Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట యిరువది యైదవ అధ్యాయము - తంత్ర విధానము

పుష్కరః- ఓంకారపూర్వికా నామ మహావ్యాహృతయః స్మృతాః | సర్వకల్మష నాశిన్యః సర్వకర్మ పదా స్తథా ||

ఆజ్యాహుతి సహస్రేణ దేవమారాధయే ద్ద్విజ | మనసః కాంక్షితం రామ ః మనసేప్సిత కామదమ్‌ ||

శాన్తికామో యవైః కుర్యాత్తిలైః పాపాపనుత్తమే | ధాన్యైః సిద్ధార్థకైశ్చైవ సర్వకామకరం తథా ||

పుష్కరుండనియె ఓంకార పూర్వికలయిన సప్తవ్యాహృతులు సర్వకల్మష నాశకములు సర్వకర్మ సిద్ధి ప్రదములు. ద్విజా! వేయి నేతి యాహుతులతో దేవునారాధింపవలెను. అది మనసునకు నచ్చిన కోరికల నిచ్చును. శాంతికాముడు యవలతోను పాపహరణము కోరువాడు నువ్వులతోను, అభిష్టసిద్ధి కోరువాడు ధాన్యముతోను, ఆవాలుతోను హోమము సేయవలెను.

జౌదుంబరీభి రిధ్మాభిః పశుకామస్య శస్యతే | దధ్నా చైవాన్నకామస్య పయసా శాన్తి మిచ్ఛతః ||

అపామార్గ సమిద్భిశ్చ కామయన్‌ కనకం బహు | కన్యాకామో ఘృతాక్తాని యుగ్మశో గ్రధితాని చ ||

జాతి పుష్పాణి జుహుయాద్గ్రామార్ధీ తిలతండులమ్‌ | వశీకర్మణి శాఖోటవాశా7పామార్గ మేవచ ||

మేడినమిథల యిధ్మములతో జేయుహోమము పశుసమృద్ధి నొసంగును (సమిథలు ఇరువది యొకటి కట్టిన ఇధ్మమనం బడును) అన్నకాముడు దధితోను శాన్తికాముడు పాలతోను హోమము చేయనగును సువర్ణ సమృద్ధి గోరునాతడు ఉత్తరేణిసమిధల తోను కన్యాకాముడు నేతితో దడిపి రెండేసిజాజిపూలు కలిపి హోమము సేయవలెను. నువ్వులు, బియ్యము గ్రామార్థి (ఒక గ్రామము సొంతము కావలెనని కోరువాడ) హోమము సేయవలెను. వశీకరణ మందు శాఖోటము = బరివెంక సమిధలు వాశా (శీ) బాడిద సమిథలు ఉత్తరేణు సమిథలను వాడవలెను.

వసా7సృజ్‌ మిశ్ర సమిధో వ్యాధిఘాతస్య భార్గవ | క్రుద్ధస్తు జుహుయాత్‌ సమ్యక్‌ శత్రూణాం వధ కామ్యయాః ||

సర్వవీహిమయీం కృత్వా రాజ్ఞః ప్రతికృతిం ద్విజః | సహస్రశస్తు జుహుయాత్‌ స్రజావశగతో భ##వేత్‌ ||

వ్యాధిగ్రస్తునికి వసా=క్రోవ్వు రక్తముతో కూడిన సమిలధను, శత్రువులం జంపుటకు పగగొని హోమము సేయవలెను రాజుయొక్క ప్రతి కృతిని (బొమ్మను) అన్ని రకాల ధాన్యముతో దయారుసేసి వేలకొలది హోమములు సేసిన నారాజు ప్రజలకు వశుడగును.

వస్త్రకామస్య పుష్పాణి దుర్వా వ్యాధి వినాశనీ | బ్రహ్మవర్చస కామస్య వాశాగ్రంచ విధీయతే ||

ప్రత్యంగి రేప్సుర్జుహుయాత్తుషకంటక భస్మభిః | విద్వేషణచ పక్షాణి కాకకౌశికయోస్తధా ||

కాపిలంతు ఘృతం హుత్వా తధాచంద్రగ్రహే ద్విజ | వచా చూర్ణేన సంవీతాం స్తదానీయచ తాం వచాం ||

సహస్రమంత్రితాం భుక్త్వా మేధావీ జాయతే నరః | సూర్యోదయే7ర్కాభిముఖం పుత్రకామో జపేన్నరః ||

వస్త్రకాముడుపువ్వులను వ్యాధిబాధితుడు గరికను బ్రహ్మవర్చప కాముడునాశాగ్రమును = అడ్డనరమును హోమముచేయనగును. ప్రత్యంగిరఃకామి=ప్రత్యంగిరయను నాభిచారికము చేయువాడు ఊకముండను బూడిదను శత్రునిగ్రహము. కాకి గుడ్లగూడ ఱక్కలను హోమము సేయవలెను. ''ప్రత్యంగిర''' అనునది అభిచారిక కర్మకు సంబంధించిన యొక సంకేతము. దీని లక్షణ మీఅధ్యాయములో 106 వ శ్లోకము నందున్నది. ''యాతే రుద్ర శివాతనూః)'' అను మంత్రముతో వరారోహ సమిదలను=కొబ్బరి నమిధలను ఇథ్మమగా నట్టి చంద్రగ్రహణమందు కపిలగోవు నేయి హోమము సేసి వసకొమ్ము పొడితో అవసను వేయిసార్లుమంత్రించితిన్నచో మేధా సంపత్తి గల్గును. సూర్యోదయవేళ సూర్యుని కెదురుగా నిలిచి పుత్రకాముడు జపింపవలెను.

ఏకాదశ్యాం గగ్గులుంవా లోహం బైల్వంచ ఖాదిరమ్‌ | ద్విషస్తం త్వాం వధానీతి నిఖనేత్‌ రిపువేశ్మని ||

ఉచ్చాటన మిదం కర్మ శత్రూణాం కధితం తవ | శక్రం ధ్రువం భూపతయే మహావ్యాహృతిభి ర్బవేత్‌ ||

ఏకాదశినాడు గుగ్గిలము లోహము=ఇనుము మారేడు చండ్రకర్రను గాని "ద్విషంతంత్వాం వధాని" అని (శత్రువును జంపెదను అని యీ మాట కర్థము). శత్రువునింట పాతవలెను. ఈ కర్మ (పని) శత్రూచ్చాటన కర్మమని నీకు చెప్పబడినది. మహా వ్యాహృతులతో శక్రంధ్రువం అను మంత్రము రాజు కొరకు చెప్పబడినది.

"సూర్యస్త్వే " తి తధామంత్రం జ్ఞేయా ప్రత్యంగిరా పరా | ఏతే నౌదుంబరై రిధ్మైర్దేవం పర్షాపయేద్ధ్రువమ్‌ ||

అహోరాత్రం జలే జప్త్వా చక్షుష్మా నిత్యయం ద్విజ! | ప్రణష్ట చక్షుద్ధర్మజ్ఞః యోగమాప్నాతి చక్షుషః ||

"సూర్యస్త్వా"తి అనునది శ్రేష్ఠమగు ప్రత్యంగిర మంత్రమని యెఱుంగనగును. ఇది సంపుటిచేసి మేడి సమిథలతో హోమము సేసి ఒక దేవతను ప్రీతి పరచవలెను. "చక్షుష్మాన్‌" అను మంత్రమును నీటిలో అహోరాత్రము జపించి కండ్లుపోయిన వాడు కన్నులను బడయును.

ఉపప్రయన్త మిత్యేతర్ధుత్వా విప్రో మహానసే | అనువాకం మహాభాగ నిత్యసన్నే నయుజ్యేతే ||

తనూపాగ్నే7సి ఇతిచ డూర్వాహుత్వా రుజాన్వితః | వ్యాధిమోక్ష మపాప్నోతి నాత్రకార్య విచారణాః ||

ఇహైవ తేభ్యః పతితం గృహీత్వా గోమయం ద్విజ | ఘృతాజ్య మధుసంయుక్తం హుత్వాధేనుం తు తాం లభేత్‌ ||

ఏషతే రుద్రభాగేతి హుత్వా రామః గవేధుకాం | అర్ధర్చేన తధాప్నోతి ధనం నాస్త్యత్ర సంశయః ||

"ఉప ప్రయంత" యను వాక్యమును విప్రుడు వంటింట హోమముసేసి దూరమైన దగ్గరి వానితో బంధువుతో గలిసి కొనగలడు. (నిత్యాసన్నుడు=ఎప్పుడును దగ్గర నుండువాడు). "తనూపా7గ్నేసి" అను మంత్రముతో దూర్వాహోమము సేసిన వాడు రోగముక్తినందును. ఇందు సందియములేదు. "ఇహైవ తేభ్యః పతితమ్‌ " అను మంత్రముతో నావుపేడ తీసికొని నేయి తేనెతో కలిపి హోమము నేసిన ఆయావును పొందును. "ఏషతే రుద్రభాగ" అని అర్థర్చముతో (సగము ఋక్కుతో) అడవి గోధుములను హోమము సేసిన ధనము బొందును సందియము లేదు.

అర్ధర్చేన ద్వితీయేన క్షేత్రమధ్యే బలిం హరేత్‌ | మూషికాశలభోత్పాతే సురామాంసా77సవాదిభిః ||

"భేషజ" మితి మంత్రేణ దధ్యాజ్య మధుహోమకః | చతుష్పదానాం సర్వేషా ముపసర్గం వినాశ##యేత్‌ ||

త్య్రంబకం యజా మహేతిహోమః సర్వార్థసాధకః | కన్యానామ గృహీత్వాచ కన్యాలాభకరః పరః ||

రెండవ అర్థర్చముతో (ఋక్కుతో) పొలమునడుమ కల్లు మాంసము అనపము మొదలైన వానితో బలియిచ్చినచో ఎలుకలు మిడుతలువలన నీ బాధలు పోవును. భేషజమను మంత్రముతో పెఱుగు నేయి తేనె హోమముసేసిన చతుష్పదము (పశువు) లయొక్క ప్రమాదము లన్నియు మానును. "త్రియంబకం యజామహే" అను మంత్రముతోడి హోమము సర్వార్థ సాధకము. కన్య పేరు సెప్పుచు నీహోమము సేసిన తప్పక కన్యలకు లాభముగల్గును.

"భ##యేషుచ" జపేన్నిత్యం భ##యేభ్యో విప్రముచ్యతే | దూత్తూరపుష్పం సఘృతం తధా హుత్వా చతుష్పధే ||

శూన్యే శివాలయేవాపి శివాత్కామానవాప్ను యాత్‌ | హుత్వాచ గగ్గులుం రామః స్వయంపశ్యతి శంకరమ్‌ ||

ఆకృత్యా ఇతి చైవాష్టౌ ఋచోహుత్వా ఘృతాదిభిః | అన్వహం త్వాపదాం నాశం స్వకులే కురుతే ధ్రువమ్‌ ||

భవత్యుత్తమవాదీచ జప్త్వాచ విదసీ త్య్రుచమ్‌ | అగ్నేస్తనోరితి తథా హుత్వాచ తిలతండులైః ||

సహస్రశస్తు ధర్మజ్ఞః భ##వే త్సర్వాతిథిర్నరః | యుంజతే మనఇత్యే తదనువాదంతు వైష్ణవమ్‌ ||

సాయం ప్రాతః సమాసీత దీర్ఘమాయు రవాప్నుయాత్‌ | దివావావిష్ణ ఇత్యస్య కర్మవ్యాహృతి వద్భవేత్‌ ||

"భ##యేషు చ" అను మంత్రము నిత్యము జపించిన భయరహితుడగును. దుత్తూర పుష్పమును నేతితో నాల్గు మార్గముల కూడలిలోగాని లేదా పాడుపడిన శివాలయములోగాని హోమము సేసినచో శివునివలన సర్వాభీష్టములందును. గుగ్గిలముతోనీ మంత్రముతో హోమముచేసిన శివుని దర్శింపగల్గును. "అకృత్యా' అను నెనిమిది ఋక్కులను నేయి మొదలైన వానితో ప్రతిదినము హోమము చేసినచో తన కుటుంబమునందు సర్వాపదలను నశింపజేయును. "విదసి" అను ఋక్కు జపించిన మంచి వాదకుశలుడౌను. "ఆగ్నేస్తనోః" అను మంత్రముతో నువ్వులు బియ్యముతో వేలకొలది హోమములు సేసిన సర్వులకు నతిధియగును. పూజ్యుడగును. "యుంజతేమనః" అను అనువాకము విష్ణుదైవత్యము. దీనిని సాయం ప్రాతస్సమయములందుపాసించిన దీర్ఘాయుష్మంతుడగును. "దివావా విష్ణ" అను నీ మంత్రజపము వ్యాహృతులవలె ఫలమిచ్చును.

విష్ణో రరాట మిత్యేతత్‌ సర్వబాధావినాశనమ్‌ | రక్షోఘ్నంచ యశస్యంచ తధైవ వివరప్రదమ్‌ ||

"అయంనో యజ్ఞ" ఇత్యేతత్‌ సంగ్రామే విజయప్రదమ్‌ | "ఇదమాపః ప్రవవేహతః" స్నానే పాపాపనోదనమ్‌ ||

దైవాంశ ఇతి దైవే తదభిచారేషు యోజయేత్‌ | వ్యాధిఘాతః సమిద్భిస్తు రాజికాసృగ్విషైస్తధా ||

యక్ష్మాహీతి తథాహుత్వా బహిర్నిర్గమ్య మానవః | ఉపశ్రుతింతు గృహ్ణీయాత్‌ సాతస్యా7వి తధాభ##వేత్‌ ||

ఆగ్నే పవస్వేతి హుతం బ్రహ్మవర్చస కారకమ్‌ | ఉదుత్యం చిత్ర మిత్యస్య కర్మ వ్యాహృతివద్భవేత్‌ ||

యస్మాన్నరా దభ్యధికో నరో భవితుమిచ్చతి | స్వస్తినేంద్రేతితు జపేత్తస్య నామాంతసంయుతమ్‌ ||

భవత్యభ్యధికస్తస్మా ద్విద్వయా యశుసాశ్రియా | తధా హోమాదనేనైవ దాసలాభ మవాప్నుయాత్‌ ||

"విష్ణోరరాటమ్‌" అను మంత్రము సర్వబాధాహరము. మఱియు రక్షోఘ్నము యశస్యము అవకాశప్రదము. "ఆయంనోయజ్ఞ" అను మంత్రము యుద్ధ విజయదము. "ఇదమావః ప్రవహత" అను మంత్రముతో స్నానముచేసిన పాపకరము. "దైవాంశ" అను మంత్రమును దైవ కృత్యమునందు అభిచార ప్రక్రియలందు వాడవలెను. వ్యాధిగ్రస్తుడు సమిధలతో రాజికలు రక్తము విషముతోగూడ"యక్ష్మాహి" అను మంత్రముతో హోమముసేసి వెలికేగి యొక "ఉపశ్రుతిని" ఆలింపవలెను. అనగా ఉపశ్రుతి = తమ సంభాషణమున దబ్బాటున గలిగెడి శుభాశుభ సూచకమగు అన్య సంభాషణ శ్రవణము. ఆ వినిపించినట్లయితీరును. అది వృధాపోదు. "ఆగ్నే పవవ్వ" అని చేసిన హోమము బ్రహ్మవర్చసమునిచ్చును. 'ఉదుత్యం చిత్రమ్‌" అను మంత్రముతో జేసిన కర్మగ హోమము జపము మొదలయినది, వ్యాహృతులట్లు ఫలమిచ్చును. ఏ మానవునికంటె తా నధికుడు కావలయునని కోరునో వాని పేరు జోజించి "స్వస్తిన ఇంద్ర" అను మంత్రము జపించవలెను. వాని కంటె విద్యచేత యశస్సుచేత సంపదచేతను నధికుడగును. ఈ మంత్రసంపుటితో జేసిన హోమముచేతనే దాసలాభమందును. అనేకులు పరిచారకులు సేవలందుకొనునన్న మాట.

విశ్వకర్మ హవిష్యంచ సూచీం తాహీం దశాంగుళీమ్‌ | కన్యాగ్రే నిఖనేద్ద్వారి తతస్సా 7సై#్మ ప్రదీయతే ||

దేవస్యేతి తరీషేన హుతేనైదాన్నవాన్‌ భ##వేత్‌ | వాజస్య సతి చై తేన హుత్వా77జ్యం సప్తభిర్ద్విజః ||

యదేవ జుహుయాత్‌ పశ్చాత్త దేవా7క్షయ మాప్నుయాత్‌ | ఆగ్నే అచ్చేతి జుహుయాత్‌ ధనకామో ద్విజోత్తమః ||

తిలైర్యవైశ్చ ధర్మజ్ఞస్తధా7పామార్గ తండులైః | సహస్రమంత్రితాం కృత్వా తధా గోరోచనాం ద్విజః ||

తిలకంచ తధా జనస్యప్రియతాం వ్రజేత్‌ | పౌర్ణమాస్యాం తథాహుత్వా"మేఘం రాజాన" మిత్యపి ||

ఉపస్థానం తధా కృత్వా దత్వా చాన్నం ద్విజన్మనే | సోమయాజీ భ##వేద్రాను ! నాత్రకార్యా విచారణా''

ఏషతే నిరృతేద్యాభి రభిచారక కర్మణా | గృహాన్నైరృత్యకే భాగే హుత్యా స్నాత్యా నదీజలే||

కాపిలా ద్గోమయాన్నిత్యం పంచగవ్యాభిషేచితమ్‌ | కృత్యా రుద్రాం స్తధాజప్త్వా మైత్రమాప్నోతి గుహ్వకైః ||

రుద్రాణాంచ తధ్యాజప్యం సర్వాఘవినిషూదనమ్‌ | సర్వ కర్మకరం హోమం తధా సర్వత్ర శాన్తిదమ్‌ ||

అజావికానా మశ్యానాం కుంజరాణాం తధాగవామ్‌ | మనుష్యాణాం నరేంద్రాణాం బాలానాం యోషితామపి ||

గ్రామాణాం నగరాణాంచ దేశానామపి భార్గవ | అని ద్రుతానాం ధర్మజ్ఞ ! వ్యాధితానాం తధైవచ||

మరణ సమనుప్రాప్తే రిపుజేచ తధాభ##యే | రుద్రహోమః పరాశాన్తిః పాయసేన ఘృతేన చ||

కూష్మాండై ర్ఘృతహోమేన సర్వాన్పాపా నపోహతి | సక్తు యావక భైక్ష్యాశీ నక్తం మనుజసత్తమ! ||

బహిః స్నానరతో మాసాన్యుచ్చతే బ్రహ్మహత్యయా | మధువాతేతి మంత్రేణ హుత్వైవాజ్య మతంద్రితః ||

సహస్రశస్తు ధర్మజ్ఞ! దీర్ఘమాప్నోతి జీవితమ్‌ | హుత్యా ధధ్నా తధా పుత్రాన్‌ ప్రాప్నోతి మనసేప్సితాన్‌||

విశ్వకర్మ హవిష్యము (విశ్వకర్మ దేవత నుద్దేశించిన హవిః పదార్థమును) పది యంగుళములయినుప సూదినిన్నీ కన్య ముందు గుమ్మములో పాతవలెను. ఆమీద నా కన్య యీ పాతినవానికీయబడును. ''దేవస్య'' అను మంత్రముతో హోమము చేసినచో అన్నవంతుడగును. ''వాజస్యసతి'' అను మంత్రములేడింటితో ఆజ్యహోమము సేసిన లోగడ చెప్పిన అన్న లాభము అక్షయమగును. ''ఆగ్నే అచ్ఛ'' అను మంత్రముతో ధనకాముడు ద్విజోత్తముడు నువ్వులు యువలు ఉత్తరేణు బియ్యమును హోమము గావింపవలెను. వేయిసార్లభి మంత్రించిన గోరోచనమును బొట్టు పెట్టుకొన్నవాడు జనప్రియుడగును. పూర్ణిమనాడు మేఘం రాజాన మను మంత్రముతో హోమము సేసి ఉపస్థానము సెప్పి ద్విజునకు భోజనము పెట్టినచో సోమయాగము సేయగలవాడు (సోమచూజి) అగును సందియములేదు. ''ఏషతే నిరృత'' అను మంత్రములతో అభిచారక కర్మ విధానమున ఇంటికి నిరృతి మూలహోమము సేసి నదిలో స్నానముసేసి కపిల గోవుపేడతో పంచగవ్యాభిషేకము గావించి రుద్రానువాకముల జపించినచో గుహ్యకులతో (దేవతా విశేషులు) మైత్రినందును. రుద్రానువాకజపము (నమక చనుకాలు) సర్వాసు సంహారకము వానితో హోమము సర్వ కర్మ సిద్ధికరము. సర్వత్ర శాంతిప్రదము. గొఱ్ఱలు గుఱ్ఱాలు ఏనుగులు ఆవులు మనుజులు నరపతులు బాలురు స్త్రీలు గ్రామాలు నగరాలు దేశములు చెల్లచెదరైన వ్యాధిగ్రస్తము లయి చచ్చుచున్నయెడ శత్రువువలని భయమేర్పడినపుడు రుద్రహోమము పాయసముతో ఆజ్యముతో చేయుట పరమ శాంతి. కూష్మాండ మంత్రములతోడి ఆజ్యహోమము సర్వపాపహరము. పేలపిండి యవలపిండి భైక్ష్యముతో నక్తముచేసి ఇంటి వెలుపల స్నానము సేసినవాడు నెల రోజులలో బ్రహ్మ హత్యాపాపముక్తుడగును. ''మధువాతా'' అను మంత్రముతో ఆజ్య హోమము శ్రద్ధతో వేయి పర్యాయములు సేసిన యతడు దీర్ఘాయుష్మంతుడగును. పెఱుగుతో హోమముసేసి తాను గోరిన పుత్రులను గాంచును.

గుగ్గులోః కణికాభిస్తు సౌభాగ్యం విందతే ధ్రువమ్‌ | కృత్వాష్టపత్రంకమలం తన్మధ్యే శశినం లిఖేత్‌ ||

లవణన తతస్తస్య పూజాంకృత్వా యధావిధి | సౌభాగ్యం మహదాప్నోతి మధువాతేతి వైజపన్‌ ||

జప్త్వా పుష్పవతీ త్యేవం మంత్రం రామ ! సహస్రశః | దేవతాయై నివేద్యైవ కుసుమాని శివం భ##వేత్‌ ||

జీమూతసై#్యవ భవతి మంత్రం జయకరం ద్విజ ! | పయస్వతీతి పయసా తధాహుత్వా సహస్రశః ||

బ్రహ్మవర్చస మాప్నోతి దధ్నావా భృగునందన ! | దధిక్రావ్ణేతి హుత్వాతు పుత్రాన్‌ ప్రాప్నోత్య సంశయమ్‌ ||

తథా ఘృతవతీత్యేతదాయుష్యం స్యాద్ఘృతేన తు | బోధశ్చ మేతి వధితం తథా స్వస్త్యయనం పరం ||

స్వస్తిన ఇంద్రేత్యేతంచ సర్వబాధా వినాశనమ్‌ | ఇహ గావః ప్రజాయధ్వ మితి పుష్టివివర్ధనమ్‌ ||

స్రువేణ దేవస్యత్వేతి హుత్వాపామార్గ తండులమ్‌ | ముచ్యతే వికృతాచ్ఛీఘ్ర మభిచారాన్న సంశయః ||

బహిత్వ దన్య దిత్యేతత్కర్మ వ్యాహృతి వద్భవేత్‌ | భద్రయన్తే పలాశస్య సమిద్భిః కనకం లభేత్‌ ||

హంసః శుచిషదిత్య తజ్జపం స్తోయేఘనాశనమ్‌ | చత్వారి శృంగేత్యేతచ్చ సర్వపాపహరం జలే ||

దేవ యజ్ఞేతి జప్త్వాతు బ్రహ్మలోకే మహీయతే | జప్త్వా పితృభ్య ఇత్యే తత్తత్తృప్తిం ప్రాప్నుయాతన్నరః ||

గుగ్గిలపు కణికలతో హోమముసేసిన తప్పకుండ సౌభాగ్యము బొందును. అష్టదళ పద్మము లిఖించి వాని నడుమ జంద్రుని జిత్రింపవలెను. ఉప్పుతో యధావిధిగా నా చందమామం బూజింపవలెను. ''మధువాతా'' అను మంత్రము జపించుచు నిట్లు సేసిన మహా సౌభాగద్య సంపన్నుడగును. ''పుష్పవతీ'' అను మంత్రమును వేయి జపించి దేవతకు పువ్వులు నివేదించిన శివమగును, భద్రమగును. ''జీమూతస్య'' అను మంత్రము జయకరము. 'పయస్వతీ' అను మంత్రముతో పాలు పెఱుగుగాని హోమము వేల కొలదిగ సేసిన బ్రహ్మవర్ఛస్సుగల్గును. ''దధికావ్ణో'' అను మంత్రముతో హోమము సేసిన పుత్రసంతానము గల్గును. 'ఘృతవతీ' అను మంత్రముతోకూడ ఆజ్యహోమముచేసిన పైరీతిగ పూర్ణాయుష్యమునందును. ''బోధశ్చమ'' అను మంత్రము స్వస్తి (శుభ) కారకము. ''స్వస్తిన ఇంద్ర'' అను మంత్రము సర్వబాధానివారకము. ''ఇహగావః ప్రజాయధ్వయ్‌'' అను మంత్రము పుష్టి వర్ధనము. స్రువముతో ''దేవస్యత్వా'' అను మంత్ర సంపుటితో ఉత్తరేణు బియ్యము హోమము సేసి వికృతమైన అభిచారమునుండి శీఘ్రముగ ముక్తుడగును. ''బహిత్వ దన్యత్‌'' అను మంత్రముతో జేసిన హోమము జపము వ్యాహతి పూర్వకముగా జేసినచో ''భద్రయంతే'' అను మంత్రము సంపుటితో పలాశ సమిధలు హోమముచేసినచో (మోదుగ) బంగారము లభించును. వీటిలో ''హభంస శ్శుచిసత్‌'' అను మంత్రజపము పాపహరము. ''చత్వారి శృంగ'' అనునదిగూడ పాపనాశనమే. ''దేవయజ్ఞ'' అనునది జపించి బ్రహ్మలోకమందు పూజ్యుడగును. ''పితృభ్యః'' అనునది జపించి పితృ తృప్తి పొందును.

వసంతేతిచ హుత్వాజ్య మాదిత్యా ద్ధనమాప్నుయాత్‌ | శివోభవస్వాగ్న్యుత్పాతే వ్రీహిభిర్జుహుయాన్నరః ||

యామ్యేన ఇతిచైతచ్చ తస్కరేభ్యో భయావహమ్‌ | దంష్ట్రాభ్యామితి చైతచ్చ వ్రీహిభిర్జుహుయాన్నరః |

యో అస్మభ్య మరాతీయాన్‌ హుత్వా కృష్ణతిలై ర్నరః | సహస్రశోభిచారాత్తు ముచ్యతే వికృతిం ద్విజః ||

అన్నే నా న్నపతే త్వేతద్ధుత్వాచాన్న మవాప్నుయాత్‌ | సుపర్ణోసీతి దైత్యస్య కర్మవ్యాహృతి వద్భవేత్‌ ||

మనః స్వతీతి జప్త్వాచ బంధనాన్మోక్షమాప్నుయాత్‌ | రోపయేత వచాం రాజా చంద్రేగ్రస్తే జలాశ##యే ||

యా ఓషధయ ఇత్యే తజ్జపం స్తాముద్ధరే త్పునః | త్రిరాత్రో పోషితః కూర్చాంకృత్వా తాం తామ్రభాజనే ||

తేనైన మంత్రితాం చంద్రం దృష్ట్వామాసం సదా జపేత్‌ | సకాపిల ఘృత క్షీరే పిత్వా శ్రుతి ధరో భ##వేత్‌ ||

''వసంత'' అను మంత్రముతో ఆజ్యహోమము సేసి ఆదిత్యునివలన ధనముం బొందును. ''శివో భవస్వ'' అను మంత్ర మును వ్రీహులతో హోమము సేసి అగ్ని వలని యుత్పాతమునుండి బయటపడును. ''యామ్యేన'' అను నీమంత్రము దొంగలకు భయము కూర్చును. దంష్టాభ్యాయ్‌ అని వ్రీహిధాన్యముతో హోమముకూడ సేయవలెను. ''యోఅస్మభ్య మరాతీయాన్‌'' అను మంత్రముతో నల్ల నువ్వులతో వేలకొలది హోమములు సేసిన అభిచార కర్మమువలన వికారమును బాయును. ''అన్నే నాన్నపతే'' అను మంత్రముతో హోమము సేసిన న్న ముం బడయును. సువర్ణోసి. అను మంత్రమును వ్యాహృతులతో కలిపి చేసిన యాభిచారిక క్రియయగును. ''మనస్వతీ'' మంత్ర జపము బంధముక్తి దూర్చును. చంద్రగ్రహణవేళ మడుగులో వచన రాజు = నాటవలెను. ఆ నాటిన ఓషధులను ''యా ఓషధయ'' అను మంత్రము జపించుచు పైకి తీయవలెను. త్రిరాత్రోపవాసము సేసి వానితో కూర్చను చేసి అదే మంత్రముతో రాగి బిందెలోనుంచి చంద్రుని జూచి యొక్క మాసము జపమసేసి, కపిల గోవు నేతిని పాలను త్రావినచో శ్రుతి ధరుందగును, వేదావధాని యగును.

ఏత మేవౌషధీపానే సదామంత్రం జపే ద్ద్విజ | సిద్ధాభవన్త్యోషధయో మంత్రేణానేన మంత్రితాః ||

ద్రుపదానామసా దేవీ యజుర్వేదే ప్రతిష్ఠితా | అన్తర్జలే త్రిరావృత్య ముచ్యతే సర్వకల్బిషైః ||

ఇహ గావః ప్రజాయధ్వం మంత్రోయం పుష్టివర్ధనః | హుతస్తు సర్పిషా దధ్నాపయసా పాయసేనవా ||

ఇదే యోషధీ పానము చేయుచు మంత్రము జపించిన యీమంత్రముతో ఔషధీ సిద్ధి గల్గును. అన్ని యోషధులు (మూలికలను) గుర్తించు బూశక్తిమున గల్గునన్నమాట. 'ద్రుపదా' అను దేవియజుర్వేద మందున్న ప్రతిష్ఠాన దేవత. ఆ మంత్ర మును నీళ్లలో మూడుసార్లు జపించిన సర్వపాప విమోచనము నందును. ''ఇహ గావః ప్రజాయధ్యం'' అను మంత్రము పుష్టి వర్దకము. ఇదే మంత్రముతో నేయి పనెఱుగు పాలు పాయసుమలలో దేని చేతనేని హోమము చేయనగును.

శతంవ ఇతి చైతేన హుత్వాపర్ణ ఫలానిచ | ఆరోగ్యం చిరమాప్నోతి దీర్ఘమాప్నోతి జీవితమ్‌ |

ఓషధీః ప్రతిమోదధ్వం జపేత్కర్మకర స్సదా | లవనే బీజవాపేవా విశేషాత్సిద్ధి మాప్నుయాత్‌ ||

సర్వౌషధీః సమానీయ సర్వవ్రీహియుతా స్తతః | క్షేత్రమధ్యే ద్విజోహుత్వా కృషిమాప్నోతి పుష్టిదామ్‌ ||

'శతంవ' అను మంత్రముతో మోదుగుపండ్లు హోమము సేసినయెడల శాశ్వతారోగ్యము దీర్ఘాయుర్దాయమునుం బొందును. 'ఓషధీః ప్రతి మోదధ్యం'' అను మంత్రమును నిరంతరము కృషి కర్మకరుడు జపింపవలెను. పంట కోతలో విత్తనాల చల్లికలో నీ జపము చేసిన విశేష సిద్ధినందును. అన్ని మూలికలు అన్ని వ్రీహి (వడ్లు) ధాన్యములు గొనివచ్చి పొలము నడుమ హోమము జేసిన పుష్టిదమైన (నిండైన) కృషిని పొందును.

శ్యాశ్వీఅపామార్గం యవం ధాన్యమోషధీ రితి మాతరః | గోకామశ్చాశ్య కామోవాతం కామం శీఘ్రమాప్నుయాత్‌ ||

''ఓషధీః సమజన్తే''తి హుత్వా చాజ్యేన మానవః | భయమాప్నోతి నైవేహ యాతుధానభవం క్వచిత్‌ ||

యాగ్రంథావతీతి చైతేన పాయసం జుహుయా ద్ద్విజ | సర్వత్ర శాన్తి మాప్నోతి నాత్రకార్యా విచారణా ||

''అపా మార్గం యవంధాన్య మోషధీః'' అను మంత్రమును జపించిన గోకాముడు అశ్వకాముడు గాని వానిని త్వరలో బొందును. ''ఓషధీః సమజంత'' అను మంత్రముతో ఆజ్యహోమము సేసిన రాక్షసకృతమైన భయము నెన్నడుంబొందదు. 'గ్రంథావతీ' అను మంత్రముతో పాయస హోమము సేసిన సర్వత్ర శాంతి నందగలడు. వివర్శింప బనిలేదు.

సీరాం యుం జతి ఇత్యే తద్దుత్వాకృషి మవాప్నుయాత్‌ | ఉచ్ఛుగ్మా ఇతి చైతేన బంధనస్థో విముచ్యతే ||

యువా సువాసా ఏతేన వాసాంస్యాప్నో త్యసంశయమ్‌ | యస్మిం శ్చాపః స్థితాః కాష్ఠే తద్గృహీత్వా విచక్షణః ||

''నేరాంయుంజతి'' అను మంత్రముచే హోమము సేసిన కృషి ఫలించును. 'ఉచ్ఛగ్మా' అను మంత్రముచే బంధముక్తి గల్గును. ''యువాసువాసా'' అను మంత్రముచే వస్త్రసమృద్ధి నందును. ఏకర్రలో నీశ్శున్నవో ఆకర్రను జేకొని ''సాయంయక్ష'' అను మంత్రముతో శత్రువున్నచోట పాలపిట్ట యొక్క లేక గ్రద్దయొక్క ఱక్క పాతినచో వానికి కుష్ఠరోగము వచ్చును.

సాయం యక్ష్మేతి మంత్రేణ శత్రోస్తు నిఖనే త్పదే | కుష్ఠీభవతి చాషస్య పక్షం గృథ్రస్య వా పునః ||

సహస్ర మంత్రితం కృత్వా శత్రోః ప్రతికృతిం తతః | తేన బద్ధ్వాతతో మృత్యుం శత్రుః ప్రాప్నోత్యసంశయమ్‌ ||

శత్రుంతు న్యాయత్యాశు సర్వాతంక వినాశనమ్‌ | ప్రపతన్తీతిచ ఋచా జుహుయా దోషధీ ర్ద్విజః ||

మిష్టాన్నభాగీ భవతి భాండానాం చైవ రక్షితా | మామాహింసీతి చాజ్యేన హుతం రిపు వినాశనమ్‌ ||

కాంతార మధ్వరస్యేతి మధుసైంధవ సంయుతామ్‌ | సౌభాగ్యకామో జుహుయాత్‌ స్త్రయోకా పురుషస్య వా ||

వేయిసారులు పైమంత్రముతో మంత్రించి శత్రువు యొక్క చిత్రపటమును గ్రద్దఱక్కతో గట్టినచో శత్రువు మరణించి తీరును. సర్వబాధలు నశించును. 'ప్రపతంతి' అను మంత్రముతో (బుక్కుతో) ఓషథులు హోమము సేసినచో, మృష్టాన్నము పొందును. భాండ రక్షకుడగును. ధన నిధులకు భాండమని పేరు. 'మామాహింసి' అను మంత్రముతో నాజ్య హోమముసేసినచో శత్రువు నశించును. 'కాంతారమధ్వరస్య' అను మంత్రముతో తేనెను సైంధవ లవణమును హోమముసేసినచో స్త్రీకి పురుషునికి గాని సౌభాగ్య సిద్ధికల్గును.

హోమోద్రప్సశ్చ స్కన్దేతి వశ్యకామస్య శస్యతే | నమోస్తు సర్పేభ్య ఇతి పాయసం సఘృతం నరః ||

నాగస్థానేతి జుహుయా త్సువర్ణం ప్రాప్నుయాద్బహు | కృణుష్వపాజ ఇత్యే తదభిచార వినాశనమ్‌ ||

ఆగ్నే తిష్ఠేతి జుహుయా ద్ద్రవ్యాః ఖల్బభిచారకాః | శత్రోర్నామ గృహీత్వాతు శత్రుం కుర్యాత్తదావశే ||

'ద్రప్సశ్చస్కంద' అను మంత్రముతో హోమము సేసిన వశ్యసిద్ధియగును. 'నమోస్తు సర్పేభ్యం' 'నాగస్థాన' అ మంత్రముతో పాయసమును నేతిని హోమము చేసినచో సువర్ణ సమృద్ధినందును. 'కృణుష్వ పాజ' అను మంత్రము అభిచారమును (చేతపబడిని) త్రిప్పికొట్టును. 'ఆగ్నే తిష్ఠ' అను మంత్రముతో అభిచారక ద్రవ్యములకను శత్రువుపేరు సంపుటి చేసి హోమము చేసినచో శత్రువు వశుడగును.

దూర్వాకాండాయుతం హుత్వా కాండాత్కాలందేతి మన్త్రతః | గ్రామే జనపదే వాపి మరకంతు శమం నయేత్‌ ||

రోగార్తో ముచ్యతే రోగాత్తధా దుఃఖాత్తు దుఃఖితః | జౌదుంబర్యస్తు సమిధో మధుమాన్నో వనస్పతిః ||

హుత్వా జహస్రశో రామ! ధనమాప్నోతి మానవః | సౌభాగ్యం మహదాప్నోతి వ్యవహారే తధా జయమ్‌ ||

యోగాదితి తధా హుత్వాదేవం వర్షపయే ద్ధ్రువమ్‌ | అపః పిబన్నితి తధా హుత్వా దధిఘృతం మధు ||

ప్రవర్తయతి ధర్మజ్ఞ | మహావృష్టి మనన్తరం | అగ్నిర్దేవతేతి తధా యవ ముష్ట్యయుతం ద్విజ ! ||

'కాండాత్కాందాత్‌' అను మంత్రముతో గరికమొదళ్లను పదివేలను హోమముసేసినచో గ్రామములో దేశములోని మరకములు కలరా మొదలయిన వ్యాధులు శమించును. రోగముక్తి దుఃఖము క్తియుం గూడ గల్గును. మేడి సమిథలను 'మధుమాన్నో వనస్పతిః' అను మంత్రముతో వేలకొలది హోమము సేసి ధనవంతుడగును. ఇందువలన సౌభాగ్యము వ్యవహార జయమునుంగల్గును. 'యోగాత్‌' అను మంత్రముతో పై విధముగా హోమము సేసిన వర్షము గురియును. 'అపఃపి బన్‌' అను మంత్రముతో పెరుగు, నెయ్యి, తేనె హోమము సేసినచో కుంభవృష్టి కురియును.

హుత్వా శ్రద్దేయ వావ్యస్తు సర్వత్సైదవాభిజాయతే | అయం పురేతి జుహుయా దనువాకేన మానవః ||

ఘృత పూర్ణాని పద్మాని సహస్రం భృగునందన | కన్యాంతాం సమవాప్నోతి యామసౌ మనసేప్సతి |

శ్రియమాప్నోతిచ తధా ధనమాప్నో త్యనుత్తమమ్‌ | నమస్తే రుద్ర ఇత్యేత త్సర్వోపద్రవ నాశనమ్‌ ||

సర్వశాన్తికరం ప్రోక్తం మహాపాతక నాశనమ్‌ | రక్షోఘ్నంచ యశస్యంచ శ్రీరాయుః పుష్టివర్ధనమ్‌ ||

'అగ్నిర్దేవతా' అను మంత్రముతో పదివేల గుప్పిళ్ల యపలుహోమము సేసినచో నెల్యెడల నెల్లరును నాతనిమాటను శ్రద్ధతో నావింతురు. 'అయపురా' అను అనువాకముతో ఆజ్యమును నింపిన వేయి పద్మములను హోమము సేయుటవలన కోరిన కన్యనుబొందును. మరియు సర్వ సంపదలను ధనము గూడ బొందును. 'నమస్తే రుద్రమన్యవ' అను నమకమంత్ర జపము సర్వోపద్రవ నివారకము. అంతేకాక సర్వ శాంతికరము. సర్వపాపహరము రక్షో బాధను హరించును. యశస్కరము. సంపదను, ఆయువును, పుష్టినినిచ్చును.

అధ్యవోచ దిత్యనేన రక్షాస్యా ద్వ్యాధితస్యతు | సిద్ధార్థకానాం క్షేపేణ పధి చైతత్సదా పఠేత్‌ ||

క్షేమేణ స్వగృదహానేతి సర్వబాధా వివర్జితః | అసౌయ స్తామ్ర ఇత్యే తత్పఠేన్నిత్యం దివాకరమ్‌ ||

ఉపతిష్ఠేత ధర్మజ్ఞ ! సాయం ప్రాత రతంద్రితః | అన్నమక్షయ్య మాప్నోతి దీర్ఘమాయశ్చ విందతి ||

'అధ్యవోచత్‌' అను నమక మంత్రము జిపించి రక్షరేకు కట్టుకొన్న వ్యాధిని నివారణమగును. ఆవాలను జల్లుచు ప్రయాణ మార్గమందీ మంత్రము పఠింప వలెను. ఏ బాధలు లేకుండ క్షేమముగ నింటికివచ్చును. 'అసౌయస్తామః' అను నమక మంత్రము నిరంతరము పఠించుచు సూర్య నమస్కారము సాయం ప్రాతస్సమయములందు శ్రద్ధగా చేసినచో అక్షయమైన యన్నము దీర్ఘాయువును గాంచును.

ప్రముంచ ధన్వ ఇత్యేతత్‌ షడ్భిరాయుధ మన్త్రణమ్‌ | రిపూణం భంగదం యుద్ధే నాత్రకార్యా విచారణా ||

మానోమహాన్త ఇత్యే తద్జాలానాం శాన్తికారకమ్‌ | నమోహిరణ్యబాహవే ఇత్యే తద్దర్షకారకమ్‌ ||

రాజికాం తిలతై లాక్తాం జుహుయా చ్ఛత్రునాశనమ్‌ | నమోవః కిరికేభ్యశ్చ పద్మలక్షే హుతే నరః ||

రాజలక్ష్మీ మావాప్నోతి నాత్రకార్యా విచారణా | బిల్వానాంచ తధా హుత్వా కనకం బహు విందతి ||

'ప్రముంచ ధన్వన' అను నమకమంత్రమునుండి యారు మంత్రములతో నాయుధములను అభిమంత్రించినచోనవి శత్రు వులం జెండాడును. సందియములేదు. మానౌమహాన్త' మను నమకానువాకము బాలురకు శాంతినిచ్చును. 'నమో హిరణ్య బాహవే' అను మంత్రము సంతోషకారము. తిలతైలముతో గూర్చిన రాజకమును గుంటకలగర కాడలను హోమముసేసిన శత్రువుల నశింతురు. 'నమోవః కిరికేభ్యః' అను నమకమంత్రముతో లక్షతామర పువ్వులు హోమము చేసిన సామ్రాజ్యలక్ష్మీ సంపన్నుడగును. సందియము లేదు. ఇట్లే మారేడు పండ్లు హోమము సేసిన సమృద్ధియైన బంగారముంబడయును.

ఇమాం రుద్రాయేతి తిలైః కృత్వా హోమం విచక్షణః | శీఘ్రమేవ మహాభాగ ! ధనమాప్నోతి చింతితమ్‌ ||

అనేనైవచ మంత్రేణ దూర్వాహోమేన మానవః | సర్వవ్యాధి వినిర్ముక్తో భయాన్‌ సర్వాన్‌ వ్యపోహతి ||

వరారోహేణ ఇధ్మానాం యాతేరుద్ర శివాతనుః | హుత్వాయుతంతు ధర్మజ్ఞ ! పుత్రమాప్నో త్యభీప్సితమ్‌ ||

అసంఖ్యాతా స్సహస్రాణి మంత్రై స్తదభిచారకమ్‌ | నమోస్తు తుద్రేభ్య ఇతి ప్రోక్తా ప్రత్యంగిరా సదా ||

'ఇమాంరుద్రాయ' అను మంత్రముతో తిలలు హోమమొనరించిన వెనువెంటనే యనుకొన్న ధనలాభమునందును. ఈమంత్ర ముతోనే దూర్వాహోమముసేసినచో సర్వవ్యాధులు సర్వభయములంబాయును. 'యాతేరుద్ర శివాతనూః' అను మంత్ర సంపుటితో వరారోహముల యిధ్మములను పదివేలుహోమము సేసిన కోరిన లక్షణములుగల కొడుకుంగాంచును. (వరారోహము=కొబ్బరి.) ''అసంఖ్యాతా స్సహస్రాణి'' అను మంత్రములతో హోమము అభిచారము. నమోస్తురుద్రేభ్యః అను మంత్రముతో చేసిన యెడలనది అభిచారక. కర్మ ''ప్రత్యంగిరా'' అను పేర పిలువబడును.

రక్తోష్ణీషో రక్తవాసా రక్తమాల్యానులేపనః | అనేనైవ శ్మశానేతు లోహశంకుం నరోత్తమ! ||

ప్రాదేశమాత్రం జుహుయాత్‌ సహస్రం భృగునందన ! | కృత్యా ముత్ధాపయే జ్జాతాం రక్తకుంభేన పూజయేత్‌ ||

పూర్ణపాత్రేణచ తధా సర్వకర్మకరో భ##వేత్‌ | ఆశుః శిశాన ఇత్యేత దాయుధానాంచ రక్షణమ్‌ ||

ఎఱ్ఱతలపాగ ఎఱ్ఱవస్త్రముం ధరించి రక్తమాల్యముల (ఎఱ్ఱని పూమాలలు) దాల్చి రక్తచందనము పూసికొని యీనమోఅస్తుడద్రేభ్యః' యను మంత్రము సంపుటీ కరించి శ్మశానమందు ఇనుప శంకును ప్రాదేశమాత్రము (లొడి తెడు) పొడవైన దానిని వేయి మారులు హోమము సేసి 'కృత్య' అనుశక్తిని లేపవలెను. ఆలేచిన కృత్యను రక్తపుకడవలోను. అట్లే పూర్ణ పాత్రమందును బూజింపగా నిది సర్వకర్మ సిద్ధినిగూర్చును.

సంగ్రామే కధితం రామ! సర్వశత్రు వినాశనమ్‌ | ఇమం సోమమిత్యే తన్నదీం గత్వా సముద్రగామ్‌ ||

స్నాతస్తోయేయుతం జప్త్వా హుత్వాదశశతం తతః | సాష్టం మనుజశార్దూల : గ్రామమాప్నో త్యభీస్సితమ్‌ ||

వాజశ్చ మేతి జుహుయా త్సహస్రం పంచభిర్ధ్విజః | ఆజ్యాహుతీనాం ధర్మజ్ఞ ! చక్షూరోగా ద్విముచ్యతే ||

మనోభవస్వేతి గృహే తధా హుత్వా విచక్షణః | వాస్తుదోషాం స్తతస్సర్వాన్‌ క్షిప్రమేవ వ్యపోహతి ||

'ఆశుః శిశాన' అను మంత్రము యుద్ధరంగమందు ఆయుద్ధములకు రక్షకము సర్వ శత్రునాశకముం గూడ. 'ఇమం సోమమ్‌' అను మంత్రమును సముద్రగామియగు నదికేగి, స్నానముచేసి పదివేలు జపించి వేయి యెనిమిదిమారులు హోమము సేసిన నభీష్ట సిద్ధిగల్గును. 'వాజశ్చమే' అను మంత్రముతో నైదువేలు ఆజ్యహోమములు సేసినయెడల కంటివ్యాధులు పోవును. 'మనో భవస్వ'' అను మంత్రముతో నింటి యందు హోమము సేసిన సర్వవిధ వాస్తు దోసములు వెంటనే హరించును.

అగ్న ఆయూగ్‌ంషి చైతేన హుత్వైవాజ్య మతంద్రితః | సహస్రశస్త ధర్మజ్ఞ ! వశం నాప్రోతికేనచిత్‌ ||

అపాం ఫేనేతి లాజాభిః హుతాభిర్జయ మాప్నుయాత్‌ | భద్రా ఇతీంద్రియైర్హీనో జపన్‌ స్యాత్సకలేంద్రియః ||

అగ్నిశ్చ పృథివీచేతి వశీకరణ ముత్తమమ్‌ | అధ్వనీతి జపన్‌ మంత్రం వ్యవహారే జయీభ##వేత్‌ ||

''అగ్న ఆయూగ్‌ంషి'' అను మంత్రముతో ఆజ్య హోమములు వేలకొలదిగ చేసినచో నెవ్వనికినేని లొంగడు. 'అపాం ఫేన' అను మంత్రముతో (పేలాలు) లాజహోమము సేసిన జయముగల్గును. 'భద్రా' అను మంత్రము ఇంద్రియహీనుడు జపించినచో సర్వేంద్రియ లోపమును నివారణమగును. 'అగ్నిశ్చ పృథివీచ' అనునది మంచి వశీకరణ మంత్రము. 'అధ్వని' అను మంత్రము జపించినచో వ్యవహారమందు గెలుపుకల్గును.

బ్రహ్మరాజభ్యా మితిచ కర్మా రంభేషువై జపేత్‌ | సర్వేషు సర్వధర్మజ్ఞ : తేషాం సిద్ధి ముపాశ్నుతే ||

నూనపాదోసుర ఇతి న్యగ్రోధే ద్విజసత్తమ | అశోకపుష్పాన్‌ సఘృతాన్‌ జుహుయా ల్లక్షసంమితాన్‌ ||

తతో దానవ కన్యాంతు స్వయమేవే పశ్యతి | అనువాకస్య శేషేణ తసై#్యహవాన్నం నివేదయేత్‌ ||

దదాతిసా తదా రుక్మం తూష్ణీం తత్రేచ్ఛయా భ##వేత్‌ | అనుగచ్ఛేత్తతదస్తూష్ణీం పాణౌ సంగృహ్యసా నరమ్‌ ||

బిలం ప్రవేశ##యేద్రామ! నాత్రకార్యా విచారణా | శూన్యాయతన మాసాద్య మాష మిశ్రమధౌదనమ్‌ ||

కయాన శ్చిత్ర ఇత్యేత జ్జపంస్తు జుహుయా న్నరః | హుతే శతసహస్రేతు తన్య విద్యాధరః స్వకామ్‌ ||

సువర్ణరాశిం ధర్మజ్ఞ ! శీఘ్రమేవ ప్రయచ్ఛతి |

''బ్రహ్మరాజభ్యాం'' అను మంత్రమును కర్మారంభమున జపించినచో సర్వకార్యసిద్ధి కల్గును. 'నూన పాదో సురః' అను మంత్రముతో మఱ్ఱిచెట్టునందు నేతితోకలిపి అశోక పువ్వులొకలక్ష హోమము సేసిన తరువాత నొక రాక్షస కన్యను స్వయముగా జూచును. ఈనూనపాదోసుర అను అనువాకము చివర భాగముతో నాదానవ కన్యకు అన్నము నివేదింపవలెను. అపుడామె బంగారము నిచ్చును. సంకల్పమాత్రముచే మాటాడకున్నంతనే యావనిజరుగును. ఆమీద మాటాడకుండ నామె యీసాధకుని చేతబట్టుకొని వెంబడించును. అక్కడ నొక బిలము నందు ప్రవేశ##పెట్టును. ఇందు సందియములేదు. అక్కడనొక శూన్యగృహమునుజేరి మినప న్నమును ''కయానశ్చిత్ర'' అను మంత్రము జపించుచు హోమము సేయవలెను. నూరువేలు (లక్ష) హోమము సేసినంత నాసాధకునికి ఒక విద్యాధరుడు వచ్చి తన సువర్ణరాశి వెనువెంటనే యిచ్చును.

సంవత్సరో శీత్యనయా ఘృతం హుత్వా విచక్షణః ||

యావజ్జీవ మరోగీస్యా ల్లక్షహోమేన పండితః | కేతుం కృణ్వన్నిత్యే తత్సంగ్రామే జయవర్ధనమ్‌ ||

ఐంద్రాగ్నం వర్మ ఇత్యేత ద్రణ సన్నాహ బంధనమ్‌ | ధన నాగేతి మంత్రశ్చ ధనుర్గ్రహణికః పరః ||

వక్ష్యన్తీతి తధా మంత్రో విజ్ఞేయోజ్యాభి మంత్రణ | మంత్రశ్చాహి రివేత్యేత త్తూణమంత్రః ప్రకీర్తితః ||

'సంవత్సరోసి' అను మంత్రముతో లక్ష ఆజ్యహోమ మొనరించినచో నాజన్మమును ఆరోగ్యవంతుడును. ''కేతుం కృణ్వక్‌ అను మంత్రము యుద్ధమందు జయవర్ధనము. ''ఐంద్రాగ్నం వర్మ'' అను నిది యుద్ద సన్నాహముల నరికట్టును. శత్రువు యుద్ధారంభము సాగనీదన్న మాట. 'దననాగ' అను మంత్రముతో ధనుర్గ్రహణము సేయవలెను. ''పక్ష్యంతి'' అను మంత్రముతో వింటినారి నభిమంత్రింపవలెను. ''అహిరివ'' అను మత్రము తూణమంత్రము. అమ్ములపొదినభిమంత్రింప వలెనన్న మాట.

యుం జతీతి తధాశ్వానాం యోజనే మంత్ర ఉచ్యతే | ఆశుః శిశాన ఇత్యే తద్గాత్రాలంభన ముచ్యతే ||

విష్ణోః క్రమేణ మంత్రశ్చ రధారోహణికః పరః | ఆజంఘన్తీతి చాశ్వానాం తాడనీయ ఉదాహృతః ||

యస్సేనా అభీత్వరీతి పరసైస్యముఖో జపేత్‌ | డుణ్డుభ ఇతి వాప్యేతత్‌ డుణ్డుభీ తాడనే భ##వేత్‌ ||

గుఱ్ఱములను రథమునకు బూన్చుటకు ''యుంజతి'' అను మంత్రము, ''ఆశుఃశి శాన'' అను మంత్రము గుఱ్ఱముల శరీరము తట్టుటకు విష్ణోః క్రమేణ అను మంత్రము రథమెక్కునపుడు 'ఆజంసుంతి' అను మంత్రము గుఱ్ఱములను కొఱడాతో కొట్టుటకును నుపయోగింప వలయును. ''యస్సేనా అభీత్వరీ'' అను మంత్రమును శత్రుసేనాభిముఖుడై జపింప వలెను. ''డుండుభ'' అను మంత్రముతో యుద్ధ డుండుభిని (దుందుభిని) మోగింపవలెను.

ఏతైః పూర్వహుతై ర్మంత్రైః కృత్వైనం విజయీభ##వేత్‌ | యమేన దత్త మిత్యస్యకోటిహోమా ద్విచోణః ||

రథముత్పాదయే చ్ఛీఘ్రం సంగ్రామే విజయప్రదమ్‌ | ఆకృష్ణేతి తధైతస్య కర్మవ్యాహృతి వద్భవేత్‌ ||

యువం చ్యవాన మేతచ్చభ##యేషు భయనాశనమ్‌ | ఘృతాహుతి సహస్రేణ నాత్రకార్యా విచారణా ||

ఈ మంత్రముతోనే యుద్ధమునకు ముందు హోమములు సేసిన విజయమందును. ''యమేనదత్తమ్‌'' అను మంత్రముతో కోటి హోమముసేసిన యుద్దజయమందును. ''ఆకృష్ణ'' అను మంత్రమును వ్యాహృతులతో జపించిన జయముగల్గును. 'యువంచద్యవానమ్‌' అను మంత్రముతో వేయి ఆజ్య హోమముల చేసినచో భయము నశించును.

మిత్రం హువేత ఇత్యే తన్మేధాకామస్య శన్యతే | సరాజ ఇతి చైతేన దేవతారాధనం వరః |

కుర్యార్భార్గవ | సర్వత్ర హోమమజపై#్య ర్యధేప్సితమ్‌ | శివసంకల్ప జప్యేన సమాధిః మనసో లభేత్‌ ||

''మిత్రం హువేత'' అను మంత్రమును మేధాకాముడు జపించవలెను. (హోమము చేయవలెను.) సరాజ'' అను మంత్రములో దేవతారాధనము చేసి (హోమములుసేసి) జపించినచో సర్వాభీష్ల సిద్థిగల్గును ''శిదసంకల్పమస్తు'' అను మంత్రము జపించిన మనస్సమాధి లభించును.

పంచనద్య ఇత్యేనేన పద్మలక్షం ఘృతాప్రతమ్‌ | హుత్వా శీఘ్ర మావాప్నోతి శ్రియం వైపద్మమాలినీమ్‌ ||

ఉభావపిత ఇత్యే తద్రూపకామస్య శస్యతే | యదాబధ్నన్‌ దాక్షయణా మంత్రేణానేన మంత్రితమ్‌ ||

సహస్రకృత్వః కనకం ధారయే ద్రిపునాశనమ్‌ | గుహ్యకానాంచ సర్వేషాం తధా నిర్వహణం పరమ్‌ ||

''పంచనద్యః'' అను మంత్రముతో నేతితోదడిపిన లక్షపద్మములను హోమముసేసిన పద్మవనమాలాధారిణియైన మహా లక్ష్మిని వెనువెంటనే పొందును. మహాలక్ష్మీ సంపన్నుడగును. ''ఉభావపితే'' అను మంత్రము సౌందర్య కామునకు ప్రశస్తము. దాక్షాయ(ణా)ణీ మంత్రముతో వేయిసార్లధి మంత్రించిన రక్షరేకుకట్టుకొనిన శత్రునాశన మగును. గుహ్యకులందరికి సాధక మీ మంత్రము.

ఇమం జీవేభ్య ఇతిచ సీతాలోష్టం చతుర్దిశమ్‌ | క్షి పేద్గృహే తదాతస్య నస్యా చ్చోరభయం నిశి ||

పరీమేగామనేషతేతి వశీకరణ ముత్తమమ్‌ | హర్తు మప్యాగతస్తస్య వశీభవతి మానవః ||

భక్ష్యతాంబూలపుష్పాద్యం మంత్రితంతు ప్రయచ్ఛతి | యస్య ధర్మస్య వశగః సోస్య శీఘ్రం భవిష్యతి ||

''ఇమంజీవేభ్యః'' అను మంత్రముతో దున్నినచాలులోమట్టిని గ్రహించి నలుదిక్కులం జల్లిన చోరభయనివారణ మగును. ''పరమేగామనేషత'' అను మంత్ర మత్యుత్తమవశీకరణమంత్రము. తనను హరించికొని పోనెంచినవాడు గూడ వశుడగును. భక్ష్యములు తాంబూలమును పువ్వులును ''పరమేగామనేషత'' యను పై మంత్రములో నభిమంత్రించి యిచ్చినయెడల పై విధముగా వశ్యసిద్ధియగును ఏ ధర్మమునకు వశ##మైన వాడైన నీ యిచ్చిన వానికి వాడు దశ##మైతీరును.

శన్నోమిత్రపత్‌ః ఇత్యే సదా సర్వత్ర శాన్తిదమ్‌ | మనసః కామమాకూతిః పుష్టికామస్య శస్యతే ||

చమ షట్కంచ ధర్మజ్ఞ! సర్వకామకరం స్మృతమ్‌ | షట్కేనచ తధాహోమః సర్వదేవ ప్రసాదనః ||

ఔదార్యేణోదకం స్పృష్ట్వా తద్ధోమా ద్విప్రముచ్యతే | వికృతం చైత దాజ్యేన హుతం శూలాపహం భ##వేత్‌ ||

''శన్నోమితిత'' అను మంత్ర మన్నియెడల శాంతిప్రద మంతరము. ''మానసః కామమాకూతిమ్‌'' అను మంత్రము పుష్టిప్రదము. ''చమషట్కము'' (మంత్రములాఱు) సర్వకామ్యపదములు. ఆ ఆఱు మంత్రాలతోడి హోమముకూడ సర్వదేవ ప్రసాదకము. ఉదారభావమున జలముస్పృశించి దానితో నాజ్యహోమము సేసిన శూలయనురోగము పోవును.

గణానాం త్వా గణపతిహోమం కృత్వా చతుష్పథే | వశే కుర్యాజ్జగత్సర్వం సర్వధాన్యై రసంశయమ్‌ ||

వైకంకతే ధ్మహోమేచ సమాస్త్వాగ్న ఇతీ త్యపి | యశసా యోగ మాప్నోతి విపులం నాత్ర సంశయః ||

అగ్ని ర్మూర్థేతి మంత్రేణ హుత్వై వాజ్యం హుతాశ##నే | తత్ప్రసాదా దవాప్నోతి నాత్రకార్య విచారణా ||

''గణానాంత్వా గణపతిగ్‌ం'' అను మంత్రముతో చతుష్పథమునందు (నాల్గుదారులకూడలిలో) హోమముసేసినచో సర్వ జగత్తును వశపఱచుకొన గలడు. ''సమాస్త్వాగ్న'' అను మంత్రముతో వైకంకతేధ్మముతో హోమము సేసినచో నత్యధికయశః ప్రాప్తిగల్గును. ''అగ్నిర్మూర్ధా'' అను మంత్రముతో ఆజ్యహోమము సేసిన ఆయన అనుగ్రహము కలుగును.

ఏవంహి దేవతాలింగై స్తధారామ ! యధా స్వకైః | హుతైః ప్రసాదయే దిష్టాందేవతాం నాత్రసంశయః ||

హిరణ్యవర్ణా శ్శుచయో మంత్రోయమభిషేచనే | శన్న ఆపశ్చ ధన్వన్యాః సర్వపాపహరాః స్మృతాః ||

శన్నోదేవీ రభీష్టయే చేతి శాంతకరః పరః | ఏకచక్రేతి మంత్రేణ హుతే నాజ్యేన భార్గవ ! ||

ఇట్లాయాదేవతల తమతమ లింగములు గల మంత్రములతో చేయబడిన హోమమువలన నాయాయిష్ట దేవతానుగ్రహము పొందవచ్చును. ఇందు సందియములేదు. ''హిరణ్య వర్ణాశ్శుచయో'' అను నీ మంత్రమభిషేచన మందు ప్రయోగింపవలెను. ''శన్న ఆపశ్చధన్వన్యాః'' సర్వపాప హరములు. ''శన్నో దేవీరభీష్టయ'' అనునది పరమోత్తమ శాంతిమంత్రము. ''ఏకచక్ర'' అను మంత్రముతో ఆజ్యహోమముసేసిన గ్రహానుగ్రహము గల్గితీరును.

గ్రహేభ్య శ్శీఘ్ర మాప్నోతి ప్రసాదం నాత్రసంశయః | యాజ్యానువాకా వృక్షాణాం ''మమాగ్నే వర్చ'' ఇత్యపి ||

తత్ప్రసాదా దవాప్నోతి నాత్రకార్యా విచారణా | గావో భగ ఇతి ద్వాభ్యాం హుత్వైవాజ్యం సహస్రశః ||

గా స్సమాప్నోతి ధర్మజ్ఞ ! నాత్రకార్యా విచారణా | ఉదుత్తమం వరుణ ఇతి జుహుయా ద్భృగునందన ! ||

నదీవాహ తడాగేషు సుకృతేషు ద్విజోత్తమ : | సంవదత్తాం హిరణ్యకోశం రూపం కృత్వా తధైవచ ||

ప్రవాదసాం సేతి చైవ గృహే యజ్ఞో విధీయతే | దేవేభ్యో వనస్పత ఇతి బ్రహ్మయజ్ఞో విధీయతే ||

''మమాగ్నే వర్చ అను'' యాజ్యానువాకలు నక్షత్ర సంబంధములు. దానివలన నక్షత్ర దేవతానుగ్రహము కల్గును. ''గావోభగ'' అను రెండు మంత్రములతో వేలకొలది ఆజ్యహోమములు సేసిన గోసంపద గల్గును. సంవయములేదు. ''ఉదుత్తమం వరుణ'' అను మంత్రముతో హోమము సేయవలెను. నదీవాపీతటాకాదులందు ''సంవదత్తాం హిరణ్యకోశం రూపంకృత్వా'' అను మంత్రమును ''ప్రవాదసాంసా'' అను మంత్రుమును సంపుటీకరించి గ్రహయజ్ఞము సేయవలెను.

రాత్రీయఖ్య ఇతి ద్వాభ్యాం రాత్రి యజ్ఞాం ప్రకీర్తితాః | శ##మే శమీకం శమ్యాకా మశ్వత్థం ప్లక్షమేవచ ||

ఉదుంబరం చ న్యగ్రోధ మపామార్గంచ గోమయమ్‌ | యాం కుర్యాద్ధర్భపింజూలాం దూర్వాం ప్రాచీనగామినీమ్‌ ||

సీతాం లోష్టం సువర్ణంచ తధా వల్మీకమృత్తికామ్‌ | సంవః సృజామీతి ద్వాభ్యాం బీజాన్యప్సువినిక్షిపేత్‌ ||

యా ఓషధయ ఇత్యేత దనువాకం తతో జపేత్‌ | అపా మివేద్వితి తతః ప్రోక్షణం తు విధీయతే ||

''దేవేభ్యోవనస్పత'' అను మంత్రముతో బ్రహ్మ యజ్ఞము విధింపబడినది. ''రాత్రీయభ్య'' అను రెండు మంత్రములు రాత్రి యజ్ఞమునకు చెప్పబడినవి. శ##మేశమీకము, శమ్యాకము, రావి, జువ్వి, మేడి, మఱ్ఱి, ఉత్తరేణు, ఆవుపేడ, దర్భపింజులములు తూర్పుగాబ్రాకు గరిక, నాగలి చాలులో మన్ను, బంగారము, పుట్టమన్నును ''సంవః సృజామి'' అను మంత్రములు రెండింటితో ధాన్యమును నీళ్లలో వేయవలెను. ''యాఓషధయః'' అను అనువాకము జపింపవలెను. ''అసామివ'' అను మంత్రముతో ప్రోక్షణముసేయవలెను.

ఇన్నో భయ మితీత్యేచ చ్చాష్టర్చం జుహుయాద్ద్విజః | యద్దేవా దేవహేడన మృచస్తిస్ర స్తధైవచ ||

హుత్వా సంప్రోక్షణ కుర్యాద్భూయ స్వసర్వత్ర మానవః | సర్వోత్పాత ప్రశమనం కర్మైతత్పరికీర్తితమ్‌ ||

''ఇన్నోభయమ్‌'' అనునది మొదలుగ నెనిమిది ఋక్కులతో హోమముసేయవలెను.''యద్దేవాదేవ హేడనమ్‌'' అనునది మొదలుగ మూడు ఋక్కులతో హోమము సేసి ప్రోక్షణము సేయవలెను. ఇది సర్వోత్పాతములను శమింపజేయు ప్రక్రియ యని చెప్పబడినది.

గాయత్రీ వైష్ణవీ జ్ఞేయా తద్విష్ణోః పరమపదమ్‌ | సర్వపాప ప్రశమనీ సర్వకర్మకరీ తధా ||

ఏతావదుక్తం యజుషాం విధానం మయాహి కించిత్తవ ధర్మనిష్ఠః |

ఆతః పరం వచ్మి నృవీర సామ్నాం తన్మే శృణుష్వాయత లోచనాక్ష ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే తంత్రవిధానం నామ పంచవింశత్యుత్తర శతతమోధ్యాయః

''తద్విష్టోః పరమం పదమ్‌'' అనునది వైష్ణవ గాయత్రీ మంత్రము. ''గాయత్రీ మంత్రము'' వైష్ణవి = విష్ణు దేవతాకము. ఇది విష్ణువుయొక్క పరమపదస్థానము. అది సర్వపాప ప్రశమనము. సర్రవకర్మకరియును. ధర్మనిష్ఠా! ఫరశురామమూర్తీ! యజుర్వి ధానమిది. కొంచెము నీకెఱింగించితిని. ఈ తరువాత సామవిధానముం దెల్పెద నాలింపుము.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమందు తంత్ర విధానమను నూటయిరువదియైదవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters