Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట నలుబది ఏడవ అధ్యాయము - ఉపేక్షా వర్ణనము

పుష్కరః- అభిమన్యేత నృపతి రనేన మమ విగ్రహే | అనర్థాయానుబంధ స్స్యాత్‌ సంధినాచ తధా భ##వేత్‌ ||

సామ లజ్జాస్పదం చాత్ర దానం చాత్ర క్షయార్థకం | భేదే దండేనుబంధఃస్యాత్తదా పక్షం సమాశ్రయేత్‌ ||

అవజ్ఞోపహత స్తత్ర రాజ్ఞా కార్యో రిపుర్భవేత్‌ | ఉపేక్షయైవ ధర్మజ్ఞ!శ్రేయసే తత్ర సా స్మృతా ||

ఉపేక్షయా యత్రతు శక్య మర్థం క్షయ వ్యవాయా సమతా నతత్ర |

కార్యం భ##వేద్ర్బాహణ విగ్రహేణ లజ్ఱాస్పదేనాప్యథ సంథినా వా ||

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తర ద్వితీయ ఖండే ఉపేక్షా వర్ణనం నామ సప్తచత్వారింశదుత్తర శతతమోధ్యాయః ||

పుష్కరుండనియె. నృపతి పెట్టుకొనిన సామదాన సంబంధము ఈ శత్రువుతోడి అనర్థము కొఱకు అగును. సంధిచేసి కొన్నను నంతే యగును. సామోపాయము పయోగించునా దాన తలవంపగును. దానోపాయమో ధనక్షయమునకు కారణమగును. భేదోపాయమునందు దండోపాయమునందు సంబంధము పెట్టుకొనిన ఒక రాజు పక్షములో జేరవలయును. అని యీ విధముగానెట్లునుం జేయక ఉపేక్షించుట వలన శత్రురాజునట్లు తిరస్కృతుడగును, అందువలన కొన్ని యెడలను పేక్షించి యూరుకొనుటవలన శ్రేయస్సుగల్గును. ఎక్కడ ఉపేక్షచేతనే యర్థ సాధనము శక్యమో యెక్కడ సైన్యధనాది వ్యయకారణ మధికమోఅక్కడ విగ్రహ ముతో బ్రయోజనముండదు. తలవంపునకు కారణమగు సంధియుం బ్రయోజనకారిగాదు. అక్కడ ఉపేక్ష యొక్కటే కార్యకారి.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమందు యుపేక్షా వర్ణనమను నూటనలుబదియేడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters