Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

డెబ్బదిమూడవ అధ్యాయము - ప్రాయశ్చిత్త విధి

రామ ఉవాచ - కుర్యాద్దండ ప్రణయనం ప్రాయశ్చిత్త మకుర్వతామ్‌ | నృణాం రాజతతో బ్రూహి ప్రాయశ్చిత్తవింధింమమ ||

పుష్కరః - అకామతః కృతే పాపే ప్రాయశ్చిత్తం విదుర్భుధాః | కామచార కృతే 7ప్యేతే న్మతం మే శ్రతి దర్శనాత్‌||

ప్రాయశ్చిత్తైశ్శమంయాతి పాపం కృత మసంశయమ్‌ | రాజ దండాచ్ఛమంయాతి ప్రాయశ్చిత్త మకుర్వతామ్‌ ||

ప్రాయశ్చిత్త విహీనాయే రాజభిశ్చాప్యవాసితాః | నరకం ప్రతిపద్యన్తే తిర్యగ్యోనిం తథైవ చ ||

మానుష్యమపి చాసాద్య భవన్తీహ తథాంకితాః | ప్రాయశ్చిత్త మతః కార్యం కల్మష స్యాపనుత్తయే ||

రాజకృద్ధా77 తురాన్నంచ న భుంజీత కదాచన | తథైవాహ్వాయకస్యాన్నం పదా స్పృష్టంచ కామతః ||

మహాపాతికినా స్పృష్ఠమవలీఢం పతత్రిణా | ఋబీషపక్వం యచ్ఛాపి స్పృష్టం యచ్చా7 ప్యుదక్యయా ||

గణాన్నం గణికాన్నంచ విద్విషాం య జ్ఞుగుప్సితమ్‌ | స్తేనస్యచైవ తీక్షణస్య వార్ధుషే ర్గాయనస్యచ||

దీక్షితస్య కరర్యస్య బద్దస్య నిగడై రపి | అభి శస్తస్య షండస్య పుంశ్చల్యా దాంభికస్య చ ||

చికిత్సకస్య మృగయోః క్రూరస్యోచ్ఛిష్టభోజినః | అనర్చితం వృధామాంస మవీరాయాశ్చ యోషితః

ద్విషదన్నంచ దాసాన్న ముగ్రాన్నం చా ప్యచాక్షుషమ్‌ | పిశునా 7నృతినో శ్చాన్న మ స్త్ర విక్రయిణ స్తథా

రజకస్య సృశంసన్య యస్య చోపపతి ర్గృహే | శైలూష తున్న వాయాన్నం కృతఘ్న స్యాన్నమేవ చ ||

పరివిత్తేశ్చ దుష్టస్య బందినః కితవస్య చ | కుండ గోలకయో శ్చైవ స్త్రీజితస్య తధైవ చ ||

కర్మారస్య నిషణాదస్య రంగావతరకస్య చ | సువర్ణకర్తు ర్వేనస్య చైల నిర్ణేజకస్య చ ||

మిథ్యా ప్రవ్రజిస్యా 7న్నం తైలికస్య తధైవ చ | తధైవ వృషలస్యాన్నం బ్రాహ్మణనా7 నిమంత్రితమ్‌|

ఏషా మన్యతమస్యా7 న్న మమత్యా త్త్వా త్ర్యహం క్షిపేత్‌ | మత్యా భుక్త్వా చరేత్‌ కృచ్ఛ్రం రేతో విణ్మూత్రమేవచ ||

మహాపాతక యుక్తస్య సూతికస్య తధైవ చ | భుక్త్వా7న్నం చర్మకారస్య మత్యా కృచ్ఛ్రం చరేద్ద్విజః ||

చండాల శ్వపచాన్నంచ భుక్త్వా చాంద్రాయణం చరేత్‌ | అంతశ్చతుర్థి ప్రేతాన్నం గవా ఘ్రాతం తధైవచ ||

శూద్రోచ్ఛిష్టం లఘూచ్ఛిష్టం సూతికాన్నం తధైవచ | తప్తకృచ్ఛ్రంతు కుర్వీత తస్య పాపస్య శాన్తయే || 19

పరశురాముడు - ప్రాయశ్చిత్తము చేసికొననివారికి రాజు దండనము విధింపవలయును గాన ప్రాయశ్చిత్త విధిని తెఱపు మనగా - పుష్కరుండిట్లనియె. ఆబుద్ధి పూర్వకముగ జేసినె పాపమునకు ప్రాశ్చిత్తమును పండితులెఱుంగుదురు. బుద్దిపూర్వకముగ జూసపిన పాపములకు గూడ వేదములంబట్టి ప్రాయశ్చిత్తమున్నదని నాతలంపు. ప్రాయశ్చిత్తములచే,తానుచేసిన పాపముపశమించిను సందేహము లేదు. ప్రాయశ్చితము చేసికొనని వారి పాపము రాజదండనము వలన నుప శమించును- ప్రాయశ్చితము రాజదండనము ఈ రెండు లేక యున్న పాపులు, నరకమును, పశు పక్ష్యాది రూపమునందుదురు. మనుష్యరూపమందినను కుష్ఠమున్నగు రోగా దులచే నంగవైకల్యము కలిగి యుందురు. కావున పాపము పోవుటకు ప్రాయశ్చిత్త మవశ్య కర్తవ్యము, రాజు, కోపి, బాధితుడు వీరలయన్నము నెన్నడు తినరాదు.- అట్లే ఏడ్పించువాడు లేదా (నయిస్థానములో పెరెట్టిపిలుచు) ఆహ్వాయకుని యన్నము బుద్ధి పూర్వకముగ కాలితో తన్నిన యన్నము, మహాపాపునిచే తాకబడిన యన్నము పక్షులు పారిన యన్నము | బూరెల మూకుడుతో వండబడిన వేపుడు పదార్థము ముట్టడి తాకిన యన్నము, సంఘూన్నము, వేశ్యాన్నము, శత్రువల యోక్క అసహ్యాన్నము, దొంగ తీక్షణ స్వభావము గలవాడు, వడ్డీసొత్తచే జీవించువాడు, గాయకుడు, యాగదీక్షలో నున్నవాడు, లోభి, సంకెళ్లలోనున్నవాడు, నిందితుడు, నపుంసకుడు, రంకులాడి, కపటి, వైద్యుడు, వేటకాడు, క్రూరుడ, ఎంగిళ్ళుతినువాడు, వీరి యన్నమును దేవ నివేదితముకాని యన్నము, వృధాగా తన తిండికై వండిన మాంసమా ఆవీర (భక్తిలేనిది) యొక్క అన్నము దాసుని అన్నము, ఉగ్రాన్నము అంధుని యన్నము, లోభి అసత్యవాది, అస్త్రములమ్మువాడు చాకలి, ఘాతకుడు, వీరల యన్నములు తినరాదు. ఎవనియింట తన భార్యయొక్క ఉపపతి యుండునో వాని యన్నము, నటుడు, బట్టలు నేయువాడు, మీలు మఱచినవాడు, తమ్మని వివాహము కాగా వివాహముకాని అన్నగారు, దుష్టుడు, దూర్తుడు, ఖైది, భర్తయుండగా జారునివలన పుట్టినవాడు, భర్తపోగా జారునివలన పుట్టినవాడు, ఆడుదానికి లొంగినవాడు, కమ్మరి, బోయడు, నాటకమున తెరనుదింపువాడు, స్వర్ణకారుడు, నేతగాడు, బట్టలకురంగు వేయువాడు, దొంగసన్యాసి, తెలకులవాడు శూద్రుడు వీరియన్నము తినరాదు. బ్రాహ్మణునిచే నిమంత్రితము (పిలిచి పెట్టని) కానియన్నముతినరాదు- పైన చెప్పబడిన వారి యన్నమును బుద్దిపూర్వము కాకుండ తిన్నయెడల మూడుదినములు పవసింపవలెను. ఎఱింగి తిన్నచో కృచ్ఛ్ర వ్రతముచేయవలెను. రేతస్సు మల మూత్రములు తిన్నవాడు నిట్లే. మహాపాపాత్ముడు అశౌచ గ్రస్తుడు. చర్మ వస్తువులు చేయువాడు వీరి యన్నమును తెలిసి తిన్నయెడల కృచ్ఛ్రవ్రతమాచరించవలెను. చండాలుడు, కుక్క మాంసము తినువాడు వీరరలయన్నము తిన్నచో చాంద్రాయణ వ్రతమాచిరంచవలెను. చనిపోయిన నాలుగు రోజులలోగా ఆ ప్రేతయొక్క యన్నము గోవు మూర్కొనిని యన్నము శూద్రనియొక్కయు నీచుని యొక్కయు అన్నమును ఉచ్ఛిష్టాన్నమును సూతికాన్నమును తినినవాడు పాపము పోవుటకు తప్తకృచ్ఛ్రముచేయవలెను.

భక్త్వాతు బ్రాహ్మణాశౌచే చరేత్‌ సాంతవనం ద్విజః | భుక్త్వాతు క్షత్రియాశౌచే కృచ్ఛ్రం విధీయతే||

వైశ్యాశౌచే తధా భుక్త్వా తప్తకృచ్ఛ్రం సమాచరేత్‌ | శూద్రాశౌచే ద్విజో భుక్త్వా తధా చాంద్రాయణం చరేత్‌ ||

ఆశౌచే యస్యయో భుంక్తే సో ప్యశుద్ధ స్తథా భ##వేత్‌ | తావ ద్యావ దశౌచంతు తస్య రామః ప్రకీర్తితమ్‌ ||

తస్యాశౌచవ్యపగమే ప్రాయశ్చిత్తం సమాచరేత్‌ | భుక్త్వో త్తమస్యచాశౌచే క్షిపేత దివసం తధా ||

మృత పంచనఖాత్‌ కూపా దమేధ్యేన సకృద్యుతాత్‌ | అపః పీత్వా త్ర్యహం తిష్టేత్‌ సోపవాసో ద్విజోత్తమః ||

ద్విదినం క్షత్రియస్తిష్ఠేత్‌ ఏకాహం వైశ్య ఏవ చ | నక్తాశీ చ తధా శూద్రః పంచగవ్యేన శుద్ధ్యతి ||

భుక్త్వా ప్యథ కసాయాంశ్చ పీత్వా మేధ్యాన్యపి ద్విజః | తాప ద్భవత్యప్రయతో యావదన్నం వ్రజత్యధః ||

ప్రాశ్యమూత్ర పురీణషాణి ద్విజ శ్చాంద్రాయణ చరేత్‌ || 27

బ్రాహ్మణుని మైలలో వానియన్నము తిన్న బ్రాహ్మణుడు సాంతపనము క్షత్రియాశౌచాన్నము తిన్నచో కృచ్ఛ్రము, వైశ్యాశౌచాన్నము తిన్నచో తప్త కృచ్ఛ్రము, శూద్రోశౌచాన్నము తిన్నయెడల చాంద్రాయణవ్రతము ఆచరింపవలెను. మైలవాని యన్నము తిన్న్నవాడు వానితో పాటు అశౌచ పర్యంతము మైలపడును. మైలశుద్ధియైన తరువాత ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. ఉత్తమ పురుషుని మైలలో తిన్నవాడు ఒక్కరోజు ఉపవాసము చేయవలయును. వంచనఖములు గల మృగము చచ్చనట్టి యు ఒక్క పర్యాయ మమేధ్యముతో గూడినట్టియు కూపమునుండి నీరు త్రాగిని యెడల బ్రాహ్మణుడు మూడురోజులు పవసింపవలెను. క్షత్రియుడు రెండుకోజులు, వైశ్యుడొక్కరోజు ఉపవసించియు శూద్రుడు నక్త రోజనముచేసియు పంచగవ్య ప్రాశనచె శుద్ధులగుదురు. కషాయములను త్రావినను మేధ్యములు తిన్నను దుష్టాన్నము క్రిందికి (విరోచన రూపమున) పోవువరకు అపరిశుద్ధడే || మూత్రపురీషములను తినినద్విజుడు చాంద్రాయణవ్రతము చేయువలెను.

శుష్కాణి జగ్ధ్కామాంసాని భౌమాని కవకాని చ | అజ్ఞాతం చైవ సూనాస్థం చైతదేవ వ్రతం చరేత్‌ |

క్రవ్యాద సూకరోష్ట్రాణాం గోమాయోః కపి కాకయోః | గో నరాశ్వఖరోష్ట్రాణాం ఖోక్తా పంచ నఖాశ్చయే ||

మాంసం చ కౌంజరం భుక్త్వా తప్త కృచ్ఛ్రేణ శుద్ధ్యతి | గ్రాయ కుక్కుట ఛ త్రాకౌ భుక్త్వా చాంద్రాయణం చరేత్‌ ||

కేశకీటావపన్నే పిపిబే ద్ర్భహ్మ సువర్చలామ్‌ | ఆమశ్రద్దేతధా భుక్త్వా తప్తకృచ్ఛ్రేణ శుద్ధ్యతి ||

సంకల్పితే తధా భుక్త్వా త్రిరాత్రో పోషణం భ##వేత్‌ || ప్రతాచారీ తధా భుక్త్వా మధు మాంసంచ భార్గవః |

లశునం గృంజనల చైవ పలాండుం మద్యమేవ చ | లశునాది సమంయచ్చ గంధేన మనుజోత్తమః || 33

ఎండిన మాంసములను తినియు, పుట్టగొడుగును తినియు పధ్యస్థానాన్నమును తెలయక తినియు పైవ్రతమునే చేయవలెను. క్రూర మృగములు లేక మాంస భక్షకుడు, పంది, ఒంటె పంచనఖ మృగములు, నక్క, కోతి, కాకి, గోవు, నరుడు, అశ్వము గాడిద, ఏనుగు వీని మాంసము తిన్నవాడు తప్తవృచ్ఛ్రముతో శుద్ధుడగును. గ్రామకుమ్కటము (కొడి) పుట్టగొడుగు, వీనిని తిన్న యెడల చాంద్రాయణవ్రత మాచరించవలెను. వెంట్రుకలు, కీటముటచే దూషితమగు నన్నమును, తినిన బ్రహ్మసువర్చల (పొద్దుతిరుగుడు) పూరసము త్రాగవలెను- ఆమశ్రాద్ధములో భుజించినవాడు తప్త కృచ్ఛ్రముచే శుద్ధుడగును. సంకల్ప శ్రాద్దమున మాంసాది కము తినినవాడు మూడురోజులపవసింపవలెను. నియమములపాలించువాడు మధు మాంసముల సేవించిననునట్లే యుపసించవలెను.

భుక్త్వా చాంద్రాయణం కుర్యాత్‌ మాంసం క్రవ్యభుజ స్తధా | లోహితాన్‌ వృక్ష నిర్యాసాన్‌ కుస్థానప్రభవాం స్తధా ||

శేలుం గవ్యం చ పేయుషం శేష్మాతకం మృదమ్‌ | వృధా కృసర సంయావ పాయసా7 పూప శష్కులీః ||

గవాంచ మహిషీణాంచ వర్జయిత్వా తధా7ప్యజామ్‌ | సర్వక్షీరాణి వర్జ్యాని తేషాంచైవా ప్యనిర్దశమ్‌ ||

స్యందనే7 మేధ్య భక్షాయాః వివాత్సాయాశ్చ వర్జయేత్‌ | దధి వర్జ్యం చ శుక్తాని సర్వాణ్యవ వివర్జయేత్‌ ||

శుభైః పుష్పఫలై ః యాని భ##క్తైరభియుతాని చ | విష్కిరాన్‌ జాలపాదాంశ్చ రక్తపాదాం స్తధైవ చ ||

సర్వ శుష్కాంశ్చ చూడాలాన్‌ ప్రతోదాంశ్చ వివర్జయేత్‌ || ? వర్తికో వర్తికా చేతి తత్తిరశ్చ కవింజలః||

భక్ష్యో మయూరశ్చ తథా పక్షిణాం యే వివర్జితాః | శశకః శల్లకో గోధా ఖడ్గః కూర్మ స్తథైవచ ||

భక్ష్యాః పంచనఖాః ప్రోక్తాః పరిశేషాశ్చ వర్జితాః | పారీనాన్‌ రోహితాన్‌ మత్స్యాన్‌ లోహతనుండాశ్చ భక్షయేత్‌ || 42

రాజీవాం శ్చ సశల్కాన్‌ భక్ష్యా నాహుర్మనీషిణః | ఆతో న్యాన్‌ వర్జయే త్సర్వాన్‌ తధావై జలచారిణః ||

ఏతేషాం భక్షణా ద్రామ! త్రిరాత్రం క్షపణం భ##వేత్‌ | చక్రవాకం ప్లవం హంసం టిట్టిభం మద్గుమేవ చ |

కాకోలం చ ళుకం భాసం దాత్యూహం సారికాం తధా | బకశ్యేనబలాకాం శ్చ భుక్త్వా షడ్రాత్రమాచరేత్‌ ||

ఉపవాస స్తథా కార్యః సునా మాంసాశ##నే భ##వేత్‌ | అజా7వికా నురోహాం శ్చ పృషతాన్‌ మాహిషాం స్తధా |

రంకుస్యంకూం స్తధైణాంశ్చ గవయాం శ్చైవ భక్షయేత్‌ | భక్త్వా మాసం తతో7 న్యస్య త్ర్యహం తిష్ఠే ద్బుభుక్షిత ||

యవగోధూమజం సర్వం పయసశ్చైవ క్రియాః | రాగషాడబ చుక్రాదీన్‌ సస్నేహం యచ్చ కించ న ||

ఏత ద్వినా పర్యుషితం భుత్‌వా చోపవసే ద్దినమ్‌ | మద్యభాండగతా మోహాత్‌ పీత్వా వాసో ద్విజోత్తమః ||

శంఖ పుష్పాశ్రితం క్షీరం పిబేత్తు దివసత్రయమ్‌ | సురాభాండగతాః పీత్వా సప్తరాత్రం తథా పిబేత్‌ ||

శూద్రోచ్ఛిష్టా స్తధా పీత్వా పంచరాత్రం తధా పిబేత్‌ | స్వప్నేనసిక్త్వా బ్రహ్మచారీ ద్విజ శ్శుక్ర మకామతః ||

స్నాత్వా7ర్క మర్చయిత్యాత్రిః పునర్మా మితృ చం జపేత్‌ | అగ్నిహోత్రాపవిద్ధాగ్ని ర్బ్రాహ్మణః కామచారతః ||

చాంద్రాయణం చరే న్మాసం వీర మప్యాసనం హితమ్‌ | బ్రహ్మహత్యా సురాపానం స్తేయం గుర్వంగనా గమః ||

మహాన్తి పాతకా న్యాహుః సంయోగశ్చైవ తైస్సహ | అనృతం చ సముత్కర్షే రాజగామి చ పైశునమ్‌ || 53

గురో శ్చాలీకనిర్భంధః సమాని బ్రహ్మహత్యయా | బ్రహ్మోజ్ఘతా వేదనిందా కౌటసాక్ష్యం సుహృ ద్వదః ||

వర్జితాన్నధ్యయే ర్జగ్ధిః సరాపసాన సమాని షట్‌ | నిక్షేపస్యా పహరణం నరా శ్వ రజతస్యచ ||

భూమివజ్రమణీనాం చ రుక్మస్తేయసమం స్మ్రతమ్‌ | రేతస్సేక స్త్వయోనీషు కుమారీ ష్వన్తన్యజాసను చ||

సఖ్యుః పుత్రస్య చ స్త్రీసు గురుతల్పసమం విదుః | గోవధో యాజ్యసంయాజ్యపారదార్యాత్మవిక్రయః ||

గురుమాతృపితృ త్యాగః స్వాధ్యాయాగ్న్యో స్సుతస్య చ | పరివర్తితానుజేన పరిదేవన మేవ చ ||

తయోర్మానం చ కన్యాయా స్తయోరేవచ యాజనమ్‌ | కన్యాయా దూషణం చైవ వార్ధుష్యం వ్రతలోపనమ్‌ ||

తడాగారామదారాణా మపత్యస్య చ విక్రయః | వ్రాత్యతా బాంధవత్యాగో భృతా ధ్యాపన మేవ చ || 60

వెల్లుల్లి, నీరుల్లి, గృంజనము = విషము పూసిన ఆయుధముచే చంపబడినదాని మాంసం, మద్యము, లశునాదులవలెన వాసన గలమరి యేదైన మాంసము మాంస భక్షకుని మాంసము, వీనిని తిని చాంద్రాయణము చేయవలెను. ఎఱ్ఱని చెట్ల బంకలను చెడ్డ తావులందు బయలుదేరిన వానిని విరిగెను( నక్కెర) ఆవుజున్ను, విషము శ్లేష్మాతకము, మట్టి, నిమత్తములేనిపులగము, పారుపత్తులు, పరమాన్నము, అపూపములు, చక్కిలములు, ఆవులు, గేదెలు, మేకలుతప్ప మఱి యేపాలైనను వర్జ్యములే. అమేధ్యమును తినునావు యొక్కయు, దూడలేనిదని యొక్కయు, పాలు పెరుగు పనికిరావు. కడుగునీళ్లు శుభములైన పుష్పఫలములతోను, అన్నముతోను కూడి యున్నవి విడువదగినవి. పక్షులలో జాలపాదములు(బాతులు) ఎఱ్ఱని పాదమలు గలవి పూర్తిగ నెండిపోయినవి శిఖలగలవి ప్రతోదములు విడువదగినవి. వర్తికము మీలదొంగ= వర్తిక= ఆడమీల దొంగ తిత్తిరి పక్షి కపింజల (కాజు) పక్షి నెమిలియు దినదగినవి కుందేలు, శల్లకము(ఏదుపంది) ఖడ్గమృగము, తాబేలు, ఉడుము ఈఐదు పంచనఖములు గల వానిలో తినదగినవి. ఇతరమలుగు పంచనఖ, జంతువుల నిషిద్ధములు. పాఠీనములు =కొఱ్ఱ మీనులు (బేడిసలు) రోహితములు = ఎఱ్ఱ చేపలు, లోహ తుండములగలచేపలు, వీనిని తినవచ్చును- రాజీవములు (ఒకానొక చేపలు) పొలుసుతోనున్న చేపలు, సొరచేపలు, ఇవి భక్షింపదగినవని విద్వాంసులు చెప్పుదురు. మఱియితర జలచరములదినదారు, తినిన యెడల తిరాత్రోపవాసము చేయనగును. చక్రవాకము, కప్ప, హంస టిట్టిభము (లకుమకిపిట్ట ) మద్గువు (నీరుకాకి) బొంతకాకి, చిలుక, గ్రద్ద, దాత్యూహము గుండగిపక్షి, గోరువంక కొంగ డేగ బెగ్గురులం, దిని యాఱు రాత్రులుపవసింపలెను. దాన మాంసాశన పాపము పోవును. మేక గొఱ్ఱ అనురోహమలు దుప్పి దున్నపోతు జింక, ఇఱ్ఱి పెద్దకన్నులు గల యిఱ్ఱి, గవయము (అడవియాపు) తినవచ్చును. ఇవిగాక మరియితర జంతువుల మాంసములలు తిని మూడుదినములు పవసింపవలెను. యవలు గోధుమలతో జేసినది, క్షీరముతో జేసినది, మధురాది రసములు పులుసు మున్నగునవి నూనెతో గూడినవి గాక మఱియితర పర్యుషిత (చలిది ) ములు తిన్నను నొకదినముపవసింపవలెను. తిలియక ఆసవలపుకుండలోనున్న నీరుద్రావిన ద్విజోత్తముడు శంఖుపుష్ప (శుక్లకంద) మిశ్రతమైన పాలను మూడురోజులు త్రాగవలెను. కల్లుకుందలోని నీరుత్రావినవా దేడురోజులు పైపాలను త్రాగవలెను. శూద్రుని యెంగిలినీరు త్రాగిన వాడైదురోజులట్లు చేయవలెను. స్వప్నమునందు తెలియక రేతస్సును విడిచిన బ్రాహ్మణ బ్రహ్మచారి, స్నానముచేసి సూర్యుని పూజించి ''పనర్మాం'' అనుబుక్కును ముమ్మారు జపింపవలెను. బుద్ధిపూర్వకముగ ధార్యాగ్నిని పోగొట్టుకొనినవాడు చాంద్రాయణ వ్రతమును ఒకనెల చేయవలెను. వీరాసనము (దీనిని అనుకొనక కూర్చుండుట) నందుం వలెను. బ్రాహ్మణుని చంపుట, కల్లుత్రాగుట, దొంగతనము, గురస్త్రీని కలియుట, మహాపాపములుగ చెప్పబడినవి అట్టి పాపులతో సంబంధముకూడ మహాపాపమే. పెద్దలయెడ నసత్యము పలుకుట రాజునకు కొండెములు చెప్పుట, గురువును, మోసగించి నిర్బంధించుట బ్రహ్మహత్యతో సమానములగు పాతకములు. వేదమును విడచుట లేక బ్రాహ్మణాతీక్రమము, వేదముల నిందించుట, అబద్దపు సాక్ష్యము, మిత్రుని చంపుట, నిషిద్ధాన్నము లేక అనివేదితా న్నమును, తినుట యీయాఱును సురాపాన సమానములు, దాచనిచ్చని సొత్తును నరులు, గుఱ్ఱములు, వెండి, భూమి వజ్రములు మణులు మున్నగువానిని హరించుట సనువర్ణస్తేయ సమానమని చెప్పబడినది. అయోను(పరస్త్రీల లందు, పెండ్లికాని పిల్లలందు, అంత్యజాతులందు మిత్రుడు, కోడండ్ర యందు రేతస్సు నుంచుట గురుస్త్రీగమనసమానము. గోవధ యాగార్హత లేనివానిచే యాగముచేయించుట పరభార్యసంబంధము, తానమ్ముడు పోవుట, గురువు తల్లి తండ్రులను వేదమును అగ్నిహోత్రములను కుమారుని విడిచివేయట, తమ్ము నేడిపించుట, వారిద్ధఱ నగౌర వించుట, వారిద్ధఱికి యాగముచే, యించట కన్యను, దూషించుట, వడ్డీతో బ్రతుకుట వ్రతలోపముచేయుట. తడాగములు, తోటలు, భార్యను సంతానమున అమ్ముకొనుట ఉపనయనాది సంస్కారహీనత, బాంధవులను పరిత్యజించుట, వేదమును వేపనము తీసికొని చెప్పుట,

భృతా దధ్యయ నాదాన మవిక్రేయస్య విక్రయమ్‌ | సర్వాకరే ష్వధీకౌరో మహాయస్త్రప్రవర్తనమ్‌ ||

హింస్రౌషధిస్త్రీయాజీవ క్రియా యాచన కర్మ చ | ఇంధనార్థ మశుష్కాణాం ద్రుమాణాం చైవ పాతనమ్‌ ||

ఆత్మార్థం చ క్రియారంభో నిందితాన్నదనం తథా| అనాహితాగ్నితా స్తేయ మగమ్యా స్త్రీ నిషేవణమ్‌ ||

స్త్రీ శూద్రవిట్‌ క్షత్రివధో నాస్తిక్యం చోవ పాతకమ్‌| బ్రాహ్మణస్య రుజాకృత్యం ఘ్రాతి రఘ్రేయమద్యయోః ||

జైహ్మం చ పుంసి మైథున్యం జాతిభ్రంశకరం స్మృతమ్‌ | శ్వఖరోష్ట్ర మృగేభానా మజావ్యో శ్చెవ మారణమ్‌ ||

సంకీర్ణకరణం జ్ఞేయం మీనా7 హి నకులస్య చ | నిందితేభ్యో ధానాదానం వాణిజ్యం శూద్రసేవనమ్‌ ||

అపాత్రీకరణం జ్ఞేయ మసత్యస్య చ భాషణమ్‌ | కృమికీటవయోహత్యా మన్యానుగతభోజనమ్‌ ||

ఫలైధః కుసుమస్తేయ మధైర్యం చపలాత్మతా | ఏతా న్యేనాంపి సర్వాణి యధోక్తాని పృధక్‌ పృధక్‌ ||

యైర్యై ర్వ్రతై రసోహేత తాని తమ్యజ్‌ నిబోధత| బ్రహ్మహో ద్వాదశాబ్దాని కుటిం కృత్వా వనే వనసేత్‌ ||

భిక్షేతా7థ విశుద్ధ్యర్థ ముపాసీనో వృషధ్వజమ్‌ | 69

వేతనము గొనువానినుండి వేదమును స్వీకరించుట, అమ్మగూడని వస్తువలనమ్ముట, సర్వవిధములగు గనుల మీద నధికారము మహాయంత్రముల నడుపుట, హింసాకరములయిన మూలికలతోను స్త్రీలతోను జీవనము చేయిట, అడుగు కొనుట కట్టెలకై పచ్చి చెట్లను పడగొట్టుట, కేవలము తన పోట్టకై పనియారంభించుట, నిందితాన్నముతినుట, అగ్న్యాధానము చేయకుండుట,దొంగతనము, చేరదగని స్త్రీని చేరుట, స్త్రీ శూద్రవైశ్య క్షత్రియులను చంపుట, నాస్తిక్యము, ఉపపాతకము, బ్రాహ్మణునికి బాధ కల్గించుట, వాసన చూడదగని దానిని కల్లును మూర్కొనుట, కుటిలముగ ప్రవర్తించుట, పురుషునియందు మైధునము చేయుట, జాతి భ్రంశకర పాతకములు కుక్క గాడిద, ఒంటె, లేడి, ఏనుగు మేక, గొఱ్ఱలను చంపుట , చేపలను, పాములను, ముంగిసలను చంపుట సంకీర్ణ కర మహాపాతకములు. నిందితులనుండి ధనము గొనుట, వర్తకముచేయుట, శూద్రసేవ, అసత్యమాడుట, కృములను కీటములను పక్షులను చంపుట, ఇతరులతో కలసితినుట, పండ్లు, సమిధలు, పువ్వులను దొంగలించుట అధైర్యము చాపల్యము ఇవి అపాత్రీకరణ పాపమలు, ఇవి యెట్లువేర్వేరనేయే వ్రతములచే బోవునో తెల్పెద బాగుగ నెఱింగికొనుడు. బ్రహ్మ హత్య చేసినవాడు అడవికేగి కుటీరము కల్పించుకొని పండ్రెండేండ్లు నివసించవలెను. శివుని పాసించుచు విశుద్ది నిమిత్తమై బిచ్చమెత్తవలెను.

లక్షం శస్త్రభ్భతాం వాస్యా ద్విద్విషామిచ్ఛయా త్మనః || 70

ప్రాశ్యే దాత్మాన మగ్నౌవా సమిద్ధేత్రిరవాక్ఛిరాః | యజేత వా శ్వమేజధేన స్వర్జితాగోసవేనచ ||

అభిజి ద్విశ్వ జిద్ఖ్యాం వా త్రివృతాగ్నిష్టుతా పివా | జపన్వా న్యతమం వేదం యోజనానాం శతం ప్రజేత్‌ ||

బ్రహ్మహత్యా పనుత్త్యర్థం మితభుజ్‌ నియతేంద్రియః | సర్వస్వం వా వేదవిదే బ్రాహ్మణా యోపపాదయేత్‌ ||

ధనం వా జీవనాయా7లం గృహం వా సపరిచ్ఛదమ్‌ | వ్రతై రేతై రపోహేత మహాపాతకితాన్‌ ద్విజ ః ||

ఉపపాతక సంయుక్తో గోఘ్నో మాసంయ వానదేత్‌ | కృత పాపోథ నివసే చ్చర్మణాతేన సంవృతః

చతుర్థకాల మశ్నీయాద క్షరాలవణం మితమ్‌ | గో మూత్రేణా చరేత్‌ స్నానం ద్వౌమాసౌ నియతేంధ్రియః ||

దివానుగచ్ఛే త్తాగాశ్చ తిష్ఠన్నూర్థ్వ మపః పిబేత్‌ | శుశ్రూషిత్వా నమస్కృత్య రాత్రొ వీరాసనం చరేత్‌ ||

తిష్ఠం తీష్వను తిష్ఠేత్తు వ్రజంతీ ష్వప్యను వ్రజేత్‌ | ఆసీనాసు తథాసీనో నియతో వీత మత్సరః |

ఆతురా మభిషిక్తాం చ చౌర వ్యాఘ్రాదిభిర్భయైః | పతితాం పంకలీనాం వా సర్వప్రాణౖ ద్విమోక్షయేత్‌ ||

ఉష్ణైర్వర్షాతి శీతైర్వా మారుతే వాతి వా భృశమ్‌ | న కుర్వీ తాత్మన స్త్రాణం గోర

కృత్వా తు శక్తితః || 80

తనంతతాను ఆయుధదారులకుగాని శత్రువులకుగాని గురికవాలయును. లేదా మండుచున్న యగ్నిలో తలవంచుకొని ముమ్మారు శరీర మర్పింపవలెను.అశ్వమేధయాగముగాని, స్వర్గజిద్యాగముగాని గోమేధముగాని చేయవలెను. అభిజిత్‌, విశ్వజిత్‌, త్రివృత్‌, అగ్నిష్ణు ద్యాగములను గాని చేయవలెను. ఏదోయొక వేదమంత్రములను జపించుచు శతయోజనములు పోవలెను. బ్రహ్మహత్యాపాపము తొలగుటకై మిత భోజియై జితేంద్రియుడై పైపనులుచేయవలెను.

లేక వేదవేత్తయగు బ్రాహ్మణునకు సర్వస్వ సమర్పణము చేయవలయును. జీవనమునకు చాలిన ధనమునుగాని సపరికరమైన గృహమునుగాని దానమీయవలెను.ఈ వ్రతములచే మహాపాపములను పోగొట్టుకొనవలెను. ఉపపాతకయుక్తుడు గోహత్యచేసపినవాడును ఒక్క నెలరోజులు యవలను తినవలెను. పాపము చేసపినవాడు గోచర్మను కప్పుకొనవలెను. ఉప్పుకారములను మాని మితముగ చతుర్థకాలమున (అపరాహ్ణము)న భుజించవలెను. రెండుమాసములు ఇంద్రియములను నిగ్రహించి గోమూత్రముతో స్నానముచేయవలెను. పటగివేళ నిలబడియే గోవుల ననుసరించి తరువాత నీరు త్రాగవలెను. రాత్రి గోసేవచేసి నమస్కరించి వీరాసమనమున (ఆనుకొనకుండ కూర్చుండట) నుండవలెను. గోవులునడచిన, నడచుట కూర్చుండిన కూర్చుండుట నిలబడిని నిలబడుట పరుండిన పరుండుట నియముమాని, మాత్సర్యము మాని చేయవలెను. ఆవు బాధలో నున్నపుడు నీటిలోనున్నపుడు చోరవ్యాఘ్రాది భయగ్రస్తమైనపుడు బురదలో పడినప్పుడును తన సర్వప్రాణములతో దానిని రక్షించవలెను. వేడి చలి గాలితీవ్రముగ నున్నపుడు తనశక్తి గొలది గోరక్షణము చేయకుండ ఆత్మ రక్షణము చేసికొనరాదు.

ఆత్మనో యది వా7న్యేషాం గృహే క్షేత్రే7ధవా ఖలే | ? ఖాదమానాం నశంసేత పిబంతం చైవ వత్సకమ్‌ || 81

వృషబైకాదశా గాస్తు దద్యాద్ధిచరితవ్రతః | అవిద్యమానే సర్వస్వం వేదవిద్య్యో నివేదయేత్‌ ||

బంధనే రోధనే వాపి యోజనే చ గవాం రుజా| భ##వేద్వా మరణం యత్ర నిమిత్తే తత్ర లిప్యతే ||

పాదమేకం చరే ద్గోష్ఠే ద్వౌ పాదౌ బంధనే చరేత్‌ | యోజనే పాదహీనం స్యా చ్చరే త్సర్వం నిపాతనే ||

కాన్తరే7 ప్యథ దుర్గేషు విషమేషు గుహాసు చ | యది తత్ర విపత్తిస్స్యా దేకః పాదో విధీయతే ||

బాధా మరణ దోషేషు తధైవార్థం వినిర్దిశేత్‌ | దమనే వాహనే రోధే శకటస్య చ యోక్త్రణ ||

నద్యాం సకల పాశేషు మృతౌ పాదౌ సమాచరేత్‌ | వ్యాపన్నానాం బహూనాం తు బంధనే రోధనే పివా |

భిషజ్‌ మిధ్యాచరం శ్చేహ ద్విగుణం గోవ్రతం చరేత్‌ | శృంగభంగే7 స్ధిభంగే వా లాంగూలాభేదనే పివా ||

యావకంతు పిబే త్తావత్‌ యావత్‌ స్వస్థా తు గౌర్భవేత్‌ | ఏకా చేద్భహుభివర్దైవా ద్యత్ర వ్యాపాదితా భ##వేత్‌ ||

పాదం పాదం తు హత్యాయాం చరేయు స్తే పృథక్‌ పృథక్‌ | యంత్రేణ గో శ్చికిత్సర్థే మూఢగర్భవియోక్షణ || 90

యది తత్ర విపత్తి స్స్యా ద్దోష స్తత్ర న విద్యతే |

తన యొక్క యితరులయొక్క గృహమందు పొలమందు ఖలేకళ్లమందు మేయుచుండు గోవును తోలరాదు. పాలుగడుచుచున్న దూడను గొట్టరాదు. అట్ట సేసెనేని ఎద్దుతో గూడ మరిపదిగోవులను ప్రతాచరదక్షిణగా నీయవలెను. అదిలేనిచో వేదవిదులకు తనసర్వస్వమును నివేదింపవలెను. బందమునందు కట్టివేసినపుడు కట్టురాటకు గొనిపోవునపుడు గోవున కేమైన బాధగాని మరణముగాని సంభవించినచో దానివవలన పాపస్పర్శ కలుగును. ఆబాధ గోశాలలో గల్గినచో నాల్గవంతు బందమందైనో సగము బండిమొదలయిన వానిని పూన్చుటలో నైనచో ముప్పాతిక వంతు ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. ఒకవేళ నాగోవుపడిపోయినచో పూర్తి ప్రాయశ్చిత్తము చేపసికోవలనెను. అడవులందు విషమస్థలములందు దుర్గములందు గుహలలో నావునకు చావు గల్గిచో నాల్గవవంతు ప్రాయిశ్చిత్తమున విహితము. బాధలు మరణము మొదలగు దోషణములందు సగము మనముందు= కొట్టుటలో వాహనమునకు కట్టునపుడు బండిని పూచ్చ నపుడు నదియందు శకటములందు పలుపుబిగింపులోనునైనచో సగముప్రాయశ్చిత్తము , బంధించినపుడు - నిరోధించిన పుడు చాలా గోవులు మరణములకు గురుయైనపుడు, వైద్యుడుతప్పువైద్యముచేసినపుడు రెట్టింపపు గోవ్రతము సేయవలెను. కొమ్ములు ఎముకల నరికినపుడు తోకను చేదించినపుడు గోవులుస్వస్థత చెందుదాక యవలజావ త్రాగింయుండవలెను, ఒక్క గోవు పెక్కురచేత దైవికముగా జంపబడునేని వేర్వేర సయ్యందరు నాల్గవంతున ప్రాయిశ్చిత్తము చేసికొనవలసియుందురు. గోవుయొక్క మూఢ గర్భమును బలవంతముగా శస్త్రముమూలమున దిగుచునపుడు గోవు చనిపోయినయొడల నక్కడ నెవ్వనికి దోషముంగలుగదు.

ఔషధం స్నేహ మాహారం దద్యాచ్చ బ్రాహ్మణాదిషు || 91

దీయమానే విపత్తి స్స్యాత్‌ దాతు ర్దోషో న విద్యతే | ఏతదేవ వ్రతం కుర్యు రుపపాతికిన స్తథా ||

అపకీర్ణీ విశుద్ధ్యర్థం చాంద్రాయణ మథాపి వా| అవకీర్ణీ తు కాలేన సప్తమేచ చతుష్పథే ||

పాకయజ్ఞవిధానేన యజతే నిభృతం నిశి | హుత్వాగ్నౌ విధివ ద్ధోమాం స్తతస్తు సమితి త్యృచమ్‌ ||

వాతేంద్రగురువహ్నీనాంమ జుహుయా త్సర్పిషాహుతీః | కామతో రేతస స్సేకః వ్రతస్ధస్య ద్విజన్మనః ||

అక్రమంచ వ్రతస్యాహు ర్ధర్మజ్ఞాః సత్యవాదినః | ఏతస్మి న్నేవ సిద్ధార్థే వసిత్వా గర్థభాజినమ్‌ ||

సప్తాగారం చరే ద్భైక్ష్యం స్వకర్మ పరిదేవయన్‌ | తేఖ్యో లబ్ధేన భై క్ష్యేణ వర్తయ న్నేవ కాలికమ్‌ ||

ఉపస్పృశన్‌ త్రిషవణం అబ్ధేన స విశుద్ధ్యతి || హత్వా గర్భ మవిజ్ఞాతం బ్రహ్మహత్యా వ్రతం చరేత్‌ ||

రాజన్య వైశ్యౌ చేజానా వాత్రేయీ మేవ చ స్త్రియమ్‌ | ఉక్త్వా చైవానృతం సాక్ష్యే ప్రతిపద్య గురూం స్తథా ||

అపహృత్యచ నిక్షేపం కృత్వా చ స్త్రీసుహృద్వథమ్‌ | సురాం పీత్వా ద్విజో మోహాదగ్ని వర్ణాం సరాం పిబేత్‌ || 104

ఔషధము స్నేహము = నూనె ఆహారమును బ్రాహ్మణాదులకిచ్చినపుడు వారికేదేని విపత్తి గలిగినయెడల యిచ్చిన వానికి పాపముగల్గదు. ఉపాతకులుగూడ యిదేవ్రతము సేయనగదురు. అపకీర్ణి వ్రతభ్రష్ఠుడైనవాడు శుద్ధుడగుటకు చాంద్రాయణము సేయవలెను. అపకీర్ణదోషముగలవాడు సప్తమకాలముతో రాత్రి నాల్గు దారులు గలిసినచోట. పాకయజ్ఞవిధాన ముగా నిభృతముగా (నిండుగా) యగ్ని యందు యథావిధిగ హోమముచేసి సమితి త్రుచముతో (సమ్మని ప్రారంభించు మంత్రముతో) వాయువు ఇంద్రుడు బృహస్పతి అగ్ని యనుదేవతల నుద్దేశించి ఆజ్యాహుతుల నీయవలెను. వ్రతనస్థుడగు ద్విజునికి కామప్రవృత్తితో రేతస్సు స్షలనమయినచో నది ప్రతాక్రమణదోషమని దర్మజ్ఞలు సత్యనిరతులందురు. ఈ పరస్ధితి యేర్పడినపుడు గాడిదతోలు కట్టుకొని తన కర్మవిధిని (తన దోషమును) అందఱకు వెల్లడించుకొనుచు నేడిండ్లు బిక్షాటన మాచరించవలెను. దాన వచ్చినదానితోనే కాలము గడుపవలెను. త్రిషణవణస్నానముచేయుచు నొకసంవత్సరమున పరిశుధ్దుడగును. తెలియక గర్భమును చంపినవాడు బ్రహ్మహత్యకు చేయతగిన వ్రతమాచరించవలెను. యాగము చేయుచున్న క్షత్రియవైశ్యులు, ఆత్రేయి(పుష్పవతి) ని జంపిన వాడును గూడ పైన చెప్పిన వ్రతమునేచేయవలెను. మోహముచేత సాక్ష్యమునందు అసత్యమాడినను, గురువుతో ప్రతివాదము చేసినను, ఇల్లడబెట్టిన సొత్తునపహరించినను, స్త్రీని మిత్రుని చంపినను, కల్లుత్రాగినను నిప్పురంగులోనున్న కల్లును త్రాగవలెను.

తయాస కాయే నర్దగ్ధే ముచ్చతే కిల్బిషాత్తతః| గోమూత్ర మగ్నివర్ణాం వా పిబే దుదక మెవ వా|| 101

వయో ఘృతం వాయ రణాద్గో శకీద్రసమేవ వా | కణా న్వా భక్షయే దబ్దం పిణ్యాకం వా సకృన్నిశి ||

సురాపానాపనుత్త్యర్థం చీరవాసాః జటీ ధ్వజీ | సురావై మల మన్నానాం పాప్మా చ మల ముచ్యతే ||

తస్మాద్ర్బాహ్మణ రాజన్యౌ వైశ్య శ్చ నసురాం పిబేత్‌ | గౌడీ పైష్టీ చ మాధ్వీ చ విజ్ఞేయా త్రివిధా సురా ||

యథైవైకా తథా సర్వా న పాతవ్యా ద్విజోత్తమైః || యక్షరక్షః పిశాచానాం మద్యం మాంసం సురాశననమ్‌ ||

తద్ర్భాహ్మ ణన నాత్తవ్యం దేవానా మశ్నతా హవిః | మాధ్వీక మైక్షవం టాంకం తాలం ఖార్జరపానసమ్‌ ||

మృద్వీకారస మాద్ధ్వీకే మైరేయం నారికేలజమ్‌ | అసేవ్యాని దశైతాని మద్యాని బ్రాహ్మణస్య చ ||

యస్య కామగతం బ్రహ్మ మద్యే నాప్లావ్యతే సకృత్‌ | తస్య వ్యపైతి బ్రాహ్మణ్యం శూద్రత్వం చ స గచ్ఛతి ||

దానిచే శరీరముతో గూడ దగ్ధుడైనచో నాపనాపమునుండి ముక్తుడగును. అగ్నివర్ణముగల గోమూత్రమును గాని నీరునుగాని త్రాగవలెను. లేక మరణపర్యంతము పాలనుగాని నేతినిగాని ఆవుపేడరసమునుగాని కణముల (నూకల) ను గాని తెలకపిండినిగాని రాత్రి ఒక పర్యాయము సంవత్సరకాలము భక్షించవలెను, సురాపానపాపము పోవుటకు నారచీరలు జడలను, ధ్యజమును= కల్లు కుండగుర్తు దాల్పవలెను. కల్లు అన్నమలము. పాపముకూడ మలమే అందువలన బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడును కల్లు త్రాగురాదు. కల్లు (సుర) గౌడి = గుడముతో లేక ఆరెపు వ్వ్వుతో చేయునది, పైష్టి = పిష్టము (పిండితో) చేయునది మాధ్వి= తేనెతో చేయు బడినిది అనిమూడు విధములు. ఈమూడు ను నిషిద్ధములే. ద్విజశ్రేష్టులు త్రాగరాదు. యక్షరాక్షసపిశాచముల కాహారము మద్యము మాంసము సుర అనునవి. అందువలన దేవతల హవిస్సు నారగించు బ్రహ్మణుడు పైవాని నారగించరాదు. ఇప్పసారాయి, చెరుకుసారా టాకం= నల్లవెలగపండుతో చేసినమధ్యము, తాలము తాటికల్లు, ఖర్జూరపుకల్లు, పనసకల్లు, గోస్తనీరసము మాథ్యీకము (ఇప్పసారా) మైరేయము =మిరి అనుదిను సుతో చేసిన మద్యము కొబ్బరికల్లు ననునీదశవిధములై నమద్యములు బ్రాహ్మణుడు త్రాగరాదు. ఏ బ్రాహ్మణుని వేదము ఇచ్ఛాపూర్వకముగా నొక్క పర్యాయమైన మధ్యముచే నాప్లావితమగునో, వానికి బ్రాహ్మణ్యము నశించి శూద్రత్వముగలుగును.

అత ఊర్థ్వం ప్రవక్ష్యామి సువర్ణస్తేయనిర్ణయమ్‌ | సువర్ణస్తేయకృ ద్విప్రో రాజాన మభిశస్య తు || 110

స్వకర్మ ఖ్యాపయన్‌ బ్రూయాత్‌ మా భవానపి శాస్త్వితి || గృహీత్వా ముసలం రాజా సకృద్ధ్యన్యాత్తు తం స్వయమ్‌ ||

వధేన శుధ్యతే స్తేనో బ్రాహ్మణ స్తపసైవ వా | తపసా త్వపనుత్యంతు సువర్ణ స్తేయజం మలమ్‌ ||

చీరవాసనా ద్విజో రణ్య చరే ద్బ్రహ్మణో వ్రతమ్‌ | గురుతల్పో೭೭ భిభాషై#్యనః తల్పే స్వప్య్సా దయోమయే || 111

సుర్మీం జ్వలన్తీ మాశ్లిష్య మృత్యునా తు విశుద్యతి | స్వయం వా శిశ్నవృషణా వుత్కృత్యాధాయ స్వాంజలౌ ||

నైరృతీం దిశ మాతిష్టే దానిపాత మజిహ్మగః | ఖట్వాంగీ చీరవాసా వా శ్మశ్రులో విజనే వనే ||

ప్రాజాపత్యం చరేత్‌ కృచ్ఛ్రం త్వబ్ద మేకం సమాహితః | చాంద్రాయణం తు త్రీన్‌ మాసనానభ్యసే న్నియతేంద్రియః ||

హవిష్యేణ యవాగ్వా చ గురుతల్పాపనుత్తయే | జాతిభ్రంశ కరం కర్మ కృత్వా న్యతర మిచ్ఛయా ||

చరే త్సాంతపనం కృచ్ఛ్రం ప్రాజాపత్య మనిచ్ఛాయా | సంకరాయా త కృతేషు స్యాత్‌ సంశోధన మైందనవమ్‌ ||

మలినీకరణీయేషు తప్తః స్యా ద్యావకం త్ర్యహమ్‌ | తరీయం బ్రహ్య హత్యాయాః క్షత్రియస్య వధే స్మృతమ్‌

వైశ్యే ష్టమోంశో హ్యన్యత్ర శూద్రే జ్ఞేయస్తు షోడశ || అకామతస్తు రాజన్యం వినిపాత్య ద్విజోత్తమః ||

వృషభై కసహస్రంగా ః దద్యాచ్చుద్ధ్యర్థ మాత్మనః | త్ర్యబ్దం చరేద్వా నియతో జటి బ్రహ్మహణో వ్రతమ్‌ ||

వసే ద్దూరతరే గ్రమాత్‌ వృక్షమూలనికేతనః | ఏత దేవాచరే దబ్ధం ప్రాయశ్చిత్తం ద్విజోత్తమః || 120

ఇక సువర్ణస్తేయ నిర్ణయముంగురించి చెప్పెదను, సువర్ణము దొంగలించివనపుడు రాజును చేరితన పాపవృత్యము నెఱింగించి తనను మీరే శిక్షింతురుకాక యని పలుకవలెను. రాజు స్వయముగ రోకలిగొని యోక్క పర్యాయుము వానిని గొట్టవలయును. దొంగ దానిచే శుద్ధుడగును. బ్రాహ్మణుడు తపస్సు చేత శుద్ధుడగును. తసన్సుచే సువర్ణస్తేయమలమును పోగొట్టుకొన దలచిన బ్రాహ్మణుడు అరణ్యమున నారచీరలధరించి బ్రహ్మహత్య చేసినవాడు చేయవలసిని వ్రతమును చేయవలెను-గురు భార్యను గూడినవాడు సూర్మిం= లోహప్రతిమను కౌగలించుకొని చనిపోయిన శుద్ధుడగును. లేదా తనకు తాను శిశ్న వృషణమును కోసికొని దోసిట నుంచుకొని నైరృతిదిక్కుగా సూటిగ పడిపోవు నంతవరకు పోవలెను. లేదా ఖట్వాంగము (మంచపుకోడు ) పట్టుకొని నారచీరలు కట్టుకొని గడ్డము పెంచుకొని సావధానచిత్తుడై విజనారణ్యమున నొక్క సనంవత్సర ప్రాజపత్యకృచ్ఛ్రవ్రతమును మూడునెలలు చాంద్రాయణ వ్రతము చేయవలెను. గురుతల్పగ దోషశాన్తి కై హవిష్యాన్నము గంజినిగావి తీసికొనవలెను.

జాతిభంశకరమగు కర్మ మేదైన బుద్దిపూర్వకముగ జేసినవాడు సొంతపనకృచ్ఛ్రవ్రతమును, ఆబుద్ధిపూర్వకముగ జేసిన వాడు ప్రాజాపత్యకృచ్ఛ్రమాచరించవలెను. సాంకర్యమందు ఐందవం= చాంద్రాయణవ్రతము పాపశోధకము, మలినీకరణ వృత్యములు చేసినవాడు పశ్చాత్తప్తుడై యవల యన్నము ను మూడురోజులు తినవలెను. క్షత్రియవధలో , బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తములు నాల్గవంతు, వైశ్యవధలో నెనిమిదవవంతు, శూద్రవధలో పదునాఱవవంతు ప్రాయశ్చిత్తము. ఆబుద్ధిపూర్వక ముగ క్షత్రియుని చంపిన బ్రాహ్మణోత్తముడు ఒక వృషభమును వేయి గోవులను దానము చేయవలెను. లేదా మూడు సంవత్సరములు నియమవంతుడై జటాధారియైబ్రహ్మహత్యాపాపామునకు చేయవలసిన వ్రతము నాచరించవలెను. గ్రామమునకు దూరముగ నుండి చెట్టు మొదట నివసించుచు నీ ప్రాయశ్చిత్తమును నాంక సవత్సర మాచరించవలెను.

ప్రమాప్య వైశ్యం వృత్తస్థం దద్యా చ్చైకశతం గవామ్‌ | ఏతదేవ వ్రతం కృత్స్నం షణ్మాసాన్‌ శూద్రహా చరేత్‌ || 121

వృషభైకాదశా వాపి దద్యా ద్ద్విప్రాయ గా స్సితాః మార్జారనకులాక్‌ హత్యా చాషం మండూక మేవ వా||

శ్వగోధోలూక కాకాంశ్చ శూద్రహత్యా వ్రతం చేరేత్‌ | పయః పిబే త్త్రిరాత్రం వాయోజనం వా ధ్వినో వ్రజేత్‌ ||

ఉపస్పృశేత్‌ స్రవంత్యాంవా సూక్తం వా త్రివృతం జపేత్‌ | అభ్రీం కాలాయసీం దద్యాత్‌ సర్పం హత్వా ద్విజోత్తమః ||

పలాలభారకం పణ్డం సోమకం చైవ మాషకమ్‌ | ఘృతకుంభం వరాహే తు తిలద్రోణం తు తిత్తిరే ||

శుకే ద్విహాయనం వత్సం క్రౌంచం హత్వా ద్విహాయనమ్‌ | హాత్వా హంసం బలాకాం చ బకం బర్హిణ మేవ చ ||

వానరం శ్యేనభాసౌ వా స్పర్శయే ద్భ్రాహ్మణాయ గామ్‌ | వాసో దద్యా ద్ధయం హత్వా , పంచ నీలాన్‌ వృషాన్‌ గజమ్‌ ||

అజం మేష మనడ్వాహం ఖరం హత్త్వైకహాయనమ్‌ | క్రవ్యాదాం హరిణీం హత్వా ధేనుం దద్యా త్పయస్వినీమ్‌ ||

అక్రవ్యాదం వత్సతరీ ముష్ట్రం హత్వా తు కృష్టలమ్‌ | జీవ కార్ముక వత్సాదీన్‌ పృథక్‌ దద్యా ద్విశుద్ధయే||

చతుర్ణా మపి వర్ణానాం నారీం హత్వానరాగతః | వర్ణానా మాను పూర్వ్యేణ త్రయాణా మవిశేషతః ||

ప్రమాప్య చా7ప్రమాప్య స్త్రీం శూద్రహత్యావ్రతం చరేత్‌ | ధనేన వధనిర్ణేకం సర్పాదీనా మశక్నువన్‌ ||

ఏకైకశ శ్చరేత్‌ కృచ్ఛ్రం ద్విజః పాపాపనుత్తయే | ఫలదానాం తు వృక్షాణాం ఛేదనే జప్య మృక్‌శతమ్‌ ||

గుల్మవల్లీలతానాం చ పుష్పితానాం చ వీరుథామ్‌ | అస్ధన్వతాం తు సత్వానాం సహస్రస్య ప్రమాపణ ||

పూర్ణే వా తదనస్థ్నాం తు శూద్రహత్యా వ్రతం చరేత్‌ | కించిదేవ తు విప్రాయ దద్యా దస్థిమతాం వధే ||

అనస్థ్నాం చైవ హింసాయాం ప్రాణాయామేన శుద్ధ్యతి || అన్నా ద్యజానాం సత్త్వానాం రసజానాం చ సర్వశః ||

ఫల పుష్పోద్భవానాం చ ఘృతప్రాశో విశోధనమ్‌ | కృష్ణజానా మౌషధీనాం జాతానాం చ స్వయం వనే ||

వృథారంభేణ గచ్ఛేద్గాం దినమేకం వయోవ్రతః | ఏతై ర్ర్వతై రపోహ్యం స్యా దేనో హింసాముద్భపమ్‌|| 139

స్వధర్మములోనున్న వైశ్యునిజంపినవాడు నూరుగోవులను దానముచేయవలెను. శూద్రుని చంపినవాడీ వ్రతమునే సమగ్రముగా నాఱుమాసము లాచరించవలెను. ఒక వృషభమును పది గోవులను బ్రాహ్మణునకు దానము సేయవలెను. పిల్లిని, ముంగిసను, పాలపిట్టను కప్పను కుక్కను ఉడుమును, గుడ్లగూబను, కాకిని చంపినవాడు శూద్రహత్యాపాపప్రాయశ్చిత్తము నాచరించవలెను. మూడురోజులు పాలు త్రాగవలెను. లేదా యోజనదూరము నడువవలెను. నదిలో స్నానముచేయనగును. లేదా ముమ్మారు అఘమర్షణాదిసూక్తపఠనము చేయవలెను. సర్పమునుచంపిన ద్విజశ్రేష్ఠుడు ఇనుపగునపము నీయవలెను. పందిని జంపినవాడు ఆబోతును గడ్డిమోపును కర్పూరమును నేతికడవను, తిత్తిరిపక్షిని చంపినవాడు కుంచెడునువ్వులను నీయవలెను. చిలకనుచంపిన వాడు రెండేండ్ల దూడను క్రౌంచపక్షినిచంపిన. రెండేడ్లం దూడను హంస, బెగ్గురుపక్షి కొంగను నెమలిని కోతిని డేగను బెళగువ్వ వెన్నెలపులుగును (చకోరపక్షి) చంపిన వాడు బ్రాహ్మణునకు గోవునీయవలెను. ఏనుగుజంపినవాడు వల్ల ఆబోతుల నైదింటి నీయవలయును. గొఱ్ఱను మేకను ఎద్దును గాడిదను చంపినవాడు ఒక సంవత్సరము వయసు గల ఆవు నీయవలెను. మాంసము తిను జంతువును లేడిని జంపిన వాడు పాలనిచ్చు గోవును, మాంసము తినిన లేడిని చంపిన వత్సతరి (ఆవుదూడను) నీయవలెను. ఒంటెను చంపిన కృష్టలప్రమాణమైన బంగారము నీయవలెను. పాపమునుండి శుద్ధిపొందుటకై వేరు వేరుగా జీవనమును విల్లును, ఆవుదూడ మొదలగువాని నీయవలెను. అబుద్ధిపూర్వకముగ నాలుగువర్ణములవారిని జావబాదినవాడు మొదటి మూడువర్ణముల స్త్రీ చచ్చిన, చావకపోయినను శూద్రహత్యాదోష ప్రాయశ్చితము చేసికొనవలెను. సర్పాదులను చంపినపాపమును ధనముచే పోగొట్టుకొన లేని బ్రాహ్మణుడు ఒక్కొక్క వధ కొక్కొక కృచ్చ్రమును చేసికొనవలెను. ఫలవృక్షముల నరికిన యెడల నూఱుఋక్కులను జపించవలెను. పొదలు, తీగెలు, పుష్పించు లతలను డొంకలను చేధించినను అస్థన్వంతములైన జంతువులను వేయిని చంపినను చంపయత్నించినను శూద్రహత్యా వ్రతమా చరించవలెను. ఎముకలుగల జంతువుల చంపినచో బ్రాహ్మణున కేకొంచమైన దానమీయవలెను. ఎముకలు లేనివానిని చంపినవాడు ప్రాణాయామముతో పరిశుద్ధుడగును. అన్నాదులతోను రసములతోను, ఫలపుష్పాదులతో పుట్టు ప్రాణులనహింసించిన అజ్యప్రాశన చేసిన శుద్ధుడగును. దన్నుటలోను వనమునందు స్వయముగను పుట్టిన ఓషధులను హింసించినవాడు వయోవ్రతమూని యోకదినమున ఆవువెంట దిరుగవలెను. హింసవలన కలిగినపాప మీ వ్రతములతో పోగొట్టుకొననగును.

స్తేయదోషాపహర్తౄణాం వ్రతానాం శ్రూయతాం విధిః | ధాన్యాదిధన చౌర్యాణి కృత్వా కామా ద్ధ్విజోత్తమః ||

స్వజాతీయ గృహా దేవ కృచ్ఛ్రాబ్దేన విశుద్ధ్యతి | మనుష్యాణాం తు మరణ స్త్రిణాం క్షేత్ర గృహస్య చ ||

కూప వాప జలానాం తు శుద్ధి శ్చాంద్రాయణం స్మృతమ్‌ | ద్రవ్యాణా మల్పసారాణం స్తేయం కృత్వా 7న్యవేశ్మతః ||

చరే త్సాంతపనం కృచ్ఛ్రం తం నిర్యా త్యాత్మ శుద్ధయే |భక్ష్య భోజ్యాపహరణ యానశయ్యాస నస్య చ ||

పుష్పమూలఫలానాం చ పంచగవ్యం విశోధనమ్‌ | తృణకాష్ఠద్రుమాణం తు శుష్కాన్నస్య గుడస్య చ ||

చైల చర్మా77మిషాణాం చ త్రిరాత్రం స్యా దభోజనమ్‌ | మణి ముక్తాప్రవాళానాం తామ్రస్య రజతస్య చ ||

అయస్కాంస్యోపలానాం చ ద్వాదశాహం కణాన్నఛుక్‌ | కార్పాసకీట కోర్ణానాం ద్విశ##ఫైక శఫస్య చ ||

పక్షిగంధౌషధీనాం చ రజ్జ్వా శ్చైవ త్రహ్యం పయః | ఏతై ర్వ్రతై రపోహేత పాపం స్తేయ కీతం ద్విజః ||146

దొంగతనమునకు ప్రాయశ్చిత్తము

చోరత్వదోషము పోవుట కాచరించదగిన వ్రతవిధానము వినుము. ద్విజవరుడు కోరి ధాన్యధనచౌర్యము చేసినచో అదికూడ తన జాతికి చెందిన యింటినుండి యైనచో నొక్క యేడాది కృచ్ఛ్రవ్రతము చేసిన శుద్ధుడగును. మనుష్యులను, స్త్రీలను, క్షేత్రము (భూమి)ను, ఇంటిని కూపము (నుయ్యి) వాపి =దిగుడుబావి లోని నీళ్ళను హరించినచో చాంద్రాయణము చేసినశుద్ధి యగును, ఒరునింట చిన్న చిన్న ద్రవ్యములను భక్ష్య భోజ్యమును య్యామును = బండ్లు మొదలైన యానసాధనములను మంచము పరుపులను ఆసనమును పూలు దుంపలు, పండ్లు హరించిన పంచగవ్య ప్రాశనముచే శుద్ధుడగును. గడ్డి కట్టెలు చెట్లు శుష్కాన్నము బెల్లము, వస్త్రము చర్మములు మాంసములు హరించిన త్రిరాత్రోపవాసము చేయవలెను. మణులు ముత్యాలు పవడములు రాగా వెండి ఇనుము కంచురాళ్ళు దొంగిలించి పండ్రెడురోజులు కణాన్న భుక్కుకావలెను. నూకతో చేసిన అన్నము తినవలెను. ప్రత్తి పొత్తినూలు కట్టుబట్టలను ద్విశఫలములు=రెండు డెక్కలుగల జంతువులను ఏకశఫములు (గుఱ్ఱముమొ) పక్షులు గంధము ఓషధులు త్రాళ్ళు దొంగిలించినయెడల మూడుదినములు పాలుత్రాగి యుండవలెను. ఇది దొంగతనమునకు ప్రాయశ్చిత్తము.

అగమ్యగమనైనః వ్రతై రేభి రపానుదేత్‌ | గురుతల్పవ్రతం కుర్యా ద్రేత స్సిక్త్వా7న్య యోనిషు|| 147

సఖ్యుః పుత్రస్య చ స్త్రీషు కుమారీ ష్వన్త్వజాసు చ | పైతృష్వస్రేయీం భగినీం స్వస్రీయాం మాతురేవ చ ||

మాతు శ్చ భ్రాతు స్తనయాం గత్వా యచాంద్రాయాణాం చరేత్‌ |ఏతా స్త్రిస్రస్తు భార్యార్ధే నోపయచ్చేత బుద్ధిమాన్‌ ||

జ్ఞాతయో నోపయమనాః పితు శ్చ హ్యుపయ న్నథః | అమానుషీషు పురుష ఉదక్యాం వామయోనిషు ||

రేత స్సిక్త్వా జలే చైవ కృచ్ఛం సాంతపనం చరేత్‌| మైథునం తు సమాసేవ్య పుంసి యోషితివా ద్విజః ||

గోయానేషు దివా చైవ సవాసాః స్నాన మాచరేత్‌ | చండాలాంత్యజ స్త్రీయోగా ద్భుక్త్వా చ ప్రతిగృహ్య చ ||

పత త్యజ్ఞానతో విప్రో జ్ఞానా త్సామ్యం చ గచ్చతి| విప్రదుష్టాం స్త్రియం భర్తా నిరుంధ్యా దేవ వేశ్మని ||

య త్పుంసః పరదారేషు తచ్చైనాం చారయే ద్ర్వతమ్‌ | సాచే త్పునః ప్రదుష్యేత సదృశేనోపమంత్రితా ||

కృచ్చ్రం చాంద్రాయణం చైవ తదస్యాః పావనం స్మృతమ్‌ ||

అగమ్యగమన ప్రాయశ్చిత్తము

అగమ్యగమన పాపము నేచెప్పబోవు వ్రతములతో పోగొట్టుకొననగును, అన్యయోదులందు లేతస్సేకము చేసినవాడు గురుతల్ప ప్రాయశ్చిత్తమును చేసికొనవలెను. మిత్రుని పుత్రుని భార్యలను, కుమారికలను, కడజాతివాండ్రను, మేనత్తకూతిరిని, పినతల్లి, పెత్తల్లి, కూతుళ్ళను మేనమామకూతురును చేరినవాడు చాంద్రాయణ వ్రతమాచరించవలెను. పైమువ్వురిని బుద్ధిమంతుడెవ్వడును భార్యగా గ్రహింపరాదు. తండ్రి యొక్క జ్ఞాతులను పెండ్లాడరాదు. ఆడినవాడు మనుష్యేతరయోనులందును, ముట్టువానియందు, దుష్టయోనులందు జలమందు రేతస్సేకము చేసినవాడును సాంతపనవృచ్చ్రవ్రతముల నాచరించవలెను, పురుషునితో స్త్రీతోను ఎడ్లబండ్లలోను, పగలు మైధునము చేసినవాడు సచేలస్నానము చేయనగును. అంత్యజులు, చండాలస్త్రీలతో సంగమించిన వాడు కలసి తినినవాడు వారివద్ద దానము పెట్టిన చేసినవాడును తెలియక చేసిన పతితుడగును, తెలిసియండ్రనచో చేసినచో సామ్యము నందును. చెడిపోయిన స్త్రీని భర్త యొకగుడిసెలో నిరోధించవలెను. పరదారాభిగమనము చేసిన పురుషుడు చేయదగిన వ్రతము నామెచే చేయింపవలెను. అమెయే మరల సాటివానిచే పిలువబడి భ్రష్టురాలగుచో కృచ్చ్రాచాంద్రాయణ వ్రతాచరణముచే పరిశుద్దురాలగును.

య త్కరోత్యేకరాత్రేణ వృషలీసేవనం ద్విజః ||

తద్భైక్ష్యుభుగ్బపన్‌ నిత్యం త్రిభి ర్వర్షైః వ్యపోహతి | ఏషా పాపకృతా ముక్తా చతుర్ణా మపి నిష్కృతి ః ||

పతితైః సంప్రయుక్తానా మిమాః శృణుత నిష్కతీః | సంవత్సరేణ పతతి పతితేన సహాచరన్‌ ||

యాజనా7ధ్యాపనా ద్దానా దుక్తి పానాశనాసనాత్‌ | యో యేన పతితే నైషాం సంసర్గం యాతి మానవః ||

స తసై#్వవ వ్రతం కుర్యాత్‌ తత్సంసర్గస్య శుద్ధయే | పతిత స్యోదకం కార్యం సంపిండై ర్బాంధవై స్సహ ||

ఒక్కరాత్రి శూద్రస్త్రీని గలిసిన ద్విజుడు నిత్యము భిక్షాన్నముం దినుచు జపము చేసినొనుచు మూడుసంవత్సరములకు పరిశుద్దుడగును. ఇది పాపము చేసిన నాలుగువర్ణముల వారికిని చెప్పబడిన ప్రాయశ్చిత్తవిధానము. ఇట్టిపతితులతో గూడిన వారి ప్రాయశ్చిత్తములను వినుము ! ఒక్క సంవత్సరకాలము పతితునితో గలసిన తిరిగినవాడు యజ్ఞము చేయించుటకు వేదము చెప్పుటకు దానమునకు సంభాషణము చేయుటకు కలిసి నీరు త్రాగుటకు, కలిసి భుజించుటకు, కలిసికూర్చుండుటకును పనికిరాడు. పాపములు చేసిన నాలుగు వర్ణములవారికిట్లు నిష్క్రతి (పరిహారము) చెప్పబడినది.

పతితసాంగత్య ప్రాయశ్చిత్తము

నిందితె7హని సాయాహ్నే జ్ఞాత్యృత్విగ్గురు సంనిధౌ | దాసీఘట మపాం పూర్ణం పర్యస్యేత్‌ ప్రేతవత్సదా || 160

అహోరాత్ర ముపాసీరన్‌ న శౌచం బాంధవై స్సహ | నివర్తయేరన్‌ తస్మా త్తు సంభాషణసహాసనే ||

దాయాదస్య వ్రదానం చ యాత్రా మేవచ లౌ కికీమ్‌ | జేష్ట్యభాగం నివర్తేత జేష్ట్యావాప్తం చ యద్వసు ||

జేష్ఠ్యాంశం ప్రావ్నుయా చ్చాపి యావీయాన్‌ గుణతో7ధికం | ప్రాయశ్చిత్తే తు చరితే పూర్ణకుంభ మపాం నవమ్‌||

తేనైవ సార్థం ప్రాపేయుః స్నాత్వా పుణ్య జలాశ##యే | స త్స్వప్సు తం ఘటం ప్రాప్య ప్రవిశ్య భవనం స్వకమ్‌ ||

సర్వాణి జ్ఞాతికార్యాణి యధాపూర్వం సమాచరేత్‌ | ఏన మేవ విధిం కుర్యా ద్యోషిత్సు పతితా స్వపి ||

వస్త్రాన్నపానం దేయా స్తే వసేయు శ్చ గృహాన్తికే | ఏనస్విభి రనిర్ణిక్తై ర్నార్థం కించి త్సమాచరేత్‌ ||

కృతనిర్ణేజనాం శ్చైతా న్న జగుప్సేత కర్హిచిత్‌ | బాలఘ్నాం శ్చ కృతఘ్నాం శ్చ విశుద్ధానపి ధర్మతః ||

శరణాగతహంతౄం శ్చ స్త్రీహంతౄం శ్చ న సంవసేత్‌ | యేషాం ద్విజానాం సావిత్రీ నా నుచ్యేత యథావిధి||

తాం శ్చారయిత్వా త్రీన్‌ కృచ్ఛ్రాన్‌ యథావిధ్యు పనాయయేత్‌ | ప్రాయశ్చిత్తం చికీర్షన్తి వికర్మస్థాస్తు యే ద్విజా ః ||

బ్రాహ్మణాశ్చ పరిత్యక్తా యేషాం మధ్యే త దాదిశేత్‌ | యద్గర్హితే నార్జయన్తి బ్రాహ్మణాః కర్మణా ధనమ్‌ || 170

ఆపతితుని వెలివేసిన రోజున సాయంకాలము జ్ఞాతులు ఋత్విక్కులు గురువు (పెద్ద)ల సన్నిధిలో దాసీమనిషి జలముతో నింపిన కుంభమును శవముపై గ్రుమ్మరించినట్లు వానిపై గ్రమ్మరించవలెను. ఆతడు జ్ఞాతులతో వొక్కరాత్రి పగలు కలిసియుండ వచ్చును- కాని వారితో నాచారకృత్యము లేమియు జేయరాదు. బంధువులు వానితో మాటలాడుటయు కలిసి మెలిసి యుండుటయు గూడదు. వాడెచటికేని వ్యవహరము నిమిత్తమై పోవునపుడుమాత్రమే వానికి దాయ భాగము నీయవలెను. అతడు జేష్టుడైనను జ్వేష్టాంశ మీయ వలనుపడదు. నానికంటె చిన్నవాడైనను గుణములచే జేష్టుడైనవాడే జేష్టాంశమును పొందనర్హుడు. భ్రష్టుడు యథావిధిగా ప్రాయశ్చిత్తము చేసికొన్నచో వానిచేతులమీదనే వాని జ్ఞాతులు బంధువులు జలపూర్ణ కుంభము నందుకొనవచ్చును. పుణ్య జలాశయమున స్నానము చేసి అకుంభమును తీసికొని స్వగృహమును చేరి జ్ఞ్యాతి కృత్యముల నన్నిటిని యథా పూర్వముగ చేసికొనవలెను. ఇట్లు పాపాపనోదనము చేసికొనిన వారి నెప్పుడును నేవగించుకొనరాదు. పతితులైన స్త్రీల విషయములోకూడ నిట్లే వస్త్ర, అన్న పానాదులనీయ వచ్చును. దగ్గరనుండవచ్చును. పాపాపనోదనము చేసికొనిన పాపాత్ములతో నేపనిచేయరాదు. యధా విథిగ ప్రాయశ్చిత్తము చేసికొని శుద్ధులైనను బాలఘాతుకులను, కృతఘ్నులను శరణా గతఘాతుకులను, స్త్రీఘాతకులను మాత్రము చేరియుండరాదు. ద్విజులకు యథా విధిగ గాయత్రీమంత్రోప దేశము జరుగని యెడల వారిచే మూడు కృచ్ఛ్రవ్రతములను చేయించి మరల యథా విధిగ నుపనయనము చేయింపవలెను.

తస్యోత్సర్గేణ శుధ్ద్యన్తి జప్యేన తపసైవ చ | జపిత్వా త్రీణి సావిత్ర్యాః సహస్రాణి సమాహితః ||

మాసం గోష్ఠే పయః పీత్వా ముచ్యతే7సత్ప్రతిగ్రహాత్‌ | ఉపవాసకృశం తం తు గోవ్రజాత్‌ పునరాగతమ్‌ ||

ప్రణతం పరిపృచ్ఛేయుః సౌమ్య! సౌమ్యేచ్ఛ సీతి కిమ్‌ | సత్య ముక్త్వా తు విప్రేభ్యో వితరే ద్యవసం గవామ్‌ ||

గోభిః ప్రవర్తితే తీర్థే కుర్యు స్తస్య పరిగ్రహమ్‌ | వ్రాత్యానాం యాజనం కృత్వా పరేషా మంత్యకర్మచ ||

అభిచార మహీనం చ త్రిభిః కృచ్ఛ్రై ర్విశుద్థ్యతి | శరణాగతం పరిత్యజ్య వేదం విప్లావ్య చ ద్విజః ||

సంవత్సరం యతాహార స్తత్పాప మతిగచ్చతి | శ్వశృగాలోరగై ర్దష్టో గ్రామ్యైః క్రవ్యాద్భి రేవ చ ||

గవాశ్వోష్ట్ర వరాహై శ్చ ప్రాణాయామేన శుధ్యతి | షష్ఠాహ్నకాల మశనం సంహితాజాప ఏవ చ ||

హోమ శ్చ శాకలో నిత్య మపంక్త్యానాం విశోధనమ్‌ | ఉష్ట్రయానం సమారూహ్య ఖరయానం చ కామతః ||

ప్నాత్వా తు విప్రో దిగ్వాసాః ప్రాణాయామేన శుధ్యతి| వినా భిన్నాప్సు చా ప్యన్తః శరీరం సంనివేశ##యేత్‌ ||

సచైలో బహి రాఫ్లుత్య గా మాలభ్య విశుధ్యతి | వేదోదితానాం నిత్యానాం కర్మణాం సమత్రికమే ||

వికర్మల జేయుచు బ్రాహ్మలచే విడువబడిన ద్విజులు ప్రాయశ్చిత్తము చేసికొన నిచ్చగించి రేవి వారికిటు ఆదేశమీయవలెను. బ్రాహ్మణులు నింద్య కర్మచే సంపాదించిన ద్రవ్యమును విడిచి పెట్టి జపము చేతను తపస్సు చేతను పరిశుద్దులగుదురు. ఒకనెల దినములు గోష్ఠము నందుండి మూడు సహస్రముల గాయత్రీ మంత్ర జపము చేయుచు గోక్షీరపానము చేసినయెడల అసత్ర్పతి గ్రహ దోషము తొలగును. అట్లుపవాసము నొనరించి గోశాల నుండి యేతెంచి ప్రణతుడైన బ్రాహ్మణుని ''సౌమ్యుడా! నీకేమీ కావలయునని'' యడుగగా తాను జేసిన పాపమును నిజముగ చెప్పి గోవులకు మేత వేయవలెను. గోవులు దిగు రేవులో వానిని మరల తమలో కలుపుకొనవలెను. సంస్కార హీనులకు యజ్ఞము చేయించినవాడు, ఇతరులకు ప్రేతకర్మ చేసినవాడు, ఘోరమగు అభిచారము (శత్రు వథ గోరి ) చేసినవాడును మూడు కృచ్ఛ్రములు దోషవిముక్తుడగును.

శరణాగతుని విడచిన వాడును, వేద భ్రంశము (ఆమ్నాయము చేయక మరచుట) చేసినవాము, ఒక్కసంవత్సర మహారనియమముతో పరిశుద్దుడగును, కుక్క, నక్క, పాముచేతను గ్రామముల దిరుగు క్రూరజంతువుల చేతను, గోవు ఒంటె గుఱ్ఱము, పందుల చేతను కరువ బడినవాడు ప్రాణాయామముచే పరిశుద్దుడగును.

పంక్తి బాహ్యుడు నక్త, భోజనము, వేదసంహితా జపము, శాకలోక్త హోమము, నిత్యము చేసిన శుద్దుడగును. ఒంటె గాడిదలను బుద్ధి పూర్వకముగ నెక్కినవాడు, దిరంబరిగ స్నానము చేసిన వాడును ప్రాణాయామముతో దోష రహితు డగును. సచేల స్నానము చేసినవాడు గోస్పర్శచే శుద్ధుడగును. స్నాతకవ్రత లోపమందుపవాసము ప్రాయశ్చిత్తముగ చెప్పబడెను.

స్నాతకవ్రతలోపే చ ప్రాయశ్చిత్త మభోజనమ్‌ | హుంకారం బ్రాహ్మణ స్యో క్త్వా త్వం కారంతుగరీయసః ||

స్నాత్వా7నశ్న న్నహశ్చైక మభి వాద్య ప్రసాదయేత్‌ | తాడయిత్వా తృణనాపి కంఠే బద్ధ్వా7పి వాససా ||

వివాదేనాపి నిర్జిత్య ప్రతిపత్య ప్రసాదయేత్‌ | అవగూర్య త్వబ్దశతం సహస్ర మభిహత్య చ ||

జిఘాంసయా బ్రాహ్మణస్య నరకం ప్రతి పద్యతే || శోణితం యావతః పాంసూన్‌ సంతృహ్ణతి ద్వి జననః ||

తావన్త్వబ్దసహస్రాణీ తత్కర్తా నరకం వ్రజేత్‌ | అవగూహ్య చరేత్‌ కృచ్ఛ్రం అతికృచ్ఛ్రం నిపాతినే||

కృచ్చ్రాతికృచ్చ్రం కుర్వీత విప్రస్యోత్పాద్య శోణితమ్‌ | చండాలాది రవిజ్ఞాతో యస్య తిష్ఠేత వేశ్మని ||

సమ్యక్‌ జ్ఞాతస్తు కాలేన తస్య కుర్వీత శోధనమ్‌ | చాంద్రాయణం పరాకం వా ద్విజానాం తు విశోధనమ్‌ ||

ప్రాజాపత్యం తు శూద్రాణాం శేషం తదనుసారతః || 187 1/2

బ్రాహ్మణుని హుంకరించినపుడు పెద్దవానిని నీవునీవనినను స్మానము చేసి యొకదిన ముపవాసముండి వారికి నమస్కరించి ప్రసన్నుల జేసికొనవలెను. గడ్డి పోచతో కొట్టినను కంఠమునందు వస్త్రముతో కట్టివేసినను వాదములో జయించినను వారి కాళ్లపైబడి ప్రసన్నుల జేసి కొనవలెను. బ్రాహ్మణుని జంపగోరి అవమానించినవాడు నూరేండ్లును, కొట్టినవాడు వేయేండ్లును నరమునొందును. బ్రాహ్మణునిరక్తము భూమి రేణువులను ఎన్ని సంగ్రహించునో అన్ని వేలయేండ్లు తత్కర్త నరకము నొందును. అవగూరణము (అవమానము) చేసినవాడు కృచ్చ్రవ్రతము పడగొట్టినవాడు అతికృచ్ఛ్రమును, బ్రాహ్మణునకు రక్తము తెప్పించినవాడు కృచ్ఛ్రాతి కృచ్ఛ్రావ్రతముల జేయ వలయును. చండాలాది జాతి వాడెవ్వడింట తెలియకుండ నున్న యెడల అసంగతి తెలియగానే ఆ దోషశోధనము గావింప వలయును. ద్విజులకు చాంద్రాయణము గాని పరాక కృచ్ఛ్రవ్రతము గాని శోధకము. శూద్రులకు ప్రాజాపత్యవ్రతము. కృచ్ఛ్రము లేడు విధములు. తక్కినవస్తువుల శుద్ధి ఈ క్రిందివిధముగా చేయవలెను.

గుడం కుసుంభం లవణం తథా ధాన్యాని యాని చ ||

కృత్వా గృహే తతో ద్వారి తేషాం దద్యా ద్ధుతాశనమ్‌ | మృణ్మయానాం తు భాండానాం త్యాగ ఏవ విధీయతే ||

ద్రవ్యాణాం పరిశేషాణా మేవంశుద్ధి ర్విధీ యతే || యస్తస్య భుంక్తే పక్వాన్నం కృచ్చ్రార్థం తస్య దాపయేత్‌ || 190

శుష్కాన్నభాజినః పాద మిత్యాహ భగవాన్‌ మనుః | కూపే తా నవసంపాద్య స్పర్శసంకల్పదూషితాః||

శుద్ధేయు రుపవాసేన పంచగమ్యేన చాప్యథ| యస్తు సం స్పృశ్య చాండాల మశ్నీ యాద్వా త్వకామతః ||

ద్విజ శ్చాంద్రాయణం కుర్యాత్‌ తప్తకృచ్చ్ర మథాపి వా |వర్ణసంకరసంకీర్ణా శ్చండాలాది జుగుప్సితాః ||

భుక్త్వా పీత్వా తథా తేషాం షడ్రాత్రేణ విశుధ్యతి | అంత్యానాం భుక్తశేషం తు భక్షయిత్వా ద్విజాతయః ||

వ్రతం చాంద్రాణం కుర్యుః త్రిరాత్రం శూద్ర ఏవ చ | చండాలకూప భాండేషు అజ్ఞానా ద్యః పిబే జ్జలమ్‌ ||

ద్విజ స్సాంతపనం కుర్యాత్‌ శూద్ర శ్చోపవసే ద్దినమ్‌ | ఉచ్ఛిష్టో యది సంస్పృష్టః శునా శూద్రేణవా ద్విజః ||

ఉపోష్య రజనీ మేకాం పంచగవ్యేన శుధ్యతి| ఉచ్చిష్టేన యది స్పృష్టః ఉచ్చిష్టో బ్రాహ్మణోత్తమః ||

త్రికాల మాచరేత్‌ స్నానం నక్తం భుంజీత వాగ్యతః | క్షత్రియేణ తథా స్పృష్టః స్నానం నక్తం సమాచరేత్‌ || 198

స్పృష్ట స్సవర్ణే నాచామే దమేధ్యం స్పృశ##తే యది | అహో రాత్రోషితో భూత్వా పంచగవ్యేన శుధ్యతి||

బెల్లము, కుంకుమ, ఉప్పు, ధాన్యములు వీని నింటనే యుంచి ద్వారమున వానికి నిప్పంటించవలెను. మట్టి పాత్రలను పారవేయవలెను. ఇతర ద్రవ్యములకు చేయవలసిన ద్రవ్య శుద్ధి చేయనగును. వాని యింట పక్వాన్నము తిన్నవాడు అర్థ కృచ్ఛ్రమును శుష్కాన్నము తిన్నవాడు పాద కృచ్చ్రమును నాచరించవలెను. అని మను భగవానుడు చెప్పెను. పాత్రలను కూపము నందుంచి అస్పర్శ దోషదూషితులైన వారు ఉపవాసము చేతను పంచగవ్య ప్రాశనచేతను శుద్ధులగుదురు. తెలియక చండాలుని తాకి భుజించిన బ్రాహ్మణుడు చాంద్రాయణ తప్త కృచ్ఛ్రమును చేయవలెను. వర్ణ సంకరులతో కలసి చండాలాదులతో నేవగించు కొనుచు భుజించిన వారును నీరు త్రాగిన వారును ఆరు రాత్రులతో శుద్ధులగుదురు. అంత్యజుల భుక్తశేషమును భుజించిన ద్విజులు శూద్రుడును మూడురోజులు చంద్రాయణ వ్రత మాచరించ వలెను.

చండాలుల బావులలోకడవలలోని నీరును తెలియక త్రావిన ద్విజుడు సాంతపన వ్రతమాచరించ వలెను. శూద్రుడొకదినముపవాసము చేయవలెను. ద్విజుడు తన ఉచ్చిష్టము కుక్కచేగాని శూద్రునిచే గాని తాకబడిన యెడల ఆ బ్రాహ్మణుడొక రాత్రి ఉపవసించి పంచగవ్యప్రాశనచే శుద్ధుడగును. భోజనము చేసి (చెయికడుగు కొనకుండ) మఱియొక ఉచిష్టమును తాకిన ద్విజుడు మూడు పూటల స్నానము చేసి వాజ్నియమమూని రాత్రి భుజించవలెను. క్షత్రియుడు అట్లుఉచ్చిష్ట స్పర్శ చేసెనేని స్నానము చేసి నక్త భోజనము చేయవలెను. సవర్ణుడు తాకినచో ఆచమించ వలెను. ఆమేధ్యమును తాకిన యెడల అహోరాత్రముపవసించి పంచగవ్యముచే శుద్ధుడగును.

అధ్వానం ప్రస్థితో విప్రః కాంతారే య ద్యనూదకే | పక్వా న్నేన గృహీతేన మూత్రోచ్చారం కరోతి వై|| 200

అనిధాయైవ తద్ధ్రవ్యం కృత్వాంగే ఉత్తమే స్థితమ్‌ | శౌచం కృత్వా యథాన్యాయ ముపవిశ్య యథావిధి ||

అన్న మభ్యుక్షయే చ్చాపి ఉద్ధ్రత్యార్కస్య దర్శయేత్‌ | అర్కాభావే7ప్య7గ్నేశ్చ బస్త స్యాధ ప్రదర్శయేత్‌ ||

తృక్త్వా గ్రాసత్రయం, తస్మా చ్ఛేషం శుద్ధి మవాప్నుయాత్‌ | వ్లుె చ్ఛై ర్హృతానాం చోరై ర్వా కాంతారే వా ప్రవాసినామ్‌ ||

భక్ష్యాభక్ష్య విశుద్ధ్యర్థం తేషాం వక్ష్యామి నిష్కృతిమ్‌ | పునః ప్రాప్య స్వకం దేశం వర్ణానా మాను పూర్వ శః ||

కృచ్ఛ్ర స్యార్థే బ్రాహ్మణ స్తు పున స్సంస్కార మర్హతి| పాదోనాన్తే క్షత్రియస్తు అర్ధార్థే వైశ్య ఏవ చ||

పాదం కృత్వా తథా శూద్రో దానం దత్త్వా విశుధ్ధ్యతి | ఉదక్యా తు సవకుర్ణా యా స్పృష్టా చేత్స్యా దుద క్యయా ||

అహోరాత్రోషితా సాచ శుద్ధా స్నానేన శుద్ధ్యతి || మూత్రం కృత్వా వ్రజ న్మార్గం న్మతి భ్రంశా జ్జలమ్‌ పిబేత్‌||

అహోరాత్రోషితో భూత్వా పంచగవ్యేన శుద్ధ్యతి | మూత్రోచ్చారం ధ్విజః కృత్వా ప్యకృత్వా శౌచ మాత్మనః ||

మోహాత్‌ భుక్త్వా త్రిరాత్రం తు యవాన్‌ పీత్వా విశుద్ద్యతి || పరిత్యక్త మహాయజ్ఞాఃప్రవ్రజ్యా విచ్యుతా శ్చ యే ||

అనాశక నివృత్తాశ్చ తేషాం శుద్ధిః ప్రవక్ష్యతే | చారయే త్త్రీణి కృచ్ఛ్రాణి చాంద్రాయణ మధా పి వా ||

జాత కర్మాది సంస్కారైః సంస్కుర్యా త్తం తథా పునః | ఉపానహ మమేధ్యంవా చాస్య సంస్పృశ##తే ముఖమ్‌ ||

పుత్రికా గోమయే తస్య పంచగవ్యం విశోధనమ్‌ | వాపనం విక్రయం చైవ నీలవృత్త్యు పజీవనమ్‌ ||

పతనీయం హి విప్రస్య నీలసూత్రస్యధారణాత్‌ | స్నానం దానం తపో హోమః స్వాధ్యాయః పితృతర్పణమ్‌ ||

వృధా తస్య మహా యజ్ఞాః నీల సూత్రస్య ధా రణాత్‌ | నీలరక్తం యదా వస్త్రం ద్విజో7ంగేషు హి ధా రయేత్‌ ||

ఉపోష్య రజనీ మేకాం పంచగవ్యేనశుధ్యతి | నీల దారు యదా భ##జ్యే ద్బ్రాహ్మణస్య తు పాదయోః ||

శోణితం దృశ్యతే బాస్య ద్విజ శ్చాంద్రాయణం చరేత్‌ || వాపితం యత్ర నీలం తు తావ దేవా శుచి ర్మహీ ||

ప్రమాణం ద్వాదశాబ్దాని అత ఊ ర్థం శుచి ర్బవేత్‌ | అన్త్యజేన శ్వపాకేన సంస్పృష్టా స్త్రీ రజస్వలా ||

చతుర్థే7హని శుద్ధాయాః ప్రాయశ్చిత్తం విశోధనమ్‌ | త్రిరాత్ర ముపవాసః స్యాత్‌ పంచగవ్యం తధైవ చ ||

ఉచ్ఛిష్టేన తు సంస్పృష్టా కదాచిత్‌ స్త్రీ రజస్వలా | యా వన్న శుద్ధి మాప్నోతి నాశ్నీయా త్తావ దేవ తు ||

చండాల శ్వపచౌ స్పృష్ట్వా శవధూమం చ సూతికామ్‌ | శవం స్పర్శయితా శ్వానం సద్యః స్నానేన శుధ్యతి ||

నా స్పృష్ట్వా స్థి తు సస్నేహం స్నాత్వా విప్రో విశుధ్యతి |

ఆ చమ్యైవ తు నిః స్నేహం గా మాలభ్యా7ర్క మీక్ష్య వా ||

రధ్యా కర్ధమ తో యేన నాభి స్పృష్టో భవత్య ధః | మృత్తో యై శ్చర్చయే దంగం తతః శుద్ధి మవా ప్ను యాత్‌ ||

వాన్తం వివిక్తః స్నాత్వా తు ఘృతం పీత్వా వి శుధ్యతి | క్షుర కర్మ తతః కృత్వా స్నానే నైవ వి శుధ్యతి ||

అపాం క్తేయైన్తు యః పంక్త్యాం భుంక్తే కశ్చి ద్ద్విజో త్తమః | అహో రాత్రో షితో భూత్వా పంచ గవ్యేన శుధ్యతి ||

చంద్రార్క గ్రహణ భుక్త్వా ద్విజ శ్చాంద్రాయణం చరేత్‌ || బ్రహ్మచారీ శునా దష్ట స్త్ర్య హం సాయం పయః పిబేత్‌ ||

గృహస్థో వా త్రిరాత్రం తు చైకా హం త్వగ్ని హోత్రవాన్‌ | నాభే రూర్థ్వం తు దష్టస్య తదేవ ద్విగుణం భ##వేత్‌ ||

బాహ్వోశ్చ త్రిగుణం జ్ఞేయం మూర్ధని స్యా చ్చతుర్గణమ్‌ ||

ఉద్బంధ మృతకం ప్రేతం యః స్పృశే ద్బ్రాహ్మణః క్వచిత్‌||

తస్య శుద్ధిం విజానీయాత్‌ తప్త కృచ్ఛ్రేణ నిత్యశః | ఆత్మానం ఘాతయే ద్యస్తు రజ్జ్వాదిభి రూప క్రమైః ||

సవర్ణుడు తాకినచో నాచమనము సేయవలెను. అమేధ్యము తాకిన వాడహోరాత్రోప వాసము చేసి పంచగవ్యముచే శుద్ధుడగును. విప్రుడు నిర్జలమైన యడవిలో దారి మసలి యక్కడ పక్వాన్నము (దారిబత్తెముగా గొని) నెత్తిపై బెట్టుకొని దానిం దింపకుండ మూత్రోచ్చారము సేయునేని యవ్వలగూర్చుండి యదావిథి శౌచము గావించుకొని (కాళ్ళు గడిగి కొనుట మొదలైనవి చేసి) యాయన్నము నభ్యుక్షించి నీళ్ళు చల్లి సూర్యునికి చూపవలెను. సూర్యుడు లేనిచో అగ్నికి లేక మేకకు చూపవలెను మరియు నందులో మాడు ముద్దలు వదలి వేసినచో తక్కినది శుద్ధినందును. వ్లుెచ్చులు చోరులు నడవిలో బ్రవాసమున్నవారి అహారము హరించినపుడు వానిభక్ష్యా భక్ష్య విశుద్ధికి జేయదగిన నిష్కృతి (శుద్ధి కర్మము) దెల్పెదను. తిరిగి తన ప్రదేశమునకు వచ్చి బ్రాహ్మణాది వర్ణ క్రమమున ప్రాయశ్చిత్తము జరుపుకొనవలెను. బ్రాహ్మణుడు సగము క్షత్రియుడు ముప్పాతిక వైశ్యుడు సగము (నాల్గవ వంతు ) శూద్రుడు కృచ్చ్రము సేయవలెను. శూద్రుడుదానము కూడ సేయవలెను. ముట్టుది సవర్ణయైన ముట్టు దానిని ముట్టు కొన్నచో అహోరాత్రోపవాసము చేసి స్నానము చేసిన శుద్దురాలగును. మూత్రము చేసి దారిలో పోవుచు మరచిపోయి నీటిని త్రాగిన యెడల అహోరాత్రము లుపవసించి పంచగవ్య ప్రాశన చేసిన శుద్ధుడగును. దారిలో మూత్రము విడిచిన ద్విజుడ మంత్రోచ్చారము సేసి ద్విజుడు శౌచము చేసి కొనక మోహముచే భుజించునేని ముణ్ణాళ్ళు యవలగంజి త్రాగి శుద్ధుడగును. పంచ మహా యజ్ఞములు మానిన వాండ్రు సన్యాసము పుచ్చుకొని భ్రష్టులైన వారు అనాశక నివృత్తులు=చావునకై చేసినఅనశన వ్రతము నుండి మరలిన వారు నగు వాండ్రు మూడు కృచ్చ వ్రతము లాచరింపవలెను. లేదా చాంద్రాయణము సేయవలెను. అట్టి భ్రష్టులను తిరిగి జాతకర్మాది సంస్కారములచే సంస్కరింపవలెను. వీని చెప్పులు అమేధ్యము ముఖముం దాకినచో పంచ గవ్యమును వానికి విశోధనము. వాపనము=చేయుట అమ్మకము నీలవృత్తిచే బడ్రతుకుట యివి విప్రుని పతనమునకు కారణములు. నీల సూత్ర ధారణము వలన స్నాన దాన తపో హోమ స్వాధాయ పితృ తర్పణములు అను పంచ మహా యజ్ఞములు కలనేత నీలసూత్రధారణము వలన వ్యర్ధములు. ద్విజుడు నలుపు నెఱుపు గలిసిన వస్త్రములు ధరించునేని యొక్క రాత్రి యుపవసించి పంచ గవ్యముచే శుద్ధుడగును. బ్రాహ్మణుని పాదములకు దగిలి నల్లని కర్ర విరిగినపుడు రక్తము కనిపించునేని యతడు చంద్రాయణము సేయవలెను.

తస్య ప్రేత క్ర యాం కీత్వా తప్త కృచ్ఛ్రేణ శుధ్యతి | ఇంద్రియేషు ప్రవిష్టం స్యా దమేధ్యం యస్య కస్యచి||

అహో రాత్రో షితః స్నాత్వా పంచ గవ్యేన శుధ్యతి | ఏతై ర్ద్వి జాతయః శోధ్యా వ్రతై రావిష్కృతై ర్మయాత్‌||

అనా విష్కృత పా పాంశ్చా మంతైర్హోమౌశ్చ సాధయేత్‌ | ఖ్యాపనే నాను తాపే న తపసా7ధ్యయనేన చ || 230

అస్త్య జాతి వానిచేతను శ్వపాకుని చేతను రజస్వల స్త్రీ తాకబడెనేని నాల్గవ రోజున ముట్టు స్నానము చేసిన తరువాత త్రిరాత్రోపవాసము సేసి పంచ గవ్య ప్రాశణము సేయవలెను. ఆమె యెట్టిదేని ఎంగిలి వానిచే తాక బడెనేని యాదజస్వల యైన స్త్రీ శుద్ధి కానంత వరకు భోజనము సేయరాదు. చండాలుని శ్వవచుని తాకినను శవ ధూపము సోకినను పురుడులో నున్న స్త్రీని శవమును కుక్కను దాకిన వాడును నద్య స్నానము చేసిన శుద్ధుడగును.

విప్రుడు జిడ్డుతో నున్న యెయుకం దాకిన స్నానము చేసిన జాలును. జిడ్డులేని యెముకం దాకిన నాచమించి గోవుందాకి సూర్యునిం బూచిన శుద్ధుడగును. రాచ బాటలోని బురద నీరు, నాభికిం దాకినచో నంటువడును. మట్టితో నీళ్ళను గడిగి కొన్నచో శుద్ధి నందును. విడిగనున్న వాడు కక్కుకొనినచో స్నానము చేసి నెయ్యి ద్రావిన శుద్ధుడగును క్షుర కర్మ చేసికొని స్నానముచే శుద్ధుడగును. అపాంక్తేయులతో బంతి గుడిచిన ద్విజవర్యుడహోరాత్రోపవాసము చేసి పంచగవ్య ప్రాశనసేయవలెను. చంద్ర సూర్య గ్రహణము లందు భుజించిన వాడు చాంద్రాయణ వ్రతము సేయవలెను. కుక్క గఱచిన బ్రహ్మచారి మూడు రోజులు సాయంకాలమందు పాలు త్రాగ వలెను. గృహస్తు మూడు దినములు, అగ్ని హోత్రియొకదినము. నాభికిపైని గఱచిన వానికి చెప్పినది రెట్టింపు. బాహువులం గఱచిన మూడు రెట్లు తలపైని, గఱచిన నాలుగు రెట్లు ప్రాయశ్చిత్తము, ఉరిపోసి కొని చచ్చిన వాని శవమును బ్రాహ్మణుడు తాకెనేని తప్త క్రృచ్ఛము సేయవలెను. త్రాళ్ళు మొదలయిన వానితో దన్నుదాను జంపు కొన్న వానికి ప్రేత కార్యము సేసిన వాడు తప్త కృచ్చ్రములచే పునీతుడగును. ఏనికేని యింద్రియములం దమేధ్యము ప్రవేశించేనేని యహోరాత్రోప వాసము చేసి పంచగవ్య ప్రాశన సేయవలెను.

పాప కృ న్ముచ్యతే పాపా త్తథా దానేన చా పరే | యధా తధా నరో ధర్మం స్వయం కృత్వా న భాషతే||

తథా తథా చ యేనై వ తస్మా త్పాపా త్ప్రముచ్యతే | కృత్వా పాపం హి స్మర్తవ్యం తస్మా త్పాపాత్‌ ప్రముచ్యతే ||

యధా యధా మన స్తస్య దుష్కృతం కర్మ గర్హతి | తథా తధా శరీరం తత్‌ తేనా ధర్మేణ ముచ్య తే ||

నైత త్కుర్యాం పునరితి నివృత్త్యాం ప్రయతే న్నరః | ఏవం సంచిత్య మనసా ప్రేత్య కర్మ ఫలో దయమ్‌ ||

మనో వా క్కర్మభి ర్నిత్యం శుభం కర్మ సమాచరే త్‌ | అజ్ఞానా ద్యది వా జ్ఞౌనాత్‌ కృత్వా కర్మ విగ ర్హి తమ్‌||

తస్మాద్ధి ముచ్యతే నిత్యం ద్వితీయం న సమాచరేత్‌ | యస్మిన్‌ కర్మ ణ్యస్య కృతే మనసః స్యా దలాఘవమ్‌ ||

తస్మిం స్తావ త్తపః మర్యాత్‌ యావత్తు ష్టికరం భ##వేత్‌ ||

గురు లఘుతాం చ విచార్య యధావ ద్యేషు మయాగమనం చ తవో క్తమ్‌ |

తేషు భ##వేత్‌ సహ నిశ్చిత బుద్ధిః విప్రవరైః కుశ##లైః సుధియా వా ||

ఇతి విష్టు ధర్మోత్తరే ద్వితీయ ఖండే ప్రాయశ్చిత్తాధ్యాయో నామ త్రి సప్తతి తమో7 ధ్యాయః||

ద్విజులు చెప్పిన వ్రతములచే వెల్లడియైన పాపముల శోధింప వలెను. వెల్లడి కాని వారితో ఇంకను తెలియని పాపము లెన్నో చేసినను మంత్రములచే హోమములచే వ్రతములచే శుద్ధి చేయవలెను. వెల్లడించు కొన్న యనుతాపముచే పశ్చాత్తాపముచే తపస్సుచే అధ్యయనముచే (వేదాధ్యయనము) దానముచే పాపి పాప విముక్తి నందును. నరుడెట్లెట్లు ధర్మము సేసి యింత చేసితినని చెప్పి కొనడో యట్లట్లా తడా పాపము నుండి ముక్తుడగును. పాపము చేసి యా చేసిన పాపమును స్మరించునేని వాడా పాపము నుండి విడివడును. వాని మనస్సు నంట్లెట్లు దుష్కృతమును గర్హించును (నిందించును) అట్లట్లు వాని శరీర మా దుష్కర్మము నుండి విముక్త మగును. ఇంక నీపని చేయనని పాపము నుండి మరలుటకు నతడు ప్రయత్నింప వలెను. మనస్సుచే జేసిన యీ చింతన చనిపోయిన తరువాత శుభ కర్మ ఫలోదయమగును. త్రికరణములచే నిత్యము శుభ##మైన పని చేయవలెను. తెలియకయో తెలిసియో విగర్హితమైన పని చేసి యటు వంటి పాపము రెండవసారి సేయకుండెనేని యామున్ను జేసిన పాపము నుండి యతడు ముక్తుడుగును. ఏ కర్మ మొనరించిన మనస్సు లాఘవము పొందదో (తేలికై పోదో) యా కర్మ యందు తనకు సంతుష్టి కలుగు నందాక తపస్సు చేయ నగును. గురు లాఘవములను విచారించి వేనియందు నడకను నీకు పూర్తిగ చెప్పితినో వానియందు నేర్పరులగు బ్రాహ్మణో త్తములతో గూడ మంచి బుద్ధితో నాలోచించిన నిశ్చిత బుద్ధి కలుగును.

ఇది విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయ ఖండమున ప్రాయశ్చిత్త కాండమను డెబ్బది మూడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters