Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట అరువదిరెండవ అధ్యాయము - సంవత్సరాభిషేకాధ్యాయము

రామః - సంవత్సరాభిషేకంచ కధయస్వ మహీభృతః | తత్రమే సంశయం దేవ! త్వంహి సర్వం విపశ్యసి ||

పుష్కరః - రాజాభిషేక నక్షత్రే ప్రతిసంవత్సరం ద్విజః | పూర్వాభిషేక విధినా కర్తవ్య మభిషేచనమ్‌ ||

ధన్యం యశస్యం రిపునాశనంచ | సౌభాగ్యదం పుష్టి వివర్ధనంచ ||

వర్షాభిషేకం నృపతేః ప్రదిష్టం | సౌఖ్యావహం రాజ్య వివృద్ధిదంచ ||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తర ద్వితీయ ఖండే సంవత్సరాభిషేకాధ్యాయో నామ ద్విషష్ట్యుత్తర శత తమో7ధ్యాయః ||

పరశురాముడు నృపతికి గావించవలసిన సంవత్సారభిషేకముం గూర్చి యానతిమ్మన బుష్కరుం డిట్లనియె. రాజునకు పట్టాభిషేకము జరిగిన నక్షత్రమందు బ్రతి సంవత్సరము మొదట పట్టాభిషేకము కర్తవ్యము. ఈ ప్రతి సంవత్సర పట్టాభిషేకము రాజునకు ధన్యతా సంపాదకము యశస్కరము, శత్రుహరము, సౌభాగ్యకరము పుష్టివర్ధనము, సౌఖ్యావహము రాజ్య వివృద్ధి ప్రదముని జెప్పబడినది.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున సంవత్సరాభిషేకాధ్యాయము నూటఅరువదిరెండవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters