Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఇరువదియారవ యధ్యాయము - దుర్గసంపత్తి

పుష్కరః- రాజా సహాయ సంయుక్తః ప్రభూతయవసేంధనమ్‌ | రమ్య మానతసామస్తః పశవ్యం దేశ మావసేత్‌ 1

వైశ్య శూద్ర జనప్రాయ మనాహార్యం తథా పరైః | కించి ద్ర్బాహ్మణ సంయుక్తం బహు కర్మకరం తథా || 2

ఆదేవమాతృకం కర్మ స్వనురక్తజనాచితమ్‌ | కరైరపీడితం చాపి బహుపుష్పఫలం తథా || 3

ఆగమ్యం పరచక్రాణాం తద్వాదసహ మాపది | సమదుఃఖసుఖం రాజ్ఞః సతతం చ ప్రియే స్థితమ్‌ || 4

సరీసృప విహీనం చ వ్యాధితస్కర వర్జితమ్‌ | ఏవంవిధం యథాలాభం రాజా విషయ మావసేత్‌ || 5

తత్ర దుర్గం నృపః కుర్యాత్‌ షణ్ణా మేకతమం బుధః | ధన్వదుర్గం మహీదుర్గం నరదుర్గం తథైవ చ || 6

వార్‌క్షం చైవాంబుదుర్గం చ గిరిదుర్గం చ భార్గవ ! | సర్వేషా మేవ దుర్గాణాం గిరిదుర్గం ప్రశస్యతే || 7

దుర్గం చ పరిఖోపేతం నృపాట్టాలకసంయుతమ్‌ | శతఘ్నీయంత్ర ముఖ్యైశ్చ శతశ శ్చ తథా యుతమ్‌ || 8

గోపురం సంకపాటం చ తత్ర స్యాత్సుమనోహరమ్‌ | సపతాక గజారూఢో యేన రాజా విశే త్పురమ్‌ || 9

చతస్రస్చ తథా తత్ర కార్యాశ్చాపణవీధయః ఏకస్మిం స్తత్ర వీధ్యగ్రే దేవవేశ్మ భ##వే ద్ధృఢమ్‌ ||10

వీధ్యగ్రే చ ద్వితీయ వై రాజవేశ్మాభిధీయతే | ధర్మాధికరణం కార్యం వీధ్యగ్రే చ తృతీయకే || 11

చతుర్థే చైవ వీథ్యగ్రే గోపురం చ విధీయతే | ఆయతం చతురస్రం వా వృత్తం చాకారయే త్పురమ్‌ || 12

ముక్తిహీనం త్రికోణం చ యవమధ్యం తథైవ చ | అర్ధ చంద్రప్రకారంచ వజ్రాకారం చ వర్జయేత్‌ || 13

ఆర్ధచంద్రం ప్రశంసన్తి నదీతీరేతు తద్వశాత్‌ | అన్యత్ర తత్ర కర్తవ్యం ప్రయత్నేన విజానతా || 14

రాజ్ఞః కోశగృహం కార్యం దక్షిణ రాజవేశ్మనః | తస్యాపి దక్షిణ భాగే గజస్థానం విధీయతే || 15

గజానాం ప్రాజ్ముఖీ శాలా కర్తవ్యా చాప్యుదజ్ముఖీ | ఆగ్నేయే చ తథా భాగే ఆయుధాగార ఇష్యతే || 16

మహాసనం చ ధర్మజ్ఞ ! కర్మశాలా స్తథా పరాః | గృహం పురోధసః కార్యం వామతో రాజవేశ్మనః || 17

మంత్ర దైవవిదాం చైవ చికిత్సా కర్తు రేవ చ | తత్రైవ చ తథా భాగే కోష్ఠాగారం విధీయతే || 18

గవాం స్థానం తు కర్తవ్యం తురగాణాం తథైవ చ | ఉత్తరాభిముఖీ శ్రేణి తురగాణాం విధీయతే || 19

ప్రాజ్ముఖీ చాపి ధర్మజ్ఞ ! పరిశేషా విగర్హితా | తురగాశ్చ తథా ధార్యాః ప్రశ##సై#్త స్సార్వ రాత్రికైః || 20

కుక్కుటాన్‌ వానరాం శ్చైవ మర్కటాంశ్చ నరాధిపః | ధారయే దథ శాలాసు సవత్సాం ధేను మేవ చ || 21

అజాశ్చ ధార్యా యత్నేన తురగాణాం హితైషిణా | గో గజాశ్వావిశాలాసు తత్పురీషస్య నిష్క్రమమ్‌ || 22

అస్తంగతే స కర్తవ్యం దేవదేవే దివాకరే | తత స్తత్ర యథాన్యాయం రాజా విజ్ఞాయ సారవిత్‌ || 23

దద్యా దావసథ స్థానం సర్వేషా మవిశేషతః | యోధానాం శిల్పినాం చైవ సర్వేషా మవిశేషతః || 24

దద్యా దావసథాన్‌ దుర్గే మంత్ర కాలవిదాం సతామ్‌ | గోవైద్యా నశ్వవై ద్యాంశ్చ గజవైద్యాం స్తథైవ చ || 25

ఆహరేత భృశం రాజా దుర్గే పర బలారుజః | కుశీలవానాం విప్రాణాం దుర్గే స్థానం విధీయతే || 26

న బహూనాం నతై ర్డుర్గం వినా కార్యం తథా భ##వేత్‌ | దుర్గే చ యంత్రాః కర్తవ్యాః నానా ప్రహరణాన్వితాః || 27

సహస్రఘాతినో రామ ! తైస్తు రక్షా విధీయతే | దుర్గే ద్వారాణి గుప్తాని కార్యాణ్యపి చ భూభుజా || 28

సంచయ శ్చాత్ర సర్వేషాం చాయుధానాం ప్రశస్యతే | ధనుషాం క్షేపణీయానాం తోమరాణాం చ భార్గవ ! || 29

శరాణా మథ ఖడ్గానాం ఖనకానాం తథైవ చ | లగుడానాం గుడానాం చ హుడానాం పరిఘై స్సహ || 30

అశ్వానాం చ ప్రభూతానాం ముద్గరాణాం తథైవ చ | కణియానాం త్రిశూలానాం పట్టిశానాం చ భార్గవ ! 31

ప్రాసానాం చ త్సరూణాం చ శక్తీనాం చ నరోత్తమ ! | పరశ్వధానాం చక్రాణాం చర్మణాం చర్మభి స్సహ || 32

కుద్దాల రజ్జు వేత్రాణాం పిటికానాం తథైవ చ | హ్రస్వకానాం చ పాత్రాణా మగరస్య చ సంశ్రయమ్‌ || 33

సర్వేషాం చిత్ర భాండానాం సంచయ శ్చాత్ర ఇష్యతే | వాదిత్రాణాం చ సర్వేషా మౌషధానాం తథైవచ || 34

యవసానాం ప్రభూతానాం చేంధనస్య చ సంచయమ్‌ | గుడస్య సర్వ తైలానాం గోరసానాం తథైవ చ || 35

చర్మణాం చ ససర్జానాం స్నాయూనా మస్థిభి స్సహ | గోరసస్య పటానాం చ ధాన్యానాం సర్వత స్తథా || 36

తథైవ ప్రపటానాం చ యవ గోధూమయో రపి | రత్నానాం సర్వ వస్త్రాణాం లోహానాం చాప్యశేషతః || 37

కలాయ ముద్గ మాషాణాం కణకానాం తిలైస్సహ | తథా చ సర్వ సస్యానాం పాంశుగోమయయో రపి || 38

సణసర్జరసం భూర్జ జతు లాక్షా కటంకటామ్‌ | రాజా సంచిను యా ద్దుర్గే యచ్చాన్యదపి కించన || 39

కుంభా స్సాశీవిషా ధార్యా వ్యాఘ్ర సింహాదయ స్తథా | మృగాశ్చ పక్షిణశ్చైవ పశవశ్చ పృథగ్విధాః || 40

సంచేయాని విరుద్ధానాం సుగుప్తాని పృథక్‌ పృథక్‌ | కర్తవ్యాని మహాభాగ ! యత్నేన పృథివీక్షితా || 41

ఉక్తాని చాప్యనుక్తాని రాజద్రవ్యా ణ్యశేషతః | సుగుప్తాని పురే కుర్యాజ్జనానాం హితకామ్యయా || 42

జీవ కర్షవ కాకోలీ రామలక్యః పరూషకమ్‌ | శాలిపర్ణీ పృశ్ని పర్ణీ ముద్గపర్ణీ తథైవ చ || 43

మాషవర్నీ తథా చైవ సారివే ద్వే బలాభయమ్‌ | వీరాశ్వగంధా పృధ్వీకా బృహతీ కంటాకారికా || 44

శృంగాటికా రోద్ర గోధీ వర్షాభూ దర్భ గుంద్రకా | మధువర్ణీ విదార్యౌ ద్వే మహాదుర్గా మహా తథా || 45

ధన్వనా మహబు గ్వ్యాహ్యా త్రికోటి రణ్డకం విషమ్‌ | పర్ణాసనాహ్వీ మృద్వికా ఫల్గుః ఖర్జూర యష్టికా || 46

శుక్రాతి శుక్ర కాశ్మర్యశ్ఛత్రాతిచ్ఛత్ర వీరణా | ఇక్షు రిక్షు వికారశ్చ ఫానితా ద్యాశ్చ భార్గవ ! || 47

సహాశ్చ సహదేవాశ్చ విశ్వేదేవాఢ రూషకమ్‌ | మధూకపుష్పం హంసాఖ్యా శతపుష్ప మధూలికా || 48

శతావరీ మధూకం చ ప్రియాలం తాల మేవ చ | ఆత్మగుప్తా కట్ఫలాఖ్యా దరదా రాజసేరుకా || 49

రాజర్షభక ధానక్యా ఋష్యప్రోక్తా తథోత్కటా | కటంకటా పద్మబీజం గోవల్లీ మధువల్లికా || 50

శీతపాకీ కులిం గాక్షీ కాకబిహ్వోరుపత్రికా | ఏర్వారా మ్రపసౌ చోభౌ ముంజాతక పునర్నవే || 51

కాశేరుకా తుగా క్షీరా బిల్వేశాలూక కేసరమ్‌ | శూకధాన్యాని సర్వాణి శంబీ ధాన్యాని యాని చ || 52

క్షీరం క్షౌద్రం తథా శుక్లం మజ్జా తైలం వసా ఘృతమ్‌ | నికోచాభిషుకాక్షోటం వాతాపం సోరుఖాణకమ్‌ || 53

ఏవ మాదీని చాన్యాని విజ్ఞేయో మధురో గణః | రాజా సంచినుయా త్సర్వం పురే నివశేషతః ||54

దాడిమా మ్రాతకాం లీనం తింతిడీకావ్లు వేతసమ్‌ | భవ్యకః కండలీక శ్చ మకరంద కరూషకమ్‌ ||55

బీజ పూరక కాండీర మాలతీ రాజ ధన్వనా | కోలక ద్వయ వర్ణాని ద్వయో రల్లీకయో రపి ||56

పారేవతం భాగరికం ప్రాచీనా రూక్ష మేవ చ | కపిత్థామలకం చుక్రం కలిందం చ శధస్య చ ||57

జాంబవం నవనీతం చ సౌవీరకతుపోచకే | సురాసవం చ మద్యాని మండం తక్ర దధీని చ || 58

శుక్లాని చైవ సర్వాణి జ్ఞేయా న్యావ్లు గణాని వై |

సైంధవో ద్భేద నాదేయ పాక్య సాముద్ర రోచనమ్‌ | కూప్య సౌవర్చలవణం వాలకైలోప బాహుకమ్‌ | 59

ఊషక్షారం కాల భస్మ విజ్ఞేయో లావణో గణః | ఏవ మాదీని చాన్యాని రాజా సంచిసూయాత్‌ పురే || 60

పిప్పలీ పిప్పలీమూలం చవ్య చిత్రక నాగరమ్‌ | కుథేరకం సమిరిచం శిగ్రుం భల్లాత సర్షపాః || 61

కుష్టాజమోద కిటిభ హింగు మూలక థాన్యకమ్‌ | కారవ్యః కుచికా దాత్యః సుముఖః కాలపాలికా || 62

ఫణిజ్జకోథ లశునం భూస్తృణం సురస స్తథా | కాయస్థా చ వయస్థా చ హరితాల మనశ్శిలా || 63

అమృతాగురుదన్తీచ రోహితం కుంకుమం తథా | అవల్గుజః సోమరాజీ కృష్టసర్పా శిలాజతు || 64

కపిల్లకం తైజవతీ విడంగ నిచులాని చ | ఏడకాక్షీ ప్రకీర్యా చ పుండీరం స్వర్ణయూధికా || 65

సౌగంధికం గృంజనకం వేశ్మధూమోథ రోచనా | యవా ఐరండ కాండీరం సత్యకీ హపుషా తథా || 66

సర్వపీతాని సూత్రాణి ప్రాయో హరితకాని చ | ఫలాని చైషాం చ తథా సూక్ష్మైలా హింగు పత్రికా || 67

ఏవ మాదీని చాన్యాని గణం కటుక సంజ్ఞకమ్‌ | రాజా సంచిసుయా ద్దుర్గే ప్రయత్నేన భృగూత్తమ ! || 68

ముస్త చందన హ్రీబేర కృతమాలక దారవమ్‌ | హరిద్రా నలదోశీర మంక్తామలక వాస్తుకమ్‌ | 69

పూర్వా పటోల కటుకా పాఠ త్వక్పత్ర తుమ్బకః | కిరాత కిత్తకౌ నింబం యష్టికా తివిషా తథా || 70

తాలీశపత్రం తగరం సప్తవర్ణం నికాస్తకమ్‌ | కాగోదుంబరకౌ దీప సుషవీ కణికాసనాః || 71

షడ్‌గ్రంధా చ హిణీ మాంసీ పర్పటం మదయన్తికా | రసాంజనం భృంగరసం పతంగా పరిపైలవమ్‌ || 72

దుస్స్పర్శా గురుణీ కాశో రసకం గంధనాకులీ | తుషవల్లీ వ్యాఘ్రనఖం శాంగష్టా చతురంగులః || 73

రాస్రా చైవ కుశా స్ఫీతా హరేణు రథ రేణుకా | వేత్రాగ్రం వేతస స్తుర్వీ విషాణం లోహ మంజనమ్‌ || 74

మాలతీ వనతిక్తాఖ్యా వృష గోజిహ్మ కర్కశాః | పర్పటీచ గుడూచీ చ గణ స్తిక్త సంజ్ఞకః || 75

ఏవ మాదీని చాన్యాని రాజా సంచినుయాత్‌ పురే | అభయా మలకే చోభే తథైవ చ విభీతకమ్‌ || 76

ప్రియంగు ధాతకీ పుష్పమోచ రోఘాసనార్జునా | అనంతామ్రాస్థినాగాహ్వా స్యోనా కంకఫలం తథా || 77

భూర్జపత్రం శిఖోద్భేదం పాటలా వకులో ష్టకమ్‌ | సమంగా త్రివృతామూలం కర్పాసా గైరికాంజనమ్‌ || 78

విద్రుమం సమధూచ్ఛిష్టం కుంభీక కుముదోత్పలే | న్యగ్రోధౌదుంబరా శ్వత్థ కింశుకాః శింసుపా శమీ || 79

ప్రియాలా ఏలుకా సారం శిరీషం పద్మకం తథా |

బిల్వాగ్నిమంధం ప్లక్షశ్చ శ్యామాకాచయచకౌయనమ్‌ | రాజాదనం కలీరం చ చంపకప్రియకౌ తథా || 80

అంకోలోశీర బదరాః కదంబ ఖదిరాహ్వయమ్‌ | యేషాం పత్రాణి సారాణి మూలాని కుసుమాని చ || 81

ఏవ మాదీని చాన్యాని కషాయాఖ్యో గణోస్తి చ | ప్రయత్నేన భృగుశ్రేష్ఠ ! రాజా సంచినుయా త్పురే || 82

కీటాశ్వమారణ యోగా వ్యంగతాయాం తథైవ చ | వాతా ధూమాంబు మార్గాణాం దూషణాని తథైవ చ || 83

ధార్యాణి పార్థివై ర్దుర్గే నాహం పార్థివై ర్దుర్గే నాహం వక్ష్యామి తాని తే | విషాణాం ధారణం కార్యం ప్రయత్నేన మహీభుజా || 84

విచిత్రా శ్చాగదా ధార్యా విష ప్రశమనా స్తథా | రక్షో భూతాదిశమనాః పాపఘ్నూః పుష్టి వర్థనాః || 85

కాలావిదశ్చ పురుషాః పురే ధార్యాః ప్రయత్నతః | భీతాన్‌ ప్రమత్తాన్‌ కుపితాన్‌ తథైవ చ విమానితాన్‌ || 86

కుభృత్యా నకులీనాంశ్చ న రాజా వాసయే త్పురే | 87

యంత్రాయుధాట్టాలచయోపపన్నం | సమగ్ర ధాన్యౌషధ సంప్రయుక్తమ్‌ |

వణిగ్జనైః శోభన మానసేత | దుర్గం సుగుప్తం నృపతి స్సదైవ || 88

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే దుర్గసంపత్తిర్నామ షడ్వింశోధ్యాయః.

పుష్కరుండనియె: రాజు సహాయ సంపన్నుడై సమృద్ధమైన యవసము (తృణసమృద్ధి) వంట చెఱకు గలది రమ్య మైనదియు, పశు సమృద్ధమైనదియు నగు దేశము నందు నివాసము సేయ వలెను. వైశ్యులు శూద్రులు నిండుగా నున్నది, శత్రువులకు లొంగనిది బ్రాహ్మణులు కొలదిగ నున్నది, బహువిధ కర్మ సమృద్ధము నయినది, దేవమాతృకము కానిది (జీవనదుల ప్రాంతముగా గూడదన్నమాట) వారి వారి పనులందు అనురక్తులయిన జనులు గలది, పన్నులపీడ లేనిది, పుష్పఫల సమృద్ధమైనది. శత్రు చక్రముల కగమ్యము, ఆపద వేశ నా శత్రు దండయాత్ర సడుల కోర్వగలది, రాజుతో, సమ దుఃఖానుభవము గలది, రాజు యొక్క ప్రియమే యెల్లపుడుకోరునది, సర్పాది బాధలు లేనిది, వ్యాధులు దొంగలు లేనిదియు నైన యీలాంటి ప్రదేశమును యధాలాభముగ రాజు నివాసము సేయవలెను. అక్కడ నాఱు రకము లయిన దుర్గము లందొక విధమైన కోటను నిర్మించుకొన వలెను. 1. ధన్వదుర్గము = నిర్జల ప్రదేశము 2. మహీదుర్గము = మట్టికోట 3. నరదుర్గము = సేనాదుర్గము 4. వార్‌క్షదుర్గము = వృక్షములకోట 5. అంబుదుర్గము = నీటితో నేర్పరుప బడిన కోట 6. గిరిదుర్గము = కొండలతో నావరింప బడిన కోట. వీటన్నిటిలో గిరిదుర్గము చాల ప్రశస్తము. కోట చుట్టు అగడ్త (కందకము) యుండ వలెను. కోట బురుజు ముందు ద్వారము మీద అట్టాలకము (కోటబురుజు) దానియందు శతఘ్నులు (బాంబులు) యంత్ర శ్రేష్ఠములు వందల కొలది యుండవలెను. రాజ ద్వారము మీద గోపురము దానికి ద్వారములు చక్కగా నుండవలెను. జెండాతో గూడ యేనుగు నెక్కి రాజు పుర ప్రవేశము చేయుట కనువుగా నాగోపురద్వార మెత్తుగా నుండవలెను. రాజు యొక్క గోపురము ముందు నాల్గు రహదారులు దాని యందు బజారులు తీర్చబడవలెను. ఒక్కోక్క రాజమార్గము చివర దృఢమైన దేవాలయ ముండవలెను. రెండవ వీధి చివర రాజ సౌధము, మూడవ వీధి చివర ధర్మాధికరము (న్యాయస్థానము) నిర్మింపవలెను. నాల్గవ రాజమార్గము చివర నలుచదరము విశాలమునైన గోపురముండవలెను. అది గుండ్రముగానైన నుండవచ్చును. ముక్తిహీనము (విడుపు లేనిది దొడ్డిదారి లేనిది) త్రికోణము యవధ్యానపు గింజ నడిమి యాకారము గలది అర్ధచంద్రాకారము వజ్రాకారమునుగా నా గోపుర ముండ గూడదు. నదీతీర మందు గోపుర మర్ధచంద్రాకారముగా ప్రశస్తము, రాజుయొక్క కోశగృహము, రాజసౌధమునకు దక్షిణదిశగా నుండవలెను దానికి దక్షిణముగ గజశాల అదియు తూర్పు ముఖము గాని పడమట ముఖముగా గాని నిర్మింపవలెను. ఆగ్నేయమూల నాయుధాగారము-వంటయిల్లు కర్మాగారములు నుండవలెను. రాజగృహమున నెడమ వైపు పురోహితుడు మంత్రి దైవజ్ఞుడు వైద్యుడు నను వారి గృహము లుండవలెను. అక్కడనే కోష్ఠాగారము రాజగృహ మెడమ ప్రక్కనే గోశాల అశ్వశాలయు గూడ నుండవలెను. ఆశ్వశ్రేణి నుత్తరాభిముఖముగా గట్టివేయవలెను. తూర్పు ముఖమైనను మంచిదే. అశ్వధారులు(గుఱ్ఱములను కాయువారు) ప్రశస్తులు సార్వ రాత్రికులు రాత్రి కూడ వానిని గనిపెట్టుకొని వారు)గా నుండవలెను. కోళ్ళు కోతులు కొండముచ్చులను దూడ తోడి గోవులను నాయా శాలల యందుంచి కాపింపవలెను. తురగముల క్షేమము కొరకు మేకలను సంరక్షింపవలెను. ఆవు ఏనుగు గుర్రములయొక్క శాలల యందు పురీషమును సూర్యాస్తమయయిన పిమ్మట తొలిగింప రాదు. అటుపై సారము తెలిసిన రాజు వారివారి సత్తువలనెరింగి యోధులకు శిల్పులకు కాలజ్ఞులకు కోటలోనే (జ్యోతిషికులకు) నివాస గృహముల నొసంగవలెను. గోగజాశ్వ (వైద్యులకు) చికిత్సకులకు గూడ కోటలోనే నివాస మేర్పరుపవలెను. గాయకులకు విప్రులకు దుర్గమందు స్థానము కల్పింపవలెను. వీరు గాకమరి యితరులచే కోట సమ్మర్ధము గాకూడదు. నానావిధస్త్రశస్త్రములతో యంత్రములా కోటలో సమకూర్పవలెను. అవి వేలమంది నొక్క మారు చంపు నదిగా నుండవలెను. వాని చేతనే దుర్గ రక్ష జరుగును. మరియు నాదుర్గ మందు రహస్య ద్వారముల నేర్పరుపవలయును. వీని యందు ఆయుధ సముదాయము నుంచవలెను. ధనస్సులు క్షేపణులు తోమరములు అమ్ములు గడ్డపారలు ఇనుప బడితెలు దుడ్లు పరిఘలు రాళ్ళు ఇనుప గడియలు కణియములు త్రిశూలములు ఈటెలు కత్తులు మొదలగు వాని పిడులు గండ్రగొడ్డళ్ళు చక్రములు చర్మములు చిల్లి కోలలు బెత్తములు చిన్న గడియలువిషము నింపిన పిడచలు చిత్రవర్ణము లయిన పాత్రలు సమృద్దమయిన గడ్డి పచ్చిక మేత వంటచెరుకు బెల్లము సర్వతైలము గోరసము స్నాయువులు అస్థులు అన్నిరకాల ధాన్యపు గాదెలు సర్వరత్నములు సర్వ వస్త్రములు లోహములు బఠాణీలు పెసలు మినుములు శనగలు సర్వ సస్యమములు పాంశు గోమయములు, సర్జరసము, భుజపత్రి, లక్క మానిపసుపు మొదలగు నాయా వస్తువులను రాజకోటలో నిలువచేయవలెను. పాము విషము నింపిన కడవలను భద్రపరుచవలెను. పులులు సింహములు మొదలగు మృగములు పక్షులు సమకూర్చవలెను. తమ రహస్య మేదియు తెలియనీయరాదు. ఈ చెప్పినవి నగు ద్రవ్యములను ప్రజాహితము గోరి రాజు భద్రపరచవలెను. వేగిస, కాకోలి, ఉసరిక, నేలవుసిరిక, ఖర్జూరము, శాలిపర్ణి పృశ్నిపర్ణి, సురపొన్న, కారుమినుము పాలసుగంధి కరక్కాయ నేలములగ వట్టివేరు పెన్నేరు నల్లజీలకఱ్ఱ నేలమునగవాకుడు పరికె గడ్డలు లొద్దుగ పిండికొండ గలిజేరు దర్భలు యుష్టిమధుకము తెల్లనేల గుమ్మడి నీలి ధన్వనము మహఋకు వాహ్య త్రికోటి దండకము అతివస నల్లగొగ్గెర ద్రాక్షమేడి ఖర్జూరము యష్టిమధుకము శుక్రము అతి శుక్రము కాశ్మీరి అడవిసదాప అవురు గడ్డి చెఱకు చెరుకురసము, ఖండశర్కర పిల్లిపెసర అతిబల విశ్వేదేవ రూషకము ఇప్ప హంస శతపుష్ట నీలి పిల్లిపీచర ప్రియాలముతాలము దూలగుండి పినగుమ్మడి ఇంగిలీకము రాజశేరుక రాజర్షభము కధానక్య ఋష్యప్రోక్త లవంగములు అచ్ఛుమనుడి పుష్పవృక్ష విశేషము, పద్మబీజములు మధువల్లీ శీతపాణి కలింగాక్షి కాకజిహ్వా ఉరుపత్రిక దోసత్రప్సము ముంజాతక గలిజేరు కాశేరుక తుగా క్షీర బిల్వ శాలూకము కేసరము, శృకధాన్యము శంబీ ధ్యానము. పాలు తేనె శుక్లము మజ్జ తైలము వస ఘృతము నికోచము అభిషుకము అక్షోటము వాతాపము ఉరుబాణకము నివి గాక పెక్కు వస్తువులు మధుర గణమనబడును. వీనిని రాజు తన పురమందు ప్రోగు చేయవలెను. దానిమ్మ అంబాళము నల్లమామిడి చింత పుల్లప్రబ్బలి భవ్యకము కండలీకము మకరందము మాదీఫలము ఉత్తరేణుమాలతి రాజధన్వనము కోలకద్వయ పర్ణములు అల్లీకద్వయ పర్ణములు పారేవతము భాగరికము ప్రాచీనారూక్షము వెలగ ఆకులకము చక్రము కువిందము జాంబవము నవనీతము సౌవీరము తుపోచకము సురాసవము మద్యము శుక్లము నెల్లి అవ్లుగణము. సైంధవము నాదేయము పాక్యము పాముద్రము రోచనము లాప్యము సౌవర్చలవణము విడము వాలకైలోపబాహుకము ఊషక్షారము కాలభస్మము సైంధవము ఇవి లవణ గుణము పిప్పిలీ పప్పిలీ మూలము చవ్యము చిత్రకము నాగరము శిగ్రువు కుఠేరుకము మిరియాలు జీడిమామిడి అవాలు చెంగల్వకోష్టు వాము కిటిభము ఇంగువ మూలకము ధనియాలు కాలవేము ''అంధాహి'' అను చేప దాత్యము సుముఖము కుంకుష్టమృత్తిక మరువము ఉల్లి వాసనగడ్డి సురసము కరక్కాయ ఉశిరిక అరదళము మణిశిల అమీత అగురుదంతి రోహితము కుకుభము కారుగచ్చ సోమరాజి మొగలి గజపిప్పలి తేజవతి వాయువిడంగములు ఎఱ్ఱగన్నేరు నీడకాక్షి పూతి పుండీరము, స్వర్ఱ యూదికము చెంగల్వ నెల్లుల్లి వేశ్మధూమము గోరోజనము యవలు అముదము ఉత్తరేణు సత్యకి బోడతరము సర్వపీతము లయిన సూత్రములు హరితకములు వీని ఫలములు సన్నయేలకులు హింగుపత్రిక. ఈ మొదలయిన వానికి కటుక గణము అని పేరు. రాజు ప్రయత్నించి కోట యందు సంగ్రహము చేయవలెను. తుంగముస్తలు మంచిగంధము హ్రీబీరము ఱల దారవము పసుపు వట్టివేరు, ముక్త పెద్దఉసిరి వాస్తుకము పొట్లకాయ, కలుకము చిరుబొద్దిపట్ట లవంగపట్ట తుమ్మి నేలవేము తిక్తము వేప యష్టి మధుకము అతివస తాళిసపత్రి తగరము ఏడాకులరటి నికాంతకము కొండగోగు మేడి మయూరశిఖి సోపు నెల్లి వేగిస గంట్లకోచరము హిణి జటామాంసి పర్పాటకము మదయంతిక రసాంజనము గుంటగలర పాదరసము పరిపైలవము వాకుడు భూరుండి రెల్లురసము సర్పాక్షి తాండ్రతీగె వ్యాఘ్రనఖము శాంగష్టము చతురంగుళము, రస్నా, కుశ స్ఫీత హిరేణు రేణుక వేత్రాగ్రము తుర్వి, విషాణము లోహము అంజనము మాలతి వనతిక్త వృష గోజిహ్మ కర్కశము పర్పాటకము తిప్పతీగె గుడూచీ గణమని వీని నందురు. ఈ మొదలగు వానిని రాజు సంగ్రహించి యుంచవలెను కరక్కాయ చిన్నవుశిరికె పెద్దవుశిరిక తాడికాయ ప్రేంఖణము ఆరె పుష్ప మోచ రోఘాసన అర్జునము పిప్పిలి మామిడి అస్థినాగాహ్వయములు దుండిగము కంకఫలము భూర్జపత్రము శిఖోద్భేదము పొగడ అష్టకము మంజిష్ట తెగడ ప్రత్తి గైరికాంజనం విద్రమము మైనము పున్నాగము తెల్లకలువ నల్లకలువ మఱ్ఱి మేడి రావి మోదుగ విరుగుడుమాను జమ్మి ద్రాక్ష ఏలుకాసారము దిరిశెన పద్మకము మారేడు అగ్నిమంధము జువ్వి చామలు యచకౌయనము పాలకూర దురదగొండి చంపకము ప్రియకము ఊగ ఊడుగ ఊశీరము రేగు కడిమ చండ్ర వీని యాకులు మూలములు సాలములు పువ్వులు నీ మొదలయిన కషాయ గుణమును రాజు సమకూర్చుకొని యుంచుకొనవలెను కీటకసంహారయోగములు దోమకాటు కందిరీగలు మొదలయినవి కుట్టకుండ కుట్టిన విషమెక్కకుండా చేయు ఔషధ యోగములు. వ్యంగయందు (అంగము నరకబడినపుడు)విశల్యకరణి సంధానకరణి మొదలయిన శస్త్రచికిత్సా యోగములు, వాత- ధూమ అంబుమార్గముల యావరోధములను హరింపగల సామాగ్రిని రాజు కోటలో బధ్రపరుచుకొనవలెను. వానిన్నిటిని నేను దెలుపను. అటుపై విషములను నిలువ చేసుకొనవలెను. విషహారము లయిన విచిత్రములయిన మందులును రక్షోభూత ప్రేత పిశాచ శమనములు పాపహరములు పుష్టివర్ధనము నైన సామగ్రిని దుర్గమందు సేకరించి కొనియుండవలెను. కాలవేత్తలు (జ్యోతిషికులు) పురమందు సప్రయత్నముగా భరింప వలసినవారు. పిరికి వాండ్రను ప్రమత్తులను కుపితులను అవమానితులను కుభృత్యులను ఆకులీనులను రాజు పురమందు నివసింపనీయరాదు. యంత్రాయుధములతో గూడిన యట్టాలక సమూహము తోడిది సమగ్ర ధాన్యౌషధ సంప్రయుక్తమైనదియు వణిగ్జన శోభనమైనదియును గుప్తమైనదియునగు దుర్గము (కోట) లో నిరంతరము రాజు నింసించవలెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున దుర్గసంపత్తియను నిరువదియారవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters