Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఇరువదిరెండవ యధ్యాయము - పట్టాభిషేకమంత్రములు

పరశురామః ః మంత్రేణ యేన ధర్మజ్ఞ! కుర్యాద్రాజ్ఞోభిషేచనమ్‌ | తమహం శ్రోతు మిచ్ఛామి త్వత్తోవరుణ నందన! |

పుష్కరః ః శృణుష్వాహితో మంత్రం రామ! కల్మషనానశనమ్‌ | యేనాభిషిక్తో నృపతి శ్చిరం యశసి తిష్ఠతి || 2

రాజ్ఞో7భిషేక శబ్దాన్తే దైవవి త్కుశవారిణా | కుంభా దభ్యుక్షణం కుర్యా న్మంత్రాంతే సకలం న్యసేత్‌ || 3

సురాస్త్వా మభిషించంతు బ్రహ్మవిష్ణు మహేశ్వరాః | వాసుదేవో జగన్నాథ స్తథా సంకర్షణో విభుః || 4

ప్రద్యుమ్న శ్చానిరుద్ధస్తు భవన్తు విజయాయతే | అఖండలోగ్నిర్భగవాన్‌ యమో వై నైరృతి స్తథా || 5

వరుణః పవనశ్చైవ ధనాధ్యక్ష స్తథా శివః | బ్రహ్మణా సహిత శ్శేషో దిక్పాలాః పాంతు తే సదా || 6

భద్రో ధర్మో మను ర్భక్షో రుచి శ్శ్రద్ధా చ పార్ఖివ! భృగు రత్రి ర్వసిష్ఠశ్చ సనకశ్చ సనందనః || 7

సనత్కుమారశ్చ తథా భగవానపి చాంగిరాః | పులహశ్చ పులస్త్యశ్చ మరీచిః కశ్యపః ప్రభుః || 8

ఏతేత్వా మభిషించంతు ప్రజాధ్యక్షా స్సమాగతాః | ప్రభాసురా బర్హిషదో హ్యగ్నిష్వాత్తా స్తథైవ చ || 9

క్రవ్యాదా శ్చోపహూతాశ్చ ఆజ్యపాశ్చ సుకాలినః | ఏతే త్వా మభిషించంతు పితర శ్చాగ్నిభి స్సహ || 10

లక్ష్మీర్దేవీ సతీ ఖ్యాతి రనసయా తధా స్మృతిః | సంభూతి స్సన్నతిశ్చైవ క్షమాప్రీతి స్తధైవ చ || 11

స్వాహా స్వధా చ త్వా రాజన్‌ ! అభిషించంతు మాతరః | కీర్తి ర్లక్ష్మీర్ధృతి ర్మేధాపుష్టి శ్శ్రద్ధా క్రియా తథా || 12

బుద్ధి ర్లజ్జా వపుః శాన్తి స్తుష్టిః సిద్ధిశ్చ పార్థివ! | ఏతాః త్వా మభిషించంతు ధర్మపత్న్యస్సమాగతాః || 13

అరుంధతీ వసుర్జామీ లంబా భానుర్మరుత్వతీ | సంకల్పా చ ముహూర్తా చ సాధ్యా విశ్వా స్తథైవ చ || 14

ధర్మపత్న్యస్తథాన్యాస్త్వా మభిషించన్తు పార్థివ! అదితిశ్చ దితి స్తామ్రా హ్యరిష్టా సురసా మునిః || 15

కద్రూః క్రోధవశా ప్రాధా వినతా సురభి స్త్రిభిః | ఏతా స్త్వా మభిషించన్తు కశ్చపస్య ప్రియాః స్త్రియః || 16

పత్నీ తే బహుపుత్రస్య సుప్రభా యా చ భామినీ | సమాయాత్వభిషేకానయ విజయాయ చ పార్థివ! || 17

కృశాశ్వపత్నీచ తథా సుప్రభా చ జయా తథా! అస్త్రగ్రామ స్తయోః పుత్రో విజయం విదధాతుతే || 18

మనోరమా భానుమతీ విశాలా యా చ బాహుదా | అరిష్టనేమీపత్న్య స్త్వా మభిషించంతు పార్థివః || 19

కృత్తికా రోహిణీ దేవీ ఇల్వలా బాహురేవచ | పునర్వసుశ్చ తిష్యశ్చ తథా೭೭శ్లేషా చ పార్థివ! || 20

మఘా చ ఫాల్గునీ పూర్వా త థైవోత్తరఫల్గునీ | హస్తశ్చిత్ర స్తథా స్వాతీ ర్విశాఖా చ నరాధిప! || 21

అనూరాధా తథా జ్యేష్ఠా మూలం చ వసుధాధిప | ఆషాఢా చ తథా పూర్వా తథైవ నృప! చోత్తరా || 22

అభిజిచ్చ తథాశ్వత్థో ధనిష్ఠాచ నరాధిప! | తథా శతభిషశ్చైవ పూర్వా భాద్రపద చయా ||23

ఉత్తరా రేవతీ రాజన్‌ ః అశ్వనీ భరణీ తథా | ఏతా స్త్వా మభిషించన్తు సోమపత్న్య స్సమాగతాః || 24

మృగీచ మృగమందా చ శ్వేతా భద్రాసనా హరిః | భూతా చ కపిశా దంష్ట్రీ సురసా సరమా తథా | 25

ఏతా పులహపత్న్య స్త్వా మభిషించన్తు పార్థివ! | శ్యేనీ భాసీ తథా క్రౌంచీ ధృతరాష్ట్రీ శుకీ తథా || 26

పత్న్య స్త్వా మభిషించన్తు అరుణ స్యార్క సారథేః | ఆయతి ర్నియతి శ్చైవ రాత్రి ర్నిద్రా త థైవ చ || 27

ఏతాస్త్వా మభిషించన్తు లోక సంస్థాన హేతవః | ఉమా మేనా శచీచైవ ఘ్రూమ్రోర్ణా నివృతి స్తథా || 28

గౌరీ శివా చ సిద్ధిశ్చ వేలా చైవాథ నడ్వలా | అసిక్నీ చ తథా జ్యోత్స్నా యాచ దేవీ వనస్పతేః || 29

ఏతా స్త్వా మభిషించన్తు దేవపత్న్య స్సమాగతాః | మహాకల్పశ్చ కల్పశ్చ మన్వంతర యుగాని చ || 30

సంవత్సరాణి సర్వాణి తథా చైవాయనద్వయమ్‌ | ఋతపశ్చ తథా మాసాః పక్షౌ రాత్ర్యహానీ తథా || 31

సంధ్యాశ్చ తిథయశ్చైవ ముహూర్తాః కరణాని చ | ఏతే త్వా మభిషించన్తు కాలస్యావయవా శ్శుభాః || 32

ఆదిత్యశ్చంద్రమా భౌమో బుధో జీవ స్సితార్కజౌ | గ్రహస్త్వా మభిషించన్తు రాహుకేతూ చ పార్థివ! 33

స్వాయంభువో మనుః పూర్వమనుః స్వారోచిష స్తథా | ఔత్తమ స్తామస శ్చైవ రైవత శ్చాక్షుష స్తథా || 34

వైవస్వతో యథా కర్ణో దక్షో బ్రహ్మసుతా వుభౌ | ధర్మపుత్రో రుద్రపుత్రో రౌచ్యో భౌత్యశ్చ యో మనుః || 35

ఏ తేత్వా మబిషించన్తు మనవశ్చ చతుర్ధశ | విశ్వభుక్చ విపశ్చిచ్చ సుశాన్తిశ్చ శిఖీ విభుః || 36

మనోజవ స్తథోజస్వీ బహి రద్బుత శాన్తికా | వృషశ్చ ఋతధామాచ దివస్యాచ్ఛుచి రేవ చ || 37

ఏతే త్వా మభిషించన్తు దేవనాథా శ్చతుర్దశ | రైవతశ్చ కుమారశ్చ తథా వర్చా వినాయకః || 38

వీరభద్రశ్చ నన్దీ చ విశ్వకర్మా మనోజవః | ఏతే త్వా మభిషించన్తు సురముఖ్యా స్సమాగతాః || 39

ఆత్మా చాయుర్మనో దక్షో హ్యావః ప్రాణ స్తథైవ చ | హవిష్మాంశ్చ గవిష్ఠశ్బ ఋత స్సత్యశ్చ పార్థివ! || 40

అభిషించన్తు రాజన్‌ ! త్వాం దేవా హ్యాంగిరసా దశ | క్రతు ర్దక్షో వసు స్సత్యః కాలః కామో ముని స్తథా || 41

కురవో న్మనుజశ్చైవ రోచమాన స్తథైవ చ | ఏతే త్వా మభిషంచంతు విశ్వేదేవా స్తథా దశ || 42

అంగారక స్తథా సర్పో నిరృతిశ్చ తథా ఘసః | ఆజై కపా దహిర్భుధ్న్యో ధూమకేతు స్తథా ద్విజః || 43

భరతశ్చ తథా మృత్యుః కాపాలి రథ కింకిణిః | ఏకాదశైతే రుద్రాస్త్వా మభిషించన్తు పార్థివ ! 44

భువనో భావన శ్చైవ సుజన్య స్సుజన స్తథా | క్రతు స్సర్వశ్చ మూర్ధాచ త్యాజ్య శ్చైవ స్తుత స్తధా || 45

ప్రసవ శ్చావ్యయ శ్చైవ దక్షశ్చ మనుజాధిప ఏతే త్వా మభిషించంతు భృగవో నామ దేవతాః || 46

మనో మన్తా చ ప్రాణ శ్చ నరో పానశ్చ వీర్యవాన్‌ | వినిర్భయో నయశ్చైవ హంసో నారాయణ స్తధా || 47

విభు శ్చాపి ప్రభుశ్చాపి దేవశ్రేష్ఠా జగధ్ధితాః | ఏతే త్వా మభిషించంతు సాధ్యా ధ్వాదశ పార్థివ 48

ధాతా మిత్రోర్యమా పూషా శ క్రేశౌ వరుణో భగః | త్వష్టా వివస్వా న్సవితా విష్ణు ర్ద్వాదశగస్తథా || 49

ఏతే త్వా మభిషించంతు కశ్యపాదితి సంభవాః | ఏకజ్యోతిశ్చ ద్విజ్యోతి స్త్రి చతుర్జ్యోతి రేవచ || 50

ఏకశక్రో ద్విశక్రశ్చ త్రిశక్రశ్చ మహాబలః | ఇంద్రాశ్చ గత్యా దృశ్యంతే తతః ప్రతి సకృత్తయా || 51

మితశ్చ సమ్మతశ్చైవ అమితశ్చ మహాబలః | ఋతజి త్సత్యజిచ్చైవ సుషేణః సత్యజిత్తథా || 52

అతిమిత్రోనమిత్రశ్చ పురుమిత్రః పురానితః | ఋతుశ్చ ఋతథాతా చ విధాతా ధారణో ధ్రువః || 53

విధారణో మహాతేజా వాసకస్య పరస్సఖా | ఈదృక్షశ్చా ప్యదృక్షశ్చ ఏతాదృ గమితాశనః || 54

క్రీతినః ప్రసదృక్షశ్చ సరభశ్చ మహాయశాః | ధాతు రుగ్రోధ్వని ర్భీమో హ్యతియుక్తః క్షిపః సహః || 55

ద్యుతి ర్వపు రనాధృష్యో వాసః కామో జయో విరాట్‌ | ఏతే త్వా మభిషించన్తు మరుత స్తే సమాగతాః || 56

దేవా ఏకోనపంచాశ న్మహాబల పరాక్రమాః | చిత్రాంగద శ్చిత్రరథ శ్చిత్రసేనశ్చ వీర్యవాన్‌ || 57

ఊర్ణాయు రనఘశ్చైవ ఉగ్రసేనశ్చ వీర్యవాన్‌ | ధృతరాష్ట్రశ్చ గోపశ్చ సూర్యావర్త స్తథైవ చ || 58

యుగవ స్త్రణయః కార్‌ష్ణి ర్నంద శ్చిత్రస్తథైవ చ | కలిః శాలి శ్శిరా రాజన్‌ ! పర్జన్యో నారద స్తథా || 59

వృషపర్వా చ హంసశ్చ తథా చైవ హహా హుహూః | విశ్వావసు స్తుంబురుశ్చ తథా చ సురుచిశ్చ యః || 60

ఏతే త్వా మభిషించన్తు గంధర్వాః పృథివీ పతే ! | ఆహుత్య స్తా భవత్యశ్చ పర్గపత్య స్తథైవ చ || 61

ఆయుర్వత్య స్తథోర్జాశ్చ తథా వై కురవాః స్తవాః | బహ్వాయుశ్చా7 మృతాయుశ్చ భువశ్చైవ రుచ స్తథా -- 62

భీరవ శ్శోభయంత్యశ్చ దివ్యా యాశ్చా ప్సరోగణాః | ఏతే త్వా మభిషించంతు సమాగత్య మహీపతే! || 63

అనవద్యా సత్యకామా చానూనా వరుణా ప్రియా | అనూపా సుభగా చైవ సుకేశా చ మనోవతీ || 64

మేనకా సహజన్యాచ పర్ణాశా పుంజికస్థలా | కృతస్థలా ఘృతాచీ చ విశ్వాచీ పూర్వచిత్యపి || 65

ప్రవ్లూెచా చాప్యనువ్లూెచా రంభా చైవోర్వశీ తథా | పంచచూడా సానుమతీ పత్రలేఖా చ పార్థివ! || 66

మిశ్రకేశీ మరీచిశ్చ విద్యుత్పర్ణా తిలోత్తమా | అద్రికా లక్ష్మనాక్షేపా అసితా రుచికా తథా || 67

సుహేమా చాథ హేమా చ శాద్వలీ చ వపు స్తథా | సు వతా చ సుబాహుశ్చ సుగంధా సువపు స్తథా || 68

పుండరీకా సుదానా చా సుదానా సురసా తథా | హేమా శారద్వతీచైవ నూనృతా కమలాలయా || 69

సుముఖీ హంసవాదీ చ వారుణీ రతిలాలసా | ఏతా స్త్వామభిషించన్తు రాజన్నప్సరస శ్శుభాః || 70

ప్రహ్లదశ్చ మహాతేజా స్తథా రాజన్‌ విరోచనః | బలి ర్బాణ స్తధాన్యే చ దితిపుత్రా స్సమాగతాః || 71

అభిషించన్తు దైత్యాంస్త్వాం దివ్యేనా ప్యభసా స్వయమ్‌ | విప్రచిత్తి ముఖా స్సర్వే దానవా స్త్వాం సమాగతాః || 72

అభిషించన్తు రాజేంద్ర ! రాజరాజ్యేన సత్వరాః | హేతిశ్చైవ ప్రహేతిశ్చ మాలీ శంకుస్తథైవ చ || 73

సుకేశీ పౌరుషేయశ్చ యజ్ఞహా పురుషాధమః | విద్యుత్‌ స్పూర్జస్తథావ్యాఘ్రో వధశ్చ రసన స్తథా || 74

ఏతే త్వా మభిషించన్తు సమాగమ్యా ద్య రాక్షసాః | సిద్ధార్థో మణిభద్రశ్చ సుమనో నందన స్తథా || 75

కాండభిః పంచమశ్చైవ మణిమానుయమాం స్తథా | సర్వానుభూత శ్శంఖశ్చ పింగాక్ష శ్చస్తరస్తథా || 76

యశోమందరశోభీ చ పద్మచంద్రప్రభంకరాః | మేఘవర్ణ స్సుభద్రశ్చ ప్రద్యోతశ్చ మహాఘసః || 77

ద్యుతిమాన్‌ కేతుమాంశ్చైవ మౌళిమాంశ్చ సుదర్శనః | శ్వేతశ్చ విపులశ్చైవ పుష్పదంతో జయావహః || 78

పద్మవర్ణో బలాకశ్చ కుముదశ్చ బలాహకః | పద్మనాభ స్సుంగంధశ్చ ప్రవీరో విజయః కృతిః || 79

పూర్ణమాసో హిరణ్యాక్ష శ్శతజిహ్వశ్చ వీర్యవాన్‌ | ఏతే త్వా మభిషించన్తు రాజన్‌ ! యక్షేంద్ర సత్తమాః || 80

శంఖం పద్మస్తు రాజేంద్ర! మకరః కచ్ఛప స్తథా | ఏతే త్వా మభిషించన్తు నిధయస్తుసమాగతాః || 81

పలగాశ్చైవ వక్రాశ్చ యే చ సూచీముఖా నృప! దుఃపూరణాః విషాదాశ్చ జ్వలనాంగారకాస్తథా || 82

కుంభపాతాః ప్రతుండాశ్చ తపవీరా ఉలూఖలాః ! అకర్ణాశ్చ కుషండాశ్చ తథా యే పాత్రపాణయః || 83

పాంసవశ్చ వితుండాశ్చ నిపుణా స్స్కందనా స్తథా | ఏతే త్వా మభిషించన్తు పిశాచానాం చ జాతయః || 84

బ్రహ్మచర్యే స్థితా దాన్తాః సర్వజ్ఞా స్సర్వదర్శినః | నానా ప్రకారవదనాః నానా బాహు శిరోధరాః || 85

చతుష్పథ పురాట్టాల శూన్యాలయ నికేతనాః | మధురత్వే భ##వే దేవం యే గతాః మనుజేశ్వరాః || 86

తే త్వా మద్యాభిషించన్తు భూతా భూతపతే స్స్వయమ్‌ | మహాకాలం పురస్కృత్య నరసింహం చ మాతరః || 87

సర్వా స్త్వా మభిషించన్తు రాజరాజ్యే నరాధిప! | గుహః స్కందో విశాఖశ్చ నైగమేయ స్తథైవ చ || 88

అభిషించన్తు రాజన్‌! త్వాం సర్వే స్కందగ్రహా శ్శుభాః | డాకిన్యో యాశ్చ యోగిన్యః ఖేచరీ భూచరీశ్చ యాః || 89

సర్వాస్త్వా మభిషించంతు సమేత్య మనుజేశ్వర! | గురుడశ్చారుణశ్చైవ ఆరుణిశ్చ మహాఖగః || 90

సంపాతీ వినతశ్చైవ విష్ణుగంధః కుమారకః | ఏతే త్వా మభిషించన్తు సుపర్ణాః పృథివీపతేః || 91

అనంతశ్చ మహానాగః శేషో వాసుకి తక్షకౌ | సపర్దీరశ్చ కుంభశ్చ వామనశ్చాంజన స్తథా || 92

ఐరావతో మహానాగః కంబలాశ్వతరా వుభౌ ! ఐలమంత్రశ్చ శంఖశ్చ కర్కోటక ధనంజ¸° || 93

మహాకర్ణ మహానీలౌ దృతరాష్ట్ర వలాహకౌ | కుమారః పుష్పదన్తశ్చ సుముఖో దుర్ముఖ స్తథా || 94

సూచీముఖో దధిముఖః కాలియః శాలి పిండకః | బిల్వపాదః పాండురకో నాగశ్చాపూరణ స్తథా || 95

కపిలశ్చాంబరీషశ్చ కుమారశ్చాథ కశ్యపః | ప్రహ్లాదః పుష్పదన్తశ్చ గంధర్వశ్చ మనస్వికః || 96

నహుషః కరరోమా చ శంఖపాల న్తథైవ చ | పద్మశ్చకులికశ్చైవ పాణిరిత్యే వమాదయః || 97

నాగా స్త్వా మభిషించంతు రాజరాజ్యేన పార్థివ ! | కుముదైరావణౌ పద్మః పుష్పదంతోథ వామనః || 98

సుప్రతీకోంజనో నీలః పాంతు త్వాం సర్వత స్సదా | చక్రం త్రిశూలం వజ్రశ్చ నందకోస్త్రాణి చాప్యథ || 99

పైతామహా స్తథా హంసో వృషభ శ్శంకరస్య చ | దుర్గా సింహశ్చ పాంతు త్వాం యమస్య మహిష స్తథా || 100

ఉచ్చైఃశ్రవాశ్చాశ్వపతి స్తథా ధన్వంతరి ర్నృప! | కౌస్తుభః శంఖరాజశ్చ పాంతు త్వాం సర్వత స్సదా || 101

సర్వేభిషేకం దత్త్వా తే దిశన్తు విజయం ధ్రువమ్‌ | ధర్మశ్చ వ్యవసాయశ్చ సత్యోదానం తప స్తథా || 102

యమో యజ్ఞ స్తథా వాయుః బ్రహ్మచర్యం దమ శ్శమః | ఏతే త్వా మభిషించన్తు చిత్రగుప్తశ్చ పార్థివ! || 103

దండశ్చ పింగలశ్చైవ మృత్యు కాలా వుభౌ తథా | వాలఖిల్యా స్తథా సర్వే భవంతు విజయాయతే || 104

ఓధర్మజ్ఞ ! వరుణకుమార! రాజాభిషేకము నేమంత్రముతో జేయవలయునది నే వినగోరెదనని పరశురాముడన పుష్కరుడిట్లనియె. రామా! కల్మషహరమైన యా మంత్రములను శ్రద్ధమై నాలింపుము. వానిచే నబిషిక్తుడయిన నృపతి శాశ్వత కీర్తి ప్రతిష్ఠలనందగలడు. రాజాభిషేకమంగళ వాద్యధ్వనియైన తర్వాత దైవజ్ఞుడు. కుశోదకముచే పూర్ణకుంభము నుండి రాజు నభ్యుక్షింపవలెను. ఆ ప్రోక్షణము సేయు నపుడు దేవతలు నిన్నభిషేకింతిరు. గాక. బ్రహ్మ విష్ణు మహేశ్రులు వాసుదేవుడు సంకర్షణుడు జగన్నాథుడు. ప్రద్యమ్నుడు. అనిరుద్ధుడు నీ విజయమున కగుదురుగాక! ఇంద్రుడు అగ్ని మొదలయిన దిక్పాలురెనమండుగురు. నిన్ను రక్షింతురుగాక ! ఈ విధమయిన 4-19 శ్లోకముదాక యాయా దేవతలందరిని బేర్కొని ఆ మీద 20-24 శ్లోకముదాక నక్షత్ర దేవతలందరిని బేర్కొని వీరందరు నిన్ను రక్షింతురుగాక యని 25-185 శ్లోకముదాక నంద అలకనంద మొదలయిన జగన్మాతలయినపుణ్యనదులు నిన్ను రక్షింతురుగాక యని యావచింపబడిన యందఱిచే నభిషేకింపబడిన నీవీ చతుస్సాగర పర్యంతమైన పృథివి ననుభవింపుము. చిరంజీవ! చిరంజీవ! నీ బుద్ధి ధర్మమందు నిలుచుగాక యని యభిషేకము ముగింపవలెను.

ఆయా శ్లోకములలో పేర్కొనబడినవారు:- దిక్పాలుర తరువాత శేషుడు-భద్రుడు ధర్ముడు మనుపు దక్షుడు రుచి శ్రద్ధ భృగువు సప్తర్షులు బర్హిపదులు అగ్నిష్వాత్తుడు క్రవ్యాదులు ఉపహూతులు ఆజ్యపులు సంకాలులు నను పితృదేవతలు, లక్ష్మి మొదలు స్వాహా స్వదాక గల మాతృదేవతలు, కీర్తి మొదలు సిద్ధిదాక గల ధర్మపత్నులు, అదితి మొదలయిన మఱియుంగల ధర్మపత్నులు, అదితి మొదలు సురభిదాక గల కశ్యప ప్రజాపతిపత్నులు, బహుపుత్రుని భార్య సుప్రభ కృశాశ్వ భార్య సుప్రభ జయ, వారి పుత్రుడగు అస్త్రగ్రాముడు, అరిష్టనేమి భార్యలు మనోరమాదులు, కృత్తికాదినక్షత్రాధిదేవతలు, సోముని భార్యలు, మృగి మృగమంద మొదలుగ సరమ దాక గల పులహుని ధర్మపత్నులు, శ్యేని మొదలు శుకిదాక గల యరుణుని భార్యలు, లోకస్థితి హేతువులైన ఆయతి నియతి, రాత్రినిద్రాధిదేవతలు ఉమ మొదలు వనస్పతి భార్య జోత్స్న దాక గల దేవపత్నులు, మహా కల్పాది యోగములు, కరణములు దాక గల కాలావయ దేవతలు, ఆదిత్యుడు మొదలు రాహు కేతువుల దాక నవగ్రహ దేవతలు, స్వాయంభువ మనువు మొదలు పదునల్గురు మనువులు, విశ్వభుక్కు మొదలు దేవనాథులు పదునల్గురు, రైవతుడు మొదలుగ మనోజపుడు దాక గలవారు ముఖ్యులు. ఆత్మ మొదలు పది మంది ఆంగిరసులు క్రతువు మొదలుగ రోచమానుడు దాక విశ్వదేవులు పది మంది, అంగారకుడు మొదలు కింకిణి దాక గల ఏకాదశ రుద్రులు, భువనుడు మొదలు భృగువులును, దేవతలు మనువు మొదలు ప్రభువు దాక పండ్రెడుగురు సాధ్యులు, ధాత మొదలు విష్ణువు దాక ద్వాదశాదిత్యులు, ఏకజ్యోతి మొదలు విరాట్టు దాక గల మరుత్తులు నలుబది తొమ్మండుగురు, (చిత్రాంగదుడు మొదలుగ సురుచిదాక పేర్కొనబడినవారు) గంధర్వులు, ఆహుతులు మొదలుగ భీరువులను వారిదాక గల యప్సరోగణములు, అనవద్య మొదలు రతి లాలసదాక గల యప్సరసలు, ప్రహ్లాదుని మొదలు దితి కొడుకులు (దైత్యులు) విప్రచ్చిత్తి మొదలుగాగల దానవులు, హేతి మొదలుగ రసనుడు దాక గల రాక్షసులు సిద్ధార్థుడు మొదలు శతజిహ్వుని దాక గల యక్షేంద్రులు, శంఖుడు మొదలు కచ్ఛపము దాక గల నిధులు, పలగులు మొదలు స్కందనులు దాక పిశాచ జాతులు, బ్రహ్మచర్యవ్రతులు దాంతులు సర్వజ్ఞులు సర్వదర్శనులు నానావిధ ముఖులు నానా బాహుశిరో గ్రీవులు నాల్గుదారులు కలిసినచోట పురాట్టలక శూన్యాలయములందుండు భూతములు. మహాకాలుని నరసింహుని పురస్కరించుకొను సర్వ మాతృకలు, గుహుడు మొదలుగ నైగమేయుని దాక గల స్కంద గ్రహములు డాకినులు యోగినులు భూచరీ ఖేచరీవర్గము గరుడుడు మొదలు కుమారకుడు దాక గల సుపర్ణులు. అనంతుడు మొదలు పాణి దాకగల నాగులు, కుముదుడు మొదలు నీలుడు దాక గల దిగ్గజములు చక్రము త్రిశూలము వజ్రము నందకమునను శస్త్రములు బ్రహ్మయొక్క వాహనమైన హంస మొదలు ఉచ్ఛైశ్రవము దాక దేవతా వాహనములు కౌస్తుభము, ధర్మాది శమముదాక గుణములు, చిత్రగ్రీవుడు దండాదులు వాలఖిల్యులు.

దిగ్థేనవ శ్చతస్ర స్త్వాం సురభిశ్చ తథా నృప| అభిషించన్తు పర్వాభిర్గోభి స్సార్థం నరేశ్వర|| 105

వేదవ్యాసశ్చ వాల్మీకిః కమఠో7థ పరాశరః| దేవలః పర్వతశ్చైవ దుర్వాసాశ్చ తథా మునిః || 106

యాజ్ఞవల్క్యశ్చ జాబాలిః జమదగ్నిః శుచిశ్రవాః| విశ్వామిత్రః స్థూలశిరా శ్చ్యవనో7త్రి ర్విదూరథః || 107

ఏకతశ్చ ద్వితశ్చైవ త్రితో గౌతమ గాలవౌ | శాండిల్యశ్చ భరద్వాజో మౌద్గల్యో వేదవాహనః || 108

బృహదశ్వః కుటిశఠో జటాజాను ర్ఘటోదరః| యవక్రీతో7ర్థరైత్యశ్చ ఆత్మవా నథ జైమినిః || 109

ఋషిః శార్జరవశ్చైవ తథా7 గస్త్యో మహాతపాః |ఉన్మువు ర్ముమువుశ్చైవ ఇధ్మబాహు ర్మహోదయ ||110

కాత్యాయనశ్చ కణ్వశ్చ వల్వ కాంబోరు నందనః| ఏతే త్వా మభిషించన్తు ఋషయః పార్థివోత్తమ! || 111

పృథు ర్ధిలీపో భరతో దుష్యన్తః శత్రుజి ద్బలీ| మనుః కుకుత్థశ్చా7నేనా యువనాశ్వో జయద్రధః || 112

మాంధాతా ముచుకుందశ్చ తథా రాజా పురూరవాః | ఆయుశ్చ నహుషశ్చైవ యాయాతి రపరాజితః || 113

ఇక్ష్వాకుశ్చ యదుశ్చైవ పున ర్భూరిశ్రవా స్తథా అంబరీషశ్చ నాభాగో బృహదశ్వో మహాహనుః || 114

ప్రద్యుమ్నశ్చా7థ సుద్యుమ్నో భూరిద్యుమ్నశ్చ సృంజయః| ఏతే చాన్యే చ రాజాన న్తవ రాజన్‌! దివంగతా || 115

సమాయాంత్వభిషేకాయ విజయాయ తథా శ్రియే | పర్జన్యాద్యా స్తథా సర్వే వాస్తుదేవా స్సమాసతః || 116

ద్రుమా శ్చాషధయో రత్న బీజాని వివిధాని చ| సర్వే త్వా మభిషించన్తు రాజరాజ్యేన సత్వరాః || 117

పురుషశ్చా7 ప్రమేయాత్మా మహాభూతాని యాని చ| పృథివీ వాయు రాకాశ మాపో జ్యోతి సథైవ చ || 118

మనోబుద్ధి సథైవాత్మా అవ్యక్తశ్చ మహీపతేః| ఏతే త్వా మభిషించన్తు సమేతా వసుధా7ధివః || 119

రుక్మభౌమ శ్శిలాభౌమః పాతాలో నీలమృత్తికః| పీతో రక్తక్షితి శ్చైవ శ్వేతభౌమ స్తథైవ చ || 120

ఏతే త్వా మభిషించన్తు విజయాయ మహీపతేః! | భూలోక7థ భూవర్లోకః స్వర్లోకో7థ మపార్జనః || 121

తప స్సత్యశ్చ రాజేంద్ర! విజయాయ భవన్తుతే| జంబూ శాక కుశ కౌంచాః శాల్మిలి ద్వీప ఏవ చ || 122

గోమేధః పుష్కరశ్చైవ స్వసామ్యం ప్రదిశన్తుతే| ఉత్తరాః కురవః పుణ్యాః రమ్యా హైరణ్వత స్తథా | 123

భద్రాశ్వః కేతుమాలశ్చ వర్షశ్చైవ ఇలావృతః| హరివర్షః కింపురుషో వర్షో భారత సంజ్ఞికః|| 124

ఏతే త్వా మభిషించన్తు సమేత్య వసుధా7ధిపః ఇంద్రద్వీపః కశేరుశ్చ తామ్రవర్ణో గభ స్తిమాన్‌|| 125

నాగద్వీపాః తథా సౌమ్యో గాంధర్వో వారుణాస్తథా| ఆయం చరువసస్తేషాం స్వసామ్యం ప్రదిశన్తుతే|| 126

హిమవాన్‌ హేమకూటశ్చ నిషధో నీలపర్వతః| శ్వేతశ్చ శృంగవాన్‌ మేరు ర్మాల్యవాన్‌ గంధమాదనః|| 127

మహేంద్రో మలయ స్సహ్య శ్శుక్తిమాన్‌ ఋక్షవాంస్తథా| వింధ్యశ్చపారియాత్రశ్చ సర్వఏవ మహీధరాః|| 128

సమాగమ్యా7భిషించన్తు త్వా మద్య వసుధా7ధిపః| ఋగ్వేదో7ధ యజుర్వేద స్సామవేద స్తథైవ చ|| 129

అధర్వవేదో వేదా స్త్వా మభిషించన్తు పార్థివ!| ఇతిహోసో ధనుర్వేదో గంధర్వశ్చా7యు సంజ్ఞితః || 130

వేదోపవేదాశ్చ తథా విజయాయ భవన్తు తే | శీక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం జ్యోతిషాంగతిః|| 131

ఛందోవిచితి షష్ఠాని విజయం ప్రదిశన్తుతే| అంగాని వేదా శ్చత్వారో మీమాంస న్యాయ విస్తరః|| 132

ధర్మశాస్త్రం పురాణంచ విద్యా ఏతా శ్చతుర్ధశ| సాంఖ్యయోగః పాంచరాత్రం వేదాః పాశుపతం తథా|| 133

కృతాన్న పంచకం హ్యేత చ్ఛాస్త్రాణి వివిధాని చ| గాయత్రీ పాపశమనీ దుర్గాదేవీ మహాశివా|| 134

గంధారీ చ తథా విద్యా విజయం ప్రదివన్తుతే| దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస పన్నగాః || 135

ఋషయో మనవో గావో దేవమాతర ఏవ చ| దేవపత్య్నో ద్రుమా నాగా ః దైత్యాశ్చా7ప్సరసాం గణాః|| 136

శస్త్రాణి సర్వశాస్త్రాణి రాజానో వాహనాని చ| ఔషధాని చ రత్నాని కాలస్యా7వయవా స్తథా ||137

స్థానాని చ సమస్తాని పుణ్యా న్యాయతనాని చ| జీముతాని చ సర్వాణి తద్వికారాశ్చ యే తథా || 138

ఉక్తాని చాప్యనుక్తాని విజయాయ భవంతు తే| లవణః క్షారతోయశ్చ ఘృతమండోదక స్తథా || 139

దధిమండోదక శ్చైవ సురోదశ్చ నరాధిప! తథైవేక్షురసోదశ్చ తథా స్వాదూదకశ్చ యః|| 140

గర్భోదశ్చ స్వతోయైస్త్వా మభిషించన్తు పార్థివ! | చత్వార స్సాగరాశ్చైవ స్వేన తోయేన పార్థివః|| 141

సమాగమ్యా7భిషించన్తు విజయం ప్రదిశన్తుతే | పుష్కరశ్చ ప్రయాగశ్చ ప్రభాసో నైమిష స్తథా || 142

తథా బ్రహ్మసదః పుణ్యం గయాశీర్షం చ పార్థివ! కాలోదకో నందికుండః తధైవోత్తర మానసః || 143

స్వర్గమార్గ ప్రదశ్చైవ తథా పంచనదశ్చ యః | భృగుతీర్థం చౌజసశ్చ తథైవ7మరకంటకః|| 144

ఆశ్రమః కాళియాశ్చ తృణబిందోస్తథా7శ్రమః| గోపతీర్థం చాపతీర్థం విమల స్స్వర్గ ఏవ చ|| 145

జంబూమార్గశ్చ రాజేంద్ర! పుణ్య స్తాండులికా7శ్రమః | కపిలస్య తథా తీర్థే వాటిక షండికే|| 146

మహాసరస్తథా7 గస్త్యః కుమారీ తీర్ధ ఏవచ| గంగాతీరః కుశావర్తో బిల్వకో నీలపర్వతః||147

వరాహ పర్వతశ్చైవ తీర్థః కనఖల స్తథా | స్వర్గంధా వశకుంభా చ తథా శాకంభరీ చ యా|| 148

భృగుతుంగః సకుబ్జా7మ్రః కపిలస్య తథాశ్రమమ్‌|| 149

చమసోద్భేవదనః పుణ్యస్తథా వినశన శ్శుభః | అజతుంగశ్చ సోమశ్చ అజో గంధశ్చ పార్థివ!|| 150

కాలింజరశ్చ కేదారో రుద్రకోటి స్తథైవ చ|

మహాలగ్నశ్చ రాజేంద్ర! వదనా7 శ్రమ ఏవ చ నందా చ సూర్యతీర్థం చ సోమతీర్ధం శతక్రతోః|| 151

అశ్వినో ర్వరుణస్యా7పివాయో ర్వైశ్రవణస్య చ | బ్రహ్మణశ్చైవ శర్వస్య యమస్య చ్యవనస్య చ|| 152

విరూపాక్షస్య ధర్మస్య తథా చా7ప్సరసాం నృపః | ఋషీనాం చ వసూనాంచ సాధ్యానాం మరుతాం తథా||153

ఆదిత్యానాం చ రుద్రాణాం తథా చాంగిరసాం నృప| విశ్వేదేవ భృగూణాం చ గంధర్వాణాం చ మానద! || 154

ప్లక్ష ప్రస్రవణశ్చైవ సుశేణశ్చ నరాధిప! శాలిగ్రామ సరశ్చైవ వారాహో వామన స్తథా|| 155

కామాశ్రమ స్త్రికూటశ్బ చిత్రకూట స్తథైవ చ| సప్తర్చః క్రతుసారశ్చ తథా విష్ణుపదం సరః || 156

కపిలస్య తథా తీర్థం వాసుకే స్తీర్థ మేవచ| సింధుత్తమం తపో దానం తథా శూర్పాకర శ్శుభః || 157

పౌండరీకశ్చ రాజేంద్ర! గంగా సాగర సగమః| సింధు సాగరయో శ్చైవ సంగమ స్సుమనోహరః|| 158

తథా కుందా వసుంధశ్చ మానసం చ మహత్సరః | తథా బిందుసరః పుణ్యం సరశ్చా7చ్ఛోదకం తథా || 159

ధర్మారణ్యం ఫల్గుతీర్థం సవిముక్తం తథైవ చ|లౌహిత్యశ్చ తథా పుణ్యో బదరీ పాపన శ్శివః|| 160

తీర్ధం సప్తఋషీణాం చ వహ్నితీర్థం చ పార్థివ| వస్త్రా7పథ స్తతో మేష శ్చాగలేశ స్స పార్థివః || 161

పుష్పన్యాస స్సకామేశ స్తీర్థో హంసపద స్తథా | అశ్వశీర్షః సకృష్ణాఖ్యో మణిభద్ర స్తధైవ చ || 162

దేవికా సింధుమార్గశ్చ స్వర్ణబిందు స్తథైవచ| ఆహల్యక స్తథా తీర్థ స్తీర్థ శ్చైరావత స్తథా|| 163

ఐరావతి సముద్భేదే తీర్థం భోగయశ స్తథా | కరవీరాశ్రమ శ్చైవ నాగమోదానిక స్తథా || 164

పాపమోచనిక శ్చైవ ఋణమోచనిక స్తథా| ఉద్వేజన స్తథా పుణ్యః పుణ్యశ్చ హరిశేశ్వరః|| 165

దేవబ్రహ్మసరః పుణ్యం సర్పి ర్దర్వీ చ పార్థివః | ఏతే చాన్యే చ బహవః పుణ్య సంకీర్తనాశ్శుభాః|| 166

తోయై స్త్వా మషిభించన్తు సర్వపాతక నాశ##నైః| గంగా మహానదీ పుణ్యా హ్రాదినీ హ్లాదినీ తథా || 167

పావనీ చ తథా సీతా చక్షు స్సింధుశ్చ నర్మదా | సుప్రభా కాతారాక్షీ చ శిథిలా మానసీ హ్రదా|| 168

సరస్వత్యోఘనాదా చ సువేణు ర్విమలోదకా | సిప్రా శోణః శతద్రుశ్చ సరయూ ర్గండకీ తథా|| 169

అచ్ఛాదో చ విపాశా చ చంద్రవిభాగా ఇరావతీ| వితస్తా దేవికా రంభా సీతా దేవహ్రదా శివా||170

తథైవేక్షుమతీ పుణ్యా కౌశికీ యమునా తథా | గోమతీ ధూతాపాపా చ బాహుదా చ దృషద్వతీ|| 171

నిశ్ళీరా చ తృతీయా చ లౌహిత్యశ్చ మహానదః| వేదస్మృతి ద్వేదసినీ వేత్రఘ్నీ వరదా తథా || 172

వర్ణా మా చందనా చైవ బహునీరా కుముద్వతీ | పారా చర్మణ్వతీ రూపా విదిశా వేణువత్యపి|| 173

అవన్తీ చ తథా కున్తీ సురసా చ పలాశినీ | మందాకినీ దశార్ణా చ చిత్రకూట దృషద్వతీ|| 174

తమసా పిప్పలా సేనీ కరమోదా పిశాచికా| చిత్రోపలా చిత్రవర్ణా మంజులా వాలుకావతీ || 175

శుక్తిమతీ సిలీ రంధ్రా సంకుణాత్యయ కాస్తతః తాపీ వయోష్ణీ నిర్వింధ్యా సితా చ నిషధావతీ||176

వేణా వైతరణీ భీమా చర్మా రామా తథా కుహుః | తోయా చైవ మహాగౌరీ దుర్గా మతుశిలా తథా || 177

గోదావరీ భీమరధీ కృష్ణా వేణా చ వంజులా| తుంగభద్రా సుప్రకారా బాహ్యా కావేరి రేవ చ || 178

కృతమాలా తామ్రపర్ణీ పుష్పజా హ్యుత్పలావతీ| త్రిసమా ఋషికుల్యా చ ఇక్షుకా త్రిదివాలయా || 179

లాంగూలినీ వంశధరా సుకుసారా కులావతీ | ఋషికా కరివేగా చ మందగా మందవాహినీ|| 180

కృపీ దర్వీ దయా వ్యోమా పరోష్ణీ కోలవాహినీ | కంపనా చ విశల్యా చ కరతోయా7ంశువాహినీ || 181

తామ్రా7రుణా వేత్రవతీ గోమతీ చా7థ నద్యపి | అద్రిణీ త్రికసా చైవ సుప్రతారా హిరణ్వతీ || 182

ఆపగా చా7లకా భాసీ సంధ్యా చ మడవా నదీ | నందా చా7లకనందా చ శుద్ధా చ వసువాహినీ || 183

ఏతా శ్చా న్యాశ్చ రాజేంద్ర! నద్య స్త్వాం విమలోదకాః | సర్వ పాప ప్రశమనాః సర్వలోకస్య మాతరః || 184

స్వతోయ పూర్ణైః కలశై రభిషించన్తు పార్థివ! ||

ఏతై ర్యథో క్తైర్నృప! రాజరాజ్యే దత్తభిషేకః పృధివీం సమాగ్రామ్‌ |

ససాగరాం భుంక్ష్వ చిరం చ జీవః | ధర్మే చ తే బుద్ధి రతీవ చాస్తు || 185

ఇతి విష్ణుధర్మోత్తరే ద్వితీయ ఖండే

భార్గవరామంప్రతి పుష్కర వ్యాఖ్యానే అభిషేకమంత్రో నామ ద్వావింతితమో7ధ్యాయః

దిశా ధేనువులు నాల్గు సురభియు వేదవ్యాసులు మొదలు వల్వకాంబోరునందనుని దాక గల ఋషులు (చూ.106 నుంచి 111శ్లో) పృధువు మొదలు (112 శ్లోకము నుంచి 115 దాకగల సృంజయని దాక ) స్వర్గ గాములైన ధర్మచక్రవర్తులు -పర్జన్యాదులు వాస్తుదేవతలు. సర్వ ద్రుమములు ఔషధులు రత్నబీజములు-అప్రమేయాత్మయగు పురుషుడు (పరబ్రహ్మ) మొదలు అవ్యక్తముదాక గల తత్త్వములు, 118-119 శ్లోకాలలో రుక్మ భౌమాద్యధోలోకములు భూలోకాధి సప్తలోకములు జంబూ ప్రముఖ ద్వీపములు నవవర్షములు ఇంద్రాది ద్వీపములు హిమవంతుడు మొదలగ సప్తకుల పర్వతములు ఋగ్వేదాదులు (నాలుగు వేదములు) శిక్షాది వేదాంగములారు మీమాంస న్యాయము ధర్మశాస్త్రము పురాణముం గలిసిన పదునెన్మిది విద్యలు, సాంఖ్య పాంచ రాత్రములు, పాశుపతము, కృతాన్నపంచకము, శాస్త్రములు గాయత్రి దుర్గ గంధారీ విద్య దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసపన్నగులు ఋషులు మానవులు గోవులు దేవతలు దేవపత్నులు ద్రుమములు నాగులు దైత్యులు రాజులు వాహనములు ఔషధములు దేవాలయములు మేఘములు వానిలో రకములు ఈ చెప్పినవి చెప్పనివి లవణాది సప్తసముద్రములు పుష్కరాది తీర్థములు దర్వి దాకగల పుణ్య సరస్సులు గంగ మొదలు 167 శ్లోకము మొదలు 183 శ్లోకము దాక పొర్కోన బడిన పుణ్యమహానదులు, తమ పుణ్యతోయములచే నింపబడిన కలశములచే నిన్నభిషేకించిందురుగాక!

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున రాజాభిషేక మంత్రవిధియను యిరువదిరెండవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters