Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటముప్పది తొమ్మిదవ అధ్యాయము - జలవైకృత్య వర్ణనము

గర్గః - నగరాదప సర్పన్తి సమీప ముపయాన్తి వా | అశోష్యా అపి శుష్యన్తి సమీపం ప్రవహన్తి వా ||

నద్యోహ్రద ప్రస్రవణా విసర్గాశ్చ భవన్తి చేత్‌ | వివర్ణం కలుషం తప్తంఫేన వజ్రంతు సంకులమ్‌ ||

గర్గాచార్యుడిట్లనియె. నదులు మడుగులు సెలయేళ్లు (వాగులు) నగరమునకు దూరమగును లేదా దగ్గరకు చేరును. ఎండనివి కూడ యెండిపోవును. కట్టలు తెగిపోవును. రంగుమాని మఱుగెత్తి తెగ వ్రాగునురుగు వజ్రమువలె గడ్డకట్టును.

క్షీరం స్నేహం సురాం రక్తం వహన్తేవా కులోదకాః | షణ్మాసాభ్యంతరం తత్ర పరచక్రభయం భ##వేత్‌ ||

జలాశయా నదన్తేవా ప్రజల్పన్తి క్వధన్తి వా | విముంచతేధవా బ్రహ్మన్‌! జలాన్‌ ధూమరజాంసి చ ||

అఖాతేవా జలోత్పత్తిః స సత్వావా జలాశయాః | సంగీత శబ్దా దృశ్యన్తే జనమార భయం వదేత్‌ ||

పాలు, నూనె, కల్లు రక్తము ననువానితో నీళ్ళు వ్యాకులములై ప్రవహించుచో ఆఱునెలలో శత్రుచక్రము వలన భయము గల్గును. జలాశయములు, నదులు మొదలైనవి ధ్వనించుచో, తెగవాగుచో, ఉడుకుచో, పొగ దుమ్ముగ్రమ్మిన నీటిని వదలుచో త్రవ్వని ప్రదేశమున జలము బయలుదేరినను, జలాశయములు జల జంతువులతో నిండినను, అందు సంగీతధ్వని వినిపించినను, జననాశన భయము గల్గునని చెప్పవలెను.

జలాశయానాం వైకృత్యే సంయతస్తు జలాశ##యే | స్థాలీపాకేన పశునా వరుణం పూజయే ద్ద్విజ! ||

దివ్య మంభః పయస్సర్పి ర్మధుచాత్రావసేచనమ్‌ | జప్తవ్యా వారుణా మంత్రాః తైశ్చహోమో జలేభ##వేత్‌ ||

మధ్వాజ్య యుక్తం పరమాన్న మత్ర దేయం ద్విజానాం ద్విజ! భోజనార్ధేః

గావశ్చ దేయా ద్విజ! వస్త్రయుక్తాః తధో దుకుంభాః సకలాంగ శాన్యై||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే జల వైకృత్య వర్ణనం నామ ఏకోనచత్వారింశ దుత్తర శతతమోధ్యాయః

జలాశయము వికృతి యేర్పడినపుడు అందు ద్విజుడు నియమమూని పశువుతో స్థాలీపాకముచేసి వరుణు నారాధింప వలెను. దివ్యజలము, పాలు సర్పిస్సు = నెయ్యి, తేనెయు నీపూజయందభిషేకము చేయవలెను. (దివ్య జలమనగా నెండయుండగా పడిన వాన నీరు) వారుణ మంత్రములతో జపముచేసి వానితో హోమము గావింపవలెను. తేనె, నేయియుంగూడిన పరమాన్నమును శాంతియందు ద్విజుల కారగింపు పెట్టవలెను. సవస్త్ర గోదానము చేయవలెను. సకలాంగ శాంతికి ఉదక కుంభములుగూడ దానము చేయవలెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయ ఖండమున జలవైకృత్య వర్ణనమను నూటముప్పదితొమ్మిదివ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters