Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఏబదితొమ్మిదవ యధ్యాయము - ఆరోగ్యప్రతిపద్ర్వతము

పుష్కరః -సంవత్సరావసానే తు పంచ దశ్యా ముపోషితః | పూజయే ద్భాస్కరం దేవం వర్ణకైః కమలే కృతే || 1

శుక్లేన గంధమాల్యేన చందనేన సితేన చ | తథా కూర్మేణ ధూపేన ఘృతదీపేన భార్గవ: ||

అపూపై సై#్సకతై ర్దధ్నా పరమాన్నేన భూరిణా | ఓదనేన చ శుక్లేన సితా లవణ సర్పిషా ||

క్షీరేణ చ ఫలైః శుక్లె ర్వహ్ని బ్రాహ్మణతర్పణౖః | పూజయిత్వా జగద్ధామ దినభాగే చతుర్థకే ||

ఆహారం ప్రథమం కుర్యాత్‌ సఘృతం మనుజోత్తమః | రసం చ మనుజశ్రేష్ఠ ఘృత హీనం వివర్జయేత్‌ ||

భుక్త్వా చ సకృ దేవా7న్నం నా7హారం సముపాచరేత్‌ | పానీయ పానం కుర్వీత బ్రాహ్మణా7నుమతే పునః ||

సంవత్సర మిదం కృత్వా తతః కృత్వా త్రయోదశమ్‌ | పూజనం దేవదేవస్య తస్మి న్నహని భార్గవ! ||

సమాపయే ద్వ్రతం పుణ్యం రామ! కుంభం ద్విజాతయే |సహిరణ్యం సవస్త్రం చ తథా దద్యా ద్ద్విజోత్తమ! ||

వ్రతేనా7నేన ధర్మజ్ఞ! రోగమేవ వ్యపోహతి |

ఆరోగ్య మాప్నోతి గతిం తథా7గ్ర్యాం | యశ స్తథా7గ్ర్యాః విపూలాంశ్చ భోగాన్‌ |

వ్రతేన సమ్యక్పురుషో ధనార్థీ | సంపూజయే ద్యశ్చ జగత్ప్రధానమ్‌ ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే ఆరోగ్య ప్రతిపన్నామ ఏకోన షష్టి తమో7 ధ్యాయః.

పుష్కరుడనియె: సంవత్సరమయిన తర్వాత పూర్ణిమనాడుపవసించి పలు రంగులతో పద్మమువేసి యందు తెల్లని సువాసన నించు పూలమాలలు తెల్లగంధము కూర్మ (ఇదొకతీగ) ధూపములతో నేతిదీపము సూర్యుని బూజింపవలెను. పంచదార ఆ రిస్టెపెరుగు పరమాన్నము తెల్లని యన్నమును, పంచదార, తేనె, ఉప్పునుగూర్చి పాలు, తెల్లని పండ్లతో బ్రాహ్మణ సంతర్పణముంగావించి పగటినాల్గవ భాగమందు వాసుదేవం గొలిచి నేతితో మొదట నాహారము సేయవలెను. నేయిలేని రసమును ముట్టుకోరాదు. ఒక్కమాఠే యాహారము గైకొనవలెను. బ్రాహ్మణాజ్ఞతో మంచినీళ్ళు ద్రావచ్చును. పండ్రెండ్లు మాసములీరీతి వ్రతము సేసి మరుసటి పూర్ణిమనాడు దేవదేవు భానువునుం బూజించి, యా మీదనీ పుణ్యవ్రతోద్యాపనము సేయవలెను. సువర్ణముతో, సువస్త్రములతో, బ్రాహ్మణునికి కుంభము దానము సేయవలెను. ఈ కుంభదానముచే రోగమలున్నియుంబోవును. ఉత్తమగతియుంవచ్చును. పరమోత్తమ యశస్సు గల్గును. విపులభోగములందును. సర్వజగత్ప్రధాన దైవమయిన ప్రత్యక్షనారాయణుని సూర్యనారాయణుని ధనార్థియైన మానవుడు పూజింపవలెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున ఆరోగ్యప్రతిపద్వ్రతమను నేబదితొమ్మిదవయధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters