Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట ఏబదిఏడవ అధ్యాయము - ఇంద్రధ్వజపూజా - మంత్ర ఇంద్రస్తుతి వర్ణనము

రామః- శక్రోచ్ఛ్రాయేతు యా స్వంత్రాన్సో పవాసోనృపః వదేత్‌ | తానహంశ్రోతు మిచ్ఛామి సర్వధర్మభృతాంవరః ||

పుష్కరః-శృణుమంత్రా నిమాన్‌ సమ్యక్‌సర్వ కల్బిషనాశనాన్‌ | ప్రాప్తే శక్రధ్వజోచ్ఛ్రాయే యఃపఠే త్ప్రయతోనృపః ||

వరస్త్వింద్రజితా! మిత్రః వృత్రహన్‌ ః పాకశాసనః దేవదేవః మహాభాగః త్వంహి వర్ధిష్ణుతాం గతః ||

త్వంప్రభుః శాశ్వతశ్చై సర్వభూతహితే రతః |

అనన్తతేజో విరజో యశోవిజయవర్ధనః | అప్రభుస్త్వం ప్రభుర్నిత్య ముత్తిష్ఠః సురపూజితః ||

బ్రహ్మాస్వయంభూ ర్భగవాన్‌ సర్వలోక పితామహః | రుద్రఃపినాక భృద్దృప్త శ్చతసృ ద్వయసంస్తుతః ||

ఇంద్ర ధ్వజమెత్తునపుడేయే మంత్రములు పఠింప వలయునవి వినదలతును సర్వజ్ఞ! యని రాముండడుగ పుష్కరుండిట్లనియె. విను మీ మంత్రములు సర్వపాపహరములు. ఇంద్ర ధ్వజోచ్ఛ్రాయమపుడు రాజు నియమవంతుడై పఠింప వలసినవి. ఓ ఇంద్ర! శత్రుంజయ! వృత్రహ! పాకశాసన! దేవదేవ! మహాభాగ! నీవు వర్ధష్ణుడవు వృద్ధిని గోరువాడవు. శాశ్వత ప్రభువు నీవు సర్వభూత హితాభిలాషివి, అనంత తేజిస్వివి. విరజస్కుడవు (నిర్మలుడవు) యశోవిజయవర్దనుడవు. నీమీద మఱి ప్రభువు లేడు. దేవపూజిత! నిత్యప్రభూ! లెమ్ము! నిలుపుము.

యోగస్యనేతా కర్తా చ విష్ణురురుక్రమః | తేజస్తేవర్ధయన్త్యేతే నిత్యమేవ మహాబలాః ||

ఆనాది నిధనో దేవో బ్రహ్మాస్రష్టా సనాతనః | అగ్నిస్తేజోమయో భాగో రుద్రాత్మా పార్వతీసుతః ||

కార్తికేయశ్శక్తిధర ష్షడ్రవక్త్రశ్చ గదాధరః | శతంవరేణ్యో వరదస్తేజో వర్ధయతాం విభుః ||

దేవస్సేనాపతిః స్కన్దః సురప్రవర పూజితః | ఆదిత్యావసవో రుద్రాః సాధ్యా దేవాస్తధాశ్వినౌ ||

భృంగురంగిరస శ్చైవ విశ్వేదేవా మరుద్గణాః | లోకపాలా స్త్రయశ్చైవ చంద్ర స్సూర్యో7నలో7నిలః ||

దేవాశ్చ ఋషయ శ్చైవ యక్షగంధర్వ రాక్షసాః | సముద్రాగిరయ శ్చైవ నద్యోభూతాని యానిచ ||

తేజస్తపాంసి సత్యం చ లక్ష్మీః శ్రీః కీర్తిరేవ చ | ప్రమర్ధయతు త్వత్తేజో జయః శక్రః శచీవతే |

నీవు బ్రహ్మవు, రుద్రుడవు, సర్వలోక సృష్టికర్తవు, పినాకమను ధనుస్సు ధరించినవాడవు. అష్ట దిక్కులచే స్తుతింపబడు వాడవు. యోగ భర్తవు యోగ కర్తవును, ఉరుక్రముడగు (త్రివిక్రముడగు) విష్ణువవు. ఈ మహాబలము లన్నియు నిత్యము తేజస్సును పెంపొందించును. ఆద్యంతములు లేని వాడవు. బ్రహ్మవు. సనాతనుడవు. తేజోమయుడవగు నగ్నివి. రుద్రస్వరూపుడవు. పార్వతీ సుతుదవు, కృత్తికా కుమారుడవు, శక్తి ధరుడవు, షడాననుడవు. నీవు గదాధరుడవు. శతవరేణ్యుడవు, వరదుడవు. తేజో వర్ధనులకు విభుడవు. సేనాపతిని, స్కందుడవు. సురశ్రేష్ఠ పూజితుడవు, ఆదిత్యులు వసువులు రుద్రులు సాధ్యులు అశ్వినీ దేవతలు భృగువు అంగిరసుడు విశ్వేదేవులు మరుద్గణములు లోకపాలురు త్రిమూర్తులు చంద్రసూర్యాగ్ని వాయుదేవతలు దేవతలు ఋషులు యక్ష గంధర్వ రాక్షసులు సముద్రాలు పర్వతాలు నదులు సర్వభూతమలు తేజస్సు తపస్సులు సత్యము అక్ష్మీ శ్రీకీర్తియు నీవ. నీ తేజస్సది ప్రవృద్ధి నందు గాక! శచీపతీ! శక్ర! జయింపుము.

తవచాపిజయా న్నిత్యంత్విహ సంపద్యతే శుభమ్‌ | ప్రసీదఃరాజ్ఞాం విప్రాణాం ప్రజాన మపి సర్వశః ||

తవప్రసాదాత్‌ వృధీవీ నిత్యం సస్యవతీ భ##వేత్‌ | శివం భవతు నిర్విఘ్నం శమ్యతామే తయో భృశమ్‌ ||

నమస్తే దేవదేవేశః నమస్తే బలసూదనః నముచిఘ్నః నమస్తే7స్తు సహస్రాక్షః శచీవతేః

సర్వేషా మేవలోకానాం త్వమేకా పరమా గతిః | త్వమేవ పరమఃప్రాణః పర్వస్యాస్య జగత్పతేః ||

పాశీహ్యపి పయః స్రష్టుం త్వమనల్పం పురందర | త్వమేవ మేఘస్త్వమగ్ని ర్వైద్యుతోంబరే ||

త్వమత్రమేధా విక్షిప్తా త్వమ్మేబాహుః ప్రతర్దనమ్‌ | త్వంవజ్ర మతులం ఘోరం ఘోషవాంస్త్వం బలాహకః ||

నీవు జయించుట వలన నిహలోకమందెల్లప్పుడు శుభము సంపన్నమగును. రాజులకు విప్రులకు ప్రజలకు సర్వవిధముల ననుగ్రహము సూపుము. నీయనుగ్రహము వలన వృథివి నిత్యనస్యవతి యగుగాక! నిర్వఘ్నముగ శివమగుగాక! బాధలెల్ల శమించు గాక! దేవదేవేశ! బలారీ! నీకు నమస్కారము. శచీపతీ! నీకు నమస్కారము. సర్వలోకమునకు నీవేకైక గతివి. జగత్పతీ! ఈసర్వజగత్తునకు నీవు పరమప్రాణమవు. అధిక వయస్సృష్టికి (జలోత్పాదనకు) నీవు పాశివి=వరుణుడవు. నీవే మేఘము, వాయువు. అగ్ని ఆకసమందు మెఱుపు. నీవీలోకమందెల్లడ జిమ్ముకొన్న మేధ నీవు. నీవు నా బాహువవు. ప్రతర్దనము=ఘోరవజ్రమ నీవు. గర్జించెడి మేఘము నీవు.

స్రష్టా త్వ మేవలోకానాం సంహర్తా చా పరాజితః | త్వంజ్యతోతిః సర్వలోకానాం త్వమాదిత్యో విభావసుః |

త్వం మహద్భూత మాశ్చర్యం త్వం రాజాత్వం సురోత్మః | త్వం విష్ణుస్త్వం సహస్రాక్షస్త్వం దేవస్త్వం పరాయణమ్‌ ||

త్వమేవ చా మృతం దేవస్త్వం మోక్షః పరమార్చితః త్వంముహూర్తః స్థితిస్త్వంచ లవస్త్వంచ పునః క్షణః ||

శుక్లస్త్వం బహుళ##శ్చైవ కళాకాష్టా త్రుటి స్తధా సంవత్సరర్తవో మాసాః రజన్యశ్చ దినాని చ ||

త్వముత్తమా సగిరిచరా వసుంధరా సభాస్కరం తిమిర మంబరం తధా |

మహోదధి స్సతిమింగిల స్తధా మహోర్మిమాన్‌ బహుమకరో ఝషాకులః ||

మహాయశాస్త్వమిహ సదా చ పూజ్యసే మహర్షిభి ర్ముదిత మనా మహర్షిభిః ||

అభిష్టుతః పిబసి చ సోమ మధ్వరేహుతాన్యపి చ హవీంషి భూతయే ||

లోకస్రష్టపు పరాజితుడు గాని లోక హర్తవు నీవు. నీవు సర్వలోకముల జ్యోతివి. (వెలుగు) ఆధిత్యుడవు. అగ్నివి నీవు. నీవు వింతైన మహాభూతమవు. నీవు రాజవు. సురోత్తముడవు. విష్ణువవు. సహస్రాక్షుడవు. నీవు పరాయణమైన దేవుడవు. నీవే అమృతము, దేవుడవు నీవు. పరమార్చితుడవు మోక్షమీవే. నీవు ముహూర్తము. స్థితి నీవ. లవము నీవు. క్షణమువీవ. శుక్లపక్షము, బహుళ పక్షమీవు. కళా-కాష్ట తృటి. సంవత్సరము, ఋతువులు, మాసములు, రాత్రిపగలు నీవు. నీవు సవర్వత చరాచర వసుంధరవు. భాస్కరునితోడి చీకటివి నీవు. యంబరము నీవ. తిమింగల బహుమకర మత్స్యమహోర్మి వ్యాకులమగు మహోదధివి నీవ. నీవు మహాయశస్వివి. మహర్షులచే సదా పూజింపబడుచున్న మహర్షులచే నెల్లపుడానందభరిత మనస్సుగల వాడవు. లెస్సగాస్తుతింపబడి యజ్ఞములందు సోమముం ద్రావుదువు. హోమము సేయబడిన హవిస్సులను నైశ్వర్యము కొఱకు కారగింతువు.

త్వంవిపై#్రః పతత మిహేజ్యసే ఫలార్థం భేదార్థే ష్విష్టిసు బలౌ గీయసేత్వమ్‌ |

త్వద్దేతో ర్యజన పరాయణా ద్విజేంద్రాః వేదాంగా న్యధి గమయన్తిసర్వవేదైః ||

వజ్రస్యభర్తా భువనస్య గోప్తా వృత్రస్య హర్తా నముచే ర్నిహన్తా |

కృష్ణేవసానో వసనే మహాత్మా సత్యానృతే యో వివినక్తి లోకే ||

నీవు లోకముందెల్లపుడును ఫలాపేక్షకులైన బ్రాహ్మణులచే నిత్యము యజింపబడుదువు. బలనిధీ! భిన్న భిన్న ప్రయోజనములు కల ఇష్టులందు కీర్తింపబడుదువు. నీనిమిత్తమై బ్రాహ్మణోత్తములు యాగ పరాయుణులై వేదవేదాంగములను అధ్యయనము చేయుదురు. వజ్రభర్తవు (భరించు వాడవు). భువన గోప్తవు. వృత్రహర్తవు. నముచి సంహర్తవు. మహాత్ముడవు. నీవు రెండు నల్లని వసనములదాల్చి లోకమునందు సత్యమును అనృతమును వివేచనము సేయుదువు.

యం వాజినం గర్భమపాం సురాణాం వైశ్వానరం వాహన మభ్యుపైతి |

నమస్సదాసై#్మ త్రిదివేశ్వరాయ లెకత్రయేశాయ పురందరాయ ||

అజో7వ్యయః శాశ్వతేకరూపో విష్ణుర్వరాహః పురుషః పురాణః ||

త్వమన్తకః సర్వహరః కృశానుః సహర్షశీర్షా శతమన్యు రీడ్యః ||

నీటికి గర్భమగు బడబాగ్ని రూపుడగు అగ్నిని దేవతలకు వాహనము (ఆజ్యాది హవిస్సులను చేర్చుదానిని)గ స్వీకరించిన స్వర్గాధీశ్వరుడును త్రిదివాధికుడును త్రిలోకాధిపుడును శత్రుపట్టణ విధ్వంసకుడునగు నా దేవేంద్రునకు నెల్లప్పుడు నమస్కారము. నీవు అజుడవు. అవ్యయుడవు. శాశ్వతుడవు. ఏకరూపుడవు. వరాహుడవు, పురాణపురుషుడవు. అంతకుడవు. కృశానుడవు. (అగ్ని) సంహర్తవు. సహస్ర శీర్షుడవు. శతమన్యువవు. ఈడ్యుడవు (స్తుతింపబెడువాడవు).

కవిం సప్తజిహ్వం త్రాతారమింద్రం సవితారం సురేశమ్‌ |

హృదయాభిశక్రం వృత్రహణం సుషేణ మస్మాకం వీరా ఉత్తరేభవంతు ||

త్రాతార మింద్రేంద్రియ కారణాత్మన్‌! జగత్ప్రధానం చ హిరణయగర్భమ్‌ ః

లోకేశ్వరం దేవవరం వరేణ్యం చా నందరూపం ప్రణతో7స్మి నిత్యమ్‌ ||

ఇమం స్తవం దేవవరస్య కీర్తయేత్‌ మహాత్మన స్త్రిదశపతేః సుసంయతః |

అవాప్య కామాన్‌ మనసో7భిరామాన్‌ స్వర్లోక మాయాతి చ దేహభేదే ||

ఇతి శ్రీవిష్ణధర్మోత్తరే ద్వితీయ ఖండే సప్త పంచాశదుత్తర శతతమో7ధ్యాయః ||

కవిని సప్తజిహ్వుని రక్షకుని ఇంద్రుని నాకేశుని హృదయాభిశక్రుని వృత్రసంహర్తను సుషేణుని (నిన్ను స్తుతింతునన్నమాట) స్తుతింతును. మాకు ముందు వీరుందురు గాక! మాముందు రక్షకులుగా నడతురు గాక అన్నమాట. ఓ ఇంద్ర ఇంద్రియ కారణస్వరూపా! జగత్ప్రధానుని హిరణ్య గర్భుని లోకేశ్వరుని దేవవరుని వరేణ్యుని ఆనంద రూపుని నిన్ను గూర్చి నిత్యము ప్రణతుడ నగుచుంటిని. త్రిదశపతి మహానుభావుడునగు దేవేశ్వరునియొక్క యీ స్తోత్రమును నియమవంతుడై యెవ్వడు కీర్తించునో నాతడు మనస్సలో గోరిన మనోహరములైన అన్ని కోరికలం బొంది దేహమువీడి స్వర్లోలోకమున కరుదెంచును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున

యింద్రధ్వజ పూజా మంత్ర-ఇంద్రస్తుతి వర్ణనము నూటయేబదిఏడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters