Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

డెబ్బదిఏడవ అధ్యాయము - ప్రేతక్రియ

పుష్కరః -

అశౌచేతు వ్యతిక్రాన్తే స్నాతః ప్రయతమానసః | స్నాతాన్‌ సాలంకృతాన్‌ భక్త్యా గంధవస్త్రోజ్వలాన్‌ ద్విజన్‌ ||

ఉదజ్‌ముఖాన్‌ భోజయీత స్వాసీనాన్‌ సుసమాహితాన్‌ | మంత్రోహా శ్చాత్ర కర్తవ్యాః తధైకవచనేన చ ||

ఉచ్ఛిష్టసన్నిధాం వేకం తధా పిండం నివేశ##యేత్‌| కీర్తయే చ్ఛ తథా తస్య నామగోత్రే సమాహితః ||

భుక్తవత్సు చ విప్రేషు పూజితేషు తథా ధనైః | విసృష్టాక్షయ తోయేషు గోత్రానామానుకీర్తనైః ||

చతురంగుల విస్తారఖముతాతం తావ దన్తరమ్‌ | వితస్తి దీర్ఘం కర్తవ్యం కర్షూణాం చ తథా త్రయమ్‌ ||

కర్షూణాం చ సమీపే చ జ్వాలయే జ్జ్వలనత్రయమ్‌ | సోమాయ వహ్నయే రామ! యమాయ చ సమాహితః ||

జుహుయా డాహుతీ స్సమ్యక్‌ తధైవ చ త్రయ స్త్రయః | పిండనిర్వపణం కుర్యాతా ప్రాగ్వదేవ పృథక్‌ పృథక్‌ ||

అన్నేన దధ్నా మధునా తథా మాంసేన పూరయేత్‌ | మధ్యే చే దధి మాసస్స్యాత్‌ కుర్యా దభ్యధికం తతః ||

అథవా ద్వాదశాహేన సర్వ మేతత్‌ సమాపయేత్‌ | సంవత్సరస్య మధ్యే చే ద్యది స్యా దధిమాస కః ||

తతో ద్వాదశ##కే శ్రాద్ధే కార్యం స్యాదాధిమాసిక మ్‌ | తతో ద్వాదశ##కే శ్రాద్ధే కార్యం తదధికం భ##వేత్‌ ||

సంవత్సరే సమాప్తే తు శ్రాద్ధం శ్రా ద్ధవదా చరేత్‌ | ప్రేతాయ తస్మా దూర్ధ్వం చ తసై#్యవ పురుషత్రయే ||

పిండాన్‌ వినిర్వపే చ్చాత్ర చతుర స్సుసమాహితః | సంసృజం పృధివీం దత్వా సమానా వేతి చాప్యధ ||

యోజయేత్‌ ప్రేతపిండం తు పిండే ష్వన్యేషు భార్గవ! | ప్రేతపాత్రం చ పాత్రేషు తధైవ వినియోజయేత్‌ ||

పృథక్‌ పృథక్‌ చ కర్తవ్యం కర్మైతత్‌ కర్మణాం త్రయే | మంత్ర వర్జ మిదం కర్మ శూద్ర స్యాపి విధీయతే ||

అమంత్రోచ్చారణం స్త్రీణాం కార్య మేత త్తథా భ##వేత్‌ | యావజ్జీవం తధా కుర్యాత్‌ శ్రాద్ధం తు ప్రతివత్సరమ్‌ ||

అనేనైవ విధానేన భక్త్యా ప్రయత మానసః |

ప్రేతాయాన్నం సోద కుంభం ప్రదేయమ్‌ | నిత్యం భక్త్యా యావ దబ్దావసానమ్‌ |

ఏత త్కార్యం బాంధవైయ ర్నైవ కార్యః | శోక శ్చోచన్నైవ కించిత్‌ ప్రకుర్యాత్‌ ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే ప్రేతక్రియా నామ సప్త సప్తతి తమోధ్యాయః ||

పుష్కరుడనియె, మైల శుద్ధియైన తరువాత మనస్సుకుదిరించికొని స్నానముసేసి స్నాతాలంకృతులయిన సద్ద్విజులను భక్తితో గంధవస్త్రాదులచే బూజించి యుత్తరాభిముఖులనుగా సుభాసనములందు గూర్చుండబెట్టి భోజనము పెట్టవలెను. ఉచ్ఛిష్టసన్నిధిలో నొక పిండముంచవలెను. అప్పుడాజీవుని గోత్రనామములు సెప్పవలెను. బ్రాహ్మణులు భోజనము చేసిన తరువాత సంభావన లిచ్చి పూజించి గోత్రనామములు సెప్పి అక్షయ్యోదకములు వదవి నాల్గంగుళముల విస్తారములోతు విత స్తి (జానెడు) పొడవుగల, ఉత్ఖానము (గుంట) జేసి, మూడు పిడకలనుండి యాదరిని మూడగ్నులను జ్వాలచేసి, సోముని, అగ్నిని యముని నుద్దేశించి, హోమము గావించి మూడేసి పిండములు వేర్వేర పెట్ట వలెను. అన్నము, పెరుగు, తేనె, మాంసముతో, నా పిండములను నింపవలెను. మధ్యమం దధికమాసమైనయెడల యభ్యధికముగా గావింపవలెను. లేదా పండ్రెండవనాడే యదెల్ల ముగించవలెను. సంవత్సరమధ్యమం దధిక మాస మేర్పడినచో నది పండ్రెండవ మాస శ్రాద్ధ మందభ్యధిక మాసశ్రాద్ధము పెట్టవలెను. సంవత్సరము పూర్తయైన తర్వాత శ్రాద్ధము తద్దినము వలెనే పెట్టవలెను, అందు ప్రేతను వా పైననున్న పురుష త్రయముద్దేశించి పెట్టవలెను. ఇందు నాల్గు పిండము లుంచవలెను. ''సమానావా'' మంత్రముతో ప్రేత పిండము కలుపవలెను. ఈ కర్మ మంత్రము లేకుండ శూద్రునికిని జరుపవలసినదే. స్త్రీలు పెట్టు తద్దినములలో గూడ మంత్రోచ్చారణము లేకుండ చేయవలెను. భక్తితో నీ తద్దినము యావజ్జీవితము చేయవలసినదే. ఇదే రీతిగ నుదకుంభముతో బాటు భక్తితో ఒక్క సంవత్సరమగు దాక నిత్య మన్నము బేట్టవలెను. బంధువుల వానికై యేడవలాదు. ఏడ్చుచు నించుకేని కర్మ చేయరాదు.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమున ద్వితీయ ఖండమునందు ప్రేతక్రియయను డెబ్బది యేడవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters