Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ముప్పదియొకటవ యద్యాయము - సురపూజా మహాత్మ్యము

పుష్కరః- దుర్గే సర్వ గుణోపేతే వాస్తు లక్షణ సంయుతే | వసన్‌ వివర్ధయే త్కోశం ధర్మేణ పృధివీపతిః || 1

ప్రజానాం పాలనం కార్యం తత్ర స్థానే మహీక్షితా | స్వదేశే దేవతాయాశ్చ కృతా రాజ్ఞః పురాతనైః || 2

దాయం విత్తం జనం తాసాం ప్రయత్నేన చ పాలయేత్‌ | దేవ ద్రవ్యా7పహారేణ నరక మృచ్ఛతి || 3

అస్మిన్నపి తథా లోకే ప్రాప్నోతి చ పరాభవమ్‌ | పాలయన్తి మహీం దేవాః పూజితాః పృథివీక్షితా || 4

దైవాయత్తమిదం సర్వం భూతలం ద్విజపుంగవ ! | ధూపదీప నమస్కార పుప్పమాల్యా7నులేపనైః || 5

రత్నా7ను సంప్రదానైశ్చ పూజనీయాః సురోత్తమాః | పుజితాః పూజయన్త్యేతే చాయుషా యశసాశ్రియా || 6

ప్రాప్యతే దేవతాభక్త్వా చా7నుష్ఠానే మహత్పదమ్‌ | పూజితా స్సంప్రయచ్ఛన్తి కామాన్‌ నౄణా మభీప్సితాన్‌ || 7

ఏక మప్యాశ్రితో దేవం రాజా భార్గవనందన! | సర్వాసాం పూజనం కుర్యా ద్దేవతానా మసంశయమ్‌ || 8

దేవతానాం న చోచ్ఛింద్యాత్‌ పూర్వదాయం కథంచన | ప్రాక్‌ స్థితం తన్న చోచ్ఛింద్యాత్‌ న చ ఛింద్యా త్తథా నవమ్‌ ||

తచ్ఛేత్తా నరకం యాతి సహ పూర్వైః పితామహైః | అపి స్వల్పం న హర్తవ్యం దేవద్రవ్యం విజానతా || 10

స్వల్పస్యా7పి ఫలం ఘోరం యస్మా జ్జన్మాం7తరే భ##వేత్‌ | షష్టివర్ష సహస్రాణి షష్టివర్ష శతాని చ || 11

దేవద్రవ్యా7పహరణా న్నరకం ప్రతిపద్యతే | సన్తీహ దేవతా సౌమ్యాః సన్త్యుగ్రాశ్చా7పి భార్గవ ! | 12

దర్శయన్తి రుషం సౌమ్య ! రాజ్యభ్రంశా7దిభిర్నృణామ్‌ | అస్మిన్‌ లోకే రుషం క్రూరాం నైవ కుర్వన్తి దేవతాః || 13

తాసాం విత్తా7పహరణ ద్రాజా నరక మృచ్ఛతి | భుంక్తే పితామహై స్సార్థం ప్రాగుక్తం ఫలమేవ చ || 14

దేవద్రవ్యా7పహరణం నైవ జాతు భ##వే ద్వృథా | సర్వస్వరహితాన్‌ కృత్వా దేవద్రవ్యా7పహారిణః || 15

అంకయిత్యా ద్విజశ్రేష్ఠ! స్వరాష్ట్రా ద్విప్రవాసయేత్‌ | త్రైవిద్యా వణిజో వైద్యా లింగినో దేవపాలికాః | 16

తథా తత్ప్రతిబద్ధాశ్చ న కుర్యుః కలహం మిథః | తేషాం సహాయకః స్వామీ నిగ్రహా7నుగ్రహీ భ##వేత్‌ || 17

రాగద్వేష వియుక్తస్తు వివాస్య శ్చా7న్యథా భ##వేత్‌ | దండం చ దేవతాగామి దేవద్రవ్యస్య సూచకమ్‌ || 18

సర్వా న్వివాసయే ద్రాజా ధార్మికో ధర్మకారణాత్‌ | రాజ్ఞా సర్వప్రయత్నేన పాలనీయాః సురాలయాః|| 19

కర్తవ్యాశ్చ మహాభాగ ! సురలోక మభీప్సతా | దేవతాస్తు ప్రతిష్టాప్య తల్లోకం ధ్రువ మాప్నుయాత్‌ || 20

కృత్వా దేవగృహం శుభ్రం స్వర్గ మాప్నో త్యనుత్తమమ్‌ | తదా భోగ ప్రమాణన లక్ష్మీ స్తత్రా7పి భార్గవ ! || 21

మృత్ప్రాసాదా ద్దశగుణం స్థూల దారుకృతే భ##వేత్‌ | ఫలం దశగుణం తస్మా త్తథా పక్వేష్టకా కృతే || 22

తస్మా ద్దశగుణం చైతే నా7త్ర కార్యావిచారణా | యావత్సంఖ్యం నరః కుర్యా ద్దేవవేశ్మ సుధాపితమ్‌ || 23

తావజ్జన్మా7న్తరాణీహ యశసా స విరాజతే | కృత్వా చ చిత్రవిన్యాసం గంధర్వై స్సహ మోదతే || 24

కృత్వా సంశోథనం తత్ర విరోగ స్సమపద్యతే | ప్రోక్షయిత్వా మనస్తాపా న్మానవః ప్రతిముచ్యతే || 25

కృత్వోపలేపనం రామ! నాక మాప్నోత్యనుత్తమమ్‌ | గన్దర్వలోక మాప్నోతి కృత్వా వర్ణకరంజితమ్‌ || 26

గన్ధైస్సముక్షితం కృత్వా గంధర్వైస్సహ మోదతే | ఉపకార ప్రదానేన శ్రియ మాప్నో7త్యనుత్తమమ్‌ || 27

గీతవాద్య ప్రదానేన సుఖ మాప్నో త్యనుత్తమమ్‌ | ప్రేక్షణీయ ప్రదానేన రూపనా నభిజాయతే || || 28

తథా చౌజ్ఞ్వల్య మాప్నోతి యత్రయత్రా7భిజాయతే |స్నాపయిత్వా ఘృతేనా 7ర్చాం సర్వపాపైః ప్రముచ్యతే || 29

స్నాపయిత్వా చ తైలేన విరోగ స్సమపద్యతే | అంబునా స్నాపయిత్వా తు సౌభాగ్య మధిగచ్ఛతి || 30

విరూక్షయిత్వా తాం రామ! పాపం జహతి మానవః | అనులేపన దానేన రూప మాప్నో త్యనుత్తమమ్‌ || 31

తథా పుష్పప్రదానేన శ్రియ మాప్నోత్యనుత్తమామ్‌ | ధూపదానేన ధర్మజ్ఞ ! రతి మాప్నోతి శోభనామ్‌ || 32

తథా దీపప్రదానేన చక్షుష్మానభిజాయతే | అన్నద స్సర్వ మాప్నోతి యత్కించి న్మనసేచ్ఛతి || 33

పానకానాం ప్రదానేన తృప్తి మాప్నోత్య7నుత్తమామ్‌ | వసుదో రూప మాప్నోతి, రూపమాప్నోతి రూపదః || 34

రుక్మద స్సర్వ మాప్నోతి శ్రియ మాప్నోతి సర్వదః | ఛత్రదః స్వర్గ మాప్నోతి తాలవృంత ప్రదో దివమ్‌ || 35

చామరాణాం ప్రదానేన రాజా భవతి ధార్మికః | పతాకాయాః ప్రదానేన సర్వపాపాన్‌ వ్యపోహతి || 36

ధ్వజదానేన లోకే7స్మిన్‌ ధ్వజభూతో భ##వేన్నరః | నానావిధానాం భోగానాం తథా రామ! ప్రదాయకః || 37

తానేవ భోగా నాప్నోతి సర్వమాప్నోతి భూమిదః | దేవమాల్యా7పనయనా ద్గోదానఫల మాప్నుయాత్‌ || 38

తదాహుతిప్రదానేన తల్లోక మభిపద్యతే | నమస్కార ప్రణామాభ్యా మేనోభిః ప్రతిముచ్యతే || 39

ప్రదక్షిణం తథా కృత్వా భవత్యాచారవా న్నరః | స్తుత్వా చ దేవతాం రామ! మనోదుఃఖాత్‌ ప్రముచ్యతే || 40

సంతర్పయిత్వా తోయేన తృప్తిం సమధిగచ్ఛతి | తస్మా త్సర్వప్రయత్నేచ విశుద్ధేనా7ంతరాత్మనా || 41

అర్చాస్థాః పూజయే త్సర్వాః దేవతా భూరిదర్శన! | తదా7శ్రితాంశ్చ యుంజీతః తదా తద్విధిపారగాన్‌ || 42

తత్పూజనే తథా రామ! తాంశ్చ సంపూజయే త్సదా | బ్రాహ్మణాశ్చ నియోక్తవ్యా వేదోక్త సురపూజనే || 43

యస్య రాజ్ఞస్తు విషయే దేవవేశ్మ విశీర్యతే | తస్య సీదతి తద్రాష్ట్రం దేవవేశ్మ యథా తథా || 44

సంస్కారం లంభ##యేద్యస్తు దేవవేశ్మ పురాతనమ్‌ | స చ సౌఖ్య మవాప్నోతి యత్రయత్రా7భిజాయతే || 45

వాపీకూప తడాగానాం సదా త్రిదశ##వేశ్మనామ్‌ | భూయః సంస్కారకర్తా చ లభ##తే ముక్తిజం ఫలమ్‌ || 46

దేవసంపూజనా ద్రామః వృద్ధిం సముపగచ్ఛతి ! రాజ్ఞస్తు విషయే యస్య పూజ్యన్తే సతతం సురాః || 47

అతివృష్టి రనావృష్టి ర్మూషకా శ్శలభా శ్శుకాః | రాక్షసాశ్చ పిశాచాశ్చ రిపవశ్చ సుదారుణాః || 48

ఈతయశ్చ తథైవాన్యాః న భవన్తి ద్విజోత్తమ! |

తస్మాత్ర్పయత్నేన సదా నరేంద్రైః | పూజా విధేయా విషయే సురాణామ్‌ |

సురార్చనా దూత సమస్తపాపాః | స్వర్గం క్షితీశాశ్చిర మాప్నువన్తి || 50

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే - ద్వితీయఖండే- సురపూజామహాత్మ్య వర్ణనం నామ ఏకత్రింశో7ధ్యాయః.

పుష్కరుడనియె, వాస్తులక్షణములుగల సర్వగుణసమృద్ధమునైనదుర్గమందు వసించుచు ధర్మముచే కోశమును వృద్ధిపరుపవలెను. ప్రజాపాలనము సేయవలెను. తనదేశమందు తన పూర్వులారాధించిన దేవతయొక్క దాయ భాగమును (మాన్యములను) ధనమును దేవాలయములందు పనిచేయు జనమును గాపాడవలెను. దేవాదాయ ధర్మాదాయములనపహరించిన రాజు నరకమందును. ఇహలోకమందుగూడ యవమానముల పాలగును. రాజుచే పూజింపబడిన దేవతలు భూమిని రక్షింతురు. ఈసర్వభూత ప్రపంచము దైవముపైని ఆధారపడియున్నది. ధూపదీప నమస్కార పుష్పమాల్యగంధానులేపనాదులచే రత్నసమర్పణముచే శ్రేష్ఠమైన పదార్థములర్పించుటచేతను దేవతలు పూజనీయులు. వీరుతాము పూజితులై ఆయువు కీర్తిసంపదచే పూజించినవారిని పూజింతురు. దేవతాభక్తిచే సదనుష్ఠానుముచే మహోన్నత పుణ్యలోకమువచ్చును. పూజితులైనదేవత లభీష్టముల నిత్తురు. రాజేయొక్క దేవతనైన నమ్ముకొని యున్నవాడైనను నందరి దేవతలపూజలను నిర్వహింపవలెను. దేవతలకు పూర్వులిచ్చిన మాన్యములను గ్రొత్తగా నీయబబడిన దాయములను విచ్ఛిన్నము సేయరాదు. దేవతల యాస్తులను విచ్ఛిన్నముసేసిన రాజు తరతరములవారితో నరకమందును. దేవద్రవ్యమేకొంచెమేనిహరింపరాదు. అత్యల్పమైన ద్రవ్యమిచ్చినను మహాఫలమే. హరించినను మహాపాతకమే. అది మలిజన్మమునందనుభవింపక తప్పదు. అరువదివేల యరువదివందల వర్షములు దేవద్రవ్యాపహరణముచే నరకమనుభవించును. లోకమున సౌమ్యదేవతలును, ఉగ్రదేవతలును రాజ్యభ్రంశాదులుచేసి త మ కోపమును చూపింతురు. కొందరీలోకమునందు తమకోపము జూపింపరు.వారు నరకమనుభవింపజేయుదురు. పితామహ ప్రపితామహులతో గూడ దేవద్రవ్యాపహారకుడు నరకమందును. దేవద్రవ్యాపహరణ మూరకపోదు. దేవద్రవ్యము హరించినజనుల సర్వస్వము రాజు లాగికొని తన రాష్ట్రమునుండి ప్రవాసమంపవలెను. త్రైవిద్యులు (త్రివేదులు) వణిజులు వైద్యులు లింగులు సన్యాసులు మొదలయినవారు దేవపాలకులు దేవాదాయవ్యవహారనియుక్తులు నొండొరులు తగవులాడుకోరాదు. నిగ్రహానుగ్రనుములు సేయుచు రాజు వారికి సహాయపడవలెను. ప్రభువు రాగద్వేషములేనివాడై యందరికి తోడ్పడవలెను. అట్లుగాని రాజు వివాస్యుడు (వెళ్లగొట్టదగినవాడు) అగును. దేవద్రవ్యము హరించిన వాండ్రకు విధించు శిక్షాద్రవ్యము దేవద్రవ్యమునకు సూచకమగును. అ న గా దేవద్రవ్యము గాజేసిన వా రి ని శిక్షించినచో నాద్రవ్యము దేవతలకు జెందినదేయగును. ధర్మనిమిత్తమై దేవాదాయాపహర్తల నెవరినైనను రాష్ట్రమునుండి తరిమివేయవలెను. రాజు సర్వ ప్రయత్నములచే దేవాలయమును పాలింపవలెను. స్వర్గమునభిలషించురాజు దేవాలయములగట్టింపవలయును దేవతా ప్రతిష్టలు చేయవలెను. అందుచే నా లోకమును దప్పకపొందును. (సాలోక్యముక్తినందును) దేవాలయమును శుభ్రపరిచినవాడు స్వర్గమందును (ఇక్కడ శుభ్రపరచుటయనగా ఊడ్చుట కడుగుట లేక వెల్లవేయుటయునుంగావచ్చును). ఆ చేసిన భోగపరిమితి ననుసరించి లక్ష్మీ సంపన్నుడగును. మట్టితో నాలయము గట్టించుట కంటె పదిరెట్లు ఫలము పెద్దపెద్ద దారులతో నాలయనిర్మాణము వలన కలుగును పండుటిటుకలతో నాలయ నిర్మాణము దానికి పదిరెట్లుఫలమిచ్చును. దానికి పదిరెట్లుఫలము శిలానిర్మాణము వలన కలుగును. ఏ సంఖ్యలో దేవాలయమునకు వెల్ల వేయునో అన్నిజన్మలు కర్త కీర్తితో విరాజిల్లును. దేవాలయముందు చిత్రనిర్మాణము చేసి నతడు గంధర్వులతో గ్రీడించును. దేవాలయ శోధనమొనరించినవాడు (ఊడ్చుట కడుగుట చేసినవాడు) ఆరోగ్యవంతుడగను ఆలయమునందు నీళ్ళు చల్లినవాడు మనస్తాపముక్తుడగును. సున్నము మొదలగు వాని యుపలేపనము (పూత) చేసి నతడుత్తమ నాక మందును. రంగులు వేసినవాడు గంధర్వలోకమందును. సుగంధవస్తువులచే పరిమళింప జేసినవాడు నదేఫలమందును. ఆచేయు మంచి పనుల కుపకార వేతన మొసంగినవాడు (ద్రవ్యమిచ్చినవాడు) సర్వోత్తమ శ్రీసంపన్నుడగును. దేవాలయములందు సంగీతము పాడుట మంగళవాద్యమేళనముసేయుట చేయించుట వలన సుఖము పొందును. అక్కడ సుందరవస్తువులినిచ్చినవాడు సుందరుడగును. జన్మించినపుడెల్ల ప్రకాశమును బొందును. నేతితో దేవతనభ్యంగము సేయించినచో పాపమునెల్లబాయును. తైలాభిషేకముగావించిన నారోగ్య వంతుడగును. జలస్నానము చేయించి సౌభాగ్యమందును. దేవతను దోమిన పాపమువాయును. గంధము పూసిన రూపవంతుడగును. పుష్పముల బూజించిన లక్ష్మీసంపన్నుడగును. ధూపాఘాణముచే శోభవనవస్తురతినందును. (రతి = ప్రీతి) దీపమువెట్టిన చక్కని నేత్రములుగలవాడగును. అన్న నివేదనముచే నభీష్టములన్నిటింబడయును. మధురపానకముల నివేదించి తృప్తినొందును. ధనముచ్చిన రూపవంతుడగును. బంగారమిచ్చినవాడు సర్వమృద్ధుడగును. ఛత్రమిచ్చి సర్వమును తాటాకువిసనకర్ర సమర్పించి స్వర్గమునందును. చామరమొసంగి ధార్మిక ప్రభువగును. పతాక మిచ్చుటచే పాపమునెల్లబాయును. ధ్వజమిచ్చియీలోకమునందందరలో ధ్వజమట్లున్నతుడై రాణించును. నానాభోగములను దేవతార్పణము గావించినవాడు ఆ నానాభోగములందును. భూమిచ్చినవాడు సర్వముబడయును. దేవతా నిర్మాల్యమును దొలగించుటచే గోదానఫలమందును. దేవతోద్దేశమున ఆహుతులిచ్చినవాడు తద్దేవతా సాలోక్యమందును సమస్కారదండప్రణామములుచేసి సర్వపాపముక్తుడగును.

దేవతలకు బ్రదక్షిణము సేసిన ఆచారవంతుడగును. దేవతా స్తుతిచేసిన మనోదుఃఖముంబాయును. ఉదకముచే తర్పణముచేసి తృప్తినందును. కావున పరిశుద్ధాంతఃకరణముతో దేవతల పూజింపవలెను. సర్వదర్శన! ఓ పరుశురామా! అర్చామూర్తులయిన దేవతల నందరను రాజు పూజింప వలెను. పూజావిధి పారంగతులై యా యా దేవతల నాశ్రయించినవారి నాపూజయందేర్పరుపవలెను. ఆ పూజరులనుగూడ పూజింపవలెను. వేదోక్త దేవతా పూజయందు బ్రాహ్మణులను నియోగింపవలెను ఏరాజు దేశమందు దేవాలయము శిధిలమౌనో యాదేశము ఆదేవాలయముతోబాటు శిధిలమౌను. జీర్ణదేవాలయోద్ధరణము సేయునతడే జన్మమునెత్తిననక్కడసౌఖ్యమందును. వాపీకూపతటాకములు దేవాలయములు బాగుచేయించునతడు ముక్తిఫలమందును. దేవపూజనముచేవృద్ధిపొందును. ఏదేశమందు దేవతాపూజలు జరుగు నాదేశమతివృష్టి అనావృష్టి ఎలుకలు మిడుతలు వడ్ల చిలుకలు రాక్షసులు పిశాచములు శత్రువులు మున్నగు దారుణములుండవు, అందుచే నరేంద్రులు సర్వప్రయత్నముచేత దేవతాపూజలను తమ రాజ్యమందు నిర్వర్తింపజేయవలెను. రాజు సురార్చన వలన పాపములెల్లబాసి చిరకాల స్వర్గభోగమునందును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున సురపూజా మహత్వమను ముప్పదియొకటవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters