Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

యేబదియవ యధ్యాయము - గజములకు శాంతివిధానము

పుష్కరః- అతః పరం తు నాగానాం శాన్తి కర్మ నిబోధ మే | నిత్యం నైమిత్తికం కామ్యం యథావ దనుపూర్వకమ్‌ ||

పంచమీషు చ శుక్లాసు వాసుదేవస్య పూజనమ్‌ | శ్రియశ్చ రామ ! కర్తవ్యం నాగసై#్యరావణస్య చ ||

గంధమాల్య నమస్కార ధూపదీపా7న్న సంపదా | తథా చ కృష్ణ పక్షా7న్తే మాసి మాసి ద్విజోత్తమ ! ||

భూతేజ్యా సతతం కార్యా తిలమాంస పయో గుడైః | మత్స్యైః పక్వామిషై ర్భక్ష్యైః సుమనోభిశ్చ భార్గవ! ||

చతుష్పధేషు రద్యాసు తథా శూన్య గృహేషు చ | ఏక వృక్షశ్మశానేషు గోపురా7ట్టలకేషు చ ||

సంగమేషు నదీనాం చ పర్వతానాం గుహాసు చ | త్రికంటకేషు ముఖ్యేషు శూన్యదేవ గృహేషు చ ||

శుక్లపక్షా7వసానేషు దేవతేజ్యా విధీయతే | గజస్థానోత్తరే భాగే ప్రాగుదక్‌ ప్రవణ శుభే ||

బ్రహ్మాణం శంకరం విష్ణుం శక్రం వైశ్రవణం యమమ్‌ | చంద్రా7ర్కౌ వరుణం వాయుం త్వగ్నిం పృధ్వీం తథా ఖగమ్‌ ||

శేషం చ నాగరాజం తు భూధరాం శ్చైవ కుంజరాన్‌ | విరూపాక్షం మహాపద్మం భద్రం సుమనసం తథా ||

అష్టౌచ దిగ్గజా యే వై తే స్మృతా దేవయోనయః | కుముదై రావణౌ పద్మం పుష్పదంతో7థ వామనః || 10

సుప్రతీకా7ంజనౌ నీల ఏతే7ష్టౌ దేవయోనయః | యథోక్తానాం సుకర్తవ్యం పూజనంవై పృథక్‌ పృథక్‌ ||

గంధమాల్య నమస్కార ధూపదీ7పాన్న సంపదా | ఓంకారపూతే నా7జ్యేన తథా7గ్ని హవనం భ##వేత్‌ ||

పుష్కరుండనియె : ఈపైని గజముల శాంతివిధానముం దెలిపెద. తెలిసికొనుము. ఇది నిత్యము. నైమిత్తికము, కామ్యము నను మూడు విధములు. శుక్లపంచమీ తిథులందు వాసుదేవ పూజ లక్ష్మీదేవి పూజ ఇంద్రుని యైరావత గజరాజ పూజయు షోడశోపచారములతో గావింపవలెను. నెలనెలకు కృష్ణపక్షాంతమందు తిలలు మాంసము పాలు బెల్లము చేపల పక్వమాంసములతో భక్ష్యములతో బువ్వులతో జేయగనును. నాల్గుదారుల కూడలియందు రాజవీధులందు శూన్యగృహములందు ఒకే చెట్టున్న స్మశానములందు రాజగోపురములందు అట్టాలకములందు నదీ సంగమములందు పర్వతగుహలందు ముఖ్యములయిన త్రికంటకము లందు పాడుపడిన దేవాలయములందు శుక్ల పక్షము చివర దేవతాపూజ విధింపబడినది. గజశాలకుత్తరముగ తూర్పు ఉత్తరముల వైపున ఈశాన్యమూలయందు బ్రహ్మను శంకరుని విష్ణువును ఇంద్రుని కుబేరుని యముని సూర్యచంద్రులను వరుణుని వాయువును అగ్నిని భూమిని శేషుని పర్వతములను ఏనుగులను విరూపాక్షుని మాహాపద్మమును(కుబేరుని నిధులలో నొకటి)భద్రుని, సుమనో దేవతనూ దేవయోనులయిన అష్టదిగ్గజములను (కుముద-ఐరావణ)(త)పద్మ పుష్పదంత వామనసుప్రతీక-అంజన నీలములను పేరుగలవానిని) వేర్వేర శాస్త్రోక్తముగా షోడశోపచారపూజ గావింపవలెను.

పృథక్‌ పృథక్చ సర్వేషాం చతుర్థ్య న్తైశ్చ నామభిః | దక్షిణా7భి స్తతో రామ ! బ్రాహ్మణాన్‌ స్వస్తి వాచయేత్‌ ||

తత శ్శాన్త్యుదకం కృత్వా మంత్రై రక్షోహణౖ ర్ద్విపాన్‌ | అభ్యుక్షయే త్కుశాగ్రేణ పూజాన్తే చ తథా తదా ||

అతః పరం ప్రవక్ష్యామి కర్మ నైమిత్తికం తవ | గజానాం మరణ ప్రాప్తే తథా వ్యాథౌ చ దారుణ ||

దన్తచ్ఛేదా7శుభో త్పత్తౌ మృతే రాజద్విపే తథా | దన్త భంగే తథా జాతే వా సుపక్షమృతే గజే ||

కృష్ణపక్షే మృతే నాగే వహ్ని పృష్ఠే మృతే తథా | దారుణాసు చ వేలాసు దక్షిణా7పర మూర్థని ||

హస్తిన్యా7థ మదే జాతే ప్రకృతేశ్చ విపర్యయే | పూర్వోత్తరే చ దిగ్భాగే నగరాత్‌ సుమనోహరే ||

స్నిగ్ధ ప్రాశన తోయేషు ద్రుమవీత వనస్పతౌ | ప్రాగుదక్ప్రవణం రామ ! స్థండిలం పరి కల్పయేత్‌ ||

ప్రణవపూర్వకముగ నగ్నియందు హవనము చతుర్థ్యంతముగా స్వాహాకారముతోపూజసేయవలెను. బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి స్వస్తివాచనము సేయింపవలెను. పూజ యయిన తర్వాత ఆ శాన్తి తీర్థమును రక్షోహణమంత్రములతో ఏనుగులపై కుశాగ్రము ప్రోక్షింపలచేవలెను.

ఇక నైమిత్తికశాంతివిధానము :- ఏనుగులు మిక్కిలిగ చనిపోవుచున్న యెడల దారుణవ్యాధులకు గురియైనపుడు దంతములు అశుభసూచకములుగా బుట్టినపుడు రాజగజము మరణించినపుడు దంతభంగమయినపుడు అశుభపక్షమందేనుగు మృతిచెందినను కృష్ణపక్షమందు చనిపోయినను అగ్ని యందుచనిపోయినను దారుణములయిన వేళలందు ఎడమ కుంభస్థలమందు అడయేనుగుచే మదోద్రేకము గల్గినతరి ప్రకృతి ప్రకృతి విపర్యయములందు నగరమునకు పూర్వోత్తర దిగ్భాగమున (ఈశాన్యమూలనన్నమాట) చక్కటిచోట చక్కని పానయోగ్యమయిన నుదకముగలచోట మహావృక్షములు ఉన్న వనమందు ప్రాగుదక్ప్రవణముగా (ఈశాన్యముగా) స్థండిల మేర్పరుప వలెను.

కమలం విన్యసే త్తత్ర కర్ణికా కమలే హరిమ్‌ శ్రియం చ విన్యసే త్తత్ర కేసరేషు చ విన్యసేత్‌ || 20

బ్రహ్మాణం భార్గవం పృథ్వీం తథా స్కందం చ భార్గవ ! | అనన్తం ఖం శివం సోమం సర్వాణ్యతాని భార్గవ ! ||

దళేషు తత్ర దిక్పాలాన్‌ విన్యసేత్‌ సహ కుంజరైః | పత్రాం7తరేషు శస్త్రాణి యథావ దనుపూర్వశః ||

వజ్రం తు విన్యసే ద్ధీమాన్‌ శక్రపత్రా దనంతరమ్‌ | తత శ్చక్రం తతో దండం తోరణం తదనన్తరమ్‌ ||

తతశ్చ విన్యసే త్పాశం తోమరం సశరం ధనుః | తతో గదాం మహాభాగ ! తత శ్శూలం చ విన్యశేత్‌ ||

పద్మం చ సాం7తరదళం వృత్తయా లేఖయా భ##జేత్‌ | ఆదిత్యైస్సహ నా7సత్యౌ తతః పూర్వేణ విన్యసేత్‌ ||

వసూ నగ్ని దిశాభాగే సాధ్యా న్యామ్యే చ విన్యసేత్‌ | తథా చ నైరృతే భాగేదేవా నంగిరసో న్యసేత్‌ ||

పశ్చిమే భృగవో భాగే వాయవ్యే మరుత స్తథా || విశ్వే దేవా స్తథో దక్చ రుద్రాన్‌ శివదిశి న్యసేత్‌ ||

కృత్త్వెత ద్దేవతాన్యాసం వృత్తయా రేఖయా భ##జేత్‌ | బాహ్యేన విన్యసే త్తస్యాః సూత్రకారాన్‌ ఋషీన్‌ ద్విజ ! ||

పూర్వేణ రామ ! యామ్యేన తథా దేవీం సరస్వతీమ్‌ | నదీః పశ్చిమతః శైలాన్‌ తథోదగ్భృగు నన్దన ! ||

మహాభూతాని వేదీషు కోణహస్త గతాని తు | పద్మం చక్రం గదాం శంఖ మీశాన్యాదిషు విన్యసేత్‌ || 30

అందు కమలము నుంచి దాని దుద్దునందు హరిని లక్ష్మితో విన్యాసముసేసి కేసరములందు బ్రహ్మను భార్గవును భూమిని కుమారస్వామిని శేషుని ఆకాశమును శివుని సోముని యాహ్వానించి ప్రతిష్టింపవలెను. రేకులందు దిక్పాలురను దిగ్గజములతో న్యాసము సేయవలెను. రేకుల నడుమ వారి వారి యస్త్రములను గ్రమముగా నుంచవలెను. ఇంద్రుని రేకుతర్వాత వజ్రమును తరువాత చక్రము దండము తోరణము పాశము తోమరము బాణముతో ధనుస్పును గదను శూలమును వ్యాసము చేయవలెను అంతర్దళముల తోడి యా పద్మముచుట్టు రేఖగీసి ద్వాదశాదిత్యులతో నశ్వినీదేవతలను పూర్వదిక్కున అగ్నేయమూల వసువులను దక్షిణదిశ సాధ్యులను నైరృతిమూల ఆంగిరోదేవతలను పడమట భృగువులను వాయవ్యమందు మరుత్తులు ఉత్తరమున విశ్వేదేవులను ఈశాన్యమందు రుద్రులను న్యాసము సేయవలెను. దానికి మీద చుట్టును రేఖగీసి యందు తూర్పున సూత్రకర్తలగు ఋషుల దక్షిణమున సరస్వతీ దేవిని పడమట నదులను ఉత్తరమున పర్వతములను వేదికలందు మహాభూతములను కోణహస్తములందును పద్మము చక్రము గద శంఖమును యీశాన్యాది దిశలందు ప్రతిష్టింపవలెను.

చతురస్రం తథా కార్యం చతుర్ద్వారం చ మండలమ్‌ | ప్రమాణం మండలస్యాత్ర భ##వే ద్భూమి వశా త్తథా ||

విదిక్షు పూర్ణకలశాన్‌ పూర్ణపాత్రయుతా7న్న్యసేత్‌ |

సప్తహస్తేషు దండేషు పతాకాశ్చ తథా న్యసేత్‌ | సితాః రక్తాః సితాః పీతాః యథావ దనుపూర్వశః ||

దిక్షు తోరణ విన్యాసం తోరణానాం చ వేష్టనమ్‌ |

క్షీరవృక్ష ద్రుమదళైః కుసుమైః సఫలై ర్భవేత్‌ | తోరణస్య ప్రమాణం చ షడ్ఢస్తం పరికీర్తితమ్‌ ||

ఉచ్ఛ్రాయేణ తథా7యామాద్‌ జ్ఞేయం రామ ! సమద్వయమ్‌ | తార్‌క్ష్యం తాలం చ మకరం ఋష్యం చైవా7నుపూర్వశః ||

తోరణోపరి మధ్యే తు దానవాన్‌ వినివేశ##యేత్‌ | కర్ణకై ర్లక్షణోపేతాన్‌ విన్యసే ద్దేవతా గణాన్‌ ||

సాయుధాన్‌ సపతాకాంశ్చ సాతపత్రం శతక్రతుమ్‌ | దిగ్గజానాం చ విన్యాస మోషధీభిః ప్రకల్పయేత్‌ ||

ఐరావణం దళే శ##క్రే లాజాభి ర్విన్యసే ద్బుధః | నాగం పువ్పమయం పద్మ మాగ్నేయే విన్యసే ద్దళే ||

పుష్పదన్త స్తథా యామ్యే నాగః కార్యః ప్రియంగుభిః | తథా చ నైరృతే భాగే నాగః పుష్పేణ వామనః ||

వాయవ్యే చా7ంజనం పత్రే మాషైః కుర్యా ద్విచక్షణః | నీలశ్చ పత్రే కౌబేరే శత పుష్పామయో భ##వేత్‌ ||

ఐశాన్యే కుముదం కుర్యా న్నాగేంద్రం సిత తండులైః | తతస్తు పూజనం కార్యం సోప వాసేన భార్గవ ! || 40

ఆమీద నలుచదరముగ నాల్గుద్వారములతో మండలమేర్పరుపవలెను. దాని ప్రమాణమాప్రదేశమునుబట్టి యుండవచ్చును. మూలలందు పూర్ణపాత్రములతో పూర్ణకలశములను బ్రతిష్టింపనగును. ఐదు మూరల దండములందు పతాకలను గట్టవలెను. తెలుపు ఎరుపు తెలుపు పసుపు కలిసిననిగా నవి యుండవలెను. దిక్కులందు తోరణములు వానికి వేష్టనము క్షీరవృక్షముల యాకులు పువ్వులు పండ్లతో నేర్పరుపవలెను. తోరణ ప్రమాణము మూడు మూరలుండవలెను. దాని యెత్తు దానికి రెండురెట్లుండవలెను. అనగా పదునెనిమిది మూరలుండవలెను. తోరణముమీద మధ్యను తార్‌క్ష్యుడు తాలుడు మకరుడు ఋష్యుడు నను దానవులను (వారి చిత్తరువులన్నమాట) నుంచవలెను. తోరణ కర్ణకమందు దేవతాగణములను సలక్షణముగ నలంకరింపవలెను. వారందరి కాయుధములు పతాకలు గొడుగులును చిత్రకల్పన సేయవలెను. తూర్పున పేలాలతో నింద్రదళమందైరావణగజమును ఆగ్నేయమూల పుష్పమయుని పద్మమను దిగ్గజము నుంచవలెను. దక్షిణమందు పుష్పదంతుని ప్రియంగువలతో నేర్పరుపవలెను. నిరృతిమూల వామనమను దిగ్గజమును పుష్పముతో నుంచవలెను. వాయవ్యమూల నంజనమను దిగ్గజమును మినుములతో నాకు మీద నుంచవలెను. కుబేరదిశ (ఉత్తరమందు) శత పుష్పామయునిగ నీలమను దిగ్గజమును బ్రతిష్టింపవలెను. ఈశాన్యమూల తెల్ల బియ్యముతో కుముదమను దిగ్గజము నేర్పరుపవలెను. ఉపవాసముండి ఆమీద పూజసేయవలెను.

జితేంద్రియేణ దాంతేన శిరస్స్నాతేన చాక్షేప్యథ | శుక్లవస్త్రా7వృతేనా7పి సోష్ణీణ తథైవ చ ||

కాంచనా7లంకృతేనా7పి స పవిత్రేణ భార్గవ ! | సర్వాసాం పూజనం కుర్యాద్దేవతానాం పృథక్‌ పృథక్‌ ||

అస్త్రాణాం కుంజరాణాం చ పద్మాదీనాం తథైవ చ | తోరణ తు నివిష్టానాం తార్యాక్షదీనాం పృథక్‌ పృథక్‌ ||

సాగరాణాం చ కుంభేషు గంధమాల్యా7ను లేపనైః | ధూపెర్దీపై ర్నమస్కారైః ర్వాసోభిశ్చ పృథక్‌ పృథక్‌ ||

తథా ప్రతిసరాభిశ్చ భూషణౖశ్చ పృథక్‌ పృథక్‌ | భూరిణా చ తథా7న్నేన పానైశ్చ వివిధై స్తథా ||

కుల్మాష పరమా7న్నాభ్యాం పూజ్యాస్తే కృసరేణ చ | భూదకోల్లోపికా భ##క్ష్యైః సితయా గుడ ఫాణితైః ||

మాంసౌదన పయః క్షౌద్ర దధిపాయస సక్తుభిః | అవూప ఫల మూలా7న్నరాగ ఖండవకై ర్దలైః ||

ఏవం సంవూజనం కృత్వా శంఖవాద్య రవై ర్దిజ ! | గీతేన చ మహాభాగ ! సుభగా నర్తితేన చ ||

తతస్తు పూజనం కృత్వా పూజాస్థానా త్తథా7ప్యుదక్‌ | ఆహితాగ్ని కులాదగ్నిం వేది ముల్లిఖ్య బోధయేత్‌ ||

దేవతానాం తు సర్వాసా మేకైకం తు పృథక్‌ పృథక్‌ | చతుర్థ్యన్తేన నామ్నాతు ప్రణవాద్యేన భార్గవ ! || 50

శత మాజ్యేన జుహుయా న్మహావ్యాహృతయ స్తథా | తతస్తు పూజితా నాగా వహ్నిం దేవగణాన్‌ ద్విజాన్‌ ||

కృత్వా ప్రదక్షిణం సర్వే వ్రజేయు స్స్వగృహాణి తే || ఉపద్రష్టే తథా కర్త్రే సర్వం తత్ర నివేదయేత్‌ ||

జితేంద్రియుడై దాంతుడై శిరస్స్నానము సేసి శుక్ల వస్త్రములు దాల్చి తలపాగయుం బెట్టుకొని బంగారపు వస్తులల గైసేసికొని పవిత్రము ధరించి (దర్బలతో జేసిన యుంగరమన్నమాట) ఈసర్వదేవతలకు వేర్వేర పూజసేయవలెను. ఆదేవతల అస్త్రములకు దిగ్గజములకు తోరణమందు వినిష్టులైన తార్‌క్షాదులకు పూర్ణకుంభములందు సముద్రులకు వేర్వేర నీ షోడశోపచారముల జరుపవలెను. పూలమాలతో భూషణములతో భూరిసంతర్పణము కుల్మాషములు బరమాన్నములు కృసరము పులగము మోదకములు ఉల్లోపికలు మొదలయినవి పంచదార బెల్లము పాణితములతో జేసినని మాంసౌదనము పాలు తేనె పెరుగు పాయసము పేలపిండి అపూపములు అప్పాలు పండ్లు దుంపలు రాగ ఖండవకములు దళములు మొదలయిన వానిని నివేదించి శంఖవాద్యములతో గీతములతో సుందరీ నర్తనముతో పూజసేసి పూజాస్థానమున కుత్తరముగ నాహితాగ్ని కులమునుండి యగ్నిం గొనివచ్చి వేది నుల్లేఖించి శోధనసేసి దేవతలకందరకు వేర్వేర చతుర్థీ విభక్త్యంతముగ ప్రణవవాదిగ స్వాహాకరాముతో అజ్యాహుతులు మహావ్యాహృతులు నూరింటితో సమర్పింపవలెను. ఆమీద నేనుగులం బూజించి యగ్నిని దేవగణములను ద్విజులనులూజించి ప్రదక్షిణముసేసి యందురు స్వగృహముల కేగవలెను. ఉపద్రష్టకు కర్తకు అచట సర్వము నివేదింపవలెను.

భ##వే న్నిష్కం చ నిష్కం చ ధేనుం ధేనుం భువం భువమ్‌ | అశ్వమశ్వం తథా7న్యా చ దక్షిణా శక్తితో భ##వేత్‌ ||

న భ##వే త్సా-మహాద్రోణా కథంచి దపి కస్యచిత్‌ | తథా చ హస్తి భిషజా ప్రవృత్తేన చ భూరిణా ||

పూజనీ¸° తథై వాత్ర సాంవత్సర పురోహితౌ | హస్తిన్యాం మదమత్తాయాం శాన్తికే7స్మిన్‌ ద్విజోత్తమ ! ||

రాష్ట్రాన్నిర్వాస్య తాం కుర్యా చ్ఛాన్తి మేతాం ద్విజోత్తమ ! | నాగరాజ్ఞి మృతే కృత్వా తత్రైవా7న్యం మతంగజమ్‌ ||

స్నాతం సర్వౌషథై ర్నాగం సర్వగంథై స్తథైవ చ | సర్వబీజైశ్ఛ రత్నైశ్చ సర్వతీర్థజలై స్తథా ||

అహతాంబర సంవీత దర్శనం శ్వేత లక్షణమ్‌ | కాంచనా పీడితే వాద్యగీత పుణ్యా7హ నిస్వనైః ||

అర్చితం దైవతో వహ్నిం కృత విప్ర ప్రదక్షిణమ్‌ | కరిణీం తు సమారుహ్య వదేత్కర్ణేతు కాలవిత్‌ ||

శ్రీ గజ! స్వత్కృతే రాజా భవస్వా7స్య గజాగ్రణీః | గంధ మాల్యా7గ్ర భ##క్తై స్త్వాం పూజయిష్యతి పార్థివః || 60

లోక స్త్వదాజ్ఞయా పూజాం కరిష్యతి తవా7నఘ | పాలనీయ స్త్వయా రాజా ఘోరయుద్ధే తథా77హవే ||

తిర్యగ్భావం సమ్ముత్సృజ్య దివ్యం భావ మనుస్మర ! | దేవాసురాణాం యుద్ధే చ శ్రీగజ స్త్రిదశైః కృతః ||

ఐరావణ సుతం శ్రీమానరిష్టో నామ రావణః | శ్రీగజానాం తు తత్తేజః సర్వమే వాత్ర తిష్ఠతి ||

ఉపద్రష్టకు కర్తకు నిష్కము నిష్కమీయవలెను. ధేనువుల నీయవలెను. భూదానము కర్తవ్యము. ఇద్దరికి చెరియొక గుఱ్ఱము నొసంగనగును. ఇంకను యథాశక్తి దక్షిణాయీయవలెను. ఇట్లు చేసినచో నేగజమునకు నెన్నడును. మహాద్రోణావ్యాధి (వ్యాధికాబోలు) గలుగదు దీనికి గజ చికిత్సకుడు పూర్తిక చికిత్సకు పూనుకొనుటయు దీనికి తోడగును. ఆమీద దైవజ్ఞుని పురోహితుని పూజింపవలెను. ఆడయేనుగు మదో ద్రిక్తమయిన యెడల నీ శాంతికర్మయందు దానిని రాష్ట్రమునుండి త్రోలివేసి యీశాంతి ప్రక్రియ జరుప వలెను. గజరాజు చనిపోయినచో మరొక యేనుగును గొనివచ్చి సర్వౌషధులచే సర్వగంధములచే స్నానము చేయించి సర్వధాన్యములతో (నవధాన్యములతో) రత్నములతో సర్వతీర్థజలములతో నుతికిన మడువులు ధరించి. మంగళవాద్య పుణ్యాహ వాచన ధ్వనులతో నర్చింపబడిన యగ్నికి బ్రదక్షిణముసేసి కాలజ్ఞుడు (జ్యోతిషికుడు) ఏనుగు నెక్కి దాని చెవిలో శ్రీగజమా! ఈరాజుయొక్క గజములలలో శ్రేష్టమైన దానివి కమ్ము గంధమాల్యములచే మంచియాహారముచే రాజు నీపూజ నొనరించును. ఘోర యుద్ధములందు నీవే రాజును గాపాడుము. సమరమందు నీవు పశుత్వము విడిచి దివ్యత్వమును జ్ఞాపకము సేసికొనుము దేవా సుర యుద్ధమందు శ్రీగజమును యుద్ధవిమిత్తముగా దేవతలు సృష్టించిరి. ఆ శ్రీగజములయొక్క తేజస్సంతయు నిక్కడనున్నది.

తత్తేజ స్తవ నాంగేంద్ర ! దివ్యభాగ సమనిత్వమ్‌ | ఉపతిష్ఠతు భద్రం తే రక్ష ! రాజాన మాహవే ||

ఇత్యేవ మభిషిచ్త్యైనం శుభే7హని నరాధిపః | నిత్యం చై7వాస్య కర్తవ్యం బ్రాహ్మణౖః స్వస్తివాచనమ్‌ ||

తస్యా7నుగమనం కుర్యు శ్శస్త్ర హస్తాశ్చ మానవాః | సితవర్ణశ్చ కర్తవ్యో రాజ్ఞః పుణ్యాహ కర్మసు ||

ఏతత్తే సర్వ మాఖ్యాతం గజానాం శాన్తి కర్మసు | నక్షత్రాణి ప్రశస్తాని తిథయశ్చ తథా శృణు ||

చతుర్దశీం చతుర్థీం చ నవమీం చ వివర్జయేత్‌ | అంగారక దినం రామ ! దినం భాస్కరజస్యచ ||

ఋక్షాణి వైష్ణవం త్వాష్ట్రం శస్యతే శక్ర దైవతమ్‌ | నక్షత్రాణి ముహూర్తాశ్చ ఏత ఏవ మహాబల ! ||

దేశకాలోపపన్నం విధినా చ తథా కృతమ్‌ | శాన్తికర్మ గజేంద్రాణాం సర్వ బాధా వినాశనమ్‌ || 70

ఓ నాగేంద్ర! ఆతేజస్సంతయు దివ్య భాగసమన్వితము అది నీకు వచ్చుగాక! రాజును రక్షింపుము. నీకు భద్రమగుంగాక! ఇట్లు పల్కిరాజు శుభదివసమందు యేనుగున కభిషేకముచేసి బ్రాహ్మణులచే దానికి నిత్యము స్వస్తివాచనము చేయింపవలెను. ఆయేనుగును శస్త్రపాణులయిన వారు వెంబడింపవలెను. రాజుయొక్క పుణ్యాహప్రక్రియలందు ఆశ్రీగజముకు దెల్లని రంగుపూయవలెను. గజశాంతి విధాన మిదియెల్ల దెలిపితిని. ఇక ప్రశ స్తనక్షత్రములు తిథులందెల్పెద. కృష్ణశుక్లపక్ష చతుర్దశులు నవమియుంబనికిరావు. కుజవారము ఆదివారము విష్ణుదైవతము త్వష్టృ దేవతాకము ఇంద్రదైవతమను దైవ నక్షత్రములు ప్రశస్తములు. సుముహూర్తము నిదే. దేశకాలానుకూలముగ సంఘటితమైన విధానమునజేసిన శాంతికర్మ ఏనుగులకు సర్వబాధానివారణము.

ధన్యం యశశ్య మాయుష్యం రాజ్ఞాం చ విజయావహమ్‌ | భార్గశ్చ్యవనః క్రుద్ధో యథా శక్రస్య భార్గవ ! ||

మదో నామ సముత్పన్న స్తథా దైత్య స్సుదారుణః | ఇంద్రనాశాయ శక్రార్ధీ తతః పశ్చాత్ప్రసాదితః ||

మదం స బహుధా చక్రే ప్రజాపతి సమో ద్విజ! | స్త్రీ ష్వక్షేషు తథా పానే మృగయాయాం ధనే తథా ||

విద్యాసు చైవ సర్వాసు సర్వశిల్పేషు చా7ప్యథ | జీవేషు రామ ! సర్వేషు తథా రూపే బలే మలే ||

ఏకో7స్య ధారణ శక్తోన కశ్చిదితి చింతయన్‌ | యథోక్తేష్వధికం భాగం కించి త్పానే నివేశ##యేత్‌ ||

ప్రాణినా మధ సర్వేషాం నాగేష్వభ్యధికు తథా | మదో యదా సమభ్యేతి నాగం బ్రాహ్మణ సత్తమ ! ||

రామ | శాన్తి స్తదా కార్యా యాదృశీ తాం నిబోధ మే | శాలా ప్రాగుత్తరే భాగే స్థండిలం కల్పయే ద్బుధః ||

స్థండిలే కమలం కృత్వా దిక్పత్రేషు తథేతరాన్‌ | కేసరే చ్యవనం నాగాన్‌ భువం కం చ సరస్వతీమ్‌ ||

పూజయే డ్డిండిమం మధ్యే గంధమాల్యా7ను లేపనైః | ధూప దీప నమస్కారై ర్వాసోభిశ్చ పృథక్‌ పృథక్‌ ||

సర్వాసాం పూజనం కృత్వా పాద్యా7ద్యనురతో ద్విజ ! | దేవతానాం ఘృతం హుత్వా యథాశ్రద్ధ మనిందితమ్‌ || 80

రసపూర్ణో ఘటో దేయో దక్షిణార్థే చ కాంచనమ్‌ | దత్వా వాసాంసి నాగస్య గజాధ్యక్షం చ పూజయేత్‌ ||

హస్తిపం కర్మిణ శ్చా7న్యాన్‌ దక్షిణాభి ర్ద్విజోత్తమాన్‌ | సాంవత్సరే చ విత్తేన యత స్సాంవత్సర స్స్వయమ్‌ ||

గజా7ధ్యక్షాయ తం దద్యా ద్దిండిమం ప్రయత స్స్వయమ్‌ | ప్రాఙ్ముఖశ్చ గజాధ్యక్షో వాదయేత్తం యథావిథి ||

ఇది ధన్యము యశస్కరము రాజులకు విజయావహముగూడ. భార్గవ వంశీయుడు చ్యవనుడింద్రునియెడ గోపముగొన్నతఱి మదుడను రాక్షసుడింద్ర నాశనమునకు సుదారుణమైనవాడుపుట్టెను. తరువాత వాడు ప్రశాంతుడు గావింపబడినాడు. వాడు బ్రహ్మతో సమానుడై పెక్కు తీరుల మదమును ప్రదర్శించెను. స్త్రీల యందు అక్షక్రీడ యందు త్రాగుడులో వేటలో ధనమందు సర్వ విద్యలందు సర్వశిల్పములయందు సర్వజీవులయందు రూపము బలము కులమునందు మదమును నింపి దీనివెవ్వడు నోర్వలేడని నిశ్చయించి ఈ చెప్పినవానియందుకంటె నధికభాగమును త్రాగుడునందుంచెను. అట్లే ప్రాణులలో నెల్ల నధికభాగమేనుగుల యందుంచెను. కావున నేనుగు మదమెక్కినపుడెల్ల శాంతి చేయుచుండవలెను. ఈ శాన్యమూల స్థండిల మేర్పరచి కమలమునుంచి ఆయా దిక్కులందలి రేకులందితర దేవతలను కేసరమందు చ్యవనుని ఏనుగులను భూమిని బ్రహ్మను సరస్వతిని డిండమము (వాద్యవిశేషమును) పూజింపవలెను. వేర్వేరనందరను షోడశోపచారపూజ గావించి దేవతల కాజ్యాహుతిలిచ్చి రసపూర్ణమైన పూర్ణకుంభమును దక్షిణగానీయవలెను. ఏనుగునకు నూతనవస్త్రములిచ్చి గజాధ్యక్షుని (గజ సేనాధిపతిని) గూడ పూజింపవలెను. అటుపై మావటివానిని మరి పూజాకార్యక్రమ నిర్వాహకులను బ్రాహ్మణోత్తములను దక్షిణలతో దైవజ్ఞునిం బూజింపవలెను. జ్యోతిషికూడా డిండిమను దాను స్వయముగా గజాధ్యక్షుని కీయవలెను. అతడు తూర్పుగా నిలచి నియమవంతుడై దానిని వాయింపవలెను.

ఉచ్చైర్గంభీర నిర్ఘోషే డిండిమే తు శుభే వదేత్‌ ! ఆన్తరా7పాతితే తస్మిన్‌ తథైవా7ప్యశుభం వదేత్‌ ||

డిండిమే సమ్య గాదత్తే శుభ##మేవ వినిర్దిశేత్‌ | తదా ప్రభృతి మత్తస్య తదా నాగస్య వైనృప ! ||

అశుభే లక్షణ జాతే భూయ స్తత్కర్మ చా7చరేత్‌ | శుభే తు లక్షణ జాతే గజాధ్యక్షస్య డిండిమమ్‌ ||

జయే సంస్థాప్య నందాద్యా గజపాయ ...... సర్వబాధావినాశనమ్‌ |

ఆడిండిమ ఘోషము మిక్కిలి పెద్దగానున్నచో నేనుగునకు శుభము. ఆది నడుమ నడుమ నాగియాగి మ్రోగినచో నశుభమును జరుగునని చెప్పవలెను. దానిని బట్టి యశుభ నివారణకు శాంతికర్మచేయవలెను. శుభలక్షణము గనిపించినచో నా డిండిమమును సర్వబాధావినాశనమైనదానిని గజాధ్యక్షుని కీయవలెను.

అతః పరం ప్రవక్ష్యామి కామ్యం కర్మ తవా7నఘ | ఉపోషిత స్తథా యామ్యే యజమానే పురోహితః ||

శుభప్రద మిదం స్నానం యజమానస్య కారయేత్‌ | న్యగ్రోధోదుంబరాకాశ్వత్థ మధూకోదక సంయుత్తేః ||

అకాల మూలైః కలశైః పంచభి ర్గజ లక్షణౖః | స్నాతః శుక్లాంబరో విష్ణుం చంద్రార్కౌ వరుణం తథా || 90

హస్తినం పూజయే ద్విదాన్‌ గంధమాల్యా7న్న సంపదా | ధూపదీప నమస్కారై ర్వాసోభిశ్చ తథైవ చ ||

హస్తి దంతేన సూర్యాయ దత్త్వా ధూప మతః పరమ్‌ | చతుర్థ్యన్తేన వైనామ్నా ప్రణవా7ద్యేన భార్గవ ! |

సహస్రశో గజాశ్చా7త్ర దక్షిణా కాంచనం తథా |

యః స్వాసతే స్నాన మిదం ప్రకుర్వన్‌ | గజేంద్ర ముఖ్యాన్గజ సన్నికాశాన్‌ |

బహూనవాప్నోతి తథా 7స్య నాగాః | భవన్త్యరోగాః వినిముక్త దోషాః || 93

ఇతి శ్రీ విష్ణు ధర్మోత్తరే ద్వితీయఖండే గజానాం శాన్తికర్త విధానం నామ పంచాశత్తమో7ధ్యాయః.

ఇక కామ్యకర్మ విధానము తెల్పెద. ఇందు పురోహితు డుపవాసముండి యజమానునికి శుభప్రద మయిన మంగళస్నానము సేయింపవలెను. మర్రి ఉదుంబరము రావి ఇప్ప చిగుళ్ళతోడి జలములతో అకాలమూలములైన గజలక్షణము లయిన (ఏనుగు రూపము నగిషీ చెక్కశడిన) కలశములతో స్నానము సేసి తెల్లని వస్త్రములు ధరించి విష్ణుని చంద్ర సూర్యుల వరుణుని ఏనుగును గంధమాల్యాద్యుపచారములచే బూజింపవలెను. నూతన వస్త్రముల నీయవలెను. సూర్యునికి ఏనుగు దంతముచే ధూపమునిచ్చి చతుర్ధీవిభక్త్యంతముగ ప్రణవాదిగ పూజచేయవలెను. ఈపూజలో వేలకొలది యేనుగులు బంగారము దక్షిణ నీయవలెను. ఈపూజగావించి మంగళస్నానముసేసి యెవ్వడు సుభుడైయుండు నాతడు గజసంపదను గజసమానమైన బహువిధ మంగళార్థములను బొందును. ఇతని యేనుగులు సర్వదోష రహితములుగూడ యగును.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున గజముల శాంతివిధానమను నేబదియవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters