Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటనాలుగవ అధ్యాయము - దిక్పాలస్నానము

రామ ఉవాచ|| స్నాన మన్యత్సమాచక్ష్వ భగవన్దురితాపహమ్‌ | సకృదేవ కృతం యత్తు పాపేభ్యో విప్రమోచయేత్‌||

పుష్కర ఉవాచ || రాజయక్మా భిభూతేషు విషమ జ్వరితేషు చ | ఛాయోన్మ దోపతప్తేషు విషమ జ్వరిషు చ||

వినాయక గ్రహార్తేషు మూఢ చిత్తేష్వతీవ హి | యేషాం న సిధ్యతే విద్యా సస్యం యేషాం న రోహతి||

సీదేద్యస్య కుటుంబం చ పణ్యం నాయాతి విక్రయమ్‌ | నలభేత్తు జయం యుద్ధే బలవానపి యోనరః ||

యుక్తాన్యపి చ కార్యాణి విపద్యన్తే పునః పునః | కలహశ్చ భ##వేద్యేషాం సుహృత్‌ స్వజన భాంధవైః ||

గర్భః ప్రస్రవతే యస్యా జాతో వాపి వినశ్యతి | పుష్పం యస్యాః క్షయం యాతిన చ కించత్‌ ప్రజాయతే||

గృహ్ణాతి యా న బీజం చ జనమే ద్యాప్యమానుషాన్‌| నాప్నోతి చ పతిం కన్యా తహ్మత్‌ స్నేహమ థాపివా||

సౌభాగ్యం చన చాయాతి సుహృత్‌ స్వజన బంధుషు | ఏవముక్తేషు చాన్యేషు త్వను క్తేషు చ భార్గవ! ||

ప్రసమీక్ష్య విధానజ్ఞః స్నానమేతత్‌ సమాచరేత్‌ | స్నాపయేత్సరితస్తీరే గ్రహీవిష్టాన్‌ విచక్షణః ||

రాజయక్ష్మా భిభూతా యే విషమ జ్వరితాశ్చయే | తేషాం దేవాలయే స్నానం కుర్యాద్వాం సిద్ధసేవిత్‌ ||

ఛాయేన్మాదోపతప్తా యే యే చాపన్మార శోషిణః | తేషాం మునిగణావాసే తీర్థేవా స్నాన మిష్యతే ||

వినాయక గ్రహార్తా యే యే చ మూఢా విచేతసః | సజ్ఞనా చరితే దేశే తేషాం ప్నానం విధీయతే ||

త్రైవిద్యా యేన సిధ్యన్తి గుణా యేషాం ప్రపూజితాః | తేషాం స్నాన మిహోద్దిష్టం సిద్ధదేపస్య మందిరే ||13||

పరుశురాముడు, ఒకమారు చేసినంతనే పాపమంతను హరించును నింకొక స్నానమును నాకెఱింగింపుమన పష్కరుండిట్లనియె. రాజయక్ష్మ క్షయ విషమజ్వరము ఛాయేన్మాదులగుట వినాయకగ్రహము పట్టుట మిక్కిలిగ మనస్సు మొద్ధవారుట చదువు రాకుండుట పైరు చక్కగ మొలవకుండుట కుటుంబము చిక్కుల పాలగుట వ్యాపారము జరుగకుండుట బలవంతుడైనను యుద్ధములందప జయము పొందుట న్యాయమైన పనులుకూడ మఱి మఱి నెరవేరకుండుట మిత్రులతో దనవారితో బంధువులతో కలహము గర్భ స్రావమగుట పుట్టిన పిల్ల బ్రతుకకుండుట, స్త్రీ ఋతుధర్మము (పుష్పము) క్షయించుట శిశువు కలుగకుండుట బీజగ్రహణము సేయలేనిదగుట ఒగవేళ కలిగినను నమానుష సంతానము గల్గుట కన్య భర్తను గలియక యెడమగుట భర్తనుండి స్నేహమునైన బడయకుండుట అప్తమిత్ర స్వజన బంధువర్గముతో సౌభాగ్యము (పొత్తు)లేకుండుట. యను నీచెప్పినవి, మఱి చెప్పకున్న కష్టాలు గల్గినపుడు గమనించి శాంతి ప్రక్రియ చక్కగా తెలిసిన యాతడీ శాంతి స్నానము చేయింపలెను. గ్రహము పట్టిన వాండ్రను నదీతీరమందు గూర్చండబెట్టి స్నానము చేయింపవలెను. రాజయక్ష్మ క్షయ విషపుజ్వరము వచ్చిన రోగులను తపస్సుద్ధులు సేవించు ప్రదేశమందు లేక దేవాలయమందు స్నానము సేయింపవలెను. ఛాయోన్మాదులు అపస్వారము సంధి జ్వరము (మూర్చచే) శోషించినవారికి ముని గణము నివసించుచోట గాని తీర్థమందు గాని స్నాన మభిమతము. వినాయక గ్రహ గ్రస్తులు మూఢులు పిచ్చియెత్తినవారికి సత్పురుషులు చరించుచోట స్నానము విధింపబడినది. వేదవేత్తలు కార్యసిద్దినందుటకు వారి సుగుణ సంపద పూజింపబడుటకు సిద్ధులు దేవ మందిరమందు నీ స్నానము చేయవలెను.

యేషాం నాస్తి జయోయుద్ధే మేషాం స్వజన సంక్షయః | కాన్తారే వా వనే తీర్థే తేషాం స్నానం పర్శస్యతే ||

సతతం కలహో యేషాం జాయతే చ యతస్తతః | త్రిపథేవా తడాగే వా స్నానం తేషాం ప్రకల్పయేత్‌||

పద్మిన్యాం స్నపయేన్నారీం గర్భో యస్యాః స్రవేత్తథా | అశోక సన్నిథౌ స్నాప్యా జాతో యస్యాః వినశ్యతి||

నచ గృహ్ణాతి యా శుక్రం స్నాప్యా సాసఫలే తరౌ | మహోదధితటే స్నాప్యా యదాపత్యం వినశ్యతి ||

అమానుషా న్యా జనయేత్‌ స్నాపయేత్తాం చతుష్పధే | యాదృశం యాచ భర్తారం నలభేత వరాంగగా ||

స్నాపయేత్‌ ఏకలింగేతాం స్థానేవా వృక్ష సంకులే | రూప లావణ్య యుక్తాయా సౌభాగ్య యాన విందతి||

స్నానం వృద్ధికరం తస్యావేశ్యాగారే ప్రకల్పయేత్‌ | అన్యేషామధ కర్తవ్యం సదా స్నానం మనోహరమ్‌ ||

సమే సజ్జన సంకీర్ణే సుచౌదేశే వికంటకే | సహాయైః ప్రయతైః సార్ధ మహో రాత్రోషితో ద్విజః ||

స్నానకర్మ ప్రయుజీత సోపవాసస్య మానద | ఆహో రాత్రా7సమర్థస్య కార్యం వా హవిషాశనమ్‌||

ఎవరికి యుద్ధమునందు గెలిపుగలుగదో, స్వజనముక్షయించునో అట్టివారికి కాంతారమందు=పేరడవిలోగాని వనమందు=ఉద్యానమందుగాని తీర్థమునందుగాని యీ స్నానము ప్రశస్తము. ఎల్లపుడు నేరితోనైన నిత్యము కలహము తటస్థించునో వారికి చెఱువులోగాని మూడ త్రోవలు కలిసినచోటనుగాని ఈ స్నానము నేర్పరుపనగును. గర్భస్రావమగు స్త్రీని తామరకొలనిలోను, పుట్టిన శిశువులు బ్రతకని దానిని అశోక వృక్షముల దరిగను శుక్రగ్రహణము లేనిదానికి ఫలవృక్షములు దాపునను సంతాన నష్టము గలుగుదానికి సముద్రతీరమందును అమానుష సంతానము గలుగుదానిని నాల్గుదారులు కలిసిన కూడలియందును, అనుకూల భర్తలభింపని దానిని చెట్లగుబురు లోగాని నొక్కటే లింగమున్నచోటనుగాని, రూపము లావణ్యముం గల్గియు సౌభాగ్యముం బడయనిదానికి వేశ్యయింటియందును, నీ వృద్ధిక స్నానము చేయింపవలెను. వీరుగాక యితర జనమునము నొడుదుడుకులేని చక్కని రేవులో సజ్జనులచో నిండిన నిష్కంటకమునైనచోట సహాయులతోగూడ స్నానము సేయింపవలెను. (ఒంటరిగ స్నానము సేయరాదు) ఆహోరాత్రముపవాసముముండి స్నానముచేయనగును. ఉపవాసముండలేని వాడు హవిష్యాన్నము దిని చేయవచ్చును.

శరద్వసన్తయోః కార్యం స్నానం స్వస్థస్య భార్గవ| సర్వకాలే ష్వథార్తస్య గ్రహవ్యాధినిబర్హణమ్‌||

ముహూర్తే తత్ర సావిత్రే బ్రాహ్మణః స్నాపయేద్విజ | మైత్రే7థ విజయే చైవ రాజన్యం స్నాపయే త్తథా||

వైశ్యం పైతామహే శూద్రం శేషేషుస్నాపయేత్తథా | పంచమీ సప్తమీ శ్రేష్ఠా స్నపనే బ్రాహ్మణస్య చ ||

త్రయోదశీ తృతీయా చ క్షత్రియస్య విశిష్యతే | ద్వితీయా దశమీ చైవ తథా వైశ్యస్య మానద||

షష్టీ చతుర్దశీ చైవ శూద్రాణాం స్నానకర్మణి | ఎకాదశీ ద్వాదశీ చ తథా కృష్ణ చతుర్దశీ ||

సర్వేషా మేవ వర్ణానాం స్నాన కర్మణి పూజితా | ధ్రువేషు వైష్ణవే పుష్యే రేవత్యాం భకదైవతే ||28||

హస్తే పునర్వసా సౌమ్యే జ్యేష్ఠాయామథ వారుణ | ధనిష్ఠాయాం తధా స్నానం సర్వేషామేవ పూజితం ||

శరదృతువులోను వసంతఋతువులోను స్వస్థుడు (ఆరోగ్యవంతుడు) ఈ శాంతి స్నానము సేయవలెను. ఆర్తుడును గ్రహ బాధలను వ్యాధులను పోగొట్టునీస్నానము గావింపవచ్చును. బ్రాహ్మణుని సావిత్ర ముహూర్తమందు, క్షత్రియుని మైత్ర విజయ ముహూర్తములందును, వైశ్యుని బ్రాహ్మముహూర్తమునందు శూద్రుని తక్కిన ముహూర్తములందు నీ స్నానముం జేయింపవచ్చును, బ్రాహ్మణునకు పంచమి సప్తమి. క్షత్రియునకు తిదియత్రయోదశియు, వైశ్యునకు విజయ దశమి, శూద్రులకు షష్ఠి చతుర్దశి యను తిథులు ప్రశస్తములు. ఏకాదశి ద్వాదశి కృష్ణ చతుర్దశియు నన్ని వర్ణముల వారికిని పూజ్యములే. ద్రువనక్షత్రములు వైష్ణవ శ్రవణపుష్య రేవతీ భగవైవత్యము=పుబ్బ హస్త పునర్వసు సౌమ్యము=మృగశిర జేష్ఠివారుణ=శతభిషము ధనిష్ఠ అను నక్షత్రములందు స్నాసమందఱకు మంచిది.

వేత్రాసనం భద్రపీఠం వైదలం దారవం తథా || వర్ణానా మాను పూర్వ్యే పరికీర్తిత మానసమ్‌ ||

కృష్ణాజినం చ వైయాఘ్రం రౌరవం బాస్తమేవ చ || పాదోపధానం వర్ణానామ్‌ అనుపూర్వ్యేణ కల్పయేత్‌ ||

వృషాశ్వరధ పృష్ఠే చ గజపృష్ఠే తథైవ చ | నరస్కంథే అంగనాంగే వా ప్రాయశః స్నాపయే చ్ఛిశూన్‌ ||

స్నాతు కామస్య తస్యాధ పూర్వముత్సాదనం స్మృతం | యైర్థ్రవ్యైః భృగుశార్దుల తాని వక్ష్వామ్యతః పరమ్‌ ||

పునర్న వాం రోచనాం చ శతహ్వాం గురుణీం త్వచమ్‌ | మధూకం చ రజన్యౌ ద్వేతగరం నాగకేసరమ్‌ ||

ఆసురీం సర్జికాం చైవ మాంసీం రామఠ చందనే | ప్రియంగు సర్షపాన్కుష్ఠం కుంకుమం బహుపుత్రికాం ||

బలేంద్రహస్తీం బ్రాహీం చ పంచగవ్యం తథైవ చ| సక్తునా మిశ్రయిత్వా చ కార్యము ద్వర్తనం భ##వేత్‌ ||

తతః స్నానదినే ప్రాప్తే ప్రాగ్వ దుత్సాదయే త్పునః | తతో మనోహరే దేశే మండలం ంల్పయేద్‌ బుధః ||

చతురస్రం గోమయేన సర్వతో7ష్టదిశం సమమ్‌ | సతోరణం చతుర్ధ్వారం ప్రాకారైరుపశోభితమ్‌ ||

తత్ర మధ్యే లిఖేత్పద్మ మష్టపత్రం సుశోభితం | కర్ణికాయాం లిఖేద్విష్ణుం మేఘాభం పితావాససం||

కౌస్తుభోద్భా సితోరస్కం శంఖచక్ర గదాధరం | బ్రహ్మణం దక్షిణ న్యస్య పద్మవర్ణం సమాలిఖేత్‌ ||

అజినాంబర సంయుక్తం శ్వేత యజ్ఞోపవీతినమ్‌ | రజతా భ్రనిభం వామే భాగే రుద్రం సమాలిఖేత్‌||

వ్యాఘ్ర చర్మాంబర ధరం త్రినేత్రం శూలధారిణం | పూర్వపత్రే లిఖేచ్ఛక్రం సవజ్రం చ సుదర్శనం ||

గజపృష్ఠాధిరూఢం తు స్వర్ణాభం పీతవాససమ్‌ | ప్రాగ్గక్షిణ తథా పత్రే లిఖేద్వహ్నిం మహాప్రభం ||

ధూమాభవసనం దేవం శుకయానగతం ప్రభుం | అతసీ పుష్పసంకాశం పీతాంబర ధరం శుభమ్‌ ||44||

సదండం మహిషారూఢం లిఖేత్పత్రేతు దక్షిణ | ఉష్ట్రారూఢం విరూపాక్షం లిఖేత్‌ దక్షిణ పశ్చిమే ||

రక్తాంబరధరం కృష్ణం ఖడ్గపాణిం విభీషణం | పశ్చిమేవరుణం దేవం సపాశం హంస వాహనం||

సశుక్ల వసనం దేవం స్వచ్ఛ వైడూర్య సన్నిభం ||

పశ్చిమోత్తరతో వాయుం వాయుమండల మధ్యగం ||

లిఖేచ్ఛ్రు భ్రాంబరం శ్వేతం సర్వాభరణ భూషితం | కుబేభేరముత్తరే పత్రేవ్యోమయాన గతం లిఖేత్‌ ||

కపచోత్తమ సంయుక్తం గదినం కమలప్రభం| వృషారూఢ మథేశానం పత్రే పూర్వోత్తరే లిఖేత్‌||

వ్యాఘ్ర చర్మాంపరధరం బాలచంద్ర విభూషితం |

బ్రాహ్మణునికి పేముకుర్చీ క్షత్రియునికి భద్రపీఠము, వైదలము (వెదురుతోజేసిన ఆసనము) వైశ్యునికి కొయ్యపీట శూద్రునికి స్నానమున కర్హములు, కృష్ణాజినము పులుచర్మము రదు (ఒకేలేడిజాతి) చర్మము భాస్తము=మేక చర్మమును వరుసగా బ్రహ్మణాదులకు పాదములక్రింద నుపధానములుగా నుంపదగును, ఎద్దు గుఱ్ఱము రథము ఏనుగు మనుష్యుని మూపును ననుదాన నెందైన స్త్రీ యొడిలోను శిశువులను గూర్చుండబెట్టి యాస్నానము సేయింపనగును. స్నానమునకు ముందు నలుగు వెట్టుటకు వాడిదగిన ద్రవ్యములు పునర్నవ (గల్జేరు) రోచన=గోరోచనము శతాహ్వ=పిల్లితేగ గురుణి=కృష్ణాగరు త్వక్కు=దాల్చిన చెక్క యష్టిమధుకము రజనీద్వయిము రెండు రకాల పసుపు (1) పసుపు (2)కస్తూరి పసుపు తగరము = నందివర్థనము నాగకేసరములు ఆసురి=తెల్లని ఆవాలు సర్జిక=జాజికాయ మాంసి=జుటామాంసి రామఠము=అంకోలము చందనము ప్రియంగుపు=ప్రేంకణము సర్షపములు=నల్ల ఆవాలు కుష్ఠము = చెగల్వకోష్టు కుంకుమ పువ్వు బహు పత్రిక = తులసి బల బిట్టా ముట్టి ఇంద్రహస్తి బ్రాహ్మ సరస్వతి ఆకు (మండూకపర్ణి) అనునోషథులు మూలికలు, పంచగవ్యములు సక్తువు (పేలపిండి)తో నలుగు పెట్టవలెను. చక్కనిచోట మండలమేర్పరుపువలెను. అది నలుచదరముగా నెనిమిది మూలలు దీరియుండవలెను. గోమయముతో దానినలుకవలెను. తోరణ మేర్పరుపనగును. నాల్గు ద్వారములను నాల్గు ప్రాకారములను నేర్పరిచి వానిని జక్కగా నలంకరింపవలెను. అందు నడుమ అష్టదళ పద్మము లిఖింపవలెను. దాని దుద్దున విష్ణువుని మేఘశ్యాముని పీతాంబరధారిని కౌస్తుభోరస్కుని శంఖచక్ర గదా ధరుని జిత్రింపవలెలు. దక్షిణమున పద్మ వర్ణునిగ అజినాంబరదారి శ్వేతయజ్ఞోప వతునిగా బ్రహ్మను లిఖింపవలెను. కైలాసమట్ల (వెండికొండవలె) నచ్చము తెల్లగనున్న రుద్రుని వామాభాగమందు వ్యాఘ్రచర్మాంబరునిగ త్రినేత్రునిగ శూలధారిగా జిత్రింపవలెను. తూర్పువైపు రేకులందు వజ్రధారిని గజారుఢుని సుదర్శనుని నింద్రుని జిత్రింపవలెను. ప్రాగ్ధక్షిణముగ అగ్నేయమూల ధూమాంబరుని మహాతేజస్విని అతసీ (అగిస) కుసుమవర్ణునిగ చిలుక వాహన మెక్కిన వానిగ పీతాంబరధారిగ నగ్నిభట్టారకుని చిత్రింపవలెను. దండముగొని దున్న నెక్కిన యముని దక్షిణాదిశా పత్రమందు వ్రాయవలెను. నైరృతిమూల నొంటె నెక్కిన వానిగా వికృరనేత్రునిగా రక్తాంబరధారిగా నల్లని వానింగా ఖడ్గ హస్తునిగా భయంకరునిగా నిరృతిని జిత్రింపవలెను. పడమటి దిక్కునందలి పత్రమందు వరుణుని పాశధరుడై హంస నెక్కిన వానింగా చిత్రింపవలెను. తెల్లని వలువలుదాల్చి అచ్చమైన వైడూర్యమణిరం గులో నున్నట్లు వాయుదేవుని వాయుండల మధ్య మందున్న వానింగా వాయవ్యమూలను లిఖింపవలెను. తెల్లని వస్త్రములూని తెల్లని వానింగా సర్వాభరణ భూషితునిగనుత్తరపు వైపు పత్రమందు విమాన మెక్కి ఉత్తమకవచమును గదను ధరించికమల ప్రభగల వానింగా కుచేరుని లిఖింపవలెను. ఎద్దు నెక్కి యీశన్యదిశయందీశానుని పులితోలు కట్టుకొని బాల చంద్రుందాల్చినట్లు చిత్రింపవలెను.

చతుర్భిః సాగరైః పద్మం చతురస్రం సమంతతః ||

యాదోగణయుతైశ్త్చెవ క్రమేణ పరివారయేత్‌ | సాగరాణాం తు పూర్వేణ లిభేత్పద్మం మనోహరం ||

తతశ్చక్రం తథా దండం వజ్రం మకరమేవ చ | శక్తిం ధ్వజం త్రిశూలం తు క్రమేణౖవతు విన్యసేత్‌ ||

తతః ప్రాకార సంలగ్నా నిఘాన్‌ ద్వాదశ విన్యసేత్‌ | చతురః సూక్తిషు తథా ద్వార్టేష్వష్టౌ భృగూత్తమ ||

సుసంహతాన్సమాన్‌ శ్లక్షాన్తురంగాన్‌పత్ర నిర్గతాన్‌ | వ్యామార్ధ స్మితాం స్తీక్షాన్పార్శ్వేపక్ష విభూషితాన్‌||

పంచరంగం తతః సూత్రం బధ్నీయా త్తేషు భార్గవ | అరుందన్‌ద్వార మార్గాంస్తు సుదృఢం సుమనోహరం ||

వితానం మండలీ కుర్యా చ్ఛ్వేత వర్ణం మనోహరం | ధ్వజం ఛత్రాణి ఖడ్గాంశ్చ ఘంటాదర్మాం శ్చతుర్దిశం ||

ప్రాకోరోపరి దండేషు సుదృఢేష్వ నిరోధయేత్‌ | స్నానే మండలకాన్‌ కుర్యాత్‌ ప్రాకారస్య తతో బహిః ||

త్రిసమాన్‌ భృగుశార్దుల! చతురస్రాన్‌ మనోహరాన్‌| జ్వాలా మాల్యా ర్ఘరచితా న్దిశాసు విదిశౌసు చ||

స్నాన మండలకానాం తు సమీపే సుసమం తతః | గావః సవత్సాః సంస్థాప్యా వృషభాశ్చ సుపూజితాం ||59||

అజాశ్చార్భక సంపన్నా జీవమోక్షాశ్చ పక్షిణః | ప్రాకరస్యోత్తరే భాగే వేదిం కుర్యాత్‌ సుశోభితాం |

ధర్భైరాచ్ఛాద్య తాన్‌ సర్వాన్‌ సలిలేన సముక్షయేత్‌ | తత్రాగ్నిం జుహుయాన్మంత్త్రె ర్మహావ్యాహృతి పూర్వకమ్‌ ||

యథోక్త దేవతాలింగై స్తథా మంత్త్రెశ్చ భార్గవ | ఓం కారేణ తథాస్త్రాణాం నామ యుక్తేన వైపృథక్‌ ||

అశత్థోదుంబరప్లక్ష బిల్వార్క ఖదిరాః శమీ | స్వరాహ్వయమపామార్గం పాలాశయవ కాన్యపి ||

వంశికా చా శ్వగంధా చ కదంబశ్చౌ ర్జునాసనౌ | ఏతేషాం సుమిధః శస్తాః కిష్కుమాత్రా ఘృతప్లుతాః ||

ఏకైకమప్యష్టశతం హవ్యం సర్షప సంయుతం | తిలాన్యవాం స్తథాక్షోటాం ల్లాజాశ్చాగ్నౌ సమావపేత్‌ ||

తతశ్చా వపయే చ్ఛాన్తిం బ్రాహ్మణాన్గుణ సంయుతాన్‌ | అభ్యర్చ్య దక్షిణాభిశ్చ పుష్పాక్షతఫలై స్తథా ||

తతస్తు స్థాపనే త్కుంభాన్మ మండలే సాగరోపరి | యథా దిగ్గేవనామాం కాన్దిశాసు విదిశాసు చ ||

కాంచనా న్రాజతాంస్తామ్రానథ వాపి మహీమయాన్‌ | నామాన్య థైషాం వక్ష్యామ తాని మే గదతుః శృణు

భద్రః సుభద్రః సిద్ధార్థ శ్చ తుర్థః పుష్టివర్దనః | అమోకశ్చిత్రభానుశ్చ వర్జన్యోథ సుదర్శనః ||

వాపీ కూప సరిద్భ్యశ్చ పూరయిత్వా జలేన తాన్‌ || వనస్పతి సమాయుక్తాన ర్ఘ్యమాల్యది పూజితన్‌ ||

మంత్రాను మంత్రితానేతాం స్తత్ర మంత్రం నిబోధమే | స్థాపయన్తు ఘటానే తాన్సాశ్వి రుద్రమరుద్గణాః ||

నలు చదరముగా అష్టదశ పద్మము నలువైపులను తిమిమింగలాది జల జంతువులతోడి నాల్గు సముద్రములను క్రమముగ చుట్టునట్లు చేయవలెను. సముద్రములకు దూర్పున జక్కని పద్మమును వ్రాయవలెను. అటుపై చక్రము దండము వజ్రము మకరము (మొసలిని) శక్తిని (అయుధవిశేషము) ధ్వజము త్రిశూలము ననువానిని వరుసగా న్యాసము సేయవలెను. ఆపైని ప్రారములందంటిన విధముగా బండ్రెండు బాణములను రచింపవలెను. సూక్తులందు నాలుగు, ద్వారములందు, ఎనిమిదిని నుంచవలెను. చక్కగ బలసి నున్నగనుండి వాటెడులో సగము పరిమితి గలిగి తీక్షుముగనున్నవియునగు, గుఱ్ఱములు పత్రములనుండి వెలుపలకు వచ్చుచున్నట్లు చిత్రించి వానిని పంచవర్ణముల త్రాడుతో బంధించవలెను. ద్వారమును మాయకుండ మనోహరమగు తెల్లని వితానము (చాందినీ)ను మండలాకారముగ చుట్టవలెను. మఱియు ధ్వజమును గొడుగులను కత్తులను గంటలను అద్దములను నాలుగు దిక్కులందు ప్రాకారముపైన దృఢములైన కొయ్యలకు గట్టవలెను. ప్రాకారమునకు వెలుపల స్నాన మండలకము (తొట్లు)లు చతురస్రములై మనోహరములై దీపపు కాంతులు, పూలదండలు' పూజపరికరములలో నొప్పుంచు దిక్కులందు విదిక్కులందు నుండవలెను. వానికి సమీపమునందు పూజితములై లేగలతో గూడిన గోవులను, వృషభములను, దూడలతో మేకలను, పక్షులను, ప్రాకారమునకు నుత్తరమున జక్కని శోభతో వేదిక గట్టువలెను. ఈ చెప్పినవాని నన్నింటిని దర్భలతో గప్పి యుదకముతో బ్రోక్షింపవలెను. ఆవేదియందగ్నిని బ్రకిష్ఠించి మహావ్యాహృతి పురస్సరముగ మంత్రములతో హోమము సేయవలెను, ఆహోమమునందాయా దేవతాలింగములు గల మంత్రములను సంపుటీకరింపవలెను. ఓంకారపూర్వకమయిన ఆయా యస్త్రముల పేరుతో వేఱు వేఱుగ నీ హోమము సేయవలెను. అందుపయోగించనగు సమిథలు రావి మేడి ప్లక్ష=జువ్వి మారేడు తెల్లజిల్లేడు చండ్ర జమ్మి స్వరాహ్యము=దేవిదాయ, మరువము మ్రానిపసుపు ఉత్తరేణు మోదుగ యవకము యవలు వంశిక వెదురు అశ్వగంధ=పెన్నేరుకదంబము=కడిమి అర్జున=మద్ది అసన=వేగిస అను వృక్షములకు సంబంధించనవి వాడవలెను. అవి నేతితో దడిపి కుష్కు (జానెడు) మాత్రములుగా (బొడన వేలు చూపుడువ్రేలు చాచినంత ప్రమాణములో) నుండవలెను. ఆవాలతో గలిపి యీయీ సమిథలను ఒక్కొక్కదానిని యెనిమిది వందలు (నూటఎనిమిదేమో) నువ్వులను యవలను అక్షోటములను=కొండ గోగుగింజ హోమము సేయవలెను. శాంతి పాఠము గావింపవలెను. గుణవంతులయిన బ్రాహ్మణులను పుష్పాక్షతలతో దక్షిణలతో బూజించిన తరువాత నాకుంభములను ఆయా దిక్కులు మూలల దేవతల పేరులతో బంగారు వెండి రాగిగాని లేక మన్ను అను వానిలో నేదేని పదార్థముతో దయారైన కుంభములను సముద్రములపైని మండలమందు నిలుపవలెను.వీని పేరులం దెల్పెద విను. భద్రము సుభద్రము సిద్దార్థము పష్టివర్థనము అకుమోకము చిత్రబానువు పర్జన్యము సుదర్శనము. అనునవి. నూతులు దిగుడు బావులు నదులనుండి గొనివచ్చిన నీరు వనస్పతులు (చెట్ల కొమ్మలు నాకులు) నింపి పూజించి అర్ఘ్యముతో పూలమాలలతో నలంకరించి ఆయా మంత్రములచే ననుమంత్రితములై యీ షుటముల నక్కడ నిలుపవలెను.-అందుపయోగింపనగు మంత్రము తెలిసికొనుము.

విశ్వేదేవాస్త ధాదిత్యా వసవో మునయస్తథా | అధిశ్రయస్తు సుప్రీ తాస్తథాన్యా అపి దేవతాః ||

ఏవం సస్థాప్య తాన్కుంభాన్‌ మండ ప్యాస్థాకేండలే ష్వథ| ఐంద్రాదిక్రమశః స్థాప్యాస్త్వాసనే పూర్వచోదితే ||

పూర్వే మండలకే స్థాప్యాః శుక్లపుష్పాంబరాన్వితాః | సర్వత్ర గ్రాహయే ద్విఘ్రైర్వక్ష్యమాణ గుణాన్ఘటాన్‌||

ప్రత్యేకం స్యాచ్చతుర్భిస్తు ద్వారస్యోపరి భార్గవ | అపాం పూర్ణం ఘటం తత్రయథాశం చ యథాశ్వకమ్‌ ||

తథా దద్యాద్యధా స్నానం సమ్యక్‌ స్నాప్యస్య జాయతే | ఓషధీష్చాత్ర వక్ష్యామియాస్తు కుంభేషు నిక్షిపేత్‌ ||76||

అస్థాపితేషు ధర్మజ్ఞ తతః సంస్థాపనం భ##వేత్‌ | జయాం జయన్తీం విజయాం సూకరీం మర్కటీం వచామ్‌||

కాయస్థాం చ వయస్థాం చ బృహతీం బహుపుత్రికాం | సహస్త శతవీర్యే చ త్రాయమాణాం కుటుంబరాం ||

అతి ఛత్రాం తథా ఛత్రాం జీవంతీ మపరాజితాం | జటిలాం పూతనాం కీశాం సురాం యక్షసురాం తధా ||

అవీత రాక్షసీంవీరాం స్థిరాం భద్రాం యశోబలాం | శంఖపుష్పీం విష్ణుదత్తాం నాకులీం గంధనాకులీం ||

గోలోమ్య తిబలే చైవ వ్యాఘ్రీ మశ్వవతీం తథా | శ్యామాం జ్యోతిష్మతీం చైవ తేషు కుంబేషు నిక్షిపేత్‌ ||

చందనో శీరతగర కుంభ మాగురుకే సరాన్‌ | త్వక్పత్ర మున్తహ్రీ బేరప్రియం గ్వేలారసాం స్తథా ||

గంధమాంసీం తథా స్పృక్కాం రోచనం రామకం బుటిమ్‌ | కశేరు కామృతానం చ కకుంభం పద్మకం తథా ||

కస్తూరికాం తరుష్కం చ కర్పూరం నాడికం తథా | జాతీఫలం లవంగాశ్చ కక్కోలైః సహ చూర్ణితాః ||

గంధద్రవ్యాణి చాన్యాని యధాలాభం వినిక్షిపేత్‌ |

అశ్వినిదేవతలు రుద్రులు మరుద్గుభములు విశ్వేదేవులు ఆదిత్యులు వసువులు మునులును నింకనుగల దేవతలు ప్రేతులై యీ ఘటములను బ్రతిష్ఠంతురుగాక! మండలమునందిట్లు ధ్యాయుడు=పురోహితుడు కుంభములను నిలుపవలెను. ఇంత మున్ను దెల్పిన పీటమీద నిందాది క్రమముగ నాయా దేవతలనందు ప్రతిష్ఠింపవలెను. తూర్పుదెస మందల మందల తెల్లని పువ్వులు నూతన వస్త్రమునలంకరించిన కుంభమును స్థాపింపవలెను ఈమీద చెప్పబోవు నాయా కుంభములను బ్రాహ్మణులచే గ్రహింపజేసి నిలుపవలెను. నాల్గు కుంభములను బ్వారముపైని బ్రత్యేకముగ సుంపవలెను. జలపూర్ణములయిన యా బిందేల యా దిక్కుల వరుసగ నాయా దేవ తలకు సంబంధించిన దానినుంచవలెను. ఆమీద శాంతి స్నానము చేయవలసిన వానిని శాంతి స్నానము సేయింపవలెను ఆ పూర్ణ కుంభములందుంచవలసిన ¸°షధులంచెల్పద.

ఆవిధముగ పూర్ణకుంభ ప్రతిష్ట పూర్తియగును. ఆకుంభమందు నింపవలసిన మూలికలు:- జయ=పెద్దనెల్లి జయంతి=పసుపు, విజయ=తెల్లవాని సూకరి=నేలతాడిగడ్డ మర్కటి=కానుగ వచ కాయస్థ=ఉసిరి వయస్థ=సోమలత బృహతి=నేలముగ బహుపుత్రిక=పర్పటి సహస్ర=మయూరశిఖ శతవీర్య=గరిక త్రాయమాణ=గోరింట కటుంబర=గొంతెమగోరు అతిఛత్ర సదాపచత్ర=కొత్తిమిరి జీనంతి=మనుబాల అపరాజిత=విష్ణుక్రాంత జటిలా=పిత్పలి లేక దమనము పూతనా=గంధమాంసి కీశా=ఉత్తరేణిసురా=దేవదారు యక్షసుర=మఱ్ఱి అవీత=కిసిమిసి రాక్షసి=ముర, వీరా=పట్టివేరుస్థిరా=ముయ్యాకుపొన్న భద్రా=జమ్మి లేదా తమలపాకులు యశోధర=తుంగముస్త, శంఖపుష్పి=దింటిన విష్ణుదత్త=ఎఱ్ఱములుగ నాకులి=తెల్ల చర్లగడ గంధనాకులి=రాస్న గోలోమి=అక్కలకర్ర అతిబల=పేరాముట్టి వ్యాఘ్రి=వాకుడు అశ్వమతీ=భూత కేశలత(ఏటిఅచ్చ) శ్యామ=బదనిక జ్యోతిష్మతి=చిన్న వెక్కుడు కుంభ=తెల్లతెగడ మాగధి అడవి మొల్లనాకేసరములుత్వక్పత్ర=ఆకుపత్రి ముస్తా=తుంగముస్త హ్రేబేరము వట్టివేరు ఏలకులు చెఱకురసము గంధమాంసి జటామాంసి స్పృక్కా మాలతి, బామంతి రోచనము= రేల రామఠము ఊడుగ కశేరు= గడ్డి దుంప తురుష్కము=ఒము. (తెల్లకలిగొట్టు) పచ్చ కర్పూరము నాడికమనుకూర, జీజిపండ్లు లవంగాలు కక్కోలములు నను వానితో గావించిన చూర్ణము వంటి ఇతర గంధద్రవ్యములు స్నానార్థముగ నీ పూర్ణ కలశమందు నింపవలెను.

శ్వేతారక్తా తథా పీతాకృష్ణా చైవ హిమృత్తికా ||

యాశ్చాన్యా వివిథాశ్శస్తా మృతికాస్తా నిబోధమే | వృషాగ్రశృం గాద్వల్మీ కాద్దేవతాయ తనాద్ర్వజాత్‌ ||

అగ్న్యా గారాద్ధస్తి దన్తాత్సు భగాగణికా గృహాత్‌ | రాజద్వారా త్పురద్వారా త్కూపా ద్దానగృహాత్తథా||

కుంభకార గృహాన్నద్యాః పద్మిన్యాః శ్రోత్రియా లయాత్‌ | ఇంత్రనీల తడాగా చ్చ హ్రదాత్ప్ర స్రవణాదఫి||

చతుష్ఫధా త్సప్తపథా న్మృత్తి కాశకటా త్తథా| గజాశ్వగణశాలాభ్య స్తతా థరణ వేశ్మనః ||

అజా వికాన్వితాగారా ద్రాజకోశా న్మహాసనాత్‌ | అశోకా తీరవృక్షాణాం సమీపాత్‌ సఫలస్య చ ||

సదాధ్యయన శాలాతో యజ్ఞభూమే శ్చ మృత్తికాః | ప్రగృహ్య సర్వాః సంభృత్య పంచగవ్య సమ న్వితాః ||

సర్వబీజైః సమాయేజ్య స్నాన కుంభేషు నిక్షిపేత్‌ | తతః కుంభాన్‌ ప్రతిష్ఠాప్య స్నాప్యం సంస్థాపయే ద్విజః ||92||

మండలేషు క్రమేణౖవ దిశాను విదిశాసు చ |

తెలుపు నెఱుపు పసుపు పచ్చని నల్లని ప్రశస్తములైన మృత్తికలు ఎద్దుకొమ్ము కొనతో బెల్లంగింపబడిన పుట్టమన్ను దేవాలయము గొల్లపల్లె అగ్ని హోత్ర శాలలందలి మన్ను ఏనుగు దంతముతో పెల్లగింపబడిన మృత్తిక వేశ్యసుందరి యింటి నుండి కొన వచ్చిన మన్ను రాజద్వార పురద్వారము లందలి మన్ను నూతి మన్ను దానగృహము కుమ్మరి యింటి నుండి తెచ్చినది నదులు తామర కొలనులలోనిది మడుగులు వాగులనుండి తెచ్చినది చతుష్పథము నాల్గు దారులకూడలిలోనిది, మట్టి బండిలోనిది ఏనుగుల గుఱ్ఱాల మందలు ముసలు శాలలలోనిది అధర్వ వేదజ్ఞుని యింటిలోనిది గొఱ్ఱలు మేకలుగల యింటిలోనిది రాజుయొక్క కోశాగార మందలిది వంటశాలది. అశోక వృక్షములు క్షీరవృక్షములు (పాలుగారెడి చెట్లు) ఫలవృక్షములు ప్రాంతమందలి మన్ను నిరంతర వేదాధ్యయనము జరుగు గృహమందలిది యజ్ఞభూమిలోనిదియు నగు మృత్తులను సేకరించి పంచగవ్యములతో దడిపినధాన్యములు చేర్చి యీ స్నా కలశములందు నింపవలెను. దిక్కులందు విదిక్కులందుగల మండలములందు పిమ్మట కుంభములను ప్రతిష్ఠించి బ్రాహ్మణుడు స్నానము చేయింపదగిన వానిని స్థాపించవలెను.

పూర్వే మండలకే స్నాప్యః శ్వేతమాల్యా నులేపనః ||

శ్వేతశ్త్చెవ పటోధార్య శ్చతుర్భిః బ్రాహ్మణౖ ర్భవేత్‌ || ఏవం దక్షిణతస్తస్య సర్వం నీలం ప్రకల్పయేత్‌ ||

కృష్ణం చ కల్పయేత్సర్వం తథా దక్షిణ పశ్చిమ్‌ |

(పీతం ప్రకల్పయేత్సర్వం తథా భాగే తు పశ్చిమే ||) పశ్చిమోత్తరయోః సర్వం శుక్లవర్ణం ప్రకల్పయేత్‌||

తథైవోత్తర దిగ్భాగే పద్మవర్ణం ప్రకల్పయేత్‌ | ప్రాగుత్తరే తథా భాగే చిత్రం సర్వం ప్రకల్పయేత్‌||

రాజ్యాభి షేకవిహితో మంత్రశ్చాత్ర విధీయతే | ప్రత్యేకమథ కుంభేషు దిశాసు విదిశాసు చ ||

ఏవం స్నాప్యో మహాభాగ శంఖపుణ్యాహనిస్వనై ః | స్నాతః శుక్లంబరధరః శ్వేతమాల్యాను లేపనః ||

మండలేతు నివిష్టానాం సురాణాం పూజనం తతః | కుర్వీత ప్రయతః శుద్ధ గంధమాల్యార్ఘ సంపదా ||

దీపై ర్ధూపైర్నమస్కారైర్వసై#్త్రరాభరణౖస్తథా స్తాథా| అపూపాన్పాయసం భక్ష్యాన్‌ శుక్లమాల్యా నులేపనమ్‌ ||100||

వివిధం చ ఫలం క్షీరం బ్రాహ్మణభ్యో నివేదయేత్‌ | దధ్నా చ పరమాన్నేన శ్వేత మాల్యా నులేపనైః ||

ఫలైః ప్రసూనైశ్చ తథా కేశవాయ హరేద్బలిమ్‌ | క్షీరేణ పరమానేన్నే దధ్నా సకృసరేణ చ ||

ఫలైః కాలద్భోవైః పుషై#్పః శంకరాయ హరేద్బలిమ్‌ | అపూపైః పరమాన్నేన భ##క్ష్యెః క్షీరేణ సర్పిషా ||

మాల్యాను లేపనైః శుక్లైర్మహేంద్రాయ హరేద్బలిమ్‌ | యవానాం చ తిలానాం చ గోధూమానాం తధా సకృత్‌ ||

భ##క్ష్యైః సగుడసర్పిషై#్కర్బలిం కుర్యాత్తువహ్నయే | గడౌదనగుడాపూపాన్పక్వ మాంసం తథా మిషమ్‌ ||

యమాయ చ బలిం దద్యాద్రక్త మాల్యాను లేపనమ్‌ | పక్వ మాంసం తథా మాంసం కృష్ణమాల్యాను లేపనమ్‌ ||

వరుణాయ బలిం దద్యాత్పీతం మాల్యాదికం తథా |

తూర్పు మండలమందు స్నానము సేయింపదగిన యజమానుడు నల్గురు విప్రులతోగూడ తెల్లమాలలను గంధమును దాల్చి తెల్లని వస్త్రములు దాల్చవలెను. అవ్వల దక్షిణదిశను నీలము రంగు మాలలు వస్త్రములు మొదలైనవి యుపయోగించవలెను. నిరృతి దిశ నల్లని సామగ్రి వాడవలెను. పడమటి దెస పసుపు పచ్చ సామగ్రి వాయువ్య మూలనంతయు తెల్లనిదే ఉత్తరదిశను ఎఱ్ఱ తామరపూవు రంగు వస్తువులను వాడవలెను. ఈశాన్యమూల రంగురంగుల సామగ్రి యుచితము. రాజ్యాభిషేక మందుపయోగించు మంత్రములే యిక్కడను నుపయోగింపనగును. దిక్కులందు మూలలందును పూర్ణకుంభముల నిట్లేర్పరచి శంఖ భేరి ప్రముఖ మంగళ వాద్యములతో పుణ్యాహ ఘోషముతో నీ స్నానము గవింపవలెను. స్నానము సేసి తెల్లని మడుపులు మాలలు గంధమునుందాల్చి ప్రయతుడై మండలమందుంచబడిన యాయా దేవతల పూజను గంధమాల్యాదులతో గావింపవలెను. షోడళోపచార పూజసేసి ఆభరణములు అప్పములు పాయసము భక్ష్యములు మాలలు గంధము పెక్కురకముల పండ్లుపాలు బ్రాహ్మణులకు నివేదింపవలెను. పెరుగు పరమాన్నము తెల్లని మాలలు గంధము పండ్లు పువ్వులతో విష్ణువునకు బలి యీయవలెను. అట్లే యాకాలమందు దొరకు తెల్లనిపూలు మాలలు పండ్లు పులగముతో శంకరునర్చింపవలెను. ఇంద్రునకు నప్పములు పాయసము మొదలయిన వానితో నిట్లే పూజగావింపవలెను. యవలు నువ్వులు గోదుమలు భక్ష్యములు బెల్లమునెయ్యితో వండినవి పలురకాలు పలుమార్లు అగ్నికి నివేదింపవలెను. బెల్లపన్నము బెల్లపు అప్పాలు పక్వ మాంసము ఎఱ్ఱని పూలమాలలు గంధము యమునికర్పింపవలెను. విరూపాక్షునికి సుర కల్లు, సౌవీరము (మద్యవిశేషము) పెసర కుడుములు నువ్వులతోడి అరిసెలు జలములు మందిరములు పసుపు పచ్చని పూలు మాలలు వరుణుని కర్పింపవలెను.

యవగోధూమ చణకమాష సక్తూన్సగోరసాన్‌ ||

కుల్మాషఘృత సంయుక్తాన్‌ బలిం దద్యాత్తు వాయవే | భక్ష్యాం శ్చ మధుసంయుక్తాన్మద్గ మిశ్రాం స్తథా మిషమ్‌ ||

చిత్రం మాల్యం కుంకుమం చ కుబేరాయ హరేద్బలిమ్‌ | శింబిధాన్య భవాన్భక్ష్యాన్‌ శాల్యన్న సగుడం దధి |

ఈశానాయ బలిం దద్యా చ్ఛక్లమాల్యా నులేపనైః | శుక్లౌదనం శుక్లమాల్యం శూలాయోపహరేద్బలిమ్‌ |

తథా పంచరసైః సిద్దం దద్యా ద్వజ్రాయ బుద్ధిమాన్‌ | కృసరం గంధపుష్పాఢ్యం దధ్యా చ్ఛుక్రాయ పాయసమ్‌ ||

ఫలోదనం రక్తమాల్యం దద్యా చ్ఛక్త్యై తథా బలిం | స్నానమండలం కేభ్యోపి బలిం దద్యాత్తతో బలిమ్‌ ||

బాలక్రీడనకాన్భక్షాన్‌ ఫలాని వివధాని చ | మత్స్యామిషం సరుధిరం పాయసం తిలతండులమ్‌ ||

యకృదంత్రాణి హృదయం భూతేభ్యో బలిమాహరేత్‌ |ఓంకారాద్యై శ్చతుర్థ్యన్తైః స్వాహాకార సమన్వితైః ||

రాజ్యాభిషేక మంత్రోక్త దేవతానాం పృధక్‌ పృధక్‌ | నామభిర్జుహుయాద్వహ్నౌ యథాశ్రద్ధం యథాఘృతమ్‌ ||

పూర్ణాహుతిం తతో దత్త్వా దేయా విప్రేఘ దక్షిణా | కనకం రజతం గావో వాసంసి వివిధాని చ ||

కర్త్రే చ దక్షిణాదేయా తధా రామ విశేషతః | దత్తం వస్త్రాది దేవేభ్య స్తథా స్నాన ఘటాదికమ్‌ ||

కర్తా యదేష్టం విభ##జే త్తస్య భాగోహి7స స్మృతః | ఘృతే7థ వదనం దృష్ట్యా నమస్కృత్య చ దేవతాః ||

మంగల్యా లంభనం కృత్వా ఫలపాణి రుదజ్ముఖః | తస్మా ద్దేశాద్వినిర్గత్య గృహం యాయా త్తతః స్వకమ్‌ ||

తత్రతిష్ఠేద్ధవిష్యాశీ బ్రహ్మచారీ చ తాం నిశామ్‌ | స్నాపితో బ్రహ్మపూతేన స్నానేనాయం యథా భ##వేత్‌ |

సర్వాన్కామానవాప్నోతి స్వర్గలోకం చ గచ్ఛతి | పురా దేవాసురే యుద్ధె శక్రా యెత్తద్‌ బృహస్పతిః ||122||

కృతవాన్‌ పురు హూతాయ తతశ్శక్ర స్సురాధిపః | జమాన దైత్య ముఖ్యానాం నవతీర్నవ భార్గవ! ||

ధన్యం యశస్య రిపునాశకారి రక్షోహణం పాపహరం పవిత్రమ్‌|

రోగాపహం వినినాశకారి సాఘ్ననం మయాతే విహితం యథార్థమ్‌ ||

ఇతి శ్రీవిష్ణు ధర్మత్తరే ద్వితీయఖండే దిక్పాల స్నాన వర్ణనం నామ చతురుత్తర శత తమో7ధ్యాయః||104

యవలు గోధుమలు సెనగలు మినుములు పేలపిండి గోరసములు గుగ్గిళ్ళు నేతితోగూడినవి వాయువునకు బలి యీయవలెను. కుబేరునకు తెనెతోను పెసలతో మిశ్రితములైన భక్ష్యములను అమిషమును చిత్రమాలలను కుంకుమలను సమర్పింపలెను. ఈశానికి శింబి ధ్యానమున జేసిన పిండివంటలను వరియన్నము బెల్లముతో గూడిన పెరుగు శుక్లమాల్య గంధములతో బలి సమర్పించపనగును. శూలాయుధమునకు తెల్లని యన్నము మాలలు నొసంగవలెను. పంచరసములతో సిద్ధమైన పదార్థమును వజ్రమున కొసంగవలెను. పులగము పాయసము గంధ పుష్పాదులతో శుక్రుని కర్పింపవలెను. ఫలోదనం (పండ్లతో కూడి అన్నము) రక్తమాల్యములు శక్తికి నివేదింపవలెను. స్నానమండలకాధిష్ఠాన దేవతలకు గూడ అవ్వల పూజగావింపవలెను. అందు పిల్లల అటబొమ్మలు భక్ష్యములు పలు రకాల పండ్లు చేప మాంసము రక్తముతో తిల తండులములతో పాయసము యకృత్‌ ప్రేవులు హృదయము భూతములకు బలి యీ యవలెను. ఓంకార సంపుటిచ చతుర్థీ విభక్త్యంతములయిన నామములతోడి స్వాహాకారముతో రాజ్యుభిషేక మంత్రములందు బేర్కొన బడిన దేవతలకు వేర్వేర శ్రద్ధతో నగ్నియందు హోమములు పూర్ణాహుతి చేయవలెను. విప్రులకు దక్షిణ నీయవలెను. ఆ దక్షిణకై బంగారము వెండి గోవులు వివిధ వస్త్రములు నీయవలెను. స్నానకర్తకు అనగా వురోహితునికి విశేష దక్షిణ, దేవతకు సమర్పించిన వస్త్రాదులు స్నాన ఘటాదికము నీయవలెను. అది ఆయన భాగము. ఆయన దానిని యదేఛ్ఛముగ విబాగము చేయవచ్చును. అది యాతనిదే, ఆమీదే నేతిలో ముఖము చూచి దేవతలకు మ్రొక్కిమంగశ వస్తువులు అద్దములు గోవులు మొదలయిన వానిం జేతితో దాకి యటనుండి పండ్లు చేతంబూని ఉత్తరాబిముఖుడై తన గృహమునకేగవలెను. హవిష్యము (హోమయోగ్యమయిన పదార్థము) భూజించి బ్రహ్మచర్యమూని యారాత్రి యట నుండవలెను. వేద పూతమైన స్నానము చేసిన యాతదు సమస్త కామములను ఇహలోకమున ననుబవించి యనంతరము స్వర్గలోకమున కేగును. పూర్వము దేవాసుర యుద్ధ సమయమున బృహస్పతి పురుహూతుడగు నింద్రున కీస్నానము చేయించెను. పరశురామా! అస్నాన ప్రభావమున నింద్రుడుదైత్యముఖ్యులను నవనవతి సంఖ్యాకులను (810సం||) సంహరింపగల్గెను. ధన్యతా పాదకమును, కీర్తిని కలుగజేయునదియు శత్రు నాశకమును రాక్షసఘ్నమును సమస్త పాపహారియుపవిత్రమును రోగాపనోదకము విఘ్ననాశకమును సార్థకమైనదియునగు స్నానము చెప్పబడినది.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమున ద్వితీయఖండమున దిక్పాల స్నాన వర్ణనమను

నూటనాల్గవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters