Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట నలుబదిరెండవ అధ్యాయము - ఉపస్కర వైకృత్య వర్ణనము

గర్గః- యాన్తి యానా న్యయుక్తాని యుక్తాని నహి యాన్తి చేత్‌ | చోద్య మానాని తస్యస్యా న్మహద్దుఃఖ ముపస్థితమ్‌ ||

వాద్యమానా న వాద్యన్తే వాద్యన్తే చాప్యనాహతాః | అచలా శ్చ చల న్త్యేవ నచలన్తి చలా స్తధా ||

ఆకాశే తూర్యనాదశ్చ గీతగంధర్వ నిస్వనాః | కాష్ఠం దార్వీ వికారా కుఠారం కురుతే యది ||

గవాం లాంగూల సంగశ్చేత్‌ స్త్రియం తు యది పాతయేత్‌ | ఉపరాగా దివ్యకృతా ఘోరం శస్త్రభయం వదేత్‌ ||

యానములు=రథములు బండ్లు మొదలయిన వాహనములు గుఱ్ఱములను ఎడ్లను గట్టుకుండనే నడచినను, వానితో యుక్త ములు=పూన్పబడినవి తోలినను నడువని యెడల వాద్యములు వాయించినను మ్రోగని యెడల వాయించ కుండనే మ్రోగినను కదలని చెట్లు కొండలు మున్నగునవి కదలినను కదలునట్టివి కదలక పోయినను ఆకాశములో వాద్యఘోషమును గీతగంధర్వ నిస్వనములు కట్టెయు కట్టెతో జేయబడిన యనేక వస్తువులను గొడ్డలి దయారు చేయునేని, నరకవలసిన గొడ్డలి కర్రసామగ్రిని దయారు చేయుట విరుద్ధమన్న మాట. ఆవు తోక తాకినంత మాత్రమున స్త్రీ పడిపోయినను దేవ కృతములైన యీ ఉపరాగ ములు గ్రహకల్లోల ఘోరమైన శస్త్రభయము [యుద్ధము] సూచించును.

వాయోస్తు పూజా ద్విజ సక్తుభి శ్చ కృత్వా తదుక్తాంస్తు జపేచ్చ మంత్రాన్‌ |

దద్యాత్‌ ప్రభూతం పరమాన్న మత్ర | ప్రదక్షి ణాన్తేన శమోస్య భూయాత్‌ ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే ఉపస్కర వైకృత్య వర్ణనం నామ ద్విచత్వారింశ దుత్తర శతతమోధ్యాయః ||

ఓ విప్రోత్తమ! రామ! ఇట్టి వైకృతములు గల్గినపుడు పేలపిండితో వాయుపూజ చేయవలెను. వాయుదైవత్య మంత్రములను జపింపనగును. పరమాన్న దానము సమృద్ధిగా నొనరింప వలెను. ప్రదక్షిణతో సమాప్తిగ జేసిన షోడశోపచారముల వలన నీ వైకృతములు శాంతించును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున ఉపస్కర వైకృత్య వర్ణనమను నూటనలుబది రెండవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters