Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటముప్పది రెండవ అధ్యాయము - శాంతికర్మ వర్ణరము

రామః-అష్టాదశభ్యః శాన్తిభ్యః శాన్తయో యాస్సురోత్తమ | భిద్యన్తేయా నభిద్యన్తే తన్మమాచక్ష్వపృచ్ఛతః ||

పుష్కరః-అమృతాచా భయాసౌమ్యా స్తిస్రోన్యాస్సన్తి భార్గవ| ఏకాపి తాసాం విజ్ఞేయా సర్వకర్మ ఫలప్రదా ||

సర్వోత్పాత ప్రశమనీ మంగళ్యా సిద్ధికారికా | పూర్వోక్తాః కథితేష్వేవ కర్తవ్యా అద్భుతేషు చ ||

అష్టాదశ శాంతుల కంటె వేరైనవి వేరుగానివియునగు శాంతులేవో యానతిమ్మన పుష్కరుండిట్లనియో. అమృత, అభయ-సౌమ్య అని శాంతులు మూడున్నవి. అందే యొక్కటేని జేసిన సర్వ కర్మ ఫలము నిచ్చును. ఇది సర్వోత్పాతము వెడలించును. మంగళకరము, ఫలసిద్ధినించును. ఈ మున్ను చెప్పిన మూడుశాంతులు అద్భుతము అందునూ గావింపవలెను.

రామః-శాన్తీనాంమే త్వం మమా చక్ష్మస్వరూపాణి మహాభుజః | పితామహ సమోలోకే సర్వజ్ఞోసి మతోమమ ||

పుష్కరః- అమృతా శర్వదైవత్యా అభయా బ్రహ్మదేవతా | సౌమ్యాచ సోమదైవత్యా కథితా భృగునందన ! ||

నావిని పరశురాముడు ఈశాంతుల స్వరూపమెరింగింపుము. నీవు బ్రహ్మతోసమానుడవు. సర్వజ్ఞుడవనిలోక ప్రఖ్యాతిగాంచినాడవు అన పుష్కరుండినియె. అమృతశాంతి శివదైవత్యము బ్రహ్మదైవత్య మభయశాన్తి, సౌమ్యశాంతి సోమదైవత్యము నని చెప్పబడినవి.

అన్యాసాం దేవతాజ్ఞానం నామ్నైవ కథితం తవ | అధర్వణానాం శాన్తీనాం నిబోధ గదతో మమ ||

అమృతా చిత్రవర్ణాస్యా దభయాతు శశిప్రభా | సౌమ్యాశుక్లైవ విజ్ఞేయా నీలాభవతి వైష్ణవీ ||

బాలార్క సదృశా రౌద్రీ బ్రాహ్మీ శంఖ సమప్రభా | రుక్మవర్ణా తధైవైంద్రీ వాయవ్యా హరితా భ##వేత్‌ ||

శుక్లాచ వారుణీ జ్ఞేయా కౌబేరీ సద్మసుప్రభా | భార్గవీ శుక్లలవర్ణాస్యాత్‌ ప్రాజాపత్యాచ పీతికా ||

త్వాష్ట్రీశుక్లాచ విజ్ఞేయా కౌమారీ తామ్రసుప్రభా | ఆగ్నేయ్యగ్ని సవర్ణాస్యా చ్ఛుక్లా మాతంగినీ భవలేత్‌ ||

ప్రవాళాభాచ గాంధర్వీ కృష్ణావైనైరృతా తధా | రోచనాభా చాంగిరసీ యామ్యా కృష్ణా తధా భ##వేత్‌ ||

పార్ధివీచ మయూరాభా వర్ణతః కధితాస్తవ | అతఃపరం ప్రవక్ష్యామి స్థానా న్యాసాం యధావిధి ||

ఇతర, శాంతుల దేవతల స్వరూపజ్ఞానము పేరుచేతనే పేర్కొనబడినది. అధర్వణ శాంతులను గురించి తెల్పెద వినుము. అమృత శాంతి రంగురంగులుగలది. అభయశాంతి, చంద్రకాంతిగలది, సౌమ్యశాంతి తెల్లనిది, వైష్ణవి నీలవర్ణ, రౌద్రి బాలసూర్య ప్రభ, బ్రాహ్మీశాంతి శంఖమురంగుకలది, ఐంద్రీశాన్తి బంగారురంగు గలది, వాయవ్య పచ్చనిది, వారుణీ శుక్ల (తెలుపు) కౌబేరి, పద్మప్రభ, భార్గవి, తెలుపురంగుగలది, ప్రజాపత్యశాంతి పసపుపచ్చనిది. త్వాష్ట్రితెలుపు, కౌమారి రాగిరంగు, ఆగ్నేయి అగ్నివర్ణ మాతంగిని తెలుపు, గాంధర్విపగడరంగు, నైబుత నలుపు, ఆంగిరసి గోరోచనపురంగు యామ్యనలుపు, పార్థివి నెమలిరంగుగలది.

అమృతా చాభయా సౌమ్యా తిస్రస్తు భృగునందన ! తాసాం సర్వత్ర సంస్థానాం కథితంతు పురాతనైః ||

ప్రాజాపత్యా తథాగ్నేయి యామ్యావై నైరృతీ తథా | కౌబేరీ పార్థివీచేతి పృధివ్యాం పరికీర్తితాః ||

వాయవ్యా చైవ కౌమారీ వౌష్ణవీ రుద్రదేవతా | అంతరిక్షే వినిర్దిష్టాః శాన్తయో ద్విజసత్తమః ||

ఐంద్రీ మాతంగినీ త్వాష్ట్రీ దివ్యా బ్రాహ్మీ తధేరితా | వారుణీ చైవ గాంధారీ బార్గవ్యాంగిరసీ తథా ||

అమృత అభయ సౌమ్య అనిమూడుశాంతులకు స్థానమంతటను జెప్పినారు పురాతనులు. ప్రాజాపత్య ఆగ్నేయి యామ్య నైరృతి కౌబేరి పార్థివియనువానిక స్థానము పృధివి. వాయవ్య కౌమార్యి వౌష్నవి రౌద్రియును అంతరిక్ష స్థానమునందుండునవి. ఐంద్రిమాతంగిని త్వాష్ట్రీ దివ్య బ్రాహ్మివారుణ గాంధారి భార్గవి ఆంగిరసియుం గూడ అంతరిక్ష స్థానమున నుండునవే.

ఆద్యాస్తు కధిస్తుభ్యం కర్తవ్యాశ్చ విజానతా | యధా స్వదేశ జాతేషు చాద్భుతేషు యధావిధి ||

తద్దైవత్యా స్తధా మంత్రాః సర్వాసాం గర్భ ఉచ్యతే | మణీనాం చ తధాగర్భాః సర్వాసాం మంత్ర ఉచ్యేతే ||

మణీనాంచ తథా మంత్రః జ్ఞాతవ్యా మంత్ర లింగతః | సర్వాసాం చైవ శాన్తీనాం హోతవ్యాశ్చ గణాదశ ||

శాన్త్యతీతంతు భైషజ్యం త్రిసప్తీయం తధైవచ | అభయాచ తధారామః తధా చైవాపరాజితా ||

ఆయుష్యంచ స్వస్త్యయనం సర్వకర్మ గణం తధా | వాస్తోష్పత్యం తదా రౌద్రం గణాః ప్రోక్తా స్తథాదశ ||

తొలుతటి కాంతులు తెల్పితిని. అవి తెలిసి యాచరించవలసినవి. ఆయా శాంతిదేవతల స్థానములందు సంభవించిన యద్భుతముల కాయాదేవతల శాంతి చేయనగును. అందు ఆయు దేవతల మంత్రముల గర్భ మంత్రములన బడును. అందు మణుల యొక్క రక్షరేకులయొక్క మంత్రములు గూడ గర్భములని పిలువబడును. అయామణుల మంత్రములాయా దేవతా మంత్రలింగమును బట్టి తెలిసికొని శాంతులు చేయవలెను. హోమములుకూడచేయవలెను. అవి దశగణములు, పది మంత్రముల సమూహము. 1. శాంత్యతీతము 2. భైష్యజ్యము 3. త్రిసప్తీయము 4.అభయము 5.అపరాజితము 6.ఆయుష్యము 7.స్వస్తికరము 8.సర్వకర్మగణము 9. వాస్తోష్పత్యము 10.రౌద్రమునని పది గణములు చెప్పబడినవి.

హోమ స్తధైషాం మన్తవ్యః సర్వశాన్తిషు భార్గవ | పృధక్ప్రధానతః కల్పాః తిస్రః పూర్వాః వ్రకీర్తితాః ||

గణ గణతు గాందద్యాద్గాం గర్భేగాం తధా మణౌ | అరాజా భూమిపాలన్తు దద్యాద్దశ దశైవ తు ||

నిష్కామః సభువం చైవ తధా దద్యా త్పురోధసే | అభయాయాః మణిః కార్యో వరుణస్య భృగూత్తమ ః ||

ఈగణముల హోమము సర్వశాంతులందును భావిపవలయును. వేర్వేరు మూడు ప్రధానకల్పములు చెప్పబడినవి. ప్రతిగణ హోమమందు రక్షరేకునందు గొదానము సేయవలెను. క్షత్రియుడుగాని భూమిని పాలించువాడు పదేసి గొవులు నీయవలెను. నిష్కాముడయిన ప్రభువు పురోహితునికి భూదానము సేయవలెను. అభయశాంతికి వరుణ దేవతాకమయిన రక్షరేకు(మణి) అవసరము.

శతకాండోమృతాయాశ్చ సౌమ్యాయాః శంఖజోమణిః | వైష్ణవ్యా స్త్రివృతః ప్రోక్తః స్నాతో రౌద్య్రాస్తధా మణి ||

బ్రహ్మరక్షస్తధా బ్రాహ్మ్యా మైత్య్రాస్యాత్కనకో మణిః | వాయవ్యాశ్చాంగిరః ప్రోక్తో వాయవ్యం శంఖజో భ##వేత్‌ ||

ఔదుంబరశ్చ కౌబేర్యాః భార్గవ్యాశ్చ శతావరీమ్‌ | ప్రాజాపత్యా బిల్వమణి స్త్వాష్ట్ర్యాఃసంస్కృతకో మణిః ||

దాక్షాయణశ్చ కౌమార్య ఆగ్నేయ్యాశ్చ తదేవ తు | మాతంగిన్యా జిగితజం గాంధర్వ్యాః అజశృంగజమ్‌ ||

నైరృత్యా మాయసం చైవ అంగిరిస్యా స్తధాంజనమ్‌ | శతకాండశ్చ యామ్యాయాః పార్ధివ్యా అపి పార్థివమ్‌ ||

అమృత శాంతికి శతకాండమణి దూర్వాకృతము (గరికతో జేసినది) రక్షరేకు, సౌమ్య శాంతికి శంఖమణియు, వైష్ణవ శాంతికి త్రివృతః మూడు పేటలుగా పేనినది, రౌద్రీశాంతికి స్నాతమణి కల్పింపవలెను. (తాయెత్తు) బ్రాహ్మీశాంతికి బ్రహ్మరక్ష మణియు, మైత్రీ శాంతికి బంగారపు రక్షరేకు, వాయవ్య శాంతికి శంఖమణి, కౌబేరీ శాంతికి మేడిమణి భార్గవీ శాంతికి శతావరి (పిల్లితీగ) మణియు, ప్రాజాపత్య శాంతికి మారేడుమణి, త్వాష్ట్రీశాంతికి సంస్కృతకమణి, కౌమారీశాన్తికి దాక్షాయణమణి, ఆగ్నేయుకినిదే. మాతంగికి జిగితజమణి, గాంధర్వీశాంతికి అజశృంగజము, నౌరృతీ శాంతికి ఇంగువ రక్షరేకు, అంగిరసీ శాంతికి అంజనము (కాటుకమణి) యామ్యా శాంతికి గరికమణి, పార్థివీ శాంతికి మట్టి తాయెత్తును జేయింపవలెను.

అద్భుతస్య బలం జ్ఞాత్వా కృచ్ఛ్రం కుర్యాత్పురోహితః | ప్రాగేవ కుర్యాచ్ఛ మన మాదావేవాద్భుతస్య తు ||

కృతకృచ్ఛ్రస్తు కుర్వీత తతశ్శాన్తి ముపోషితః | అరణ్యాం పాతయే ద్వహ్నిం సర్వాస్వేతాను శాంతిషు ||

ఉపవాస దినస్యాన్తే మహ్ని ముత్పాద్య యత్నతః | ఉత్పన్న మన్న విభ##జేత్క్రవ్యాదం సౌమ్యమేవచ ||

అద్భుతములయొక్క బలమెరిగి పురోహితుడు కృచ్ఛ్రవ్రతము సేయవలెను. అద్భుతములందు మన్ముందుగానే శాంతి చేయవలెను. కృచ్ఛ్రవ్రతము చేసినమీదట నుపవాసముండి యీశాంతి ప్రక్రియ నిర్వహింపవలయును. ఈశాంతులన్నిటియందును అరణినిమధించియే నిప్పుపడునట్లు చేయవలెను. ఉపవాస దినము చివర సాయంకాలము అగ్నిని పుట్టించి దాని యందుత్పన్నమైన (వండించిన) అన్నము క్రవ్యాదము (రాక్షసము) సౌమ్యమునని రెండు విభజింపవలెను.

కృత్వాకపాలే క్రవ్యాదం ధ్రువేణ నైరృతీం దిశమ్‌ | శాన్త్యగారే స్థాపయేచ్చ శాన్త్యర్థే సౌమ్యమేవ వా ||

కృష్ణోష్ణీషః కృష్ణవాసాః కృష్ణా మాల్యానులేపనః | పురోహితః ప్రదేశంతు గత్వావై నైరృతీం యజేత్‌ ||

మృణ్మండే జీర్ణశీర్షేతు తంధమాల్యాను సంపదా | కృష్ణవసై#్త్రస్తు సంఛాద్య తతుస్తూపహరే ద్బలిమ్‌ ||

క్రవ్యాన్న భాగమును కపాలములో నుంచి ధ్రువతో శాంతి గ్రహములను నైరృతి దిక్కునను సౌమ్యమును శాంతి గృహమందును ఉంచవలెను. ఆపైన నల్లని ఉష్ణీషము (తలపాగ) ధరించి నల్లని బట్టలు ధరించి నల్లని పూలమాలలు దాల్చి గంధము పూసికొని పురోహితుడే నైరృతి దిశగా వెళ్ళి హోమము సేయవలెను. పగినలి మట్టిమూకుడు మీద గంధమాల్యాదులతో నల్లవస్త్రములతో కప్పియామీద బలి నీయవలెను.

వాద్యఘోషేణ మహతా తధా కోలాహలై శ్శుభ్తేః | తతోగ్నౌజుహుయా త్సమ్యజ్‌మేదః ప్రభృతివై ద్విజ ||

పెల్గుగ వాద్యములు మ్రోయుచుండ శుభప్రదములగు కోలాహలములతో మేదస్సు మొదలైన ద్రవ్యములను అగ్నియందు హోమము సేయవలెను.

యే పిశాచా శ్చతుర్భిస్తు ఇషీకా శర్కరీ తతః కేవలే జుహుయా ద్రహ్నౌ కరశుక్త్యాశ్రవామయా ||

ఫలీకరణ మగ్నౌచ హుత్వా భుక్త్వాచ పానకమ్‌ | అపశ్యన్‌ స్వగృహం యాయాత్‌ స్నాత్వా శ్వేతాంబరస్తతః ||

అంహోముచం శాన్తికంచ జప్త్వా తిష్ఠత్సు యన్త్రితః | రాత్రౌ త్రిభాగశేషాయాం శాన్తికర్మ సమారభేత్‌ ||

శాన్తికల్ప విధానజ్ఞః సదసై#్య స్సహితస్తతః | ఏకః కర్మని యుక్తః స్యాత్‌ ఏకోమన్త్రస్య నిశ్చయే ||

''యేపిశాచా'' అనునాల్గు మంత్రములతో ''ఇషికా'' ''శర్కరీ'' కరశూప్తి- శ్రవామా అనుమంత్రముల సంపుటితో కేవలమైన యగ్నియందు హోమముసేయవలెను. ఆ అగ్నియందు ఫలీకరణ మంత్రములతో హోమముచేసి పానకము ద్రావి ఇట్టటు చూడక స్వగృహమునకేగవలెను. అక్కడ స్నానము సేసి తెల్లని దొవతులు కట్టుకొని అంహోముచ శాంతిక మంత్రములను జపించువారు నిలువ బడియుండగా వారిచే నియంత్రితుడై రాత్రి 3వభాగము శేషించినంతనే శాంతి కర్మారంభము సేయవలెను. శాంతికల్ప విధాన మెఱిగినవాడు సదస్యులతో గూడికొన్న వాడొక్కడు క్రియా నిర్వహణయందును ఒకడు మంత్ర నిశ్చయము చేయుటయందు నియమింప బడవలెను.

ఏష శాన్తివిధిః ప్రోక్తఃసమాసాత్‌ సర్వశాన్తిషు | విస్తరే విస్తరః ప్రోక్తః శాన్తికర్మ హ్యధర్వణః ||

ధనేన పూజ్యోధ పురోహిత స్స్యాత్‌ తథోవదేష్టా గురు రప్రమత్తః |

సాంవత్సరో యస్తు తతః సదస్యాః పూజ్యాస్తతో విప్రవరాశ్చ సర్వే ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వతీయఖండే శాన్తికర్మవర్ణనం నామ ద్వాత్రింశదుత్తర శతతమోధ్యాయః.

సర్వశాంతులందును చేయవలసిన శాంతి విధానమిది సంగ్రహముగా చెప్పితిని. విస్తారముగనిది చేయవలెనన్న నది విస్తరముగా నధర్వణవేదోక్తమింకొటియున్నది, అటుపైన పురోహితుడు. ఉపదేశకుడగు గురువు జ్యోతిష్కుడు, సదస్యులు, విప్రవరులు పూజింపదగినవారు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణమున ద్వితీయఖండమున శాంతికర్మ వర్ణనమను నూటముప్పది రెండవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters