Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట యేబది యైదవ అధ్యాయము - ఇంద్ర ధ్వజోత్పత్తి వర్ణనము

పుష్కరః- శిబిరా త్పూర్వదిగ్భాగే భూమిభాగే తధా శుభే | ప్రాగుదక్ప్రవణ దేశే శక్రార్థం భవనం శుభమ్‌ ||

వాసోభి శ్శయనైః శుద్ధైర్నానా రాగై స్తధైవచ | తతః శక్రధ్వజ స్థానం మథ్యే సంస్థాప్యయత్నతః ||

మఘవన్తం పటం కుర్యాత్తస్య భాగేతు దక్షిణ |

వామభాగే పటే కుర్యాచ్ఛచీందేవీం తధైవచ | ప్రోష్ఠపాద సితే పక్షే ప్రతిపత్ప్రభృతి క్రమాత్‌ ||

తయోస్తు పూజాకర్తవ్యా సతతం వసుధాథిపైః వనప్రవేశవిధానా శక్రయస్టిం తతో నృప! ||

ఆనయేద్గోరధేనాధ వాయవైః పురషై రథ |

పుష్కరుండనియె: రాజు శిబిరమునకు తూర్పువైపున తూర్పువాలు లేక ఉత్తరపు వాలుగా నున్న చోట ఇంద్రపూజా భవన నిర్మాణము శుభకరము. వస్త్రములతో నానా వర్ణములైన శయనములతో (సోఫాలతో) కూడినచోట నట్ట నడుమ నింద్రధ్వజస్థాన మేర్పరుపవలెను. ఇంద్రమూర్తిచిత్రమును (పటమును) గుడ్డమీత చిత్రించిన దానిని దానికి దక్షిణమున నుంచవలెను. దాని కెడమవైపు శచీదేవి పటమునుంచవలెను. భాద్రపద శుక్లపక్షమందు పాడ్యమినుంచి వరుసగా శచీసమేత దేవేంద్రపూజను రాజులు సేయవలెను. అవ్వల నిద్రధ్వజోప యోగియైన స్తంభమును వనప్రవేశ విధానమున నెడ్లబండిమీద వాయువులయిన (వాయుదేవినికి సంబంధించిన) మనుష్యులచేత దెప్పింపవలయును.

అర్జున స్యాజవర్ణస్య ప్రియకస్య వచస్యచ ||

సురదారవస్యతధా తధైవో దుంబరస్యచ | చందన స్యాధవా రామ! పద్మకస్యాధవా యది ||

అలాభే సర్వకాష్ఠానాం యష్టింకుర్వీత వైణవీమ్‌ | సువర్ణనాద్ధాం ధర్మజ్ఞ! తాంచ సమ్యక్ప్రవేశ##యేత్‌ ||

ప్రోష్ఠపాదసితే పక్షే అష్టమ్యాం రిపుసూదన | క్రమ ప్రమాణ విజ్ఞేయా శక్రయష్టిస్తతో నృప! ||

అర్జునస్య, మద్ది, అజవర్ణము=వేగిస, ప్రియకము కందము= కడిమి, వీచ= వస, సురదారువు=దేవదారువు, ఉదుంబరము=మేడి, చందనము, పద్మకము=పద్మకాష్ఠము ననువానిలో నేదైన కావచ్చును. అవి యేవియు లభింపనిచో వెదురు గడను బంగారపు తొడుగుతో గూడినదానిని జక్కగా ప్రవేశ పెట్టవలెను. శుక్లపక్షమం దష్టమీతిథియందు దానిని ఈ క్రింది రీతిగా కొలత గలదానిని ప్రతిష్ఠింపలెను.

చతుర్భిరంగుళైర్హీనా సాగ్రేభవతి శర్మదా | అష్టాభిశ్చ తధా మూలే ఛిత్వా తోయే యదాక్షిపేత్‌ ||

యాయాదుద్దృత్యనగరం సమ్యగేవ ప్రవర్తతే | తస్యాఃప్రవేశే నగరం పతాకా ధ్వజ మాలిచ ||

సిక్తం రాజపధం కుర్యాత్‌ తథాలంకృత బాలకం | నలనర్తక సంకీర్ణం తధా పూజిత దైవతమ్‌ ||

సంపూజిత గృహం రామ| తధా పూజిత వానయమ్‌ | పౌరైరనుగతో రాజా సువేశైః ఫలపాణిభిః ||

అష్టమ్యాం వాద్యఘేషేణ తాంతుయష్టిం ప్రవేశ##యేత్‌ | క్రాక్ఛిరాస్తాం తతః కుర్యాత్‌ వసై#్త్రస్సంఛాతితాం శుభైః ||

పూజితాం పూజయేత్తాంతు యావత్సా ద్వాదశీ ఫలమ్‌ | ఏకాదశ్యాం సోమవాసః నృపః కుర్యాత్ప్రజాగరమ్‌ ||

సాంవత్సరేణ సహితో మంత్రిణా సపురోధసా | రాత్రౌ జాగరణం కార్యం నాగరేణ జనేనతు ||

ఆయష్టి అగ్రము నాల్గంగుళముల కించుక తక్కువ వైశాల్యము గలదిగా నుండిన సుఖప్రదమగును. మొదలెనిమిదంగుళమల కైవారముండలెను. ఆ కఱ్ఱను నఱకగానే నీటిలో బడవేయవలెను. ఆ నీళ్ళలోనుంచి తీసి నగరమునకు గొనిరావలెను. ఆ స్తంభమును నగర ప్రవేశము సేయునపుడు నగరమందు రాజమార్గమెల్ల నీళ్ళతో దడిపి ధ్వజపతాకాలంకారము పుష్పాద్యలంకారము సేయించవలెను. దేవతాపూజ సేసి నటనర్తక మంగళవాద్య పురస్సరముగ బూజించి ఇంద్ర దేవాగారముంగూడ బూజించి పండ్లు పూవులు జేతులంగొని చక్కని వేషములు దాల్చి పౌరులు వెంబడింప అష్టమినాడా యష్టిని (జెండాకర్రను) ప్రవేశ##పెట్టవలెను. తూర్పుమొగమై రాజు నూతన జశుభవస్త్రములచుత గప్పవలెను. దానిని ద్వాదశిదాక పూజించవలెను. ఏకాదశినాడు ప్రభువు ఉపవాసముండి జ్యౌతిషుకునితో మంత్రి పురోహితులతో పురప్రజలతో గూడ రాత్రి జాగరణము సేయవలెను.

స్థానేస్థానే మహాభాగ! దేయా ప్రేక్ష్యా తధా మధు | పూజయే న్నృత్యగీతేన రాత్రౌ శక్రం నరాధిపః ||

ద్వాదశ్యాంతు శిరఃస్నాతో నృపతిః ప్రయతస్తతః | యంత్రేణో త్థాపనం కుర్యాచ్ఛ క్రకేతోః సమాహితః ||

సుయంత్రితంతు తంకుర్యా ద్గృహంస్తంభ చతుష్టయమ్‌ | పూజయేత్తన్మహాభాగః గంధ మాల్యాన్న సంపదా ||

నిత్యంచ పటయోః పూజాం యష్ఠిపూజాంచ కారయేత్‌ | బలిభిస్తు విచిత్రాభిస్తధా బ్రాహ్మణ పూజనైః ||

నిత్యంచ జుహుయా న్మంత్రాన్‌ పురోధాః శాక్రవైష్ణవాన్‌ | నిత్యం నృత్యేన గీతేన తధా శక్రంచ పూజయేత్‌ ||

ద్వాదశ్యాం పూజయేద్రాజా బ్రాహ్మణాన్‌ ధన సంచయైః | విశేషేణ చ ధర్మజ్ఞ సాంవత్సర పురోహితౌ ||

ఉత్థానేచ ప్రవేశేచ శక్రో భూయా న్నరాధిపః | వక్ష్యమాణన మంత్రేణ కాలవిత్స పురోహొతః ||

పూజయే దుత్థితం కేతుం భూషణౖ ర్వివిధౌ రపి | ఛత్రేణచ తధా వసై#్త్రర్మాల్య దామైస్తధైవచ ||

నగరమం దూరేగించునపు డాయాచోట నాగియాగి యందఱు దర్శించునట్లు సేసి తేనె నివేదించి రాత్రియందు నృత్యగీతాదులతో నింద్రుని బూజింపవలెను. ద్వాదశినాడు శిరస్స్నానము సేసి మడిగట్టుకొని నరపతి దానిని యంత్ర సాధనముచే లేపవలెను. ఆ యింద్రగృహమును నాల్గు స్తంభములు నిలిపి చక్కని యంత్రములతో గూడిన ట్లొనర్చి గంధమాల్యాన్న సమృద్ధిగా బూజింప వలెను. నిత్యపూజ యా శచీంద్రపటములకు నింద్రధ్వజమునకు జేసి విచిత్రమైన పసుపుకుంకుమ మొదలయినవానిచే రంగురంగులు గల బలులొనంగి (నివేదనలిచ్చి) బ్రాహ్మణుల పూజగావించవలెను. పురోహితు డింద్రవిష్ణు దేవతాక మంత్రములతో నిత్యముహోమము గావింపవలెను. ద్వాదశినాడు రాజు ధనరాసులతో విప్రుల బూజింపవలెను. జ్యౌతిషికుని పురోహితునింగూడ విశేషముగ బూజింపవలెను. ఇంద్ర ధ్వజమెత్తినపుడు దానిని ప్రవేశము సేయించినపుడును విప్ర పురోహితులం బూజించిన రాజింద్రుడేయగును. లేపిన యింద్రధ్వజమును వివిధ భూషణములిడి పూజింపవలెను. ఛత్రచామరములు వివిధ గంధ మాల్యాదులచే నీపూజ సేయవలెను.

ఏవం సంపూజయే ద్రామః తదా దినచతుష్టయమ్‌ | పంచమే దివసే ప్రాప్తే శక్రకేతుం విసర్జయేత్‌ ||

పూజయిత్వా మహాభాగః బలేన చతురంగిణా | నీత్వా కరీంద్రై స్త్రితయంతతో నద్యాం ప్రవాహయేత్‌ ||

వాద్యఘోషేణ మహతా సంగీతం తత్ర కీర్తితమ్‌ ||

పౌరా జానపదాస్తత్ర క్రీడాం కుర్యుస్తదాలభసి | ఉత్సవం చ తధా కార్యం జలతీర గతై ర్మహత్‌ ||

ఏత ద్విధానం నృపతిస్తు కృత్వా | ప్రాప్నోతి వృద్ధిం ధన వాహనానామ్‌ ||

నాశం తధా శత్రుగణస్య రామః | మహ త్ప్రసాదం త్రిదశాధినామ్‌ ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయ ఖండే శక్రధ్వజోత్సవ వర్ణనం నామ పంచపంచాశదుత్తర శతతమో7ధ్యాయః

ఇట్లు నాల్గురోజులు పూజసేసి యైదవనాడు కేతువును (జెండాను) విసర్జింపవలెను. ఉద్వాసన సేయవలెనన్నమాట. చతురంగ బలములతోగూడి రాజు పూజించిన తరువాత గజేంద్రములచే శక్రశచీ పటములను ''శక్రయష్టిని'' మూటిని లాగించుకొని పోయి నదియందు వదలవలెను. మంగళవాద్యములతో గీతములతో నాట్యములతో పౌర జానపద ప్రజలానీటియందు జలక్రీడ లాడుదురు. ఆపై గట్టునకు వచ్చి యాప్రజలుత్సవము సేయవలెను. నరపతి యీ విధానమును జరిపి ధనవాహన సమృద్ధినందగలడు. శత్రుగణమును నశింపజేసికొనగలడు. దేవేంద్రదైవత్సమమయిన మహాప్రసాదమునుంబొందగలడు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున శక్రధ్వజోత్సవ వర్ణనమను నూటయేబదియైదవ అధ్యామయు.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters