Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట ముప్పదిమూడవ అధ్యాయము - అద్భుత శాంతి వర్ఱనము

రామః-కాకాశాన్తి ర్భవేత్కావా కస్మిన్‌ కస్మిం స్తధాద్భుతే | ఏతన్మే సంశయం ఛిన్ది దేవారి బలసూదన! ||

పుష్కరఃసర్వోత్పాత వ్రశమనీ హ్యమృతాచా భయాస్వృతా | సౌమ్యాచైవ మహాశాన్తిః సర్వకర్మ ఫలప్రదా ||

విశేషేణ తు భౌమేషు శాన్తిః కార్యామృతా భ##వేత్‌ | అభయా చాన్తరిక్షేషు సౌమ్యా దివ్యేషు భార్గవః ||

విజిగీషుః పరాన్రాజా భూమికామశ్చ మోజయేత్‌ | ఆరోగ్య ధనకామశ్చ సౌమ్యాం తాం కారమేత్సదా ||

ఏ యే యద్భుతములందేయే శాంతి చేయవలెనో నాకు దెల్పుమని పరశురాముండడుగ పుష్కరుండనియె. సర్వోత్పాతములను వారించునవి అమృత-అభయ సౌమ్యయను శాంతు. ఇవి సర్వకర్మ ఫలముల నిచ్చునవి. భూమికి సంబంధించిన యత్పాతములందు విశేషించి చేయవలసినది అమృతశాంతి. అంతరిక్ష శాంతికి అభయ. దివ్యోత్పాతములందు సౌమ్య. శత్రుల జయించి భూమినాక్రమింపదలచిన రాజు ఆరోగ్యకాముడును సౌమ్యశాంతి చేయింపవలెను.

విజిగీషుః పరానేవ మభియుక్త స్తధావరైః | తధాభిచార శంకాయాం శత్రూణా మపి శాసనే ||

భ##యే మహతిచ ప్రాప్తే త్వభయా శాన్తి రిష్యతే | రాజయక్ష్మాభిభూతస్య క్షతక్షీణస్య చాప్యధ ||

సౌమ్యా ప్రశస్యతే శాన్తిః యజ్ఞకామస్య చైవ హి | భూమికంపే సముత్పన్నే ప్రాప్తే చా న్నక్షయే తధా ||

అతివృష్ట్యా మనావృష్ట్యాం శలభా೭೭ఖుభ##యేషు చ | ప్రపన్నేషుచ చౌరేషు వైష్ణవీ శాన్తి రిష్యతే ||

పశూనాం మరణ ప్రాప్తే నరాణామపి దారుణ | భూతేషు దృశ్యమానేషు రౌద్రీ శాన్తి స్తధేష్యతే ||

శత్రులజయింపనెంచి శత్రులతో నెదిరింపబడి ఎవరైన నభిచారము (చేతబడివగైరాలు) తనమీద చేసిరేమోయను శంకకలుగ శత్రువుల నిగ్రహించుటకు, విపరీత భయమేర్పడినపుడు అభయశాంతి కర్తవ్యము. రాజయక్ష్మరోగి, దెబ్బలు తగిలినవాడు యజ్ఞము సేయగోరినవాడును సౌమ్యశాంతి చేయవలెను. భూకంపమునందు అన్నదారిద్య్రమేర్పడినపుడు. అతివృష్టి, ఎలుకలు మిడుతలు బాధలందు దొంగల భాదగల్గినపుడు వైష్ణవీశాంతి అభిమతము, పశువులు మనుష్యులు దారుణముగా చనిపోవుచున్నప్పుడు. భూతముల (దెయ్యములు) కనిపించినపుడు రౌద్రశాంతి చేయవలెను.

భవిష్యత్యభిషేకే చ పరచక్ర భ##యేషు చ | స్వరాష్ట్ర భేదేరివధే శాన్తి రైంద్రీ ప్రశస్త్యతే ||

త్య్రహేతిరిక్తే పవనే రూక్షే సర్వ దిగుత్థితే | వైకృతే వాతజే వ్యాధౌ వాయవీ శాన్తిరిష్యతే ||

పట్టాభిషేకము ముందు రాజు శత్రుభయమునందు స్వరాష్ట్రములో విప్లవము కలిగినపుడు శత్రువులను జంపుటకు ఐంద్రీ శాంతి ప్రశస్తము. మూడురోజుల పైనికూడ తీవ్రమైన గాలి యన్ని దిక్కుల గ్రమ్ముకొన్నప్పుడు. వాతరోగమునందు వాయవ్య శాంతి సమ్మతము.

అనావృష్టి భ##యేజాతే జాతే విక్పత వర్షణ | జలాశయ వికారేచ వారుణీ శాన్తిరిష్యతే ||

అభి శావభ##యే ప్రాప్తే భార్గవీచ తధా ద్విజ | జాతే ప్రసవ వైకృత్యం ప్రాజాపత్యా మహాభుజ ! ||

అనావృష్టి భయమేర్పడినపుడు, వికృతముగ వర్షములు కురిసినపుడు, నదులు చెఱువులు కట్టలు తెగి ముంచెత్తునపుడు లేదా వానిలో నీరెండిపోయినపుడు వారుణీశాంతి యనుకూలము. నింద, అపవాద భయమేర్పడినపుడు భార్గవీ శాంతి. పురుడు వచ్చు నపుడేర్పడు వైకృత్యములందు ప్రాజావత్యశాంతి కర్తవ్యము.

ఉపస్కరాణాం వైకృత్యం త్వాష్ట్రీభార్గవ నందన | బాలానాం శాన్తికామస్య కొమారీచ తధా శుభా ||

ఆగ్నేయీంకారయే చ్ఛాన్తిం సంప్రాప్తే వహ్నివైకృతే | కార్యా మారుద్గణీ శాన్తిర్దుర్బలేన మహీక్షితా ||

ఆజ్ఞాభంగే తదాజాతే జాతే భృత్యాదిసంక్షయే | అశ్వానాం శాన్తికామస్య తద్వికాదే తథోత్థితే ||

గజాన్‌ కామయ మానస్య గాంధార్వీశాన్తి రిష్యతే | గజానాం శాన్తికామస్య తద్వికాదే తథోత్థితే ||

గజాన్‌ కామయ మానస్య శాన్తి రాంగిరసీ భవత్‌ | పిశాచాది భ##యే జాతే శాన్తిర్వైనైఋతీ మతా ||

అప మృత్యుభ##యే జాతే దుఃస్వప్నేచ తధా ద్విజ! | కామ్యాంతు కారయే చ్ఛాన్తిం ప్రాప్తేతు మరకే తథా ||

ఉపస్కర వైకృత్యమందు త్వాష్ట్రీశాంతి, గృహసామగ్రికి ఉపస్కరమని పేరు. పిల్లలకు సంబంధించిన చిక్కులేర్పడినపుడు కౌమారీశాంతి యర్హము. అగ్నివైకృతమందు ఆగ్నేయీశాంతి, రాజు దుర్బలుడైనపుడు మరుద్గణశాంతి, రాజాజ్ఞాభంగమేర్పడినపుడు, ప్రజల తిరుగబడుట మొదలయిన వానియందు, నౌకరుల కిబ్బందుల గల్గినపుడు, గుఱ్ఱములకు వైకృతము గల్గినపుడు, అశ్వసమృద్ధి కోరినపుడు, గజబల సమృద్ధి కోరువానికి గాంధర్వీశాంతి, ఏనుగులకు వైకృత్యమేర్పడినపుడు, గజబలమునకు అంగీరసీ శాంతి యుచితము. పిశాచాదిబాధలందు నైరృతీశాంతి చేయవలెను. అపమృత్యు భయమందు దుఃస్వప్నములందు మరక లేర్పడినపుడు కామ్యశాంతి చేయవలెను.

ధన నాశే సముత్పన్నే కౌబేరీ శాన్తి రిష్యతే | వృక్షాణాంచ తధార్చానాం వైకృతే సముపస్థితే ||

భూమి కామ స్తధా శాన్తిం పార్థివీం సంప్రయోజయేత్‌ | వ్రధమే దినయామేచ రాత్రౌచ మనుజోత్తమ! ||

హస్తే స్వాతౌచ చిత్రాయా మాదిత్యే చాశ్వినే తధా | అర్యవ్ణుె సౌమ్యజాతేషు వాయవ్యా త్యద్భుతేషు చ ||

ద్వితీయే దినయామేచ రాత్రౌచ భృగునందన! | పుష్యాగ్నేయ విశాఖాసు పిత్య్రాసు భరణీషు చ ||

ఉత్పాతేషు తధా భాగ్యే త్వాగ్నేయీ శాన్తి రిష్యతే | తృతీయదిన యామేచ రాత్రౌచ భృగునందనః ||

ధనము పోవుచున్నపుడు కౌబేరీశాంతి, చెట్లకు దేవతా గృహములకు వైకృతము కల్గినపుడు, భూమి కావలయున్నపుడు పార్థీవీశాంతిని చేయవలెను. పగటి మొదటి జామునను రాత్రియును హస్త స్వాతి చిత్త ఆదిత్యము=అశ్వని అర్యమ దేవతాకము=సోమదేవతాకమునైన నక్షత్రములయందు అద్భుతము లేర్పడినతఱి వాయవ్య (వాయుదేవతకు)శాంతి చేయవలెను. పగటి రెండవ జామున రాత్రియందు పుష్యమి ఆగ్నేయము = విశాఖ, పిత్య్రము=భరణి, భగదేవతాకమునైన నక్షత్రము అందుత్పాతమలు తటస్థించిన యెడల ఆగ్నేయీశాంతి చేయవలెను.

రోహిణ్యాం వైష్ణవే బ్రాహ్మే వాసవే విశ్వదైవతే | జ్యేష్ఠాయాంచ తధా మైత్రే యే భవ న్త్యద్భుతాః క్వచిత్‌ ||

ఐంద్రీతేషు ప్రయోక్తవ్యా శాన్తి ర్భృగుకులోద్భవః | చతుర్ధే దని యామేవా రాత్రౌచ భృగునందన! ||

రోహిణి వైష్ణవము=శ్రవణము బ్రాహ్మము. వాసవము=ధనిష్ఠ, విశ్వదైవతము=ఉత్తరాషాఢ, జ్యేష్ఠ మైత్రియు=అనూరాధ అనునీ నక్షత్రములందు అద్భుతమలు గల్గినచో ఐంద్రీశాంతి కర్తవ్యము. పగటి నాల్గవజామునగాని రాత్రిపూటగానియీ శాంతి చేయవలెను.

సార్పేపౌష్ణే తధార్ద్రాయాం త్వాహిర్బధ్న్యేచ దారుణ | మూలే పరుణదైవత్యే యే భవన్త్యద్భుతా స్తధా ||

వారుణీతేషు కర్తవ్యా మహాశాన్తి ర్మహీక్షితా | భిన్నమండల వేలాసుయే భవన్త్యద్భుతాః క్వచిత్‌ ||

తేషు శాన్తిద్వయం కార్యం నిమత్తే సతి నాన్యధా | నిర్నిమిత్తాకృతా శాన్తిర్నిమిత్తా యోపజాయతే ||

సార్పము=ఆశ్లేష, పౌష్ణము=దేవతి, ఆర్ద్ర ఆహిర్బుధ్న్యము=ఉత్తరాభాద్ర, మూల వారుణము=శతభిషమునను నక్షత్రము లందద్భుతములు గల్గినచో వారుణీ మహాశాంతిని రాజు నిర్వర్తింపవలెను. గ్రహముల భిన్నగతులందు గల్గు అద్భుతములందు వానియందు రెండు శాంతులు సేయవలెను. కారణము లేకుండ శాంతి చేయరాదు. నిర్నిమిత్తముగా జేసిన శాంతి అనిమిత్తములను దెచ్చిపెట్టును. అదియంతయు దోషము.

బాణ ప్రహారా న భవన్తి యద్వత్‌ నృణాం రణ సన్నహనై ర్యుతానామ్‌ ||

దైవోపఘాతా న భవన్తి తద్వత్‌ ధర్మాత్మనాం శాన్తి పరాయణానామ్‌ ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వతీయఖండే అద్భుతేషు శాన్తికర్మవర్ణనంనామ త్రయ స్త్రింశందుత్తర శతతమోధ్యాయః.

కవచములం దొడిగికొన్న వారికి బాణముదెబ్బలు తగలనట్లు, శాంతి పరాయణు లయిన ధర్మాత్ములకు దైవకోప ఘాతములు గల్గవు.

ఇది విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వతీయఖండమున అద్భుతశాంతి వర్ణనమను

నూటముప్పది మూడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters