Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటపదవ అధ్యాయము - భగవదనులేప స్నానవర్ణనము

రామఉవాచ || భగవన్ఛ్రోతు మిఛ్చామి కర్మకామ్యమహం నృణామ్‌ | కృతేన యేన కామానాం నరో భవతి భాజనమ్‌

పుష్కర ఉవాచ || సర్వేషామేవ కామానామీశ్వరో భగవాన్హరిః | తస్యసంపూజనా దేవ సర్వాన్కామాన్‌ సమళ్నుతే ||

స్నాపయిత్వా ఘృతక్షీరై శ్చందనే నాను లేపయేత్‌ | శుక్లైః సంపూజ్య పుషై#్ప శ్చ సప్తచాస్య బలిం హరేత్‌ ||

రక్తపిత్తా నరోస్న ఘోరా న్ముచ్యతే నాత్ర సంశయః | తైలక్షౌద్ర ఘృతైర్ధేవం స్నాపయిత్వా జనార్దనమ్‌ ||

భస్మత్రయో ణానులిప్య సంపూజ్య కుసుమైః సితైః | పంచముద్గబలిం దద్యా దతీసారా త్ప్రముచ్యతే ||

సంస్నాప్య పంచగవ్యేన దత్త్వా పంచానులేపనమ్‌ | పంచసస్య బలిం దత్త్వా సుఖం కుష్ఠా త్ప్రముచ్యతే ||

త్రిరసస్నా పితం దేవం త్రి సుగంధేన లేపితమ్‌ | కృత్వా దత్త్వా త్రి సూత్రం చ బలింకామా ద్విముచ్యతే ||

సాపయిత్వా తు తైలేన త్రిభిరుష్ణై ర్వి లేపయేత్‌ | పంచమాష బలిం దత్వా వాతవ్యాధిం విముంచతి ||

ద్విస్నేహస్న పితం దేవం శీతోష్ణే నానులేపితమ్‌ | పంచభిః స్నాపయిత్వా చ రనైర్ధేవం జనార్దనం ||

అనులిప్య చ థర్మజ్ఞ! తథా పంచ సుగంధినా | పంచవర్ణాని పుష్పాణి తథా దత్త్వా యథావిధి ||

ధూపం చ పంచ నిర్యాసం దత్త్వా చైవాస్య నుత్తరమ్‌ | తతశ్చ పంచ మధురం బలిం సమ్యజ్‌ నివేదయేత్‌ |

అనేన రోగతః శీఘ్రం ముచ్యతే నాత్ర సంశయః | విష్ణుం సహస్ర మూర్ధానం చరాచరగురుం హరిమ్‌ ||

స్తువన్నామ సహస్రేణ జ్వరాన్సర్వా న్వ్యపోహతి | ఘృతేన స్నాపితం దేవం చందనేనాను లేపయేత్‌ ||

పంచభిర్జ్బలజైః పుషై#్పస్తతః సంపూజయేద్విభుమ్‌ | ధూపం దదాత్‌త్రివారం చ పంచగవ్యం తథా బలిమ్‌ ||

పంచగౌడం తథా రామ! బుద్ధో ముచ్యేత బంధనాత్‌ | త్రిశీత స్నాపితం దేవం త్రిశీతేనాను లేపమేత్‌ ||

త్రిశీతైః కుసుమైః పూజ్యం ధూపం దద్యాత్రిశీతలమ్‌ | త్రిశీతం చ బలిం దత్త్వా రాజకోపా ద్విముచ్యతే |

శీతోష్ణ స్నాపితం దేవం త్రిశీతై రను లేపయేత్‌ | ధూపం దత్యాతు శీతోష్ణం శీతోష్ణం చ తథా బలిం||

గురుప్రసాద మాప్నోతి నాత్ర కార్యా విచారణా | యమల స్నాపితం దేవం యమలే నాను రేపితం ||

అభ్యర్చ్య యమలైః పుషై#్పః ధూపం చ వామలం దహేత్‌ | యమలం చ బలిం దత్వాసౌభాగ్యం ప్రాప్నుయాన్నరః || 19

సౌభాగ్య కామా నారీ చ సౌభాగ్యం మహదాప్నుయాత్‌ | సౌభాగ్య కామోపి నరః సౌభాగ్యం మహదశ్నుతే ||

పరశురాముడు కామ్యకర్మా చరణమును గూర్చి యానతిమ్మన పుష్కరుం డిట్లనియె. శ్రీమరి సర్వాభీష్టములనను గ్రహింపనధికారి. ఆయనం బూజించినందుననే మానవుడెల్ల కోరికల సాఫల్యము నందును నేతితో, పాలతో విష్ణువును స్నానము గావించి మంచి దంధము పూసి తెల్లని పువ్వులం బూజించి యేడు రకాల సస్యములను బలినీయవలెను. దానివలన రక్త పిత్త వ్యాధిపోవును. సందియము లేదు. ఇట్లే హరిని నూనె తేనె నేతులతో స్నానము చేయించి త్రివిధ భస్మముల నలంది, (1 స్మార్తనలభస్మము 2 శ్రొతానల భస్మము 3 విరజానల భస్మము) తెల్లనిపూలం బూజించి అయిదు పెసరకుడుములు నివేదించినచో నతిసారవ్యాధి నుండి విముక్తుడగును. పంచగవ్యముతో స్నానము చేయించి అయిదు అనులేపనములుసెసిన (అయిదు గంధపూతలు) అయిదు సస్యముల బలినిచ్చిన కుషు వ్యాధి నుండి సులభముగా విముక్తినందును. త్రిరసములచే స్నానము చేయించి త్రిసుగంధములు = దాల్చిన చెక్క ఆకు పత్రి ఏలుకలు పూసి (దాల్చిన చెక్కకు బదులు లవంగాలు) త్రిసూత్ర బలియు నొసంగిన నిష్కాముడగును. నూనెతో స్నానము చేయించి మూడు ఉష్ణములచే బూసి యైదు మినుప కుడుముల బలియిచ్చిన వాతవ్యాధి పోవును. రెండు రకాల నూనెలతో స్నానము చేయించి శీతోష్ణములచే బూసి పంచ రసములచే స్నానము చేయించి పంచ సుగంధి పదార్థములచే బూసి పంచవర్ణ కుసుమములం బూజించి పంచ నిర్యాస ధూపము వేసి (రశాంతములో నైదురకాల జిగురులుండును. పంచాంగ ధూములో నైదే యుండునన్న మాట) పంచ మధురమలులను (చెఱకు రసము బెల్లము ఖర్జూరము ద్రాక్ష తేనె నివేదింపవలెను దీని వలన రోగ విముక్తి వేగగల్గును. సందేహము లేదు. వేయి శిరస్పులు గల (సహస్ర శీర్షుని) విష్ణువుని చరాచరగురుని విష్ణు సహస్ర నామములచే స్తుతించిన సర్వ జ్వరముల నుండి ముక్తు డగును. నేతితో స్నానము గావించిన హరికి మంచి గంధము పూయవలెను. అవ్వల నైదు తామరపువ్వులం బూజ సేయవలెను. ముమ్మారులు ధూపము వేయవలెను. పంచగవ్యము నివేదన చేయవలెను. పంచగౌదమును అయిదు రకాల బెల్లీమును గూడ నైవేద్యము పెట్ట వలెను. అందువలన బంధ ముక్తి గన్గును. దేవదేవుని శీతత్రయముచే స్నానము చేయించి శీత్రయముచే బూసి త్రిశీతములగు పూవులతో బూజించి త్రిశీతల ధూపమును వేసి త్రిశీత బతినిచ్చిన యెడల రాజకోపము నుండి విముక్తుడగును. శీతోష్ణములచే స్నాపితుడైన దేవుని త్రిశీతములలో ననులేపించి శీతోష్ణదూపమును శీతోష్ణబలిని సమర్పించిన గురు ప్రసాదమునందును. సందేహములేదు. యుగ్మముచే స్నాపితుడైన దేవుని యుగళముచే ననులేపించి పుష్పయుగ్మములచే పూజించి, యమళయుత ధూపమువేసి యుగ్మమును నివేదించిన నరుడు సౌభాగ్యవంతుడగును సౌభాగ్యమును కోరుస్త్రీయును సౌభాగ్యవతి యగును.

త్రిభిః సంస్నాపితే దేవే సౌభాగ్యం మహాదాప్నుయాత్‌ | త్రిభిః ఫలైః స్నాపయిత్వా త్రి సారేణాను లేపయేత్‌ ||

త్రిశీతం చ బలిం దద్యాద్యశః ప్రాప్నోత్యనుత్తమమ్‌ | త్రితైల స్నాపితమ్‌ దేవం త్రిరక్తేనాసు లేపితమ్‌ ||

ధూపయేన్మహిషాక్షేణ త్రిరక్తం చ బలిం హరేత్‌ | రౌద్రకర్మ తు ప్రాప్నోతి సిద్ధిరస్తి న సంశయః || 28

త్రిగంధ స్నాపితం దేవం త్రిశీతేనాను లేపితమ్‌ | పూజయే ఛ్చ్వేత పద్మానాం సహస్రేణ మహాభుజమ్‌ ||

నివేద్య పరమాన్నం చ శ్రియం ప్రాప్నోత్యనుత్తమామ్‌ | ఘృతేన స్నాపితం దేవం చందనేనాను లేపితమ్‌ ||

పరమాన్నం బలిందత్త్వా యధేష్టం కామమాప్నుయాత్‌ | ఘృతేన స్నాపితం దేవం చందనేనాను లేపీతమ్‌ ||

అపూపైః పరమాన్నేన కుల్మాషేణ చ పూజయేత్‌ | ఆమ్రాతకానాం ముఖ్యానాం తత స్త్వష్టాధికం శతమ్‌ ||

క్షౌద్రన్త్రివృత్తం దేవాయయథావద్వినివేదయేత్‌ | సౌభాగ్యం మహదాప్నోతి నాత్ర కార్యా విచారాణా || 28

త్రి తైలములచే స్నానము చేయించి మహిపాక్షిచే ధూపమువేసి త్రిరక్తమును నివేధించినచో రౌద్ర కర్మ సిద్దినందును. (రౌద్రకర్మ అనగా చేతబడి మొదలగు అభిచారికము.) త్రి గంధములచే స్నానము త్రి శీతలములచే పూతయు చేసి విష్ణువుని వెయి తెల్ల తామర పూల బూజించి పరమాన్నము నివేదించిన గొప్ప సంపద నందును. నేతితో స్నానము చందనము పై పూత పూసి పరమాన్నము బలినిచ్చిన యధేష్టకామము నందును. ఘృత స్నానముచందనాను లేపనముచేసి అప్పములు పరమాన్నముకు ల్మాషములచే బూజింపవలెను నూటయెనిమిది ఆమ్రాతకములను త్రివృత్తమైన తేనెను నివేదింప వలెను. అందువలన గొప్ప సౌభాగ్యము గల్గును.

పంచగవ్య బలిం దత్త్వా ధన మాప్నోత్యనుత్తమమ్‌ | త్రిరక్త స్నాపితం దేవం త్రిరక్తేనాను లేపితమ్‌ ||

రక్తపుషై#్పః సమభ్యర్చ్య త్రిభిరేవ యథావిధి | త్రిరక్తం చ బలిం దత్త్వా హుత్వా వై సర్షపత్రయమ్‌ ||

త్రిలోహం దక్షిణాం దత్త్వా శత్రునాశ మవాప్నుయాత్‌ | త్రిఫల స్నాపితం దేవం త్రిరక్తేనాను లేపితమ్‌ ||

త్రిశీతం చ బలిం దత్త్వా పున్నామకుసుమాని చ | వున్నామకాని ముభ్యాని ఫలాని వివిథాని చ ||

పుత్రజన్మ సమాప్నోతి నాత్రకార్య విచారణా | ఘృతేన స్నాపితం దేవం త్రిరక్తేనాను లేపితం ||

కృత్వా త దేవధూపం తు దత్వా క్షీరం నివేదయేత్‌ | ఘృతపూరం బలిం దత్వా సరః ప్రాప్నోతి జీవికామ్‌ ||

పంచగవ్యము నివేదించిన గౌప్ప ధనలాభమగును. త్రిరక్తములచే వుని స్నానము దేచేయించి దానిచే మైపూతయుం బెట్టి మూడు ఎఱ్ఱని పూలచే బూజించి మూడు రక్తబలుల నిచ్చి మూడు ఆవాలో హోమము సేసి త్రిలోహములను (మూడు ఇనుప వస్తువులను) దక్షిణ యిచ్చినచో శత్రువులు నశీంతురు. త్రి ఫలములచే (ఉసిరి - తాడి - కరక్కాయలు) స్నానము చేయించి త్రిరక్తములు పూసి త్రిశీతముగా బలిగ నివేదించి పుంనామకములయిన పండ్లను నివేదించిన పుత్రజననము అగును. సందియము లేదు. పుంనామకము లనగా పుంలింగముచే బేర్కొనబడిన వన్నమాట. నేతితో స్నానము చేయించి త్రిరక్తము పూత పెట్టి అవి ధూపము వేసి క్షీరము నివేదించి సమృద్ధిగ నేతిని నివేదించిన వాడు జీవితము (బతుకు తెఱువు) పొందును.

క్షీరాజ్య స్నాపితం దేవం చందనేనాను లేపితం | తదేవ ధూపం దాతవ్యం జాతీపుష్పాణి చాప్యథ || 35

పంచగవ్య బలిం దత్వా హుత్వా వహ్నౌ తథా ఘృతం | గాంచ దత్వా మహాభాగ గాః సమాప్నోతి మానవః ||

యమల స్నాపితం దేవం యమలేనాను లేపితం | అభ్యర్చ్య యమలైః పుషై#్ప ర్ధూపంచ యమలందహేత్‌ ||

యమలంచ బలిం దత్వా జుహుయా దక్షతాం స్తథా | తిలసిద్ధార్ధకయుతా న్సర్పిః క్షీరం ఘృతం తథా ||

అశ్వం చ దక్షిణాం దత్వా హయన్ప్రాప్నోత్యనుత్తమాన్‌ | ఘృతేన స్నాపితం దేవం తధైవ ఘృత లేపితం||

పుషై#్స శ్చతుర్భిస్సంపూజ్యధూపం దత్వా చతుస్సమమ్‌| త్రిశుకం చ తథా దత్వా తధైవ పానక త్రయమ్‌||

త్రిశుకం చ తథా హుత్వా తి) స్నేహేన సమన్వితం | త్రిలోహం దక్షిణాం దత్వా గాణాపత్య మవాప్నుయాత్‌ ||

మధురత్రితయే నాథ స్నాపయిత్వా జనార్ధనమ్‌ | అనులింపేత్త్రి శీతేన పూజయే చ్చమకై స్తథా ||

ధూపం దహే త్త్రి శీతేన దద్యా త్త్రిమధురం బలిం | మధూకపుష్పాణి తధా ద్రాక్షా ఖర్జూర మేవచ || 43

సర్వభూతై స్సహాప్నోతి సఖ్య మేవ న సంశయః | ఘృతేన స్నాపితం దేవం వచయా నిశయా తథా ||

చందనే నాను లింపేత్తు జాతీపుషై#్ప రథార్చయేత్‌ | ఘృతక్షౌద్రయుగం దత్వా తధా ధూపం చ గుగ్గులుమ్‌ ||

త్రిశూకం చ బలిం దత్వా తథా త్రిలవణం నరః | కనకం దక్షీణాం దత్వా విద్యా మాప్నోత్య భీప్సితామ్‌ ||

చందన మాజ్యం జాతీ పరమాన్నం గుగ్గులుం చ దేవాయ | దత్వా భక్త్యాపురుషః సర్వా న్కామా నవాప్నోతి ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తర ద్వితీయఖండే భగవదనులేపన స్నాన వర్ణనం నామ దశోత్తర శతతమోధ్యాయః 110

పాలతో నేతికో స్నానము సేయించి చందనముపూసి చందనముతోనే ధూపమువేసి జాజిపువ్వులం బూజించి పంచగవ్యము నివేదనచేసి నేతితో హోమమొనరించి గోదానముసేసిన యతడు గోసంపదను బొందును. యమలములచే స్నానము అనులేపనము (మైపూత) పుష్పపూజ అదేధూపము యమల నివేదనము చేసి నువ్వుల తెల్ల ఆవాలతో గలసిన అక్షితలను నెయ్యి పాలు హోమము సేసి, అశ్వము దక్షిణగా నిచ్చిన మంచి గుఱ్ఱముల లభించును. నేతితో స్నానము చేయించి నేనితోమైపూతయుంబెట్టి నాల్గు పువ్వులతో బూజగావించి నాల్గు వస్తువులు సమమయిన పాళ్ళుగాకూర్చి ధూపమువేసి త్రిశుక్లము త్రిశూకమును ఒసంగి మూడు పానకములు సమర్పించి, త్రిస్నేహముతో (మూడురకాల నూనెలతో) త్రిశుకము హోమము సేసి, త్రిలోహములను దక్షిణగనిచ్చిన యాతడు గాణాపత్యము = గణముల కాధిపణ్యాము నందును. అట్లే శ్రీహరిని త్రిమధురములచే స్నానము చేయించి త్రిశీతములు పూసి చమకమంత్రములతో త్రిశీతములువట్టివేరు పచ్చకర్పూరం మంచిగంధము లర్పించి త్రి శీతము ధూపమువేసి త్రి మధురములను (తేనే నెల్యు పంచదార) ఇప్పపూవులు ద్రాక్ష ఖర్జూరము ననునవికూడ నివేదించిన ఆతడు సర్వభూత సుహృత్తు (మిత్రుడు) అగును. నేతితో విష్ణువును స్నానము చేయించి వచ - పసుపు, నిశ, చందనముపూసి జాజిపువ్వులతో బూజించి తేనె నేతితో గలిపిన గుగ్గులు ధూపమువేసి త్రిశూకము (వరి, యవలుని మొదలగు) మూడు రకాల బియ్యముతోడి వంటకము మూడు రకాల లవణములతో సైందవ ముద్ర సౌవర్చలవణములు మూటితోని వేదించి బంగారము దక్షిణయిచ్చినవాడు విద్యాసిద్ధి నందును. చందనమునెయ్యి జాజి పరమాన్నము గుగ్గులు మొదలగు పూజాద్రవ్యములతో హరినర్చించునాతడు సర్వకామ సిద్ధినందును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర ద్వితీయఖండమునందు భగవదనులేపన స్నానాది వర్ణనమను నూటపదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters