Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నలుబదిఎనిమిదవ యధ్యాయము - గజప్రశంస

పుష్కరః- కుంజరాః పరమా శోభా శిబిరస్య బలస్య చ | ఆయాతి కుంజరేష్వేవ విజయః పృథివీక్షితావమ్‌ ||

తేషాం సంమార్జనే యత్నం పాలేన చ భృగూత్తమ! | యథావ న్నృపతిః కుర్యా ద్గంధర్వాః కుంజరా మతాః ||

జయంతాశ్చ తథా ధార్యాః యావతాం పోషణం సుఖమ్‌ | కర్తుం శక్యం న ధార్యాస్తే క్షుధితా దుఃఖితా స్తథా ||

దుంఖితాస్తే నృణాం హన్యుః కులాని చ భృగూత్తమ ! | తస్మాత్తేషాం సుఖం కార్యం యశ శ్శీ విజయ ప్రదమ్‌ ||

సన్నద్ధ పురుషా7రూఢైః సుసన్నద్ధై స్తురంగమైః | అనల్పై రపి యద్యుక్తం బలం పరబల ప్రణుత్‌ ||

తదైకస్యా7పి సమరే కుంజరస్య సవర్మణః | న శక్యం ప్రముఖే స్థాతుం వేగా దాపతతో ద్విజ ! ||

అభిన్నానాం తు సంఘానాం సంహృతానాం చ భేదనమ్‌ | ఏకః క్రుద్ధో రణ కుర్యా త్కుంజరః సాధు చోదితః ||

మదక్లిన్న కపోలస్య కించి దంచిత చక్షుషః | బృహ దాభోగ శుండస్య కశ్శోభాం కధితుం క్షమః ||

వేగేన ధావమానస్య ప్రసారిత కరస్య చ | కస్సమర్థః పుర స్థ్సాతుం స్తబ్ధ కర్ణస్య దన్తినః ||

యస్య పూత్కార మాత్రేణ తురంగమ శతాన్యపి | స్వారూఢాన్యపి వేగేన విద్రవన్తి దిశోదశ || 1

తత్సైన్యం కుంజరా యత్ర స నృపో యస్య కుంజరాః | మూర్తిమాన్‌ విజయో రామ ! కుంజరా మదగర్వితాః ||

సపక్షా దేవవాహ్యా స్తేమనుజానాం త్వపక్షకాః | వాహనా7ర్థం కృతా రామ ! స్వయమేవ తు వేధసా ||

దృష్ట్వా పతాకాభి రలంకృతం తు | నాగేంద్ర సైన్యం ప్రబలం యథా7ద్రిమ్‌ ||

పతన్తి శీఘ్రం హృదయా న్యరీణామ్‌ | తస్మా త్ప్రధానాః సతతం గజేంద్రాః ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే గజప్రశంసా నామ అష్ట చత్వారింశో7ధ్యాయః.

పుష్కరుడనియె : ఏనుగులు శిబిరమునకు, సేనకు పరమశోభ గూర్చునవి. పృథివీశులకు కుంజరముల వలననే జయము గల్గును. వానిని దోమించుటలో, రక్షణలో రాజు సర్వయత్నము సేయవలెను. అవి గంధర్వులని చెప్పబడినవి. జయంతముల నెన్నిటిని పోషింపగల్గిన నన్నిటిని పోషింపవలెను. వానిని ఆకలికి దుఃఖమునకు గురిసేయరాదు. అవి దుఃఖించినచో మానవులకు తరతరముల కులహాని చేయును. అందుచే వానికి సుఖము చేయవలెను. అది కీర్తిని, సంపదను, విజయము నొసంగును. నిత్య సన్నద్ధులైన పురుషు లెక్కిన ఏనుగులతో, సుసన్నద్ధములయిన గుఱ్ఱములతో, పెక్కింటితోగూడిన బలము (సైన్యము) పరబలములంబారదోలగలవు. ఏనుగొక్కటియేని సేనయందు విజృంభించి పైబడునేని దానియెదుట నిలువ నెవ్వనికిని శక్యముకాదు. విడివడక గుంపులుగా గూడి యొత్తుకొనియున్న యోధులను పెక్కుమందిని నొక్క యేనుగు పని పట్టెనేని లెస్సగ మావటీడు తోలెనేని యందరను గూల్పగలదు గండస్థలి వెల్లుగ మదముచే దడిసి యించుక కనుదెఱచినదియు, మిక్కిలి విశాలమైన, నిండైన, తొండము గలదియునగు మదపు టేనుగు శోభ##నెవ్వడు వర్ణింప గలడు? కడువేగమున బరువులు వారుచు తుండమునెత్తి చెవులుస్థంభించు మదదంతి ముందఱ నెవ్వడు నిలువ గలడు? ఏయేనుగుయొక్క పూత్కారమాత్రమున మంచి రౌతులెక్కినవైనను, వందలకొలది గుఱ్ఱముల గుంపులు పారిపోవునో, ఆలాటి యెనుగు ఎదుట నిలుచుటవేనికిశక్యము? ఎందేనుగులు సైన్యముండు, నది సైన్యము. ఎవనికి గజబలము సమృద్ధ మాతడు నృపతి. మద గర్వితములయిన యేనుగలే రూపొందిన విజయము దేవతల వాహనములయిన సపక్షములు రెక్కలు గల యాయేనుగులనే మానవులకు రెక్కలు లేకుండ బ్రహ్మనిర్మించి యిచ్చినాడు. పతాకాలంకృతములు ప్రబలమైన నాగెంద్రబలముంగని నంతన శత్రువుల గుండెలు రాలిపోవును. గావున గజేంద్రములు సర్వప్రధానములు.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తరమహాపురాణము ద్వితీయఖండమున గజ ప్రశంస యను నలుబది యెనిమిదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters