Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటయెనిమిదవ అధ్యాయము - పురుషోత్తమ పాదోదక స్నానము

రామ ఉవాచ || స్నానానామిహ సర్వేషాం యత్స్నాన మతిరిచ్యతే | తన్మమాచక్ష్వ సకలం సర్వకల్మష నాశనమ్‌ ||

పుష్కర ఉవాచ || విష్ణు పాదోదకస్నానం సర్వ కిర్బిషనాశనమ్‌ | శ్రవణరంవినాహ్యేతద్భవత్యర్థ పలం యతః

తతః కార్యం ప్రయత్నేన శ్రవణరం విశేషతః | అథోత్తరాస్వషాఢాను నిరాహారోజితేంద్రియః ||

సర్వౌషదైః సర్వ గంధై రేవదేవన్‌న్య చక్రిణః | పాదం ప్రలేపయేద్విద్వాస్కమ్రేణ చతురాత్మనః ||

తతస్తు కలశాన్కుర్యా చ్చతురః సుదృఢాన్నవాన్‌ | సౌవర్ణాన్రాజతాన్తామ్రానథ వాపి మహీమయాన్‌ ||

తతో7నిరుద్ద చరణౌ కూపాద్భిః క్షాలయేత్తతః | తాభిస్తు కలశం పూర్ణం స్థాపనీయం తదగ్రతః||

తతః ప్రద్యుమ్న చరణౌక్షాల్యౌ ప్రస్రవణోదకైః | కలశం పూరితం తచ్చ భ##వేత్‌ స్థాప్యం తదగ్రతః ||

సంకర్షణస్య చరణౌ క్షాళ్యౌతోయైశ్చ సారసైః | తైస్తుసంపూర్ణకలశం స్థాప్యం తస్యాగ్రతో భ##వేత్‌ ||

వాసుదేవస్య చరణౌ నాదేయైః క్షాలయేద్బుధః | కలశం పూరితం తైశ్చ స్థాపనీయం తదగ్రతః ||

తతః పూజాతు కర్తవ్యా యథా వచ్చతురాత్మనః | కలశా న్పూజయేత్తాంశ్చ గంధమాల్య ఫలాక్షతైః ||

అన్ని స్నానములలో శ్రేష్ఠమగు సర్వపాపహర హ్నన మొక్కటి యానతిమ్మనిపరశురాముడడుగ పుష్కరుండిట్లనియె. విష్ణోపాదోదక స్నానము సర్వోత్తమము. అది శ్రవణ నక్షత్రముతో గలియకున్నచో సగము ఫలమిచ్చును. కావున శ్రవణ నక్షత్రము నందది చేయుటకు సర్వప్రయత్నములు సేయవలెను. ఉత్తరాషాఢ నక్షత్రమునందుపసించి జితేంద్రియుడై సర్వౌషధులు సర్వ గంధములుగూర్చి దేవదేవుడగు చక్రి పాదములు పూయవలెను. అటుపై నాల్గు నూత్న కలశములను గట్టి వానిని సమాకూర్ప వలెను. అవ్వల ననిరుద్ధుని పాదములను నూతినీటితో గడుగవలెను. ఆ కడిగిన తీర్థముతో నింపిన కలశమును తొలుత నక్కడ ప్రతిష్ఠింపవలెను. ఆమీద ప్రద్యుమ్నుని పాదములు ప్రస్రవణ జలములచే (కొండవాగులనుండి తెచ్చినవానిచే) కడిగి దాన నింపిన కలశమును తరువాత ప్రతిష్ఠింపవలెను. సరస్సు నుండి తెచ్చిన నీటితో సంకర్షణుని పాదములు కడిగీ ఆనీటనిండిన కలశము నక్కడ నిలుపవలెను. అటుపై నదీజలములచే వాసుదేవుని యడుగులం కడిగి యాతీర్థము నింపిన కలశమా మీద నక్కడ ప్రతిష్ఠింపవలెను. అవ్వల యధావిధి నట్లు చతురిర్వధమూర్తియైన హరిని బూజింపవలెను. గంధమాల్య ఫలానక్షలతో నా కలశమును యధావిధిం బూజసేయవలెను.

తతః ప్రాప్తే ద్వితీయే7హ్ని స్నాతః పూర్వముపోషితః | సమ్ముఖశ్చా నిరుద్దస్య స్నాప్యశ్చ కటుకోభ##వేత్‌ ||

ప్రద్యుమ్నస్య చ దేవస్యతతః సంకర్షణస్య చ | తతశ్చ వాసుదేవస్య యథా రామస్య చక్రిణః ||

పవిత్రమంత్రైః సర్వేషాం ఘంటానామభిమంత్రణమ్‌ | కర్తవ్యం సాత్త్వతేనాథ శుచినా భార్గవోత్తమ ||

అథమంత్రాన్ప్రవక్ష్యామి కలశేషు చతుర్షు తే | మంగల్యాంశ్చ యశశ్యాంశ్చ సర్వాషు వినిషూదనాన్‌ ||

అరుద్ధమార్గాః సర్వత్ర సర్వశశ్చాపరాజితాః | వాయుమూర్తిర చిన్త్యాత్మా సో7నిరుద్ధః స్వయం ప్రభుః ||

పాదోదకేన దివ్యేన శివేనాఘవినాశినా | తథాఘ మపహృత్యాశు శివం వర్థయతాం ప్రభుః ||

లోకన్ప్రద్యోతయతి యః ప్రద్యుఘ్నో భాస్కరః ప్రభః |హుతాశనః స తేజస్వీ మంగలం విదధాతుతే ||

కామదేవో జగద్యోనిః సర్వశః ప్రభురీర్వరః |దుఃఖహర్తా జగన్నాథో మంగలాని దదాతు తే ||

జగతాం కర్షణాద్దేవో యః స సంకర్షణః ప్రభుః | రుద్రమూర్తిర చిన్త్యాత్మా సర్వగః సర్వహారకః ||

కామపాలో7రిదమనః సర్వ భూతస్య శంకరః | విశ్వయోనిర్మహాతేజా మంగలాని దదాతు తే ||

సర్వవాసో వాసుదేవో భూతాత్మా భూత భావనః | సర్వగశ్చా ప్రమే యశ్చ పురుషః పరమేశ్వరః ||

అనంతః సర్వ దేవేశో జగదాధార కారణః | అఘాపహారి వరదో విదధాతు శ్రియంతవ ||

రెండవరోజున స్నానముచేసి యుపవాసముండి అనిరుద్ధనెదుట గూర్చుండి స్నానము సేయింపవలెను. అట్లే ప్రద్యుమ్నసంకర్షణ వాసుదేవులకును స్నానము సేయింపవలెను. పవిత్ర మంత్రములచే శుచియై విష్ణుభక్తుడా కలశముల నఖిమంత్రింపవలెను. నాల్గు కలశములనభిమంత్రణము సేయదగు మంత్రములను మంగళకరములను సర్వ పాపహరములనిదె వర్ణింతును.

శ్లోకరూపములయిన ఆమంత్రములతాత్పర్యమిది, ఎయ్యెడల పరాజయింపబడని వాడును ఊహకందరాని వాడునునగు అనిరుద్ధుడు స్వయం ప్రభువైనవాడు వాయు స్వరూపుడయు యున్నవాడు దివ్యము మంగళ ప్రదము అఘహరమునైన యీపాదోదకముచేనీపాపముం ద్రోసివేసి శివమును(శుభమును) పెంపొందించు గాక ! ఏ ప్రభువు సూర్య ప్రభగొని లోకములను ప్రకాశింపజేయును హోమము సేయబడు హవిస్సుల నారగించు నాతేజోమూర్తి నాకు మంగళము నొనరించు గాక | కామముల కధీశుడు జగత్కారణుడు సర్వ ప్రభువు ఈశ్వరుడు దుఃఖహరుడు జగన్నాధుడా సంకర్షణుడు జగమ్ములను పడిపోకుండ మీదికి ఆకర్షించుచుండు నాతడు రుద్రమూర్తి అచింత్య స్వరూపుడు సర్వాంతర్యామి సర్వ సంహారకుడు కామపాలుడు శత్రు దమనుడు సర్వభూతములకు శం (సుఖమును)కరుడు చేయునాడు విశ్వకారణుడుమహాతేజస్వి నీకుమంగళముల ననుగ్రహించును గాక| అంతటనువసించువాడు భూత స్వరూపుడు భూత భావనడు(సృష్టించువాడు) సర్వాంతర్గతడు అప్రమేయుడు పురుషుడు పరమేశ్వరుడు నైనవాసుదేవుడు మాపాపములహరించి వరముల ననుగ్రహించి శ్రీ సమృద్ధిని ఐశ్వర్యమును నొనరించు గాక|

ఏవం స్నాత స్తతస్త్యక్త్వా తత్రైప స్నానవాససీ | శుక్లవాసా ఉపస్పృశ్య పూజాం కుర్యాత్క్రమేణ తు ||

గంధైః పుషై#్పః ఫలైర్ముఖ్యైర్దీపైర్ధూపై)ః సుగంధిభిః | నైవేద్యైర్వి విదైశ్చైవ సాత్వీతానాం చ పూజనైః ||

ఏవం దేవార్చనం కృత్వా సాత్త్వాతాం శాంతిదం శుభమ్‌ | భోజనం గోరసప్రాయం కృత్వా తిష్టేత్సు యంత్రితమ్‌ ||

ప్రాదుర్భావాణి ముఖ్యాని శృణుయాత్కేశవస్య చ | పాఖండ పతితానాం చ పర్జయేద్దర్శనం తథా ||

ఇతి పాదోదక స్నానం ప్రోక్తం రక్షోహణం తవ| మంగల్యం పాపశమన మలక్ష్మీ నాశనం పరమ్‌ ||

సర్వ విఘ్న ప్రశమనం సర్వభాదా వినాశనమ్‌ | దుఃస్వప్నారిష్ట శమనం సర్వ వ్యాధి హరం శివమ్‌ ||

యాత్రా సిద్ధికరం ధన్యంకర్మణాం సిద్ధి కారకమ్‌ | శత్రుఘ్నం బుద్ధిదం మేధ్యం బలాయుః స్మృతి వర్ధనమ్‌ ||

సౌభాగ్యదం కామపరం యశః పుత్ర వివర్ధనమ్‌ ||

అమోఘవీర్యం పురుషోత్తమస్య పాదోదక స్నానమిదం ప్రదిష్టమ్‌ |

స్నోనోత్తరం తే రణ చండవేగ ! భూయస్తుతేకిం కథయామి రామ

ఇతి శ్రీవిష్ణోధర్మోత్తరే ద్వితీయఖండే మా.సం. రామం ప్రతి పుష్కరోపాఖ్యానే పురుషోత్తమ పాదోదక స్నానవర్ణనన్నామా ష్టోత్తర శతతమో7ధ్యాయః ||108

ఇట్లు సమంక్రముగ స్నానముచేసి యాతడు తడిబట్టలను విడిచి నూతనములయిన తెలుపు వస్త్రములదాల్చి ఉపస్పర్శనముచేసి (ఉదకము స్పృశించి) క్రమముగా బూజసేయవలెను గంధపుష్పఫల ధూపదీపా ద్యుపచారములచే దేవునర్చించి%ి విష్ణు భక్తులకుశాంతి ప్రదమైన గోరసభరితమైన భోజనము పెట్టి నియమమంతుడై యుండవలెను. ముఖ్యములగు విష్ణునవతార కథల నాలింపవలెనుపాషండులు కులభష్ట్రులగు వారిం గన్నెత్తి చూడరాదు. ఇది విష్ణు పాదోక స్నాన విధానము పాపహరము రక్షోఘ్నము మంగళకరముఆలక్ష్మీహరము లక్ష్మీకరము సర్వవిఘ్నహరము సర్వ బాధాహరము దుఃస్వప్నములను అరిష్టములను మాన్పునది సర్వ వ్యాధి హరము శివము(మంగళ ప్రదము) యాత్రాసిద్ధినిచ్చునది ధన్యము కర్మ సిద్ధినిచ్చునది శత్రునాశకము బుద్ధి (జ్ఞానము) నిచ్చునది పవిత్రము బలము ఆయువు స్మృతిని(మేధ)పెంపొందించునది సౌభాగ్యప్రదము కామప్రదము యశస్కరముపుత్రపౌత్ర ప్రవర్థనము అమోఘశక్తికము ఇది పురుషోత్తమ స్నానము, రణమున పచండ శేగముగల ఓ పరశురామ మూర్తి ఇది సర్వోత్తమ పురుషొత్తమ స్నాన విధానము తెల్పితి నింకనేమి పల్కుదు నానతిమ్ము.

ఇది పురుషోత్తమ పాదోదక స్నాన వర్ణనమను నూటయెనిమిదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters