Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట అరువదినాల్గవ అధ్యాయము - శకున వర్ణనము

పుష్కరః- తిష్టతో గమనే ప్రశ్నే పురుషస్య శుభా శుభమ్‌ | నివేదయన్తి శకునా దేశస్య నగరస్యచ ||

పథిపాన్థో నృపసై#్సన్యే మరీచోద్దిశ్య దేవతామ్‌ | సార్ధే ప్రధానః సామ్యేచ జాతి విద్యా వయోధికః ||

సర్వపాపఫలో దీప్తః శాన్తః శుభఫలో మతః | షట్‌ ప్రకారా వినిర్దిష్టాః శకునానాంచ దీప్తతా ||

వేలా దిగ్దేశ కరణం సతుజాతి విభేదకః | పూర్వా పూర్వాచ విజ్ఞేయా సాతేషాం బలవత్తరా ||

దివాచరో రాత్రిచర స్తథా రాత్రౌ దివాచరః | క్రూరస్య వేలాదీప్తస్య ఖలర్‌క్ష నిగ్రమాదిషు ||

ధూమితా సాతు విజ్ఞేయా యాంగమిష్యతి భాస్కరః | యస్యాం స్థితః సాజ్వలితా ముక్తా చాంగారిణీ మతా ||

ఏతా స్తిస్రః స్మృతా దీప్తాః పంచ శాన్తా స్తధా పరా | దీప్తాయాందిశి దిగ్దీప్తః శకునఃపరికీర్తితః ||

ప్రయాణపు ప్రశ్నలోనున్న పురుషునకు రాజునకు కనబడు శకునములు రాజ్యముయొక్క రాజధానికి గలుగబోవు శుభమును అశుభమును దెలుపుచుండును. బాటలో బాటసారి, సేనయందు రాజు, వర్తకుల గుంపులో ప్రధాన వ్యాపారి, సముల యందు జాతిచేతను, విద్యచేతను, వయస్సుచేతను, నధికుడైనవాడును నీ శకునము నివేదింపవలెను. వానింబట్టి తక్కిన వారి శుభా శుభ ఫలానుభవ మాధరాపడియుండు నన్నమాట. దీప్తశకునము=దుశ్శకునమన్నమాట. అది సర్వపాపములయొక్క ఫలరూపము. శాన్తశకునము శుభశకున మన్నమాట. శుభఫలప్రదము. దుశ్శకునములు యొక్క రీతు లాఱు రకములు. సమయము, దిక్కు దేశము, ప్రయాణ సాధనము అనువానినిబట్టి యేర్పడునవి. ఆయా శకునముల రకాలననుసరించి వాని ముందు వెనుకలు వాని బలా బలములను దెలియనగును. రాత్రి సంచారము సేయునవి పగలు చరించుట పగలు తిఱుగునవి రాత్రి సంచారము సేయుట దుష్టగ్రహ నక్షత్రములలో ఆయా క్రూర (పాప) గ్రహాదులయొక్క వేళ దీప్త శకున లక్షణము సూర్యుడేగిన దిశను ధూమచయం నిలిచిన ధూపిత సూర్యుడు నిశ్చలముగా నిలిచిన దిశను జ్వలితయని, సూర్యుడు విడిచిన దిశను అంగారిణియనియు నందురు. ఈ మూడు రకాల శకునములు దీప్తములు (క్రూరములు) ఇంకొక మైదు శాంత శకునములు దీప్త శకునముతో దిశయందేర్పడునది దిగ్దీప్త శకునమనబడును.

గ్రామ్యే వన్యో వనేగ్రామ్యః తధా నిందిత పాదపే | దేశేచైవ శుభేజ్ఞేయో దేశదీప్తో ద్విజోత్తమః ||

క్రియాదీప్తో వినిర్దిష్టః స్వజాత్యనుచిత క్రియః | తతోదీప్తశ్చ కధితో భిన్నభైరవ నిస్వనః ||

ప్రతిదీప్త స్తథా జ్ఞేయః కేవలం మాంస భోజనం | దీప్త శాన్తో వినిద్దిష్టః సర్వైః భేదైః ప్రకీర్తితః ||

మిశ్రైర్మిశ్రో వినిర్దిష్ట స్తతో వాచ్యం బలాత్ఫలమ్‌ ||

గో7శ్వోష్ట్ర గర్దభశ్వానః శారికా గృహగొధికే | నటి కేషాంస చర్మాద్యేపాం కథితా గ్రామవాసినః ||

అజా7వి శుక నాగేంద్రఖరా మహిషవాయసౌ | గ్రామ్యా7రణా వినిర్దిష్టాః సర్వే7న్యే వనగోచరాః ||

గ్రామమునందు గలవానియందు వన్యలక్షణమలు వనములందుడు వాని యందు గ్రామ్య లక్షణములు గనబడును చెట్లు విపరీతముగ చెడిపోయినప్పుడు నా దేశమునందు గోచరించునది అశుభదీప్తము (దుశ్శకునము). దేశదీప్త మనబడును. తన జాతి కుచితములుగాని క్రియలు జరుగుట క్రియాదీప్తములు. భిన్న భిన్న (భైరవ) భయంకరదోషము ఆగి ఆగి క్రూరజంతువులు మొదలయిన అఱపులను క్రియాదీప్తమనబడును. ప్రతిదీప్తమను దుశ్శకునము కేవల మాంసభోజనము. దీప్త శాన్తమనబడును. శుభాశుభ మిశ్రమన్నమాట. దీప్త వాంత మిశ్ర శకునములయినపుడు ఫలము శుభాశుభ మిశ్రమముగ నుండును. గోవులు, గుఱ్ఱములు, ఒంటెలు, గార్ధభములు, కుక్కలు, గోరువంక, గృహగోధికా=బల్లి, మొదలగునవి గ్రామ్యములు మేకలు, గొఱ్ఱలు, చిలుకలు, ఏనుగులు, ఖరములు, రాబందు, గేదెలు, కాకి యనునవి గ్రామ్యారణ్యములు, మిశ్రజాతి యన్నమాట. తక్కినవి వన్యములు. (అడవి జంతువులు)

మార్జరక్త కృపోగ్రామ్య స్తధాన్యో వనగోచరే | సర్వే7 ప్యేవేతి విజ్ఞేయా నిత్యం రూప విభేదతః ||

శ్రీకంఠ శిభి చక్రాహ్వాః యేచ హారీత వాయసాః | కులాల కుక్కుట శ్యేన ఫాంటవం జల వానరాః ||

శశఘ్న చటక శ్యామా శ్చావభాస కపింజలాః | తిత్తిరిః శత పత్రశ్చ కపోతాశ్చ తధా త్రయః ||

ఖంజరీటక దాత్యూహ శుకాండీవహ తిక్తకాః | భారద్వాజశ్చ సారంగ ఇతి జ్ఞేయా దివాచరాః ||

శ్రీకంఠ=కోకిల, నెమలి, చక్రవాకము, హారీతము=పావురము, కాకులు, కులాలము కుక్కుటము=కోడిశ్యేనము=డేగ, ఫాంటవము, జలవానరము, శశఘ్నము, చటకము, శ్యామము, చాపము, భాస, కపింజలము, తిత్తిరి, శతపత్రము, కపోతము, ఖంజరీటకము, దాత్యూహము, శుకాండీవహము: తిక్తకము, భారద్వాజము, సారంగము ఇవి పగటివేళ చరించు పక్షులు.

వల్గుల్యులూకః శశకా శరభోత్కోశ పిచ్ఛతౌ | మూషికా పింగళీ కాకః కథితా రాత్రిచారిణః ||

వల్గులి; ఉలూకము, శశకము, శరభము, ఉత్కోశము, పిచ్చలము, మూషికము, పింగలికాకము ఇవి రాత్రియందు తిరుగు పక్షులు.

హంసాజ మృగ మార్జార నకులర్ష భుజంగమాః | వృకశ్చ సింహ వ్యాఘ్రోష్ట్రశ్వ సూకర తురంగమాః ||

శ్వావిత్పృధుత గోమాయు ఘృతకోకిల సారసాః | తురంగమో ద్వీపినరా శ్చోరా ఉభయ చారిణః ||

హంస, అజ, మృగ, మార్జారము, నకులము, భుజంగము=పాపము, పృకము=తోడేలు, సింహము, వ్యాఘ్రము, ఒంటె; గుఱ్ఱము, పంది, శ్వావిత్తు, పృథంతము, గోమాయువు=నక్క, ఘృతము, కోకిల, సారసము=బెగ్గురు, తురంగము, ద్వీపి, నరులు, దొంగలు, రాత్రి పగలుం దిరుగునవి.

రణ ప్రస్థానయో స్సర్వే పురస్తాత్‌ సంగచారిణః | జయావహా వినిర్దష్టాః పశ్చా ద్వాజయకారిణః ||

గృహేగమ్యో యదా చాయం వ్యాహరేత్‌ పురత స్థ్సితః | నృపావమానం వదతి వామః కలహభోజనే ||

యానే తద్దర్శనంధన్యం సపతంగస్య చాప్యధ | చోరైర్దోష మధాఖ్యాతి మయూరో భిన్ననిస్వన ||

వమతే కపిల శ్రేష్ఠతధా దక్షిణ సంస్థిత | వృష్ఠతో నిందిత ఫల తిత్తిరి స్తత్య్రశస్యచే ||

యుద్ధమందు, యుద్ధయాత్రయందు నివి ఎదుట దగ్గరగాకూడి చరించిన యెడల జయమిచ్చును. వెనుక వచ్చిన యెడల నోటమినిచ్చును. ఇంటినుండి వెడలవలసినపుడీ రాజునకెదుట నున్నవాడు రాజావమాన ప్రసంగము చేసెనేని యది కలహ భోజన మునకు (అనగా కయ్యమునకు కాలుద్రవ్వుటకు) ప్రతికూల శకునము. యాత్రయందు, ప్రయాణమందు చేతితో పక్షిని బట్టుకొని యెవ్వడేని యెదురువడెనేని విజయమగును. నెమలి భిన్న స్వరముగ గేకవేయునేని యాత్రయందు దొంగల బెడదను. సూచించును. శ్రేష్ఠమయిన కపిలః=పింగళవర్ణముగల యెద్దు, తిత్తిరిః=తీతువుపక్షి దక్షణమునైపు (కుడివైపు) రెట్టవేసినచో శుభఫల మిచ్చును. వృష్ఠభాగమున (తనవెనుక) నయినచో శుభఫలమగును.

ఏణా వరాహాః వృషతో వామాభూత్వాతు దక్షిణాః | భవన్త్యర్థకరా నిత్యం విపరీతా విగర్హితాః ||

వృకాశ్చ జంబుక వ్యాఘ్ర సింహామార్జారగర్దభాః | వాఛితార్థకరా జ్ఞేయా దక్షిణా ద్వామభాగగాః ||

శివాశ్యామారలా చ్ఛుః పింగలా గృహగోధికాః | సూకరీ పరిపుష్టా చ పుంనామానశ్చ వామతః ||

శ్రీసంజ్ఞా చాషభషక కపి శ్రీకర్ణ ఛిక్కరాః | కపి శ్రీకర్ణ పిప్పీకా రురుశ్యేనాశ్చ దక్షిణాః

లేళ్ళు, పందులు, పృషతః=తెల్లచుక్కల దుప్పిలు ఎడమనుంచి కుడివైపునకు పోయినచో శుభఫలమిచ్చును. ఇందుకు వ్యతిరేకమయినచో నశుభమునిచ్చును. తోడేళ్ళు, మగనక్కలు, పులులు, సింహములు, పిల్లులు, గాడిదలు, కుడివైపునుండి యెడమ వైపునకు పోయినచో నభీష్టఫలసిద్ధి ప్రదములు. నల్లని నక్క, చుంచు, పింగలవర్ణముగల బల్లి, పంది, కోకిల (మగవి ఆగవికూడ), ఎడమ నుండి కుడిగా బోవుట శుభము. శ్రీసంజ్ఞ=సాలెపురుగు, చాష=పాలపిట్ట, భషక=కుక్క, కపి, శ్రీకర్ణ, ఛిక్కర, పిప్పిక=పక్షి విశేషము చారు, శ్యేన=డేగ, ఆడుకాటుకపిట్ట కుడినుండి యెడమవైపుకు పోవుట శుభశకునము.

జాహకాహి శశక్రోడ ఘోధానాం కీర్తనం శుభమ్‌ | తతః సందర్శనంనేష్టం ప్రతీపం వానరర్షయోః ||

ఫలకృత్‌ పూర్వ శమనః ప్రస్థితస్య చ యో7న్వహమ్‌ | భ##వేత్తస్యఫలం వా7న్య త్తదేవ దివసం బుధైః ||

జాహక=నల్లతొండ, అహి=పాము, శశము=చెవులపిల్లి, క్రోడము=పంది, గోధ=ఉడుము అనువానింబేర్కొనుట శుభము. అంతకంటె కనిపించిన యదియు మంచిది. కోతి, ఎలుగుబంటి అశుభము. ప్రయాణమందియిన తొలిశకునమే యా రోజంతయు ఫలమిచ్చును. ఆమీద నేశకునమయిన నది ఫలమీయదు.

మత్తాభిక్షార్థినో బాలా విరక్తాభా స్తధైవచ | సీమాన్త నద్యన్తరితా విజ్ఞేయాః నిష్ఫలా ద్విజ! ||

ఏకద్విత్రి చతుర్భిస్తుశివా ధన్యా తతో భ##వేత్‌ | పంచభి శ్చ తధా షడ్భిరధన్యాః పరికీర్తితాః

సప్తభిశ్చ తధా ధన్యా నిష్ఫలా పరతో భ##వేత్‌ | నృణాం రోమాం చ జననీ వాహనానాం భయప్రధా ||

జ్వాలాననా సూర్యముఖీ విజ్ఞేయా భయవర్ధినీ | ప్రధమం శార్జకేదృష్టే శుభేదేశే శుభం భ##వేత్‌ ||

మత్తులు, బిచ్చగాండ్రు బాలురు=ఆజ్ఞానులు విరక్తులుకాక విరక్తలైనట్లు వేసములు వేయువారు, గ్రామము సరిహద్దుగాని నదినగాని మధ్యనున్మనచో యది నిష్ఫలము. ఒకటి రెండు నాల్గు శకునములు నాల్గు రోజులు శుభఫలమిచ్చును. అయిదవది ఆఱవది శుభఫలమీయవు. శుభ శకునము శుభఫలమిచ్చును. ఏడవది ధన్యము. ఎనిమిదవది. మొదలాపైని ఫలమీయవు. మానవులకు గగుర్పాటు గల్గించునది, వాహనములకు జడుపు గూర్చునదియునై జ్వాలాయుఖి సూర్యముఖియు భయముంబెంచును. శుభప్రదేశమందు మొదలు ధనుర్ధారి గనిపించిన శుభమగును.

సంవత్సరం మనుష్య స్యహ్యశుభే చాశుభం తధా | యథావిధి నరఃపశ్యన్‌ శమనం ప్రధమే7హని ||

ఆత్మనశ్చ తధాతేన జ్ఞాతవ్యం వత్సరం ఫలమ్‌ | శార్జకం చ నరో వృష్ట్యా భుజంగమ శిరోగతః ||

ఈ శకున ఫలితమలు మానవున కొక సంవత్సరముదాకే గల్గుచుండును. మానవుడు యాత్రాప్రధమదినమందు చక్కగా గమనించి దాని ననుసరించి తన సంవత్సరఫలము గ్రహింపవచ్చును. పాము పడగనున్న విల్లును జూచెనేని (విల్లు రూపమున నున్న గుర్తు) మనుజుడు తాననుకొన్న దేదైనంబొందును.

అవశ్యం తదావాప్నోతి యత్కించి న్మనసే చ్ఛతి | విశన్తి యేన మార్గేణ వాయసా బహవఃపరమ్‌ ||

తేన మార్గేణ వై తస్య పురస్య గ్రహణం భ##వేత్‌ | సేనాయం యది వాసార్ధే విసష్టో వాయసో భ##వేత్‌ ||

వాసోభయాయ రాత్రష్థో భయం వదతి దుస్తరమ్‌ | ఛాయంగ వాహనోపాన చ్ఛత్రవస్త్రాది కుంఠనైః ||

మృత్యు స్తత్పూజనే పూజా, తద్విష్టాకరణ శుభమ్‌ | ప్రోషితామగ కృత్కాకః కుర్వన్‌ ద్వారి గతా గతమ్‌ ||

రక్తం దగ్ధం గృహే ద్రవ్యం విక్షిపన్‌ వహ్నివేదకః | న్యసేద్రజం పురస్తాచ్ఛే న్నివేదయతి బంధనమ్‌ ||

పీతద్రవ్యం తధా రుక్మం రూప్యం శ్వేతంతు భార్గవ! యశ్చైవోపల భేద్ద్రవ్యం తస్య లబ్ధిం వినిర్ధిశేత్‌ ||

ద్రవ్యం చోపనయే ద్యత్తు తస్య హానిం ద్విజోత్తమః | తరతో ధనలబ్ధిః స్యాద్రామః మాంసస్య భక్షణ ||

కాకి శకునాలు:- ఏ దారిని పెక్కుకాకులు పురములోనికి బొవుచుండు నా దారిపోయి రాజాపురమును ముట్టడించవెను. కాకి పోని జాడలోనేగి సేనకుగాని తనకుగాని నివాసమేర్పరచుకొన్నచో నక్కడ రాత్రి నిలిచినచో నది దుస్తరభయమును గల్పించును. కాకిపై వ్రాలి నీడకల్పించుట, తన మేనిని రాజ వాహనములను, పాదుకలను, ఛత్రమును, మస్త్రాదులను ముక్కుతో పొడుచుట వలన మృత్యువగునని, వానిని పూజించిన పూజ గల్గునని, వానిపై నది రెట్టవేసిన శుభము కలుగునని చెప్పవలెను. ద్వార మందు కాకి యెగిరిపోవుచు వచ్చి వ్రాలుట ప్రవాసగతుని రాకను సూచించును. ఇంటిలో ఎఱ్ఱని ద్రవ్యమునుగాని, కాలినదానినిగాని చిమ్ముచున్న కాకి అగ్నిభయము సూచించును. పరాగమును ముందునకు చిమ్ముచున్న కాకి బంధనమును సూచించును. గుమ్మము ముందు బెట్టిపోయినను నాయజమానికి బంధనమగునని తెలియపరచును. పచ్చనివస్తువు బంగారము. తెలుపువస్తువు వెండియు లభించెనేని యా లభించినవానికి లాభము రానున్నదని. ఆ వస్తువునది పట్టుకొనిపోయెనా యాతనికి హాని గల్గునని ఫలముజెప్పవలెను. కాకి మాంసమును దిన్నచో శత్రువునుండి ధనలాభముం జెప్పవలెను.

శ్రీలబ్ధిః స్యాన్మృగక్షేపే రాజ్యం రత్నార్పణ మహత్‌ | యాతుః కాకో7నుకూలస్థః క్షేప్యః కర్ణసమో భ##వేత్‌ ||

నన్వర్థ సాధకోజ్ఞేయః ప్రతకూలో భయావహః ||

యాత్ర వెడలు రాజునకెదుట కాకి యేదేని మృగమును (మాంస రూపములో) ముక్కునంగఱచుకొని పడవేసిన శ్రీలాభము. రత్నమేదేని పడవైచిన మహారాజ్యలాభము గూర్చును. కాకి యనుకూలముగా వచ్చి (ప్రతికూలముగా వచ్చి వ్రాలకుండ) యేది పడివేసినను నది దానకర్ణుడట్లు సర్వసమృద్ధిగా నిచ్చును. అనుకూలముగ నదియర్థసాధకము. ప్రతికూలమైనచో భయావహము.

సముఖో7 భ్యేతి వితతః యాత్రా ఘాతకరో భ##వేత్‌ | వామఃకాకః స్మృతో ధన్యో దక్షిణస్తు వినాశకృత్‌ ||

వామో7నులోమగః ప్రేష్ఠో మధ్యమో దక్షిణ స్మృతః | ప్రతిలోమ కృతి ర్వామో గమన ప్రతిషేధకృత్‌ ||

నివేదయతి యాత్రార్థ మభిప్రేతం గృహే రతః ఏకాక్షి చరణ స్త్వర్కం వక్ష్యమాణో భయావహః ||

కోటరే వాసమానస్తు మహానర్థకరో భ##వేత్‌ | నశుభః సూకరే కాకః పంకాన్తస్సతు దృశ్యతే ||

అమేధ్యపూర్ణ వదనః కాకః సర్వార్థ సాధకః | జ్ఞేయాః పతత్రిణో7న్యే7మీ కాక వద్భృగు నందన! ||

స్కందాదౌ రామ! సవ్యస్థాః శ్వానో రిపు వినాశకాః ఇంద్రస్థానే నరేంద్రస్య పురేశస్య తు గొపురే ||

అన్తర్గృహే గృహేశస్య మరణాయ భ##వేత్‌ భృశమ్‌ | యస్య వ్రజతి వామాంగం తస్స స్యాద్థీర్ఘ సిద్ధయే ||

కాకి సముఖముగా ఱక్కలు విదలించుచు వచ్చులేని దండయాత్రను వమ్ముసేయును. అది ఎడమవైపు వచ్చెనా శుభప్రదము. కుడివైపు వచ్చెనా వినాశకరము. ఎడమప్రక్క గూడా యది అనులోమముగ వచ్చెనా ఉత్తమఫలము. కుడి ప్రక్కనుండి అనులోమముగ వచ్చెనా మధ్యమఫలము నగును. ఎడమవైపు ప్రతిలోమముగా వచ్చినచో యాత్రాప్రతిబంధకమగును. గృహమునందుండు కాకి అభీష్టమగు ప్రయాణమును సూచించును. (యాత్రాసంకల్పము సేసిన గృహస్థునకు) సూర్యునివంకకు బెట్టిన కాకియొక్క కాలు భయము రానున్నదని చెప్పును. తొఱ్ఱలోనుండు కాకి మహానర్థము చేయును. (తొఱ్ఱలో కాకియుండగా గనబడిన నది చలా కీడైన శకునమన్నమాట) బురదలోని పందిమీద వ్రాలిన కాకి కనబడుట శుభముగాదు. ముక్కంతయు మేధ్యముతో నిండిన కాకి కనబడుట సర్వార్ధసాధకము. భృగుకుమార! కాకివలెనె నితర పక్షలును నెఱుంగనగును.

చెట్టుమొదట కుడిప్రక్కగా కూర్చుండిన కుక్కలు గనిపించిన శత్రువు నశించును. రాజు యొక్క ఇంద్రస్థానమందు (తూర్పువైపున నన్నమాట), రాజగొపురమందు, రాజగృహ మధ్యమందు కుక్కలు తిరగినచో రాజు మరణసూచనము. కుక్క యెడమవైపు మేని పైకెత్తెనేని యది దీర్ఘకాలసిద్ధి నెఱింగించును.

భయాయ దక్షిణం తధా భుజ మదక్షిణమ్‌ | యాత్రాఘాతకరో యస్తుహర్షం ప్రతిముఖాగతః ||

మార్గావరోధకో మార్గే చౌరస్తుదతి భార్గవ! అలాతా7స్థిముఖః పాపో రజ్జుమీరముఖ స్తథా ||

సోపానత్కముఖోధన్యో మాంస పూర్ణ ముఖో7పిచ | అమంగల్య మథద్రవ్యం దేశంచైవా శుభం తధా ||

అవమూల్యాగ్రతో యాతి యాతస్యనభయం భ##వేత్‌ | తథా7వమూల్యాం వ్రజతి శుభం దేశం తథా క్రమమ్‌ ||

మంగళ్యంచ తధా ద్రవ్యం తస్య స్యాదర్థ సిద్ధయే | ఏవంచ రామ! విజ్ఞేయా స్తధావై జంబుకాదయః ||

భౌభౌమని యార్చుచు ఎదురువచ్చి కుడివైపు శరీరమును నెడమ భుజమును సంతోషముతో వచ్చి మూర్కొను నేని దండ యాత్రదారి కది భంగకరము. దారిలో దొంగల బెడద తప్పదు. కొరకంచు, ఎముక, ఎముక, త్రాడు, నోటగరచెకొని వచ్చినా పాపము (అశుభము) చెప్పులు, మాంసము, నోట గరచుకొని వచ్చిన శుభప్రదము. కుక్క అమంగళ ద్రవ్యమును నోట జెల్లగించుకొని అమంగళపు ప్రదేమునకు వెళ్ళెనేని దాని వలన యాత్రికునికి దారిలో భయము గల్గదు. మంగళ ద్రవ్యము నోట కఱచుకొని ముందువెళ్ళిన అర్థసిద్ధి కలుగును. పరశురామా! ఇట్లే నక్కయు మున్నగు వానివలన గూడ ఫలము తెలియ వలెను.

భయాయ స్వామినో జ్ఞేయా అనిమిత్తభయం గవామ్‌ | నిశి బౌరభయా య స్యా ద్వికృతం మృత్యవే తధా ||

శివాయస్వామినో రాత్రౌ బలివర్దో నదన్‌ భ##వేత్‌ | ఉత్సృష్ట వృషభో రాజ్ఞో విజయం సంప్రయచ్ఛతి ||

అభక్ష్యం భక్షయన్తశ్చ గావో న్యాసస్తధాంబకాన్‌ | త్యక్త స్నేహాశ్చ వత్సేషు గవాంక్షయకరో మతాః ||

భూమింపాదై ర్వినిర్హత్య దీనాభూతా వికారణాత్‌ | అన్యోన్నలగ్న పుచ్ఛాశ్చ గావో భయంకరా మతాః ||

ఆర్ద్రాంగా హృష్టరోమాశ్చ ప్రవిశన్త్య స్తధా గృహమ్‌ | శృంగలగ్న మృదోవాపి విజ్ఞేయాః స్వామి వృద్ధయే ||

గోవులక కారణముగ భయమేర్పడిన నది రాజునకు భయకారణము. రాత్రి బందిపోట్ల భయమునకు. ఆ గోవుల కేర్పడు భయము చాల వికృతమైనచో రాజు మృత్యువునకు దారితీయును. బలీ వర్దము=ఎద్దు రాత్రి రంకెవేసినచో యజమాని కది మంగళకరము. వృషోత్సర్జనము రాజునకు విజయప్రదము. ఆవులు తినగూడనిది తినుచు అంబా అంబా యని యఱపులు పెట్టుట దూడలయెడల బ్రీతి లేకుండుటయు గోక్షయమును సూచించును. ఆవులు కాళ్ళచే నేల రాయుచు కొట్టుచు కారణము లేక దిగులుపడి యొకదానిపై నొకటి తోకల లంకె వెట్టునేని దేశమునకు భయము గూర్చును. అవి తడి యొడళులతో రోమాంచముతో కొమ్ములందు బురదయంటి గృహమునంబ్రవేశించు నేని యది యజమాని యభివృద్ధికి శుభశకునము.

మహిష్యాదిషు చాప్యేత త్సర్వం వాచ్యం విజానతా | నేత్ర నాసాపుట ప్రోధస్కంధస్యాసన మూర్ధసు ||

హయానాం జ్వలనం శస్త మతో7న్యత్ర ప్రశస్యతే | సర్వాంగ జ్వలనం నేష్టం తథా ధూమ సముద్భవః ||

విస్ఫులింగోద్భవశ్చైవ శకృత్యా స్వశనం తధా | ఆరోహణం తధా7న్యేన సపర్యాణస్స వాజినః ||

జలోపవేశనం నేష్టం భూమౌచ పరివర్తనమ్‌ | విపత్కల్ప తరంగస్య స్వతో వా7ప్యనిమిత్తతః ||

గేదెలు మొదలగు వాని యెడం గూడ నీఫలముం దెలినివ వాడు చెప్పవలెను. గుఱ్ఱములకు కన్నులు ముక్కుపుటములు ముట్టెమూపు ఆసనము తలయందు మది యితర స్థానములందు జ్వలనము=మెఱుపు (కాంతి) కనిపించుట శుభకరము. సర్వ శరీరము ప్రకాశవంతమై కనిపించుట పొగలు గ్రమ్ముటయు మాత్రము మంచిది గాదు. లిద్దెలో=నివృనెదనులు వేడి పొగలు వచ్చుట పర్యాణముతో (జీను) నున్న (అనగా తనకై సిద్దము చేయబడిన) గుఱ్ఱము నింకొక నీటిలో దిగుట కొప్పకుండుట భూమి మీదనే తిఱుగుట స్నభావముచే గాని కారణము లేకుండగాని గుఱ్ఱములకు కష్టమేర్పడుట.

యకసోదవయో ర్ద్వేష స్త్వకస్మాచ్చైవ శస్యతే | క్రీతః కాకైః కపోతైర్వా శారాకాభి స్తురంగమః ||

ఆత్మనః స్వామినో వాపి తదా మరణ వేదకః దుఃఖార్త ధ్వాన శీలచ్చ సాశ్రునేత్రో భయావహః ||

జిహ్వయా లేఢి చరణ మసావపి భయంకరః | నిర్నిమిత్తం పతలవా తదాస్యా న్నృషు వృద్ధయేః ||

వామ పాదేన చతధా విలిఖంశ్చ వసుంధరామ్‌ | స్వేనైవ వామపార్శ్వేన ||

ప్రవేపమానా హ్రేషన్తే రోదన్తేచ ముహుర్ముహుః | శకృన్మూత్రే విముంచన్తో వేదయన్తి మహద్భయమ్‌ః ||

ఉత్తిష్ఠన్తో నిషీదన్తః సంధ్యాయాం దీన మనాసాః | స్రస్తా స్సాస్రాశ్చ దీనాశ్చ హ్రేషమాణా భయావహాః ||

హ్రేషతస్తు యదా జ్వాలా జ్యోత్స్నావా ముఖతో భ##వేత్‌ | తదా విజయ మాఖ్యాతి స్వామినో ధ్రువ మేవహి ||

హఠాత్తుగ గడ్టి, నీరు నెడలనరుచియు అందు వలన నంత మహాహయము కాకులకు పావురములకు గొర్వంకలకు నమ్ముడు పోవును. అనగా నంత పరికిరాని దగును. తనకు యజమానికి మరణమును సూచించును. దుఃఖనాదము, ఆర్తనాదము చేయు స్వభావము కలిగి కన్నిరు గ్రమ్మిన నేత్రములు గలిగి భీతిని కల్పించు గుఱ్ఱము పాదమును నాలుకతో నాకుచుండుట నయమును సూచించును. ఎడమ కాలితో పగలునేని తన యెడమ ప్రక్కతో నేలపై రాయును. వణకుచు సకిలించును మాటిమాటికేడ్చును. శకృమూత్రములు విడుచుచు అట్లుచేయుట పెద్దభయము గల్గుచున్నట్లు దెల్పును. లేచుచు పరుండుచు సంధ్యవేఫయందు దిగులుపడి బడలువడి దిగనారి కంట నీళ్ళు గార్చును. సకిలించుచు గుఱ్ఱములు భయము రాకడను సూచించును. సకిలించునపుడు వాని నోట మంటలు గాని వెన్నెల గాని వెడిలునేని యది మాత్రము ప్రభువునకు విజయముం నిశ్చయమని తెలుపును.

దక్షిణన పదా భూమిం వికిరన్‌, జయవర్ధనః | రాత్రౌ దక్షిణ పార్శ్వేన ప్రస్వపంశ్చ నరోత్తమః ||

ఆరోహణం నవై దద్యాత్‌ ప్రతీవం వాగృహం వ్రజేత్‌ | యాత్రావిఘూత మాచష్టే వామం పాదం తధాస్పృశన్‌ ||

అనులోమం యదాయాతి పురస్తాత్‌ ప్రతి హ్రేషిదే | దక్షిణంవా తధా పార్శ్వం ముఖేనోపరి మార్జతిః ||

ప్రేరితస్త్వను కూతేన పవనేన రణ హయః | హ్రేషమాణః పరాన్‌యాతి తదాస్యా ద్విజయావహః ||

కుడికాలిలో భూమినిరాచి చిమ్ము గుఱ్ఱము జయవర్దనము. రాత్రి కుడివైపు కొఱగి పరుండుట గూడ యంతే. ఎక్కనీ యదు పోనీయనివెనుదిరిగి యింటి మొగముం బట్టద ఎడమకాలు దాచుచు నిలుచును. అది యాత్రాభంగ సూచనము. ప్రతిహేషితము బయలు దేరగా అనుకూలముగా ముందుకు నడుచును. వెనుకనుండి కుడి ప్రక్కకు ముట్టెతో నాకును. అనుకూల వాయు ప్రేరణ సేయుచుండ సకిలించుచు శత్రువుల వైపు పోవునేని యది విజయ ప్రదము.

గ్రామే వ్రజతి నాగశ్చే న్మైథునం దేశహా భ##వేత్‌ | ప్రసూతా నాగవనితా మత్తా చాన్తయ భూపతేః ||

-:ఏనుగుల శకునములు:-

ఏనుగు గ్రామములో మైథును జేయనేని నది దేశహానికరము. ఆడయేనుగు నక్కడ ననుటయు వదించుటయు రాజు నాశనమునకు కారణమగును.

దన్తభంగే శుభేదేశే ద్రుమేవా భయ వర్ధనః | క్రూరేషు తధా రామ! విశేషతః ||

గండూషధారణం కృత్వా వక్త్రభాగేతు దక్షిణ | హస్తం గృహీత్వా హస్తేన నాగస్యా న్యస్య వాపునః ||

ఉచ్చైర్వా కరమున్నమ్య విషాణ వాథ దక్షిణ | గంభీరం శ్రోత్రమదురం రాజ్ఞస్తద్విజయా వహమ్‌ ||

లతో7న్యథా విపర్యన్తం త్వశుభం పరికీర్తితమ్‌ | ఆరోహణం నచేద్ధద్యాత్‌ ప్రతీపం వాగృహం వ్రజేత్‌ ||

మదం వా వారణోజహ్యా ద్యాత్రా ఘాత కరో భ##వేత్‌ | త్రాహగృహీ తోద్విరదః సగ్రాహః సలిలా శయాత్‌ ||

ఉత్తరన్‌ విజయయా స్యాత్‌ సగ్రాహో భయవర్ధనః| శస్త్రాంకుశ పతాకానాం భూమౌ నిపతనం గజాత్‌ ||

గుఱ్ఱము శుభప్రదేశమున చెట్టునందు గాని క్రూరవేళలందు క్రూరలగ్నమందు దంతము లూడుడ భయవరనము. తన తొండమందుకొని నేని అందులో గూడ తొండిము మీదకెత్తి కుడి దంతమునెత్తి విననింపుగా కుడివైపు నోట నీటిని (గండూషించునేని=పుక్కిలించునేని) పుక్కిట బట్టునేని యది రాజునకు విజయావహము. ఇందులకు వ్యతిరేకముగ జేసిన నది యశుభము. స్వామి నెక్కనీదు: లేదా వెనుదిఱిగి యింటి మొగమై పోవును. లేదా మదము గార్పును. అట్టి యేనుగు దంమయాత్రా విఘాత కరమగును. మడుపులో మొసలి పట్టినపుడు మడుగు వెడలి వచ్చునేని యది శుభప్రదము. మొసలి పట్టులోనే యున్నచో భయవర్థనము.

లోష్ట కాష్ట కరీషాణాం క్షేపణ చాపి యద్భవేత్‌ | అనుయాత్రం జయా యైతత్‌ ప్రతియాత్రాం న శస్యతే ||

వార్యమాణో యదానాగః శత్రుణా7భిముఖో వ్రజేత్‌ తురన్‌ ప్రసుప్తతారంచ యదా తేజః ప్రశంకితః ||

ఇష్టాంస్తు యస్తు భక్ష్యాంశ్చ తధా స్పృశతి హస్తినీమ్‌ | రామ! బృంహిత ఘంటానాం ప్రతిశ##బ్దేన కుప్యతే ||

కక్షాయాం బధ్యమా నాయాం యదా వోచ్చైర్నదత్యపి | యాత్రానుగశ్చ భవతి ప్రహృష్టశ్చైవ వారణః ||

వామం దక్షిణపాదేన పాద మాత్రమతే తథా | దక్షిణం చ తధా దన్తే పరిమార్షి కరేణ చేత్‌ ||

వేష్టయా త్యధ వా కర్ణౌ తధా స్తబ్ధౌ కరోతి చ | జయాయ రాజ్ఞో భవతి జనయ న్నపి శీకరమ్‌ ||

ఆయుధములు, అంమేశములు, జెండాలు నేన్ను మీది నుండి పడుట బెడ్డలు, కఱ్ఱలు, పిడకలు విసిరినపుడునుం జరుగును. గాన నంత మాత్రమున వెదుదిఱిగ రాజు. ముందునకు సాగుటయే విరియ ప్రదమగును. శత్రువు ఏనునంత వారించుచున్నను దెదురుగానే నడచుచు నేదేని వెలుగు గ్రమ్మినపుడు గూడ నుప్తమైయున్న కనుపాపను విపార జేయుచు నిష్టమైన ధిక్ష్యములను నాద యేరుగుమం దాకుచు ఘంటల ప్రతిధ్వనికి కోపము గొనును. కాక్ష=నడుటిగించునపుడు పెల్టుగ ఘీంకరించును, అత్యానంద బరితమై యా త కనుకూలముగ నడచును. కుడికాలితో నెడమ యడుగును రాయును. తొండముతో కుడ దంతమును దాకును చెవులను ముడుచును టెక్కికచును. తొండము నుండి నీటితుంపులం జిమ్మును. ఇట్టి యేనుగు రాజులకు విజయకారణ మగును. గజనిమిత్తదుశ్శకునములు.

వామంతు వేష్టయే ద్దన్తం పాదం వామేన దక్షిణమ్‌ | పాద మాక్రమ మాణ శ్చ ప్రస్ఖల న్నిపతన్నపి ||

అగ్రహస్గం నోద్దరతి యదాచ వసుధా తలాత్‌ | సాస్తుశ్చ కబలద్వేషి దీనో భయ వివర్ధనః ||

నిశ్వాసం పరమం కుర్వన్‌ శాస్తం వికృత మేవచ | భయావహౌ వినిర్దష్టః ప్రతిలోమ గతిస్తధా ||

క్షీరపాదప గుల్మానాం నిహన్త విజయావహః తధా వికాసితాక్షశ్చ రామ! లబ్ధవదో7పిచ ||

వృషో7శ్వః కుంజరోవా7పి రిపుసైన్యం యదా వ్రజేత్‌ | పరాజయ స్తతో జ్ఞేయం లక్షణం భృగు నందనః ||

ఖండేమేఘా7భివృష్ట్యాచ సేనానాశ మవాప్నువాన్‌ | ప్రతిమాలగ్రహ ర్చాంచ తధా సంముఖ మాసతా ||

యాత్రాకాలే రణ వాసి ఛత్రాది పతనా ద్భయమ్‌ | విజ్ఞేయం భూమిపాలస్య ఘోఢీరాణా ం దీనతా తధా ||

ఎడమ దంతమును గపుచుండును. ఎడమ కాలిచే కుడికాలుం గ్రప్పుచు ముందుకు నడచు నపుడు తొట్రుపడచు పడును. నేల నుండి తొండము చివర పైకెత్తదు. ఆకలి గొన్నను దానాకిష్టపడదు. దిగులు పడును నిట్లుండు నేరుగు భయవర్ధనము. ఊరక నిట్టూర్పులు పుచ్చును. విపరీత శాతముగ నుండును. వేనుకడుగు వేయును. అట్టిది భయావహము. పాలచెట్టను పొదలను విరుచు నదియు విజయప్రదమే గలదియున్తె తేఱిపారకున్నట విప్పార్చును. ఒకచోట నిలుకడగా నిల్చుచు నుండు ఎద్దు, గుఱ్ఱము, ఏనుగు శత్రుసైన్యమున కోగునేని యది పరాజయ లక్షణమని తెలియవలెను.

సరాశ్వనాగా హృష్టశ్చ విధూమో7గ్ని స్తధా జ్వలన్‌ | అనులోమా గ్రహాశ్చైవ విజ్ఞేయం జయ లక్షణమ్‌ ||

ఆయుధానాం ప్రజ్వలనం కోశాదపి వినిర్గమః | సంగ్రామకాలే విజ్ఞేయం విజయస్యతు లక్షణమ్‌ ||

కాకైర్యోధా7భిభవనం క్రవ్యాదై ర్మండల క్రియా | సైన్యోవర్యు వసైన్యేన విజ్ఞేయం భయలక్షణమ్‌ ||

కండూతి ద్దక్షిణ హస్తే ఛాయాచ శుభలక్షణా | శోభా మనుజ శార్దూల! తత్కాలం విజయావహా ||

సేనాంగ సంస్థో భయవృద్ధ్విజేన్ద్ర! | క్రవ్యాద్భవే ద్వాప్యథ మక్షికాచ ||

శుభావహాః స్యుఃశతపత్ర చావమయూర హంసా | మయూర హంసాశ్చసజీవ జీవాః ||

ఇతి శ్రీవిష్ణు ధర్మోత్తరే ద్వితీయ ఖండే శకున వర్ఱనం నామ చతుష్ట ష్ట్యుత్తర శతమో7ధ్యాయః ||

ఎడనెడ మబ్బు పట్టి కురిసిన వర్షముచే సేనా నాశనమగును. గ్రహనక్షత్రము లనుకూలముగా నుండకపోవుట వలన వీరులు దిగులు పడుట రాజునకు భయము సూచించును. నరులు (భటులు) గుఱ్ఱములు నేనుగులు హర్షముతో నుండుట అగ్ని పోగ గ్రమ్ముకంట చక్కగా ప్రిజ్వలించుడ గ్రహము లనులోమములయి యుండుబి (వక్రించ కుండుట) జయలక్షణ మని తెలియ వలెను. యుద్ధ సమయములందు ఆయుధములు ప్రజ్వలించుట (మెఱుగలు గ్రక్కుట) ఒఱల నుండి వెడలుట విజయమునకు లక్షణము. కాకులు యోధులను జేకాకు పెట్టుట రాబందులు గ్రద్ధలు మండలములుగా నేర్పడి యెగురుట సేనల మీద సైన్యమును పడుట భయలక్షణమని యెఱుంగ నగును. కుడిచేతి దురదయు, మంచి వెలుతురు శుభలక్షణమైన సొంపులుగలుగుటయు ననునివి తత్కాల విజయ శకునములు. సేనాంగములపై వెఱవుగొల్పుచు గ్రద్ధలు, రాబందులు వ్రాలుట ఈగలు, కందిరీగలు రేగులు భయము గూర్చును. కమలములు, ధనస్సు, నెమళ్ళు హంసలు సిజీవులైన జీవలునుంగనిపించుట శుభాహలశకునములు.

ఇది శ్రీ విష్ణోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున శకున వర్ణనమను నూ యరువదినాల్గవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters