Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటపదునెనిమిదవ అధ్యాయము - నిరయగామివర్ణనము

పుష్కరః : మహాపాతకినో యేచ యేచ పాతకినో జనాః | మంసాశినో నరాయేచ తధా యేగమ్యగామినః ||

పరదార రతా యేచ తేవై నిరయ గామినః || 1

అతి క్రామన్తియే భాల్యాం పీడయన్తి చతేయే నరాన్‌ | యే సభాస్వవ మన్యంతేవై నిరయ గామినః ||

బహుభార్యాశ్చ భార్యాసు వర్తన్తే న సమంచ యే | ఋతుకాల హారాః యేచతే వై నిరయగామినః ||

సమ్యగ్‌ భర్తృషు యానార్యో వర్తన్తే నావలేపతః | అప్రియేచ తథాసక్తా జ్ఞేయాస్తా నిరయంగమాః ||

భర్తార మవ మన్యన్తే భాషన్తే విప్రియాణి చ || స్వాతంత్ర్యేణ చ వర్తవ్తే జ్ఞాతవ్యాః నిరయంగమాః ||

రాజ శాస్త్రోపదేశం యే సంత్యజ్య వసుధాధిపాః | పర్తన్తే సర్వకార్యేషు తేవై నిరయగామినః ||

వర్ణాశ్రమోక్తం వర్తన్తే ధర్మం త్యక్త్వాతు యేనరాః | బహిశ్శాస్త్రాత్‌ హహాభాగ! తేవై నిరయగామినః ||

అయాజ్య యాజినోయేచ కూట సాక్ష్యప్రదాశ్చయే | తథానృతరతా యేచతేవై నిరయ గామినః ||

వ్యవహారేషుయే సక్తాః పక్షపాతాభిధాయినః | అసమ్య గ్ధర్శినో యేచతేవై నిరయగామినః ||

ప్రేక్ష్యమాణ పరిజనే మిష్ట మశ్నన్తి యేనరాః | అసంవిభజ్య ధర్మజ్ఞః తేవై నిరయగామినః || 10

భృతకాంన్తు మహాభాగ! కుర్వన్తే నైవ యేభృతమ్‌ | అనిర్దిష్ట భూజశ్చైవ తేవై నిరయ గామినః ||

వంచకాః భృతకానాంచ తధైవాశ్రిత వంచకాః | వంచకాశ్చ తధాన్యేషాంజ్ఞేయా నిరయ గామినః ||

కృతఘ్నాః నిర్ఘృణా యేచ పరస్వా೭೭దాయినశ్చయే | శఠాచారాశచ మిత్రాణాం తేవై నిరయ గామినః ||

గవాం పాన ప్రవృత్తానాం యే తధా విఘ్నకారిణః | తధాన్యేషాంచ భూతానాం తేవైనిరనయ గామినః ||

ధర్మకార్య ప్రవృత్తస్య యేనరా విఘ్న కారిణః | పాపప్రోత్సాహకాశ్చైవ తేవైని రయ గామినః ||

త్యాగినస్త్వాశ్రితానాం యే బుత్విజాం త్యాగినశ్చయే | యాజ్యానాంచ గురూణాంచ తేవై నిరయ గామినః ||

త్యాగినో దేనతానాంచ పహ్నీనాం త్యాగిసశ్చ యే | శాస్త్రాణాం త్యాగినో యేచ తేవై నిరయ గామినః ||

బాలకాతిధి విప్రాణాం సురాణాం చైవ మానదః | యేచ పూర్వభూజో నిత్యం తేవై నిరయ గామినః ||

రజస్వలాంచయే యాన్తి యేచ ప్రేష్యకరాం స్త్రియం | వియోన్తేనిం యేచ గచ్ఛన్తి తేవైని రయ గామినః ||

శుక్రం త్యజన్త్యయోనౌయే తధా కాశేచ నిర్ఘృణాః | పర్వస్వపిచ ధర్మజ్ఞ! తేవై నిరయ గామినః || 20

అనధ్యాయేషు యేరామ! స్వాధ్యాయమిహకుర్వతే | నిందన్తి చ గురూన్‌ యేవై తేవై నిరయగామినః || 21

దేవతానాం చ వేదానాం బ్రాహ్మణానాం చ నిందకాః | పురాణ చరితానాంచ తేవై నిరయగామినః ||

యేనా స్తికా నరా రామ! యేచ శ్రద్ధావివర్జితాః | అహంకార గృహీతావ్చ తేవై నిరయ గామినః ||

కుకర్మ సక్తా మనుజాః సుకర్మ పరివర్జకాః | స్వామి మిత్రద్రుహో యేచతే వై నిరయగామినః ||

యేచ ద్రోహరతా రాజ్ఞాం బ్రాహ్మణానాం గవామపి | సుహృదామపి ధర్మజ్ఞః తేవై నిరయగామినః -||

యేతుపైశున్య సంసక్తాః పరమర్మస్పృశోపిచ | అశుచశ్చ తధామార్త్యాః తేవై నిరయగామినః ||

సోమవిక్రయిణోయేచ బీజ విక్రయిణస్తధా | ఆత్మ విక్రయిణో యేచజ్ఞేయా నిరయగామినః ||

రజః పశ్యన్తి ధర్మజ్ఞః యేషాం వేశ్మని కన్యకాః | శుల్కేచదత్తా సాయైశ్చ తేవై నిరయ గామినః ||

బ్రహ్మేశ కేశవానాంచ యేనరా భేదవాదినః | తమోభిభూతః పరితస్తేవై నిరయ గామినః ||

కులజానాం సపిండానాం యేచ పిండ విలోపకాః | అశ్రాద్ధదాశ్చ పూర్వేషాం తేవైనిరయ గామినః ||

కామాత్మానో నరాయేచ యే తథార్థ పరాయణాః | యేచ ధర్మద్విషో లోకే తేవై నిరయ గామినః ||

నాభి పశ్యన్తి యే శక్త్యా దీన మాతుర మాశ్రితమ్‌ | ఆర్తంచ నాభిధావన్తి తేవై నిరయ గామినః ||

యేచాపహాసం కుర్వన్తి దీనానాం మానగర్వితాః | అనాగసం పరిభవన్త్యేతే నిరయ గామినః ||

పీడా మథోత్పాద్య నరస్య రామ! యథా కథంచి న్నరకం ప్రయాతి |

తస్మా త్ర్పయత్నేన వివర్జనీయా పరస్య పీడా మనుజేన రామ! || 35

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే నిరయగామి వర్ణనం నామ అష్టాదశోత్తర శత తమోధ్యాయః ||

మహాపాపకములు ఉపపాతతములును జేసినవారు మాంసభుక్కులు పొందరానివారిం బొందినవారు పరదారరతులు నరకగాములు. భార్యనతిక్రమించి తిఱుగుబోతులు. (వ్యభిచారులు) ధర్మపత్నిం బీడించువాడు సభలందవమానించువారు. నరకగాములు పెక్కభార్యలున్న వారైయందుఱయందు సమముగవర్తింపని వారు బుతుకాలమందు బొందుసేయనివారు నరకగాములు. భర్తలయెడగర్వమూని అనుకూలముగవర్తింపక వారిక ప్రియములొనరించుటందే సక్తులైన స్త్రీలు నరకగాములు. మగనివమానించున ప్రియము లాడి స్వతంత్రముగ వర్తించు స్త్రీలు నరకగాములు. రాజశాస్త్రములు సెప్పినది విడిచి స్వేచ్ఛా వృత్తి నెల్ల పనులందు వర్తించు రాజులు నరకగాములు.వర్ణాశ్రమములకు జెప్పబడిన ధర్మముల్లంఘించి శాస్త్ర విధికి దూరముగ వర్తించువారు నరకగాములు. అపాత్రులచే యజ్ఞముసేయించు వాండ్రు అబద్ధసాక్ష్యమిచ్చు వాండ్రు అనృతములాడువారు నరకగాములు పక్షపాతముతో వ్యవవహారములందు వర్తించువారు తప్పో ఒప్పో సరిగ కనిపెట్టనివారు నరకగాములు. పరిజనము చూచుచుండ సమముగ పంచి కుడువనివారు నరకగాములు. భృతకులను (శిశువులను భరింపవలసినవారు) భరింపక నిర్దేశములేకుండ తమకుదాము గుడుచువాండ్రు నరకగాములు. భృతకులను ఆ శ్రితులను వంచించువారు పరవంచకులును నరగాములు కృతఘ్నలు (చేసిన మేలుధరచువారు ) దయలేనివారు పరధ నములంగాజేయువారు, మిత్రులయెడ దుర్మార్గముగ ప్రవర్తించువారును నరకగాములు. నీరు ద్రావుచున్న గోవులను మరియితర భూతములను నడ్డగించువారు నరకగాములు. ధర్మకార్యమొనరించువానికి విఘ్నముసేయువారు పాపమును ప్రోత్సహించువారు నరకగాములు. తన నాశ్రయించిన వారిని విడిచిపుచ్చినవారు బుత్విక్కులను యాజ్యులను = యజ్ఞముచేయువారిని గురువులను విడిచిపుచ్చినవారు నరకగాములు దేవతలను అగ్నులమ శాస్త్రములను విడినవారు నరకగాముని బాలురు అతిధులు విప్రులు వేల్పులు మొదలగు వారికంటె ముందు గుడుచువారు నరకము గుడుతురు. ముట్టుతను దాసీని వియోనిని స్వకులమతమునకు జేరనిస్త్రీని, పశుయోనింగూడిన వారు నరకగాములు. దయాశూన్యులై యయోగ్యమోనియందు ఆకాశమందు పర్వములందు శుక్రమును వదలు నరులు నరకగాములు. అనధ్యాయములందు వేదాధ్యయనము సేయువారు గురునిందచేయువారు నరకగాములు. వేదదేవ బ్రాహ్మణ గురునిందకులు పురాణచరిత్ర దూషకులు నరకగాములు. నాస్తికులు శ్రద్ధాహీనులు అహంకారవిష్టులు నరకగాములు. చెడ్డపనియెడ తగులముగొని మంచి పనిని విడిచినవారు స్వామిద్రోహులు మిత్రద్రోహులును నరకగాములు. రాజద్రోహము బ్రాహ్మణద్రోహము మిత్రద్రోహము నెడ నాసక్తులు నరకగాములు. కొండెములు చెప్పుటయందాసక్తులు పరులనొవ్వనాడు వారు ఎదిరికష్టముల గని శోకింపనివారు నరకగాములు. సోమమునమ్మినవారు బీజములను (విత్తనములను) అమ్మువారు తనకు దానమ్ముడు పోయినవారు నరకగామలు. ఎవరి యిండ్ల కన్యకలు రజస్సును జూతురో (వివాహము కానిపిల్లలు రజస్వలలగుదురో) ఎవక్వరిచే కన్యాశుల్కము తీసికోనబడునో ఆ నరులు నరకగాము బ్రహ్మకు శివునకు కేశవునకు భేదము కలదని వాదించువారు కేవల తమైగుణదోషితులైన నరకములు సత్కులమునకు జెందిన సపిండులగు పితరులకు పిండలోపము సేయువారు పూజ్యలకు శ్రాద్ధము పెట్టనివారు నరకగాములు, లోకమందు కేవల కామలోలురు కేవల మర్థపరాయణులు ధర్మద్వేషులు నరకగామలు. దీనుని (దిక్కులేని వానిని రోగాదివశున బక్కచిక్కిన వానిని) ఆతురుని ఆశ్రితుని ఆర్తునికనిపెట్టరో వారియెడకు పఱువెత్తరో (రక్షింప యత్నింపరో) వారు నరకగాములు. ఎవ్వరు దురభిమానమున బొగరెక్క దీనులను జూచి పరిహాసము సేయుదురో నినపరాధినవమానింతురో అనరులు నరకగామలు ఇంకొక నరుని కెట్లేని బాధకల్గించి, నరుడు నరకమునకేగును. అందువలన మనుజుడు పూనికగొని పరపీడనొనరించుట మానవలెను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమందు నిరయగామివర్ణనమను నూటపదునెనిమిదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters