Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ముప్పది నాల్గవ యధ్యాయము - గోవులకు శాంతిపక్రియ

పుష్కరః- అతః పరం ప్రవక్ష్యామి శాంతి కర్మ గవాం తవ | నిత్యం నైమిత్తికం కామ్యం తథా పుష్టి వివర్ధనమ్‌ ||

పంచమేషు చ శుక్లాసు శ్రియః పూజా విధీయతే | గవాం పురీషే ధర్మజ్ఞః ధూప దీపా7న్న సంపదా || 2

వన్యై స్సుకుమసుమై ర్భక్త్యా బ్రాహ్మణానాం పూజనమ్‌ | తత్రై7వాహని కర్తవ్యం వాసుదేవస్య పూజనమ్‌ || 3

సహి సర్వగతో దేవః క్షరోదధినికేతనః | త్రైలోక్య7ధారా భూతానాం విశేషణ తథా గవామ్‌ || 4

ఆశ్వయుక్‌ శుక్లపక్షస్య పంచదశ్యాం భృగూత్తమ! వృత్రా7న్తకస్య కర్తవ్యః తదా యాగస్తు గోమతా || 5

గంధ ధూప పమస్కార పుష్ప దీపా7న్న సంపదా | ఇహ ప్రజాయా స్సామ్రాధః పృషదశ్వా తథైవ చ || 6

ఘృత ప్రతీకశ్చ తథా రౌద్రీభిశ్చ భృగూత్తమ! | నిత్యాభిశ్చ తథా వహ్నిం ఘృతేన జుహుయా ద్బుధః || 7

అంభ##స్థేతి చ మంత్రేణ లవణం చా7భిమంత్రయేత్‌ | దధ్నా సంప్రాశనం కార్యం దధి క్రావ్ణేత్యనన్తరమ్‌ || 8

యజమానేన దేయ చ ధేనుః స్యా చ్ఛత ధేనునా | తదూన విత్తో దద్యాచ్చ హోత్రే శ##క్త్యైవ దక్షిణామ్‌ || 9

గావ స్వలంకృతాః పశ్చా ద్గంధమాల్య ఫలా7దిభిః | స్వాశితా ముక్తవత్సాశ్చ కుర్యు ర్వహ్నిం ప్రదక్షిణమ్‌ || 10

క్ష్వేడా కిలకిలా శ##బ్దైః శంఖ వాద్య రవై స్తథా | వృషాణాం యోజయే ద్యుద్ధం గోపాలానాం తథైవ చ || 11

ద్వితీయే7హని ధేనూనాం వృషాణాం సహవత్సకైః | లవణం తత్ప్రదాతవ్యం బ్రాహ్మణనా 7భి మంత్రితమ్‌ || 12

భోజనం గోరస ప్రాయం బ్రాహ్మణాం శ్చా7త్ర భోజయేత్‌ | స్వస్తి వాచ్యం తతః పశ్చా ద్దత్తదాయా న్విసర్జయేత్‌ ||

నిత్య మేత త్తవోదిష్టం శాన్తి కర్మ శుభం గవామ్‌ | అతః పరం ప్రవక్ష్యామి కర్మ నైమిత్తికం తవ || 14

ధేనూనాం మారకే ప్రాప్తే తథా రోగా ద్యుపద్రవే | క్షీరక్షయే తథా7న్యస్మిన్‌ ప్రకృతేస్తు విపర్యయే || 15

త్రిరాత్రో పోషితో విద్వాన్‌ ఏకరాత్రోషితో 7ధవా | గవాం మధ్యే శుభే దేశే స్థండిలం పరికల్పయేత్‌|| 16

అష్టపత్రం లిఖేత్పద్మం కర్ణికా కేసరా7న్వితమ్‌ | పూజయే త్కర్ణికా మధ్యే వాసుదేవం శ్రియా సహ ! || 17

కృసరైః పూజనం కార్యం దేవతానాం యథా క్రమమ్‌ | యాసాం తాసాం ప్రవక్ష్యామి తవ నామాని భార్గవ! || 18

సుభద్రాం నామ దిగ్ధేనుం పూర్వభాగే సమర్చయేత్‌ | పూజనీయ స్తతోబ్రహ్మా సురభి స్తదనన్తరమ్‌ || 19

తత స్సూర్యస్తతో ధేను ర్భహురూపా ద్విజోత్తమ ! | తతస్తు పృథివీం దేవీం తతో 7నన్తం ప్రపూజయేత్‌|| 20

తతశ్చ విశ్వరూపాక్షం దిగ్ధేనుం తదనన్తరమ్‌ | తతస్సిద్ధం తతోబుద్ధిం తతశ్శాన్తిం సమర్చయేత్‌ || 21

రోహిణీ నామ దిగ్ధేనుః తతఃపూజ్యా ద్విజోత్తమ! | తతః శ్చంద్రమసం దేవం మహాదేవ వృషం తతః|| 22

మహాదేవం తతోదేవం పూజయే త్తదనన్తరమ్‌| ఇత్యేతా దేవతాః ప్రోక్తాః కృసరే తవ షోడశ || 23

ప్రత్యేకాల పూజయేజయేద్రామ! దేవతాం ప్రయతో ద్విజః | గంధమాల్య నమస్కార ధూపదీప7న్న సంపదా || 24

ప్రత్యేకాం పూజయేద్రామ! దేవతాం ప్రయతో ద్విజః | పూర్ణకుంభాని సర్వాణి ప్రత్యేకం వినివేదయేత్‌ || 25

భక్త్యా స్థగిత వక్త్రాణి వర్థమానై స్సతండులైః | సహిరణ్యౖ ర్యథాశక్తి తతో హోమం సమారభేత్‌|| 26

వేదిం కృత్వా యథాశాస్త్రం సమిధ్య చ హుతాశనమ్‌ | ఏకైకం దైవతం రామ! సముద్ధిశ్య యథావిధి || 27

చతుర్థ్యన్తేన ధర్మజ్ఞ ! నామ్నాతు ప్రణవా7దినా | హోమద్రవ్యై స్తథై కైవం శతసంఖ్యం తు హోమయేత్‌ || 28

సమిధః క్షీరవృక్షస్య అక్షతాని తిలాంస్తథ | సిద్ధార్థకాన్యథా7జ్యం చ ప్రత్యేకం జహూయా త్క్రమాత్‌ || 29

తతో రక్షహణౖర్మంత్రై ర్జుహుయాద్గౌరసర్జపాన్‌ | తత స్సమాపయే ద్విద్వా నగ్ని కర్మ యథావిధి |7 30

సువర్ణం చ తథా కాంస్యం ధేనుం వస్త్రయుతం తథా | కర్తుర్దేయ ముపస్రష్టు ర్వ స్త్రయుగ్మం గురోస్తథా || 31

భోజనం గోరసప్రాయం బ్రాహ్మణాంశ్చ7త్ర భోజయేత్‌ | స్వస్తి వాచ్యం తతః పశ్చా ద్దత్తదాయా ద్విజోత్తమాః || 32

రక్షోహణౖ స్థథా మంత్రై కుర్యు రభ్యుక్షణం గవామ్‌ | గవాం చ పూజా కర్తవ్యా గంధమాల్యా7ను లేపనైః || 33

మోకైవ్యాశ్చ తదా వత్సాః యధాకామం ద్విజోత్తమ! | శాన్తికర్మ గవామేత త్సర్వోత్పాత ప్రశాన్తయే || 34

కర్తవ్యం భృగు శార్ధూల! పరమం కర్మ దారుణమ్‌ | అతః పరం ప్రవక్ష్యామి కామ్యం కర్మ తవా7నఘ! || 35

పుష్కరుడనియె: గోవునకు నిత్యము నైమిత్తికము కామ్యము నైన శాంతి ప్రక్రియను పుష్టినిగూర్చి పని నెరింగితును. ఆవుపేడ యందు శుక్లపంచములందు ధూపదీపాదులతో లక్ష్మీపూజ గావింపవలెను. ఆరోజే వన్యములయిన పువ్వులతో (అడవి పూలతో) భక్తితో బ్రాహ్మణులను విష్ణువుగా బూజించవలెను. ఆ విష్ణువు సర్వాంతర్యామి. క్షీరసాగర నివాసి. ముల్లోకముల కాధారమయిన గోవులకు దేవుడు. ఆశ్వయుజ శుక్లపూర్ణిమ నాడు గోసంపద కలవాడు వృత్రాసురాంతకునికి (ఇంద్రునికి) పూజ యాగముకూడచేయవలెను. ''ఇహప్రజా యా స్సామ్రాధః '' ''పృషదశ్వా'' ''ఘృత ప్రతీకశ్చ'' అను మంత్రములతో రుద్రమంత్రములతో (నమక చమకములు) నిత్యాగ్నిహోత్రముల చేతను ఆవు నేతితో నగ్నియందు హోమము సేయవలెను. ''అంభస్థ'' అను మంత్రముతో నువనభిమంత్రించి ''దధిక్రావ్ణ'' అను మంత్రసంపుటితో బెరుగుతో ప్రాశనము సేయవలెను. యజమాను డీనిన ఆవును సవత్సగోదానము చేయవలెను. దానివలన నూరుధేనువుల సంపద నొందును. ధనము లేనివాడు ప్రతి గ్రజహీతకు యథాశక్తి దక్షిణ నీయవలెను. గంధమాల్య ఫలాదులచే గోవులను జక్కగ నలంకరించి చక్కని మేతపెట్టి దూడలను పాలకు విడిచిన తరువాత నగ్నికి ప్రదక్షిణకు సేయవలెను. ఆ మీద కిలకిలారావములు చేయుచు సింహనాదము సేయుచు శంఖవాద్యాదులతో వృషభములకు గోపాలురకు పందెములు జరిపించవలెను. రెండవ రోజున ఆవులకు నెడ్లకును, దూడలకును నుప్పుదినిపింప వలెను. దానిని బ్రాహ్మణుడభిమంత్రించి పెట్టవలెను. గోరససమృద్ధముగ బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఆ మీద స్వస్తివాచనము గావించి సంభాషనలిచ్చి వారిని సాగనంప వలెను. ఇది నిత్యగో శాంతికర్మ. గోవులకు శుభప్రదము. ఇక నైమిత్తికము. ధేనువులకు మారకము, రోగాద్యు పద్రవములు. పాలుతఱిగినపుడు మఱి యితర ప్రకృతి విపర్యయమందు మూణ్ణాళ్ళుగాని ఒకనాడుగాని యుపవాసము చేసి గోవుల మంద నడుమ శుభప్రదేశమున స్థండిల మేర్పరచి దానిమీద అష్టదళ పద్మమునుదుద్దుతో కేసరములతో (కింజల్కములతో) గూడ విభజించి కర్ణికామధ్యమందు (తామర పూవుదుద్దు నందు) లక్ష్మీసమ్మేతుడైన వాసుదేవని బూజింపవలెను. కృసర ములతో (పులగములు) క్రమముగ దేవతల బూజింప వలెను. ఆ పూజింప వలసిన దేవతల పేర్లు యెఱిగింతును.

తూర్పున సుభద్రయను దగ్ధేనువును ఆపైని బ్రాహ్మణుని సురభిని (కామధేనువును) సూర్యుని ఐహురూపయను ధేనువును ఆ మీద పృథివీ దేవిని అనంతుని విశ్వరూపాక్షుని దిగ్ధేనువును అవ్వల సిద్ధిని బుద్ధిని శాంతిని బూజింపవలెను. ఆ పైని చంద్రదేవుని మహాదేవు వాహనమగు ఋషభమును మహాదేవుని బూజింపవలెను. ఆ వీరు పదునాణుగురు కృసరముతో (పులగము) బూజింపవలసిన దేవతలు. ఆ తామరపువ్వు రేకులందు వరుసగా దిక్పాలురం ధూపనైవేద్యాలతో బూజింపవలెను, ప్రత్యేకముగానే పూజింపవలెను. ప్రత్యేకముగా నీయందఱకు పూర్ణకుంభములు నివేదింపవలెను, ఆ వర్థమానములను (మూకుళ్ళు) బియ్యముపోసి నూతన వస్త్రములతో గప్పవలెను. అందుమీద యధాశక్తి హిరణ్యము (బంగారము) నుంచవలెను. ఆ మీద హోమమారంభింపవలెను. యథాశాస్త్రము వేది నేర్పరచి యగ్నిజ్వాల నొనర్చి పైని చెప్పిన యొక్కొక్క దేవతకొఱకు చతుర్థీ విభక్త్యంతమును ప్రణవపూర్వకముగా బేర్కొని నూరు మార్లు హోమద్రవ్యములతో హోమము గావింపవలెను. పాలచెట్లయొక్క సమిధలు అక్షతలు నువ్వులు, ఆవాలు, నెయ్యి అనువానితో క్రమముగా ప్రత్యేకముగా హోమములు సేయవలెను. ఆమీద రక్షోహణ మంత్రములచే తెల్లావాలు హోమము సేయవలెను. ఆ మీద యధావిథి నాయగ్ని కర్మము సమాప్తిని చేసి బంగారము కంచును ధేనువును వస్త్రయుగ్మమును (కర్తకు) హోతకు ఉపద్రష్ట గురువునకు వస్త్రయుగ్మము నొసంగవలెను. గోరస సమృద్ధముగా భోజనము పెట్టవలెను.

కర్తా తూపవసే త్తత్ర కారకైశ్చ తథైవ చ | పూర్వభాద్రపదాయోగ మహిర్బుధ్య గతే తథా || 36

స్నానం నిశాకరే కుర్యా ద్ద్వితీయే7హని శాస్త్రవిత్‌ | ఉదుంబరస్య పత్రాణి పంచచగవ్యం కుశోదకమ్‌ || 37

రోచనాం చ సమంగాం చ క్షి పేత్‌ కుంభద్వయే తతః | కుంభద్వయం బుధః కుర్యాద్గంధ మాల్యోజ్జ్వలం దృఢమ్‌ || 38

అకాల మూలం సంస్థాప్య కర్తా తేన తదా భ##వేత్‌ | స్నాత్వా గోవాలచీరాణి పరిధాయ సమాహితమ్‌ || 39

పూజయేచ్చా7ప్యహి ర్భుధ్న్య మాదిత్యం చ తథైవ చ | వరుణం చ శశాంకం చ గంధమాల్యా7న్న సంపదా || 40

ధూపదీప నమస్కారై స్తథైవ బలికర్మణా | అక్షతానాం చ పాత్రాణి తతో రామ! చతుర్ధశ || 41

అహిర్భుధ్న్యాయ రుద్రాయ సఫలాంశ్చ నివేదయేత్‌ | ఖట్వాంగేన తు దాతవ్యం తథా ధూపం ద్విజోత్తమ ! 42

తతస్తు పూజాకర్తవ్యా దేవదేవస్య చక్రిణః | ఓంకార పూర్వమాజ్యం చ సర్వాసాం జుహుయా త్తతః || 43

దేవతానాం యథోక్తానా మేకైకస్య శతం శతమ్‌ | గోవాల శఫ శృంగైశ్చ త్రివృతం కారయే న్మణిమ్‌ || 44

ధారణం తస్య కర్తవ్యం కంఠే మూర్ధ్న్యథవా భుజే | కర్త్రే చైవోప ద్రష్ట్రే చ శక్త్యా దేయా చ దక్షిణా || 45

బ్రహ్మణానాం చ సర్వేషాం యథావ దనుపూర్వశః | అలంఘయన్‌ భాద్రపదా మథాన్త్యాం | కరోతియః స్నానమిదం సదైవ |

భవన్తి తస్యా7యుతశ్చ గావః | పరమవాప్నోతి తథైవ వృద్ధిమ్‌ ||

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే గవాంశాన్తి కర్మనామ చతుశ్చత్వారింశత్తమో7ధ్యాయః.

ఇక కామ్య కర్మవిధానము చెప్పెద. శాంతి కర్మచేయు కర్త కారకులతో (తక్కిన సహాయకులతో) నుపవాసము సేయవలెను. పూర్వభాద్ర నక్షత్రముతో అహిర్భుధ్న్య (శివ) దేవతా నక్షత్రముతో జంద్రుడు యోగము నందినపుడు స్నానము సేపి మరునాడు మేడియాకులను పంచగవ్యమును కలశోదకమును గోరోచనము మంగతో రెండుపూర్ణకుంభములందు నునిచి గంధమాల్యాదులచే వానిని అలంకరించి దానిలో ఆకాలమూలముగూడ యుంచి ఆవుతోక వెంట్రుకలతో దయారైన చీరలు ధరించి ఆహిర్బుధ్న్యుని ఆ త్యుని వరుణుని చంద్రుని గంధమాల్యాదులతో మృష్టాన్నములతో ధూపదీపనమసా స్కారములతో బలివిధానముతో బూజింపవలెను. ఆ మీద పదునాల్గు అక్షతల పాత్రలు పండ్లతో నహిర్బుధ్న్యుడగు రుద్రునికి నివేదింపవలెను, ఖట్వాంగముచే ధూపము వేయవలెను. అమీద దేవదేవుడగు చక్రిం బూజింపవలెను. అందరకు ప్రణవముతో నాజ్యాహుతు లీయవలెను. ఒకొక్కదేవతకు నూరేసి ఆహుతులొసంగవలెను. ఆవు గిట్టలు కొమ్ములతో మూడు చుట్టులుగా మణినిజేయించికొని కంఠమందో భుజమందో శిరస్సుననో ధరింపవలెను. కర్తకు, ఉపద్రష్టకును బ్రాహ్మణులకందరకు యథాశక్తి దక్షిణ నీయవలెను. భాద్రపదనక్షత్రము దాటకుండ స్నానము సేసి యీ పూజాదికము సేసినతడు ఆయుర్భాగ్యము గోసంపద సమృద్ధిగ పొందును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున గోవులకు శాంతి ప్రక్రియయను నలుబదినాల్గవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters