Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట యేబది నాల్గవ అధ్యాయము - శక్ర ధ్వజోత్పత్తి వర్ణనము

రామః- శక్రసంపూజనం కార్యం కధం రాజ్ఞా సురోత్తమః | సమ్యగ్భాద్రపదే మాసితన్మమాచక్ష్వ పృచ్ఛతః ||

పుష్కరః- ఆసురైస్తు సురాభగ్నాః పురాయుద్ధే భృగూత్తమ! బ్రహ్మాణంశరణం జగ్ముః సర్వభూతహితేరతమ్‌ ||

తేతుమూఢాఃసురా స్సర్వే నిర్జితా దానవైర్యుధి | తానువాచ తతో బ్రహ్మాక్షీరోదే మధుసూదనమ్‌ ||

గచ్ఛధ్వం సమితాస్సర్వే సవఃశ్రేయః కరిష్యతి | ఏవముక్త్వా సురాస్సర్వే క్షీరోదే కేశవం యయుః ||

భాద్రపదమందు ఇంద్రపూజను రాజెట్లు చేయవలెను నాకానతిమ్మని రాముడడుగ పుష్కరుం డిట్లనియో. భృగుశ్రేష్ఠా! మున్నసురులకు సురలోడిపోయిరి, సర్వభూత హితాభిలాషియని బ్రహ్మను శరణొందిరి. ఆవేల్పులెల్ల యుద్ధమున దానవుల కోడినంద వారిని బ్రహ్మ క్షేర సముద్రమందున్న మధుసూదనుని సన్నిధికేగుడు. ఆయన మీకు శ్రేయస్సు చేయగలడన వారు పాలవెల్లికి విష్ణువుంగూర్చి యేగిరి.

దదృశుశ్చ తదాదేవం వాసుదేవం జగద్గురుమ్‌ | అమృతాధ్మాత మేఘాభం శంఖచక్రగదాధరమ్‌ ||

తుష్టువుశ్చ మహాభాగం త్రిదశాస్తం పునః పునః సర్వేషా మీశ్వరం దేవం భువనసై#్యకకారణమ్‌ ||

అపుడు జగద్గురులైన వాసుదేవుని దర్శించిరి. ఆయన అమృతమెల్ల లోనగుంభించికొన్న మేఘమట్లు శంఖ చక్ర గధా ధారియై కనిపించెను. ఆమహానుభావుని త్రిదశులు సర్వేశ్వరుని భువనైక కారణుని స్తుతించిరి.

-దేవతలు క్షీరసాగరశయనుని స్తుతించుట-

దేవాః-నమస్తే పుండరీకాక్షః శరణాగత వత్సల | దేవారి బలదర్పఘ్న! త్రిదశేంద్ర సుఖప్రద! ||

చామీకరాభ వసన! తార్యప్రవరకేతన | శేషపర్యంక శయన | లక్ష్మీహృదయ వల్లభ |

సురాసుర శిరోరత్న నిఘృష్ట చరణాంబుజ | ఉన్నిద్ర చారుకమల విరాజిత కారంబుజ! ||

సచైకదేవః భగ్నానా మస్మాక మసురై ర్భవాన్‌ | గతిస్తేనస్మ సంప్రాప్తా దైత్యభగ్నా స్త్వదన్తికమ్‌ ||

ప్రసీదః దేవదేవేశః జహి ః తానసురాధమాన్‌ యే7స్మాకం దేవదేవేశ! పీడయన్తి సదైవతు||

నీకు వందనమో పుండరీకనయన! స్వామి! శరణాగతత్రాణ! పరమకరుణ దితిజ బలదర్పహరణ! త్రిదశరమణ!

సుఖద! చామీకరాభ విస్వరణ వసన | శేసవర్యంక శయన! లక్ష్మీమనోభిరామ సుందర! శేష పర్యంక శయన!

మహిత సుర దైత్య కోటీరమణి నికృష్టదివ్య చరణార వింద! ఉద్దీప్త నవనవారుణాంభోజ కలిత కరారవింద!

దేవడొక్కడవ అధములన్‌ దితిజ కోటి కోడినామింతకు దిక్కొకడ వీవ

నీదు దరిజేరినాము మామీద దయను బూను విదళింపు మధమాధములను వీరి

శ్రీభగవాన్‌-ధ్వజమేతం ప్రదాస్వామి భవతామరినాశనం | దృష్ట మాత్రేణ యేనేమ విద్రవిష్యన్తిదానవాః ||

పుష్కరః-ఏవముక్త్వా తేషాం దదౌ విష్ణురనుత్తమః | సౌవర్ణముచ్చ్రితం దివ్యంశ శక్రధ్వజ మితిశ్రుతమ్‌ ||

శ్రీ భగవంతుడిట్లనియో. ఇదిగో ఈధ్వజమును మీకిచ్చుచున్నాను. ఇది శత్రునాశకము దీనం జూచినంతన దానవులు పారిపోవుదురు. అని పలికి విష్ణువు వారలకు జెండానొసగెను. అది సువర్ణమయము. దివ్యము. మహోన్నతము శక్రధ్వజము ఇంద్ర ధ్వజమను పేర వినబడునది.

తమాదాయ సురస్సర్వే ప్రయయు ర్దానవాలయమ్‌ | దేవానుపగతాన్‌ శ్రుత్వాదానవా నిర్యయుస్తతః ||

సుసన్నద్ధ బలా స్సర్వేప్రగృహీతాయుధ స్తధా | దృష్ట్వా దేవబలంతేచ శక్రకేతు విరాజితమ్‌ ||

తత్తేజసా మహాభాగః మూర్ఛీభూతాః క్షణనతు | మూర్ఛితాస్తు తతోదైత్యా స్త్రిదశైర్వినిపాతితాః ||

కేచిద్భగ్నా దిశోజగ్ను స్సముద్రే వివిశుస్తతః | తతోలబ్ధజయ శ్శక్రః పూజయామాస తం ధ్వజమ్‌ ||

పూజయిత్వా నృపతయో వసవేప్రదదౌ తదా | గర్గోక్తేన విధానేన తంచ పూజితవాన్‌ వసుః ||

తేనాస్యతుష్టో భగవాన్‌ ఇదంవచన మబ్రవీత్‌ | ఇంద్రః - యే7ప్యన్యేభూమిపాః శ్రేష్ఠాః శక్రధ్వజ మాహోత్సవమ్‌ ||

అద్యప్రభృతి ధర్మజ్ఞ! వరిష్యన్తి సమాహితాః తేషాంతు వివిధా వృద్ధిర్భవిష్యతి సదా ద్విజ! ||

దేవతలందరుం దానింజేకొన దానవుల నివాసమున కేగిరి. రాక్షసులు వారిరాక విని సైన్య సన్నాహము సేసికొన ఆయుధములు పట్టి యిలు వెడలిరి. ఇంద్రధ్వజముచే తపించు దేవసైన్యమును జూచి యా ధ్వజ ప్రభకు క్షణములో మూర్ఛపోయిరి. అటు పడిపోయిన దైత్యులను దేవతలు కూల్చివైచిరి. కొందఱు చెదరి నలుదెసలకు పారిపోయిరి. సముద్రములో జొచ్చిరి. ఇంద్రుడుజయమొంది యాధ్వజమును బూజించెను. పూజించి దానిని వసువను నృపతి కిచ్చెను. వసురాజు గర్గాచార్యులు సెప్పిన విధానమున దానింబూజించెను. దానిచే నింద్ర భగవానుడు సంతుష్టుడై యిట్లనియె. మఱి భూపాలురుత్తము లెవ్వరేని యీశక్రధ్వజ మహోత్సవము నేటి నుండి శ్రద్ధతో చేయుదురో వారి కనేక విధముల నభివృద్ధి గలుగ గలదు.

దుర్భిక్షం మరకోవ్యాధిః పరచక్రభయం తధా | సర్వాణ్యతాని నశ్యన్తి కృతే శక్రధ్వజోత్సవే ||

పుష్కరః-తతః ప్రభృతి రాజానోరామ! శక్రధ్వజోత్సవమ్‌ || కుర్వన్తి గర్గ కథితం సర్వభయ వినాశనమ్‌ ||

థన్యం యశస్యం రిపునాశకారి కీర్తప్రదం దర్మఫలప్రదం చ |

కార్యంనరేంద్రైర్విజయాయ యత్నాత్‌ శక్రోత్సవం తత్కధయామి తుభ్యమ్‌ ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే శక్రధ్వజోత్పత్తి వర్ణనం నామచతుః పంచాశ దుత్తర శతతమో7ధ్యాయః ||

దుర్భిక్షము మరకము=మారి అటు వ్యాధి శత్రుభయము మొదలగునవి యెల్ల నింద్ర ధ్వజోత్సవము చేసిన నంతరింపగలవు అని యింద్రుడనియె. పుష్కరుండనియె. అది మొదలు ఓ పరశురామా! రాజులు గర్గాచార్య ప్రోక్తమైన సర్వభయ నివారకమైన యీయింద్రాత్యకము సేయుచున్నాడు. ఇది ధన్యము యశఃకరము శత్రునాశకము కీర్తిప్రదము ధర్మఫల ప్రదము గూడ. నరేంద్రులకిది జయము గల్గుట కవశ్యకర్తవ్యము. ఈ యంశము నీకేను దెల్పుచున్నాను.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమందు శక్ర ధ్వజోత్పత్తి వర్ణనమను నూటయేబది నాల్గవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters