Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

పదునొకండవ యధ్యాయము - అశ్వలక్షణము

పుష్కరః : అశ్వానా మృషిభిఃప్రోక్తా మహోదోషాః భృగూత్తమ | యైరన్వితాః పరిత్యాజ్యాస్తన్మే నిగదతః శృణు! || 1

హీనదన్తో ద్విదన్తశ్చ కరాళీ కృష్ణతాలుకః | కృష్ణజిహ్వశ్చ యమజో జాతముష్కశ్చ యస్తథా || 2

ద్విశఫశ్చతధా శృంగీ నృవర్ణో వ్యాఘ్రవర్ణకః | ఖరవర్ణో భస్మవర్ణో జాతవర్ణశ్చ కాకుదీ || 3

శ్విత్రీ చ కాకసాదీ చ ఖరశార స్తధైవచ | వానరాఖ్యః కృష్ణసటః కృష్ణముష్క స్తధైవ చ || 4

కృష్ణ ప్రోథశ్చ మూకశ్చ యశ్చ తిత్తిరసన్నిభః | విషమశ్శ్వేత పాదశ్చ ధ్రువావర్త వివర్జితః || 5

అశుభావర్త సంయుక్తో వర్జనీయ స్తురంగమః |

రామః : వాజినాం కే ధ్రువావర్తాః కేషుస్థానేషు శోభనాః | వాజినః కే తదాశస్తా స్తన్మమాచక్ష్వ పృచ్ఛతః || 6

పుష్కరః : రంధ్రోపరంధ్రయో ర్ద్వౌద్వౌ ద్వౌద్వౌమస్తక వక్షసోః | ప్రమాణచ లలాటేచ ధ్రువా77వర్తా దశస్మృతాః || 7

ఏకో7పినభ##వే ద్యస్య ధ్రువావర్తస్తు వాజినః | నతం శంసన్తి ధర్మజ్ఞ! తస్మాత్తం పరివర్జయేత్‌ || 8

ఉత్తరోష్ఠే భృగుశ్రేష్ఠ! ప్రమాణస్య తధోపరి | నాసాపుటే తధా ప్రోధే గండ ప్రోధక్షి మధ్యగః || 9

కథయో రశ్రుపాతేన భ్రువోః కంఠాగ్రయోస్తధా | నాభ్యాం హనుబలా కక్షా స్కంధోపస్కన్ధ సంధిషు || 10

విదోబాహు ప్రదేశేచ గలమధ్యే తధైవచl ఆసనే కుకుదే ప్రోథే జానుజంఘాసు భార్గవ! ll 11

కుష్టికానాభి కక్షాసు ముష్కయో ర్మూత్ర దేశజః l త్రికేచ మూలపుచ్ఛేచ ఉపరి సూణయో స్తధా ll 12

పిండయో ర్జఠరే చైవ సీవనీయోప కుక్షిషుl ఆవర్తైర్వర్జనీయా స్స్యుః ప్రయత్నేన తురంగమాః ll 13

కకుదే కర్ణయోశ్చైవ యస్యా77వర్తః కువాజినఃl అత్యన్త మప్రశస్తం తం రాజా రాష్ట్రా ద్వివాసయేత్‌ ll 14

హస్తిదేవమణిః సర్వం పూర్వకాయేషు లక్షణః l సువ్యక్తో రోచమానో వానతు కాకుదినం క్వచిత్‌ ll 15

మేఖలా వా7ప్యధః కాయాద్ధన్యా దావర్త సంభవమ్‌ l దోషాన్సర్వాన్‌ తురంగస్య నహన్యాత్‌ కాకసాదినమ్‌ ll 16

పుష్కరుడనియె. భృగూత్తమ! అశ్వముల మహాదోషములను ఋషులు దెల్పియున్నారు వినుము. దంతములులేనిది రెండు దంతములు గలది కరాళీ = భీలి గూర్చునది నల్లని లోదవడలు నాలుక గలది. కవలలుగా బుట్టినది ముష్కములు జనించినది. రెండు రెక్కలుగలది. కొమ్మున్నది. మానవునిరంగు పెద్ద గాడిదబూడిద రంగుగలది కాకుదీ బొల్లిది ఖరశారః = వానరాఖ్యం= నల్ల జూలుగలది నల్ల ముష్కముగలది నల్లని ముట్టెగలది మూగది తీతువు పక్షివలె నుండునది --విషమః = తెల్లని పాదములు గలది ధ్రువమను సుడితేనిది? = అశుభములయిన సుడులుగలదియు నగు గుఱ్ఱము నిషిద్ధము. రాముడు గుఱ్ఱముల సుడులం గూర్చి తెలుపుమన పుష్కరుండనియె. రంధ్రమందు ఉపరంధ్రమందు మస్తకమున రొమ్మున ప్రమాణమందు = నుదుటను రెండు రెండు సుడులు మొత్తమివి పది సుడులు ధ్రువము లనబడును. శుభదములు. ఇందొక్కటియేనిసుడిలేని గుఱ్ఱమును వదలివేయ వలెను. మీదిపెదవిపై ప్రమాణము మీద ముక్కుపుటమందు ప్రోధమందు=ముట్టె గండస్థలము ప్రోధ = కండ్ల మధ్యమందు బొడ్డు దవడ బల కక్ష = ప్రక్కలు రెండు కంఠము రెండు చివరల గళము నడుమ ఆసనమందు మూపురమందు ప్రోధమున = గుఱ్ఱపు ముక్కు పిక్కలు మోకాళ్ళ మీద కుష్ఠికావర్తము అశుభావర్తములలో నొకటి (సుడి)నాభి కక్షాసు = బొడ్డున, కక్షములందు అశుభావర్తము చెడ్డ సుడి ముష్కములందు మూత్రదేశమందు త్రికమందు కడుపువ మడతలు మూడింటియందు తోక మొరలునందు సూణముల మీద పిండములందు కడుపున సేవనీయములందు ఉపకుక్షి ప్రదేశమందు ఆవటములు (గుంటలు) గల గుఱ్ఱములు దుష్టములు. రెండు చెవుల మూపురమందు సుడిగలది మిక్కిలి యప్రశస్తము. దానిని రాష్ట్రమునుండి తోలివేయవలెను. హస్తిదేవమణి యనునది గుఱ్ఱముల పూర్వకాయమునందుండు రోచమానమను సుడిగలది గూడ మిక్కిలి ప్రశస్తము. కాకుదియైన గుఱ్ఱము మాత్రము చాల నింద్యము. కకుత్తు = మూపురము. దానిమీద పుట్టుమచ్చలు గలది కాకుది యన్నమాట. ఆవర్తము = సుడి ఆగంతుకమలు = రోచగమానము శ్రీవక్షకము జుత్తు రకాలు కంఠాభిమాము శతవధి లింగములు దేవమణి మేఘల. వృషభములు అంగదము వాస్తుజము స్వాప్విజము యవళములు త్రేవాణులు కేణంతములు చాతరంతికము విక్రీణము.

అతః పరం ప్రవక్ష్యామి శుభమావర్త లక్షణమ్‌ | సృక్వీణ్యోశ్చ లలాటేచ తధా శ్రవణమూలయోః ll 17

నిగాలేచ తథా కంఠే స్తుతకేశాన్తయోస్తథా l బాహుమూలే తథాశస్తా రోమజాతా స్తురంగమాః ll 18

అవర్తస్తు నిగాలస్థో జ్ఞేయో దేవమణి శ్శుభః l కంఠజో రోచమానశ్చ సర్వావర్తో జనాధిపః ll 19

అర్కేంద్ర గోపచంద్రాభా యేచ వాయససన్నిభాః l సువర్ణవర్ణాః స్నిగ్థాశ్చ ప్రశస్యన్తే సద్తేవతే ll 20

దీర్ఝగ్రీవాక్ష కూటాశ్చ హ్రస్వవర్ణాశ్చ యే తధా l హ్రస్వప్రోధాశ్చ శస్యన్తే మేఫ°ఘ సదృశస్వనాః ll 21

పృథూరు పాదజవనాః ముఖంపుండ్రాశ్చ వై హయాః ll

చంద్రాంశు శుక్లాన్తురగాః ప్రశస్తాః కర్ణాన్త కేశైర్గవలాలివర్ణైః l

యేరక్తవర్ణాశ్చ సమగ్రపాదైః శుక్లాశ్చ వర్ణైశ్చ మహానుభావాః ll 22

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే అశ్వలక్షణం నామ ఏకాదశో7ధ్యాయః

(అశ్వశాస్త్ర గ్రంధాలు. హయలీలావతి భోజరాజీయము రేవంతోత్తరము అశ్వశాస్త్రము హాలాస్య మహాత్మ్యములో నొక ప్రకరణము. వాని పరిభాషలు ధ్రువస్థానములు. అవర్తరూపములు ఆగంతుకములు అశుభావర్తములు శుభావర్తములు వర్ణములు అనువర్ణములు చిత్రపర్వములు ముఖరజ్జువులు శిక్షాకాలములు అశ్వసంచారమార్గము గతివిశేషములు = ధారలు. వర్ణములు. ఇక శుభావర్త లక్షణములెరిగించెద. సృక్విణులందు (సెలవులందు) నుదుటను చెవిమొదళులందు మెడదగ్గర కంఠమందు స్తుతమందు స్తుతజము = శుభావర్తము కేశాంతమందు బాహుమూలమునను సుడులున్న గుఱ్ఱముల ప్రశస్తములు. నిగాలమందున్న సుడికి దేవమణి యని పేరు. కంఠమందున్నది రోచమానమనబడును. సూర్యుడు ఇంద్రగోపము = ఆరుద్రపురుగు చంద్రుని యొక్క రంగుగలసి కాకిరంగు గలవి బంగారురంగువియునై నిగనిగలాడు గుఱ్ఱములు ప్రశస్తములు. పొడవైన మెడ కనుగ్రుడ్లుగలవి. హ్రస్వవర్ణములు (ముదురురంగుగాక) లేతరంగులుగలవి పొట్టిముట్టెలు గలవి మేఘగర్జన మట్లు సకిలిలచునవి నిండైన తొడలు పాదములు వేగము గలవి ముఖమందు పుండ్రములు బొట్టుగుర్తులు గలవి చంద్రకిరణము లట్లు తెల్లవి ప్రశస్తములు. చెవులకౌసలు జూలు గవలమురంగు కలవి (గేదె కొమ్ము రంగు కలవి) పాదము లెరుపు మేను తెలుపుగల గుఱ్ఱములు కల్యాణీ గుఱ్ఱములు.

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున అశ్వలక్షణము అను పదునొకండవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters