 ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే మా. సం. రామంప్రతి

పుష్కరోపాఖ్యానే జన్మరక్షస్నాన వర్ణనన్నామ ద్వుత్తరశత తమో7ధ్యాయః.

పుష్కరుండనియె:- చంద్రుడు తన జన్మనక్షత్రమున నున్నపుడు అన్ని యోషధులం గూడిన పూజింపబడిన పూర్ణ కుంభముతో స్నానము చెయింపవలెను. స్నానముచేసి జగత్పతియగు వాసుదేవు నర్చింపవలెను. నక్షత్ర దైవతమగు చంద్రుని వారుణ నక్షత్రమును వాయువును ఆయుధమును పీఠమును, మొదలయిన వానిని ఛత్రమును చక్కగా పూజింపవలెను. ఈచెప్పినదేవతల లింగములు (గుర్తులు) గల మంత్రములతో నేయి హోమము చేయవలెను. యథాశక్తి బ్రాహ్మణులకు దక్షిణనీయవలెను. ఆమీద మంచిగంధము పూసికొని ఘమఘమలాడుచు పూలమాలలు వివిధాభరణములుదాల్చి హవి ష్యాన్నము మాత్రమేతినియింద్రియ నిగ్రహముగొని యుండవలెను. ఉపవాసము చేయకున్నను నిది పాపహరము పవిత్రము, జగమ్ముకెల్ల జన్మనక్షత్రము మాతృస్థానముందురు, నక్షత్రేశుడు భగవంతుడు నగు చంద్రుడు పితృస్థానీయుడగు విష్ణువే. అందుచే జన్మనక్షత్రమందున్న చంద్రుని జన్మనక్షత్రమును భక్తితోబూజించి తీరవలెను. ఇట్లు పూజించినవాజు సర్వాభీష్టముల నందును. పాపములుబాసి యిహమందు సర్వసుఖములందును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండము జన్మనక్షత్రస్నాన విధియను నూటరెండవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters