Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటఏబదియొకటవ అధ్యాయము - ఆజస్రిక వర్ణనము

రామః- అజస్రం కర్మమే బ్రూహి రాజ్ఞాం రాజీవలోచన! | యచ్చ కార్యం నరేంద్రాణాం తధాచ ప్రతివత్సరమ్‌ ||

పుష్కరః- ద్విముహూర్తావ శేషాయాం రాత్రౌ నిద్రాం త్యజేన్నృపః | వేణువీణా మృదంగానాంపటహానాంచ నిస్స్వనైః ||

వందినాం నిస్స్వనై శ్చైవ తధా మంగళవాదినామ్‌ | తతః పశ్యే న్మహీపాలో గూఢాంశ్చపురుషా న్నిశి ||

విజ్ఞాయన్తే న యే లోకే తదీయా ఇతి కేనచిత్‌ | ఆయవ్యయస్య శ్రవణం తతః కార్యం యధావిధి ||

వేగోత్సర్గం తతః కృత్వా రాజాస్నానగృహం వ్రజేత్‌ | దత్తా7భ్యంగః ప్రదోషేతు కల్య ముత్సాదితస్తతః ||

స్నానం కుర్యాత్తతః పశ్చా ద్దన్తధావన పూర్వకమ్‌ | సౌషధైర్మంత్ర పూతైస్తు పానీయైర్వివిధైః శుభైః ||

రాముడు రాజుల కుచితమైన నిత్యాచరణీయమయిన కర్మమును ప్రతి సంవత్సరము చేయనగు కర్మము నానతిమ్మన పుష్కరుండిట్లనియె.

రెండు ముహూర్తములుమాత్రము మిగిలిన రాత్రివేళ [ముహూర్తము=రెండు గడియలకాలము] వీణ, వేణువు, మృదంగములు, పటహములు మొదలైన వాద్యముల యొక్కయు వందిమాగధుల యొక్కయు మంగళములు పలుకువారి యొక్కయు శుభ ధ్వనులతో రాజు నిద్దురవిడువలెను. ఆమీద నారాత్రివేళ##నే వారి వారుగా లోకులెవ్వరుం దెలియని గూఢచారులను జూడవలెను. ఆమీద నేరోజున కారోజు జరిగిన ఆదాయ వ్యయములను ఆలింపవలెను. ఆమీద మలమూత్ర విసర్జనము సేసి దంతధావన పూర్వకముగ స్నాన గృహముంజొచ్చి యొడలికినూనె రాచి నలుగుపెట్టుట మొదలగు రీతి నభ్యంగస్నాన మాప్రదోషమందే నిర్వర్తించి మంత్రపూతము లయిన పలురకాల స్నానీయములయిన మూలికలతో గూడిన శుభకరములయిన మంచినీళ్ళతో స్నానము సేయవలెను.

సంధ్యా ముపాస్య ప్రయతః కృతజప్యః సమాహితః | అగ్న్యగారం ప్రవిశ్యా7ధ వహ్నీన్‌ పశ్యేత్‌ పురోధసా ||

హుతాన్‌ సమ్యక్తతః కుర్యాద్వాసుదేవస్య చార్చనమ్‌ | దుఃస్వప్న శమనం కర్మ తత్రకుర్యా త్పురోహితః ||

నియమముతో సంధ్య నుపాసించి మనస్సమాధితో జపము సేసి అగ్నిశాలం జొచ్చి పురోహితునిచే హోమము సేయబడిన త్రేతాగ్నులను దర్శింపవలెను. ఆపైన వాసుదేవార్చనము గావింపవలెను. పురోహితు డక్కడ దుఃస్వప్న శమనమయిన క్రియ నిర్వర్తింపవలెను.

స్వయం చోపసదే వహ్నౌపవిత్రం జుహుయాన్నృపః | తర్పయే దుదకై ర్దేవా న్పితౄనథ యధావిధి ||

దద్యా ద్ద్విజాతయే థేనుం సవత్సాంచ సకాంచనామ్‌ | శక్త్యా ధనైః పూజయిత్వా దత్తాశీః సతతం ద్విజైః ||

అనులిప్తస్తతః స్రగ్వీ సువాసా శ్చాప్యలంకృతః | దర్పణచ ముఖం పశ్యే త్ససువర్ణేచ సర్పిషి ||

సమీప గతాగ్నియందు రాజు స్వయముగా పవిత్రాహుతిని హోమము సేయవలెను. అవ్వల యధావిధిగా దేవర్షి పితరుల నుదకముతో సంతృప్తులం జేయవలెను. దేవర్షి పితృ తర్పణములు సేయవలె నన్నమాట. ద్విజునకు దూడతో, బంగారముతోగూడ ధేనువు నీయవలెను. యధాశక్తి దానములచే బూజించి ద్విజుల యాశీర్వాదములు పొందవలెను. ఆ మీద భగవత్సమర్పితమయిన గంధము పూసికొని పూలమాలలు గైకొని అద్దములోను బంగారము వేసిన నేతిలోను తన ముఖముం దాను జూడవలెను.

ఆజ్యం ప్రసన్నం సురభి యది స్యాద్విజయో భ##వేత్‌ | దీయమానేచ దుర్గంథే పతితేచ భయం భ##వేత్‌ ||

వికృతం చేన్ముఖం పశ్యే ద్రాజా మృత్యు మవాప్నుయాత్‌ | సుప్రభంచ యదా పశ్యేత్తదా తస్య శుభం భ##వేత్‌ ||

ఆ నెయ్యి ప్రసన్నమై [స్వచ్ఛమై] సువాసనగలది యగునేని విజయము గల్గును. అది దుర్వాసన గొట్టుచున్నను, ఒలికి పోయినను భయము గల్గును. [అపశకున మన్నమాట] అందు చూచిన ముఖము వికృతముగ కనిపించునేని రాజు మరణించును. అది చక్కని ప్రభతో నున్నట్లు చూచునేని వానికి శుభమగును.

తతస్తు శృణుయా ద్రాజాసాంవత్సర ముఖోద్గతమ్‌ | దివసే తిథినక్షత్రే సర్వాశుభ వినాశనమ్‌ ||

భిషజాం చ వచః కుర్యాత్తత స్త్వారోగ్య వర్ధనమ్‌ | మంగళా లంభనం కృత్వా తతః పశ్యే ద్గురూన్‌ నృపః ||

కృతాశీ ర్గురుభిః పశ్చాద్రాజా గచ్ఛేత్స మన్తతః | తత్రస్థాన్‌ బ్రాహ్మణాన్‌ పశ్యే దమాత్యాన్‌ మన్త్రిణ స్తధా ||

ప్రకృతీశ్చ మహాభాగ! ప్రతీహార నిబోధత | తత్రేతిహాస శ్రవణం కుర్యాత్కించి దతంద్రితః ||

అవ్వల జౌతిషుకుని ముఖమున నా రాజు తిథి నక్షత్రాదులను వినవలెను. పంచాంగ శ్రవణము చేయవలె నన్నమాట. అది సర్వాశుభ నివారకము. ఆరోగ్యాభివృద్ధికరమైన వైద్యులమాట నాలింపవలెను. ఆమీద మంగళాలంభనం= మంగళ వస్తుదర్శన స్పర్శనాదులు సేసిన తరువాత గురువులం దర్శింపవలెను. గురువులాశీర్వదించిన తరువాత రాజు రాజభవనమందుట నున్న బ్రాహ్మణులను అమాత్యులను మంత్రులను జూడవలెను. ఆమీద ప్రకృతులను ప్రతిహారుని విన్నపము ననుసరించి తిలకింపవలెను. అక్కడ ఇతిహాసము భారతాదుల నొకించుక తొట్రువడక శ్రవణము సేయవలెను.

తతః కార్యార్థినాం కుర్యా ద్యధా ధీః కార్యనిర్ణయమ్‌ ||

వ్యవహారాం స్తతః పశ్యేత్సమో భూత్వారి మిత్రయోః త్యక్త్వాసభాం తతః కుర్యా న్మంత్రంతు సహ మన్త్రిభిః ||

యత్రాస్య కశ్చిత్తం మన్త్రం శృణుయా న్నకధంచన | ఏకేనసహ తం కుర్యా న్నకుర్యా ద్బహుభి స్సహ ||

అవ్వల కార్యార్థుల కార్యనిర్ణయము తన బుద్ధి ననుసరించి చేయవలెను. శత్రుమిత్రులయెడ సముడై యా మీద వ్యవహారములను జూడవలెను. అవ్వల సభవదలి మంత్రులతోగూడ మంత్రములను [ఆలోచనని] జేయవలెను. ఆ ఆలోచనసేయు స్థానమం దెవ్వడునేని వినగూడనిదై యేకాంతమయి యుండవలెను. ఆలోచన పెక్కుమందితో సేయరాదు.

నచమూర్ఖై ర్నచానామై స్తధానా7 ధార్మికైర్మృపః | మంత్రం స్వధిష్ఠితం కుర్యా ద్యేన రాష్ట్రం నధావతి ||

రాజ్ఞాం వినాశమాలస్తు కథితో మన్త్ర విభ్రమః | నాశ##హేతుర్భవే న్మంత్రః కుప్రయుక్త స్త్వమంత్రవత్‌ ||

మంత్రే సునిశ్చితే సిద్ధిః కధితా పృధివీక్షితామ్‌ | క్రియమాణాని కర్మాణి యస్యవేత్తి నకశ్చన ||

కృతాన్యేవ విజానాతి సరాజా పృథివీ పతిః | పృథక్‌ చ మంత్రిభి ర్మంత్రం కృతంవై సంహితైఃపునః ||

మూర్ఖులతో నూరుపేరు లేనివారితో నధార్మికులతో మంత్రమును [ఆలోచనను]సేయరాదు. అది యోగ్యులధిష్ఠించినదిగా [పరివేష్టించినదిగా] నుండవలెను. అందువలన రాష్ట్రము [రాజ్యము] పరుగెత్తదు. చేజారిపోదన్నమాట. మంత్ర విభ్రమము ఆలోచన వీధులంబడునేని చేతగానివాడు [అపాత్రుడు] ఉపయోగించిన మంత్రమట్లు వినాశ హేతువగును. సునిశ్చితమైన మంత్రమందు రాజులకు ఫలసిద్ధి చెప్పబడినది. రాజు సేయు నేపనిగాని యెవ్వడు నెఱుగరాదు. ఏ రాజు సేసిన పనులైన జరిగినవే తెలియబడునో ఆ రాజు పృథివీపతి. పృథివినెల్ల పాలింపగలవాడగును. కలిసికట్టుగనున్న మంత్రులతోగూడ విడివిడిగా నొక్కొక్కరితోనే కార్యాలోచన సేయవలెను.

విచార్య మాత్మనః సాదు పశ్చాత్తత్ర సమాశ్రయేత్‌ | ప్రజ్ఞాభిమానీ నృపతి ర్నమంత్రి వచనే రతః ||

క్షిప్రం వినాశ మాయాతి తడాగ మివ కాజలమ్‌ | ఆకారగుహనై రాజ్ఞో మంత్రరక్షా పరామతా ||

ఆకారై రింగితైః ప్రాజ్ఞాః మంత్రం జానన్తి పండితాః | సాంవత్సరాణాం వైద్యానాం మంత్రిణాం వచనేరతః ||

రాజావిభూతి మాప్నోతి చిరం యశసి తిష్ఠతి | తఏనం మృగయాసక్తం ధారయన్తి విపశ్చితః ||

అదికూడ తనకు యోగ్యమని యాలోచించిన మీదటనే యాపని సేయవలెను. నాకంటె ప్రజ్ఞావంతుడు [బుద్ధిమంతుడు] లేడని మంత్రుల మాట యెడ నపేక్ష లేనివాడగునేని కట్టలుతెగిన నీటం జెఱువట్టులు వినాశమందును. పరమోత్తమ మంత్ర రక్ష యనగా రాజున కాకారగోహనము ముఖ కవళికలంబట్టి రాజు హృదయము గుర్తింప వీలుగాకూడ దన్నమాట. పండితులు [బుద్ధిమంతులు] ఆకారములంబట్టి ఇంగితములం [చేష్టలు] బట్టియు నాలోచన గనిపెట్టుదురు. జ్యౌతిషికుల వైద్యుల మంత్రుల మాట యెడ నపేక్ష గల రాజు చిరకలాము విభూతిని [ఐశ్వర్యమును] పొందును. యశస్వియునగును. వేటయెడ నాసక్తుడైన రాజును చక్కగా తెలిసినవారు కాపాడగలరు.

స్త్రీషు మానే తధా7క్షేషు వృథా జ్యాయాం చ్చభార్గవ! |కరప్రణయనే సక్తం హింసాయాంచ నరాధిపమ్‌ ||

తధా పరోక్షనిందాయాం బలవద్విగ్రహే7పిచ | అన్యేషు చాప్యనర్థేషు ప్రసక్తం వారయన్తి తమ్‌ ||

మంత్రం కృత్వాతతః కుర్యా ద్వ్యాయామం పృధవీ పతిః | రధే నాగే తధైవాశ్వే ఖడ్గే ధనుషి చాప్యధ ||

అన్యేషు చైవశ##స్త్రేషు నియుద్ధేషు తతః పరమ్‌ | పద్భ్యా ముద్వన్తితః స్నాతః పశ్యేద్విష్ణుం సుపూజితమ్‌ ||

స్త్రీలందు మానమందు నేనే గొప్పవాడనను దురభిమానమందు పాచిక లాటయందు వ్యర్థమగు జ్యాయాం=నారియందు, అనగా విల్లెక్కుపెట్టుటయందు అనగా యుద్ధమందు, పన్నులు వేయుటయందు, పరహింసయందు, చాటున నిందలు వేయుటయందు, బలవంతులతోడి నిగ్రహమందు, మఱియు బెక్కు చిక్కులయందు బడిన రాజును వారు నివారింతురు. కార్యాలోచనము సేసిన తరువాత రాజు రథము ఏనుగు గుఱ్ఱపుస్వారి కత్తివాటు విల్లు నందును మఱి పెక్కువిధములైన ఆయుధములందు యుద్ధములందు = కుస్తీలు పట్టుట మొదలయిన వానియందు వ్యాయామము సేయవలెను. పాదముల నెగిఱిపడి స్నానమాడి చక్కగ బూజింపబడిన విష్ణుని దర్శనము సేయవలెను.

హుతంచ పావకం పశ్యే ద్విప్రాన్పశ్యే త్సుపూజితాన్‌ | స్వామినో దక్షిణాభిశ్చ పూజితాన్‌ భృగునన్దన! ||

తతో7 నులిక్త ః సురభిః స్రగ్వీ రుచిర భూషణః | సువాసా భోజనం కుర్యా ద్గీతంచశృణు యాత్తదా ||

ఆప్తం వరీక్షీతం వహ్నౌ మృగ పక్షీంగితై స్తధా | పూర్వం పరీక్షితం చాన్యై ర్నిజాంగుళ్యాభి మన్త్రితమ్‌ ||

విషఘ్నాంశ్చ మణిన్‌ రాజా థారయన్నౌ షధీంస్తధా | భుక్త్వా గృహీత తాంబూలః పరిక్రమ్య విశేషతః ||

శయనే వామపార్శేన తతః శాస్త్రాణి చిన్త యేత్‌ | కోష్ఠాగారాయుధాగారాన్‌ ప్రతి చాంగ్రంచ వాహనమ్‌ ||

యోధాంశ్చ దృష్ట్వా చాన్వస్య తతః సంధ్యాచ పశ్చిమా ||

కార్యాణి చింతయిత్వాచ ప్రేషయిత్వా తతశ్చరాన్‌ | అంతఃపురచరో భూత్వా లఘుభుక్త్వా తధాహితమ్‌ ||

సువేణు వీణా పటహస్వనేన సేవేత నిద్రాం కృతపూర్వ రక్షామ్‌ |

ఏత ద్యశస్యంహి నరాధిపానా మాజస్రికం తే కధితం విధానమ్‌ ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయ ఖండే ఆజస్రికోనామా ఏక పంచాశ దుత్తర శతతమో7ధ్యాయః ||

అటుపై పురోహితుడు హోమములు సేసిన పూజించిన అగ్నిహోత్రములం దర్శింపవలెను. దక్షిణలిచ్చి చక్కగ పూజింప బడిన విప్రులను దర్శింపవలెను. అవ్వల గంధము పూసికొని సువాసనల నించు పూలమాలలు చక్కని యాభరణములు దాల్చి అందమైన వలువలు దాల్చి భోజనము సేయవలెను. అప్పుడు సంగీతముగూడ వినవలెను. వడ్డించిన తరువాత నగ్నిలో మృగములు పక్షులు యింగితములచేత [అవి చూపు భావములను] పరీక్షింపబడినదియు, అంతమున్ను వైద్యులు మొదలగు వారిచే బరీక్షింపబడినదియు, తన వ్రేలిచేత నభిమంత్రింప బడినదియునైన యన్నమును, విషహరములయిన మణులను ఓషధులను ఉంగరములుగా దాల్చి భోజనము సేసి తాంబూలచర్వణము సేసి, చేసిన వెంటనే యిట్టటు పచారు సేసి, శయనమం దెడమప్రక్కకు వ్రాలి పరుండి, యవ్వల శాస్త్రములను విమర్శించి ధనాగారాయుధా గారాదులను వాహనములను యోదులను జూచి[పరిశీలించి] సాయంకాల సంధ్యా వందనము సేసి కార్యాలోచన సేసి చారులను పంపివేసి అంతఃపురచరుడై అల్పాహారమును హితమైనదానిని సేవించి వీణావేణుపటహధ్వనులతో మున్ముందన్ని విధముల పరీక్షలచేత రక్ష యీయబడి నిద్ర పోవలెను. ఇది నరేశ్వరులకు యశస్కరమయిన ఆజస్రి కము నిత్యకృత్యమయిన విధానము నీకు దెల్పబడినది.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున ఆజస్రికమను నూట యేబదియొకటవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters