Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఏబది యేడవ యధ్యాయము - శతభిషాస్నానము

రామః- ఆరోగ్య కరణం నామ ద్వితీయా ప్రతిపత్తథా | ఆరోగ్యదం వ్రతం చైవ వైష్ణవం కథయస్వ మే || 1

పుష్కరః- ధనిష్ఠాసు మహాభాగ! యజమాన పురోహితౌ | ఉపోష్య వారుణం స్నానం యాజమానస్య కారయేత్‌ ||

కృత్వా కుంభశతం సాగ్రం శఖ ముక్తా ఫలోదకైః | భద్రాసనోప విష్ట సై#్తః స్నాత శ్చైవా7 హతాంబరః ||

కేశవం వరుణం చంద్రం నక్షక్ష్రం వారుణం తథా | పూజయేత్‌ ప్రయతో రామ! గంధమాలా7ను లేపనైః ||

ధూప దీప నమస్కారై స్తథా చైవా7న్న సంపదా | దేవతానాం యథోక్తానాం కుర్వీత హవనం తథా ||

సర్వౌషథై స్తథాజ్యేస యథాశక్తి విధానతః | గురవే వాససీ దేయే రసకుంభం చ కాంచనమ్‌ ||

బ్రాహ్మణానాం ప్రదాతవ్యా విత్తశక్త్యా చ దక్షిణా | శమీ శాల్మలిజైః పత్రైః వంశాగ్రేణ తథైవ చ ||

త్రివృతస్తు బలిః కార్యః సర్వరోగవినాశనః | శాకాని హరితం మాల్యం సర్వసస్యామి వాససీ ||

వరుణాయా7శు నిక్షిప్య గంధై ర్దూపై ర్నివేదయేత్‌ |

అలంఘమానస్య హి వారుణం తమ్‌ | స్నానేన దానేన కృతేన సమ్యక్‌ |

రోగా స్సమస్తాః ప్రశమం ప్రయాన్తి | బద్ధ స్తథా మోక్ష మవాప్నుయాచ్చ ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే శతభిషాస్నాన వర్జనం నామ సప్త పంచాశత్తమో7ధ్యాయః.

పరుశురాముడు ఆరోగ్యప్రతిపత్తు ఆరోగ్యద్వితీయా వ్రతము విష్ణువ్రతముం గూర్చి వచింపుమన పుష్కరుండిట్లనియె ధనిష్ఠానక్షత్రమందు యజమానుడు పురోహితుడు నుపవాసముండి యజమానునిచే వారుణస్నానము సేయింపవలెను. సింహాసన మధిష్టించి నూరు కుంభములుపైగా శంఖములు ముత్యములు నించిన యుదకముల స్నానముచేసి నూతనాంబరములు ధరించి కేశవుని వరుణుని, చంద్రుని వారుణనక్షత్రమును (శతభిషానక్షత్రమును) మడిగట్టుకొని గంధమాల్యాను లేపనములచే ధూపదీపాదులచే నీయన్న సమృద్ధిగ బూజించి యాదేవతలకు సర్వౌషధులతో నేతితో హవనము సేయవలెను. గురువునకు వస్త్రయుగ్మము రసకుంభము బంగారము పసపు దానము సేయవలెను. కలిమికొలది బ్రాహ్మణులకు దక్షిణ యీయవలెను. జమ్మి బూరుగాకులు వెదురు చిగుళ్ళు నుంగూర్చియీయవలెను. కూరలు పసుపు మాల్యము (మాలలు) సర్వసస్యములు వస్త్రములు ధాన్యవరుణునికి గంధ ధూపాదులతో నివేదనసేయవలెను., వారుణనక్షత్రము దాటకుండ స్నానము దానములు జేసినచో సర్వరోగములు శమించును. బంధములో నున్నవాడు విముక్తుడగును.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున శతభిషాస్నానవర్ణనమను నేబదియేడవయధ్యాయము

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters