Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట ముప్పదియారవ అధ్యాయము - ఔత్పాతికాగ్ని శాంతి

గర్గః- అనగ్నిర్దీప్యతే యత్ర రాష్ఠ్రే భృశ సమన్వితః | న దీప్యతే చేంధనం వా సరాష్ట్రః పీడ్యతే నృపైః ||

ప్రజలాదంబు నాశం చ తధార్ద్రం వాతి కించన | ప్రాసాదస్తోరణం ద్వారం నృపవేశ్మ సురాలయమ్‌ ||

ఏతాని యత్ర దహ్యన్తే తత్ర రాజభయం భ##వేత్‌ | విద్యుతావా ప్రదహ్యన్తే తదాపి నృపతే ర్భయమ్‌ ||

అనైశ్యాని తమాంసిస్యుర్దిశః పాంసురజాంసి చ | ధూమశ్చా నగ్ని జో యత్ర, తత్ర విద్యా న్మహద్భయమ్‌ ||

రాత్రా వనభ్రే గగనే భయం స్యాదృక్షవర్జితే | దివా సతారే గగనే తధైవ భయమాదిశేత్‌ ||

గ్రహ నక్షత్ర వైకృత్యే తారా వికృత దర్శనే | పురవాహన యానేషు చతుష్పాన్మృగ పక్షిషు ||

ఆయుధేషు చ దీప్తేషు ధూమాయత్సు తధైవచ | నిర్యత్సు కోశాశ్చ తథా సంగ్రామస్తు ములోభ##వేత్‌ ||

వినాగ్నిం విస్ఫులింగాశ్చ దృశ్యన్తే యత్ర కర్హిచిత్‌ | స్వభావాచ్చాపి పూర్యన్తే ధనూంషి వికృతానిచ ||

వికారాశ్చాయుధానాం స్యుస్తత్ర సంగ్రామ మాదిశేత్‌ | త్రిరాత్రో పోషితస్తత్ర పురోధాః సు సమాహితః ||

సమిద్భిః క్షీరవృక్షాణాం సర్షపైశ్చ ఘృతేన చ | అగ్నిలింగైశ్చ జుహుయా ద్వహ్నిం శ్వేతాంబరశ్శుచిః ||

దద్యా త్సవర్గంచ తధా ద్విజేభ్యోగా శ్చైవ వస్త్రాణి తధా భువం చ |

ఏవం కృతే పాప ముపైతి నాశం యద్వహ్ని వైకృత్య భవం ద్విజేంద్ర ! ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే ఔత్పాతికాగ్ని శాంతివర్ణనంనామ షట్త్రింశదుత్తర శతతమోధ్యాయః.

గర్గుండిట్లయె : నిప్పులేకుండ కట్టె మండినను నిప్పున్నపుడు కట్టె అంటుకొనకుండినను నా రాజ్యము శత్రుపీడనందను. రాజప్రాసాదము తోరణద్వారము రాజగృహము దేవాలయము కాలిపోయినచో రాజునకు ప్రమాదమని చెప్పవలెను. విద్యుత్తచేత కాలిపోయినా నదే ఫలము. రాత్రి పడకుండ చీకట్లలుముకొన్నను, దిక్కులందు ధూళిరేగినను, అగ్నిలేకుండ పొగ గ్రమ్మినను నక్కడ మహత్తర భయము గల్గునని తెలయనగును.

రాత్రివేళ యాకాశమందు మేఘములు, నక్షత్రములు కనిపించకున్నను పగలు చుక్కలు పొడిచినను భయము గల్గునని చెప్పవలెను. గ్రహనక్షత్ర వైకృత్యచమందు పురమందు వాహనములందు, యానములందు (బండ్లు మొదలయిన ప్రయాణ సాధనము లందు) పశువులందు, మృగ పక్షులందు వికృతలక్షణములు గనిపించినను, ఆయుధములు మండిపోయినను పొగ జిమ్ముచున్నను ఆయుధముల కోశములు తొడుగు లూడిపోవుచున్నను సంకుల యుద్ధము జరుగును. నిప్పు లేకుండ నిప్పురవ్వలు కనిపించినను విల్లెక్కుపెట్టకుండ తమంత నారి తొడిగియున్ననూ, ఆయుధములందే వేని వికారములు గోచిరించిననూ యుద్ధము తటస్థించుననవలెను. అప్పుడు మూడురోజు లుపవాసముచేసి నియమమూని శ్వేతవస్త్రములు దాల్చి పురోహితుడు పాలచెట్ల సమిధలు ఆవాలు నేయి ముంగొని అగ్ని లింగములయిన మంత్రముతో నగ్నిని వేల్చవలయును. సువర్ణము గోవులు వస్త్రములు భూమియు బ్రాహ్మణుల కొసంగవలయును. ఇట్లు చేసిన వహ్నివైకృత్యమున నేర్పడిన పాపము దీనిచే నశించును.

ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున ఔత్పాతికాగ్ని శాంతివర్ణనమను నూట ముప్పది యాఱవఅధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters