Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట యిరువది నాల్గవ అధ్యాయము - బుగ్విధానము

రామ:- వైదికాని సమాచక్ష్వ కర్మాణి సురసత్తమ : | అధికారీ భ##వేద్యేషాం కృచ్ర్ఛకారీ త్వనంతరమ్‌||1

పుష్కర :- శృణు ! కామ్యాని కర్మాణి పుష్కలాని మమా7నఘ | ప్రతి వేదం మహాభాగ : గదలో భృగునందన !

మానవుడు కృచ్ఛ్ర వ్రతములాచరించిన తర్వాత వైధిక కర్మ సమాచరణమున కధికారియగును. అట్టి వైదిక కర్మములను గురించి తెల్పుమని పరశురాముడడుగ పుష్కరుండిట్లనియె. రామా! మహాభాగ! నాల్గు వేదములందను కామ్య కర్మములు పుష్కలములుగా నున్నవి. వానిం తెల్పెద వినుము.

అంతర్జలే తధా హోమే జపేచ్చ మనసేప్సితమ్‌ | కామం కరోతి గాయత్రీ ప్రాణాయామా ద్విశేషతః ||

గాయత్ర్యా దశసాహస్రో జపో నక్తాశినో ద్విజ | బహిః స్నాతస్య తత్రైవ సర్వకల్మష నాశనః ||

దశా7 యుతాని జస్త్వాచ హవిష్యాళీ సుసంయతః | వాయుభూత స్తదాస్నోతి యర్విష్ణోం పరమం పదమ్‌ ||

పరస్య బ్రహ్మణో రామ! వాచకః ప్రణవః స్మృతః | పురుష స్యా7 ప్రమేయస్య సర్వగస్యా7 వినాశినః ||

తజ్జపేనేహ పూయన్తే యే7పి దుష్కృత కారిణః | ఓంకారపూతం సలిలం నాభిమాత్రోదక స్థితః ||

శతజప్తం పిబే ద్యస్తు సపాపైర్వి ప్రముచ్యతే | అకారశ్చా7 ప్యుకారశ్చ మకారశ్చ భృగూత్తమ ! ||

యుజుర్వేదః సామవేడ బుగ్వేదశ్చ విచక్షణౖః | కథితస్తు త్రిమాత్రశ్చ ప్రణవః పరికీర్తితః ||

మాత్రాత్రయంతు ప్రణవ స్త్రయో దేవాః సనాతనాః | ఏత ఏకత్రయో లోకాః త్రయ శ్చైవాగ్నయ స్తధా ||

మహావ్యాహృతిభర్హోమాత్‌ సర్వపాపై ర్విముచ్యతే | మహావ్యాహృతయో జ్ఞేయాః సప్తలోకా విచక్షణౖః ||

నీళ్ళలో నిలిచి హోమమందును ప్రాణాయామ ప్రధానముగ గాయత్రిం జపించినచో కామ్య సిద్ధి గల్గును. వెలుపల స్నానము చేసి నక్తవ్రతమూని పదివేలు గాయత్రి జపముచేయుట సర్వకల్మష హరము. పది పదివేలు (లక్ష) జపముచేసి నియమమూని హవిష్యము నారగించు నతడు వాయురూపమున విష్ణుపదమును బొందును. ప్రణవము పరబ్రహ్మ కువాచకము. పరమాత్మ పురుషుడు బుద్ధికందడు. సర్వాంతర్యామి నాశరహితుడు. అట్టి ప్రణవమును జపించినచో పాపులు పవిత్రులగుదురు. బొడ్డులోతున నిలిచి ఓంకారము నూరుమార్లు జపించి మత్రించుట ద్వాతమున పవిత్రమైన యుదకమును ద్రావినచో పాపములబాయును. ఓ భృగు వర్య ! అకారము ఉకారము మకారము యుజుర్వేదము సామవేదము బుగ్వేదము పండితులచే చెప్పబడినవి. ప్రణవము త్రిమాత్రమని ప్రస్తుతింప బడినది. త్రిమాత్రాత్మకము ప్రణవము. ననాతనమయిన దేవతలు ముగ్గురు. ఈ లోకాలు మూడు. అగ్నులును మూడు. మహావ్యాకృతులతో సంపుటి చేసి హోమము చేయుట వలన సర్వపాస విముక్తుడగును. మహావ్యాహృతు లేడును నేడు లోకములని విజ్ఞులన్నారు.

గాయత్రీ పరమా జప్యే హోమే వ్యాహృతయస్తధా | అంతర్జలే తధారామ ! ప్రోక్తక్చై వాఘమర్షణః ||

అగ్నిమీళే పురోహితం సూక్తో7యం వహ్నిదేవతః | శిరసాధారయే ద్వహ్నిం యోజపే త్పరివత్సరమ్‌||

హోమం త్రిషవణం చైవ తధాతేన సమాచరేత్‌| అనగ్ని జ్వాలనం మద్యాత్‌ భైక్షాహారస్తు వత్సరాన్‌||

జపము విషయములో హోమ విషయములో గాయత్రి పరమోత్తమ మంత్ర ము-వ్యాహృతులు గూడ నట్లే నీళ్ళలో నిలిచి చేసిన జపమ ఘమర్షఅము =పాపము దుడిచియేయునది. ''అగ్ని మీళేపురోహితమ్‌'' అను సూక్తమునకు దేవత అగ్ని ఒక సంవత్సరము జపించువాడు అగ్నినిదలం దాల్చవలెను. శిరస్థానము నందున్నట్టు ధ్యానింప వలెనన్నమాట. త్రిషవణ హోమము గూడ అగ్నిదేవతాక మంత్రముతోనే చేయవలెను. త్రిషవణము అనగా ప్రాతర్మ ద్యాహ్న సాయంసమయములు. నిప్పు చేయకుండ అనగా తాను వంట చేసికొనకుండ భైక్షాహారియో కొన్న యేండ్లు జపింపవలెను.

అతఃపర మృచః సప్తబాగ్నేయ్యః పరికీర్తితాః | తా జపన్‌ ప్రయతో నిత్యమిష్టాన్‌ కామాన్‌ సమశ్నుతే ||

మేధాకామో జపేన్నిత్యం సదసత్పమిత్యృచమ్‌ | అమ్బయో యాన్తియాః ప్రోక్తాః న బంధో మృత్యునాశినీ ||

శునశ్శేఫ మృషిం తద్వత్‌ సంనిరుద్ధో7ధవా జపేత్‌ | ముచ్యతే సర్వపాపేభ్యో గదాచాపగదీ గదన్‌ ||

యదచ్ఛే చ్ఛాశ్వతం కామ మింద్రాత్ర్పాప్తుం పురందరాత్‌ | ఋగ్భిః షోడశభిః స్తూయా దింద్రమేతి దినేదినే ||

హిరణ్యస్తూపమిత్యే తజ్జపన్‌ శత్రూన్‌ ప్రభాధతే | క్షేమీ భవతి చాధ్మానే యేతే పక్తా జవన్నరః ||

ఈ మంత్రము తర్వాత నేడు ఋక్కులు అగ్ని దేవతాకములు అని ప్రస్తుతింపబడినవి. నిత్యము వానిన నియమముతో జపించినచో నబీష్టములను బడయును. మేధాకాముడైన వాడు ''సదసత్పదమ్‌'' అన్న ఋక్కును నిత్యము జపించ వలెను. నిరోధింపబడినవాడు (నిర్బంధమందు బడనివాడు) శునశ్శేఫబుషిగా గల ''గదాచాపగదీ'' అను మంత్రము జపించినచో సర్వపాప బంధవిముక్తుడగును. ఇంద్రుని వలన శాశ్వతమైన అభీష్టముం గోరునేని దినదినమును ''ఇమేద్రతి'' అను పదముతో నారంభ##మైన పదునారు ఋక్కులతో నింద్రుని స్తుతనింపవలెను. ''హిరణ్య స్తూపమ్‌'' అను మంత్రము జపించిన వాడు శత్రువులను నిగ్రహింపగలడు. ''యేతేపక్తాః '' అను మంత్రము జపించి క్షేమ వంతుడగును.

దౌద్రీభిష్షడ్భిరీశానం స్తూయాద్యోవై దినే దినే | చరుంవాకల్పయే ద్రౌద్రం తస్యశాన్తిః పరాభ##వేత్‌ ||

ఉది త్యుద్యన్త మాదిత్య ముపతిష్ఠే ద్దినే దినే | క్షిపే జ్జలాంజలీ న్సప్త మనో దుఃఖ వినాశనమ్‌ ||

ద్విషన్త మిత్యధానర్చ్య ద్యిషన్తం చ జపన్‌ స్మరేత్‌ | అగచ్ఛన్‌ సప్తరాత్రేణ విద్వేష మధిగచ్ఛతి ||

ఆరోగ్య కామో రోగీ చ ప్రస్కన్న స్యోత్తమం జపేత్‌ | ఉత్తమ స్తస్య చాపేతి జపే ద్వైర వినాశ##నే ||

ఉదయ త్యాయు రక్షయ్యం తేజో మధ్యం దినే జపేత్‌ | అస్తవ్రజతి సూర్యే చ ద్విషన్తం వ్రతిపాదితమ్‌ ||

ఆఱు రౌద్రీమంత్రములచే రుద్ర దేవతాక మంత్రములతో దినదినము శివుని స్తుతించినవారు, రుద్రదేవతాక చరుహోమ మేని జేసిన వాడు పరమ శాంతి నందును. ''ఉదుత్యంజాత వేదసమ్‌'' అని యుదయించుచున్న సూర్యునకు ప్రతి దినముస్థానము సేసినవాడు (ప్రార్ధించిన వాడు) జలాంజలులను = అర్ఘ్యములను ఇచ్చిన వాడు దుఃఖములను బాయును. ''ద్విషంతమ్‌'' అను మంత్రముచే నర్చించి యా మంత్రమును జపించుచు శత్రువును స్మరింప వలెను ఏడు రాత్రులలో జపించిన దండెత్తి పోకుండనే శత్రుత్వమును దాటును. రోగియైనవాడు ఆరోగ్యముకోరి''ప్రస్కన్న స్యోత్తమం ''అను మంత్రము ''ఉదయత్యాయు రక్షయ్యం తేజః'' అను మంత్రమును మధ్యాహ్నవేళను సూర్యాస్తమయవేల ద్విషంతం అను సూక్తమును జపించిన శత్రువులన నిగ్రహింప గలదు.

నవ పద్యేతి సూక్తాని జపన్‌ శత్రూ న్నియచ్ఛతి | ఏకాదశ సువర్ణస్య సర్వకామాంరిస్తు నిర్దిశేత్‌ ||

ఆధ్యాత్మికైః క ఇత్యేత జ్జపన్‌ మోక్ష మవాప్నుయత్‌ | ఆసనో రుద్ర మిత్యేక ద్దీర్ఘమాయు రవాప్నుయాత్‌ ||

త్వం సోమేతిచ సూక్తేన నవం పశ్యే న్నిశాకరమ్‌ | ఉపతిష్ఠే త్సమిల్పాణి ర్వాసాం స్యాప్నోత్య సంశయమ్‌ ||

ఆయురీప్స న్నిద మితి కౌత్ససూక్తం యదాభ్యసేత్‌ | అపనః శోశుచ దితి స్తుత్వా మధ్యే దివాకరమ్‌ ||

యథా మంజాదిషీవేక్షీకా తథా పాపం ప్రముంరతి | జాతవేదస ఇత్యేతత్‌ జపేత్‌ స్వస్తయనం పథి ||

భ##యై ర్విముచ్యేత సర్వైః స్వస్తి మానాప్ను యాద్గృహమ్‌ | వ్యుష్టాయాం చ తధా రాత్రావేత ద్దుశ్వప్న నాశనమ్‌ ||

ప్రమందితేతి సూర్యస్య జపే ద్గర్భ విమోచనమ్‌ | జపన్నిండ్రమితి స్నాతో వైవ్వదేవంతు సన్తకమ్‌ ||

ముంచత్యాజ్యం తధాజుహ్వ త్సకలం కిల్బిషం నరః | ఇమామితి జపన్‌ శశ్వత్‌ కామానాప్నో త్యభీప్సితాన్‌ ||

''పబ్యా'' అను నవసంఖ్యాక సూక్తములను జపించిన శత్రునిగ్రహము కలుగును. ''సువర్ణస్య'' అనుఏకాదశ సంఖ్యాక మంత్రములజపించిన సర్వకామ సిద్ధియగును. ''ఆధ్యాత్మికైఃకః'' అను మంత్రముజపించినమోక్షమందును. ''ఆసనోరుద్రమ్‌'' అని జపించిన దీర్ఘీయుష్కుండగును. ''త్వంసోమ'' అను సూక్తము జపము చేయుచు ఉదయ చంద్రుని దర్శించుచు సమిధలుచేబూని ఉపస్థానము (ప్రార్థనలు) చేసిన వస్త్ర సమృద్ధి నొందును. ఆయువును పొందగోరి ''దమ్‌'' అను కౌత్ససూక్తమున్ను ''అపనః శోశుచత్‌'' అను దాని మధ్యాహ్నకాల సూర్యుని స్తుతించిన ముంజగడ్డి మధ్యనుండు ఇషీక =గడ్డిపరకవలె సులభముగ పాపము నుండి ముక్తుడగును. మార్గమందు (ప్రయాణములో) శుభనిలయమగు ''జాతవేదసే'' అను మంత్రమును జపింపవలెను. అందువలన సర్వభయములం బాసి స్వస్తిస్త మంతుడై శుభములం బొందినవాడై సుఖముగా నిల్లుసేరును. వేకువ లేకరాత్రివేళ నిది జపించి దుస్స్వప్నములు రావు. ''ప్రమందిత'' అను సూర్య మంత్రము జపించిన గర్భవిమోచనమగును. ఉపన్నిందరమ్‌ అనుచు స్నానము చేసి యేడు వైశ్వదేవములందు ఆజ్యహోమము సేసిన యెడల సర్వపాపములను బాయును. ''ఇమామ్‌'' అను మంత్రము జపించి నభిష్ట సమృద్ధి నందును.

మాసప్తోక ఇతి ద్వాబ్యాం త్రిరాత్రోపోషితః శుచిః | జౌదుంబరీస్తు జుహుయాద్దధి మధ్వాజ్య సంస్కృతాః ||

ఛిత్వా సర్వాన్‌ మృత్యుపాశాన్‌ జీవేద్రోగ వివర్జితః | ఊర్థ్వ బాహు రనేనైవ స్తుత్వాశస్త్రం తధైవ చ ||

మాన స్తోకేతి చ బుచా శిఖాబంధే కృతే నరః | అదృశ్యః సర్వభూతానాం జాయతే సంశయం వినా ||

చిత్ర మిత్యుప తిష్ఠేత త్రిసంద్యం భాస్కరం తధా | సమిత్పాణి ర్నరో నిత్యం ప్రాప్నుయాత్తు ధనాయుషీ ||

ఏతత్‌ దుఃస్వప్న స్యేతి చ జపన్‌ ప్రాతర్దినే దినే | దుఃస్వప్నం దహతే కృత్స్నం భోజనం చాప్ను యాచ్చుభమ్‌ ||

ఉభేషునామీతి తధా రక్షా చ పరికీర్తితా | నిర్వర్త్య పంచయజ్ఞాంశ్చ హుత్వాచాగ్నిం కృలాహ్నికః ||

దేవాసావితి దేవ్యేదం జపన్‌ కామాసవాప్నుయాత్‌ | ఆతతాయిన మాయాంతు దృష్ట్వా వ్యాఘ్రాదివకం నరః ||

నమాగ్నిన్నితి జపంత్తేభ్య ఏవ ప్రముచ్యతే | కయా శుభేతి చజపన్‌ జ్ఞాతి శ్రైష్ఠమవాప్నుయాత్‌ ||

ఇమంను సోమ విత్యేతత్‌ సర్వాన్‌ కామానవాప్నుయాత్‌ | పిత్ర న్త్విత్యుప తిష్ఠేత నిత్య మస్న ముపస్థితమ్‌ ||

నాస్య స్యాదన్నతో వ్యాధి ర్విషమప్యన్నతా మియాత్‌ | అగ్నే నయేతి సూక్తేన ప్రత్యుచం జుహుయాత్‌ ఘృతమ్‌ ||

పక్వాన్నం ప్రతిపద్యేత కృత్వాచాకర్మ గర్హితమ్‌ | వీరా7న్వయం సమాప్నోతి సశ్లోకం యోజపేత్సదా ||

''మానస్తోకే'' అను రనెండు మంత్రములతో మూడు రాత్రులపవశించి శుచియై మేడిసమిధులను పెరుగు, తేనె, నెయ్యితో సంస్కరింతచి హోమము సేసపినయెడల సర్వమృత్యు పాశములను త్రెంచికొని రోగములు వాసి జీవించును. చేతులు మీదికెత్తి యి మంత్రము చేతనే శస్త్రమును స్తుతించి ''మామస్తోకే'' అనిన బుక్కుతోనే జుట్టు ముడివేకొన్నచో సర్వ భూతములకు గనిపింవకుండ నుండును ఇది ''అదృశ్యకరణి'' అన్నమాట. ''చిత్ర''మను మంత్రముచే త్రిసంధ్యమును భాస్కరుని సమిధలుచేత బట్టుకొని ప్రార్థించునేని ధనమును అయుర్భాగ్యమును బొందును. ఉదయము ప్రతిదినము '' ఏతత్‌ దుఃస్వప్నస్య'' అను మంత్రము జిపించినచో దుఃస్వప్నములు రావు చక్కని భోజనముంగూడ పొందునను. ''ఉభేషునామీ'' అనునది ''రక్ష'' మంత్రమని కీర్తింపబడినది. పంచ యజ్ఞములు గావించి (పంచయజ్ఞములు బ్రహ్మ - దేవ - పితృ - మనుష్య - భూతయజ్ఞము) అగ్ని హోత్రము సేసి ఆహ్నిక కర్మకలాపమంతయు ముగించికొని ''దేవా సావితి దేవ్యేదం'' అను మంత్రము జరిపించిన సర్వకామసిద్ధి నందును. పెద్ద పులులు మొదలైన క్రూరమృగములు ఆతతాయి (నిప్పు పెట్టువాడు విషము పెట్టువాడు కత్తిగొని నకువాడు దనము దోచుకొనువాడు భూమిని లాగికొన్నవాడు పరుని భర్యాను చెఱబెట్టినవాడు) ననువారు పైబడునపుడు ''నమాగిరన్‌'' అను మంత్రము జపించినచో నా బాధలను దప్పించుకొనును. ''కయాశుధ'' అను మంత్రము జపించినచో జ్ఞాతులలో గొప్పవాడగునున. ''ఇమంను సోమం'' అను మంత్ర జపము సర్వకామపద్రము. ''పిత్రన్తు'' అను మంత్రముతో నెదుటనున్న యన్నముం బ్రార్థించిన వీని కన్నమువలన రోగమురాదు. విషముకూడ నాహారముగును. ''అగ్నేనయ' అను సూక్తముతో ప్రతి బుక్‌తో నెయ్యి హోమము చేసినచో నీచవృత్తిలోనుండియును పక్వాన్నముం బొందును. ''సశ్లోకం'' అను మంత్ర జపముచేసిన వీరులపంశ మందు జనించును.

కం కతా చేతి సూక్తేన విఘ్నాన్సర్వా నపోహతి | యోజాత ఇతిసూక్తేన సుఖ మాప్నో త్యనుత్తమమ్‌ ||

యే పరాజన్ని తీమాం తు దుఃస్వప్న శమనా మృచమ్‌ | ఏకా మాహమితీయంతు విజ్ఞేయా శ్రీకరీ తధా ||

గతుర్దశీ ముపోషై#్యకాం కృష్ణాసు జుహుయాత్‌ ఘృతమ్‌ | ఆత్తసూక్తేన రౌద్రేణ వ్యాధి మేకం విముంచతి ||

స్నాత్వా7నశ్నన్‌ జపే దప్సు శీత త్రయ మతంద్రితః | ఆమిషస్యేతయోర్మోహాత్‌ కృత్వావా కర్మగర్హితమ్‌ ||

అధ్వని ప్రస్తితోయస్తు పశ్యేచ్ఛకున ముత్థితమ్‌ | అప్రశ##స్తే ప్రశ##స్తేవా కనిక్రద మిదం జఫేత్‌ ||

''కంకతా'' అను సూక్తమువలన సర్వవిఘ్నములం బోగోట్టుకొనును. ''యోజాత'' అను సూక్తముచే అత్యుత్తమ సుఖమందును. ''యేపరాజన్‌'' అను బుక్కు దుఃస్వప్న నాశకము. ఏకామాహమ్‌'' అనునది సంవత్కరియగు బుక్కు. కృష్ణచతుర్దశులం దుపవసించి రుద్రసూక్తముతో ఆజ్యహోమముచేసిన రోగ విముక్తుడగును. స్నానముసేసి ఉపవాసముండి మోహముచే నింద్యములైన పనులు చేసినవాడలసుడుగాక శీతత్రయముం జపింపవలెను. ప్రయాణమైనవాడు తోవలో మంచి చెడ్డ శకునము లేవైనను కనిక్రమను నీమంత్రము జపింపవలెను.

అస్పృష్టై చ జప్తవ్యమే తత్తస్కర మోహనమ్‌ | ఓం ష్విత్సృచ మపాం మధ్యే జపేద్యోవై నదీం తరేత్‌ ||

ఉద్ధౌర్మిఖిరితీమాం తు జపే ద్రథగతస్తరన్‌ | లధ్వానం ప్రస్థితశ్చైవ మంత్రైరితి చ సంస్మరేత్‌ ||

సుదాతారం సుపుష్ట్యర్థం సర్వవేదేస్థితం నరం | నాస్తి వాద్యాగమో యస్య సుయు క్తస్యాపి భార్గవ! ||

స సర్పీరితిచ జపన్‌ మాసాత్తం ప్రతిపద్యతే | యానాక్షం సమభజ్యన్తం దృష్ట్వా దుర్గే7ధ్వని ద్విజ! ||

అభిత్యవస్యేతి జపే దృచమక్షబలం దధత్‌ | కృష్ణ పక్ష చతుర్దశ్యాం త్రిరాత్రాతో పోషితః శుచిః ||

దక్షిణ ప్రవణ దేశే స్మవానస్థః సమాహితః | రక్తోష్ణీష్యసి పాణిశ్చ దౌలాకీభ్యో7నిలాశనః ||

సస్తాహం జుహుయాత్తైలల సార్షపం లవాణాన్వితమ్‌ | సమిధో రాజవృక్షస్య వసిష్ఢేద్వేషిణీ! పఠన్‌ |

యం ద్విష్యాత్తస్య కృత్వాతు శమ్యాకేనాహుతిం నిశి | అధిష్ఠాయ చ తం కుర్యాదృగ్భిశ్చ తిసృభిర్ద్విజః ||

ఉద్దిశ్య రామ హోమో7యం సప్తరాత్రం న జీవత | ద్వావింశకం జపన్‌ సూక్తమాధ్యత్మిక మనుత్తమమ్‌ ||

పర్వసు ప్రయతో నిత్య మిష్టాన్‌ కామానుపాశ్నుతే | బృహస్పతి మజాశ్వంచ సతారం బభ్రుమేవచ ||

పంచర్చేన స్తువన్నేతాన్‌ పంచకామా న వాప్నుయాత్‌ | కృణుష్వేతి జపన్‌ సూక్తం జుహ్వదాజ్యం సమాహితః ||

ఆరాతీనాం హరేత్‌ ప్రాణాన్‌ రక్షాం స్యపిద నాశ##యేత్‌ | ఉపతిష్ఠేత యోవహ్నిం పరీత్యచ దినే దినే ||

తం రక్షతి స్వయం వహ్ని ర్విశ్వతో విశ్వతోముఖః |

దొంగలను సమ్మోహ పరచుటకు ''అస్పృష్ట్వైవ'' అను మంత్రము జపింపవలెను. ''ఓం షు'' అను బుక్కును నీళ్ళలో జపించినే నదిని దాటగల్గును. !!ఉద్ధౌర్మిభిః '' అను నీ బుక్కును రథమున గూర్చుండి జపింపవలెను. దారి నడచువాడు (ప్రయాణమందు ''మంత్రై'' అను మంత్రము జపించుచు శుభప్రదాతయు సర్వవేదములం దర్ధమైయున్న వానిని మంచి పుష్టికొరకు స్మరింపవలెను. ఈ మంత్ర జపముసుయుక్తుడై అన్ని విధాల యోగ్యతులున్నను విద్యరాని వానికి విద్యాసిద్ధికి జెప్పబడినది. ''ససర్పీః అను'' మంత్రమును నిరుకదారింబడి విఱిగిపోనున్న రథచక్ర మాకు(బండియాకును) జూచిజపించిన యెడలనది బాగుపడును. ''అభిత్యవన్య'' అను బుక్కునం అక్షబలం = ఇంద్రియ పాటవమును దధత్‌ =ధరించిన వాడై అనగా దిటవైన బుద్ధి గలిగి కృష్ణ పక్ష చతుర్దవి నాడు త్రిరాత్రోప వాసము చేసి శుచియై జపింపవలెను. దక్షిణదిశ వాలుగా నున్న చోట స్మశానములో గూర్చుండి మనసు కుదురు కొనం జేసికొని ఎఱ్ఱని తలపాగ దాన్చి కత్తి చేతం బట్టుకొని వాయు భక్షణము సేయుచు నేడు రోజులుప్పుతో గలిపి యావనూనును రాజవృక్షము (ఱల చెట్టు) యొక్క సమిథలతో హోమము సేయవలెను. ''వశిష్దేద్వేఫిశీః'' అను మంత్ర మిక్కడ పఠింపవలెను. ఎవనిని ద్వేషించునో వాని నుద్దేశించి రాత్రివేల గూర్చుండి శమ్సాకముతో నేడు రోజులుమూడుబుక్కుల సంపుటితలో హోమము సేయవలెను. ఇది జరిగిన తరువాత నా శత్రువు బ్రతుకడు. అధ్యాత్మకము (కేవల పరబ్రహ్మ విషయమైన) ద్వాలింశకమను సూక్తమును పర్వము లందు నియమముతో నిత్యము జపించినచో సర్వాభీష్టములను భవించును. బృహస్పతిని అజాశ్వని సతారుని బభ్రువును నను వీరిని పంచర్చముతో (ఐదు బుక్కుల సంపుటితో) స్తుతించిపంచ కాలములను శబ్దస్పర్శరూపరస గంధములను నైదింద్రియ విషయ భోగములను బడయగలడు. ''కృణుష్వ'' అను సూక్తమును జపించుచు ఆజ్యాహోమము నియమిత బుద్ధియై గావింపవలెను. ఇది శత్రువుల ప్రాణములను హరించును. రక్షస్పసుల నాశనముసేయును. ప్రతి దినమును నగ్నినుపాసించునాడని అగ్ని విశ్వతో ముఖుడై (అన్ని వైపుల దృష్టి కలవాడై) సశ్వతః =సర్వము నుండి రక్షించును.

కో ఆద్యేతి చ సూక్తేన వాసాంసి లభ##తే పరమ్‌ ||

కాయేతి వామదేవేన కుర్యాత్‌ స్వస్త్యయనం నిశి | హంసః శుచిషదిత్యేతత్‌ శుచి రీక్షన్‌ దివాకరమ్‌ ||

కృషిం ప్రపద్యమానస్తు స్థాలీపాకం యధావిధి | జుహుయాత్‌ క్షేత్రమధ్యేతు శునావాహస్తు పంచభిః ||

ఇంద్రాయచ మరుద్భ్యశ్చ పర్జన్యాయ భగాయచ | యథాలింగం తు విహరేల్లాంగలంతు కృషీవలః ||

పూష్ణే ధాన్యాయ సీతాయై శునాసీర మధోత్తరమ్‌ | గందమాల్యోపహారైశ్చ యజే దేతాశ్బ దేవతాః ||

ప్రవాపణ ప్రలపనే ఖలసీతోపహారయోః | అమోఘం కర్మభవతి వర్ధతే సర్వదా కృషిః ||

క్షేత్రస్య పత్యే తత్‌ క్షేత్రం సూర్యదృగ్విందతే భువమ్‌ | ఆఖూత్కరేషు చరణౌ యజే దేతేన మూషికామ్‌ ||

చిత్రా ఇంద్రేతిచ స్తూయాన్నాస్య వృష్టి భయం భ##వేత్‌ | విజ్యే తిష్యేతి జ్వలయే ద్యత్రేచ్ఛే జ్జాతవేదసమ్‌ ||

సముద్రా దితి సూక్తేన కామానాప్నోతి పావకాత్‌ | విశ్వాని చ అతి ద్వాభ్యా మృగ్భ్యాం యోవహ్ని మర్చతి ||

స తరత్యాపదః సర్వాః యశః ప్రాప్నోతి తచాక్షయమ్‌ | ఆగ్నేత్వమితి చ స్తుత్వా ధనమాప్నోతి వాంఛితమ్‌ ||

ఉరోష్ట ఇతి నూక్తేన విత్తమాప్నోత్య సంవయమ్‌ | ప్రజాకామో జపేన్నిత్యం వరుణాదేవసన్నయా ||

స్వస్త్యాత్రేయం జపేత్ప్రాతః సదాస్వస్త్యయనం జపేత్‌ | స్వస్థిపన్థా మితిప్రోద్య స్వస్తమాన్‌ వ్రజతే7ధ్వని||

విజహిషో ర్వనస్యాన్తే శత్రూనాం బాధనం భ##వేత్‌ | స్త్రీయో గరృప్రమూఢాయా గర్భమోక్షణ ముత్తమమ్‌ ||

అవచ్చాదిత సూక్తేన కృష్టికామః ప్రయెజయేత్‌ | నిరాహారః క్లిన్నవాసాః నచిరేణ ప్రకర్షతి || శ్రియః పంచదశర్చం తు జపన్‌ హూయాత్‌ ఘృతేన వా | ఉప్తెతు మాం దేవసఖ ఇతి సర్వౌషధీ జలైః ||

సదా స్నాతః శ్రియం దీప్తాం కలే ప్రాప్నోత్య సంశయమ్‌ | మనసః కామ మిత్యేతాం పశుకామో నరో జవేత్‌ ||

కర్దమనేతి చస్నాయాల్‌ ప్రజాకామః శుచివ్రతః ః అశ్వపూర్వా మితిస్నాయా ద్రాజ్యకామస్తు మానవః ||

రోహితే చర్మణి స్నాయా ద్ర్బాహ్మణస్తు యతావిధి | రాజాచర్మణి వైయాఘ్రే ఛాగే వైశ్య స్తదైవచ ||

దశ సాహస్రికో హోమః ప్రత్యేకం పరికీర్తితః | అప్సు వాజుహూయా ద్రామ ! పద్మాన్యయుతశో7గ్నిఘ||

ఇష్టాన ఇత్యుచ్రా వహ్నిం స్తువన్‌ శత్రూన్‌ వినాశ##యేత్‌ | ఆచార ఇతిసూక్తేన గోష్ఠేగాం లోకమాతరమ్‌ ||

ఉపతిష్ఠే ద్ర్వజేచ్చైవ య ఇచ్ఛేద్గాః సదా క్షయాశ్షుః | వాక్సిద్ధింతు స్తువన్‌ శక్రం మహద్ధన మూప్నుయాత్‌ ||

ఉపైతేతి బుచా రాజ్ఞో దుందుభీ నభి మంత్రయేత్‌ || తేజోబలంచ ప్రాప్నోతి శత్రూం శ్చైవ నియచ్ఛతి ||

తృణపాణిర్జపే త్సూక్తం రక్షోఘ్నం దస్యుభిర్యతః | యేకేచమేత్యృచం జప్త్వా దేర్ఘమాయరనాప్నుయాత్‌ ||

యస్యనష్టం భ##వెద్ద్రవ్యం సంపూజ్య స జపే న్నిశి | సౌమారౌద్రం జపే త్సూక్తం సర్వపాపైః ప్రముచ్యతే ||

జీమూతసూక్తేన తథా సేనాంగా నభిమంత్రయేత్‌ | యధాలింగం తతో రాజా వినిహన్తిరణ రిపూన్‌ ||

అగ్నిం నరేతి సూక్తేన స్తువన్నగ్నిం సుఖీభ##వేత్‌ | ప్రాణపేతి త్రిబింసూక్తైః దనమాప్నోతి చాక్షయమ్‌ ||

''అభీతయః ప్రగాఢేన'' స్తుత్వా శక్రం ధనీ భ##వేత్‌ | శంవతిః శన్న ఇంద్రాగ్నీ జపే ధ్వ్యాధి వినాశనమ్‌ ||

సముద్ర జ్యేష్ఠేతి జపేత్‌ సూక్త మేతజ్జయావహమ్‌ | వాస్తోష్పతే ప్రతీ త్యేతత్‌ సూక్తం వాస్తోష్పతే ర్జపేత్‌ ||

అనీవహేతి సూక్తేన భూతాన్నిస్స్వాపయే న్నిశి | సంబాధే విషమే దుర్గే బంధేవానిగడైః క్వచిత్‌ ||

పలాయిత్వా గృహీతోవా సూక్తమేత త్తధా జపేత్‌ | త్రిరాత్రం నియతోపోష్యశ్రపయేత్‌ పాయసం చరుమ్‌ ||

తేనాయుత శతం పూర్ణం జుహుయాత్త్య్రంబకేత్యృచా | సముద్దిశ్య మహాదేవం జీలేదబ్దశతం సుఖీ ||

''తచ్చక్షు'' రిత్యృచా స్నాతః ఉపతిష్ఠేద్దివాకరమ్‌ | ఉత్యన్తం మధ్యమం చైవ దీర్ఘమాయుర్జిజీషుః ||

వ్యుసా ఇత్యుపతిష్ఠేత యఃప్రతాః ప్రయతశ్శుచిః | ప్రాప్నుయత్స హిరణ్యాది నానారూప ధరం బహు ||

ధ్రువం సంధ్యాసుక్షితషు జపన్‌ బద్ధః ప్రముచ్చతే | ఇదమాపః ప్రవహత యత్కించిద్దురితం పునః ||

ఆపః ప్రవిశ్యతు జపన్సర్వపాపైః పరముచ్చతే | సూక్తాభ్యాం పర ఏతాతభ్యాం హుతాభ్యాంభూతి మాప్నుయాత్‌ ||

సూక్తాభ్యాం తిస్ర ఏతాభ్యా మాస్యదఘ్నోదక స్థితః | ఉపతిష్టన్‌ రవిం దేవం పంచరాత్రే గతే నరః ||

అనశ్నన్‌ భార్గవశేష్ఠ ! మహద్ధర్ష మవాప్నుయాత్‌ |

కొ అద్య అను సూక్తము జపించిన వస్త్ర సమృద్ది నందును '' కాయ'' అను మంత్రముతో వామదేవమను మంత్రముతో రాత్రిస్వస్త్యయనము స్యస్తివాచనము సేయవలెను. ''హంసః శుచిషత్‌'' అను మంత్రముతో సూర్యుని జూచుచు వుచియగును. వ్యవసాయము సేయనెంచిన వారు యతావిధిగా పొలమ నడుమ స్దావీపాకము సేసి ''శునావాహః'' అను మంత్రములసంపుటితో ఇంద్రునికి మరుత్తులకు పర్థన్యునికి భగునకు ఆయాదేవతల లింగము (పేడు చిహ్నగల) మంత్రములతో హోమము సేయవలెను. ఆ మీదట కృషీవలుడు (వ్యవసాయదారు) నాగలికట్టి దున్నవలెను. ధాన్యము పంటకు రాషదేవతకు దుక్కి(బాలు) సాగుటకు ఇంద్రునికి గంధమార్యాదుల సమర్పించి యీదేవతలను బూజింపవలెను. ఇందువలన విత్తనాలచల్లుటలో ప్రలవనమందు (కోతలదు) కళ్ళముచేయుటలో దున్నుటలోను నిరాఘాటముగ సాగును. వ్యవవసాయము నిరంతరముగ నభివృద్దినందును.

''చిత్రా ఇంద్ర'' అను మంతరముతో స్తుతించునేని అతివృష్ట అనావృష్టి భయముఉండదు. ''విజ్యేతిష్యు'' అను మంత్రముతో నగ్ని యవసరమైనపుడల్ల నిప్పును రగుల్పవలెను. ''సముద్రాత్‌'' అను సూక్తముచేత నగ్ని హోత్రుని స్తుతించిన యాయనవలన నన్ని కోరికలును సిద్దించుము. ''విశ్వాని చ'' అనునది మొదలుగ రెండు మంత్రములచు నగ్ని సమర్చసేసినవాడు సర్వాపదలను రాటును. అక్షయ కీర్తిని గూడ పొందును. ''గ్నేత్వమ్‌'' అను మంత్రముతో నగ్నిని స్తుతించి కోరిన ధనమును బొందును. ''ఉరోష్ట'' అను సూక్తపఠనమున ధనవంతుడగును. ''వరుణా దేవన్నయా'' అను మంత్రమును సంతానకాముడు నిత్యము జపింపవలెను. స్వస్త్యాత్రేయమను మంత్రమును ప్రాతఃకాలమందు స్కవస్త్యయనమును మంత్రము నెల్పుడును (శుభ ప్రయాణ సాధనమగు) స్వస్తిపంథా మను మంత్రమును జపించిన నతడు మార్గమునందు స్వస్తి మంతుడగును. దుర్గమారణ్నయము దాటదలచు వానికి దారిలో నడ్డు వచ్చిన శత్రువలుకు బాధగల్గును. మూఢగర్బయగు స్త్రీకి గర్భమోక్షము చక్కనగును.

వర్షము కావలయునన్న యాతడు''అసచ్చాత్‌'' అను సూక్తమును నిరాహారియై తడి గుడ్డలు కట్టుకొని ప్రయోగించిన వెంటనే వర్షము గురియును. పదు నేను బుక్కులు గల శ్రీ సూక్తము జపించుచు ఆజ్యహోమము సేయవలెను. ఉపైతుమాం దేవ సఖ అని జపించి నర్వౌ షధలు నింపిన నీటితో నిత్యము స్నానము సేసిన వాడు తన కులమందు సుశోభనమైన యైశ్వర్యముంబొందును. నందియములేదు. ''మసఃకామ'' అను మంత్రమును పశుకాముడు జపింపవలెను. ''కర్దమేన'' అను మంత్రముచే శుచివ్రతియై ప్రజా (సంతాన) కాముడు స్నానము సేయవలెనను. అశ్వ పూర్వామను మంత్రము జపించుచు రాజ్యకాముడు స్నానము సేయవలెను. జింకచర్మముపై బ్రాహ్మణుడు పులిచర్మము మీద క్షత్రియుడు మేక చర్మముపై వైశ్యుడును స్నానము సేయవలెను. వేద్వేర పది వేల సంఖ్యలో నీటి యుందు గాని అగ్నియందు గాని పది వేల తామర పూవులు హోమము సేయవలెను. ''ఇష్టాన'' అను బుక్కుచే నగ్నిని స్తుతించిన వాడు శత్రువలనశింప జేయగలడు. ''ఆచార'' అను సూక్తముతో గోశాలలో లోకమాత యగు గోవును స్తుతింప వలెను. దాని ననుగమింపవలెను. దాని వలన తఱుగని గోసంపద గల్గును. ఇంద్రుని స్తుతించిన వాక్సిద్ధి దన సమృద్ధియుంగల్గును.

''ఉపైత'' అను బుక్కుతో రాజుయొక్క దుందుభి వాద్యము నభిమంత్రించినచో తేజస్సు (ప్రతాపమును) బలయును బడయును. శత్రువులను నిగ్రహించును. దొంగలు క్రమ్ముకొన్నపుడు గడ్డి చేతబట్టుకొని ''యేకేచమా'' అను రక్షోనాశకమైన బుక్కును జపించిన దీర్ఘాయువందును. ద్రవ్య నష్టము గల్గినపుడు ''సౌమారౌద్ర'' సూక్తమును రాత్రి పూజచేసి జపింపవలెను. సమస్త పాప నిర్ముక్తుడగును. ''జీమూత'' సూక్తముచేత సేనలోని గజ రధ తురగ - పదాతులను చతురంగముల నభిమంత్రింపవలెను. ఆయా మంత్రములం దాయా గజాదుల లింగము = మంత్రలింగము (పేరు) ఉండును. అది గమనించి వాని వాని నభిమంత్రించినచో శత్రువలం జయించును. ''అగ్నింనర'' అను సూక్తముతో నగ్నిని స్తుతించినయెడల సుఖమందును. ''ప్రాణప'' అను మూడు సూక్తములచే స్తుతించిన నక్షయధనమందును. ''అభీతయః ప్రగాఢేన'' అని బుక్కుచే నింద్రుని స్తుతించిన ధనవంతుడగును. ''శంవతీః శంన ఇంద్రాగ్నీ'' అను మంత్రములు వ్యాధి పోవుటకు జపింప నయినవి. ''సముద్ర జ్యేష్ఠ'' అను సూక్తము జపించిన జయము గల్గును. ''వాస్తోష్పతే ప్రతి'' అను సూక్తమును వాస్తోష్పతి (ఇంద్రుని) కై జపింపవలెను. ''అనీవహ'' అను సూక్తముచే రాత్రి భూతములను దయ్యములను నిద్రింపజేయవచ్చను. ఇఱకాటములందు విషమము దుర్గమములయిన కష్టములందు నిగళ బంధమునందు చేతులకు సంకెళ్ళు పడనైనవేళ హడలి పారిపోవునప్పుడు దయ్యము పట్టు కొన్నప్పుడు నీ సూక్తము జపించి మూడురోజులుపవాసముండి పరమాన్నము చరువును వండవలెను. పై మంత్రము నూరు వేలు జపముచేసి ''త్ర్యంబకం యజామహే'' అను బుక్కుతో మహాదేవు నుద్దేశించి పాయనచరు హోమము సేసినచో నూరెండ్లు హాయిగ నుండును. ''తచ్ఛక్ష్రుః'' అను బుక్కుతో స్నానముచేసి ఉదయించుచున్న మథ్యం దినమందున్న సూర్యునికుపస్థానము సేసిన యెడల దీర్ఘాయుష్మంతుడౌను. ''వ్యుషా''అను మంత్రముతో ప్రాతఃకాలమందు నియమవంతుడై శుచియై సూర్యునుసాసించిన బంగారము మొదలైన పెక్కు రూపములైన ఐశ్వర్య మెంతేనిం బడయును. ''ధ్రువం సంధ్యాసుక్షితిషు'' అను మంత్ర జపముచే బంధముక్తుడగును. ఏకొంచెము పాపమున్నను ''ఇదమాపః ప్రవహత'' అను మంత్రమును నీటిలో దిగి జపించినచో సర్వపాపముక్తడగును. ఈ చెప్పిన రెండు సూక్తములతో హోమము సేసినవాడైశ్వర్యముంబొందును. ఈరెండు సూక్తములను ప్రవహించు చున్న కంఠములోతు నీటిలో నిలిచి సూర్యభగవానుని కుపస్థానము చేయుచు నైదు దినములు నిరాహారియై యున్నచో మహానందభరితుడగును.

ఇంద్రాసోమేతి సూక్తంతు కథితం శత్రు నాశకమ్‌ ||

యస్యలుప్యే ద్ర్వతం మోహా ద్ర్వాత్యైర్వా సంసృజేత్సహ | ఉపోష్యాజ్యస్య జుహుయాత్‌ త్వమగ్నే వ్రతపా ఇతి ||

ఆదిత్య దృక్‌ప్రమా ద్రౌజం జప్త్వా వాదీ జయి భ##వేత్‌ | సమగ్ని రగ్ని ఛిశ్చేతి ప్రపద్యే ద్వాయు భాస్కరౌ||

అగ్నిం ప్రథమతః స్తుత్యా మహత్కష్టా త్ప్ర ముచ్యలే | నహీతి చ చతుష్కేణ ముచ్యతే మహతో భయాత్‌ ||

బుచం జప్త్వాయ ఇత్యేతత్‌ సర్వాన్కా మానవాప్నుయాత్‌ | ప్రాగ్భోజన ''మిదంబ్రహ్మ'' మానవానాం మహర్షిణామ్‌ ||

పూర్వాహ్ణే జపతోనిత్యం త్వర్థ సిద్దః పరాభ##వేత్‌ | అగ్నినే త్యాశ్వినం సూక్తం మృజాహర ముదాహృతమ్‌ ||

సమిధేతి జుహోత్యగ్నౌ ప్రాప్నుయాత్‌ కీర్తి ముత్తమామ్‌ | ద్విచత్వారింశకం చైంద్రం జప్త్వా నాశయతే రిపూన్‌ ||

నాశం మహీతి జప్త్వాచ ప్రాప్నోత్యారోగ్యమేవచ | దుఃస్వప్నఘ్నాః పరా జప్త్వా నరఃపాపైః ప్రముచ్చతే ||

శంనో భ##వేతి ద్వాభ్యాంతు భుక్త్వాన్నం ప్రయతశ్శుచిః | హృదయం పాణినా స్పృష్ట్వా వ్యాధిభిర్నాభిభూయతే ||

అహోరాత్రోషితః స్నాత్వా శక్రం సంపూజ్య మానవః | ఇత ఇత్యాజ్యముత్పూయ జుహుయాందింద్ర మర్చయేత్‌ ||

ఘృతం తిలం వా ధర్మజ్ఞ ! భ##యేభ్యో విప్రముచ్యతే | తత్వా మందమితి స్నాతోహుత్వా శత్రూన్‌ ప్రమాపయేత్‌ ||

తాన్విద్యాదిత్య దైవత్యం జప్త్వాముచ్యేత బంధనాత్‌ | యద్యావ ఇతి జప్త్వాచ సర్వాన్‌ కామాన్‌ సమశ్నుతే ||

"ఇంద్రాసోమ" ఆను సూక్తము శత్రునాశకమని చెప్పబడినది. మోహముచేత గాని వ్రాత్యుల యొక్క = సంస్కార హీనులయొక్క సంపర్కము వలనగాని వ్రత లోపము వచ్చినపుడు ఉపవాసముండి "త్వమగ్నే వ్రతపా" అను సూక్తముతో ఆజ్యుహోమము సేయవలెను. "ఆదిత్యదృక్‌ ప్రమాద్రౌజం" అను మంత్రము జపించిన వాదమునందు గెల్పొందును. "సమగ్నిరగ్నిభిశ్చ" అని వాయుదేవుని సూర్యుని ప్రార్థింపవలెను. మొదట నగ్నిని స్తుతించి మహా కష్టమునుండి విడివడును. "నహి" అను నాల్గు మంత్రములను జపించుటచే మహా భయ విముక్తుడగును. "" అను ఋక్కును జపించిన సర్వకామములను బొందును. భోజనమునకు ముందు "ఇదం బ్రహ్మ" అను మంత్రము మానవులకు మహర్షులకును పూర్వ భోజనము. నిత్యము దీనిని పూర్వాహ్ణమున జపించిన పరమార్థసిద్ధి గల్గును (బ్రహ్మనుభవముగల్గునన్నమాట.). "అగ్నినా" అను ఆశ్విల సూక్తము అశ్వినీ దేవతాకము రోగహరము. "సమిధా" అను మంత్రముతో నగ్నియందు హోమముసేసిన కీర్తిగల్గును. ద్విచత్వారింశకం =నలుబది రెండు మంత్రముల సంపుటి యైన యింద్ర దేవతాక సూక్తము జపించి శత్రునాశనము చేయగలడు. "నాశంమహీ" అని జపించిన వా డారోగ్యవంతుడగును. "దుస్స్వప్నఘ్నా పరాః" అను మంత్రము జపించిన సర్వపాపముక్తుడగును. "శంనోభవ" అను రెండు మంత్రములతో శుచియై నియమ వంతుడై భోజనము సేసి చేతితో హృదయముం దాకిన యతడు రోగగ్రస్తుడు గాడు. అహో రాత్రోపవాసము సేసి స్నానము సేసి యింద్రుని బూజించి "ఇతః" అను మంత్రము పఠించుచు నేతిని ఆజ్యపాత్రయం దుత్పవన (దర్భలతో నేతిని తూర్పు నుండి పడమరకు పొందించి మరల తూర్పునకు చేర్చుట) రూపమున పవిత్ర మొనరించి ఇంద్ర దేవతాక మంత్రములతో హోమము సేసి యింద్రునర్చింపవలెను. ఆ హోమము నెయ్యితోగాని నువ్వులతోగాని జేయవలెను. దాని వలన సర్వభయ విముక్తి గలుగును. "తత్వా మంద" మను మంత్రముతో స్నానము చేసి హోమమెనరించిన సర్వశత్రువుల నశింపచేయ గలడు.

పవిత్రాణాం పవిత్రంతు పావమాన ఋచః స్మృతాః | వైఖానస ఋచస్త్రింశత్‌ పవిత్రాః పరమాః స్మృతాః ||

ఋచాం ద్విషష్టిః ప్రోక్తం చోపవసే దృషిసత్తమైః | సర్వకల్ప వినాశాయ పావనాయ శివాయచ ||

స్వాదిష్టయేతి సూక్తానాం సప్తషష్టి రుదాహృతాః | దశోత్తరా ఋచశ్చైతాః పావమాన్యః శతాని షట్‌ ||

ఏతజ్జుహ్వన్‌ జపం శ్చైవ ఘోరం మృత్యుభయం జయేత్‌ | ఆధ్యాత్మికం పవిత్రంచ సూక్తం జప్తా7ల్పతః క్విచిత్‌ ||

గతి మిష్టా మవాప్నోతి విందతే మహతీం శ్రియమ్‌ | ఆపోహిష్ఠేతి మహతః ప్రయుంజీతోదక స్థితః ||

సర్వపాప వినిర్ముక్తస్త్వ శేషఫలమశ్నుతే | ఉపతిష్ఠేత రాజానం యమసూక్తేన వైద్విజ! ||

చతుర్ధశ్యాంతు కుర్వీత స్థాలీపాకం యధాతిధి | పరేయవాంస మిత్యే తత్సూక్తమత్ర ప్రయోజయేత్‌ ||

పరాయుషః ప్రమీయేత నస జాతు కధంచ న | మృత్యుమేవ ప్రపద్యేత పరం మృత్యోరితి ద్విజ ! || 116

"తాన్‌" అను ఆదిత్య దేవతాక మంత్రము జపించిన బంధ విముక్తుడగును. "యద్యావ" అను మంత్రము జపించిన సర్వ కామ సిద్ధి యగును. పావమాన బుక్కులు. పవిత్రమై వానికి కూడ పవిత్రత కలగించునని వైఖానస ఋక్కులు ముప్పదియు పరమ పవిత్రములని స్మృతికారులు ఋషులు పల్కినారు. అరువది రెండు ఋక్కులు నుపవసించి జపించిన సర్వకల్ప వినాశన మగును. పవిత్రమగు మంగళమును గల్గును. "స్వాదిష్టయ" అని మొదలుగ నఱువది యేడు ఋక్కులు అటుమీది పదిఋక్కులు, అఱువందలు పావమానీ ఋక్కులను జపించుచు హోమ వినియోగము చేయనేని ఘోరమైన మృత్యుభయముం గెల్చును. కేవల పరమాత్మ విషయము పవిత్రమునైన సూక్తము నొకప్పుడేని నొకించుకగా నేని జపించినచో కోరిన సద్గతి నందును. మహైశ్వర్య సంపన్నుడు నగును. నీళ్ళలో నిలిచి ఆపోహిష్ఠామయోభువః అను గొప్ప మంత్రముల నుపయోగించిన సర్వపాపములు వోయి అన్ని ఫలముల ననుభవించును. యమసూక్తముతో రాజును (యముని ) ఉపాసించవలెను. చతుర్థశి యందు స్థాలీపాకము చేయవలెను. ఈ స్థాలీపాకమందు "పరేయువామ్‌" అను మంత్రమును సంపుటీకరింపవలెను. దాని వలన పరమాయుర్దాయము నొందును. అంతకుమున్నెన్నడు నతడు చనిపోడు. "పరం మృత్యోః" అను మంత్ర ప్రయోగమునగూడ అల్పాయువై పోదు.

వైశాఖ్యాం పూర్ణిమాస్యాంతు నక్తభోజి సదానరః | పరాయుషః ప్రమీయేత న స జాతు కథంచ న ||

ఫలాహారో జయేన్మృత్యుం త్రిభిర్వర్షైః సదా నరః | దశాక్షరంతు శాన్త్యర్థం భద్రం న ఇతి సంస్మరన్‌ ||

ఫలావారో భ##వేన్మాసం మాసాన్మాసం పయః పిబేత్‌ | వాయుభక్ష్యో భ##వేన్మాసం జపన్నేత త్సహస్రశః ||

అంతర్థానమవాప్నోతి సిద్ధాన్‌ పశ్యతి చారణాన్‌ | ప్రదేవతేతి నియతో జపేత మరుధన్వసు ||

ప్రాణన్తకే భ##యే ప్రాప్తే క్షిప్రమాయస్తు విన్దతి | వైఖీతకాంస్తు త్రీనక్షాన్‌ గంధైస్సమధి వాసయేత్‌ ||

పుషై#్ప రవకిరే చ్చైవ స్థాపయిత్వా విహాయసి | సంహృత్య పాదౌతౌ తత్రతిష్ఠే ద్దక్షస్తుతిం జవేత్‌ ||

ప్రావే మాసే త్యృచామేకాం జపేచ్చ మనసానిశి | వ్యుష్టాయా ముదితే సూర్యే ద్యూతే జయ మవాప్ను యాత్‌ ||

అబ్రధ్న ముషసాన క్తే త్యేతత్‌ స్వస్త్యయనం జపేత్‌ | నమో మిత్రన్య వరుణస్య "చక్షుషేతిచ నిత్యశః ||

తధాజ్యం జుహుయాన్నిత్యం భీతిభ్యో విప్రముచ్యతే | దేవస్యరీతి నిత్యుంతు జ పేద్దేవం సమశ్నుతే ||

మప్రగామీతి మూఢస్తు పన్థానం పధి వింధతి | క్షీణాయురితి మన్యే త యం కంచిత్సుహృదం ప్రియమ్‌ ||

యత్తేయ మితితు స్నాతస్తస్య ముర్ధానమాలభేత్‌ | సహస్రకృత్వా వంచాహం తేనాయుర్విందతే పునః ||

స్రుక్‌ స్రువే దశ##మేనైవ ఇధ్మమౌదుంబరం భ##వేత్‌ | ఇదమిధ్మేతి జుహుయాత్‌ ఘృతం ప్రాజ్ఞ స్సహస్రసః ||

వైశాఖ పూర్ణిమ నాడు నక్తము సేసిన (రాత్రి మాత్రమే భుజించిన) యతడు పరాయువుకంటిముం దేన్నడుం బూవడు. కేవల ఫలభక్షణము మూడేండ్లు సేయుచు శాంతికై "భద్రంనో అపివాతయమనః" అను దశాక్షర మంత్రము జపించిన మృత్యువు గెల్చును. ఒక మాసము ఫలాహారియై తరువాతి మాసము మంచినీరు త్రాగి యాపైనెల వాయు భక్షణ సేయుచు నింత మున్ను జెప్పిన మంత్ర జపము వేలకొలది సంఖ్యలో జేసిన యతడంతర్థాన శక్తినందును. సిద్దులను చారణులను దర్శింప గలడు. "నియతుడై ప్రదేవతా" అను మంత్రము నెడారిలో జపించ వలెను. జపించిన వెంటనే ప్రాణాంతక స్థితిలో పూర్ణాయువు నందును. వేభీతకాత్‌ = విభీత (తాండ్ర) వృక్ష సంబంధమైన కర్రతో జేసిన మూడు పాచికములకు గంధమురాసి పువ్వులు చల్లి యాకసము నందునిలిపి పాదములు రెండు దగ్గరగాజేర్చి "దక్షస్తుతిని" జపింపవలెను.,"ప్రావే మాసే" అను నీయొక్క ఋక్కును రాత్రివేళ మనస్సుచే జపింపవలెను. తెల్లవారి సూర్యోదయము కాగానే జూదమందు గెలుపొందును. "అబ్రధ్నముష సానక్త" అను నీ స్వస్తి నిలయ మంత్రమును (మంగళకరమన్నమాట) "నమో మిత్రస్యవరుణస్య చక్షుషా" అను మంత్రము నిత్యము జపించి ఆజ్యహోమము సేసిన భయములందలగును. "దేవస్యరీ" అనిజపించిన భగవంతుని బొందును. "మాప్రగామి" అని జపించినచో యొఱుగని దారీ యెఱుకపడును. మిత్రుడెవ్వడేని క్షీణాయువని ఆల్పాయుర్దాయము గలవాడని తోచెనేని "యత్తేయమ్‌" అను మంత్రముతో స్నానము సేసి వాని నడినెత్తిని చేతితో తాకవలెను.అయిదు రోజులీ మంత్రమును వేయిసారులు జపించవలెను. దానిచే నా స్నేహితుడాయుర్దాయమును బడయను. స్రుక్కున్రువము దశమము = హామసాధన సామగ్రిలో పదియవదియు మేడిసమిధల ఇధ్మమును గైకొని "ఇదమిధ్మ" అను మంత్రముతో వేయిసారులు ఆజ్యహోమము సేయవలెను.

పశుకామో గవాం గోష్ఠే అన్నకామ శ్చతుష్పథే | పారావతస్వ స్త్యయనం స్నాతకస్య విధీయతే ||

బృహస్పతే ప్రధమ మితి జ్ఞానకామస్య భార్గవ ! | వయస్సువపర్ణ ఇత్యేతాం జపన్వై విందతే శ్రియమ్‌ ||

"యస్తే మన్యో" ఇతి సదాప్రయత్నఘ్నం విధీయతే | హావిష్మతీయ మభ్యస్య సర్వపాపైః వ్రముచ్యతే ||

యా ఓషధీః స్వస్త్యయనం సర్వపాప వినాశనమ్‌ | తస్య మాయా వనశ్యేత కాయాగ్నిర్వర్థతే తధా ||

బృహస్పతిః ప్రతీత్యేతత్‌ వృష్టికామః ప్రయోజయేత్‌ | సర్వత్రతు పరాశక్తిః జ్ఞేయా ప్రతిరధా తధా ||

భూతాంశం కాశ్యపం నిత్యం ప్రజాకామస్య కీర్తితమ్‌ | "అహం రుద్రేభి" రిత్యేత ద్వాగ్మీ భవతి మానవః ||

ఈ హోమము పశుకాముడు గోశాలలోను అన్నకాముడు నాల్గుదారుల కూడలిలోను గావింపవలెను. స్నాతకునికి పారామస్వస్త్యయన మంత్రము చెప్పబడెను. శుభప్రదమగు నన్నమాట. "బృహస్పతే ప్రథమమ్‌" అనునది జ్ఞానకాముడు జపింపవలసినది. "వయస్సుపర్ణ" అను మంత్రమును జపించిన ఐశ్వర్య సంపన్నుడగును. "యస్తేమన్యో" అను మంత్రము అప్రయత్న దోషమును వారించును. ప్రయత్నకారి అగునన్న మాట "హవిష్మతీయ" అను మంత్ర జపముచే సర్వ పాపముక్తి గల్గును. "యాఔషధీః" అను మంత్రమును స్వస్తి (శుభము) కూర్చును. పాపములెల్ల హరించును. ఆ జపము సేసిన వానికి మాయనివారమమగును. జ్ఞానస్ఫూర్తియగునన్నమాట. ఆకలి వృద్ధి నందును. "బృహస్పతిః ప్రతి" అను మంత్రమును పృష్టి (వాన) కాముడు ప్రయోగింపవలెను. రదేవత యెట్టి ఘట్టములందేని తిఱుగులేనిదని యెఱుంగవలెను. "భూతాంశం కాశ్యపమ్‌" అను మంత్రము సంతాన కామునికి జెప్పబడినది. "అహంరుద్రేభిః" అను దానిం జపించి మంచి వక్త యగును.

నయోనౌ జాయేతే విద్వాన్‌ జపన్నత్రీతి రాత్రిషు | రాత్రిసూక్తం జపన్రాత్రౌ రాత్రిక్షేమి భ##వేన్నరః ||

యాకల్పయతీతి జపేన్నిత్యం శత్రువినాశనమ్‌ | ఆయుష్యం చైవ వర్చస్యం సూక్తం దాక్షాయణం మహత్‌ ||

ఉత దేవా ఇతి జపే దామయఘ్నం ధృతవ్రతః | ఆగ్నే ఆగ్నావ ఇత్యే తద్ధనకామః ప్రయోజయేత్‌ ||

"అత్రి" అను మంత్రము రాత్రులందు చక్కగ తెలిసిజపించునేని జన్మరహితుడగును. రాత్రియందు రాత్రిసూక్తము జపించుచు రాత్రివేళ క్షేమముగా నుండును. "యాకల్పయతి" అనునది జపింప శత్రునాశనమగును. దాక్షాయణ సూక్తము పూర్ణా యుఃప్రదమును వర్చస్కారమకమునునగును. "ఉతదేవా" అను మంత్రము వ్రతధారియై జపింప రోగములు వాయును. "ఆగ్నే అగ్నావ" అను దానిని ధనకాముడు జపింప వలెను.

వైభీతకే7బ్ధం హుత్వాగ్ని ద్విషద్ద్వేషం తతో జపేత్‌ | ద్విషన్తు ధన్వినం హుత్వా ద్విషతోవిన్దతే ధనమ్‌ ||

ఆయమగ్నే జనితేతి జపేదగ్ని భ##యేసతి | ద్విమార్జన్నితి పాఠంతు జపన్నుత్థాపయే ద్ద్విజః ||

ప్రాతశ్చ పాఠయే దేనం సంసది బ్రహ్మచారిణామ్‌ | ఇమా మితిచ సూక్తేన శతకృత్వో7భిమంత్రితమ్‌ ||

ఘృతేన పీత్వా తం ప్రాతః సపత్నీభిర్విముచ్యతే | అరణ్యానీ త్యరణ్యషు జపే త్తద్భయనాశనమ్‌ ||

శ్రద్ధాసూక్తం జపేన్నిత్యం శ్రద్ధాకామ వివర్ధనమ్‌ | బ్రాహ్మీ యద్యస్య సూక్తేద్వే జపేత నియతస్సదా ||

శంఖ పుష్పీంతు పయసా బ్రాహ్మీపుష్పాణి సర్పిషా | శతావరీంతు పయసా వచా మద్భిర్ఘృతేన వా ||

సూక్తాఖ్యాం మనుమంత్య్రాఖ్యాంచే కైకంతుత్య్రహం పిబేత్‌ | శ్రద్ధాం మేధాం స్మృతిం పుష్టిం వర్ణం లక్ష్మీంచ విందతే ||

ఒక్క సంవత్సరకాలము వైభీతక మందు తాండ్ర చెట్టు క్రింద అగ్ని హోమముచేసి "ద్విషద్ద్వేషం" అను మంత్రము జపింపవలెను. "ద్విషంతు ధన్వినం" అను మంత్రముతో హోమము చేసిన శత్రువు నుండి ధనము పొందును. "అయమగ్నే జనితా" అను మంత్రమును అగ్ని హోత్రునుద్దేశించి జపింపవలెను. దాని వలన నగ్నిభయముపోవును. "ద్విమార్జన్‌" అను మంత్రపాఠమును జపించి శత్రువులను లోవగొట్ట వలెను. ఈ మంత్రమును బ్రహ్మచారుల సభలో నుదయవేళ పఠింప జేయవలెను. "ఇమామ్‌ "అను సూక్తముతో నూరుమార్లు అభి మంత్రించి నేతితో త్రాగ వలెను. శత్రు పీడ తొలగును. "అరణ్యాని" అను మంత్రము నడవులలో జపించిన నక్కడి భయము పోవును. శ్రద్ధాసూక్తము నిత్యము జపించిన శ్రద్ధాకామములు పెంపొందును. "బ్రాహ్మీ" "యద్వస్య" అను రెండు సూక్తములను నియమవంతుడై జపింపవలెను. శంఖ పుష్పిని పాలతో బ్రాహ్మీ పుష్పములను నేతితో శతాకరిని=పిల్లి తీగను పాలతోను వచను (వసకొమ్మును) నీళ్ళతోగాని, నేతితో గాని పై రెండు సూక్తములతో నభిమంత్రించి నేతితో త్రాగవలెను. శత్రు పీడ తొలగును. ఒక్కొక్క దానిని రోజులు త్రాగవలెను. అందుచే శ్రద్ధమేధ స్మృతి = జ్ఞపక శక్తి పుష్టిని రంగును లక్ష్మినిం గూడ బృడయగల్గును.

శాసన్నర్థాన్‌ జపేన్నిత్యం సంగ్రామే విజగీషుకః | గృహీత దక్షిణోదర్భాన్‌ గృహీత్వా సంస్పృశన్జపేత్‌ ||

ముంచామిత్వా హవిషేతి యక్ష్మాణమపకర్షతి | బ్రహ్మణా గ్నేస్సంవిధానం గర్భ మృత్యువినాశనమ్‌ ||

అపేహీతి జపేత్సూక్తం శుచిర్దుస్వప్న నాశనమ్‌ | దేవాః కపోత ఇతితు కపోతస్యోపవేశ##నే ||

కౌశికస్య జపేత్సూక్తం ఘృతేన జుహుయాత్తధా | సపత్నఘ్నం ప్రయుంజీత ఋషభం జపహోమయోః ||

యేనేద మితి జప్త్వావై సమాధిం విందతే పరామ్‌ | మయో భూద్వాత ఇతితు గవాం స్వస్త్యయనం పరమ్‌ ||

యవానాంచ ఘృతాక్తానాం గోమయాగ్నౌ సమాహితః | జుహుయాద్గోష్ఠమధ్యేతు దధి మధ్వాజ్య సంస్కృతమ్‌ ||

పత న్తమితి నిత్యంతు జపేత విజనే వనే | శాంబరీ మింద్రజాలాంవా మాలామేతేన ధారయేత్‌ ||

అదృశ్యానాంచ సత్త్వానాం మాయామేతేన భాధతే | న ప్రతిష్ఠేతి స్వస్త్యయనం నారీగర్భ వివర్ధనమ్‌ ||

విష్ణుర్ణ్యానమితీమం చ తధైవా పరముచ్యతే | మహిత్సృణాం మవోస్వితి పరిస్వస్త్యయనం జపేత్‌ ||

ప్రాపయే ద్విద్విషద్వేషం జపేచ్చ రిపునాశనమ్‌ | ఆయంగౌః | సప్తరాజ్ఞస్తు సర్పానేతైః ప్రసాధయేత్‌ ||

సంసమిద్యువసేచ్చై తత్‌ సౌభ్రాతృకరణం మహత్‌ | "తచ్చం యోరావృణీమహే" జపేత్‌ స్వస్త్యయనం సదా ||

పితౄణాం సంహితాం విద్యాత్‌ పితౄన్‌ ప్రీణాతివై తధా | వాస్తోష్పతేన మంత్రేణ యజేత గృహదేవతామ్‌ ||

తల్లింగైర్దేవతా మంత్రైః దేవారాధన ముచ్యతే | జపసై#్యష విధిః ప్రాక్తోహుతే యజ్ఞే విశేషతః ||

హోమాన్తే దక్షిణాదేయా యధాశక్త్యాచ భార్గవ | హుతేన శమ్యతే పాపం హుతమన్నేన శమ్యతే ||

అన్నం హిరణ్యదానేన అమోఘాబ్రాహ్మణాశిష|ః | సిద్ధార్ధకా యవా ధాన్యం పయోదధిఘృతం తధా ||

క్షీరవృక్షాస్తధేధ్మాశ్చ సర్వకామప్రదాః స్మృతాః | సమిధః కంటకిన్యశ్చ రాజికా రుధిరం విషమ్‌ ||

తైలంచ భృగుశార్దూలః విజ్ఞేయ మభిచారకమ్‌ | సక్తవః ఫలమూలాని శాకాని వివిధానిచ ||

పయోదధి సువర్ణంచ భైక్ష్యం శత్రువినాశనమ్‌ | హవిః స్నానంచ కర్తవ్యం సర్వత్ర భృగుసత్తమ!||

ఋచాం విధానం కథితం తవైతత్‌ సమాసతః కర్మకరం ద్విజానామ్‌|

తతో విధానం యజుషాం నిబోధ ! సమాసతో ధర్మభృతాం వరిష్ఠ ! ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే ఋగ్విధానం నామ చతుర్వింశత్యుత్తర శతతమో7ధ్యాయః .

"శాసన్నర్దాన్‌" అను మంత్రమును యుద్ధజయము గోరువాడు నిత్యమును జపింపవలెను. దక్షిణను గ్రహించి దర్భలను జేతజట్టుకొని "ముంచామిత్వాహవిషా" అను మంత్రముతో స్పృశించిన "యక్ష్మ" క్షయ రోగము పోగొట్టును. "బ్రహ్మణాగ్నిస్సం విధానం " అను మంత్రము గర్భస్థ శిశువునకు మృత్యువు గలుగనీయదు. "ఆపేహి" అను సూక్తమును శుచియై జపించిన దుస్స్వప్నములు రావు "దేవాఃకపోత" అను మంత్రము కపోతము ఇంటిపై వ్రాలినపుడు జపింపవలెను. కపోతము=పావురము. కౌశిక సూక్తము జపించి నేతితో హోమము సేయవలెను. ఋషభ సూక్తమును జప హోమములకు ప్రయోగించిన శత్రు నాశనమగును. "యేనేదం" అను మంత్రము జపించిన నిశ్చల యోగ సమాధినందును. "మయోభూర్వాత" అను మంత్రము గోవులకు మిక్కిలి మంగళకరము. నేతిలో తడిపిన యవలు ఆవుపిడకల యగ్నియందు సమాహిత చిత్తుడై గోశాలలో పెరుగు, నెయ్యి, తేనెతోగూడ సంస్కరించి హోమము సేయవలెను. నిర్జనారణ్యమందు "పతంతమ్‌ " అను మంత్రము జపింపవలెను. శాంబరికనికట్టు. శాంబరీ మాలను గాని ఇంద్రజాల మాలను గాని ఈ మంత్రముతో ధరింపవలెను. కంటికి కనబడనని జంతువుల మాయను దీనిచే త్రిప్పిగొట్టగలడు. "నప్రతిష్ఠ" అను మంత్రము "స్వస్తి"=మంగళమును లయనము=పొందించును. మంగళకరమన్నమాట. స్త్రీ గర్భ వర్థనము. "విష్ణుర్ణ్యానం" అను నది దాని తరువాతిది. "మహితృణా మవోసు" అన్నది జపించిన సర్వ శుభకరమగును. "ఆయంగౌః సప్తరాజ్ఞ" అను మంత్రము జపించిన శత్రువులయెడ ద్వేషమును బెంచును. శత్రువులను నశింపజేయును. ఈ ''ఆయంగౌః నప్తరాజ్ఞ'' అను మంత్రము సర్పములను స్వాధీనము చేయును. "సంపమరిద్యువసేత్‌" అను మంత్రము అన్నదమ్ములలో నెంతేని మైత్రిని బెంచును. "తచ్ఛం యోరావృణీమహే" అను మంత్రము మంగళకరము. పితృ సంహిత పితృ ప్రీతికరమని తెలియనగును, వాస్తోష్పతి మంత్రముచే వాస్తుదేవతలను పూజింపవలెను. (యజింపవలెను. హోమాదులునుంజేయవలెనన్నమాట). జపమునకు హోమమునకు విషేశించి యజ్ఞమునకు దేవతారాధన మందాయా దేవతలను వారి వారి లింగములుగలవి అనగా వారి పేరులు వినిపించునట్టి మంత్రములచేతనే యారాధింపవలెను. హోమము ముగించినంతనే యధాశక్తి దక్షిణ యీయవలెను. పాపమునకు హోమము హోమమునకు అన్నదానము అన్నమునకు హిరణ్యదానము క్రమముగ శాంతి ప్రక్రియలు. ఈ యింతకును పరమావధి శాంతి బ్రహ్మణులయొక్క అమోఘములైన యాశీర్వాదములు. ఆవాలు యవలు ధాన్యము పాలు పెరుగు నెయ్యి పాలచెట్లు వాని ఇద్మములు సర్వాభీష్టప్రదములని స్మృతులు చెప్పినవి. ముళ్లచెట్ల సమిధులు రాజికలు నెత్తురు విషము. నువ్వులనూనెయు నభిచారక సామగ్రి. పేలాలపిండి, పండ్లు, దుంపలు పెక్కు రకాల ఆకు కూరలు పాలు పెఱుగు బంగారము భిక్షాన్నమును శత్రునాశక సామాగ్రి. వేదాలలో ఆర్షగ్రంథాలలో నెక్కడ నెయ్యి పాలు పెఱుగునని చెప్పబడెనో అదంతయు ఆవు నెయ్యి ఆవుపాలు ఆవు పెఱుగు అనియే తెలిసికొనవలెను. భృగుశ్రేష్ఠా! హవిస్స్నానముకూడ నంతట చేయదగినది. ఓ ధార్మిక వరిష్ఠ!భృగుశ్రేష్ఠ! పరశురామా! నీ కింతదనుక ద్విజులకు పనికివచ్చు ఋగ్విధానము సర్వము సమన్వయపరచి చెప్పితిని. ఈ పైనయజుర్విధానమును వినుము.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమందు ఋగ్విధానమను నూట యిరువది నాల్గవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters