Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూటయేబది యారవ అధ్యాయము - ఇంద్రధ్వజ నిమిత్త శమన వర్ణనము

పుష్కరః- ఇంద్ర ధ్వజశిరో భ##జ్యేత్పతే దింద్రధ్వజో యది | భజ్యతే శక్రయష్టిర్వా నృపతే ర్నియతం వధః ||

యంత్రభంగే తధా జ్ఞేయం రజ్ఞుచ్ఛేదే తధైవచ | మాతృకాయా స్తథా భంగే పరచక్రే భయం ద్విజః ||

దివ్యాన్తరిక్ష భౌమాఃస్యు రుత్పాతా స్తత్రవై తధా | తేషాం తీవ్రతమం జ్ఞేయం ఫల మత్యంత దారుణమ్‌ ||

నిలీయతే చేత్క్రవ్యాదః శక్రయష్టౌ యదాద్విజః | రాజావా మ్రియతే తత్ర సవాదేశో వినశ్యతి ||

పుష్కరుండినియె: ఇంధ్రధ్వజము తల విఱిగినను ధ్వజమే పడినను జెండాకర్ర విరిగినను నృపతి వధనందును. ధ్వజయంత్రము పగిలినను పగ్గము తెగినను మాతృకాభంగమైనను శత్రు భయమగును. (మాతృక=మూలము బీజాక్షర చిత్రము) దివ్యములు అంతరిక్షములు భౌమములునైన యుత్పాతములు గనిపించినచో వాని ఫల మత్యంత దారుణముగ నుండునని తెలియవలెను. ఇంధ్రధ్వజము కర్రమీద గ్రద్ధ వాలినచో రాజైన పోవును. రాజ్యమైన నశించును.

ఇంద్ర ధ్వజోపకరణం యత్కించి ద్ద్విజ సత్తమః | వినశ్యతి తదా జ్ఞేయా పీడా నగరవాసినామ్‌ ||

ఇంద్రవాజి నిమిత్తేతు ప్రాయశ్చిత్త మిదం స్మృతమ్‌ | ఇంద్రయాగం పుణం కుర్యాత్‌ సౌవర్ణేనేంద్ర కుతునా ||

రాజ్యం దత్త్వాచగురవే బంధనాని ప్రమోచయేత్‌| సప్తాహం పూజయిత్వాచ ధ్వజం దద్యాద్ద్విజాతిషు ||

శాన్తిరైంద్రీ భ##వేత్కార్యా యష్టవ్యశ్చ పురందరః | మహాభోజ్యాని కార్యాణి బ్రాహ్మణానాం దినేదినే ||

గావశ్చ దేయా ద్విజ పుంగవేభ్యో | హిరణ్య వాసో రజతైః సమేతాః ||

ఏవం కృతే శాన్తి ముపైతి పాపం ః వృద్ధిస్తధాస్యా న్మనుజాధిపస్య ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తర ద్వితీయ ఖండే ఇంద్రధ్వజ నిమిత్త శమనవర్ణనంనామ షట్పంచాశదుత్తర శతతమో7ధ్యాః ||

ఇంద్రధ్వజ సాధన మేకొంచెము నశించినను నగరవాసులకు పీడ గల్గును.

ఇంత్రవాజి నిమిత్తమునందు జేయవలసిన ప్రాయశ్చిత్తమిది:- బంగారముతో చేసిన యింధ్రధ్వజముతో నింద్రయాగము మకల చేయవలెను. గురువునకు రాజ్యమునిచ్చి బందీలను విడిచిపెట్టి ఇంద్రధ్వజమును సప్తాహ దీక్షతో బూజించి బ్రాహ్మణులకు దానములు సేయవలెను. ఐంద్రీ శాంతి (ఇంద్రదేవతా శాంతి) సేయవలెను. ఇంద్రయాగము కర్తవ్యము. బ్రాహ్మణుల కెల్లరకు షడ్రసోపేత భోజనములు పెట్టవలెను. బ్రాహ్మణోత్తములకు బంగారము, వెండి, వస్త్రములతో గోవుల నీయవలెను. ఇట్లు సేసిన పాపము శాంతి నొందును. మనుజాధిపునకు వృద్ధియునుం గల్గును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున ఇంద్రధ్వజ నిమిత్త శమనవర్ణనమను నూటయేబది యారవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters