Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

పండ్రెండవ యధ్యాయము - చామరలక్షణము

పుష్కరః : చమరీవాలసంభూతా శ్శశాంకాంశుసమప్రభాః l సంహతాః స్నిగ్థదీర్ఘాశ్చ తథా స్దాలి నిబంధనాః ll 1

దండశ్చ చామరే కార్యో రుక్మరూప్యమయ స్తధా l ప్రవాళ##వైడూర్యమయ స్తథైవ కనకాన్వితః ll 2

క్షీరవృక్షస్య వా కార్యో రుక్మరూప్య నిబంధనః l రత్నైః ప్రశ##సై#్త శ్విత్రో వా కాంచనస్య ప్రశస్యతే ll 3

చందనస్యా7థ దంతస్య శార్‌ఞ్గః కార్యో యథా భ##వేత్‌ l అర్ధహస్తాన్న చాప్యూన మధ్యర్దా7న్న తతోధికః ll 4

కర్తవ్యం చామరం రాజ్ఞా నచ భార్గవ! రంజితమ్‌ l 5

ఆపీతవర్ణం తు భ##వేత్ప్రస్తం సాంవత్సరా7మాత్య పురోహితానామ్‌ l

నరేంద్రపత్నీ యువరాజ సైన్య స్యాన్యస్య శేషస్య జనస్య కృష్ణః ll 6

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే చామరలక్షణం నామ ద్వాదశో7ధ్యాయః

పుష్కరుడనియె: చమరీమృగము తోకతో దయారైనట్టి చంద్రకిరణములట్లచ్ఛము తెల్లనివి ఒత్తైనవి స్నిగ్ధములు నిగనిగ లాడునవి పొడవై నవియొనై స్థాలి నిబద్ధములైన చామరములు ప్రశస్తములు. బంగారము, వెండి పవడముకర్ర వైడూర్యమయములగు చామరదండములు కనకాంచితము గావింపవలెను. పాలచెట్టు కర్రతో చామరదండము చేయింపవచ్చును. కాని, దాని పిడి స్వర్ణమయము రజత మయమేని కావలెను. కాంచన దండమునకుగాని పిడికిగాని మణులు పొదుగవలెను. మంచిగంధపు కర్ర దంతము శార్జము కొమ్ముతో జేసినదియై యుండలెను. ఆ చామరదండము హస్తములో సగమునకు తగ్గ కూడదు (హస్తమా = మూర) రాజచామరమునకీ చెప్పిన దండములు ప్రశస్తములు రంజతమయిన దండము మాత్రము పనికిరాదు. జ్యౌతిషికులకు మంత్రులకు పురోహతులకు-రాజపత్నులకు యువరాజునకు సైన్యాధి పతికి పసుపుపచ్చని చామరము వాడలెను. మిగత వారికి చామరము నల్లగ నుండవలెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున చామరలక్షణమను పండ్రెండవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters