Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట ఎనుబదియొకటవ అధ్యాయము - ధనుర్వేదము - ఆయుధ ప్రయోగ విధి

పుష్కరఉవాచ :- జితహస్తో జితమతి ర్జతిదృగ్లక్ష్య సాధకః | నియతాం సిద్ధిమాసాద్య తతో వాహన మారుహేత్‌.

ఏష తత్రైవ చ విధిః కార్త్స్నె న పరికీర్తితః | అధికం భ్రమత స్తస్య భాగే గ్రహణమేవ చ.

ఏతేషాం చైవ యోగానాం విధిర్యన్త్రైషుకస్య చ | వాహా శ్రితస్య వక్ష్యామి సంవిశేషేణ లక్షణమ్‌.

పాశాసియష్టిదండానాం విధిర్యః పరిష్ఠినితః | క్షేపఏన యథా న్యాయం తస్య వక్ష్యామి యాక్రియా.

దశహస్తో భ##వేత్పాశో వృతః కరముఖస్తథా | శణకార్పాస పుంజానాం భగ్నస్నాయ్వస్థి చర్మణామ్‌.

అన్యేషాం సుదృఢానాం చ సుకృతం పరివేష్టితమ్‌ |

- : ఆయుధ ప్రయోగవిధి :-

పుష్కరుడనియె :- హస్తలాఘవము గొని మనస్సును జయించి చూపును స్వాధీనము సేసికొని గురి తప్పకుండ బాణ ప్రయోగాదులను జేయు సాధన చేసి అందు అచంచలమయిన సిద్ధిని గడించిన మీదట వాహనమెక్కవలెను. ఈ విధాన మక్కడనే (ధనుర్వేదమందు) సమగ్రముగ జెప్పబడినది. ఐషుకస్య = బాణయుద్ధము చేయుచు రణమందెక్కువగ స్వేచ్చా విహార మొనరించు వానికి - వాహన మెక్కి యుద్ధమొనరించు వారికి నవసరమయిన యీ ప్రక్రియల (యోగముల యొక్క) లక్షణము సవిస్తరముగ జెప్పుచున్నాను. పాశములు ఖడ్గములు యష్టికర్రలు దండములు మొదలగువాని ప్రయోగవిధి ధనుర్వేదమందు ''క్షేపము'' అను ప్రక్రియ పూర్తిగ నున్నది. ఆ క్షేపక్రియను జెప్పెదను. పాశము పది మూరలు వర్తులముగ నుండవలెను. అది శణ = కార్పాసము తెగిన స్నాయువులు అస్థి చర్మములతో తయారు చేయనగును. ఇందులకు మరియుం గొన్న గట్టి సేసిన సామగ్రి నుపయోగించ వచ్చును.

త్రయ స్త్రింశత్సమం చా పం బుధః కుర్యా త్సు వర్తితమ్‌.

కర్తవ్యా శిబికై స్తస్య స్థానం కక్ష్యాసు వైతదా | వామహస్తేన సంగృహ్య దక్షిణనో ద్ధ రేతు సః.

కుండలస్యా కృతిం కృత్వా గ్రామైకం మస్తకోపరి | క్షిపేత్తృణమయే తూర్ణం పురుషే చర్మ వేష్టితే.

చలితే చ | ప్లుతే చైవ తథా ప్రజవితేషు చ సమాయోగవిధిం జ్ఞాత్వా ప్రయుంజీత సుశిక్షితః.

-: చాప (ధనుస్సు) ప్రయోగవిధి :-

విల్లుముప్పది మూడంగుళము లుండవలెను. దాని శిబికముతో కక్ష్యలందు స్థానమేర్పరుప వలెను. ఆ విల్లు నెడమచేత బట్టి కుడిచేత నెక్కుపెట్టవలెను. అది మండలాకారముగ నేర్పడవలెను. ఒక గ్రామమున శిరస్సు గురిచేసి మనుష్య రూపమున గడ్డిబొమ్మ తోలుచుట్టి బాణము విసరవలెను. ఆ బొమ్మ కదులట తూలుట దూరముగ బడుటయు గమనించి ఆమీద బాణానుసంధాన ప్రయోగ ప్రక్రియలను చక్కని గురు శిక్షనందినవా డాచరణలో పెట్టవలెను.

విజిత్య చ యథాన్యాయం తతో బంధం సమాచరేత్‌ | కట్యాం బధ్వా తతః ఖడ్గం వామ పార్శ్వావలంబినమ్‌.

దృఢం విగృహ్య వామేన వికర్షే ద్దక్షిణన తు | షడంగుల పరీణాహం సమహస్తం సముచ్ఛ్రితమ్‌.

అయోమయ శలాకాశ్చ చర్మాణి వివిధాని చ | అపహస్తం సమంచైవ తిర్యగూర్ధ్వహతం తథా.

శోధయేద్విధినా యేన తథా మే గదతః శృణు | తార్ణం చర్మావ నద్ధాంగం స్థాప యిత్వా నరం దృఢమ్‌.

కరేణాదాయ లగుడం దక్షిణాంగుష్టికా న్నరః | ఉద్యమ్య ఘాతయే ద్యస్య నామ్నస్తం శిరసో దృఢమ్‌ |

ఉభాభ్యా మపి హస్తాభ్యాం కుర్యాత్తస్య నిపాతనమ్‌.

-: ఖడ్గప్రయోగవిధి :-

యథాన్యాయముగ ఖడ్గమును నడుమునను కుడివైపునగాని యెడమవైపునగాని కట్టుకొనవలెను. అది ఆరంగుళాల వైశాల్యము గలదియు పిడి సరిగా ఎత్తుగా నున్నదియు గావలెను. ఇనుప శలాకలు చర్మములు (చేతికి) అపహస్తముగను సమముగను అడ్డముగాను మీదికి యెట్లు కత్తిని ప్రయోగించుటయో బాగుగా శోధించుకోవలెను. అమీద తార్ణం=గడ్డితో చేసినదిగా గాని చర్మావ నద్ధాంగం చర్మముచుట్టినదానినిగాని యొక మనిషి బొమ్మను గట్టిగా తయారుచేసి నిలిపి ఆమీద లగుడమును కుడిచేతి బొటన వ్రేలానించి చేతపట్టుకొని యెత్తి ఆ బొమ్మయొక్క తలమీద గొట్టవలెను. ఆ మీద రెండు చేతులతో పట్టుకొని వానిని క్రిందకు పడవేయవలెను.

బింబోయం విధిసహితో హితః సుముక్తః | శిష్యాణాం హితమతి కుర్వతా మయా తే |

వాహానాం శ్రమహరణ ప్రధారణార్థమ్‌ | యోగ్యార్హం ప్రథమతరం బుధేన వధ్యమ్‌.

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే ధనుర్వేద విద్యాకథనం నామ ఏకాశీత్యుత్తర శతతమోధ్యాయః ||

ప్రయోగ విధితోగూడ యీ బింబము యోధహితమయినది చెప్పితిని.

శిష్యులకు హితము చేయనెంచి నేను ప్రయోగ విధులతో గూడ యీ బింబము=ధనుర్విద్యా స్వరూపము - వాహనముల శ్రమ నివారించుటకు యుద్ధములందు కాలు నిలువరించుట కనువుగ తెలిసినవానికి యోగ్యుని కనుచితముగ మొట్టమొదటిదిగా నీకిది సెప్పితిని.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమునందు ద్వితీయ ఖండమున ధనుర్విద్యా వర్ణనమునం దాయుర్వేద ప్రయోగవిధిలోని నూట యెనుబది యొకటవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters