Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట యేబది రెండవ అధ్యాయము - సాంవత్సరిక వర్ణనము

పుష్కరః- రాజాతు జన్మనక్షత్రే ప్రతిమాసం సమాచారాత్‌ |జన్మనః క్షాలనం కర్మ యత్తత్పూర్వం మయేరితమ్‌ ||

పుష్పస్నానం తతః కుర్యాత్‌ ప్రతిమాసం నరాధిపః | సంక్రాన్తౌ పూజయే త్సూర్యం బాలమిందుం తధైవచ ||

గ్రహం సంపూజయే ద్రాజా నిర్గతం రవిమండలాత్‌ | అగస్త్య స్యోదయే కార్యా తధాపూజా నరాధిపైః ||

పుష్కరుండనియో. రాజు ప్రతిమాసమునను జన్మనక్షత్రమందు జన్మదోష ప్రక్షాలనము సేయు ప్రక్రియ సేసికొనవెను. ఇది యింతకుమున్నే నేను తెల్పియుంటిని. ఆ మీద నెల నెల పుష్పస్నానము సేయవలెను. సంక్రాంతి యందు సూర్యుని బాల చంద్రునిం బూజింప వలెను. రవి మండలము నుండి వెడలిన గ్రహమును బూజింపవెను. మౌఢ్యంము బాసిన దానినన్నమాట. అట్లే అగస్త్యోదయ మందు రాజు పూజ సేయవలెను.

పూజయే చ్చతురో మాసాన్‌ ప్రసుప్తం మాధుసూదనమ్‌ | ప్రోష్ఠపాదా మలేపక్షే పూజయేచ్చ శతవ్రతమ్‌ ||

నవమ్యా మాశ్వయు క్ఛుక్లే భద్రకాంళీంచ పూజయేత్‌ | రవౌస్వాతి మనుప్రాప్తే కుర్యాన్నీ రాజనం తధా ||

సంవత్సరాత్‌ కోటిహోమం కుర్యాచ్చ ఘృత కేవలమ్‌ | రాజ్యసంవత్సర గ్రంధౌ కుర్యా త్తద్రుద్ర పూజనమ్‌ ||

కర్మాణ్యధైతాని నారాధిపస్య నిత్యాని తే రామ ః మయోదితాని |

ఏతాని కృత్వా విధి వన్నరేంద్ర శ్చిరం సమగ్రాం వసుధాం ప్రశాస్తి ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే త్వితీయఖండే సాంవత్సరిక వర్ణనంనామ ద్విపంచాశదు త్తర శతతమో7ధ్యాయః ||

శయనించిన వష్ణువును నాల్గు మాసములు [చాతుర్మాస మందు] పూజింపవలెను. భాత్రపద శుక్లపక్షమున నింద్రుని ఆశ్వయుజ మందు శుక్లనవమి నాడు [మహర్నవమి నాడన్న మాట] భద్రకాళి నర్చింపవలెను. రవి స్వాతీ నక్షత్రమునకు వచ్చి నపుడు నీరాజనము సేయవలెను. ఏడాతి కొకసారి కేవలము నేతితో కోటి హోమము సేయవలెను. రాజ్య సంవత్సర గ్రంధి యందు రుద్రపూజ సేయవలెను. నరాధిపుని నిత్యకర్తవ్యములయిన విధులివి. నీకు దెల్పితిని. యధావిధిగ వీనిని నిర్వర్తించి, రాజు సర్వవసుధను చిరకాలము శాసించును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయ ఖండమందు సాంవత్సరిక వర్ణనమను నూటయేబదిరెండవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters